26/11 సాక్ష్యాల ఆధారంగానే విచారణ జరుపుతాం: పాక్

ముంబై దాడులకు సంబంధించి భారత ప్రభుత్వం సమర్పించిన ఆధారాలను సీరియస్‌గానే పరిశీలిస్తున్నట్టు పాకిస్థాన్ అధికారులు వెల్లడించారు. దీనిపై భారత్‌లోని పాకిస్థాన్ హైకమిషనర్ షాహిద్ మాలిక్ బుధవారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. 26/11 దాడులకు సంబంధించి కేంద్ర విదేశాంగ శాఖ సమర్పించిన ఆధారాల ఆధారంగా కుట్రదారులను శిక్షించేందుకు పాక్ చర్యలు చేపట్టినట్టు గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 8:49 am

జమ్మూకాశ్మీర్‌లో 700 మంది తీవ్రవాదులు: కేంద్రం

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో 700 మంది తీవ్రవాదులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్, జైషే మొహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలు అందించే నిధులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన కార్యకలాపాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మఖన్ సమాధానం ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 8:32 am

లాభాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం లాభాల్లో కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 75 పాయింట్లు వృద్ధి చెంది, 16,952 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 27 పాయింట్లు బలపడి, 5,060 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 8:25 am

తెలంగాణ ప్రాంతాల్లో విద్యాసంస్థలు తెరవాలి: హైకోర్టు

గత పక్షం రోజులుగా మూతపడి ఉన్న తెలంగాణ ప్రాంతాల్లోని విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను తక్షణం తెరవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 7:48 am

యూరప్ మార్కెట్ ప్రభావం: లాభాల్లో సెన్సెక్స్

యూరప్ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 40 పాయింట్లు పుంజుకుని, 16,917 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్లు బలపడి, 5,058 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 7:19 am

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఇటలీ ప్రధాని బెర్లుస్కోనీ

ఉన్మాది దాడిలో గాయపడి ఆస్పత్రి పాలైన ఇటాలీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ మూడు రోజుల వైద్య చికిత్స అనంతరం బుధవారం డిశ్చార్జ్ అయ్యారు. అయితే, విధులకు మాత్రం రెండు వారాల తర్వాతే హాజరవుతారని వైద్యులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 6:49 am

ఒడిదుడుకుల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి, నిఫ్టీ పతనం

బుధవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ.. మధ్యాహ్నానికి మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. దీంతో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ 22 పాయింట్లు వృద్ధి చెంది, 16,899 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అయితే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 6 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,026 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 6:48 am

చిరు, హరి కుటుంబాల సినిమాలను అడ్డుకుంటాం

సమైక్యాంధ్ర, ప్రత్యేక తెలంగాణా సెగలు సినీ పరిశ్రమను కూడా తాకాయి. ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర వైపు మొగ్గుచూపడాన్ని తెలంగాణావాదులు వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఆయన కుటుంబానికి చెందిన సినీతారల సినిమాల ప్రదర్శనను అడ్డుకుంటామని ప్రకటించారు. ఇప్పటికే వరంగల్‌లో ఆర్య-2 చిత్రాన్ని అడ్డుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. చిరంజీవితోపాటు తెలుగుదేశం నాయకుడు నందమూరి హరికృష్ణ కూడా సమైక్యాంధ్రకు మద్దతు పలికిన నేపధ్యంలో జూనియర్ ఎన్టీఆర్ చిత్రం అదుర్స్‌ను థియేటర్లలో ఆడనివ్వబోమని తెలంగాణా మద్దతుదారులు అంటున్నారు.ఇదిలావుండగా, రాజకీయాలను సినిమాలతో ముడిపెట్టడం భావ్యం కాదని సినీ ప్రముఖులు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయాలలో తలెత్తిన సంక్షోభానికి సినీ పరిశ్రమకు లింకుపెట్టి సినిమాలను అడ్డుకోవడం తగదని హితవు పలుకుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 6:36 am

దేశంలో 730కు చేసిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య

స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడి దేశ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 730కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 22 వేలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 6:31 am

తెలంగాణ మంత్రిగా 'చేవెళ్ళ చెల్లెమ్మ': తెదేపా నేత కేశవ్

చేవెళ్ల చెల్లెమ్మా అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పిలుచుకునే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇపుడు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మారిపోయారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురంలోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 6:08 am

దేశ వ్యాప్తంగా సాగుతున్న బ్యాంకు ఉద్యోగుల సమ్మె

మాతృసంస్థ భారతీయ స్టేట్ బ్యాంకులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండోర్‌ను విలీనం చేయాలన్న ప్రతిపాదనతో పాటు.. ఇతర డిమాండ్ల పరిష్కారం కోసం బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు దేశ వ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో బుధవారం దేశ వ్యాప్తంగా బ్యాంకు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించి పోయాయి.
Source: Yahoo! Telugu: News | 16 Dec 2009 | 5:52 am

విష్ణువర్థన్ సలీమ్ ట్రెయిలర్ చూడండి

విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటించిన చిత్రం "సలీమ్". లక్ష్మీ ప్రసన్న బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుత కాలానికి అనుగుణంగా తీసిన ప్రేమకథ. ప్రతి సన్నివేశం చాలా బాగా వచ్చింది.ఈ చిత్రంలో ఇలియానా, కావేరిఝా, ఆలీ, భరణి, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, తెలంగాణా శకుంతల, హేమ తదితరులు నటించారు. సంగీతం.. సందీప్ చౌతలా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత.. అశోక్ కుమార్ రాజు, ఆర్ట్.. ఆనందసాయి, స్టోరీ విభాగం.. గోపీ మోహన్, బీవీఎస్.రవి, పాటలు.. చంద్రబోస్, కెమెరా.. సి.రామ్ ప్రసాద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం.. వైవీఎస్.చౌదరి.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 5:07 am

సారాయి వీర్రాజు ట్రెయిలర్

అజయ్ హీరోగా, విశ్వ, మదులిక, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం "సారాయి వీర్రాజు". కణ్ణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన "సారాయి వీర్రాజు" విడులైంది. అజయ్ ఫైట్స్ సినిమాకు హైలెట్‌గా నిలిచాయి. కెమెరా పనితనం అద్భుతందా వచ్చింది. మాస్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమాలోని పాత్రలు సహజంగా ఉండాలని ఓ గ్రామంలోని ప్రజలనే నటింపజేయడం ఈ చిత్రంలోని ప్రత్యేకత.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Dec 2009 | 5:01 am

జమ్మూకాశ్మీర్‌లో 700 మంది తీవ్రవాదులు: కేంద్రం

జమ్మూకాశ్మీర్‌ రాష్ట్రంలో 700 మంది తీవ్రవాదులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరంతా పాకిస్థాన్ కేంద్రంగా పని చేస్తున్న లష్కర్, జైషే మొహ్మద్ తదితర ఉగ్రవాద సంస్థలు అందించే నిధులతో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు పేర్కొంది. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం జరిగిన కార్యకలాపాల్లో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మఖన్ సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 16 Dec 2009 | 3:02 am

తెలంగాణ ప్రాంతాల్లో విద్యాసంస్థలు తెరవాలి: హైకోర్టు

గత పక్షం రోజులుగా మూతపడి ఉన్న తెలంగాణ ప్రాంతాల్లోని విద్యా సంస్థలను, విశ్వవిద్యాలయాలను తక్షణం తెరవాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొనడం వల్ల అల్లర్లు చోటు చేసుకున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 16 Dec 2009 | 2:18 am

సమైక్యాంధ్రకే మా పార్టీ కట్టుబడి ఉంది: హీరో హరికృష్ణ

ప్రధాన తెలుగుదేశం పార్టీ కూడా సమైక్య వాదానికే కట్టుబడి ఉందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, రాజ్యసభ ఎంపీ, స్వర్గీయ ఎన్టీఆర్ తనయుడు నందమూరి హరికృష్ణ తెలిపారు. అందరూ కలిసి ఉండాలన్నదే తమ అభిమతమని ఆయన బుధవారం ఢిల్లీలో స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Dec 2009 | 1:31 am

దేశంలో 730కు చేసిన స్వైన్ ఫ్లూ మృతుల సంఖ్య

స్వైన్ ఫ్లూ వైరస్ బారిన పడి దేశ వ్యాప్తంగా ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 730కు చేరుకుంది. అలాగే, ఈ వైరస్ సోకిన వారి సంఖ్య 22 వేలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 16 Dec 2009 | 1:01 am

తెలంగాణ మంత్రిగా 'చేవెళ్ళ చెల్లెమ్మ': తెదేపా నేత కేశవ్

చేవెళ్ల చెల్లెమ్మా అంటూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి పిలుచుకునే హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇపుడు తెలంగాణ రాష్ట్ర హోంమంత్రిగా మారిపోయారని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆరోపించారు. ఆయన బుధవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. అనంతపురంలోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం విద్యార్థులపై పోలీసులు చేసిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Dec 2009 | 12:38 am

'విజయవాడ సింహాల'ను ఒకటి చేసిన సమైక్య నినాదం!

వారిద్దరు విజయవాడలో తిరుగులేని రాజకీయ నేతలు. నిన్నమొన్నటి వరకు వారిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అలాంటిది నేడు.. వారిద్దరు ఒకే వేదికపై దర్శనమిచ్చారు. ఒకరినొకరు పలుకరించారు. తాము వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు అయినప్పటికీ.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు చేతులు కలుపుతామని నిరూపించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 11:51 pm

మంచి మనస్సున్న రియల్ స్టార్ చిరంజీవి: లగడపాటి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి సమైక్యాంధ్రకు మద్దతు ప్రకటిస్తే తాము చేపట్టిన ఈ ఉద్యమం మరింత ఉధృతంగా సాగుతుందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆయన సున్నిత మనస్కుడని, అఖిలాంధ్ర అభిమానుల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచి పోయారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 10:58 pm

మీకు అన్యాయం జరగదు: సీమాంధ్ర ఎంపీలకు హామీ!

రాష్ట్ర విభజన అంశంలో ఏ ఒక్క ప్రాంతానికి, ప్రజలకు హాని తలపెట్టబోమని కాంగ్రెస్ అధిష్టానం సీమాంధ్ర ఎంపీలకు స్పష్టమైన హామీ ఇచ్చింది. అదేసమయంలో పార్టీకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాల్సిన బాధ్యత మీపై ఉందంటూ అధిష్టానం వారికి గుర్తు చేసింది.
Source: జాతీయ | 15 Dec 2009 | 10:56 pm

రాష్ట్రాల ఏర్పాటుకు రెండో ఎస్సార్సీయే మేలు: దిగ్విజయ్

దేశంలో మరిన్ని చిన్నరాష్ట్రాల ఏర్పాటుకు రెండో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ (ఎస్.ఆర్.సి)ని ఏర్పాటు చేయడమే మేలని కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని మూడు చిన్న రాష్ట్రాలుగా విభజించాలంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాయావతి ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపి ఆ తరువాత ఒత్తిడి చేయాలని సూచించారు.
Source: జాతీయ | 15 Dec 2009 | 9:30 pm

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ మిత్రుల చెక్!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు యూపీఏ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు అడ్డుపడ్డాయి. తమను సంప్రదించకుండా తెలంగాణపై ఎలా ప్రకటన చేస్తారని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను నిలదీశాయి. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు జరిగింది. ఒకే భాష మాట్లాడే తెలుగు ప్రజలను రెండుగా ఎలా విడదీస్తారని కీలక భాగస్వామ్యమైన డీఎంకే నిలదీసింది.
Source: జాతీయ | 15 Dec 2009 | 9:14 pm

సమైక్యాంధ్ర వైపు చిరు: చీలిక దిశగా ప్రజారాజ్యం!

కోస్తాంధ్ర, రాయలసీమ ప్రజానీకానికి ఒత్తిడికి ప్రజారాజ్యం పార్టీ అధినేత, మెగాస్టార్ చిరంజీవి తలొగ్గారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న సామాజిక తెలంగాణ ఏర్పాటును ఆయన వెనక్కి తీసుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతు పలకాలనే నిర్ణయానికి వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 8:56 pm

ప్రసాద్ ల్యాబ్స్‌లో "మా" డైరీ ఆవిష్కరణ

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నూతన డైరీ విడుదల కార్యక్రమం మంగళవారం ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. అక్కినేని నాగేశ్వరరావు డైరీని ఆవిష్కరించి కృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా "మా" అధ్యక్షులు మురళీమోహన్ మాట్లాడుతూ... "మా అసోసియేషన్ స్థాపించిన నాటి నుంచి నటీనటులకు డైరీ ఉంటే బావుంటుందని, వారి ఫోన్ నెంబర్లు, డేట్స్‌తో పాటు పుట్టినరోజులు కూడా ఇవ్వడం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Dec 2009 | 1:10 pm

కత్రినా సెక్సీ లుక్‌కి మరోసారి ఆసియా సలామ్

కత్రినా కైఫ్ సెక్సీ ఫిగర్‌ను తలదన్నేవారు 2009లోనూ తారస పడలేదు. చురకత్తిలాంటి చూపులతో గుచ్చిగుచ్చి చూసే కత్రినా కైఫ్ ప్రపంచంలో అత్యంత సెక్సీగా ఉండే 50 మంది మహిళల్లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె సెక్సీ అందాల ముందు ఎవరి అందాలు పోటీపడలేవని లండన్‌కు చెందిన "ఈస్టరన్ ఐ" పత్రిక నిర్వహించిన పోల్‌లో తేలింది. గత ఏడాది ఆసియా సెక్సీ మహిళల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న కత్రినా ఈ ఏడాది కూడా తన స్థానాన్ని పదిలం చేసుకుంది. కత్రినా తర్వాత స్థానాలను బ్రిటన్‌కు చెందిన టీవీ నటి లైలా రౌవాస్, పాకిస్తాన్ నటి మెహవిష్ హయత్ ఆక్రమించారు. మిగిలిన స్థానాల్లో మన బాలీవుడ్‌కు చెందిన ప్రియాంకా చోప్రా, ఫ్రిదా పింటో, కరీనా కపూర్, బిపాసా బసు, లారా దత్తా, ఐశ్వర్యా రాయ్, దీపికా పదుకునే ఉన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Dec 2009 | 9:12 am

రాష్ట్ర ప్రజలు సంయమనంతో వ్యవహరించాలి: ప్రధాని

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను కేంద్రం పూర్తి స్థాయిలో పరిగణనలోకి తీసుకుందని ప్రధాని కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన మంగళవారం రాత్రి వెలువడింది. మంగళవారం సాయంత్రం జరిగిన కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో ప్రత్యేక తెలంగాణ అంశం, రాష్ట్ర పరిస్థితులపై ప్రత్యేకంగా చర్చించారు. సమావేశం ప్రధాని కార్యాలయంలో ప్రధాని మన్మోహన్ అధ్యక్షతన కమిటీ సమావేశం జరిగింది.
Source: జాతీయ | 15 Dec 2009 | 8:26 am

తెలంగాణకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మద్దతు ఇవ్వబోనని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అన్ని ప్రాంతాల ప్రజలు కలసిమెలసి ఐక్యంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అందువల్ల తాను సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉంటున్నట్టు ప్రకటించారు.
Source: జాతీయ | 15 Dec 2009 | 8:18 am

ముగిసిన రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం

దేశ రాజధానిలో కేంద్ర రాజకీయ వ్యవహారాల కమిటీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సమీక్షించడానికి ఈ కమిటీ సమావేశమైంది. ప్రధాని మన్మోహన్ సింగ్‌తోపాటు కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్ ముఖర్జీ, హోం శాఖామంత్రి పి. చిదంబరం, రక్షణ శాఖామంత్రి ఏకే ఆంటోని, దయానిధి మారన్, మమతా బెనర్జీ, శరద్ పవార్‌లు హాజరయ్యారు
Source: జాతీయ | 15 Dec 2009 | 8:00 am

సమైక్యాంధ్రకే మా మద్దతు: వైఎస్ జగన్మోహన్ రెడ్డి

రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా తమ మద్దతు సమైక్యాంధ్రకే ఉంటుందని కడప ఎంపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మంగళవారం లోక్‌సభ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజం చెప్పాలంటే తమ పార్టీ సమైక్యాంధ్రప్రదేశ్‌కే కట్టుబడి ఉందని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 7:56 am

అన్ని రాష్ట్రాల్లో కమాండో విభాగం: హోంమంత్రి

ప్రతి రాష్ట్రంలో నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ హబ్‌ లేదా ఇందుకు తగినట్టుగా ఉండే కమాండ్ ఫోర్స్‌ విభాగాన్ని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. మంగళవారం జరిగిన లోక్‌సభ కార్యక్రమాల ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. జాతీయ భద్రతను మరింత పటిష్టం చేసేందుకు వీలుగా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
Source: జాతీయ | 15 Dec 2009 | 5:37 am

ఒకప్పటి ఫ్రెంచ్ కాలనీ.. ఇప్పటి "లిటిల్ ఫ్రాన్స్"

రెండు దేశాల సంస్కృతులు కలగలిసిన ఒక విలక్షణమైన ప్రదేశమే ఇది.. ఒకప్పుడు ఫ్రెంచ్ కాలనీగా ఉన్న ఈ ప్రదేశం నేడు "లిటిల్ ఫ్రాన్స్"గా కొనియాడబడుతోంది. భారతదేశంలో అంతర్భాగమైనప్పటికీ ఆ గత చిహ్నాలతో అలరించే అందమైన ప్రాంతంగా, చదువుల కాణాచిగా, ఆధ్యాత్మికవాదుల మజిలీగా, ప్రకృతి ప్రేమికులకు విహార కేంద్రంగా భూలోకపు స్వర్గాన్ని తలపిస్తున్న ఈ అద్భుత ప్రదేశం పేరే "పాండిచ్చేరి".
Source: వినోదం | 15 Dec 2009 | 4:56 am

పాండిచ్చేరిలో ఉదయ్, శ్వేతబసుల చిత్రం

ఉదయ్‌కిరణ్ హీరోగా శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ఓ షెడ్యూల్‌ని పాండిచ్చేరిలో పూర్తి చేసుకుంది. ఈశ్వర వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుభాసెల్వం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు యు.కె. ఎవెన్యూస్ పి. ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేశాం. ఇటీవలే పాండిచ్చేరి, చెన్నైల్లో రెండో షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేశామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Dec 2009 | 4:37 am

సంక్రాంతికి కానుకగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్"

అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా, పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి. కంభన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్".పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన టాలెంటెడ్ డైరక్టర్ బి. రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మలేషియాలోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు, రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక పబ్ సాంగ్‌తో పాటు 15 రోజుల టాకీ, వైజాగ్‌లో ఒక పాట, కొంత టాకీపార్ట్, హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో ఒక పాట చేశామని నిర్మాత తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతికి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Dec 2009 | 4:31 am

వచ్చే 2014 సార్వత్రిక సమరం వరకు టైం ఇస్తాం: తెరాస

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికల వరకు సమయం ఇస్తామని తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ అంత సులంభంగా తేలేది కాదని అందువల్ల కాంగ్రెస్ అధిష్టానానికి తగిన సమయం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు తెరాస అధినేత కేసీఆర్ కుమారుడు కె.తారకరామారావు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 4:00 am

కత్రినా సెక్సీ లుక్‌కి మరోసారి ఆసియా సలామ్

కత్రినా కైఫ్ సెక్సీ ఫిగర్‌ను తలదన్నేవారు 2009లోనూ తారస పడలేదు. చురకత్తిలాంటి చూపులతో గుచ్చిగుచ్చి చూసే కత్రినా కైఫ్ ప్రపంచంలో అత్యంత సెక్సీగా ఉండే 50 మంది మహిళల్లో మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఆమె సెక్సీ అందాల ముందు ఎవరి అందాలు పోటీపడలేవని లండన్‌కు చెందిన "ఈస్టరన్ ఐ" పత్రిక నిర్వహించిన పోల్‌లో తేలింది. గత ఏడాది ఆసియా సెక్సీ మహిళల జాబితాలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న..
Source: వినోదం | 15 Dec 2009 | 3:46 am

రాజీనామాల సంగతి తేల్చాసిందే: సీమాంధ్ర ఎమ్మెల్యేలు

సమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేసిన రాజీనామాలపై ఏదో ఒకటి చెప్పాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకోసం వారంతా మంగళవారం సచివాలయంలో సభాపతితో సమావేశమయ్యారు. రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అంశం పరిశీలనలో ఉందని సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 2:47 am

అనంత నుంచి చారుసిన్హాలు తొలగిస్తాం: సీఎం హామీ

శాంతిభద్రతల పరిరక్షణ కోసం అనంతపురం జిల్లాకు ప్రత్యేక అధికారిణిగా నియమితులైన చారుసిన్హా ఐపీఎస్‌ను అక్కడ నుంచి వెనక్కి పిలిపిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య హామీ ఇచ్చారు. ఈ జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జ్ ‌ చేయడాన్ని నిరసిస్తూ తెదేపాకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు మంగళవారం సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట బైఠాయించారు.
Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 2:12 am