వజీరిస్థాన్‌లో ఆర్మీ ఆపరేషన్స్ కొనసాగుతోంది: పాక్

దక్షిణ వజీరిస్థాన్‌లో తాలిబాన్ తీవ్రవాదులను ఏరివేసేందుకు ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ ఇంకా పూర్తికాలేదని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ స్పష్టం చేశారు. అయితే తాలిబాన్లకు చెందిన కీలక స్థావరాన్ని ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్టు ఆయన వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 7:47 am

"ధనుష్" క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒరిస్సా తీరంలో ఆదివారం ప్రయోగించిన "ధనుష్" క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగలిగే సామర్థ్యం ఈ ధనుష్ క్షిపణి సొంతం. అంతేకాకుండా, నౌకల నుంచి ప్రయోగించే ధనుష్ క్షిపణిని బంగాళాఖాతంలోని యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 7:47 am

"ఎస్ఎంఎస్-అన్‌హ్యాపీ" పేరుతో ఎస్‌బీఐ పథకం!

ప్రభుత్వ రంగ బ్యాకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) తమ ఖాతాదారుల కోసం సరికొత్త సేవ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఎస్ఎంఎస్-అన్‌హ్యాపీ పేరుతో ప్రవేశపట్టిన ఈ పథకం కింద బ్యాంకు సేవలపై అసంతృప్తి ఉన్న ఖాతాదారులు ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 6:57 am

తమ ప్రజలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్: దామోదర్ రెడ్డి

తమ ప్రాంతానికి చెందిన ప్రజలను ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఇబ్బంది పెడితే తీవ్ర పరిణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై ఆయన ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లకు ఎలాంటి భయం లేదన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 6:47 am

రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగాలి: జేసీ.దివాకర్

రాష్ట్ర విభజన అంటూ జరిగితే శాస్త్రీయబద్ధంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఒకరి జాగీరు కాదని అందువల్ల ఏది జరిగినా న్యాయబద్ధంగానే జరగాలని ఆయన సూచించారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 6:15 am

యూపీఏ అసమర్థ పాలనకు నిదర్శనం: వెంకయ్య

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ప్రధాన కారణం కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర యూపీఏ సర్కారేనని భారతీయ జనతా పార్టీ ఎం.వెంకయ్య నాయుడు ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సున్నితమైన తెలంగాణ సమస్యను అర్థం చేసుకోవడంలో కేంద్రం బాధ్యతారాహితంగా వ్యవహించిందని ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 5:52 am

అమెరికన్లకు అలైఖైదాతో లింకులు: పాక్ అధికారులు

పాకిస్తాన్‌లో పట్టుబడిన ఐదుగురు అమెరికా ఉగ్రవాదులకు నిషేధిత అల్‌ఖైదాతో సంబంధాలున్నాయని అధికారులు తెలిపారు. ఉగ్రవాద దాడులకు కుట్రపన్నిన అభియోగంపై పాక్‌లో ఐదుగురు అమెరికన్లను బుధవారం అరెస్టు చేశారు. వీరిలో ఇద్దరు పాకిస్తానీ, మరో ఇద్దరు అమెరికన్లు కావడం గమనార్హం. వీరివద్ద పాక్‌ అధికారులతో పాటుగా ఎఫ్‌బిఐ కూడా ప్రశ్నించిందని అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 5:24 am

రూ.10 వేల కోట్ల నిధులు సేకరణ దిశగా జిందాల్

పబ్లిక్ ఇష్యూ ద్వారా పదివేల కోట్ల రూపాయల మేరకు నిధులను సేకరించేందుకు జందాల్ పవర్ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని నవీన్ జిందాల్ సారథ్యంలోని జిందాల్ పవర్ ప్రకటించింది. కొత్తగా 4400 మెగావాట్ల హైడల్‌, 6100 మెగావాట్ల థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులను ప్రారంభించి 2014 నాటికి పూర్తి చేయటం కోసం రూ.65 వేల కోట్ల పెట్టుబడులను పెడుతున్నట్లుగా జెఎస్‌పిఎల్‌ గ్రూప్‌కు చెందిన జిందాల్‌ పవర్‌ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 5:15 am

ఇరాక్‌పై అందుకే దాడి చేశాం: టోనీ బ్లెయిర్

ఇరాక్ అధ్యక్షుడు సద్ధాం హుస్సేన్‌తో పశ్చిమాసియా ప్రాంతానికి ప్రమాదకరమనే అభిప్రాయం ఉండేదని బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ అన్నారు. సామూహిక వినాశకర ఆయుధాలు ఉన్నట్లు ఆధారాలు లేనప్పటికీ సద్ధాం హుస్సేన్‌ ఆ పదవి నుంచి తొలగించడమే సరైందని బ్లెయిర్ సమర్థించుకున్నారు. ఇరాక్ యుద్ధ విచారణను బ్లెయిర్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో ఎదుర్కొంటున్న నేపథ్యంలో బ్లెయిర్ పైవిధంగా వ్యాఖ్యానించడం గమనార్హం
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 5:11 am

విజయవాడ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక తథ్యం: లగడపాటి

విజయవాడ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల తథ్యమని ఆ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ రాజీనామా చేసిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తన రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 13 Dec 2009 | 5:06 am

విజయవాడ ఎంపీ సీటుకు ఉప ఎన్నిక తథ్యం: లగడపాటి

విజయవాడ లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నికల తథ్యమని ఆ స్థానం నుంచి ప్రాతినిథ్యం వహిస్తూ రాజీనామా చేసిన ఎంపీ లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. తన రాజీనామాను ఉపసంహరించుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 2:38 am

"ధనుష్" క్షిపణి ప్రయోగం విజయవంతం

ఒరిస్సా తీరంలో ఆదివారం ప్రయోగించిన "ధనుష్" క్షిపణి ప్రయోగం విజయవంతమైంది. 350 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను సులభంగా చేధించగలిగే సామర్థ్యం ఈ ధనుష్ క్షిపణి సొంతం. అంతేకాకుండా, నౌకల నుంచి ప్రయోగించే ధనుష్ క్షిపణిని బంగాళాఖాతంలోని యుద్ధ నౌక నుంచి ప్రయోగించారు.
Source: జాతీయ | 13 Dec 2009 | 2:17 am

తమ ప్రజలను ఇబ్బంది పెడితే ఖబడ్దార్: దామోదర్ రెడ్డి

తమ ప్రాంతానికి చెందిన ప్రజలను ఆంధ్ర, రాయలసీమ ప్రాంత వాసులు ఇబ్బంది పెడితే తీవ్ర పరిణాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్.దామోదర్ రెడ్డి హెచ్చరించారు. దీనిపై ఆయన ఆదివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనా హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లకు ఎలాంటి భయం లేదన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 1:17 am

రాష్ట్ర విభజన శాస్త్రీయంగా జరగాలి: జేసీ.దివాకర్

రాష్ట్ర విభజన అంటూ జరిగితే శాస్త్రీయబద్ధంగా జరగాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ఒకరి జాగీరు కాదని అందువల్ల ఏది జరిగినా న్యాయబద్ధంగానే జరగాలని ఆయన సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Dec 2009 | 12:46 am

యూపీఏ అసమర్థ పాలనకు నిదర్శనం: వెంకయ్య

రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులకు ప్రధాన కారణం కాంగ్రెస్ నేతృత్వంలోని కేంద్ర యూపీఏ సర్కారేనని భారతీయ జనతా పార్టీ ఎం.వెంకయ్య నాయుడు ఆరోపించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ.. సున్నితమైన తెలంగాణ సమస్యను అర్థం చేసుకోవడంలో కేంద్రం బాధ్యతారాహితంగా వ్యవహించిందని ఆరోపించారు.
Source: జాతీయ | 13 Dec 2009 | 12:23 am

తెలంగాణా ఆంధ్రప్రదేశ్‌లో భాగం: లగడపాటి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ఒక అంతర్భాగమని విజయవాడ ఎంపీ, కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్ స్పష్టం చేశారు. హైదరాబాద్ సమైక్యాంధ్ర రాష్ట్ర రాజధాని అన్నారు. ఇలాంటి హైదరాబాద్ ఆంధ్ర రాష్ట్రానికి తల్లిలాంటిందని, రాష్ట్రంలోని 22 జిల్లాలు కొడుకులులాంటి వారన్నారు. కలిసి వుంటే కలదు సుఖం అన్నంతంగా వీరంతా కలిసివుంటే ఏదైనా చేస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 11:36 pm

సమైక్య తీర్మానంతోనే ప్రత్యేక తెలంగాణ: మొయిలీ

ఎమ్మెల్యేల సమైక్య తీర్మానంతోనే ప్రత్యేక తెలంగాణ సాధ్యమని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఎమ్మెల్యేలందరూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపట్ల సమైక్యంగా తీర్మానం చేస్తేనే తెలంగాణ వస్తుందని మొయిలీ చెప్పారు.
Source: జాతీయ | 12 Dec 2009 | 11:15 pm

ఖమ్మం జిల్లాలో ఎన్‌కౌంటర్: ఇద్దరు మావోల మృతి

ఖమ్మంజిల్లా ఇల్లెందు మండలం భూపలి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఆదివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పులు జరిగాయి.ఇల్లెందు ప్రాంతంలో మావోయిస్టుల సంచారం ఉన్నట్టు గ్రేహౌండ్స్ దళం ఉన్నతాధికారులకు సమాచారం అందింది. దీంతో స్థానిక పోలీసుల సహకారంతో ఈ దళం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టింది.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 10:26 pm

రాష్ట్ర విభజన రెండో ఎస్సార్సీతోనే సాధ్యం: కరణ్ సింగ్

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటు రెండో ఎస్సార్సీ (రాష్ట్రాల పునర్విభజన కమిషన్)తోనే సాధ్యమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డాక్టర్ కరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఎస్సార్సీ ద్వారా రాష్ట్రాలు విభజించడం వల్ల ఎలాంటి మనస్పర్ధలు ఉత్పన్నం కాబోవన్నారు.
Source: జాతీయ | 12 Dec 2009 | 10:07 pm

రాష్ట్రపతి పాలన అనవసరం: నారాయణ వ్యాఖ్య

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అనవసరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. తాజా పరిస్థితులను చూస్తే రాష్ట్రం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో తాము రాష్ట్రపతి పాలనను కోరుకోవడం లేదన్నారు. బ్యూరోక్రసీ పాలనలో ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలుసునని నారాయణ చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 9:06 pm

ఎల్‌బి నగర్లో అగ్నిప్రమాదం: భారీ ఆస్తి నష్టం

ఎల్‌బి నగర్లో ఆదివారం సంభవించిన ఓ అగ్ని ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగింది. ఎల్‌బి నగర్లోని ఓ టింబర్ డిపోలో ఆదివారం తెల్లవారుజామున రెండు గంటలకు అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ భారీ అగ్ని ప్రమాదంలో టింబర్ డిపోలోని కలప మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. దీంతో పాటు పక్కనే ఉన్న మూడంతస్తుల భవనానికి కూడా మంటలు వ్యాపించడంతో భవనం పూర్తిగా ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో ప్రాణనష్టం సంభవించకపోవడంతో సహాయక చర్యల్లో నిమగ్నమైన సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 8:54 pm

లోకంలో అందరూ హీరోలే...: వెంకటేష్

విక్టరీ వెంకటేష్, శ్రీను వైట్ల దర్శకత్వంలో "నమో వెంకటేశా" చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ముగింపు దశలో ఉంది. సంక్రాంతికి విడుదలకానున్నదని చెప్పారు. వెంకీ పుట్టినరోజు ఈనెల 13వ తేదీ. ఈ సందర్భంగా ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్య్వూ.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 2:21 pm

సినిమాలు తీసేది తెలంగాణావారా..?

గత కొద్ది రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న సంఘటనలపై చలనచిత్ర పరిశ్రమ కలత చెందుతోంది. కళారంగానికి భాష, ప్రాంతీయ భేదం లేదని నిర్మాతలు స్పష్టం చేశారు. అసలు సినిమాలు తీసేది తెలంగాణాయేతరులేననీ, తెలంగాణావారికి పనికల్పిస్తున్నామన్న సంగతిని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని సూచించారు. కొంతమంది స్వార్థపూరిత రాజకీయనాయకులు తమ ప్రయోజనాలకోసం రాష్ట్ర కావాలనుకోవడం తప్పు లేదన్నారు. అయితే ఆ నీడను చలనచిత్రరంగంపై పడనీయకండని విజ్ఞప్తి చేశారు. మన రాష్ట్రం గురించి ఏం తెలుసని సోనియా, ప్రణబ్, చిదంబరంలు మాట్లాడుతున్నారని ఘాటుగా స్పందించారు. అవసరమైతే వారి రాష్ట్రాలను విభజించుకోవచ్చని హితవు పలికారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 10:51 am

లంగా- ఓణీ కట్టుకోవడం నాకు తెలీదు: హన్సిక

పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ అక్తర్ సరసన నటించనున్న తెల్లపిల్ల హన్సిక తనకు లంగా-ఓణీ కట్టుకోవడం తెలీదని చెపుతోంది. ఆ వస్త్ర ధారణ ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు ముంబయిలోని పల్లెటూరి ప్రాంతాలకు వెళ్లి తెలుసుకుంటున్నానని అమయాకంగా చెపుతోంది.తన బాల్యమంతా నగరాల్లోనే గడిచిపోవడంతో లంగా-ఓణీలు కట్టుకున్న అమ్మాయిలు ఎలా ఉంటారో కూడా తనకు తెలియదని అంటోంది. ఇంతకీ ఈ లంగా-ఓణి గొడవ ఏమిటీ...? అనుకుంటున్నారా..?షోయబ్ అక్తర్ సరసన నటించే సదరు సినిమాలో హన్సిక ఓ పల్లెటూరి పిల్లలా కన్పించాలట. ఆ చిత్ర నిర్మాత తన పాత్ర గురించి చెప్పినప్పుడు పెల్లటూరి వేషభాషలు తనకు తెలియవని చెప్పిందట హన్సిక. దాంతో సదరు దర్శకుడు ఆచార సంప్రదాయాలను కఠినంగా అమలు జరిగే ఓ మారుమూల పల్లెటూరు పేరు చెప్పి అక్కడ అమ్మాయిల కట్టూబొట్టూ చూసి నేర్చుకోమన్నాడట.ఇక అప్పట్నుంచీ హన్సిక ఆ ఊరికి వీలుదొరికినప్పుడల్లా చెక్కెర్లు కొడుతోందట.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 9:53 am

తాత్కాలికంగా మంత్రుల రాజీనామా నిర్ణయం ఉపసంహరణ!

సమైక్యాంధ్రకు మద్దతుగా చేయతలపెట్టిన రాజీనామాల నిర్ణయాన్ని తాత్కాలికంగా ఉపసంహరించుకున్నట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖామంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ముఖ్యమంత్రి కె.రోశయ్య సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన శనివారం రాత్రి మీడియాకు వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 8:10 am

మహారాష్ట్రలో స్వల్ప భూప్రకంపనలు: రైళ్లు రద్దు

మహారాష్ట్రలో శనివారం సాయంత్రం స్పల్పస్థాయిలో భూమి కంపించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.2గా నమోదైంది. ఈ భూ ప్రకంపనలు పూణె, ధానే, రత్నగిరి, సతారా, సిధుదుర్గ్, రాయ్‌ఘర్‌, ముంబైలలో కనిపించాయి. ఈ ప్రకంపనల ఫలితంగా కొంకణ్ రైల్వే అన్ని రైళ్ళ సర్వీసులను రద్దు చేసింది. అంతేకాకుండా, మహారాష్ట్రంలోని కోయినా డ్యామ్ వద్ద కూడా భూమి స్వల్పంగా కంపించినట్టు తెలుస్తోంది.
Source: జాతీయ | 12 Dec 2009 | 6:48 am

కాజల్ సోదరి నిషాతో "వీళ్లే"

ఛార్మితో సస్పెన్స్ థ్రిల్లర్ మంత్ర చిత్రం తీసిన నిర్మాత రవిప్రకాష్ తన టీమ్‌తో కొత్తగా వీళ్లే చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకుడిగా మారాడు. అలాగే హీరోహీరోయిన్లు మారారు. హీరోగా వాన ఫేమ్ వినయ్ కాగా, హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్ సోదరి నిషా అగర్వాల్ నటిస్తోంది. తొలిసారిగా ఆమె నటిస్తున్న చిత్రమిదే.జెన్ నెక్ట్స్ మూవీస్ బ్యానర్‌పై వీళ్లే చిత్రం షూటింగ్ శుక్రవారం అన్నపూర్ణా స్టూడియోలో ప్రారంభమైంది. వారిద్దరిపై చిత్రించిన ముహూర్తపు షాట్‌కు ఎస్ఎస్ రాజమౌళి క్లాప్ కొట్టగా, కీరవాణి స్విచాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 6:28 am

ఆడపాండవులు వస్తున్నారోచ్

పాండవులు అంటే ఇంతవరకూ మగవారనే భారతం చెబుతుంది. కానీ సినిమా రంగం మాత్రం ఆడపాండవులు ఉన్నారని కొత్త భాష్యం చెప్పబోతోంది. అది ఎలాగా...? ఏమిటి? అనేది చిత్రం వచ్చేదాకా ఆగాల్సిందేనంటున్నారు చిత్ర దర్శకనిర్మాతలు.
Source: Yahoo! Telugu: Entertainment | 12 Dec 2009 | 6:06 am

రాజీనామాకు సిద్ధపడిన నలుగురు కేంద్ర మంత్రులు!

రాష్ట్ర విభజన ఏర్పాటుపై కేంద్రం చేసిన ప్రకటన లేనిపోని తలనొప్పులకు దారితీసింది. ఇప్పటికే రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాల్లో ఆందోళనలు ఉధృతంగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రాంతాలకు నలుగురు కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసేందుకు శనివారం ముందుకు వచ్చారు.
Source: జాతీయ | 12 Dec 2009 | 5:45 am

రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం: రాష్ట్రపతి పాలన విధింపు?

సమైక్యాంధ్ర రాష్ట్ర విభజన నిర్ణయం రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన మంత్రులంతా శనివారం రాజీనామా చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే తమ ప్రాంతాలకు చెందిన 135 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో వీరిపై ఒత్తిడి పెరిగింది.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 5:07 am

చెన్నయ్‌కు తెలుగుగంగ జలాలు నిలిపివేసిన నేతలు!

రాష్ట్ర విభజన కోసం కేంద్రం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ఆగ్రహావేశాలు తీవ్రస్థాయిలో ఎక్కువ అవుతున్నాయి. ఉత్తర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో ప్రజలు పార్టీలకు అతీతంగా రోడ్లపైకి వచ్చి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Dec 2009 | 4:42 am

రాష్ట్ర ఏర్పాటుకు ప్రభుత్వ తీర్మానం తప్పనిసరి: ప్రణబ్

ఒక రాష్ట్రాన్ని చీల్చి మరో రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ తీర్మానం తప్పనిగా అవసరమని కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటయ్యేందుకు మరికొంత కాలం పడుతుందన్నారు.
Source: జాతీయ | 12 Dec 2009 | 3:35 am