|
ఏడువేల కోట్ల వ్యాపారం చేస్తాం: ఐఈఎక్స్తమ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల వ్యాపారం నిర్వహిస్తుందని ఐఈఎక్స్ ఉపాధ్యక్షుడు రాజేశ్ మేదిరత్తా ఆశాభావం వ్యక్తం చేశారు. నిరుడు ఆర్థిక సంవత్సరంలో తమ ఎక్స్‌ఛేంజ్‌లో జరిగిన వ్యాపార కార్యకలాపాల్లో 55 శాతం వృద్ధి జరిగితేనే ఇది సంభవమని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 8:54 am కోర్టు తీర్పుతో పదవి నుంచి వైదొలగను: జర్దారీఅవినీతి కేసులో మాజీ సైనికాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ క్షమాభిక్ష పెట్టడం చెల్లదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ.. తాను దేశాధ్యక్ష పదవి నుంచి వైదొలగనని పాకిస్థాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ స్పష్టం చేశారు. కోర్టు తీర్పును సాకుగా చూపి బాధ్యతల నుంచి తప్పుకునే ప్రసక్తే లేదని అధ్యక్ష ప్రతినిధి ఫక్తుల్లా బాబర్ ఇస్లామాబాద్‌లో పాక్ న్యూస్ పత్రిక డాన్‌కు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 8:45 am మళ్ళీ ఊపందుకున్న షేర్ మార్కెట్బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్(బీఎస్ఈ) విడుదల చేసిన నివేదికననుసరించి బుధవారం నాటితో ముగిసిన మార్కెట్ మళ్ళీ గురువారం ఒక్కసారిగా ఊపందుకుని 61 పాయింట్లు పెరిగింది. దీంతో 16,974 పాయింట్లకు చేరుకుంది. అదే నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్(ఎన్ఎస్ఈ)కి చెందిన నిఫ్టీ 19 పాయింట్లు పెరిగి 5,061 పాయింట్లకు చేరుకుంది.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 8:34 am అసెంబ్లీలో తీర్మానంతోనే తెలంగాణ ప్రక్రియ: ప్రణబ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర అసెంబ్లీలో చేసే ఏకగ్రీవ తీర్మానంతోనే ఆరంభమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అందువల్ల రాయలసీమ, తెలంగాణ ప్రాంత నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన మరోమారు హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 8:00 am రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా ఉంది: రోశయ్యసమైక్యాంధ్ర ఉద్యమం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరింత ఉధృతంగా ఉందని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి ఏ ఒక్కరూ పిలుపునివ్వక ముందే ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 7:41 am ఉదయం 9గంటలకే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్దేశంలోని ప్రధాన స్టాక్ మార్కెట్లైన బీఎస్ఈ, ఎన్ఎస్ఈ సంస్థలు శుక్రవారం నుంచి ఉదయం గం. 9లకే తమ కార్యకలాపాలను ప్రారంభించనున్నాయి.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 7:32 am సమైక్యం స్వచ్ఛందంగానే పుట్టుకొచ్చింది: సీఎంరాష్ట్రంలో సమైక్య నినాదం వెనుక ఏ రాజకీయ పార్టీ హస్తం లేదనీ, అది ప్రజలలో నుంచి స్వచ్ఛందంగానే పుట్టుకొచ్చిందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణా అంశంపై కేంద్ర ప్రకటన తర్వాత సమైక్యాంధ్ర నినాదం వచ్చిందనీ, అది నేడు గ్రామాలకు పాకుతూ పోతోందని వివరించారు.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 7:11 am తెలంగాణకు భాజపా కట్టుబడి ఉంది: బండారురాష్ట్రంలోని ప్రత్యేక తెలంగాణ అంశానికి సంబంధించి తమ పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 7:09 am 19.95 శాతానికి చేరుకున్న ద్రవ్యోల్బణండిసెంబరు మొదటి వారంలో బంగాళా దుంపలు, పప్పు దినుసుల ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం 19.95 శాతానికి చేరుకుంది. నిత్యావసర సరుకులు ధరల ఆధారంగా నవంబర్ చివరి వారాంతానికి ద్రవ్యోల్బణం 19.05 శాతంగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 6:53 am మనం కలిసుందాం... కలిసుందాం: మోహన్ బాబురాష్ట్రంలో కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు రేపిన చిచ్చు ఫలితంగా యావదాంధ్రప్రదేశ్ లోని ప్రతి పౌరుడూ నేడు తీవ్రమైన ఆవేదనకు గురై ఉన్నాడని నటుడు మోహన్ బాబు అన్నారు. తిరుపతిలో సమైక్యాంధ్ర అనుకూలంగా దీక్ష చేపడుతున్న విద్యార్థి శిబిరానికి వెళ్లిన మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు ఆంధ్రప్రదేశ్ యుద్ధభూమిలో ఉన్నది. దీని ఫలితంగా సామాన్యప్రజానీకం తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొంటున్నారు. కొందరు స్వార్థ రాజకీయ నాయకులు యువతను రెచ్చగొడుతున్నారు. ఫలితంగా కొందరు యువకులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను పోగొట్టుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Dec 2009 | 6:27 am భారీ ఒడిదుడుకులకు లోనైన సెన్సెక్స్దేశీయ షేర్ మార్కెట్లో భారీగా హెచ్చు-తగ్గులు కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం ఆశాజనకంగా ప్రారంభమైన సన్సెక్స్ కాసేపటి తర్వాత 63 పాయింట్లు తగ్గింది. అదే నిఫ్టీ 21 పాయింట్లు తగ్గింది.Source: Yahoo! Telugu: News | 17 Dec 2009 | 6:21 am అక్కినేనికి డబ్బు పిచ్చి అంటారు: నటసామ్రాట్"అవును. అక్కినేని ఇంకా సినిమాల్లో నటిస్తే.. ఆయనకు ఏం ఖర్చు.. ఇంకా డబ్బు పిచ్చి పట్టుకుందని అందరూ అంటారు. అందుకే నేను సినిమాల్లో నటించడం లేద"ని అక్కినేని నాగేశ్వరరావు చెబుతున్నారు. తను సినిమాల్లో నటించకపోవడానికి కారణాలను చెపుతూ.. "నా వయస్సు 86 సంవత్సరాలు. ఇన్నేళ్ల కెరీర్‌లో చేయని పాత్ర లేదు. అప్పుడేదో రామదాసులో చేయమంటే చేశాను. ఆ తర్వాత చేయాలని ఉన్నా.. వయస్సుకు తగిన పాత్రలు రాలేదు. అయితే సీతారామయ్యగారి మనవరాలు లాంటి సినిమాలు వస్తే తప్పకుండా నటిస్తాను. నా ప్రాణం పోయేవరకూ నటిస్తూనే ఉంటాను" అని అన్నారు అక్కినేని నాగేశ్వరరావు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Dec 2009 | 5:10 am త్వరలో ప్రేక్షకుల ముందుకు "సుభద్ర"సుప్రసిద్ధ నిర్మాత డా. డి. రామానాయుడు చేతుల మీదుగా శ్రీకాంత్ టాకీస్ వారి "సుభద్ర" లోగో ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. యువ నిర్మాత శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రాజావన్నెంరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. "చందమామ" ఫేమ్ సింధుమీనన్ కథానాయికగా నటించిన ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్, డబ్బింగ్ కార్యక్రమాల్ని ముగించుకుని రీ-రికార్డింగ్ జరుపుకుంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 17 Dec 2009 | 5:01 am అసెంబ్లీలో తీర్మానంతోనే తెలంగాణ ప్రక్రియ: ప్రణబ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ రాష్ట్ర అసెంబ్లీలో చేసే ఏకగ్రీవ తీర్మానంతోనే ఆరంభమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అందువల్ల రాయలసీమ, తెలంగాణ ప్రాంత నేతలు ఎలాంటి ఆందోళన చెందవద్దని ఆయన మరోమారు హామీ ఇచ్చారు.Source: జాతీయ | 17 Dec 2009 | 3:22 am రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం బలంగా ఉంది: రోశయ్యసమైక్యాంధ్ర ఉద్యమం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మరింత ఉధృతంగా ఉందని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. ఈ ఉద్యమానికి ఏ ఒక్కరూ పిలుపునివ్వక ముందే ప్రజలే స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఉద్యమం చేపట్టారని గుర్తు చేశారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 2:12 am సమైక్యం స్వచ్ఛందంగానే పుట్టుకొచ్చింది: సీఎంరాష్ట్రంలో సమైక్య నినాదం వెనుక ఏ రాజకీయ పార్టీ హస్తం లేదనీ, అది ప్రజలలో నుంచి స్వచ్ఛందంగానే పుట్టుకొచ్చిందని ముఖ్యమంత్రి రోశయ్య అన్నారు. ఆయన గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... తెలంగాణా అంశంపై కేంద్ర ప్రకటన తర్వాత సమైక్యాంధ్ర నినాదం వచ్చిందనీ, అది నేడు గ్రామాలకు పాకుతూ పోతోందని వివరించారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 1:42 am తెలంగాణకు భాజపా కట్టుబడి ఉంది: బండారురాష్ట్రంలోని ప్రత్యేక తెలంగాణ అంశానికి సంబంధించి తమ పార్టీ కట్టుబడి ఉందని భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 1:40 am మెజారిటీ ప్రజల అభీష్టమే శిరోధార్యం: చిరంజీవిప్రజల అభీష్టం మేరకు, వారి ఆలోచనా ధోరణికి అనుగుణంగా అన్ని రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నొక్కివక్కాణించారు. తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి ఉంటామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితిలు సమిష్టగా బాధ్యత వహిస్తూ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 1:05 am వైఖరిలో మార్పు.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా: చిరుతెలంగాణాపై తమ పార్టీలో వచ్చిన వైఖరికి నైతిక బాధ్యత వహిస్తూ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. తన రాజీనామా లేఖపై విలేకరుల సమావేశంలోనే సంతకం చేసి, మీడియాకు చూపారు. అనంతరం ఆ లేఖను స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డికి పార్టీ నేతల ద్వారా పంపుతున్నట్టు ఆయన బుధవారం తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 12:46 am తెలంగాణ తెలుగుదేశం నేతల్లో సమైక్యాంధ్ర రాగం!తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలు కూడా తమ అభిప్రాయాన్ని మార్చుకునే దిశగా యోచన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను ఉపసంహరించుకోవాలని వారు భావిస్తున్నారు. సమైక్యాంధ్ర కోసం పెద్దఎత్తున పార్టీలకు అతీతంగా నేతలు, ప్రజలు, విద్యార్థులు ఉద్యమించడం తెదేపా తెలంగాణ నేతలను కలిసి వేసింది. దీంతో వారు కూడా సమైక్య నినాదం అందుకోవాలని భావిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 12:42 am 'సమైక్యం' కోసం 24 గంటల దీక్షకు దిగిన మోహన్బాబుసమైక్యాంధ్ర కోసం సినీ నటుడు రాజ్యసభ మాజీ సభ్యుడు మోహన్ బాబు ఒక రోజు నిరాహార దీక్షను గురువారం ప్రారంభించారు. రాష్ట్ర ప్రజలందరు సమైక్యంగా ఉండాలన్నదే తన అభిమతమని ఆయన స్పష్టం చేసారు.Source: ఏపీ న్యూస్ | 17 Dec 2009 | 12:34 am రైళ్లలో ఉచిత మంచినీటి సరఫరాకు కేంద్రం సమ్మతం!దూరప్రాంతాలకు వెళ్లే రైళ్లలో ఉచితంగా మంచినీటిని సరఫరా చేయాలన్న ప్రతిపక్ష సభ్యుల సూచనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ప్రైవేటు భాగస్వామ్యంతో రైళ్లలో 24 గంటల పాటు రైళ్లలో మంచినీటిని సరఫరా చేస్తామని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.Source: జాతీయ | 17 Dec 2009 | 12:23 am సమాక్యాంధ్రాకి ప్రజారాజ్యం జై: అధినేత చిరంజీవిసమైక్యాంధ్రానికి ప్రజారాజ్యం పార్టీ జై కొట్టింది. అత్యధిక శాతం ప్రజాభీష్టం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ అధినేత చిరంజీవి గురువారం ప్రకటించారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణాలకు కాంగ్రెస్ ప్రభుత్వాలే నైతిక బాధ్యత వహించాలని ఆయన అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 16 Dec 2009 | 11:20 pm కేసుల విచారణకు దూరంగా కర్ణాటక చీఫ్ జస్టీస్!రాజ్యసభలో అభిశంసన తీర్మానికి గురైన కర్ణాటక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పి.డి.దినకరన్ తదుపరి ఉత్తర్వులు జారీ అయ్యేంత వరకు కేసులు విచారణకు దూరంగా ఉండనున్నారు. ఈ మేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ బుధిహాల్ ఏకవాక్య ప్రకటను విడుదల చేశారు.Source: జాతీయ | 16 Dec 2009 | 10:28 pm ఏకాభిప్రాయంతోనే తెలంగాణ సాధ్యం: జయప్రకాష్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై ఏకాభిప్రాయం సాధించకుండా ముందుకు వెళ్లరాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌కు విన్నవించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ ఆహ్వానంపై బుధవారం ఆయనను కలుసుకొన్న జయప్రకాశ్ నారాయణ ముందుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు తీవ్రతరం కాకుండా చూసేందుకు వారిలో వ్యక్తమౌతున్న సందేహాలను నివృత్తి చేసేలా ప్రభుత్వం వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 16 Dec 2009 | 10:03 pm సాగుతున్న జీజేఎం దీక్షలు: పలువురి పరిస్థితి విషమం!పశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని చీల్సి గోర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో గోర్ఖా ముక్తి మోర్చా (జీజేఎం) చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు గురువారానికి ఆరో రోజుకు చేరుకున్నాయి. ఆమరణ నిరాహారదీక్షకు 20 మంది దిగగా, వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని జీజేఎం నేతలు వెల్లడించారు.Source: జాతీయ | 16 Dec 2009 | 9:35 pm ఎమ్మెల్యే పదవికి రాజీనామా: ప్రకటన చేయనున్న చిరు!ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర నేతల ఒత్తిడికి తలొగ్గారు. ప్రస్తుతం జరుగుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఆయన గురువారం తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని భావిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 16 Dec 2009 | 9:07 pm ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ గిరికి జశ్వంత్ సింగ్ గుడ్‌బై!కేంద్ర ప్రజా పద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పదవికి భారతీయ జనతా పార్టీ సీనియర్ బహిష్కృత నేత జశ్వంత్ సింగ్ బుధవారం రాజీనామా చేశారు. పీఏసీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న సందర్భంగా జస్వంత్ సింగ్ తన రాజీనామా విషయాన్ని వెల్లడించారు. జిన్నాపై వివాదాస్పద పుస్తకం రాసిన నేపథ్యంలో భాజపా ఆయనను పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.Source: జాతీయ | 16 Dec 2009 | 8:44 pm సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడంపై మోహన్ బాబు దీక్షసినీ పరిశ్రమకు రాజకీయాలకు ముడిపెట్టి సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడాన్ని నిరసిస్తూ నటుడు మోహన్ బాబు తిరుపతిలో దీక్ష చేపట్టారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో హీరోలకు ఆదరణ ఉంది కనుక సినిమా ప్రదర్శనలను అడ్డుకోరాదన్నారు. అసలు రాజకీయాలు వేరు... సినిమాలు వేరని ఆ రెండింటికీ ముడిపెట్టి చూడటం భావ్యం కాదన్నారు. చిరు, హరి కుటుంబాలకు చెందిన హీరోల చిత్రాలను ఆపడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలు రాజకీయలతో సినిమాలను కలిపి మాట్లాడవద్దనీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సినిమా షూటింగ్ లు, సినిమా ప్రదర్శనలు ఆగిపోతే దానిపై ఆధారపడి జీవిస్తున్న కళాకారులు జీవితాలు ఛిద్రమవుతాయనీ, వారి జీవితాలను గురించి ఎవరూ పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించడం శోచనీయమని భరద్వాజ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా సినిమాలను రాజకీయాలతో ముడిపెట్టడం మానుకోవాలని, తద్వారా సినీ కార్మికులను ఆదుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 1:36 pm చిరు, హరి కుటుంబాల సినిమాలను అడ్డుకుంటాంసమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణా సెగలు సినీ పరిశ్రమను కూడా తాకాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర వైపు మొగ్గుచూపడాన్ని తెలంగాణావాదులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆయన కుటుంబానికి చెందిన సినీతారల సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే వరంగల్‌లో ఆర్య-2 చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరంజీవితోపాటు తెలుగుదేశం నాయకుడు నందమూరి హరికృష్ణ కూడా సమైక్యాంధ్రకు మద్దతు పలికిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం అదుర్స్‌ను థియేటర్లలో ఆడనివ్వబోమని తెలంగాణా మద్దతుదారులు అంటున్నారు.ఇదిలావుండగా, రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టడం భావ్యం కాదని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలలో తలెత్తిన సంక్షోభానికి సినీ పరిశ్రమకు లింకుపెట్టి సినిమాలను అడ్డుకోవడం తగదని హితవు పలుకుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 6:36 am తెలంగాణపై ఏకాభిప్రాయం తప్పనిసరి: మనీష్ తివారీప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం తప్పనిసరి అని ఏఐసీసీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ స్పష్టం చేశారు. ఏకాభిప్రాయ సాధన లేకుండా ఒక రాష్ట్రాన్ని విభజించలేమని ఆయన తెల్చి చెప్పారు. దీనిపై ఆయన బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణపై ఏకాభిప్రాయం తప్పని సరని చెప్పారు.Source: జాతీయ | 16 Dec 2009 | 5:21 am విష్ణువర్థన్ సలీమ్ ట్రెయిలర్ చూడండివిలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం "సలీమ్". లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చింది.ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు. సంగీతం.. సందీప్ చౌతలా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. అశోక్ కుమార్ రాజు, ఆర్ట్.. ఆనందసాయి, స్టోరీ విభాగం.. గోపీ మోహన్, బీవీఎస్.రవి, పాటలు.. చంద్రబోస్, కెమెరా.. సి.రామ్ ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. వైవీఎస్.చౌదరి.Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 5:07 am సారాయి వీర్రాజు ట్రెయిలర్అజయ్ హీరోగా, విశ్వ, మదులిక, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "సారాయి వీర్రాజు". కణ్ణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన "సారాయి వీర్రాజు" విడులైంది. అజయ్ ఫైట్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. కెమెరా పనితనం అద్భుతందా వచ్చింది. మాస్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలోని పాత్రలు సహజంగా ఉండాలని ఓ గ్రామంలోని ప్రజలనే నటింపజేయడం ఈ చిత్రంలోని ప్రత్యేకత.Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 5:01 am జమ్మూకాశ్మీర్‌లో 700 మంది తీవ్రవాదులు: కేంద్రంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో 700 మంది తీవ్రవాదులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్, జైషే మొహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలు అందించే నిధులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన కార్యకలాపాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మఖన్ సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 16 Dec 2009 | 3:02 am
|