|
రూ.2700 కోట్ల నిధుల సమీకరణలో జేఎస్డబ్ల్యూసజ్జన్ జిందాల్ నేతృత్వంలోని జేఎస్‌డబ్ల్యూ గ్రూపునకు చెందిన జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ లిమిటెడ్ షేర్ల విక్రయం ద్వారా (బహిరంగ వేలం) నిధులను సమీకరించనుంది. ఇందుకోసం ఆ సంస్థ షేర్లను విక్రయించాలని నిర్ణయించింది. ముఖ విలుప పది రూపాయలు కలిగిన షేర్లను నూటికి నూరు శాతం వేలం పాటల ద్వారా విక్రయించనున్నట్టు ప్రకటించింది.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 8:10 am పాకిస్థాన్ అణ్వస్త్ర దేశం... బాధ్యతలు తెలుసు: అమెరికాపాకిస్థాన్ ఒక అణ్వస్త్ర దేశమని, అందువల్ల దాని బాధ్యతలు ఏమిటో ఆ దేశానికి తెలుసని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జనరల్ (రిటైర్డ్) జేమ్స్ జోన్స్ అభిప్రాయపడ్డారు. దేశ భద్రతను కూడా దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ తన గురుతర బాధ్యతలు ఏమిటో వారికి ఎరుకే అని ఆయన అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 7:26 am జనరల్ బీమా రంగంలోకి ప్రవేశించనున్న ఎస్బీఐదేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న భారతీయ స్టేట్ బ్యాంక్ వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో జనరల్ ఇన్స్యూరెన్స్ రంగంలోకి ప్రవేశించనుందని, దీనికోసం ఇప్పటికే విదేశీ సంస్థ అయిన ఇన్స్యూరెన్స్ ఆస్ట్రేలియా గ్రూప్(ఐఏజీ)తో కలసి వ్యాపార ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని ఎస్‌బీఐ వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 7:21 am తెలంగాణ విడిపోతేనే ఆంధ్ర అభివృద్ధి సాధ్యం: జోగయ్యతెలంగాణ ఒక రాష్ట్రంగా విడిపోతేనే అన్ని వనరులు ఉన్న ఆంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. ప్రరాపా అధినేత చిరంజీవి తెలంగాణకు మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోవడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 6:55 am 30 యేళ్ళలో 1.5 కిమీ కరిగిన గంగోత్రీ మంచుదిబ్బ!ఇటీవలి కాలంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై భారత్‌తో పాటు.. ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ది చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు మోతాదుకు మించి కార్బన్ ఉద్గరాలను విడుదల చేయడం వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 6:44 am ఆర్థిక వృద్ధి 9 శాతానికి : ప్రధాని ఆశాభావంఓ వైపు ప్రంపంచంలో ఆర్థిక మాంద్యం ఉన్నా కూడా భారతదేశంలో వరుసగా నాలుగు సంవత్సరాలపాటు ఆర్థిక వృద్ధి తొమ్మిది శాతానికి చేరుకుంటోందని, ఇది రానున్న మూడు సంవత్సరాలలోను ఈ పరిస్థితి మళ్ళీ ఇలాగే కొనసాగుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ మాస్కోలో అన్నారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 6:27 am నైలు నదిలో ఢీకొన్న పడవలు: ప్రయాణికుల గల్లంతు!ఈజిప్టులోని నైలు నదిలో రెండు పడవలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పవడలో ప్రయాణిస్తున్న 65 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. వీరిలో ఆరుగురిని రక్షించగా, మిగిలిన వారి ఆచూకీ తెలియరాలేదు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 6:14 am జమ్మూలో భారీ స్థాయిలో ఆయుధ డంప్ స్వాధీనంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ సెక్టార్‌లో భారీ ఎత్తున ఆయుధ డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పూంఛ్ సెక్టార్‌లో మిలిటెంట్లు సంచారం ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం వచ్చింది. దీంతో కేంద్ర రిజర్వు బెటాలియన్ స్థానిక పోలీసుల సహకారంతో ఆ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 6:01 am అమల-నాగ్-టబులపై ట్రయాంగిల్ స్టోరీ రెడీనిన్నేపెళ్లాడుతా... చిత్రంలో పర్‌ఫెక్ట్ కపుల్‌గా నటించి ప్రేక్షకుల మదిలో తమదైన ముద్ర వేసుకున్న జంట నాగార్జున, టబు. వీళ్లద్దరి మధ్య ఏదో ఉందని టాలీవుడ్ సినీజనం అప్పుడప్పుడు గుసగుసలు పోతుంటారు. దీనికితోడు టబు ఏకంగా తన మకాన్ని హైదరాబాదుకు మార్చేయడంతోపాటు వివాహం ఊసే ఎత్తకపోవడంతో సినీ జనాలు లేవనెత్తుతున్న సందేహాలు నిజమేనేమోనన్న అనుమానం కలుగుక మానదు. అయితే యువసామ్రాట్ నాగార్జున మాత్రం టబు తనకు మంచి స్నేహితురాలని చెపుతారు. అదేవిధంగా నాగార్జున భార్య అమల సైతం నాగార్జునకంటే టబు తనకు మరింత సన్నిహిత స్నేహితురాలని చెపుతుంటారు. అయితే ఫిలిమ్ జనం మాత్రం నాగార్జున-టబుల మధ్య చిగురించిన స్నేహబంధం చాలా బలమైన బంధంగా మారిపోయిందని సందర్భం వచ్చినపుడల్లా చెపుతుంటారు. ఈ సంగతి ఇలావుంటే, వీరి ముగ్గురి మధ్య ఉన్న సంబంధాలను ఇతివృత్తంగా చేసుకుని ఓ బాలీవుడ్ నిర్మాత చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. కథ కూడా సిద్ధమైపోయిందట.Source: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2009 | 5:43 am కర్ణాటక చీఫ్ జస్టీస్‌కు పదోన్నతికి కేంద్రం నిరాకరణ!అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినకరన్‌కు పదోన్నతి ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. మిగిలిన వారికి పదోన్నతులు కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్‌కు పదోన్నతి కల్పిస్తూ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించేలా సుప్రీంకోర్టు కమిటీ కోరింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 5:36 am ఆర్థిక వృద్ధి రేటు 9 శాతానికి చేరుకుంటుంది: రాబర్ట్రానున్న రెండు సంవత్సరాలలో భారతదేశపు ఆర్థిక వృద్ధి రేటు 9 శాతానికి చేరుకునే అవకాశాలున్నాయని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు రాబర్ట్ జోలిక్ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశంలోనున్న పటిష్టమైన ద్రవ్య, పరపతి చర్యలు ఇందుకు దోహదపడుతాయని ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: News | 5 Dec 2009 | 5:24 am గర్భిణీ స్త్రీలపై టార్గెట్ "అమరావతి"అల్లరి చిత్రం నుంచి చలపతిరావు కుమారుడు రవి దర్శకుడుగా కొత్త ప్రయోగాలు చేస్తున్నాడు. ఆమధ్య అనసూయ చేశాడు. తర్వాత నచ్చావులే చేసి లవ్‌స్టోరీ సక్సెస్ చేశాడు. మళ్లీ ఈసారి మర్డర్ మిస్టరీని కథావస్తువుగా ఎంచుకున్నాడు. ఈ చిత్రంలో గర్భిణీ స్త్రీలను టార్గెట్ చేశాడు. ఈ కథ హాలీవుడ్ చిత్రాలకు సరిపోయేది. మరి మన నేటివిటీకి ఎలాగుంటుందో...Source: Yahoo! Telugu: Entertainment | 5 Dec 2009 | 4:36 am తెలంగాణ విడిపోతేనే ఆంధ్ర అభివృద్ధి సాధ్యం: జోగయ్యతెలంగాణ ఒక రాష్ట్రంగా విడిపోతేనే అన్ని వనరులు ఉన్న ఆంధ్ర మరింతగా అభివృద్ధి చెందుతుందని ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత హరిరామ జోగయ్య అభిప్రాయపడ్డారు. ప్రరాపా అధినేత చిరంజీవి తెలంగాణకు మద్దతు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేక పోవడం వల్లే తాను పార్టీకి రాజీనామా చేసినట్టు ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 5 Dec 2009 | 1:26 am 30 యేళ్ళలో 1.5 కిమీ కరిగిన గంగోత్రీ మంచుదిబ్బ!ఇటీవలి కాలంలో వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై భారత్‌తో పాటు.. ప్రపంచ దేశాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ది చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు మోతాదుకు మించి కార్బన్ ఉద్గరాలను విడుదల చేయడం వల్లే వాతావరణంలో విపరీతమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.Source: జాతీయ | 5 Dec 2009 | 1:15 am జమ్మూలో భారీ స్థాయిలో ఆయుధ డంప్ స్వాధీనంజమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని పూంఛ్ సెక్టార్‌లో భారీ ఎత్తున ఆయుధ డంప్‌ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. పూంఛ్ సెక్టార్‌లో మిలిటెంట్లు సంచారం ఉన్నట్టు నిఘా వర్గాల సమాచారం వచ్చింది. దీంతో కేంద్ర రిజర్వు బెటాలియన్ స్థానిక పోలీసుల సహకారంతో ఆ ప్రాంతంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది.Source: జాతీయ | 5 Dec 2009 | 12:31 am కర్ణాటక చీఫ్ జస్టీస్‌కు పదోన్నతికి కేంద్రం నిరాకరణ!అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దినకరన్‌కు పదోన్నతి ఇచ్చేందుకు కేంద్రం నిరాకరించింది. మిగిలిన వారికి పదోన్నతులు కల్పించేందుకు అనుమతి ఇచ్చింది. భూ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న దినకరన్‌కు పదోన్నతి కల్పిస్తూ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమించేలా సుప్రీంకోర్టు కమిటీ కోరింది. దీనిపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి.Source: జాతీయ | 5 Dec 2009 | 12:07 am మరోమారు రాష్ట్రంలో తెరపైకి "జై ఆంధ్ర" ఉద్యమం!రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు జోరుగా మారుతున్నాయి. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఊపందుకుంది. మరోవైపు జై ఆంధ్ర ఉద్యమం తెరపైకి వచ్చింది. రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు, ప్రజారాజ్యం పార్టీ మాజీ నేత హరిరామ జోగయ్యలు దీనికి నాయత్వం వహిస్తున్నారు. వీరిద్దరు కలిసి జై ఆంధ్ర ఉద్యమాన్ని తెరపైకి తెస్తున్నారు. సమైక్య వాదులను ఏకతాటిపైకి తెచ్చేందుకు నడుంబిగించారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 11:54 pm ప్రరాపా అధినేతకు హరిరామ జోగయ్య "ఝలక్"!ప్రజారాజ్యం పార్టీకి ఆ పార్టీ సీనియర్ నేత హరిరామ జోగయ్యం ఝలక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు శనివారం ప్రకటించారు. చిరంజీవి పార్టీ పెట్టక ముందు నుంచి ఆయనకు మద్దతు ప్రకటించి, ప్రరాపాలో కీలక నేతగా వ్యవహరిస్తూ వచ్చిన జోగయ్య ఆ పార్టీకి రాజీనామా ప్రకటించడం ప్రరాపాకు పెద్ద దెబ్బలాంటిందే.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 11:27 pm కేసీఆర్ దీక్ష విరమించినా.. ఉద్యమం ఆగదు: జేఏసీప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగంగా తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్ష విమరించుకున్నా, తాము చేపట్టిన ఉద్యమం మాత్రం ఆపబోమని తెలంగాణ విద్యార్థి సంఘాల ఉమ్మడి కార్యాచరణ సమితి (జేఏసీ) శనివారం స్పష్టం చేసింది. కేసీఆర్ సేవలు తెలంగాణకు అవసరమని, ఆయనకు విద్యార్థులంతా అండగా ఉంటామని జేఏసీ నేతలు ఒక ప్రకటనలో తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 11:23 pm నేడు కోర్టులో ఉల్ఫా చీఫ్ రాజ్‌కోవా హాజరు: పోలీసులుబంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేసి భారత్ అధికారులకు అప్పగించిన ఉల్ఫా తీవ్రవాద సంస్థ చీఫ్ అరబిందా రోజ్‌కోవాను శనివారం స్థానిక కోర్టులో హాజరుపరుచనున్నట్టు గౌహతి పోలీసులు తెలిపారు. రోజ్‌కోవాతో సహా ఆయన వ్యక్తిగత సెక్యూరిటీ గార్డు రాజాబోరాను కూడా కోర్టులో హాజరుపరుచనున్నారు.Source: జాతీయ | 4 Dec 2009 | 10:58 pm సమైక్యవాదినే.. కానీ.. తెలంగాణాకు జై: నారాయణ!తాను వ్యక్తిగతంగా సమైక్యవాదినే అయినప్పటికీ.. జై తెలంగాణా అనక తప్పడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ (చికెన్ ముక్క నారాయణ) అభిప్రాయపడ్డారు. పార్టీ సిద్ధాంతం దృష్ట్యా తాను ఈ నినాదం చేయాల్సి వస్తోందని అన్నారు. నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కేసీఆర్‌ను ఆయన శుక్రవారం పరామర్శించారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 9:50 pm వైద్యానికి సహకరిస్తున్న కేసీఆర్: ఐసీయుకు తరలింపు!వారం రోజులుగా ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్న తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం బాగా క్షీణించింది. దీంతో ఆయనను అత్యవసర సేవల విభాగం (ఐసీయూ)కు తరలించినట్టు నిమ్స్ వైద్యులు తెలిపారు. కేసీఆర్ శరీరంలో పొటాషియం, సోడియం లెవల్స్ తగ్గడంతో ఆరోగ్యం క్షీణించిందని, రక్తం, మూత్రంలో కూడా మార్పులు కనిపిస్తున్నాయని తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 9:37 pm హురియత్ నేత ఖురేషీపై కాల్పులు: పరిస్థితి విషమం!జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఉగ్రవాదాలు మరోమారు రెచ్చిపోయారు. హురియత్ కాన్ఫరెన్స్ పార్టీకి చెందిన సీనియర్ నేత ఫజల్ హక్ ఖురేషీ (65)ను లక్ష్యంగా చేసుకుని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో ఖురేషీ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఆయన పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.Source: జాతీయ | 4 Dec 2009 | 9:01 pm రేపు రష్యా పర్యటనకు వెళ్లనున్న ప్రధాని మన్మోహన్!ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మూడు రోజుల రష్యా పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఇందుకోసం ఆయన న్యూఢిల్లీ నుంచి ఆదివారం ప్రత్యేక విమానంలో బయలుదేరి, సోమవారం మాస్కోకు చేరుకుంటారు. ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోవటంతో పాటు పౌర అణు సహకారాన్ని విస్తరించుకోవటమే ప్రధాన అజెండాగా ప్రధాన మూడు రోజుల పర్యటన సాగనుంది.Source: జాతీయ | 4 Dec 2009 | 8:37 pm "ఐ హేట్ లవ్" అంటోన్న ప్రవరాఖ్యుడు.. ఏం చేశాడు?జగపతిబాబు, ప్రియమణి, మదన్ కాంబినేషన్ అంటేనే పెళ్లయిన కొత్తలో సినిమా గుర్తుకు వస్తుంది. అదే కాంబినేషన్‌లో తీసిన చిత్రమిది. క్రేజీ కాంబినేషన్ కావడంతో ఓపెనింగ్స్ బాగానే ఉన్నాయి. పెళ్లయిన కొత్తలో భార్యాభర్తలు ఎలా ఉంటారో చూపించిన దర్శకుడు... కాలేజీ చదివే రోజుల్లో వన్ సైడ్ లవ్, ఆ తర్వాత కొన్నాళ్లు మళ్లీ ఇద్దరు ఒకే వృత్తిలో కలుసుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో ప్రవరాఖ్యుడు తీశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 10:36 am సచిన్ టెండూల్కర్ కోసం సమీరా రెడ్డి డ్యాన్స్.. డ్యాన్స్!!క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కోసం సమీరా రెడ్డి నృత్యం చేయనుంది. టెండూల్కర్ కోసం డ్యాన్స్ చేయడమేమిటీ.. అనుకుంటున్నారా..? మరేం లేదు, ఇటీవల సచిన్ టెండూల్కర్ 17వేల పరుగుల మైలురాయిని దాటి రికార్డు సృష్టించడంతో అంబానీ గ్రూపు ఆయనను సత్కరించాలని నిర్ణయించింది. సత్కార సభకు ముందు ఆటా పాటా కావాలి కదా. దీనికిగాను సమీరారెడ్డిని అడిగారట. తొలుత సమీరా "నో" అని చెప్పిందట. కానీ ఆ తర్వాత సచిన్ టెండూల్కర్ కోసమే ఆ సభ నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ప్రత్యేకంగా అంబానీలకు ఫోను చేసి డ్యాన్స్ చేస్తానని ఒప్పేసుకుందట. సమీరా రెడ్డికి ఎందుకంత ఆసక్తి అని ఆరా తీస్తే, స్కూలు రోజుల్లో తను కూడా క్రీడల్లో చురుకుగా పాల్గొనేదట. ముఖ్యంగా తనకు క్రికెట్ అంటే ఎంతో ఇష్టమనీ, అందువల్ల మేటి క్రీడాకారుడైన సచిన్ సత్కార సభలో నృత్యం చేయడం ఒక భాగ్యంగా భావిస్తున్నాని చెప్పుకొచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 9:38 am శ్రీహరితో "100 దేవుడొస్తాడు"పోలీస్, దేవా, సాంబయ్య వంటి చిత్రాల్లో పవర్‌ఫుల్ పోలీసు ఆఫీసర్‌గా నటించిన శ్రీహరి మళ్లీ పోలీసుగా నటిస్తున్నాడు. ఈ చిత్రానికి "100 దేవుడొస్తాడు" అనే పేరు పెట్టారు. సుధా ఎంటర్‌టైనర్స్ పతాకంపై జిఎల్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పోలూరి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 9:02 am తెలంగాణా ఏర్పాటుకు ఏకగ్రీవ తీర్మానం చేయండిప్రత్యేక తెలంగాణా సాధనకు దీక్ష చేపట్టిన తెరాస అధినేత కె. చంద్రశేఖరరావుకు మద్దతుగా ధర్మపురి ఎమ్మెల్యే కొప్పుల ఈశ్వర్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత ఐదు రోజులుగా తెలంగాణా సాధనలో భాగంగా ఆ ప్రాంతంలోని 9 మంది ప్రాణాలు కోల్పోయినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 7:17 am అబ్బాయికి నేను.. నాకు అబ్బాయి నచ్చాలి: రంభఅబ్బిబ్బీ... అంటూ తెలుగు కుర్రకారును ఓ ఊపు ఊపిన సెక్సీ తార రంభ, వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంద్రన్ పద్మనాధన్ అనే వ్యాపారస్తునితో పెళ్లి జరుగబోతోందని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. అంతేకాదు, రంభ స్వయంగా తన పేరుమీద డిసెంబరు నెలలో ఒక తేదీనాడు వివాహం చేసుకునేందుకుగాను కల్యాణమండపాన్ని బుక్ చేసిందట. ఈ విషయాన్ని రంభ వద్ద ప్రస్తావిస్తే... పకా పకా నవ్వింది. అసలు ఇంతవరకూ సంబంధమే కుదరలేదనీ, అలాంటప్పుడు పెళ్లెలా జరుగుతుందని ఎదురు ప్రశ్నలేస్తోంది. అయితే కల్యాణమండపం తన పేరు మీద బుక్ చేసిన మాట వాస్తవమేననీ, కానీ అది తన సోదరుని వివాహం కోసం బుక్ చేశానని చెపుతోంది. అంటే.. ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదా...? అని అడిగితే, "సంబంధాలను చూస్తున్నారు. అబ్బాయికి నేను, నాకు అబ్బాయి నచ్చాలి కదా. అన్నీ నచ్చితే పెళ్లి చేసుకునేందుకు నేను సిద్ధంగానే ఉన్నా"నని చెపుతోందట రంభ.Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 6:45 am మంత్రులతో కీలక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి!రెండు రోజుల హస్తిన పర్యటనను ముగించుకుని రాష్ట్ర రాజధానికి చేరుకున్న ముఖ్యమంత్రి కె.రోశయ్య మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈనెల ఏడో తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 6:23 am ఆంధ్రప్రదేశ్‌ను "తెలుగునాడు"గా మార్చండి: ఐ.టి.ఎప్రాంతీయ విద్వేషాలు రూపు మాపాలంటే ఆంధ్రప్రదేశ్ పేరును తెలుగునాడుగా మార్చాలని కోరారు. పరిపాలనా సౌలభ్యం కోసం ఉత్తర తెలుగునాడు, దక్షిణ తెలుగునాడు, పడమటి తెలుగునాడు, తూర్పు తెలుగునాడు, ఈశాన్య తెలుగునాడులుగా పిలవబడాలని ఆయన తెలియజేశారు. ఇది మాత్రమే ఐ.టి.ఎ సూచించే సులభ పరిష్కారమని సుకుమార్ తెలియజేశారు. ఇలా చేస్తే కాలక్రమేణా ప్రాంతీయ హద్దులు చెరిగిపోతాయని ఐ.టి.ఎ స్థాపక కార్యదర్శి పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 5:45 am బాబ్రీ విధ్వంసం: భద్రత పెంపునకు కేంద్రం ఆదేశం!బాబ్రీ మసీదు విధ్వంసక రోజైన బ్లాక్ డేను పురస్కరించుని దేశ వ్యాప్తంగా భద్రతను అప్రమత్తం చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. బ్లాక్ డే సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా ఉండేలా భద్రతా చర్యలను చేపట్టాలని కేంద్ర హోంశాఖ కోరింది.Source: జాతీయ | 4 Dec 2009 | 5:05 am జగపతిబాబు హీరోగా వర్మ శిష్యుడి "గాయం-2"ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 1992లో వచ్చిన "గాయం" చిత్రం జగపతిబాబు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. కర్త క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జగపతిబాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియశిష్యుడు ప్రవీణ్ శ్రీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూజ జరిగింది. సీనియర్ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ స్క్రిప్టును దర్శకుడు ప్రవీణ్ శ్రీకు అందజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 4:44 am బెల్లంకొండకొచ్చిన "గోలీమార్"గోపీచంద్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతోన్న గోలీమార్ చిత్రం నిర్మించే అవకాశం బెల్లంకొండ సురేష్‌కు వచ్చింది. గత వారంరోజులుగా చర్చలు నడుస్తుండగా శుక్రవారంతో ఈ విషయం ఖరారైంది.Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 4:13 am కడప జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళ!కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళగా ప్రజానేత వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మి చరిత్ర సృష్టించారు. అలాగే, పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా ఇదే తొలిసారి. అయితే, విజయమ్మ ఏకగ్రీవ ఎన్నికపై ఎన్నికల సంఘం శుక్రవారం అధికార ప్రకటన చేయనుంది.Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 4:00 am మావోయిస్టులతో తృణమూల్‌కు సంబంధాలు: లెఫ్ట్కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మావోయిస్టులకు సంబంధాలు ఉన్నట్టు పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని లెఫ్ట్ కూటమి ఆరోపించింది. ఈ మేరకు వీరి సబంధాలను రుజువు చేసే ఆధారాలను శుక్రవారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు లెఫ్ట్ నేతలు అందజేశారు.Source: జాతీయ | 4 Dec 2009 | 3:49 am ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రేకు అరెస్ట్ వారెంట్ జారీ!బీహార్ రాష్ట్ర వాసులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేకు వ్యతిరేకంగా ముజఫర్‌పూర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని పలు మార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాజ్‌థాక్రే హాజరుకాలేదు. దీంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‍ను జారీ చేసింది.Source: జాతీయ | 4 Dec 2009 | 2:41 am కాంట్రాక్టు పద్దతిలో న్యాయమూర్తుల నియమాకం: కేంద్రందేశంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేసుల సత్వర పరిష్కారం లభించక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. న్యాయం కోసం అనేక కోట్ల మంది సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా కాంట్రాక్టు పద్దతిలో న్యాయమూర్తులను నియమించాలని కేంద్రం భావిస్తోంది.Source: జాతీయ | 4 Dec 2009 | 2:19 am
|