భారత పర్యటనలో శ్రీలంక ఆర్మీ మాజీ చీఫ్ ఫోనెస్కా!

శ్రీలంక ఆర్మీ మాజీ చీఫ్ శరత్ ఫోనెస్కా ఒక రోజు పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చారు. వచ్చే నెల 26వ తేదీన జరుగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల కూటమి తరపున ఫోనెస్కా పోటీ చేయనున్నారు. ఇలాంటి తరుణంలో ఆయన భారత పర్యటనకు రావడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 8:20 am

వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వండి: ఆర్‌బీఐ

మన దేశం వ్యవసాయంపై ఆధారపడివుంది కాబట్టి వ్యవసాయ రుణాలు విరివిగా ఇవ్వాలని, దీంతో దేశంలోని గ్రామీణ ప్రాంతాలు ఆర్థికంగా పరిపుష్టి కలిగివుండేందుకు అవకాశం ఉందని ఆర్‌బీఐ గవర్నర్ డి సుబ్బారావు అన్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 8:18 am

మళ్లీ నష్టాల్లో కూరుకుపోయిన సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్ తిరిగి నష్టాల్లో కూరుకుపోయింది. ఆసియా మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకోవడం, యూరోపియన్ మార్కెట్లు తిరోగమనం వైపు పయనించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 48 పాయింట్లు క్షీణించి, 17,136 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 29 పాయింట్లు పతనమై, 5,102 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 8:14 am

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రేకు అరెస్ట్ వారెంట్ జారీ!

బీహార్ రాష్ట్ర వాసులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేకు వ్యతిరేకంగా ముజఫర్‌పూర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని పలు మార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాజ్‌థాక్రే హాజరుకాలేదు. దీంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‍‌ను జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 8:11 am

కాంట్రాక్టు పద్దతిలో న్యాయమూర్తుల నియమాకం: కేంద్రం

దేశంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేసుల సత్వర పరిష్కారం లభించక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. న్యాయం కోసం అనేక కోట్ల మంది సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా కాంట్రాక్టు పద్దతిలో న్యాయమూర్తులను నియమించాలని కేంద్రం భావిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 7:48 am

లష్కర్ సంస్థకు అల్‌ఖైదా సాయం: అమెరికా ఆరోపణ

భారత్‌కు వ్యతిరేకంగా తీవ్రవాద దాడులు జరిపేందుకు లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వివిధ రూపాల్లో సాయం చేస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఈ విషయాన్ని రక్షణ శాఖ కార్యదర్శి రాబర్ట్ గేట్స్ తెలిపారు. భారత్‌కు వ్యతిరేకంగా దాడులు జరిపేందుకే లష్కర్ సంస్థకు అల్‌ఖైదా సహాయం చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 7:38 am

లాభాల్లో కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాలతో కొనసాగుతోంది. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 58 పాయింట్లు పుంజుకుని, 17,243 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల స్వల్పలాభంతో 5,149 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 6:59 am

అబ్బాయికి నేను.. నాకు అబ్బాయి నచ్చాలి: రంభ

అబ్బిబ్బీ... అంటూ తెలుగు కుర్రకారును ఓ ఊపు ఊపిన సెక్సీ తార రంభ, వివాహం చేసుకునేందుకు సిద్ధమవుతోంది. ఇంద్రన్ పద్మనాధన్ అనే వ్యాపారస్తునితో పెళ్లి జరుగబోతోందని టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు. అంతేకాదు, రంభ స్వయంగా తన పేరుమీద డిసెంబరు నెలలో ఒక తేదీనాడు వివాహం చేసుకునేందుకుగాను కల్యాణమండపాన్ని బుక్ చేసిందట. ఈ విషయాన్ని రంభ వద్ద ప్రస్తావిస్తే... పకా పకా నవ్వింది. అసలు ఇంతవరకూ సంబంధమే కుదరలేదనీ, అలాంటప్పుడు పెళ్లెలా జరుగుతుందని ఎదురు ప్రశ్నలేస్తోంది. అయితే కల్యాణమండపం తన పేరు మీద బుక్ చేసిన మాట వాస్తవమేననీ, కానీ అది తన సోదరుని వివాహం కోసం బుక్ చేశానని చెపుతోంది. అంటే.. ఇప్పట్లో వివాహం చేసుకునే ఆలోచన లేదా...? అని అడిగితే, "సంబంధాలను చూస్తున్నారు. అబ్బాయికి నేను, నాకు అబ్బాయి నచ్చాలి కదా. అన్నీ నచ్చితే పెళ్లి చేసుకునేందుకు నేను సిద్ధంగానే ఉన్నా"నని చెపుతోందట రంభ.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 6:45 am

మాంద్యం నుంచి కోలుకుంటున్న వస్త్ర పరిశ్రమ: మారన్

మాంద్యం నుంచి మెలమెల్లగా వస్త్ర పరిశ్రమ కోలుకుంటోందని కేంద్ర జౌళిపరిశ్రమ శాఖామంత్రి దయానిధి మారన్ అన్నారు. మాంద్యం నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలు ఇస్తోందని, దీంతో జౌళి పరిశ్రమ ఉత్పత్తులను ప్రారంభించి కోలుకుంటోందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 6:12 am

కోలుకున్న స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్

వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్నా బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 84 పాయింట్లు పుంజుకుని, 17,270 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్ల స్వల్ప లాభంతో 5,154 మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 6:05 am

దూరవిద్యలో పీజీ డిప్లొమా కోర్సులు: యూహెచ్

రాష్ట్రానికి చెందిన యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్ దేశంలోని విశ్వవిద్యాలయాలలో ప్రముఖ విశ్వవిద్యాలయంగా పేరుగాంచింది. ఈ విశ్వవిద్యాలయం ఇటీవల దూరవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ (పీజీ) డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టింది. తమ విశ్వవిద్యాలయం అందిస్తున్న పలు పీజీ డిప్లొమా కోర్సులకు అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని ఆ విశ్వవిద్యాలయ పరీక్షల కన్వీనర్ ఓ ప్రకటనలో తెలిపారు. విద్యార్థినీ విద్యార్థులు పీజీ డిప్లొమా కోర్సు చేయాలనుకుంటే సంబంధిత సబ్జెక్ట్‌లలో డిగ్రీ పూర్తి చేసివుండాలని ఆ ప్రకటనలో తెలిపారు
Source: Yahoo! Telugu: News | 4 Dec 2009 | 5:49 am

జగపతిబాబు హీరోగా వర్మ శిష్యుడి "గాయం-2"

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో 1992లో వచ్చిన "గాయం" చిత్రం జగపతిబాబు కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్ సిద్ధమవుతోంది. కర్త క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జగపతిబాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి రామ్‌గోపాల్‌వర్మ ప్రియశిష్యుడు ప్రవీణ్ శ్రీ దర్శకునిగా పరిచయమవుతున్నారు. డిసెంబర్ రెండో తేదీన హైదరాబాద్ ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పూజ జరిగింది. సీనియర్ నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ స్క్రిప్టును దర్శకుడు ప్రవీణ్ శ్రీకు అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 4:44 am

గోపిచంద్, పూరీ కాంబినేషన్‌లో వస్తోన్న "గోలిమార్"

వైష్ణో అకాడమీ బేనర్‌పై ఇడియట్, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, శివమణి, పోకిరి, బంపర్ ఆఫర్ వంటి హిట్ చిత్రాల్ని నిర్మించిన డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ "గోలీమార్" అనే చిత్రాన్ని రూపొందించనున్నారు. ఎగ్రెసివ్ హీరో గోపిచంద్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ డిసెంబర్ మూడో తేదీ వైష్ణో అకాడమీ సంస్థ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Dec 2009 | 4:13 am

'మేయర్' పీఠంపై తొలి మహిళ: ఏకగ్రీవంగా ఎన్నిక!

గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ నగర మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక మహిళా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని తర్నాక కార్పొరేట్ డివిజన్ నుంచి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపొందిన బి.కార్తీకా రెడ్డి హైదరాబాద్ మేయర్‌గా ఎన్నికయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 3:27 am

ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాక్రేకు అరెస్ట్ వారెంట్ జారీ!

బీహార్ రాష్ట్ర వాసులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రేకు వ్యతిరేకంగా ముజఫర్‌పూర్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కేసు విచారణ నిమిత్తం కోర్టుకు హాజరుకావాలని పలు మార్లు సమన్లు జారీ చేసినప్పటికీ రాజ్‌థాక్రే హాజరుకాలేదు. దీంతో ఆయనను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచాల్సిందిగా ఆదేశిస్తూ నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్‍‌ను జారీ చేసింది.
Source: జాతీయ | 4 Dec 2009 | 2:41 am

మహా మొండిని.. అనుకున్నది సాధిస్తా: చిరంజీవి

తాను వ్యక్తిగతంగా మహా మొండినని, అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు ఎంత కష్టమైన పడేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ప్రకటించారు. ఎలాంటి ఆధారం లేకుండా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టినపుడు ఎన్నో అవమానాలు, చీదరింపులు, ఛీత్కారాలు ఎదురయ్యాయని గుర్తు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 2:28 am

కాంట్రాక్టు పద్దతిలో న్యాయమూర్తుల నియమాకం: కేంద్రం

దేశంలోని కోర్టుల్లో కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కేసుల సత్వర పరిష్కారం లభించక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. న్యాయం కోసం అనేక కోట్ల మంది సంవత్సరాల తరబడి ఎదురుచూస్తున్నారు. దీనికి ఫుల్‌స్టాప్ పెట్టాలనే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇందుకోసం దేశ వ్యాప్తంగా కాంట్రాక్టు పద్దతిలో న్యాయమూర్తులను నియమించాలని కేంద్రం భావిస్తోంది.
Source: జాతీయ | 4 Dec 2009 | 2:19 am

కర్నూలులో రోడ్డు ప్రమాదం: 8 మంది దుర్మరణం

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మృత్యువాత పడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. తిరుపతి నుంచి వస్తున్న జీపును వేగంగా వచ్చిన లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పాణ్యం సమీపంలో ఈ ఘోర ప్రమాదం జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 4 Dec 2009 | 12:08 am

కేంద్రంతో శాంతి చర్చలకు ఉల్ఫా సిద్ధం: రాజ్‌కోవా

కేంద్రంతో శాంతి చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు నిషేధిత తీవ్రవాద సంస్థ ఉల్ఫా ప్రకటించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ చీఫ్ అరబిందా రోజ్‌కోవా తెలిపారు. బంగ్లాదేశ్ నిఘా వర్గాలకు చిక్కిన రాజ్‌కోవాను శుక్రవారం బీఎస్‌ఎఫ్ అధికారులకు అప్పగించిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 3 Dec 2009 | 11:53 pm

ఉద్యమ తీవ్రవతను అధిష్టానం గుర్తించింది: వీహెచ్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఉద్యమ తీవ్రవతను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గుర్తించిందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ.హనుమంతరావు అన్నారు. అయితే, తమ లక్ష్య సాధన కోసం తెలంగాణా నిరసనకారులు చేస్తున్న ఆందోళనలు శాంతియుతంగా సాగాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 11:16 pm

బలూచీస్థాన్‌పై తప్పుడు సాక్ష్యాల సేకరణలో పాక్: కృష్ణ

బలూచీస్థాన్‌లోని ఉగ్రవాదులకు భారత్ మద్దతు తెలుపుతుందని రుజువు చేసేలా తపుడు సాక్ష్యాధారాలను సేకరించే పనిలో పాకిస్థాన్ పాలకులు నిమగ్నమైవున్నారని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ ఆరోపించారు. పాక్ విదేశాంగ మంత్రి ఖురేషీ రెండు వేర్వేరు సందర్భాల్లో చేసిన విరుద్ధ ప్రకటనలే ఇందుకు నిదర్శనమని ఆనయ విమర్శించారు.
Source: జాతీయ | 3 Dec 2009 | 10:52 pm

కడప జిల్లా నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళ!

కడప జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తొలి మహిళగా ప్రజానేత వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మి చరిత్ర సృష్టించారు. అలాగే, పులివెందుల నియోజకవర్గం నుంచి ఒక అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం కూడా ఇదే తొలిసారి. అయితే, విజయమ్మ ఏకగ్రీవ ఎన్నికపై ఎన్నికల సంఘం శుక్రవారం అధికార ప్రకటన చేయనుంది.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 10:46 pm

"గ్రేటర్" తొలి మహిళా మేయర్‌గా కార్తీకా రెడ్డి!

గ్రేటర్ హైదరాబాద్ తొలి మహిళా మేయర్‌గా కార్తీకా రెడ్డి పేరును ముఖ్యమంత్రి కె.రోశయ్య ఖరారు చేశారు. తార్నాక డివిజన్ నుంచి ఆమె జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేతలు గురువారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 10:29 pm

టెండర్ల ఆహ్వానం: యడ్యూరప్ప సర్కార్‌కు నోటీసు!

బెంగుళూరు నగర కార్పొరేషన్ అభివృద్ధిలో భాగంగా 22 భారీ ప్రాజెక్టులకు ఆహ్వానించిన టెండర్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం 13 వేల కోట్ల రూపాయలతో వీటిని చేపడుతున్నారు. ఈ పనులకు సంబంధించిన టెండర్లను ఆహ్వానించడంలో కర్ణాటక ప్రభుత్వం ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించిందని ప్రతిపక్ష పార్టీలు గగ్గోలు పెడుతున్నాయి.
Source: జాతీయ | 3 Dec 2009 | 9:20 pm

ఉల్ఫా తీవ్రవాదులతో శాంతి చర్చలకు సిద్ధం: సీఎం తరుణ్

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ ఆస్సోం (ఉల్ఫా)తో శాంతి చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు అస్సోం రాష్ట్ర ముఖ్యమంత్రి తరుణ్ గగోయ్ ప్రకటించారు. ఉల్ఫా అగ్రనేత అరబింద్ రాజ్‌ఖోవా బంగ్లాదేశ్‌లో అరెస్టు అయినట్టు కేంద్ర హోంశాఖ నిర్ధారించిన నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: జాతీయ | 3 Dec 2009 | 8:43 pm

బికినీలు వేయమంటే వేస్తాను: సింధు మీనన్

భద్రాచలంలో హీరోయిన్‌గా పరిచయమైన బాలనటి సింధు మీనన్ ఆ తర్వాత కొన్ని సినిమాలు చేసినా అంత పేరు రాలేదు. చందమామతో తళుక్కుమంది. అయినా ఆ తర్వాత పెద్దగా పిలిచినవారు లేరు. అదేమంటే... తమిళంలో, మలయాళంలో తనకు బోలెడు ఛాన్సులున్నాయని ఊకదంపుడు కబుర్లు చెపుతోంది. ఇక మన టాలీవుడ్‌లో మాత్రం లేటెస్ట్‌గా సుభద్ర చిత్రంలో నటిస్తోంది. భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాలు ఏవిధంగా ఉంటాయి? అపోహలు వస్తే ఎలా మారుతాయి? అనే పాయింటుతో రూపొందుతోంది. ఈ సందర్భంగా ఆమెను పలుకరిస్తే.. పలు విషయాలు వెల్లడించింది. లవ్ గురించి చెబుతూ... పనీపాటలేనివాళ్లు చేసే పనిదని చెప్పింది. తనకు అస్సలు ప్రేమించే తీరికే లేదని అంటోంది. మనిషికి ఏదైనా పనుంటే దానిమీద శ్రద్ధపెట్టి కెరీర్ డెవలప్ చేసుకుంటారనీ, అది లేనివారు ప్రేమ అంటూ పిచ్చిపట్టినట్లు తిరుగుతుంటారని చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 10:03 am

ప్రెగ్నెంట్ పద్మాలక్ష్మి నగ్న ఫోజు

భారతదేశ మోడల్, ఆరు నెలల గర్భవతి అయిన పద్మాలక్ష్మి అమెరికాలోని ఓ పత్రిక కవర్ పేజీకోసం నగ్నంగా ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోలో పద్మ, తన రెండు మోకాళ్లతో వక్షఃస్థలాన్ని కవర్ చేస్తూ కూచున్న భంగిమలో కుడివైపు భాగాన్ని చూపుతూ తీక్షణమైన చూపును విసురుతున్నట్లు ఫోజిచ్చింది. కవర్ పేజీపై ఇలా కనిపించిన పద్మాలక్ష్మి పత్రిక లోపలి పేజీలలో మరింత స్వేచ్ఛగా నగ్న ప్రదర్శనను ఇచ్చినట్లు భోగట్టా. నగ్నంగా కనబడటం కూడా ఒక కళ అనీ, తను ఈ నగ్న ఫోజువ్వడానికి చాలా కసరత్తు చేశానని పద్మాలక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే జుగుప్స కలిగించే నగ్న ప్రదర్శనకు తను వ్యతిరేకమని అంటోంది. దుస్తులు లేకుండా నగ్న ఫోజు ఇవ్వడం నిజంగా ఓ ఛాలెంజ్ అని చెపుతోంది. శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించినప్పుడు అసలురూపం బయటపడుతుందనీ, ఆ రూపాన్ని చూపించే అవకాశం కొంతమందికే వస్తుందని ఎంతో సంతోషంగా చెప్పింది పద్మ.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 7:38 am

తెలంగాణ కోసం అవిశ్రాంత పోరాటం: విజయశాంతి

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తాను అవిశ్రాంత పోరాటం చేస్తానని మెదక్ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి విజయశాంతి హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాటం చేయడానికి ముందుకు రావాలని తెలంగాణ విద్యార్థులు గురువారం విజయశాంతి ఇంటి ముందు ధర్నా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 5:18 am

సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యమించండి: టంగుటూరి పిలుపు

ఇండియన్ తెలుగు అసోసియేషన్ చేస్తున్న రిలే నిరాహార దీక్షలు నేటితో ఐదోరోజుకు చేరుకున్నాయి. ఈ రిలే నిరాహార దీక్షలో ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కార్యదర్శి టంగుటూరి రామకృష్ణ ప్రసంగిస్తూ.. కె.సి.ఆర్ స్వార్థ పూరిత రాజకీయాలకు బలికావద్దని, ఆయన స్వార్థానికి రోజుకు దాదాపు వెయ్యికోట్ల రూపాయలు నష్టం జరుగుతుందన్నారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి కుంటుపడుతుందని ప్రపంచ వ్యాప్తంగా వున్న తెలుగువారు, రాజకీయ మేధావులు అందరూ కలిసి సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 5:04 am

11న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న జెనీలియా "కథ"

బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా ప్రధాన పాత్రగా నటిస్తోన్న "కథ" చిత్రాన్ని ఈ నెల 11వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత గుణ్ణం గంగరాజు వెల్లడించారు. బుధవారం ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ.. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ అని అన్నారు. కథ జార్ఖండ్‌లో ప్రారంభమై అరకులో ముగుస్తుందని, ఇందులో జెనీలియా టీచర్‌గా నటిస్తోందని చెప్పారు. ఇంకా అసిస్టెంట్ డైరక్టర్ హీరో అరుణ్ అదిత్ నటించాడు. వింతకథతో దర్శకుడు శ్రీనివాస్‌రాగ్ అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 4:51 am

యువత రాజకీయాల్లోకి రావాలి: రాహుల్ గాంధీ

యువత రాజకీయాల్లోకి ప్రవేశించాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ మరోసారి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఆయన డిసెంబరు 7వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీని సందర్శించి అక్కడి యువతతో ముఖాముఖి సంభాషించనున్నారు.
Source: జాతీయ | 3 Dec 2009 | 4:19 am

తాజ్‌మహల్‌ను సందర్శించిన బెన్ కింగ్స్‌లే

ఆస్కార్ అవార్డు గ్రహీత బాలీవుడ్ చిత్రం " తాజ్ "లో షాజహాన్ పాత్ర పోషిస్తున్న 67 సంవత్సరాల ప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ కింగ్స్‌‍లే తన సతీమణి డేనియేలా లెవేండర్‌తో కలిసి బుధవారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శించిన సందర్భంలో ఆయన "మాంఛి రొమాంటిక్" మూడ్‌లో ఉన్నట్లు కనపడింది. తన సతీమణితో కలిసి పలు భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇతర పర్యాటకులతోను ముచ్చటించి వారికి తన ఆటోగ్రాఫ్‌ను ఇవ్వడం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 3:23 am