భారీ లాభాల దిశగా సెన్సెక్స్ పయనం

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాల దిశగా పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి స్వల్ప లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ యూరప్ మార్కెట్లు ఒక్కసారిగా పుంజుకోవడంతో లాభదాయకంగా పయనిస్తోంది. దీంతో మంగళవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 238 పాయింట్లు వృద్ధి చెంది, 17,222 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 83 పాయింట్లు పుంజుకుని, 5,150 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 9:01 am

ప్రధాని తిరిగొచ్చేదాకా ఆగాల్సిందే: మంత్రి మొయిలీ

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ తిరిగి స్వదేశానికి వచ్చేంత వరకు ప్రత్యేక తెలంగాణ వాదులు ఆగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, తక్షణం ఓ నిర్ణయానికి రాలేమని ఆయన తెగేసి చెప్పారు. ఆయన మంగళవారం రాష్ట్రానికి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలతో ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 8:58 am

అన్నపూర్ణకు అన్నం కావాలి!

భారతదేశం వ్యవసాయం, పాడిపరిశ్రమకు పెట్టినది పేరు. అలాంటిది దేశ చరిత్రలో తొలిసారిగా బియ్యం దిగుమతి రంగంలోకి అడుగుపెట్టిందంటే ఆశ్చర్యం కలగకమానదు. పదిమందికి పట్టెడన్నం పెట్టిన రైతు కష్టాలను తీర్చలేని ప్రభుత్వం విదేశాల నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటుదంటే దేశంలో ఎంతటి దారుణమైన పరిస్థితి నెలకొందో ఓ సారి అర్థం చేసుకోవచ్చు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 8:47 am

ఆశాజనకంగా యూరప్ మార్కెట్లు: సెన్సెక్స్ వృద్ధి

మంగళవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలతో కొనసాగిన యూరప్ స్టాక్ మార్కెట్.. మధ్యాహ్నానికి లాభాల బాటలో పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ కూడా భారీ లాభాలను నమోదు చేసుకునే దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో మంగళారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 200 పాయింట్ల భారీ లాభంతో, 17,188 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 72 పాయింట్లు వృద్ధి చెంది, 5,138 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 8:33 am

పెరిగిన కార్లు, బైకుల అమ్మకాలు : సియాం

దేశీయ వాహనాలలో కార్లు, బైకులు నవంబర్ నెలలో జరిగిన అమ్మకాలలో వృద్ధి సాధించిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్(సియాం) మంగళవారం న్యూఢిల్లీలో తెలిపింది. దేశంలో నవంబర్ నెలలో జరిగిన కార్ల అమ్మకాలలో 36.7 శాతం వృద్ధి జరిగి 1,13,687 వాహనాలు అమ్ముడైనాయి. అదే నిరుడు ఇదే నెలలో జరిగిన అమ్మకాలలో 83,121 వాహనాలు అమ్ముడైనట్లు సియాం ఓ ప్రకటనలో తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 8:04 am

అటల్‌జీపై ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయ్: రాహుల్

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయిపై తనకు అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించిన నివేదికలో లిబర్హాన్ కమిటీ ఆయన పేరును చేర్చడం రైటా తప్పా అనేది తనకు తెలియదన్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 7:59 am

ఉల్ఫా దాడులను తిప్పికొడతాం: బంగ్లాదేశ్ హోం మంత్రి

వేర్పాటువాద సంస్థ ఉల్ఫా నుంచి ఎదురయ్యే ఎలాంటి ప్రతిఘటననైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు బంగ్లాదేశ్ హోం మంత్రి షహారా ఖటూన్ తెలిపారు. ఉల్ఫా చీఫ్ అరబింద్ రాజ్‌ఖోవాను పట్టించినందుకు గాను ఆ తీవ్రవాద సంస్థ తమపై దాడులకు ప్రయత్నిస్తే తాము సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 7:22 am

కొనుగోళ్లపై మదుపుదారుల దృష్టి: సెన్సెక్స్ వృద్ధి

విదేశీ మార్కెట్లు తిరోగమనం వైపు పయనిస్తున్నప్పటికీ బాంబే స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో పయనిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప లాభంతో 17,042 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 9 పాయింట్లు స్వల్పంగా పుంజుకుని 5,076 పాయింట్ల వద్ద పయనిస్తుంది.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 7:17 am

విదేశీ పైలెట్ల వేతనాల్లో కోత విధించనున్న ఏఐ

స్వదేశీ ఫైలట్ సంఘాల నుండి వచ్చిన ఒత్తిడి కారణంగా ఎయిర్‌ ఇండియా లిమిటెడ్‌ విదేశీ పైలెట్లకు వారి వేతనాల్లోంచి కనీసం 10 శాతం మేరకు కోత పడనుంది. దీంతో ఎయిర్‌ ఇండియా సంస్థలో పనిచేస్తున్న 150 మంది విదేశీ పైలెట్లు తమ వేతనంలో 10 శాతం వేతనాన్ని కోల్పోనున్నారు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 6:57 am

పదవ తరగతి వారికి ఐఐటిలో శిక్షణ

వచ్చే విద్యాసంవత్సరంలో జరిగే ఐఐటీ, ఏఐఇఇఇ పరీక్షలకు శిక్షణ పొందగోరే విద్యార్థులకు ఐఐటీజెఈఈ ఫోరం ఉచితంగా కౌన్సిలింగ్ ఇస్తుంది. ఈ శిక్షణలో భాగంగా ఐఐటి, జేఈఈ, ఏఐఇఇఇ పరీక్షలకు సంబంధించిన సమాచారం, రాష్ట్రంలోని ఉత్తమ శిక్షణనందించే వివిధ శిక్షణా సంస్థల సమాచారం, ఐఐటి, జేఈఈ, బిట్‌శాట్, ఏఐఇఇఇలాంటి ప్రవేశ పరీక్షల షెడ్యూల్, ఇదివరకటి ప్రశ్నాపత్రాలు, ఈ పరీక్షలకు సంబంధించి విద్యార్థినీ, విద్యార్థుల సందేహాలకు సబ్జెక్ట్ నిపుణులచేత ఉచితంగా కౌన్సిలింగ్ అందిస్తారు.
Source: Yahoo! Telugu: News | 8 Dec 2009 | 6:33 am

జెనీలియా "కథ" ట్రెయిలర్

గ్లామర్ తార జెనీలియా, అరుణ్‌ అదిత్‌ జంటగా రాగా శ్రీనివాస్‌ దర్శకత్వంలో జస్ట్‌ ఎల్లో పతాకంపై గుణ్ణం ఊర్మిళ నిర్మిస్తున్న చిత్రం 'కథ'. సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకున్న ఈ చిత్రం డిసెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ఉంటుందనీ, అన్ని భావోద్వేగాల సమ్మేళనంతో ఈ 'కథ' రూపొందిందని చిత్ర సమర్పకలు గుణ్ణం గంగరాజు అంటున్నారు. ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా కొత్తగా వుంటుంది. విభిన్న భావోద్వేగాలు కలిగిన అమ్మాయిగా ఆమె కనిపిస్తుంది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తిని రేకెత్తించే విధంగా తెరకెక్కిన ఈ కథలో జెనీలియా పాత్ర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 5:53 am

రాఖీతో నాకు పోలికా..! హ.. హ్హ... హ్హ్హ..!!: షెర్లిన్

ముప్పావు వంతు శరీరాన్ని ప్రదర్శించే షెర్లిన్, తన అందాలతో సెక్సిణి రాఖీ సావంత్ అందాలను పోల్చి మాట్లాడటాన్ని హాస్యాస్పదమైన అంశంగా కొట్టి పారేసింది. ఇటీవల కొంతమంది ఫిలిమ్ జనం రాఖీ- షెర్లిన్‌లిద్దరూ తమతమ అందాలను ప్రదర్శించడంలో పోటాపోటీగా ఉంటారనీ, ఇద్దరికీ సమస్థాయిలో అందాలున్నాయని కితాబిచ్చారు. దీనిపై షెర్లిన్ మండిపడింది. తన అందంముందు రాఖీ అందం ఏ మూలకీ సరిపోదనీ ఎద్దేవా చేసింది. ఇదిలావుండగా ఎవరు అందం గొప్ప అనే విషయంలో ఇదివరకే రాఖీ- షెర్లిన్‌లిద్దరూ "ఢీ" కొట్టుకున్నారట. పిల్లుల్లాగా పోట్లాడుకున్నారట. అందాల విషయంలో ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు చెప్పలేనంత ఘాటు పదాలతో ఉన్నాయట.
Source: Yahoo! Telugu: Entertainment | 8 Dec 2009 | 4:53 am

ప్రధాని తిరిగొచ్చేదాకా ఆగాల్సిందే: మంత్రి మొయిలీ

విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని మన్మోహన్ సింగ్ తిరిగి స్వదేశానికి వచ్చేంత వరకు ప్రత్యేక తెలంగాణ వాదులు ఆగాల్సిందేనని కేంద్ర న్యాయశాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. ఇది చాలా సున్నితమైన అంశమని, తక్షణం ఓ నిర్ణయానికి రాలేమని ఆయన తెగేసి చెప్పారు. ఆయన మంగళవారం రాష్ట్రానికి చెందిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ఎంపీలతో ఆయన ఢిల్లీలో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 3:29 am

అటల్‌జీపై ఎంతో గౌరవ మర్యాదలు ఉన్నాయ్: రాహుల్

భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బీహారీ వాజ్‌పేయిపై తనకు అపారమైన గౌరవ మర్యాదలు ఉన్నాయని కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. బాబ్రీ విధ్వంసానికి సంబంధించిన నివేదికలో లిబర్హాన్ కమిటీ ఆయన పేరును చేర్చడం రైటా తప్పా అనేది తనకు తెలియదన్నారు.
Source: జాతీయ | 8 Dec 2009 | 2:29 am

విషమిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం: నిమ్స్ డైరక్టర్

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం రోజురోజుకూ విషమిస్తోందని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ డైరక్టర్ డాక్టర్ ప్రసాదరావు వెల్లడించారు. ఆయన తక్షణం ఆమరణ దీక్షను విరమించి, శరీరంలోకి ఏదైనా ఆహారం తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Dec 2009 | 12:53 am

ఇక ధరల పెరుగుదలపై దృష్టి కేంద్రీకరిస్తాం: రాహుల్

దేశంలో పెరిగిపోతున్న ధరలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించనున్నట్టు కాంగ్రెస్ పార్టీ యువరాజు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు చెప్పారు. ఆయన ఉత్తరప్రదేశ్‌లో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధరల పెరుగుదల ఆందోళన కలిగిస్తోందన్నారు. అందువల్ల ప్రధాని దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు.
Source: జాతీయ | 8 Dec 2009 | 12:11 am

లిబర్హాన్ కమిషన్ ఓ తప్పుల తడక: రాజ్‌నాథ్ ధ్వజం

బాబ్రీ మసీదు విధ్వంసంపై జస్టీస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదిక ఒక తప్పుల తడకగా భారతీయ జనతా పార్టీ అగ్రనేత రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. బాబ్రీ మసీదు కూల్చివేతలో తమ పార్టీ నేతల పాత్ర లేదన్నారు. ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహావేశాలే మసీదు కూల్చివేతకు ప్రధాన కారణమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 11:54 pm

కార్యక్రమాలను అడ్డుకున్న తెరాస: సభ రేపటికి వాయిదా!

అసెంబ్లీ సమావేశాలు మారోమారు రేపటికి (బుధవారం) వాయిదా పడ్డాయి. తెలంగాణ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలని తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన సభ్యులు పట్టుబట్టారు. తొమ్మిది రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న కేసీఆర్ ఆరోగ్యం కంటే.. ఈ సభకు మరొక ముఖ్యమైన అంశం ఏమిటని తెరాస శాసనసభానేత ఈటెల రాజేందర్ ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 11:22 pm

కట్టుదిట్టమైన భద్రత నడుమ జార్ఖండ్ పోలింగ్!

జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం మూడో దశ పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ సాగుతోంది. మొత్తం 81 సీట్లకు గాను 11 సెగ్మెంట్లలో ఈ పోలింగ్ జరుగుతుండగా, 25,41,042 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 10:29 pm

తూతూ మంత్రంగా అఖిలపక్షం: సోనియాకు నివేదిక!

ప్రత్యేక తెలంగాణ అంశంపై సోమవారం రాత్రి ముఖ్యమంత్రి కె.రోశయ్య అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశానుసారం నిర్వహించిన ఈ సమావేశం తూతూమంత్రంగా సాగింది. ఇదే విషయాన్ని సమావేశానంతరం విపక్ష పార్టీల నేతలు అభిప్రాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 10:14 pm

డీసీపీ స్టీఫెన్ రవీంద్రను బదిలీ చేసిన ప్రభుత్వం!

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థుల ఆగడాలను సమర్థవంతంగా అణిచి వేసిన తూర్పు మండలం డీసీపీ స్టీఫెన్ రవీంద్రను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయనను ఉత్తర మండలం డీసీపీగా బదిలీ చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 10:02 pm

తెలంగాణ తీర్మానాన్ని తోసిపుచ్చిన సభాపతి!

అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో భాగంగా మంగళవారం తెరాస సభ్యులు ప్రవేశపెట్టిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి తోసిపుచ్చారు. దీంతో తమ వాయిదా తీర్మానాలను చర్చకు స్వీకరించాలని విపక్షాలు సభను స్తంభింపజేశాయి. విపక్ష సభ్యుల గందరగోళంతో సభ ఎంతకూ దారిలోకి రాకపోవడంతో 15 నిమిషాల పాటు వాయిదా వేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 9:53 pm

బాబ్రీ మసీదు విధ్వంసానికి భాజపాయే కారణం: గుప్తా

అయోధ్యలోని పురాతన బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనలో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీయే ప్రధాన కారణమని సీపీఐ నేత గురుదాస్ గుప్తా ఆరోపించారు. మసీదు కూల్చివేతపై జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికపై ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో వాడివేడిగా చర్చ సాగుతున్న విషయం తెల్సిందే.
Source: జాతీయ | 7 Dec 2009 | 8:54 pm

సంపన్న దేశాల ఒత్తిళ్ళకు తలొగ్గం: మంత్రి జైరామ్ రమేష్

డెన్మార్క్ రాజధాని కోపెన్‌హెగెన్‌లో సోమవారం నుంచి ప్రారంభమైన వాతావరణ మార్పుల సదస్సులో అగ్రదేశాలు చేసే ఒత్తిళ్ళకు భారత్ ఏమాత్రం తలొగ్గబోదని కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 8:48 pm

ప్లస్ టూ సెన్సార్ పూర్తి

కేరళలో "నోట్ బుక్" పేరుతో విడుదలై 175 రోజులు ప్రదర్శించబడి సంచలన విజయం సాధించిన చిత్రాన్ని ప్లస్ టూ పేరుతో తెలుగు ప్రేక్షకులకి మందపాటి రాధాకృష్ణ అందిస్తునారు. ఇటివలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఈ నెలాఖరుకు రిలీజ్ చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. స్కంద, రమ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నఈ చిత్రంలో ఐశ్వర్య, సీత, సుకన్య తదితరులు నటిస్తున్నారు. అతిథి పాత్రలో సురేష్ గోపి నటిచారు. ఈ చిత్రంలో 4 పాటలకు వెన్నెలకంటి సాహిత్యాన్ని అందిచారు. ఈ చిత్రానికి సంగీతం: మేజో జోసఫ్, కథ: బాబ్బి, సంజయ్, మాటలు: శశాంక్ వెన్నలకంటి,నిర్మాత: మందపాటి రాధా కృష్ణ
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 1:27 pm

రీరికార్డింగ్ పనుల్లో కరిష్మా కోఠక్ "గ్లామర్"

చలన చిత్రరంగంపై అవగాహన లేకుండా ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న అంశాన్ని గ్లామర్ చిత్రంలో చూపిస్తున్నట్లు దర్శకనిర్మాత పి. సత్యారెడ్డి తెలిపారు. శంకర్ దాదా జిందాబాద్ ఫేమ్ కరిష్మా కోఠక్ ప్రధాన పాత్రలో జనం ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్ పార్ట్ పూర్తయింది. నిర్మాణానంతర పనులు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా దర్శకనిర్మాత సత్యారెడ్డి మాట్లాడుతూ... డబ్బింగ్ పూర్తయిందనీ, రీరికార్డింగ్ పనులు మొదలయ్యయన్నారు. అవగాహన లేకుండా పరిశ్రమలోకి వచ్చే నూతన నటీనటులకు ఈ చిత్రం ఓ డిక్షనరీలా ఉపయోగపడుతుందన్నారు. నాగార్జునసాగర్‌లో రెండు లాంచీల్లో నాలుగు రోజులపాటు హీరోయిన్ కరిష్మా కోఠక్‌పై చిత్రీకరించిన పాట సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందన్నారు. లహరి సంస్థ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి పేరొచ్చిందని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 1:06 pm

శరవేగంగా ఆకాష్, థ్రిల్లర్ మంజు చిత్రం

ఆకాష్, గౌరీ పండిట్, అయేషా, థ్రిల్లర్ మంజు ప్రధాన పాత్రధారులుగా సిగ్నస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీనికి థ్రిల్లర్ మంజు ఫైట్స్‌ను సమకూర్చడంతోపాటు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ముందు అనుకున్నట్లు జయహే టైటిల్ కాకుండా కథానుగుణంగా మరో టైటిల్‌ను త్వరలో ఖరారు చేయనున్నామని నటుడు, దర్శకుడు థ్రిల్లర్ మంజు తెలిపారు. ఈ నెల 10వ తేదీ వరకూ తొలి షెడ్యూల్‌ను జరుపనున్నామని ఆయన చెప్పారు. అందులో భాగంగా యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తామని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 12:50 pm

16 ఏళ్లకే కడుపు అనేది ఇందులో లేదు: తేజ

అనుకున్న పని అవ్వాలంటే.. అది అవుతుందో లేదో.. వస్తుందో.. రాదో.. ఇలాంటి ధర్మసందేహాలున్నప్పుడు, అయితే అటు లేదంటే ఇటు అనే వాడుతాం. తాజాగా దర్శకుడు తేజ కూడా అదే బాటలో వస్తున్నాడు. సురేష్ బాబుతో కలిసి సంయుక్తంగా ఎక్కువ శాతం కొత్తవారితో చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. "కేక" చిత్రం తర్వాత తను దర్శకత్వం చేయనని చెప్పాడు. దానికే కట్టుబడి ఉన్నానంటూ.. తనకంటే బాగా తీసేవారుంటే మధ్యలోనే మరో దర్శకుడు మారతాడని కూడా స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం తను రూపొందిస్తున్న చిత్రం పేరు "అటు ఇటు". ఈ కథాంశం కూడా కాంట్రవర్సీగా ఉంటుందని తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 9:42 am

కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేదు

ప్రత్యేక తెలంగాణా అంశంపై సోమవారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశం చప్పగా ముగిసింది. సమావేశంలో తెలంగాణాపై ఒక అనుకూల ప్రకటన చేస్తారని అందరూ భావించారు. అయితే ముఖ్యమంత్రి రోశయ్య మాత్రం తమ హైకమాండ్ సూచనల మేరకు ఆయా పార్టీల అభిప్రాయాలను మాత్రం తీసుకునేందుకే సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 8:54 am

అనుకూలమే!! కానీ... ప్రధాని వచ్చాకే తెలంగాణపై ప్రకటన!

ప్రత్యేక తెలంగాణ అంశంపై కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు సోమవారం దృష్టి సారించింది. ప్రస్తుతం ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనలో ఉన్నందున ఆయన భారత్‌కు తిరిగి వచ్చాకే తెలంగాణపై కాంగ్రెస్ నిర్ణయాన్ని ప్రకటించాలని భావించింది.
Source: జాతీయ | 7 Dec 2009 | 8:02 am

సచివాలయంలో ప్రారంభమైన అఖిలపక్ష సమావేశం

ప్రత్యేక తెలంగాణ కోసం గత ఆదివారం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు తెరాసా ఆరోగ్యపరిస్థితి రోజురోజుకు క్షీణించడం, తెలంగాణ జిల్లాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రాష్ట్ర ప్రభుత్వం హుటాహుటిన సోమవారం రాత్రి గం.8లకు అఖిలపక్ష సమావేశం నిర్విహంచింది.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 8:00 am

తెలంగాణ ఉద్యమంలోకి నక్సల్స్ ప్రవేశం: ప్రభుత్వం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ గత ఆదివారం ఉదయం గం. 11లకు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం మరో మలుపు తిరిగింది. ఉద్యమకారుల్లో నక్సలైట్లు కూడా కలిసిపోయి విధ్వంసానికి పాల్పడుతున్నారని ప్రభుత్వం వెల్లడించింది.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 6:47 am

తెలంగాణపై సోమవారం రాత్రి సమావేశమవనున్న అఖిలపక్షం

కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకు ప్రత్యేక తెలంగాణ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధికారులకు సూచించారు. ఈ సమావేశం సోమవారం రాత్రి గం.8లకు నిర్వహించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 6:30 am

తెలంగాణపై భేటీ అయిన కాంగ్రెస్ కోర్ కమిటీ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తెరాస అధ్యక్షుడు కేసీఆర్ ఆరోగ్యంతోపాటు తెలంగాణ అంశంపై కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సిపిపి కార్యాలయంలో సోమవారం సాయంత్రం సమావేశమై చర్చించింది. ఈ సమావేశంలో ప్రధాని విదేశీ పర్యటనలో ఉండగా ఆయన మినహా మిగిలిన కోర్ కమిటీ సభ్యులు హాజరై చర్చలు జరిపారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 6:12 am

తాజ్‌మహల్ కథానాయిక "బీనారాయ్" కన్నుమూత

అనార్కలి, తాజ్‌మహల్ వంటి చిత్రాల ద్వారా భారతీయ చలన చిత్ర సీమలో సుస్థిరమైన స్థానాన్ని పదిలం చేసుకున్న అలనాటి బాలీవుడ్ మేటి నటి బీనారాయ్ గుండెపోటుతో కన్నుమూశారు. 78 ఏళ్ల బీనారాయ్ ఆదివారం ఉదయం ఐదు గంటలకు తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 5:22 am

సెక్సీతార నమిత గురించి సమ్‌థింగ్...

బుగ్గన చొట్టతో, మత్తెక్కించే చూపులతో, కైపెక్కించే శృంగార భంగిమలతో ప్రేక్షకులకు కిక్కెక్కించే సత్తాగల నమిత ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మహా బిజీగా ఉంది. నమిత తన ఇష్టాయిష్టాల గురించి కొన్ని సంగతులు చెప్పింది. మీ కోసం.... ఇష్టమైన వ్యాపకం: దేశంలోని ప్రధాన భాషలన్నిటినీ నేర్చుకోవడం. ఇప్పటికే హిందీ, ఇంగ్లీషు, గుజరాతి, పంజాబీ, తమిళం, తెలుగు భాషలు బాగా మాట్లాడుతాను. చదువుతాను.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 4:55 am

డిసెంబరు నెలాఖరులో "మహాముదురు"

లక్ష్మీ వేంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నేపధ్య గాయకుడు మనో సమర్పణలో అడ్డాల వెంకట్రావు, జమీలా నిర్మాతలుగా తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని మహాముదురుగా తెలుగులోకి అందిస్తున్నారు. డబ్బింగ్, డీటీఎస్ కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 4:41 am

తెలంగాణకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు: మనీష్ తివారీ

కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని ఆ పార్టీ అధికార ప్రతినిధి మనీష్ తివారీ ఢిల్లీలో విలేకరులకు చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసాలను ఆపేందుకు ఆ పార్టీ కార్యకర్తలు ప్రయత్నించాలని ఆయన సూచించారు
Source: జాతీయ | 7 Dec 2009 | 4:30 am

భారత్‌ చేరుకున్న ఎఫ్‌బీఐ బృందం

నిరుడు ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న హెడ్లీ, రాణాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) సోమవారం భారతదేశానికి చేరుకుంది.
Source: జాతీయ | 7 Dec 2009 | 2:56 am