|
తీవ్రవాదులతో పాకిస్థాన్‌కు ముప్పే: బరాక్ ఒబామాఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ దేశ సరిహద్దుల్లో పెట్రేగిపోతున్న తీవ్రవాదం వల్ల కేవలం భారత్‌కు మాత్రమే కాకుండా, పాకిస్థాన్‌కు కూడా ప్రమాదమేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. అలాగే, పాకిస్థాన్ లోపల అల్‌ఖైదా, లష్కర్ తోయిబా అగ్రనేతలు ఉన్నట్టు నిఘా వర్గాల నుంచి స్పష్టమైన సమాచారం అందితే ఆ ప్రాంతాల్లో కూడా దాడులు చేసేందుకు వెనుకంజ వేయబోమని ఒబామా తేల్చి చెప్పారు.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 8:50 am మిశ్రమ ఫలితాల్లో విదేశీ మార్కెట్లుసోమవారం విదేశీ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. యూరప్, అమెరికా మార్కెట్లు లాభదాయకంగా కొనసాగుతుండగా, ఒక్క ఆసియా మార్కెట్‌కు చెందిన సూచీలు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు ఆసియా మార్కెట్లు లాభ, నష్టాలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి.అయితే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో 19 పాయింట్ల స్వల్ప నష్టంతో 17,099 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 15 పాయింట్లు పతనమై, 5,102 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది. ఇకపోతే.. యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా.. ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 53 పాయింట్లు పుంజుకుని, 5,315 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ కూడా 60 పాయింట్లు వృద్ధి చెంది, 5,816 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 8:47 am పదివేల మందిని తొలగించనున్న ఆర్సెల్లార్ మిట్టల్స్టీల్ ఉత్పత్తి రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగానున్న ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ వచ్చే ఏడాది లోపు పది వేలమంది ఉద్యోగులను తొలగించనుంది. సాధారణ ఖర్చులను తగ్గించుకునే నేపథ్యంలో తమ సంస్థలోని పది వేల మంది ఉద్యోగులను తొలగించనున్నామని ఆర్సెల్లార్ మిట్టల్ సంస్థ వెల్లడించినట్లు ఫ్రెంచ్ వార్తా పత్రిక సోమవారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 8:44 am అసెంబ్లీ తీర్మానం లేకుండా లోక్‌సభలో చర్చేలేదు: ప్రణబ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా తామేమీ చేయలేమని కేంద్ర ఆర్థిక మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అలాగే, దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయనతో సమావేశమైన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంత ఎంపీలకు హామీ ఇచ్చారు.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 8:35 am అమ్మకాల ఒత్తిడి: స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్బ్యాంక్, కంజ్యూమర్ డూరబుల్స్‌కు చెందిన వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో పయనిస్తోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో లాభాల్లో పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 13 పాయింట్ల స్వల్ప నష్టంతో, 17, 105 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 7 పాయింట్ల స్వల్ప నష్టంతో 5, 109 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 8:34 am లగడపాటి ఆమరణ దీక్ష ప్రకటనకు దిగొచ్చిన అధిష్టానం!కాంగ్రెస్ అధిష్టానం దిగివచ్చింది. విజయవాడ పార్లమెంట్ సభ్యుడు, కరుడుగట్టిన సమైక్యవాది లగడపాటి రాజగోపాల్ ఆమరణ దీక్ష ప్రకటన హైకమాండ్‌ను కదిలించింది. హైదరాబాద్‌కు చేరుకున్న లగడపాటిని అరెస్టు చేశారన్న వార్తను టీవీల ద్వారా తెలుసుకున్న సీమాంధ్ర ప్రజానీకం మరింత ఆగ్రహావేశాలకు లోనయ్యారు.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 8:11 am ఆసియా మార్కెట్ల ప్రభావం: మిశ్రమ ఫలితాల్లో సెన్సెక్స్ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 120 పాయింట్లు పుంజుకుని, 17, 239 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోండగా, నిఫ్టీ ఐదు పాయింట్లు పతనమ 5, 111 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 7:33 am తెదేపా చీలిపోతోంది: అధినేత చంద్రబాబు ఆవేదనపార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎంతో క్రమశిక్షణతో మెలిగిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఇపుడు రెండుగా చీలి పోయారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికంతటకీ కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 7:32 am నవంబర్‌లో 4.78 శాతం పెరిగిన ద్రవ్యోల్బణందేశంలో నిత్యావసర సరుకుల ధరలు పెరిగి నవంబర్ నెలలో ద్రవ్యోల్బణం ఒక్కసారిగా 4.78 శాతం పెరిగింది.అక్టోబర్‌లో కేవలం 1.34 శాతం మాత్రమే ద్రవ్యోల్బణం పెరిగింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం నవంబర్ నెలలో ఉన్న ద్రవ్యోల్బణం 8.48 శాతంగా ఉండింది.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 7:02 am ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్ఐటీ, ఆటో, క్యాపిటల్ గూడ్స్ వాటాల ట్రేడింగ్ ఊపందుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల బాటలో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలతో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 126 పాయింట్లు లాభపడి, 17, 245 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు వృద్ధి చెంది, 5, 149 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 14 Dec 2009 | 6:49 am కోలీవుడ్‌లో బొమ్మాళీకి ఛాన్సులే.. ఛాన్సులు..!టాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టిపడేసి అగ్రహీరోయిన్‌గా ముద్రవేసుకున్న యోగా టీచర్, బొమ్మాళీ అనుష్కకు కోలీవుడ్‌లో మంచి ఛాన్సులు వస్తున్నాయట. "ఇరండు" (తెలుగులో రెండు) చిత్రం ద్వారా కోలీవుడ్ రంగ ప్రవేశం చేసిన అనుష్కకు.. "అరుంధతి" (తమిళ డబ్బింగ్) ద్వారా మంచి గుర్తింపు లభించింది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌లో అగ్రహీరోయిన్లు మేమేనని విర్రవీగుతోన్న నయనతార, త్రిష, శ్రేయలకు అనుష్క కోలీవుడ్ ప్రవేశం షాక్ ఇచ్చిందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు. తమిళంలో పెద్ద హీరో నుంచి యంగ్ హీరో వరకు నటించే అవకాశాలు ఎక్కువ శాతం నయనతారకే వస్తుండేవి. ఈమెకు తర్వాత తెల్లపిల్ల హ్యాపీడేస్ ఫేమ్ తమన్నా ఆ ఛాన్సులను కొట్టేసింది.అయితే ఈ తెల్లపిల్లకు కూడా ఈ మధ్య ఛాన్సులు అంతగా రావట్లేదని తెలిసింది. అసలు కారణమేమిటని ఆరాతీస్తే..? అనుష్క వెంట కోలీవుడ్ నిర్మాతలు కాల్షీట్ కోసం పడిగాపులు కాస్తున్నారని సమాచారం. ప్రస్తుతం కోలీవుడ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" అనే చిత్రంలో నటించిన అనుష్క.. ఇందులో డాక్టర్ పాత్రను పోషిస్తోంది. అంతేగాకుండా.. ఎక్స్‌పోజింగ్, గ్లామర్‌కు పెద్దపీట వేసి కోలీవుడ్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంటోందిSource: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 5:30 am "మల్లీశ్వరి" కత్రినా ఆరోగ్యంపై ఆందోళనఆమధ్య పసికర్ల వ్యాధితో కత్రినా బాధపడుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వ్యాధి తగ్గిపోయిందని వైద్యులు చెప్పారు. కానీ ఆదివారం కత్రినాకైఫ్ ఉన్నట్లుండి కళ్లు తిరిగి కిందపడిపోయిందట. దాంతో మరోసారి ఆమెను ముంబయిలోని సబర్బన్ ఆసుపత్రికి తీసుక వెళ్లారు.అక్కడ ఆమెకు ఆదివారం అంతా చేయాల్సిన పరీక్షలన్నిటినీ చేశారు వైద్యులు. ఆ పరీక్షల్లో కత్రినా హిమోగ్లోబిన్ కౌంట్ గణనీయంగా తగ్గుతున్నట్లు వైద్యులు కనుగొన్నారు. అయితే హిమోగ్లోబిన్ ఇలా తగ్గిపోవడానికి కారణమేమిటన్నది మాత్రం వారు వెల్లడించలేదు. రక్తంలో అసాధారణ మార్పుల వెనుక ఉన్న అసలు కారణాలను కనుగొనేందుకు తమకు సమయం కావాలని వారు చెపుతున్నారు. అప్పటివరకూ కత్రినా పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో కత్రినా కైఫ్‌కు అనేక ప్రాంతాల నుంచి ఫోన్లు చేసి ఆమె ఆరోగ్యంపై వాకబు చేస్తున్నారు. కత్రినా మాత్రం తనకు కాస్త నీరసంగా ఉందనీ, అంతకుమించి మరేమీ లేదని చెపుతోందట.Source: Yahoo! Telugu: Entertainment | 14 Dec 2009 | 5:28 am అసెంబ్లీ తీర్మానం లేకుండా లోక్‌సభలో చర్చేలేదు: ప్రణబ్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంలో ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం లేకుండా తామేమీ చేయలేమని కేంద్ర ఆర్థిక మంత్రి, కోర్ కమిటీ సభ్యుడు ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. అలాగే, దీనిపై లోక్‌సభలో చర్చ చేపట్టేందుకు కూడా ఎలాంటి ఆస్కారం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకు ఆయనతో సమావేశమైన రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంత ఎంపీలకు హామీ ఇచ్చారు.Source: జాతీయ | 14 Dec 2009 | 3:05 am "సమైక్యాంధ్ర టైగర్" లగడపాటి రాజగోపాల్ అరెస్టు!ప్రకటించినట్టుగానే విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి నేరుగా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత ఆయన జాతీయ చేతబూని జై ఆంధ్రప్రదేశ్, సమాక్యాంధ్ర జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ పరుగలు తీశారు. లగడపాటికి రక్షణ వలయంగా ఆయన అనుసరులు, సమైక్యవాదులు భారీగా నిలబడ్డారు. దీంతో అనుచరులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 2:12 am తెదేపా చీలిపోతోంది: అధినేత చంద్రబాబు ఆవేదనపార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఎంతో క్రమశిక్షణతో మెలిగిన తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు ఇపుడు రెండుగా చీలి పోయారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. దీనికంతటకీ కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 2:06 am వైఎస్.జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు అనుకూలమా!తెలంగాణకు సానుకూలంగా కేంద్రం ప్రకటన చేయండంతో రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో అట్టుడికి పోయాయి. ప్రజాప్రతినిధులు పార్టీలకు అతీతంగా తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. రాలయసీమ, కోస్తా ఆంధ్రా ప్రాంతాలకు చెందిన మొత్తం 175 మంది ఎమ్మెల్యేలలో దాదాపుగా 153 మంది వరకు రాజీనామా చేశారు.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 12:57 am అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం: ఏకే.ఆంటోనీరాష్ట్ర ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ ఢిల్లీలో ప్రకటించారు. సోమవారం సాయంత్రంలోగా ఈ ప్రకటనను విడుదల చేస్తామని ఆయన వెల్లడించినట్టు తెలిపారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై సోమవారం లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆంటోనీ పై విధంగా సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 14 Dec 2009 | 12:32 am రాజీనామా యోచనకు సీమాంధ్ర మంత్రుల స్వస్తి!రాయలసీమ, కోస్తా ఆంధ్రా ప్రాంతాలకు చెందిన రాష్ట్ర మంత్రులు ఎట్టకేలకు ఉపసంహరించుకున్నారు. తాము చేసిన రాజీనామాలపై ముఖ్యమంత్రి రోశయ్య ఆమోదముద్ర వేయబోనని తేల్చి చెప్పారన్నారు. అందువల్లే తాము రాజీనామాలను ఉపసంహరించుకున్నట్టు రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, బొత్స సత్యనారాయణలు సోమవారం ఉదయం మీడియాకు వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 14 Dec 2009 | 12:16 am తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల్లో 'మూడు గ్రూపులు'తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మూడు గ్రూపులుగా విడిపోయారు. రాయలసీమ, కోస్తాంధ్ర, తెలంగాణ ప్రాంతాలకు చెందిన శాసనసభ్యులు వేర్వేరుగా సోమవారం అసెంబ్లీ హాలులో సమావేశమయ్యారు. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆ పార్టీ తెలంగాణ ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 11:54 pm కాశ్మీర్‌లో తొలి స్వైన్ ఫ్లూ మరణం: దేశంలో 699 మృతులుజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో తొలి స్వైన్ ఫ్లూ మరణం నమోదైంది. దీంతో ఈ వైరస్ బారినపడి దేశ వ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 699కు చేరుకుంది. శ్రీనగర్‌లో 21 సంవత్సరాల మహిళ మృతి చెందినట్టు ఆ రాష్ట్ర వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి. అలాగే, రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 699కు చేరుకుంది.Source: జాతీయ | 13 Dec 2009 | 11:15 pm మంత్రివర్గంలో ఐక్యతారాగం: కుమ్ములాటలు వద్దు!రాష్ట్ర మంత్రివర్గం ఐక్యతారాగం ఆలపించింది. ప్రస్తుతం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో అటు తెలంగాణ, ఇటు సీమాంధ్ర మంత్రులు సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారంతా ఐక్యంగా ఉండాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 11:03 pm రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా!రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మరో చీకటి రోజు నమోదైంది. విశాలాంధ్ర చరిత్రలోనే అసెంబ్లీ సమావేశాలను నిరవధికంగా వాయిదా పడటం ఇదే తొలిసారి. గవర్నర్ ఆదేశాలకు, బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నిబంధనలకు విరుద్ధంగా సమావేశాలను వాయిదా వేయడం చీకటి రోజు వంటిదని పలువురు ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 10:43 pm ఆంధ్ర ప్రజలంతా గూండాలా: ఎమ్మెల్యే ఆనం వివేకారాయలసీమ నుంచి, విజయవాడ నుంచి హైదరబాద్‌కు గూండాలు వస్తున్నారంటూ తెరాస నేతలు పదేపదే చేస్తున్న ప్రకటనపై నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాస నేతల మాటల ప్రకారం ఆంధ్ర, రాయలసీమ ప్రజలంతా గుండాల్లా కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 10:25 pm థర్మోన్యుక్లియర్ పరీక్షలు విజయవంతం: అనిల్ కకోద్కర్1988 సంవత్సరంలో నిర్వహించిన థర్మో న్యుక్లియర్ పరీక్షల్లో ఎలాంటి అనుమానాలు వద్దని, ఆ పరీక్షలు విజయవంతంగా ముగిశాయని భారత అణు ఇంధన కమిషన్ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ స్పష్టం చేశారు. ఆయన ఒక జాతీయ టీవీఛానల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అణ్వాయుధగారంపై భారత సైన్యంలో నెలకొన్న అనుమానాలను నివృత్తి చేసేందుకు ఆయన ప్రయత్నించారు.Source: జాతీయ | 13 Dec 2009 | 9:40 pm ప్రజల మనోభావాలను తెలుసుకోవాల్సిందే: అబ్దుల్ కలాందేశంలో చిన్నరాష్ట్రాల ఏర్పాటులో ప్రజల మనోభావాలు, ఆకాంక్షలను తెలుసుకోవాల్సిందేనని మాజీ రాష్ట్రపతి, అణుశాస్త్ర పితామహుడు డాక్టర్ ఏపీజే. అబ్దుల్ కలాం అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర సర్కార్ సుముఖత తెలిపిన నేపథ్యంలో మరిన్ని చిన్న రాష్ట్రాల ఏర్పాటు డిమాండ్లు తెరపైకి వచ్చాయి. దీనిపై ఈ అణుశాస్త్రవేత్త స్పందించారు.Source: జాతీయ | 13 Dec 2009 | 9:14 pm సత్యవతికి ప్రేమ విలువను తెలియజేసే "సలీమ్"విష్ణు 6 ప్యాక్ బాడీతో చాలా సన్నబడి బాడీని తగ్గించుకున్నా కళ్ళలోని ఛార్మ్ తగ్గి నీరసించినట్లున్నాడు. అయినా నటలో యాక్టివ్‌నెస్ బాగానే ఉంది. ఇక ఇలియానా తనను మొదట పరిచయం చేసింది వై.వి.ఎస్. చౌదరి అనేమో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేసింది. ఒకరకంగా దర్శకుడే ఆమెను కావాలని అలా చూపించి "దేవదాసు"లా యూత్‌ను బుట్టలో వేయాలని చూసి ఆయనే బుట్టలోపడిపోయాడు.ఇక మోహన్‌బాబు పాత్ర చేయదగినకాకపోయినా పెద్దడాన్‌గా చేసి వెటకారపు డైలాగ్‌లతో, కావేరీఝాతో ఇంగ్లీష్ పాఠాలు చెప్పించుకుంటూ ఆమెను టీచ్‌చేసే విన్యాసాలు చీప్‌క్వాలిటీగా ఉన్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 13 Dec 2009 | 10:53 am రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర: లక్ష్మీ పార్వతిరాష్ట్రాన్ని రెండు ముక్కల చేసేందుకు తమిళనాడు నేత, కేంద్రమంత్రి పి.చిదంబరం కుట్ర పన్నారని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధినేత్రి లక్ష్మీ పార్వతి ఆరోపించారు. దొంగ నాయకులు తయారై పొట్టిశ్రీరాములు ఉన్నతాశయాలతో చేసిన ఆమరణ దీక్షకే మచ్చ తీసుకువచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 5:43 am సమైక్యాంధ్రకు మద్దతుగా ఉధృతమైన ఆమరణ దీక్షలు!రాష్ట్రంలో సమైక్యాంధ్ర ఉద్యమం మరింత తీవ్రరూపం దాల్చుతోంది. ప్రత్యేక తెలంగాణ కోసం కేవలం తెరాస అధినేత కేసీఆర్ ఒక్కరు మాత్రమే ఆమరణ నిరాహార దీక్ష చేస్తే.. సమైక్యాంధ్ర కోసం వందలాది సంఖ్యలో ఆమరణ దీక్షలకు పూనుకుంటున్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తర ఆంధ్ర ప్రాంతాల్లో ప్రజలు, నేతలు పార్టీలకు అతీతంగా దీక్షలు చేసేందుకు ముందుకు వస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 5:11 am పార్లమెంట్‌పై తీవ్రవాదుల దాడి: ఎనిమిదేళ్లు పూర్తి!పార్లమెంట్‌పై దాడి జరిగి డిసెంబరు 13వ తేదీ (ఆదివారం)తో సరిగ్గా ఎనిమిదేళ్లు పూర్తయ్యాయి. తీవ్రవాదుల దాడిని సమర్థవతంగా తిప్పికొట్టే ప్రయత్నంలో వీరమరణం చెందిన సిబ్బంది స్మృత్యర్థం నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి మాత్రం మన ఎంపీలు హాజరుకాలేదు. చివరకు హస్తినలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ఆదివారం సాకుతో తమ నివాసాలకే పరిమితం అయ్యారు.Source: జాతీయ | 13 Dec 2009 | 4:01 am "ధనుష్" క్షిపణి ప్రయోగం విజయవంతంఒరిస్సా తీరంలో ఆదివారం ప్రయోగించిన "ధనుష్" క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగలిగే సామర్థ్యం ఈ ధనుష్ క్షిపణి సొంతం. అంతేకాకుండా, నౌకల నుంచి ప్రయోగించే ధనుష్ క్షిపణిని బంగాళాఖాతంలోని యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు.Source: జాతీయ | 13 Dec 2009 | 2:17 am
|