|
సానుకూలం నిర్ణయం రాకపోతే ఆమ"రణం": వైఎస్.వివేకాతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోతే ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద ప్రకటించారు. ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం దృష్ట్యా అనుచరులు వివేకానందకు వారిస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 7:30 am స్పల్ప నష్టాల్లోనే సెన్సెక్స్ పయనంబాంబే స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాలతోనే ర్యాలీని కొనసాగిస్తోంది. వారాంతమైన శుక్రవారం విదేశీ మార్కెట్ల ప్రభావంతో భారీ లాభాల దిశగా పయనించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంటుంది. దీంతో సెన్సెక్స్ 11 పాయింట్ల నష్టంతో, 17, 178 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతుండగా, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 12 పాయింట్లు క్షీణించి, 5,122 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 7:22 am టర్కీ బొగ్గు గనిలో పేలుడు: 19 మంది మృతిటర్కీ బొగ్గు గనిలో సంభవించిన పేలుడులో 19 మంది మరణించారు. శుక్రవారం జరిగిన ఈ ప్రమాదంలో బొగ్గుగనిలో పనిచేసిన 19 మంది కార్మికులు మృతి చెందినట్లు కార్మికుల మంత్రి ఒమర్ దిన్సెర్ వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే సహాయక సిబ్బంది సంఘటనా ప్రాంతానికి చేరుకున్నారని, అంతలోపే 19 మంది కార్మికులు అగ్నికి ఆహుతి అయ్యారని ఒమర్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 7:13 am రాయలసీమ, కోస్తా ఎంపీలూ.. ఆందోళనవద్దు: ప్రధానితెలంగాణాపై కేంద్రం ప్రకటన నేపధ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంత ఎంపీలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. తామంతా సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉన్నామనీ, తెలంగాణా ప్రకటన నేపధ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 6:45 am 130మంది రాజీనామా: ఉద్వేగాలకు లోను కావద్దన్న సీఎంరాష్ట్రంలోని ఆంధ్ర, సీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్వేగాలకు లోనుకావద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ప్రజలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలోని ప్రజలు సంయమనం పాటించాలని, ఉద్వేగాలకు లోనుకాకూడదని ఆయన సూచించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయే కాని, ఆ విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 6:39 am నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది. ట్రేడింగ్ ప్రారంభంలో ఆశాజనకంగా కొనసాగిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 81 పాయింట్లు పడిపోయి, 17,107 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 21 పాయింట్లు క్షీణించి, 5, 113 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 6:24 am రోశయ్య స్థానంలో గీతారెడ్డి ఎంపిక కానున్నారా...?ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి తక్షణ పరిష్కారం కనుగొనేందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సరవేగంగా పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో భాగంగా ముఖ్యమంత్రిని మార్చాలని భావిస్తోంది. గడచిన 48 గంటల్లో రాష్ట్ర రాజకీయాలలో నాటకీయమైన రీతిలో సంభవించిన పరిణామాల నేపథ్యంలో నాయకత్వ మార్పునకు మళ్ళీ తెర తీయబోతున్నట్లు సమాచారం. రోశయ్య స్థానంలో ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన గీతా రెడ్డిని నియమించడానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ముమ్మరంగా ప్రయత్నాలను మొదలుపట్టినట్లు ప్రాథమిక సమాచారం.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 6:18 am రాష్ట్ర హైకోర్టులో కొట్టుకుంటున్న లాయర్లుఏకంగా హైకోర్టులో న్యాయవాదులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో కోర్టును కొంతసేపు గేట్లను మూసివేశారు. రెండు వర్గాలుగా చీలిపోయిన న్యాయవాదులు జై ఆంధ్ర, జై తెలంగాణా, జై రాయలసీమ నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు కలబడ్డారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 6:13 am ప్రతి ఏటా 4 వేలమందిని నియమిస్తాం: భెల్దేశీయ విద్యుత్ ఉత్పాదక రంగంలో అగ్రగామిగానున్న భెల్ సంస్థ ప్రతియేటా నాలుగు వేలమందిని కొత్తగా నియమిస్తుందని కంపెనీ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ బి. ప్రసాద్ రావ్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 5:57 am స్వల్ప నష్టాల్లో బాంబే స్టాక్ మార్కెట్బాంబే స్టాక్ మార్కెట్ వారాంతమైన శుక్రవారం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 49 పాయింట్లు పతనమై, 17, 139 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 3 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,131 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 11 Dec 2009 | 5:54 am సానుకూలం నిర్ణయం రాకపోతే ఆమ"రణం": వైఎస్.వివేకాతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోక పోతే ఆమరణ నిరాహారదీక్ష చేయనున్నట్టు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ సోదరుడు, ఎమ్మెల్సీ వైఎస్.వివేకానంద ప్రకటించారు. ఈ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఆయన ఆరోగ్యం దృష్ట్యా అనుచరులు వివేకానందకు వారిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2009 | 2:01 am రాష్ట్ర హైకోర్టులో కొట్టుకుంటున్న లాయర్లుఏకంగా హైకోర్టులో న్యాయవాదులు రెండు వర్గాలుగా చీలిపోయి ఒకరిపై ఒకరు చేయిచేసుకున్నారు. దీంతో కోర్టును కొంతసేపు గేట్లను మూసివేశారు. రెండు వర్గాలుగా చీలిపోయిన న్యాయవాదులు జై ఆంధ్ర, జై తెలంగాణా, జై రాయలసీమ నినాదాలు చేస్తూ ఒకరిపై ఒకరు కలబడ్డారు.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2009 | 1:41 am 130మంది రాజీనామా: ఉద్వేగాలకు లోను కావద్దన్న సీఎంరాష్ట్రంలోని ఆంధ్ర, సీమ ప్రాంతాలలోని ప్రజలు ఉద్వేగాలకు లోనుకావద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ప్రజలకు సూచించారు. అసెంబ్లీ కమిటీ హాలులో ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ...రాష్ట్రంలోని ప్రజలు సంయమనం పాటించాలని, ఉద్వేగాలకు లోనుకాకూడదని ఆయన సూచించారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తున్నారని వార్తలు వస్తున్నాయే కాని, ఆ విషయం తనకు తెలియదని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Dec 2009 | 1:23 am రాయలసీమ, కోస్తా ఎంపీలూ.. ఆందోళనవద్దు: ప్రధానితెలంగాణాపై కేంద్రం ప్రకటన నేపధ్యంలో కోస్తా, రాయలసీమ ప్రాంత ఎంపీలు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు. తామంతా సమైక్య ఆంధ్రకు కట్టుబడి ఉన్నామనీ, తెలంగాణా ప్రకటన నేపధ్యంలో ఆంధ్ర, రాయలసీమ ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం.Source: జాతీయ | 11 Dec 2009 | 1:15 am సమైక్యమే మా నినాదం.. కాదంటే ప్రతిఘటనే: పళ్ళంసమైక్య ఆంధ్రకే తాము పూర్తిగా కట్టుబడి ఉన్నామని, కాంగ్రెస్ అధిష్టానం తమ మనోభావాలను కించపరిస్తే మాత్రం ప్రతిఘటన తప్పదని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్లం రాజు హెచ్చరించారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎంపీలు గురువారం రాత్రి సమావేశమయ్యారు.Source: జాతీయ | 10 Dec 2009 | 11:24 pm కేసీఆర్-సోనియాల మధ్య లోపాయికారి ఒప్పందం!ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీల మధ్య లోపాయికారి ఒప్పందం ఒకటి కుదిరినట్టు ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఆమె ఏకపక్షంగా తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు వారు దుమ్మెత్తి పోస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 11:11 pm ప్లీజ్.. అన్ని పార్టీల నేతలు సాయం చేయాలి: రోశయ్యప్రస్తుతం రాష్ట్రంలో విపత్కర రాజకీయ సంక్షోభం నెలకొందని , ఇలాంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీల నేతలు తమ వంతు సాయం చేయాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, ప్రస్తుత పరిస్థితుల్లో అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఆయన మల్లగుల్లాలు పడుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 11:11 pm కోస్తా-సీమల్లో సమైక్యాంధ్ర ఉద్యమం తీవ్రరూపం!తెలంగాణ సానుకూల ప్రకటన ప్రకంపనలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రాన్ని ముక్కలు చేయడాన్ని ప్రజా ప్రతినిధులు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా, కోస్తా, ఉత్తర ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ప్రజలు, విద్యార్థులు, ఆగ్రహంతో రగిలి పోతున్నారు. కేంద్ర హోం మంత్రి చేసిన ప్రకటనకు నిరసనగా శుక్రవారం బంద్ పాటిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 10:41 pm నిమ్స్ నుంచి తెరాస అధినేత కేసీఆర్ డిశ్చార్జ్!హైదారబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ఆస్పత్రి నుంచి నేరుగా తన నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యులు మాట్లాడుతూ కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడిందని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 10:03 pm 111కు చేరిన ఎమ్మెల్యేల రాజీనామాలు: స్పీకర్తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తామంటూ కేంద్రం చేసిన ప్రకటన పర్వావసానంగా ఇప్పటి వరకు రాజీనామా చేసిన శాసనసభ్యుల సంఖ్య 111కు చేరుకుంది. శుక్రవారం మరో తొమ్మిది మంది సభ్యులు రాజీనామా చేశారు. స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించిన వారిలో ప్రజారాజ్యం, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు చెందిన సభ్యులు ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 9:54 pm కేసీఆర్ దీక్ష ఫలితం: తెరపైకి మరో తొమ్మిది రాష్ట్రాలు!ప్రత్యేక తెలంగాణ రాష్ట్రకు తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఇతర రాష్ట్రాల్లోని ఉద్యమకారులకు స్ఫూర్తిగా నిలిచింది. దీంతో దేశ వ్యాప్తంగా తొమ్మిది ప్రాంతాల్లోని ఉద్యమకారులు ప్రత్యేక రాష్ట్రం కోసం సరికొత్త డిమాండ్‌ను లేవనెత్తారు.Source: జాతీయ | 10 Dec 2009 | 9:22 pm ఏకాభిప్రాయం కుదిరాకే తుది నిర్ణయం: కాంగ్రెస్ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ప్రక్రియకు సంబంధించి చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. అసెంబ్లీలో ఏకాభిప్రాయం కుదిరిన తర్వాతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం అవుతుందని కాంగ్రెస్ ఢిల్లీ వర్గాలు వెల్లడించాయి. ఇదే విషయాన్ని ఆ పార్టీ సీనియర్ నేత కావూరి సాంబశివరావు స్పష్టం చేశారు.Source: జాతీయ | 10 Dec 2009 | 8:58 pm సినీ ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభావం: "సలీమ్" రిలీజ్ వాయిదాతెలంగాణ వివాదం ఆంధ్రదేశానికి పాకింది. కోస్తా, రాయలసీమల్లోనూ ప్రకంపనలను సృష్టిస్తోంది. పార్టీలతో సంబంధాలు లేకుండా ఎమ్మేల్యేలు, ఎంపీలు రాజీనామా పరంపరలు కొనసాగించడంతో కడప, విజయవాడ, కర్నూలులో ఈ నెల 11న బంద్‌కు వివిధ పక్షాలు పిలుపునిచ్చాయి. 12వ తేదీన వైజాగ్ తదితర ప్రాంతాలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఇటు సినిమాలపై ప్రభావం పడింది. ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉన్న దృష్ట్యా "సలీమ్" చిత్ర విడుదలను వాయిదా వేస్తున్నట్లు మంచు మోహన్‌బాబు గురువారంనాడు ప్రకటన చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 10:18 am వంశీ-అల్లరి నరేష్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం!వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "వంశీ దర్శకత్వంలో సినిమా చేయాలనేది నా చిరకాల వాంఛ. వెండితెరపై వినోదాన్ని పండించడంలో వంశీది ఒక ప్రత్యేకమైన శైలి. మా కలయికలో రూపొందనున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నవ్వుల విందు భోజనం వడ్డిస్తుంది" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 10:02 am రేపు సీమ-ఆంధ్ర ఎమ్మెల్యేల అసెంబ్లీ బహిష్కరణతెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అర్థరాత్రి తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా శుక్రవారం జరిగే అసెంబ్లీ సమావేశాలను బరిష్కరించనున్నట్టు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ శైజలానాథ్ గురువారం రాత్రి ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 7:43 am ప్రత్యేక తెలంగాణా మేం ఒప్పుకోం: రాయపాటిఆంధ్ర ప్రాంత ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కాంగ్రెస్ అధిష్టానం అర్థరాత్రి తెలంగాణా నిర్ణయం ప్రకటించడాన్ని తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గుంటూరు ఎంపీ రాయపాటి సాంబశివరావు చెప్పారు. కోస్త ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని ఆయన అన్నారు.Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 7:37 am తెలంగాణ ఏర్పడేందుకు మరో రెండు సంవత్సరాలు!ప్రత్యేక తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం బుధవారం రాత్రి గం.11.30లకు శ్రద్ధ తీసుకుంటామని, తెలంగాణ ఏర్పాటుకు సుముఖంగానే ఉన్నట్లు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఇది తెలంగాణ వాదులకు ఎంతో ఊరట కలిగిన అంశం. కాని ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడేందుకు రెండు సంవత్సరాలు పట్టవచ్చని కేంద్ర హోం మంత్రిత్వ శాఖాధికారులు తెలిపారు.Source: జాతీయ | 10 Dec 2009 | 6:48 am అత్యధిక పారితోషికం పుచ్చుకోవడంలో జోలీదే అగ్రస్థానం!వినోదరంగంలో శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో హాలీవుడ్ హాట్ స్టార్ ఏంజెలీనా జోలీ 24వ స్థానంలో నిలిచింది. అయితే హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటీమణుల్లో హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ సతీమణి ఏంజెలీనా జోలీదే అగ్రస్థానమని హాలీవుడ్ రిపోర్టర్ వెల్లడించింది. హాలీవుడ్‌లో రారాణిగా వెలుగొందుతున్న ఏంజెలీనా జోలీ.. అత్యధిక పారితోషికం తీసుకునే జాబితాల్లో హాలీవుడ్ తారలు జూలియా రాబర్ట్స్. రీస్ విదర్ స్పూన్ వంటి నటీమణులను వెనక్కి నెట్టి ఉన్నత స్థానంలో నిలిచింది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 5:52 am అసెంబ్లీ తీర్మానం లేనిదే తెలంగాణ అసాధ్యం: కాంగ్రెస్ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం లేనిదే ముందుకు సాగబోమని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలతో జరిపిన సంప్రదింపుల్లో ఏకాభిప్రాయానికి వచ్చిన తర్వాతే తెలంగాణపై ప్రకటన చేయడం జరిగిందని చెప్పారు.Source: జాతీయ | 10 Dec 2009 | 5:28 am తెరపైకి బుందేల్‌ఖండ్ రాష్ట్ర ఏర్పాటుకు తాజా డిమాండ్!తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావును స్ఫూర్తిగా తీసుకున్న బుందేల్‌ఖండ్ ముక్తి మోర్చా నేతలు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తీవ్రస్థాయిలో ఆందోళన చేసేందుకు సమాయత్తమవుతున్నారు. తమ లక్ష్య సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.Source: జాతీయ | 10 Dec 2009 | 5:17 am మూడోసారి పెళ్లికూతురు కానున్న బ్రిట్నీ స్పియర్స్!?పాప్ క్వీన్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి పెళ్లికూతురు కాబోతుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే బ్రిట్నీ స్పియర్స్‌కు నిశ్చితార్థం కూడా అయ్యిందని హాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీనికి బ్రిట్నీ చేతి వేలికి ఓ మిరుమిట్లు గొలిపే ఉంగరమే సాక్ష్యమని "మిర్రర్ ఆన్ లైన్" తన ప్రచురణలో వెల్లడించింది. తన ఏజెంట్ అయిన జాసన్ ట్రావిక్ (37)తో బ్రిట్నీ స్పియర్స్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేగాకుండా వీరిద్దరి మధ్య డేటింగ్ కూడా జరుగుతుందని.. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోవాలని బ్రిట్నీ- జాసన్ నిశ్చయించుకున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 4:57 am మార్చి 26న అల్లు అర్జున్, గుణశేఖర్‌ల "వరుడు"స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర విశేషాలను దర్శకులు గుణశేఖర్ వివరిస్తూ... అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు భిన్నంగా ఓ వైవిధ్యమైన పాత్రని వరుడులో చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 4:50 am సినీ ఇండస్ట్రీపై తెలంగాణ ప్రభావం: "సలీమ్" రిలీజ్ వాయిదాతెలంగాణ వివాదం ఆంధ్రదేశానికి పాకింది. కోస్తా, రాయలసీమల్లోనూ ప్రకంపనలను సృష్టిస్తోంది. పార్టీలతో సంబంధాలు లేకుండా ఎమ్మేల్యేలు, ఎంపీలు రాజీనామా పరంపరలు కొనసాగించడంతో కడప, విజయవాడ, కర్నూలులో ఈ నెల 11న బంద్‌కు వివిధ పక్షాలు పిలుపునిచ్చాయి. 12వ తేదీన వైజాగ్ తదితర ప్రాంతాలు బంద్‌కు పిలుపునివ్వడంతో ఇటు సినిమాలపై ప్రభావం పడింది. ప్రస్తుతం రాష్ట్రం సంక్షోభంలో ఉన్న దృష్ట్యా "సలీమ్" చిత్ర విడుదలను..Source: వినోదం | 10 Dec 2009 | 4:49 am వంశీ-అల్లరి నరేష్ కాంబినేషన్‌లో కొత్త చిత్రం!వంశీ దర్శకత్వంలో అల్లరి నరేష్ హీరోగా ఓ చిత్రం రూపొందనుంది. శ్రీ కీర్తి కంబైన్స్ పతాకంపై ఎం.ఎల్. కుమార్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. అల్లరి నరేష్ మాట్లాడుతూ.. "వంశీ దర్శకత్వంలో సినిమా చేయాలనేది నా చిరకాల వాంఛ. వెండితెరపై వినోదాన్ని పండించడంలో వంశీది ఒక ప్రత్యేకమైన శైలి. మా కలయికలో రూపొందనున్న ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకులకు నవ్వుల విందు భోజనం వడ్డిస్తుంది" అని చెప్పారు.Source: వినోదం | 10 Dec 2009 | 4:33 am అస్సోంలో పేలుళ్ళు : నలుగురి మృతిసోనిత్పుర్ జిల్లాలోని మిస్సామారీ పోలీసు స్టేషన్ పరిధిలోనున్న గూరుబంధా బజారులో గురువారం మధ్యాహ్నం పేలుళ్ళు సంభవించాయి. ఈ పేలుళ్ళ కారణంగా నలుగురు మృతి చెందగా మరో 15 మందికి తీవ్ర గాయాలపాలైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో కొందరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని ఆరోగ్యశాఖాధికారులు తెలిపారు.Source: జాతీయ | 10 Dec 2009 | 4:28 am 30 శాతం వృద్ధా అవుతున్న ఇరు సభల సమయంలోక్సభ, రాజ్యసభలో జరిగే సమావేశాలలో సభ్యులు అతి తక్కువగా పాల్గొంటున్నారు. అందునా సభా సమయం చాలా వృద్ధా అవుతోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి పవన్ కుమార్ బన్సాల్ గురువారం రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో వెల్లడించారు.Source: జాతీయ | 10 Dec 2009 | 4:22 am
|