|
ట్రేడింగ్ బలహీనత: నష్టాల్లో సెన్సెక్స్ పయనంవిదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత కారణంగా బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనంలో ర్యాలీని కొనసాగిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 109 పాయింట్లు పతనమై, 17,118 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్ల నష్టంతో 5, 108 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:59 am అది శాంతి యాత్ర కాదు.. విధ్వంస ర్యాలీ: అనురాధతెలంగాణ విద్యార్థులు గురువారం తలపెట్టిన యాత్రకు పేరు మార్చినంత మాత్రాన తాము అనుమతించబోమని ఇంటలిజెన్స్ ఐజీ అనురాధా తెలిపారు. శాంతి యాత్ర ముసుగులో రాష్ట్ర రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయని ఆయన తెలిపారు. అందువల్ల ఈ యాత్రకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:56 am 'గ్రేటర్ హైదరాబాద్' ఒకరబ్బ సొత్తు కాదు: మంత్రి దానంరాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒకరి ఆస్తి కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణను విడగొట్టే ముందు గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. ఆయనతో పాటు మరో మంత్రి ముఖేష్ గౌడ్ కూడా లేఖ పంపారు.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:48 am నష్టాలతో కొనసాగుతున్న విదేశీ మార్కెట్లుప్రపంచ స్టాక్ మార్కెట్లకు బుధవారం ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ బలహీనత, అమ్మకాల ఒత్తిడి కారణంగా.. దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు నష్టాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో యూరప్, ఆసియా మార్కెట్లు నష్టాలతోనే ర్యాలీని కొనసాగిస్తున్నాయి.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:27 am అమెరికాలో మహేంద్రా అండ్ మహేంద్రా కార్ల ఫ్యాక్టరీదేశంలో ట్రాక్టర్లు, కార్ల తదితర వాహనాల తయారీలో అగ్రగామి సంస్థగా ఉన్న మహేంద్రా అండ్ మహేంద్రా సంస్థ కొత్తగా అమెరికాలో కార్ల ఫ్యాక్టరీని నెలకొల్పనుంది. ఈయేడాది ఆఖరులోగా కార్ల ఉత్పత్తి కేంద్రంతో పాటు.. సేల్స్ సెంటర్‌ను ప్రారంభించనున్నట్టు ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:21 am ఆస్ట్రేలియాలో మరో భారతీయ విద్యార్థిపై దాడి!ఆస్ట్రేలియాలో జాతి వివక్ష దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా మరో భారతీయ విద్యార్థిపై దాడి జరిగింది. మెల్‌బోర్న్‌లో 23 సంవత్సరాల యువకుడు చదువు కుంటూ టాక్సీ డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఈయనపై గుర్తు తెలియని వ్యక్తులు కొందరు బుధవారం దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:19 am నా ఫిగర్‌ను చూసి నేనే ఈర్ష్య పడుతుంటా: అమృతఅతిథి చిత్రంలో మహేష్ బాబుతో నటించిన సెక్సీ హీరోయిన్ అమృతారావు తన ఫిగర్ ను కాపాడుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందట. ఆరోగ్య నిపుణులు ఇచ్చే సలహాల ప్రకారం మంచి డైట్ తీసుకోవడంతో పాటు స్విమ్మింగ్, వాకింగ్ అంటూ బాడీని ఫిట్‌గా ఉంచే వ్యాయామాలు చేస్తానంటోంది. అంతేకాదండోయ్.. ఫిట్‌గా ఉన్నటువంటి తన ఫిగర్‌ను చూసుకుని "ఎంత అందంగా ఉన్నానో" అని తనకు తనే ఈర్ష్య పడుతుంటుందట. ఒక ఆర్టిస్టుతో లింకు పెట్టి వచ్చే వార్తలను చూసి ఆశ్చర్యపోతుంటానని చెప్పుకొస్తోంది. తనపై వచ్చే గాలి కబుర్లను ఎంతో ఇష్టంగా చదువుతానని చెపుతుందామె. "నా మీద రూమర్స్‌ని చదివి బాగా నవ్వుకుంటా. నేను ఏడ్వను. ఆ వార్తలను మా పేరెంట్స్‌కి చెప్పి పడీ పడీ నవ్వుతాను. గ్లామర్ ఫీల్డ్‌లో ఇటువంటివన్నీ సహజమే. నా కుటుంబ సభ్యులకు నా గురించి అంతా తెలుసు కాబట్టి ఎవరితో ఎన్ని లింకులు పెట్టి రాసినా పట్టించుకోరు. నా మీద వచ్చే పుకార్లను నమ్మనటువంటి వ్యక్తిత్వం గల వ్యక్తినే భర్తగా చేసుకుంటా. అంతేతప్ప ఏదో పిచ్చి రాతలు చూసి ఎగ్జైట్ అయ్యే మగాడిని నేను కోరుకోను" అంటోంది అమృతా.Source: Yahoo! Telugu: Entertainment | 9 Dec 2009 | 8:17 am నష్టాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనంబుధవారం బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే యథావిధిగా నష్టాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 104 పాయింట్లు నష్టపడి, 17,123 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 42 పాయింట్లు క్షీణించి, 5105 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 8:16 am రాయితీతో రుణాలు ఇవ్వనున్న కోటక్ మహీంద్రాకోటక్ మహీంద్రా బ్యాంకు రాయితీతో కూడిన రుణాలను అందజేయనుంది. 8.49 శాతంతో కూడిన ప్రత్యేకంగా రుణాలను మంజూరు చేయనున్నట్టు ఆ బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ఈ ప్రత్యేక ప్యాకేజీ రుణ సౌకర్యం కింద రుణం మంజూరు చేసిన మొదటి రోజు నుంచి 30 నెలలకు 8.49 శాతం వడ్డీని వసూలు చేస్తారు.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 7:42 am గృహరుణ రేట్లను తగ్గించిన ఐసీఐసీఐ, కొటక్స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరహాలో ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రాలు గృహ రుణాల వడ్డీ రేట్లను తగ్గించాయి. దీంతో ఎస్‌బీఐ ప్రారంభించిన గృహ రుణాల వడ్డీ రేట్ల తగ్గింపు రేసులో ఐసీఐసీఐ, కొటక్ మహీంద్రాలు కూడా చేరాయి.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 7:25 am భారీ నష్టాల దిశగా సెన్సెక్స్ పయనంబాంబే స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి 244 పాయింట్ల మేర పుంజుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 103 పాయింట్ల నష్టంతో 17,124 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 44 పాయింట్లు క్షీణించి, 5, 103 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 9 Dec 2009 | 7:04 am అది శాంతి యాత్ర కాదు.. విధ్వంస ర్యాలీ: అనురాధతెలంగాణ విద్యార్థులు గురువారం తలపెట్టిన యాత్రకు పేరు మార్చినంత మాత్రాన తాము అనుమతించబోమని ఇంటలిజెన్స్ ఐజీ అనురాధా తెలిపారు. శాంతి యాత్ర ముసుగులో రాష్ట్ర రాజధానిలో విధ్వంసం సృష్టించేందుకు కొన్ని దుష్ట శక్తులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాల నుంచి హెచ్చరికలు వచ్చాయని ఆయన తెలిపారు. అందువల్ల ఈ యాత్రకు ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 3:26 am 'గ్రేటర్ హైదరాబాద్' ఒకరబ్బ సొత్తు కాదు: మంత్రి దానంరాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఒకరి ఆస్తి కాదని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణను విడగొట్టే ముందు గ్రేటర్ హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇదే అంశంపై ఆయన పార్టీ అధినేత్రి సోనియా గాంధీ లేఖ రాశారు. ఆయనతో పాటు మరో మంత్రి ముఖేష్ గౌడ్ కూడా లేఖ పంపారు.Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 3:18 am త్వరలోనే తెలంగాణపై సరైన నిర్ణయం: ప్రధాని హామీప్రత్యేక తెలంగాణ అంశంపై పరిస్థితి సమీక్షిస్తున్నామని, త్వరలో ప్రభుత్వ నిర్ణయాన్ని వెల్లడిస్తామని దేశ ప్రధాని మన్మోహన్ తెలియజేశారు. ఈ విషయమై ప్రాంతీయ పార్టీలతోనూ చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం తెలంగాణపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.Source: జాతీయ | 9 Dec 2009 | 1:02 am తెలంగాణా ఉద్యమం: మరణించినవారు 22ప్రత్యేక తెలంగాణాకోసం తెలంగాణా రాష్ట్ర సమితి కేసీఆర్ దీక్షబూనిన నాటి నుంచి నేటివరకూ 22 మంది తమ ప్రాణాలను అర్పించారు. వీరిలో కొందరు కేసీఆర్ ఆరోగ్యం క్షీణించడాన్ని తట్టుకోలేక ప్రాణాలను బలి ఇవ్వగా మిగిలినవారు తమకు ప్రత్యేక తెలంగాణా ఇవ్వాల్సిందేనంటూ ఆత్మహత్యలకు పాల్పడ్డారు.Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 12:51 am కేసీఆరూ.. ఇక దీక్ష విరమించు: రోశయ్య విజ్ఞప్తిప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తక్షణమే దీక్షను విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక తెలంగాణపై చర్చకు శుక్రవారం సభలో ఆమోదం లభించిన పరిస్థితుల్లో కేసీఆర్ దీక్ష విరమించాలని రోశయ్య కోరారు. రాజకీయ నాయకుడైన కేసీఆర్ ప్రాణాలు కాపాడే బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి.. కేసీఆర్ దీక్షకు స్వస్తి చెప్పాలని రోశయ్య అన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 12:50 am కేసీఆర్ తక్షణమే దీక్షను విరమించాలి: పార్లమెంటుప్రత్యేక తెలంగాణా సాధనకు కేసీఆర్ దీక్ష నేపధ్యంలో ఈ అంశంపై పార్లమెంటులో చర్చ ప్రారంభమైంది. తొలుత కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యులు మాట్లాడుతూ... చంద్రశేఖర రావు తన దీక్షను తక్షణమే విరమించాలని కోరారు.Source: జాతీయ | 9 Dec 2009 | 12:29 am తెలంగాణ తీర్మానానికి మద్దతు: చంద్రబాబుప్రత్యేక తెలంగాణ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే తాము పూర్తి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలియజేశారు. బుధవారం సభలో మాట్లాడిన చంద్రబాబు.. తెలంగాణపై చర్చకు తాము ముందుకు వస్తామన్నారు.Source: ఏపీ న్యూస్ | 9 Dec 2009 | 12:26 am సుప్రీంకోర్టు చీఫ్ జస్టీస్ బాలకృష్ణన్‌కు స్వల్ప అస్వస్థత!భారత సర్వోన్నత న్యాయస్థానం కె.బాలకృష్ణన్ బుధవారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను ఢిల్లీలోని ఇంద్రప్రస్థ అపోలో ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. కడుపునొప్పి రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించినట్టు కోర్టు వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 8 Dec 2009 | 10:49 pm తెలంగాణ పరిష్కారం దిశగా ఆలోచన: ధర్మపురితెలంగాణ సమస్యకు పరిష్కారం కనుగొనే దిశగా కాంగ్రెస్ అధిష్టానం యోచన చేస్తోందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన బుధవారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణ పట్ల నిశితంగా ఆలోచన చేస్తోందని చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 10:23 pm ఆషామాషీ అంశం కాదు... సమయం కావాలి: రోశయ్యప్రత్యే తెలంగాణ అంశం ఆషామాషీ అంశం కాదని, దీని పరిష్కారానికి కొంత సమయం కావాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చేందుకు అవసరమైన అవకాశం కల్పించాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, తెలంగాణ సమస్య గురించి ప్రభుత్వానికి అవగాహన ఉందన్నారు.Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 10:15 pm కేసీఆర్ తుదిశ్వాస విడిచినా ఒత్తిడికి తలొగ్గం: మొయిలీప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు తుదిశ్వాస విడిచినా ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని కాంగ్రెస్ అధిష్టానం భీష్మించి కూర్చొంది. ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో మరికొన్ని రాష్ట్రాల నుంచి ఇదే తరహా ఒత్తిడిలు, డిమాండ్లు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 10:14 pm చిమ్మచీకట్లో హెలికాఫ్టర్ ల్యాండింగ్: డీజీసీఏ విచారణ!ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పర్యటనలో ఉన్న కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ వివాదంలో చిక్కుకున్నారు. తాను ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను చిమ్మచీకట్లో ల్యాండింగ్ చేయించారు. పైలట్‌ను బలవంతం చేసి ఈ పని చేయించారని ఉత్తరప్రదేశ్‌లోని మాయావతి సర్కారు ఆరోపిస్తోంది. దీనిపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది. అలాగే, సీతాపూర్ జిల్లా కలెక్టర్ నుంచి వివరణ కూడా కోరింది.Source: జాతీయ | 8 Dec 2009 | 9:14 pm పక్కా ప్రణాళికతోనే బాబ్రీని కూల్చిన భాజపా: చిదంబరంఅయోధ్యలోనే పురాతన బాబ్రీ మసీదును పక్కా ప్రణాళికతోనే భారతీయ జనతా పార్టీ కూల్చివేసిందని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం ఆరోపించారు. బాబ్రీ మసీదు అంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టుకు ఇచ్చిన హామీతో పాటు.. ప్రధాని పి.వి.నరసింహారావుకు ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందని ఆయన ధ్వజమెత్తారు.Source: జాతీయ | 8 Dec 2009 | 9:02 pm నాగార్జునని సత్కరించిన గ్రీకు ప్రభుత్వంగ్రీకువీరుడు నాగార్జున కామాక్షి కళామూవీస్ పతాకంపై అగ్రనిర్మాత డి.శివప్రసాదరెడ్డి కిరణ్ దర్శకత్వంలో నిర్మిస్తున్న భారీ చిత్రం "కేడి" షూటింగ్ కోసం గ్రీస్ వెళ్లారు. గ్రీస్‌కు వచ్చిన గ్రీకువీరుడు నాగార్జునకు గ్రీక్ ప్రభుత్వం, మిలోస్ ఐలాండ్ ప్రతినిధులు, ప్రెస్ మీడియా గ్రాండ్ వెల్‌కమ్ చెప్పి ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా మిలోస్ ఐలాండ్‌లో జరిగిన సత్కార సభలో గ్రీక్ ప్రభుత్వ ప్రతినిధులు మాట్లాడుతూ.. నాగార్జునగారి రాక గ్రీక్ టూరిజం డిపార్ట్‌మెంట్‌కి గ్రేట్ డేగా భావిస్తున్నాం. నాగార్జునగారిని సత్కరించుకోవడం మా అదృష్టం. ఈ అవకాశాన్ని మాకిచ్చిన కామాక్షి కళా మూవీస్, అన్నపూర్ణ స్టూడియోస్ టీమ్‌కి మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మళ్లీ మళ్లీ గ్రీకువీరుడు నాగార్జున మా గ్రీస్‌కు రావాలని కోరుకుంటున్నాం అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 11:56 am వైజాగ్, అరకులో "సీతారాముల కల్యాణం" (లంకలో)సిద్దూ ఫ్రం శీకాకుళం వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత విజయ్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సీతారాముల కల్యాణం (లంకలో). యంగ్ స్టార్ నితిన్, క్యూట్ గాళ్ హన్సిక జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు. కండ బలంకన్నా బుద్ధి బలం గొప్పదన్న పాయింట్‌ను ఆధారం చేసుకుని సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలను తెరకెక్కిస్తున్నారు. డిసెంబరు 4 నుంచి 7 వరకూ నాలుగు రోజులపాటు వైజాగ్‌లో హీరో నితిన్‌తో పాటు డ్యాన్సర్లు పాల్గొనగా భాస్కరభట్ల రాసిన బేసిగ్గా... ఓపిగ్గా.. ఉండటం మాకు రాదే... తేలిగ్గా... తీరిగ్గా.. తిరిగే మనసు మాదే అంటూ పాటకు గణేష్ మాస్టర్ నృత్యరీతులను సమకూరుస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 10:06 am క్రిస్మస్‌కి "గుడుగుడుగుంజం" ఆడియోటూమచ్, ఎక్స్ ట్రా చిత్రాల సక్సెస్ తర్వాత శ్రీచిత్ర బ్యానర్‌పై హ్యాట్రిక్ చిత్రంగా డాక్టర్ రాజేంద్రప్రసాద్, పార్థు, బ్రహ్మానందం ప్రధానతారాగణంగా "గుడుగుడుగుంజం" షూటింగ్ బ్యాంకాక్‌లో ఇటీవలే పూర్తి చేసుకుంది. ఈ నెల 14వ తేదీ నుంచి 20 వరకూ రామోజీ ఫిలింసిటీ పరిసర ప్రాంతాల్లో ప్యాచ్‌వర్క్ పూర్తి చేసి సంక్రాంతి కానుకగా జనవరి 14న సినిమాను విడుదల చేస్తున్నామని నిర్మాత రవికుమార్ రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 9:15 am గురువారం హైదరాబాద్‌కు రాకండి: ఐజీ అనురాధగురువారం (10.12.09)న హైదరాబాద్ నగరంలో ఎలాంటి ప్రదర్శనలు, ర్యాలీలు జరిపేందుకు అనుమతి లేదని, కాబట్టి ఎవ్వరూ కూడా హైదరాబాద్ నగరానికి రాకూడదని ఐజి అనూరాధ మంగళవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. బుధవారం నుంచి తెలంగాణ జిల్లాల్లో 144 సెక్షన్ అమలులో ఉంటుందని, గురువారం నాడు విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టేందుకు నిర్ణయించడంతో నగరంలో తనిఖీలు ముమ్మరంగా ఉంటాయని ఆమె తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 8:11 am తెలంగాణపై తొందరపాటు నిర్ణయాలు వద్దు: జగన్రాష్ట్ర విభజన అంశంపై ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తగదని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత నేత వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సూచించారు. విభజన నిర్ణయానికి ముందుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో నివశిస్తున్న లక్షలాది మంది ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవాలని ఆయన సూచించారు.Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 6:44 am రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పచ్చజెండా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వంతమ రాష్ట్రంలోని సింగూర్‌లో రైల్వే ఫ్యాక్టరీలను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతించిందని, ఈ విషయంపై ప్రభుత్వం కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖకు లేఖ రాసినట్లు ఆ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ మోహన్ చక్రవర్తి మంగళవారం విలేకరులకు తెలిపారుSource: జాతీయ | 8 Dec 2009 | 6:02 am జెనీలియా "కథ" ట్రెయిలర్గ్లామర్ తార జెనీలియా, అరుణ్ అదిత్ జంటగా రాగా శ్రీనివాస్ దర్శకత్వంలో జస్ట్ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న చిత్రం 'కథ'. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఉంటుందనీ, అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందిందని చిత్ర సమర్పకలు గుణ్ణం గంగరాజు అంటున్నారు. ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తిని రేకెత్తించే విధంగా తెరకెక్కిన ఈ కథలో జెనీలియా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 5:53 am కాంగ్రెస్ కరపత్రికగా లిబర్హాన్ నివేదిక: సుష్మా స్వరాజ్కాంగ్రెస్ పార్టీ ఆదేశానుసారం బాబ్రీ విధ్వంస నివేదికను జస్టీస్ లిబర్హాన్ కమిషన్ రూపొందించిందని భారతీయ జనతా పార్టీ మహిళా నేత సుష్మా స్వరాజ్ ఆరోపించారు. మూడు నెలల్లో తేల్చాల్సిన అంశాన్ని సాగదీసి 17 సంవత్సారాలు చేసిందని ఆమె ధ్వజమెత్తారు. ముఖ్యంగా, బాబ్రీ మసీదు విధ్వంసానికి ముందస్తు ప్రణాళిక జరిగినట్టుగా ఈ కమిషన్ నిర్ధారించలేక పోయిందని ఆమె అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 8 Dec 2009 | 5:23 am రాఖీతో నాకు పోలికా..! హ.. హ్హ... హ్హ్హ..!!: షెర్లిన్ముప్పావు వంతు శరీరాన్ని ప్రదర్శించే షెర్లిన్, తన అందాలతో సెక్సిణి రాఖీ సావంత్ అందాలను పోల్చి మాట్లాడటాన్ని హాస్యాస్పదమైన అంశంగా కొట్టి పారేసింది. ఇటీవల కొంతమంది ఫిలిమ్ జనం రాఖీ- షెర్లిన్‌లిద్దరూ తమతమ అందాలను ప్రదర్శించడంలో పోటాపోటీగా ఉంటారనీ, ఇద్దరికీ సమస్థాయిలో అందాలున్నాయని కితాబిచ్చారు. దీనిపై షెర్లిన్ మండిపడింది. తన అందంముందు రాఖీ అందం ఏ మూలకీ సరిపోదనీ ఎద్దేవా చేసింది. ఇదిలావుండగా ఎవరు అందం గొప్ప అనే విషయంలో ఇదివరకే రాఖీ- షెర్లిన్‌లిద్దరూ "ఢీ" కొట్టుకున్నారట. పిల్లుల్లాగా పోట్లాడుకున్నారట. అందాల విషయంలో ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు చెప్పలేనంత ఘాటు పదాలతో ఉన్నాయట.Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 4:53 am వైజాగ్, అరకులో "సీతారాముల కల్యాణం" (లంకలో)సిద్దూ ఫ్రం శీకాకుళం వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ప్రముఖ నిర్మాణ సంస్థ వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే, ప్రముఖ నిర్మాత విజయ్ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం సీతారాముల కల్యాణం (లంకలో). యంగ్ స్టార్ నితిన్, క్యూట్ గాళ్ హన్సిక జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఈశ్వర్ దర్శకుడు. కండ బలంకన్నా బుద్ధి బలం గొప్పదన్న పాయింట్‌ను ఆధారం చేసుకుని సాగే ఈ చిత్రంలో ప్రేక్షకులకు కావలసిన..Source: వినోదం | 8 Dec 2009 | 4:37 am పైలట్‌పై ఒత్తిడి తెచ్చిన రాహుల్: రీటా బహుగుణ జోషీతాను ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ప్రతికూల వాతావరణంలో ల్యాండింగ్ చేయాల్సిందిగా పైలట్‌పై కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఒత్తిడి తెచ్చారని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు రీటా బహుగుణ జోషీ ఆరోపించారు. దీంతో ఆమె మరో వివాదంలో చిక్కున్నారు.Source: జాతీయ | 8 Dec 2009 | 3:55 am అటల్‌జీపై ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయ్: రాహుల్భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయిపై తనకు అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించిన నివేదికలో లిబర్హాన్ కమిటీ ఆయన పేరును చేర్చడం రైటా తప్పా అనేది తనకు తెలియదన్నారు.Source: జాతీయ | 8 Dec 2009 | 2:29 am
|