|
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి: ఎనిమిది మంది మృతిఆఫ్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో మంగళవారం బాంబు పేలుడు సంభవించింది. కాబూల్‌లోని ఒక విదేశీ అతిథి గృహం వద్ద చోటు చేసుకున్న ఈ పేలుడులో నలుగురు మహిళలతో పాటు.. మొత్తం 8 మంది మృత్యువాతపడ్డారు. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 9:00 am తెలంగాణకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మద్దతు ఇవ్వబోనని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవించి ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అందువల్ల తాను సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉంటున్నట్టు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 8:44 am భారీ నష్టాల దిశగా బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఆశాజనకంగా కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. దీంతో మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 231 పాయింట్లు పతనమై, 16,866 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 74 పాయింట్లు క్షీణించి, 5,030 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 8:29 am రాజీనామాల సంగతి తేల్చాసిందే: సీమాంధ్ర ఎమ్మెల్యేలుసమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేసిన రాజీనామాలపై ఏదో ఒకటి చెప్పాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకోసం వారంతా మంగళవారం సచివాలయంలో సభాపతితో సమావేశమయ్యారు. రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అంశం పరిశీలనలో ఉందని సమాధానం ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 8:16 am రూ. 8.5 బిలియన్ల అడ్వాన్స్ పన్ను చెల్లించిన రిలయన్స్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికానికి చెల్లించాల్సిన అడ్వాన్స్ ట్యాక్స్‌గా రూ. 8.5 బిలియన్ల(396 మిలియన్ డాలర్లు లేక రూ. 850 కోట్లు)ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చెల్లించింది.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 7:43 am అనంత నుంచి చారుసిన్హాలు తొలగిస్తాం: సీఎం హామీశాంతిభద్రతల పరిరక్షణ కోసం అనంతపురం జిల్లాకు ప్రత్యేక అధికారిణిగా నియమితులైన చారుసిన్హా ఐపీఎస్‌ను అక్కడ నుంచి వెనక్కి పిలిపిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య హామీ ఇచ్చారు. ఈ జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ తెదేపాకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు మంగళవారం సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట బైఠాయించారు.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 7:42 am తెదేపా ఎంపీలకు సంఘీభావం: చిక్కుల్లో వైఎస్.జగన్!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వివాదంలో చిక్కకున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సంఘీభావం ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పై పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకంగా కోర్ కమిటీ సభ్యుడు, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీకి ఫిర్యాదు చేశారు.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 7:23 am అమ్మకాల ఒత్తిడి: భారీ నష్టాల దిశగా సెన్సెక్స్దేశీయ వాటాల అమ్మకాల ఒత్తిడి కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ తిరోగమనం వైపు పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 108 పాయింట్లు పతనమై, 16, 989 పాయంట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు కోల్పోయి, 5, 063 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 7:09 am ఎస్కే వర్శిటీలో ఆందోళన ఉద్రిక్తం: ఖాకీల విధ్వంసం!అనంతపురంలోని శ్రీకృష్ణ విశ్వవిద్యాయం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకి పోతోంది. పోలీసులే విద్యార్థులను రెచ్చగొట్టారు. హాస్టల్ క్యాంటీన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.Source: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 7:09 am స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్‌కు మంగళవారం అంతగా కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభంలో లాభదాయకంగా పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. కాగా.. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ 25 పాయింట్లు స్వల్పంగా క్షీణించి, 17,072 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 20 పాయింట్ల నష్టంతో 5, 085 పాయింట్ల వద్ద కొనసాగుతోందిSource: Yahoo! Telugu: News | 15 Dec 2009 | 6:30 am పాండిచ్చేరిలో ఉదయ్, శ్వేతబసుల చిత్రంఉదయ్కిరణ్ హీరోగా శ్వేతబసు ప్రసాద్ హీరోయిన్‌గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఫిలింస్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ఓ షెడ్యూల్‌ని పాండిచ్చేరిలో పూర్తి చేసుకుంది. ఈశ్వర వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుభాసెల్వం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకుడు యు.కె. ఎవెన్యూస్ పి. ఉదయ్‌కిరణ్ మాట్లాడుతూ.. ఈ చిత్రం తొలి షెడ్యూల్‌ని హైదరాబాద్‌లో పూర్తి చేశాం. ఇటీవలే పాండిచ్చేరి, చెన్నైల్లో రెండో షెడ్యూల్ షూటింగ్‌ని పూర్తి చేశామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Dec 2009 | 4:37 am సంక్రాంతికి కానుకగా యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్"అవితేజ్, త్రినాథ్‌లను హీరోలుగా, పార్వతి, వైనవిలను హీరోయిన్లుగా పరిచయం చేస్తూ ఇ.వి.కుమార్ సమర్పణలో అరుణై పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.3గా ఇ.వి.వి. కంభన్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ "జాయ్".పలువురు ప్రముఖ దర్శకుల వద్ద దర్శకత్వశాఖలో పనిచేసిన టాలెంటెడ్ డైరక్టర్ బి. రాజా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మలేషియాలోని అందమైన లొకేషన్స్‌లో రెండు పాటలు, రామోజీ ఫిల్మ్‌సిటీలో ఒక పబ్ సాంగ్‌తో పాటు 15 రోజుల టాకీ, వైజాగ్‌లో ఒక పాట, కొంత టాకీపార్ట్, హైదరాబాద్‌లోని వివిధ లొకేషన్స్‌లో ఒక పాట చేశామని నిర్మాత తెలియజేశారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సంక్రాంతికి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 15 Dec 2009 | 4:31 am తెలంగాణకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదు: వైఎస్ జగన్తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎట్టి పరిస్థితుల్లోనూ తాను మద్దతు ఇవ్వబోనని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి తేల్చి చెప్పారు. అన్ని రాష్ట్రాల ప్రజలు కలిసిమెలిసి జీవించి ఉండాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. అందువల్ల తాను సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉంటున్నట్టు ప్రకటించారు.Source: జాతీయ | 15 Dec 2009 | 3:16 am రాజీనామాల సంగతి తేల్చాసిందే: సీమాంధ్ర ఎమ్మెల్యేలుసమైక్యాంధ్రకు మద్దతుగా తాము చేసిన రాజీనామాలపై ఏదో ఒకటి చెప్పాలని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకోసం వారంతా మంగళవారం సచివాలయంలో సభాపతితో సమావేశమయ్యారు. రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకునే అంశం పరిశీలనలో ఉందని సమాధానం ఇచ్చారు.Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 2:47 am అనంత నుంచి చారుసిన్హాలు తొలగిస్తాం: సీఎం హామీశాంతిభద్రతల పరిరక్షణ కోసం అనంతపురం జిల్లాకు ప్రత్యేక అధికారిణిగా నియమితులైన చారుసిన్హా ఐపీఎస్‌ను అక్కడ నుంచి వెనక్కి పిలిపిస్తామని ముఖ్యమంత్రి రోశయ్య హామీ ఇచ్చారు. ఈ జిల్లాలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ తెదేపాకు చెందిన సీమాంధ్ర శాసనసభ్యులు మంగళవారం సచివాలయంలోని సీ-బ్లాక్ ఎదుట బైఠాయించారు.Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 2:12 am తెదేపా ఎంపీలకు సంఘీభావం: చిక్కుల్లో వైఎస్.జగన్!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వివాదంలో చిక్కకున్నారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఎంపీలకు సంఘీభావం ప్రకటించడంతో తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌పై పార్టీ క్రమశిక్షణ చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏకంగా కోర్ కమిటీ సభ్యుడు, రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీకి ఫిర్యాదు చేశారు.Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 1:55 am ఎస్కే వర్శిటీలో ఆందోళన ఉద్రిక్తం: ఖాకీల విధ్వంసం!అనంతపురంలోని శ్రీకృష్ణ విశ్వవిద్యాయం విద్యార్థుల ఆందోళనలతో అట్టుడుకి పోతోంది. పోలీసులే విద్యార్థులను రెచ్చగొట్టారు. హాస్టల్ క్యాంటీన్‌లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 1:39 am ఏకాభిప్రాయం కోసం కాంగ్రెస్ కృషి: ప్రణబ్‌కు బాధ్యతలు!రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెపుతూనే ఏకాభిప్రాయ సాధనతోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వనుంది. ఈ ఏకాభిప్రాయ సాధన బాధ్యతను ఆ పార్టీ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీకి కాంగ్రెస్ హైకమాండ్ అప్పగించినట్టు తెలుస్తోంది.Source: జాతీయ | 15 Dec 2009 | 12:24 am ధర్నాలు.. రాస్తారోకోలతో దద్ధరిల్లుతున్న సీమాంధ్ర!రాయలసీమ, కోస్తా ఆంధ్రా ప్రాంతాలు ధర్నాలు, రాస్తారోకోలతో దద్ధరిల్లుతున్నాయి. సమైక్యాంధ్ర కోసం హైదరాబాద్‌లో దీక్ష తలపెట్టిన ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ను పోలీసులు అనుమతి నిరాకరణతో తన దీక్షా శిబిరాన్ని విజయవాడకు తరలించారు. విజయవాడలోని స్వరాజ్య మైదానంలో ప్రారంభించిన ఆయన దీక్షకు ప్రజల నుంచి అనూహ్య మద్దతు లభించింది.Source: ఏపీ న్యూస్ | 15 Dec 2009 | 12:12 am సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా వైఎస్.జగన్!కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి భవిష్యత్ వ్యూహ రచన అంతుచిక్కడం లేదు. సమైక్య నినాదంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అట్టుడికి పోతుంటే.. జగన్ మాత్రం ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 11:53 pm ప్లీజ్.. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడదాం: సీఎం రోశయ్యహస్తినలో మంగళవారం సమావేశమయ్యే కోర్ కమిటీ సమావేశంలో తీసుకునే తుది నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగుతామని కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులకు ముఖ్యమంత్రి కె.రోశయ్య విజ్ఞప్తి చేశారు. అయితే, దీనిపై సీమాంధ్ర మంత్రుల నుంచి సానుకూల స్పందన కరువైంది.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 10:41 pm సమైక్యాంధ్ర దీక్షలు: ఆంధ్రా విద్యార్థుల పరిస్థితి విషమం!గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థుల ఆందోళనకరంగా మారింది. దీక్ష చేస్తున్న ముగ్గురు విద్యార్థుల పరిస్థితి సోమవారం సాయంత్రానికి మరింత విషమంగా మారింది. ఆరోగ్యం ఎంత క్షీణించినా వారు మాత్రం వైద్య పరీక్షలు చేయించుకునేందుకు, అన్న పానీయాలు స్వీకరించేందుకు ససేమిరా అంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 10:31 pm నేడు మరోమారు భేటీ కానున్న కాంగ్రెస్ కోర్ కమిటీ!కాంగ్రెస్ కోర్ కమిటీ మంగళవారం మరోమారు భేటీ కానుంది. ఈ సమావేశంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రజానీకానికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.Source: జాతీయ | 14 Dec 2009 | 10:22 pm సమైక్య నినాదానికి అధిష్టానం తలవంచాల్సిందే: లగడపాటిసమైక్య నినాదానికి కాంగ్రెస్ అధిష్టానం తలవంచాల్సిందేనని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నతున్నాయని ఆయన దుయ్యబట్టారు. తెలుగువారి ఆత్మగౌరవం మీద పుట్టిన తెలుగుదేశం పార్టీ ఇపుడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్ర విచ్ఛిన్నానికి అనుకూలంగా వ్యవహిస్తున్నారని లగడపాటి దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 10:02 pm గూర్ఖాలాండ్ రాష్ట్ర ఏర్పాటు కోసం జశ్వంత్ సింగ్ పట్టుపశ్చిమబెంగాల్ రాష్ట్రాన్ని ముక్కలు చేసి గూర్ఖాలాండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న గట్టి డిమాండ్‌తో గూర్ఖాలాండ్ ముక్తి మోర్చా 96 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. బెంగాల్ నుంచి డార్జిలింగ్ ప్రాంతాన్ని విడదీసి ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రంగా ఏర్పాటుచేయాలన్నది వారు డిమాండ్ చేస్తున్నారు.Source: జాతీయ | 14 Dec 2009 | 9:08 pm దేశ విభజనపై మండిపడ్డ కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లాదేశాన్ని చిన్న రాష్ట్రాలుగా విభజించాలని నిర్ణయించడం పట్ల నేషనల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్, కేంద్ర మంత్రి ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు చేయాలన్న ప్రతిపాదనను తక్షణం విరమించుకోవాలని ఆయన గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని ఇంకెంత విభజిస్తారు అంటూ పార్లమెంటు ఆవరణంలో మీడియాతో అన్నారు.Source: జాతీయ | 14 Dec 2009 | 8:58 pm ఫైట్ మాస్టర్ రాజు మృతిబ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి ఫైట్ మాస్టర్ స్థాయికి ఎదిగిన రాజు సోమవారం తెల్లవారు జామున మృతి చెందారు. చీరాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. గుండెపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. రాజు స్వస్థలం ప్రకాశం జిల్లాలోని వేటపాలెం. అగ్రహీరోలైన ఎన్టీఆర్, బాలకృష్ణ, చిరంజీవి వంటి వారి చిత్రాలకు ఫైట్స్ కంపోజ్ చేసి మంచి పేరు తెచ్చుకున్నారు. చిరంజీవి ఖైదీలో కొత్తగా ఫైట్స్ కంపోజ్ చేసి ట్రెండ్ సృష్టించారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 1:56 pm ఆంధ్రలో పరిస్థితి: హు... హు.. మన దౌర్భాగ్యం: బాలయ్యగత పక్షం రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణా, సమైక్య నినాదాలతో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. దీనిపై యువరత్న బాలకృష్ణ వెరైటీగా స్పందించారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడమని అడిగితే.. "హు.. హు.. మన దౌర్భాగ్యం" అన్నారు.ఈ సందర్భంగా విలేకరులు బాలకృష్ణను మళ్లీ ఒత్తిడి చేసి తెలంగాణా, సమైక్యాంధ్రపై స్పందన తెలియజేయాలని కోరినప్పుడు ఆయన చెప్పానుగా... హు... హు... అని అన్నారు.బాలకృష్ణ వద్ద నుంచి ఏదో ఒక మాటను లాగాలని చూసిన విలేకరుల ఆశ మాత్రం నెరవేరలేదు. దీంతో విలేకరులు కూడా హు.. హు.. అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 10:55 am విడుదలకు సిద్ధమవుతోన్న "ఆఖరి అన్వేషణ""ప్రపంచ సుందరి జాంకీ షా హీరోయిన్‌గా వినోద్ చాప్రా దర్శకత్వంలో హిందీలో రూపొందిన "మిస్టరీ షక్" చిత్రాన్ని విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై "ఆఖరి అన్వేషణ" పేరుతో నిర్మాత టి. దుర్గారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. "కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నుతారు. ఈ క్రమంలో చాలామంది ప్రాణాలు కోల్పోతారు. తనను చంపడానికి ప్రయత్నిస్తున్న దుష్టశక్తుల నుంచి హీరోయిన్ ఎలా తప్పించుకుని బయటపడిందనే కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఆద్యంతం ఎంతో ఉత్కంఠ కలిగించే ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్న నమ్మకముంది" అని నిర్మాత వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 9:57 am డిసెంబర్ 21న ముంబై దాడులపై నివేదికనిరుడు నవంబర్ నెల 26న ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు సంబంధించిన నివేదికను రామ్ ప్రధాన్ కమీషన్ డిసెంబర్ 21న మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశ పెట్టనుందని మహారాష్ట్ర హోం శాఖామంత్రి ఆర్ఆర్ పాటిల్ అసెంబ్లీతోపాటు కౌన్సిల్ సమావేశాల్లోను సోమవారం వెల్లడించారు.Source: జాతీయ | 14 Dec 2009 | 7:42 am పాక్ అదుపులో భారత మత్స్యకారులుఅరేబియా సముద్ర ప్రాంతంలో కచ్ జిల్లా పశ్చిమ తీర ప్రాంతంలో భారతదేశానికి చెందిన మత్స్యాకారులు చేపలు పట్టడానికి వెళ్ళగా వారిని అంతర్జాతీయ మేరీటైమ్ బోర్డర్‌కు చెందిన పాక్ మెరైన్ భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నట్లు గుజరాత్‌కు చెందిన ఎన్ఎఫ్ఎఫ్ కార్యదర్సి మనీష్ లోధారీ సోమవారం వెల్లడించారు.Source: జాతీయ | 14 Dec 2009 | 7:24 am లగడపాటి దీక్ష: అరెస్టు చేసిన పోలీసులుసమైక్యాంధ్రకోసం తొలిసారిగా కదం తొక్కి రాజీనామాస్త్రం సంధించిన లగడపాటి లక్ష్య సాధనకోసం రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఎల్బీ స్టేడియంలో ఆమరణ దీక్షను ప్రారంభించారు. ఆయనతోపాటు మరో 32మంది ఎమ్మెల్యేలు దీక్షకు పూనుకున్నారు. ఈ సందర్భంగా రాజగోపాల్ మాట్లాడుతూ... ఇది అంతం కాదిది... ఆరంభం అని అన్నారు. కొందరు చేసిన దీక్షలాగా తమ దీక్ష ఉండదని, ఎల్బీ స్టేడియంనుంచి ఒక్క అడుగు కూడా కదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారుSource: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 7:00 am కోలీవుడ్‌లో బొమ్మాళీకి ఛాన్సులే.. ఛాన్సులు..!టాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసి అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న యోగా టీచర్, బొమ్మాళీ అనుష్కకు కోలీవుడ్‌లో మంచి ఛాన్సులు వస్తున్నాయట. "ఇరండు" (తెలుగులో రెండు) చిత్రం ద్వారా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన అనుష్కకు.. "అరుంధతి" (తమిళ డబ్బింగ్) ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు మేమేనని విర్రవీగుతోన్న నయనతార, త్రిష, శ్రేయలకు అనుష్క కోలీవుడ్ ప్రవేశం షాక్ ఇచ్చిందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. తమిళంలో పెద్ద హీరో నుంచి యంగ్ హీరో వరకు నటించే అవకాశాలు ఎక్కువ శాతం నయనతారకే వస్తుండేవి. ఈమెకు తర్వాత తెల్లపిల్ల హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా ఆ ఛాన్సులను కొట్టేసింది.అయితే ఈ తెల్లపిల్లకు కూడా ఈ మధ్య ఛాన్సులు అంతగా రావట్లేదని తెలిసింది. అసలు కారణమేమిటని ఆరాతీస్తే..? అనుష్క వెంట కోలీవుడ్ నిర్మాతలు కాల్షీట్ కోసం పడిగాపులు కాస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" అనే చిత్రంలో నటించిన అనుష్క.. ఇందులో డాక్టర్ పాత్రను పోషిస్తోంది. అంతేగాకుండా.. ఎక్స్‌పోజింగ్, గ్లామర్‌కు పెద్దపీట వేసి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందిSource: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 5:30 am అసెంబ్లీ తీర్మానం తర్వాతే తెలంగాణ ప్రక్రియ: ఏఐసీసీరాష్ట్ర విభజనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపితేనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమవుతుందని అఖిలభారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికార ప్రతినిధి షకీల్ అహ్మద్ స్పష్టమైన వివరణ ఇచ్చారు. అర్ధరాత్రి చిదంబరం చేసిన ప్రకటన వెనుక ఒత్తిడితో పాటు.. తెరాస అధినేత కేసీఆర్ ఆరోగ్యం, ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థుల ఆందోళనలు ఉన్నాయన్నారు.Source: జాతీయ | 14 Dec 2009 | 5:29 am "మల్లీశ్వరి" కత్రినా ఆరోగ్యంపై ఆందోళనఆమధ్య పసికర్ల వ్యాధితో కత్రినా బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయిందని వైద్యులు చెప్పారు. కానీ ఆదివారం కత్రినాకైఫ్ ఉన్నట్లుండి కళ్లు తిరిగి కిందపడిపోయిందట. దాంతో మరోసారి ఆమెను ముంబయిలోని సబర్బన్ ఆసుపత్రికి తీసుక వెళ్లారు.అక్కడ ఆమెకు ఆదివారం అంతా చేయాల్సిన పరీక్షలన్నిటినీ చేశారు వైద్యులు. ఆ పరీక్షల్లో కత్రినా హిమోగ్లోబిన్ కౌంట్ గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే హిమోగ్లోబిన్ ఇలా తగ్గిపోవడానికి కారణమేమిటన్నది మాత్రం వారు వెల్లడించలేదు. రక్తంలో అసాధారణ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను కనుగొనేందుకు తమకు సమయం కావాలని వారు చెపుతున్నారు. అప్పటివరకూ కత్రినా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కత్రినా కైఫ్‌కు అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. కత్రినా మాత్రం తనకు కాస్త నీరసంగా ఉందనీ, అంతకుమించి మరేమీ లేదని చెపుతోందట.Source: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 5:28 am విడుదలకు సిద్ధమవుతోన్న "ఆఖరి అన్వేషణ""ప్రపంచ సుందరి జాంకీ షా హీరోయిన్‌గా వినోద్ చాప్రా దర్శకత్వంలో హిందీలో రూపొందిన "మిస్టరీ షక్" చిత్రాన్ని విఘ్నేష్ పిక్చర్స్ పతాకంపై "ఆఖరి అన్వేషణ" పేరుతో నిర్మాత టి. దుర్గారావు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాత మాట్లాడుతూ.. "కొన్ని కోట్ల ఆస్తికి వారసురాలైన హీరోయిన్‌ను చంపాలని కొందరు కుట్ర పన్నుతారు.Source: వినోదం | 14 Dec 2009 | 5:08 am దేశంలోకి చొరబడిన ఆత్మాహుతి దళ సభ్యులు!దేశంలోకి ఆత్మాహుతిదళ సభ్యులు ప్రవేశించినట్టు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముంబై, కోల్‌కతా, ఢిల్లీలతో పాటు. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో వీరు దాడులకు తెగబడే ఆస్కారం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించారు. అందువల్ల ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చాయి.Source: జాతీయ | 14 Dec 2009 | 4:45 am అసెంబ్లీ తీర్మానం లేకుండా లోక్‌సభలో చర్చేలేదు: ప్రణబ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా తామేమీ చేయలేమని కేంద్ర ఆర్థిక మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అలాగే, దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయనతో సమావేశమైన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంత ఎంపీలకు హామీ ఇచ్చారు.Source: జాతీయ | 14 Dec 2009 | 3:05 am
|