రాష్ట్రం పరువు తీసిన సోనియా గాంధీ: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రం పరువు తీశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక్క దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న ప్రతిష్ట, ఇమేజ్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 7:54 am

సామూహిక రాజీనామా దిశగా సీమ-ఆంధ్ర ఎంపీలు!

రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ అసంతృప్తి ఒక్కసారి బయటపడింది. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడాన్ని నిగ్రహించుకోలేక పోయిన రాజకీయ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 7:43 am

ఆసియా మార్కెట్ల ప్రభావం: పుంజుకున్న సెన్సెక్స్

ఆసియా మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నానికి పుంజుకుంది. దీంతో మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 84 పాయింట్లు వృద్ధి చెంది, 17,210 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని 5,143 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 7:40 am

పతనం అంచున రోశయ్య సర్కారు: కేంద్రంలోనూ సంక్షోభం!

125 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదంతో కూడిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 7:10 am

వేలల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్న ఇన్ఫోసిస్‌

నిరుడు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉద్యోగులను తొలగించాయి. ప్రస్తుతం మాంద్యం క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో తమ వ్యూహాలు మార్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయ సాఫ్ట్‌వేర్ దిగ్గజమైన ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ సంస్థ దాదాపు 13 వేలమందిని కొత్తగా నియమించనుంది.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 6:59 am

పుంజుకున్న స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ వృద్ధి

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి 12 గంటల వరకు నష్టాల్లో ర్యాలీని కొనసాగించిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 58 పాయింట్లు పుంజుకుని, 17, 183 పాయింట్ల వద్ద లాభాల బాటలో కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప లాభంతో 5,126 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 6:55 am

అధిష్టానానికి షాక్: కోస్తా, రాయలసీమ నేతలకు సోనియా పిలుపు

కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగింది. కోస్తా, రాయలసీమ నేతల వరుస రాజీనామాలతో బెంబేలెత్తిపోతోంది. దీంతో ఈ సాయంత్రం ఢిల్లీకి రావలసిందిగా కోస్తా, సీమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కబురు పంపింది. రాష్ట్ర పరిస్థితిపై ఆందోళన వద్దనీ సోనియా గాంధీ కోస్తా, రాయలసీమ నాయకులకు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 6:54 am

నోబుల్ శాంతి పురస్కారాన్ని అందుకోనున్న ఒబామా

2009 సంవత్సరానికిగాను అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ రోజు ఓస్లోలో నోబుల్ శాంతి పురస్కారాన్ని అందుకోనున్నారు. ఈ పురస్కారాన్ని ఆయన అమెరికా అధ్యక్షుని హోదాలో అందుకోనున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 6:46 am

ఇప్పటివరకూ 72 మంది ఎమ్మేల్యేల రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ హైకమాండ్‌కు షాక్‌నిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణాకు కేంద్రం "సై" అనడంతో కోస్తా, రాయలసీమల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభవాలను తెలుసుకోకుండా కేంద్ర హోం మంత్రి చిదంబరం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ కలిసి కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేయడానికి వ్యూహం పన్నారని ఆంధ్ర, కోస్తా నాయకులు ఆరోపిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 6:17 am

ఎమ్మెల్యేల రాజీనామా సమాచారం నాకు తెలియదు: సీఎం

ఎమ్మెల్యేల రాజీనామాపై తనకు ఎటువంటి సమాచారం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. తనకు ఎమ్మెల్యేల నుంచి రాతపూర్వకంగా రాజీనామా లేఖలు వచ్చినప్పుడే తాను స్పందిస్తానని తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉంటామని తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 10 Dec 2009 | 6:00 am

అత్యధిక పారితోషికం పుచ్చుకోవడంలో జోలీదే అగ్రస్థానం!

వినోదరంగంలో శక్తివంతమైన వందమంది మహిళల జాబితాలో హాలీవుడ్ హాట్ స్టార్ ఏంజెలీనా జోలీ 24వ స్థానంలో నిలిచింది. అయితే హాలీవుడ్‌లో అత్యధిక పారితోషికం పుచ్చుకుంటున్న నటీమణుల్లో హాలీవుడ్ సూపర్ స్టార్ బ్రాడ్‌పిట్ సతీమణి ఏంజెలీనా జోలీదే అగ్రస్థానమని హాలీవుడ్ రిపోర్టర్ వెల్లడించింది. హాలీవుడ్‌లో రారాణిగా వెలుగొందుతున్న ఏంజెలీనా జోలీ.. అత్యధిక పారితోషికం తీసుకునే జాబితాల్లో హాలీవుడ్ తారలు జూలియా రాబర్ట్స్. రీస్ విదర్ స్పూన్ వంటి నటీమణులను వెనక్కి నెట్టి ఉన్నత స్థానంలో నిలిచింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 5:52 am

మూడోసారి పెళ్లికూతురు కానున్న బ్రిట్నీ స్పియర్స్!?

పాప్ క్వీన్ బ్రిట్నీ స్పియర్స్ ముచ్చటగా మూడోసారి పెళ్లికూతురు కాబోతుందని వార్తలొస్తున్నాయి. ఇప్పటికే బ్రిట్నీ స్పియర్స్‌కు నిశ్చితార్థం కూడా అయ్యిందని హాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. దీనికి బ్రిట్నీ చేతి వేలికి ఓ మిరుమిట్లు గొలిపే ఉంగరమే సాక్ష్యమని "మిర్రర్ ఆన్ లైన్" తన ప్రచురణలో వెల్లడించింది. తన ఏజెంట్ అయిన జాసన్ ట్రావిక్ (37)తో బ్రిట్నీ స్పియర్స్ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుందని హాలీవుడ్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. అంతేగాకుండా వీరిద్దరి మధ్య డేటింగ్ కూడా జరుగుతుందని.. దీంతో త్వరలోనే పెళ్లి చేసుకోవాలని బ్రిట్నీ- జాసన్ నిశ్చయించుకున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 4:57 am

మార్చి 26న అల్లు అర్జున్, గుణశేఖర్‌ల "వరుడు"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో హిట్ చిత్రాల నిర్మాత డివివి దానయ్య నిర్మిస్తున్న భారీ చిత్రం వరుడు నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్ర విశేషాలను దర్శకులు గుణశేఖర్ వివరిస్తూ... అల్లు అర్జున్ ఇంతకుముందు చేసిన క్యారెక్టర్లకు భిన్నంగా ఓ వైవిధ్యమైన పాత్రని వరుడులో చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Dec 2009 | 4:50 am

ఎస్కే-ఎస్‌యూ వర్శిటీల్లో ఉద్రిక్తం: పరీక్షలు రద్దు!

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను కేంద్రం చేపడుతుందని కాంగ్రెస్ అధిష్టానం చేసిన ప్రకటనలో రాష్ట్రంలో ఒకవైపు హర్షం మరోవైపు ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రాంత జిల్లాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తుండగా, రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో పరిస్థితి క్షణం క్షణం ఉద్రిక్తగా మారింది.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 3:23 am

రాష్ట్రం పరువు తీసిన సోనియా గాంధీ: చంద్రబాబు

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాష్ట్రం పరువు తీశారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఒక్క దేశంలోనే కాకుండా, ప్రపంచ వ్యాప్తంగా రాష్ట్రానికి ఉన్న ప్రతిష్ట, ఇమేజ్ అన్నీ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చారన ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 2:25 am

సామూహిక రాజీనామా దిశగా సీమ-ఆంధ్ర ఎంపీలు!

రాష్ట్రంలో నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలంగాణ అసంతృప్తి ఒక్కసారి బయటపడింది. ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా కేంద్రం ప్రకటన చేయడాన్ని నిగ్రహించుకోలేక పోయిన రాజకీయ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 2:14 am

పతనం అంచున రోశయ్య సర్కారు: కేంద్రంలోనూ సంక్షోభం!

125 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక తప్పిదంతో కూడిన నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విభజనకు సంబంధించి ఏక పక్షంగా తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 1:41 am

అధిష్టానానికి షాక్: కోస్తా, రాయలసీమ నేతలకు సోనియా పిలుపు

కాంగ్రెస్ హైకమాండ్ దిమ్మతిరిగింది. కోస్తా, రాయలసీమ నేతల వరుస రాజీనామాలతో బెంబేలెత్తిపోతోంది. దీంతో ఈ సాయంత్రం ఢిల్లీకి రావలసిందిగా కోస్తా, సీమ ఎమ్మెల్యేలు, ఎంపీలకు కబురు పంపింది. రాష్ట్ర పరిస్థితిపై ఆందోళన వద్దనీ సోనియా గాంధీ కోస్తా, రాయలసీమ నాయకులకు తెలిపారు.
Source: జాతీయ | 10 Dec 2009 | 1:26 am

ఇప్పటివరకూ 72 మంది ఎమ్మేల్యేల రాజీనామా

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమల్లోని ఎమ్మెల్యేలు, ఎంపీలు కాంగ్రెస్ హైకమాండ్‌కు షాక్‌నిస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణాకు కేంద్రం "సై" అనడంతో కోస్తా, రాయలసీమల నేతలు ధ్వజమెత్తుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనోభవాలను తెలుసుకోకుండా కేంద్ర హోం మంత్రి చిదంబరం, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ కలిసి కుట్ర చేసి ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేయడానికి వ్యూహం పన్నారని ఆంధ్ర, కోస్తా నాయకులు ఆరోపిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 1:14 am

కాంగ్రెస్‌, తెదేపాల్లో చిచ్చుపెట్టిన ప్రత్యేక తెలంగాణ

ప్రత్యేక తెలంగాణకు కేంద్ర సానుకూలంగా స్పదించడంతో రాష్ట్రంలోని రాయలసీమ, ఆంధ్రప్రాంతంలోని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాల బాటలో పయనించేందుకు సిద్ధమౌతున్నారు. తెలంగాణ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు ప్రారంభిస్తోందని ప్రకటించిన నేపథ్యంలో తొలుత ఎంపి లగడపాటి రాజీనామా చేసి లోక్‌సభ స్పీకర్‌కు అందజేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 12:34 am

ఎమ్మెల్యేల రాజీనామా సమాచారం నాకు తెలియదు: సీఎం

ఎమ్మెల్యేల రాజీనామాపై తనకు ఎటువంటి సమాచారం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య తెలిపారు. తనకు ఎమ్మెల్యేల నుంచి రాతపూర్వకంగా రాజీనామా లేఖలు వచ్చినప్పుడే తాను స్పందిస్తానని తెలిపారు. ఇదిలావుండగా రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు సమైక్య రాష్ట్రానికే కట్టుబడి ఉంటామని తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 12:31 am

కొనసాగుతున్న ఎమ్మెల్యేల, ఎంపీల రాజీనామాల పర్వం

కోస్తా, రాయలసీమల్లో "తెలంగాణా" ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ ప్రాంతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వీరంతా మూకుమ్మడి రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Dec 2009 | 12:04 am

ఉల్ఫా చీఫ్‌ను అరెస్టు చేసింది బీఎస్‌ఎఫే: చిదంబరం

ఉల్ఫా తీవ్రవాద సంస్థ అధిపతి అరవింద్ రాజ్‌ఖోవాను అరెస్టు చేసింది భారత సరిహద్దు దళం (బీఎస్ఎఫ్) అని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తెలిపారు. రాజ్‌ఖోవా అరెస్టులో నెలకొన్న వివాదానికి తెరదించేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: జాతీయ | 9 Dec 2009 | 11:21 pm

లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసిన లగడపాటి!

ప్రత్యేక తెలంగాణ తెనె తుట్టె కదిలింది. కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న సానుకూల నిర్ణయం రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ పార్టీకి చెందిన విజయవాడ ఎంపీ, పారిశ్రామికవేత్త లగడపాటి రాజగోపాల్ తన లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 11:07 pm

రాష్ట్రంలో మూడు ముక్కలాట: ఆగ్రహంతో ఎమ్మెల్యేలు!

రాష్ట్ర విభజన అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. తెలంగాణపై కేంద్రం సానుకూల ప్రకటన చేయడంతో కోస్తా, రాయలసీమ ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని తప్పుబడుతున్నారు. అవసరమైతే తమ పదవులను త్యజించేందుకు సైతం సిద్ధంగా ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 10:56 pm

డీజీసీఏ నిబంధనలు రాహుల్ ఉల్లంఘించలేదు: ప్రణబ్

కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ డీజీసీఏ నిబంధనలను ఉల్లంఘించలేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఆయనకు పైలెట్ల బాధ్యతలు తెలుసునని, ఒకరు గుర్తు చేయాల్సిన పని లేదన్నారు.
Source: జాతీయ | 9 Dec 2009 | 9:09 pm

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభం: చిదంబరం

ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వం మెట్టుదిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పచ్చజెండా ఊపింది. కాంగ్రెస్ కోర్ కమిటీ పలు దఫాలుగా చర్చలు జరిపి ఓ నిర్ణయానికి వచ్చింది. చివరకు బుధవారం రాత్రి 11.30 గంటలకు కేంద్ర హోంశాఖామంత్రి చిదంబరం విలేకరుల ముందుకు వచ్చి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించారు.
Source: జాతీయ | 9 Dec 2009 | 9:01 pm

అమీషా... నాన్ వెజ్ జోలికి వెళ్లబోకు: వైద్యులు

పవన్ కల్యాణ్ "బద్రి" చికిత అమీషా పటేల్ అనారోగ్య సమస్యతో ఆస్పత్రి పాలైంది. తీవ్రమైన గ్యాస్ట్రిక్ సమస్యతో ముంబయిలోని సబర్బన్ ఆస్పత్రికి వెళ్లిన ఆమెను వైద్యులు పరీక్షించి వ్యాధి అంత ప్రమాదకర స్థాయిలో లేదని చెప్పారు. అయితే తీసుకునే ఆహారం విషయంలో మాత్రం కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ద్రవ పదార్థాలు, కూరగాయలు మాత్రమే తీసుకోవాలనీ, మాంసాహారాన్ని ప్రస్తుతానికి పక్కనబెట్టాలన్నారు. వైద్యుల సలహాలను తు.చ తప్పకుండా పాటిస్తానని అమీషా పటేల్ చెపుతోంది. ముందుగా సమస్య గురించి తెలుసుకుని వెళ్లడం వల్ల తొలిదశలోనే వ్యాధిని గుర్తించడటంతో చికిత్స సులభమైందని చెప్పింది. తనకు పరీక్ష చేసిన వైద్యులే అమితాబ్, సైఫ్ అలీ ఖాన్‌లకు కూడా చేశారని పాత సంగతులు చెప్పుకొచ్చింది. అయితే ప్రస్తుతానికి తనను వైద్యులు ఆస్పత్రిలో చేరమంటున్నారని వెల్లడించింది అమీషా.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2009 | 9:30 am

నా ఫిగర్‌ను చూసి నేనే ఈర్ష్య పడుతుంటా: అమృత

అతిథి చిత్రంలో మహేష్ బాబుతో నటించిన సెక్సీ హీరోయిన్ అమృతారావు తన ఫిగర్ ను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహాల ప్రకారం మంచి డైట్ తీసుకోవడంతో పాటు స్విమ్మింగ్, వాకింగ్ అంటూ బాడీని ఫిట్‌గా ఉంచే వ్యాయామాలు చేస్తానంటోంది. అంతేకాదండోయ్.. ఫిట్‌గా ఉన్నటువంటి తన ఫిగర్‌ను చూసుకుని "ఎంత అందంగా ఉన్నానో" అని తనకు తనే ఈర్ష్య పడుతుంటుందట. ఒక ఆర్టిస్టుతో లింకు పెట్టి వచ్చే వార్తలను చూసి ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొస్తోంది. తనపై వచ్చే గాలి కబుర్లను ఎంతో ఇష్టంగా చదువుతానని చెపుతుందామె. "నా మీద రూమర్స్‌ని చదివి బాగా నవ్వుకుంటా. నేను ఏడ్వను. ఆ వార్తలను మా పేరెంట్స్‌కి చెప్పి పడీ పడీ నవ్వుతాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఇటువంటివన్నీ సహజమే. నా కుటుంబ సభ్యులకు నా గురించి అంతా తెలుసు కాబట్టి ఎవరితో ఎన్ని లింకులు పెట్టి రాసినా పట్టించుకోరు. నా మీద వచ్చే పుకార్లను నమ్మనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తినే భర్తగా చేసుకుంటా. అంతేతప్ప ఏదో పిచ్చి రాతలు చూసి ఎగ్జైట్ అయ్యే మగాడిని నేను కోరుకోను" అంటోంది అమృతా.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2009 | 8:17 am

ఈ దేశానికి రాహుల్ ఓనర్ కాదు: శివసేన చీఫ్

కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ ఈ దేశానికి ఓనర్ కాదని శివసేన చీఫ్ బాల్‌థాక్రే అభిప్రాయపడ్డారు. అర్హతలు ఉంటే ముస్లిం కూడా ప్రధానమంత్రి కావచ్చని రాహుల్ చేసిన వ్యాఖ్యలపై బాల‌థాక్రే మండిపడ్డారు.
Source: జాతీయ | 9 Dec 2009 | 6:50 am

వాజ్‌పేయిపై విమర్శలు: క్షమాపణ చెప్పిన ప్రధాని

అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు మాజీ ప్రధాని వాజ్‌పేయిని తక్కువ చేసి చూపేలా చేసిన వ్యాఖ్యల పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ అభ్యంతరం వక్తం చేశారు. ఈ వ్యాఖ్యల పట్ల ప్రభుత్వం తరపున వాజ్‌పేయికి ప్రధాని క్షమాపణలు చెప్పారు.
Source: జాతీయ | 9 Dec 2009 | 4:18 am

నా ఫిగర్‌ను చూసి నేనే ఈర్ష్య పడుతుంటా: అమృత

అతిథి చిత్రంలో మహేష్ బాబుతో నటించిన సెక్సీ హీరోయిన్ అమృతారావు తన ఫిగర్ ను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహాల ప్రకారం మంచి డైట్ తీసుకోవడంతో పాటు స్విమ్మింగ్, వాకింగ్ అంటూ బాడీని ఫిట్‌గా ఉంచే వ్యాయామాలు చేస్తానంటోంది. అంతేకాదండోయ్.. ఫిట్‌గా ఉన్నటువంటి తన ఫిగర్‌ను చూసుకుని "ఎంత అందంగా ఉన్నానో" అని తనకు తనే ఈర్ష్య పడుతుంటుందట.
Source: వినోదం | 9 Dec 2009 | 2:48 am