భారీ నష్టాల దిశగా సెన్సెక్స్ పయనం

సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. అమ్మకాల ఒత్తిడితో పాటు విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్లతో, 16,973 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 43 పాయింట్లు క్షీణించి, 5,065 మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 8:49 am

భారత్‌ చేరుకున్న ఎఫ్‌బీఐ బృందం

నిరుడు ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న హెడ్లీ, రాణాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) సోమవారం భారతదేశానికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 8:25 am

ముస్లిం కూడా ప్రధాని కావచ్చు: రాహుల్ గాంధీ

దేశానికి సారథ్యం వహించగల సమర్థత ఉన్న వ్యక్తి ముస్లిం మతానికి చెందినవాడైనా ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. సమర్థత విషయంలో మతం, కుల ప్రస్తావన చూడాల్సిన అవసరం లేదనీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 8:15 am

వైఎస్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: చిరు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన తాను వైఎస్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సివుందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. సభలో వైఎస్ సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ....తాను సభలో ఎలా మాట్లాడాలో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలో ఆయనను చూసి నేర్చుకున్నానన్నారు.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 8:08 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: సెన్సెక్స్ పతనం

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో సెన్సెక్స్ తిరోగమనంవైపు పయనిస్తోంది. దేశీయ వాటాల అమ్మకాల ఒత్తిడి, ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం వంటి కారణాలతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 76పాయింట్లు క్షీణించి, 17,024 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 33 పాయింట్లు పడిపోయి, 5,075 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 7:45 am

అమ్మకాల ఒత్తిడి: నష్టాల్లో సెన్సెక్స్

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో పయనిస్తుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 31 పాయింట్లు పతనమై, 17,070 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 21 పాయింట్లు క్షీణించి, 5,087 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 7:09 am

యూపీలో 'మాయా' మార్కు: రాహుల్ 'ప్రెస్ మీట్' రద్దు!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో "మిషన్ యూపీ-2012"ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఇందుకోసం ఆయన రెండు రోజుల పర్యటనను చేపట్టారు. ఇందులోభాగంగా మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం కావాల్సి వుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఆడిటోరియాన్ని బుక్ చేసుకున్నారు. దీన్ని ఆకస్మికంగా రద్దు చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 6:30 am

కూరగాయల ధరలు 11 శాతం పెరిగాయి: పవార్‌

నిరుడు ఆర్థిక సంవత్సరంలో దేశంలోని కూరగాయల ధరలు దాదాపు 11 శాతం మేరకు పెరిగాయని కేంద్ర వ్యవహాయ శాఖ మంత్రి శరద్‌ సోమవారం పార్లమెంట్‌‌కు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 6:26 am

మిశ్రమ ఫలితాల్లో బాంబే స్టాక్ ఎక్చేంజ్

సోమవారం బాంబే స్టాక్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ట్రేడింగ్ ప్రారంభంలో పుంజుకున్న సెన్సెక్స్ తిరిగి మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభనష్టాలతో పాటు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెనెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 14 పాయింట్ల లాభంతో 17, 115 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తుండగా, నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో 5, 104 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 6:12 am

లాడెన్ కోసం కొత్తగా వేట ప్రారంభించనున్న అమెరికా

అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్ కోసం అమెరికా కొత్తగా వేట ప్రారంభించనుంది. ఈ విషయాన్ని అమెరికాకు చెందిన సీనియర్ అధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. ఆఫ్ఘనిస్థాన్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఒసామా నివశిస్తూ ఉండివుండవచ్చని ఆయన సందేహం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Dec 2009 | 6:10 am

తాజ్‌మహల్ కథానాయిక "బీనారాయ్" కన్నుమూత

అనార్కలి, తాజ్‌మహల్ వంటి చిత్రాల ద్వారా భారతీయ చలన చిత్ర సీమలో సుస్థిరమైన స్థానాన్ని పదిలం చేసుకున్న అలనాటి బాలీవుడ్ మేటి నటి బీనారాయ్ గుండెపోటుతో కన్నుమూశారు. 78 ఏళ్ల బీనారాయ్ ఆదివారం ఉదయం ఐదు గంటలకు తీవ్ర గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబీకులు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 5:22 am

సెక్సీతార నమిత గురించి సమ్‌థింగ్...

బుగ్గన చొట్టతో, మత్తెక్కించే చూపులతో, కైపెక్కించే శృంగార భంగిమలతో ప్రేక్షకులకు కిక్కెక్కించే సత్తాగల నమిత ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాల్లో నటిస్తూ మహా బిజీగా ఉంది. నమిత తన ఇష్టాయిష్టాల గురించి కొన్ని సంగతులు చెప్పింది. మీ కోసం.... ఇష్టమైన వ్యాపకం: దేశంలోని ప్రధాన భాషలన్నిటినీ నేర్చుకోవడం. ఇప్పటికే హిందీ, ఇంగ్లీషు, గుజరాతి, పంజాబీ, తమిళం, తెలుగు భాషలు బాగా మాట్లాడుతాను. చదువుతాను.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 4:55 am

డిసెంబరు నెలాఖరులో "మహాముదురు"

లక్ష్మీ వేంకటేశ్వర ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నేపధ్య గాయకుడు మనో సమర్పణలో అడ్డాల వెంకట్రావు, జమీలా నిర్మాతలుగా తమిళంలో విజయవంతమైన చిత్రాన్ని మహాముదురుగా తెలుగులోకి అందిస్తున్నారు. డబ్బింగ్, డీటీఎస్ కార్యక్రమాలు ముగించుకుని ఈ నెలాఖరులో విడుదలకు సిద్ధమవుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Dec 2009 | 4:41 am

భారత్‌ చేరుకున్న ఎఫ్‌బీఐ బృందం

నిరుడు ఆర్థిక రాజధాని ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడులకు ప్రధాన సూత్రధారులుగా అనుమానిస్తున్న హెడ్లీ, రాణాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని సేకరించేందుకు అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్‌బీఐ) సోమవారం భారతదేశానికి చేరుకుంది.
Source: జాతీయ | 7 Dec 2009 | 2:56 am

వైఎస్‌ను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది: చిరు

అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. అసెంబ్లీకి కొత్తగా ఎన్నికైన తాను వైఎస్‌ను చూసి చాలా నేర్చుకోవాల్సివుందని ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అన్నారు. సభలో వైఎస్ సంతాప తీర్మానంపై ఆయన మాట్లాడుతూ....తాను సభలో ఎలా మాట్లాడాలో, ఇచ్చిన మాటను ఎలా నిలబెట్టుకోవాలో ఆయనను చూసి నేర్చుకున్నానన్నారు.
Source: ఏపీ న్యూస్ | 7 Dec 2009 | 2:49 am

ముస్లిం కూడా ప్రధాని కావచ్చు: రాహుల్ గాంధీ

దేశానికి సారథ్యం వహించగల సమర్థత ఉన్న వ్యక్తి ముస్లిం మతానికి చెందినవాడైనా ప్రధానమంత్రి పదవిని చేపట్టే అవకాశం ఉంటుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ అన్నారు. సమర్థత విషయంలో మతం, కుల ప్రస్తావన చూడాల్సిన అవసరం లేదనీ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 2:46 am

యూపీలో 'మాయా' మార్కు: రాహుల్ 'ప్రెస్ మీట్' రద్దు!

ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో "మిషన్ యూపీ-2012"ను రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఇందుకోసం ఆయన రెండు రోజుల పర్యటనను చేపట్టారు. ఇందులోభాగంగా మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో సమావేశం కావాల్సి వుంది. ఇందుకోసం ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థకు చెందిన ఆడిటోరియాన్ని బుక్ చేసుకున్నారు. దీన్ని ఆకస్మికంగా రద్దు చేశారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 1:02 am

అయోధ్యపై భాజపా ఓ నిర్ణయం తీసుకోవాలి: ఆర్ఎస్ఎస్

అయోధ్యలో రామమందిర నిర్మాణం అంశంపై ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ ఓ స్థిరమైన నిర్ణయం తీసుకోవాలని సంఘ్ పరివార్ సంస్థలైన ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ వంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా, పార్లమెంట్‌లో లిబర్హాన్ కమిషన్‌పై జరిగే చర్చలోనే భాజపా తమ స్థిరమైన నిర్ణయానికి కట్టుబడాలని ఆ సంస్థలు పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 7 Dec 2009 | 12:26 am

ఉస్మానియా క్యాంపస్‌లో ఉద్రిక్తత: బలగాల మొహరింపు!

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాగణంలో మరోమారు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు బలగాలను భారీ సంఖ్యలో మొహరించారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున విద్యార్థులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు పాల్పడకుండా ఉండేందుకు వీలుగా ఈ చర్యలు చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 11:45 pm

ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు: వైఎస్‌కు నివాళి

రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. జాతీయ గీతాలాపనతో ప్రారంభమైన సభా కార్యక్రమాలు ప్రారంభంకాగానే తెలంగాణ రాష్ట్ర సమితి సభ్యులు సభలో 'జై తెలంగాణ' అంటూ నినాదాలు చేశారు. దీంతొ సభాపతి కిరణ్ కుమార్ రెడ్డి సభ్యులపై ఆగ్రహించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 11:21 pm

ఉల్ఫాతో శాంతి చర్చలకు సమ్మతించిన కేంద్రం

ఉల్ఫా తీవ్రవాద సంస్థతో చర్చలు జరిపేందుకు కేంద్ర ప్రభుత్వం సమ్మతించింది. అయితే, అస్సోం రాష్ట్రానికి సార్వభౌమత్వం కల్పించే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. శాంతి చర్చల ప్రక్రియపై ఉల్ఫా నేతలు విభిన్న ప్రకటనలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖ వర్గాలు ఆరోపించాయి.
Source: జాతీయ | 6 Dec 2009 | 11:10 pm

కేసీఆర్ ఆరోగ్యం భేష్: తెరాస నేత హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం భేషుగ్గానే ఉందని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. అయితే, ఆదివారం సాయంత్రం కొంచెం ఆందోళన కలిగించినప్పటికీ.. సోమవారానికి కాస్త మెరుగు పడిందని ఆయన తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 10:47 pm

అసెంబ్లీ ఫ్లోర్ లీడర్‌గా దళిత మహిళా నేత గీతారెడ్డి!

కాంగ్రెస్ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉన్న ఒక దళిత మహిళానేతకు అందలం ఎక్కించింది. రాష్ట్ర అసెంబ్లీలో పార్టీ ఫ్లోర్ లీడర్‌గా రాష్ట్ర సమాచార శాఖామంత్రి జె.గీతారెడ్డిని నియమించింది. ఈ మేరకు ముఖ్యమంత్రి రోశయ్య రాష్ట్ర గవర్నర్ తివారీకి ఆదివారం సాయంత్రం ఒక లేఖను అందచేశారు. సోమవారం ప్రారంభం అయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 10:24 pm

భారత్‌లో ఎఫ్‌బీఐ బృందం: హెడ్లీ లింకులపై ఆరా!

అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అధికారులు ఆదివారం దేశ వాణిజ్య రాజధాని ముంబైకు చేరుకున్నారు. లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ తీవ్రవాద అనుమానితుడిగా భావిస్తున్న అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీకి భారత్‌లో ఉన్న సంబంధాలపై ఆరా తీయనుంది.
Source: జాతీయ | 6 Dec 2009 | 9:00 pm

మా కూటమి అధికారంలోకి వస్తే మమత సీఎం: ప్రణబ్

కాంగ్రెస్-తృణమూల్ కాంగ్రెస్ పార్టీల కూటమి అధికారంలోకి వస్తే పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేంద్ర రైల్వే మంత్రి, టీసీ అధినేత్రి మమతా బెనర్జీ బాధ్యతలు చేపడుతారని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి, బెంగాల్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు.
Source: జాతీయ | 6 Dec 2009 | 8:46 pm

తెలంగాణ పరిష్కారానికి తనవంతు కృషి ఉంటుంది: డిఎస్

ప్రత్యేక తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు తనవంతు కృషి తప్పకుండా ఉంటుందని, దీనకి తాను శాయశక్తులా కృషి చేస్తానని పిసిసి అధ్యక్షుడు డిఎస్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖరరావును ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డి శ్రీనివాస్ ఆదివారం పరామర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 5:59 am

కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది : నిమ్స్ వైద్యులు

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం గత ఆదివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న నిమ్స్ వైద్యులు ఆదివారం ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 5:24 am

మరోమారు చెలరేగిన నక్సలైట్లు: నలుగురి మృతి

దంతేవాడ జిల్లాలోని సుకమా పోలీస్ స్టేషన్ పరిధిలోనున్న కేరలాపాల్ గ్రామానికి సమీపంలోనున్న నక్సల్స్ ఆదివారం నాడు మందుపాతర సహాయంతో ట్రక్కును పేల్చేశారని పోలీసు ఉన్నతాధికారి అమరేష్ సింగ్ తెలిపారు
Source: జాతీయ | 6 Dec 2009 | 5:11 am

తెలంగాణ బిల్లు పెడితే మద్దతిస్తాం: తెదేపా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గురించి అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడితే తమ పార్టీ మద్దతిస్తుందని తెలుగుదేశం తెలిపింది. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేక తెలంగాణ కోసం బిల్లును ప్రవేశ పెడితే తాము మద్దతు తెలుపుతామని తెలుగుదేశం పార్టీ నేతలు నాగం జనార్ధనరెడ్డి, దేవేందర్ గౌడ్‌లు స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 3:22 am

రాజకీయ సన్యాసం తీసుకోనున్న కరుణానిధి

ద్రవిడ మున్నేట్ర కళగం అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్. కరుణానిధి వచ్చేఏడాది మధ్యలో రాజకీయ సన్యాసం తీసుకోనున్నారు.
Source: జాతీయ | 6 Dec 2009 | 3:00 am

ప్రత్యేక ఆంధ్రను కేంద్రం ప్రకటించాలి: సత్యారెడ్డి

ప్రస్తుతం తెలంగాణ వాదులు రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కావాలని ఉద్యమం చేపడుతున్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమకారులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలోపే కేంద్రం ప్రత్యేక ఆంధ్రను ప్రకటించాలని ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఆదివారం గుంటూరులో తీర్మానించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 2:35 am

ఫ్రీజోన్ కాదని తీర్మానం ప్రవేశ పెడతాం: రోశయ్య

సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా సమావేశాల్లో హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Dec 2009 | 2:08 am