17.47 శాతానికి పెరిగిన ద్రవ్యోల్బణం

దేశంలో ద్రవ్యోల్బణం 17.47 శాతానికి చేరుకుంది. గత నెల మూడవ వారాంతానికి ముందు 15.58 శాతంవున్న ద్రవ్యోల్బణం ఏకంగా 1.89 శాతం పెరిగి 17.47 శాతానికి చేరుకుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 8:49 am

ఉపకారవేతనంపై బిడ్: లాభాల్లో సెన్సెక్స్

కేంద్ర కేబినేట్ గురువారం ఉపకారవేతనంపై బిడ్ ప్రవేశపెట్టనుండటంతో బాంబే స్టాక్ మార్కెట్ పుంజుకుంటోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 135 పాయింట్లు పుంజుకుని, 17,305 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 33 పాయింట్లు వృద్ధి చెంది, 5,157 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 8:00 am

ప్రెగ్నెంట్ పద్మాలక్ష్మి నగ్న ఫోజు

భారతదేశ మోడల్, ఆరు నెలల గర్భవతి అయిన పద్మాలక్ష్మి అమెరికాలోని ఓ పత్రిక కవర్ పేజీకోసం నగ్నంగా ఫోజు ఇచ్చింది. ఈ ఫోటోలో పద్మ, తన రెండు మోకాళ్లతో వక్షఃస్థలాన్ని కవర్ చేస్తూ కూచున్న భంగిమలో కుడివైపు భాగాన్ని చూపుతూ తీక్షణమైన చూపును విసురుతున్నట్లు ఫోజిచ్చింది. కవర్ పేజీపై ఇలా కనిపించిన పద్మాలక్ష్మి పత్రిక లోపలి పేజీలలో మరింత స్వేచ్ఛగా నగ్న ప్రదర్శనను ఇచ్చినట్లు భోగట్టా. నగ్నంగా కనబడటం కూడా ఒక కళ అనీ, తను ఈ నగ్న ఫోజువ్వడానికి చాలా కసరత్తు చేశానని పద్మాలక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే జుగుప్స కలిగించే నగ్న ప్రదర్శనకు తను వ్యతిరేకమని అంటోంది. దుస్తులు లేకుండా నగ్న ఫోజు ఇవ్వడం నిజంగా ఓ ఛాలెంజ్ అని చెపుతోంది. శరీరంపై నూలుపోగు లేకుండా కనిపించినప్పుడు అసలురూపం బయటపడుతుందనీ, ఆ రూపాన్ని చూపించే అవకాశం కొంతమందికే వస్తుందని ఎంతో సంతోషంగా చెప్పింది పద్మ.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 7:38 am

పత్తి ఎగుమతులను నిలుపుదలచేయండి: ఫియో

పత్తి నుంచి తయారు చేసే దారం ధరలు ఆకాశాన్నంటడంతో పత్తి ఎగుమతులను నిలుపుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్‌పోర్ట్ ఆర్గనైజేషన్ (ఫియో) కేంద్ర జౌళి మంత్రిత్వశాఖకు విన్నవించింది.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 7:29 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 162 పాయింట్ల వృద్ధి

గురువారం బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 162 పాయింట్లు బలపడి, 17,332 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ సల్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 52 పాయింట్లు పుంజుకుని, 5,176 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 7:24 am

శాంతి కొరకు కాశ్మీర్ సమస్యపై చర్చ జరగాలి: గిలానీ

తమ దేశంలో శాంతిని నెలకొల్పాలంటే వెంటనే కాశ్మీర్ అంశంపై చర్చలు జరగాలని తమ ప్రభుత్వం కోరుకుంటోందని పాకిస్థాన్ ప్రధానమంత్రి యూసుఫ్ రజా గిలానీ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 7:01 am

తెలంగాణా ఎంపీలకు సోనియా పిలుపు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష, అనంతరం అరెస్టు, చెలరేగుతున్న సంఘటనల దృష్ట్యా కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. తెలంగాణా ఎంపీలు ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపింది. తెలంగాణా అంశంపై సోమవారం మాట్లాడదామని తెలంగాణా ఎంపీలతో సోనియా గాంధీ చెప్పినట్లు సమచారం.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 6:49 am

తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహించిన లోక్‌సత్తా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాజాగా లోక్‌సత్తా పార్టీకి చెందిన కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తమ తోటివారికి సంఘీభావం తెలుపుతూ తాముకూడా మీకు తోడుగా ఉద్యమిస్తామని, దీనికి తమ పార్టీ అధినేత అనుమతి లభించిందని, ప్రజల అభీష్టమే లోక్‌సత్తా పార్టీ నినాదమని ఆ పార్టీ అధినేత చెప్పినట్లు లోక్‌సత్తా కార్యకర్తలు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 6:36 am

కేసీఆర్‌ను పరామర్శించిన బండారు దత్తాత్రేయ

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి దత్తాత్రేయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 6:36 am

నేను అరెస్ట్ కాబడలేదు: ఉల్ఫా చీఫ్ రాజ్‌ఖోవా

ప్రజలలో అపనమ్మకం కలిగించేందుకు తనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం చేశారని ఉల్ఫా చీఫ్ రాజ్‌ఖోవా అన్నారు. తనను అదుపులోకి తీసుకున్నామని ప్రచారం చేయడంతో అస్సోంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి అసత్యపు ప్రచారం చేసారని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 6:29 am

మధుకోడాతో లింకు: బయటపడిన ఎమ్మార్ హవాలా

రియాల్టీ పరిశ్రమలో అగ్రగామి అయిన ఎమ్మార్ ఎమ్జీఎఫ్ కార్యాలయాలను ఎన్ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ గురువారం తనిఖీ చేసింది. జార్ఖండ్ రాష్ట్ర మాజీముఖ్యమంత్రి మధుకోడా నెరపిన హవాలా వ్యవహారంలో ఈ కంపెనీ హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో నొయిడా, ఢిల్లీలలోని ఎమ్మార్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Dec 2009 | 6:19 am

11న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న జెనీలియా "కథ"

బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా ప్రధాన పాత్రగా నటిస్తోన్న "కథ" చిత్రాన్ని ఈ నెల 11వ తేదీన విడుదల చేస్తున్నట్లు నిర్మాత గుణ్ణం గంగరాజు వెల్లడించారు. బుధవారం ఈ చిత్రం గురించి నిర్మాత చెబుతూ.. ఇది రొమాంటిక్ థ్రిల్లర్ అని అన్నారు. కథ జార్ఖండ్‌లో ప్రారంభమై అరకులో ముగుస్తుందని, ఇందులో జెనీలియా టీచర్‌గా నటిస్తోందని చెప్పారు. ఇంకా అసిస్టెంట్ డైరక్టర్ హీరో అరుణ్ అదిత్ నటించాడు. వింతకథతో దర్శకుడు శ్రీనివాస్‌రాగ్ అద్భుతంగా తెరకెక్కించారని నిర్మాత తెలిపారు. జాతీయ అవార్డు గ్రహీత, విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇందులో ప్రధాన పాత్ర పోషించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 4:51 am

తాజ్‌మహల్‌ను సందర్శించిన బెన్ కింగ్స్‌లే

ఆస్కార్ అవార్డు గ్రహీత బాలీవుడ్ చిత్రం " తాజ్ "లో షాజహాన్ పాత్ర పోషిస్తున్న 67 సంవత్సరాల ప్రముఖ హాలీవుడ్ నటుడు బెన్ కింగ్స్‌‍లే తన సతీమణి డేనియేలా లెవేండర్‌తో కలిసి బుధవారం తాజ్‌మహల్‌ను సందర్శించారు. ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను సందర్శించిన సందర్భంలో ఆయన "మాంఛి రొమాంటిక్" మూడ్‌లో ఉన్నట్లు కనపడింది. తన సతీమణితో కలిసి పలు భంగిమలలో ఫోటోలకు ఫోజులిచ్చాడు. ఈ సందర్భంగా ఆయన ఇతర పర్యాటకులతోను ముచ్చటించి వారికి తన ఆటోగ్రాఫ్‌ను ఇవ్వడం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Dec 2009 | 3:23 am

తెలంగాణా ఎంపీలకు సోనియా పిలుపు

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దీక్ష, అనంతరం అరెస్టు, చెలరేగుతున్న సంఘటనల దృష్ట్యా కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. తెలంగాణా ఎంపీలు ఢిల్లీకి రావాల్సిందిగా కబురు పంపింది. తెలంగాణా అంశంపై సోమవారం మాట్లాడదామని తెలంగాణా ఎంపీలతో సోనియా గాంధీ చెప్పినట్లు సమచారం.
Source: జాతీయ | 3 Dec 2009 | 1:21 am

తెలంగాణ కోసం ర్యాలీ నిర్వహించిన లోక్‌సత్తా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాజాగా లోక్‌సత్తా పార్టీకి చెందిన కార్యకర్తలు గురువారం ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ కోసం పోరాడుతున్న తమ తోటివారికి సంఘీభావం తెలుపుతూ తాముకూడా మీకు తోడుగా ఉద్యమిస్తామని, దీనికి తమ పార్టీ అధినేత అనుమతి లభించిందని, ప్రజల అభీష్టమే లోక్‌సత్తా పార్టీ నినాదమని ఆ పార్టీ అధినేత చెప్పినట్లు లోక్‌సత్తా కార్యకర్తలు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 1:08 am

కేసీఆర్‌ను పరామర్శించిన బండారు దత్తాత్రేయ

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావును భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ గురువారం పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి దత్తాత్రేయ వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 1:06 am

నేను అరెస్ట్ కాబడలేదు: ఉల్ఫా చీఫ్ రాజ్‌ఖోవా

ప్రజలలో అపనమ్మకం కలిగించేందుకు తనను అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం చేశారని ఉల్ఫా చీఫ్ రాజ్‌ఖోవా అన్నారు. తనను అదుపులోకి తీసుకున్నామని ప్రచారం చేయడంతో అస్సోంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి అసత్యపు ప్రచారం చేసారని ఆయన అన్నారు.
Source: జాతీయ | 3 Dec 2009 | 1:00 am

మధుకోడాతో లింకు: బయటపడిన ఎమ్మార్ హవాలా

రియాల్టీ పరిశ్రమలో అగ్రగామి అయిన ఎమ్మార్ ఎమ్జీఎఫ్ కార్యాలయాలను ఎన్ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ గురువారం తనిఖీ చేసింది. జార్ఖండ్ రాష్ట్ర మాజీముఖ్యమంత్రి మధుకోడా నెరపిన హవాలా వ్యవహారంలో ఈ కంపెనీ హస్తం కూడా ఉన్నట్లు తేలడంతో నొయిడా, ఢిల్లీలలోని ఎమ్మార్ కార్యాలయాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 3 Dec 2009 | 12:50 am

తెలంగాణా ఇవ్వండి... మా నాయకుణ్ణి కాపాడండి

"ప్రత్యేక తెలంగాణా ఇచ్చుడో... కేసీఆర్ చచ్చుడో..." అంటూ దీక్ష ప్రారంభానికి ముందు తన నిర్ణయాన్ని బలంగా ప్రకటించిన తెరాస అధినేత కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. దీంతో పోలీసులు ఆయనను హుటాహుటిన హైదరాబాదు నిమ్స్‌కు తరలించారు
Source: ఏపీ న్యూస్ | 3 Dec 2009 | 12:00 am

కేసీఆర్ ఎలాంటి హాని జరిగినా.. ఆ బాధ్యత ప్రభుత్వానిదే..!

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు ఎలాంటి హాని జరిగినా.. అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన గద్దర్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ స్పష్టమైన ప్రకటన ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 11:38 pm

ప్రారంభమైన తెలంగాణ ఉద్యోగుల రిలే దీక్షలు

హైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై వివాదం చెలరేగడంతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తెలంగాణ ఉద్యోగులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో భాగంగానే గురువారం ఉదయం నుంచి తెలంగాణ ఉద్యోగులు, కార్మికులు, ఉపాధ్యాయులతో కూడిన ఐక్య కార్యాచరణ సమితి(జేఏసీ) ఆధ్వర్యంలో పలువురు రిలే దీక్షలకు పూనుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 11:05 pm

చెరువులో పడిన స్కూల్ బస్సు: 9మంది మృతి

తమిళనాడులోని నాగపట్టిణం జిల్లా వేదారణ్యం సమీపంలో ప్రైవేట్ విద్యాసంస్థకు చెందిన ఓ బస్సు అదుపుతప్పి చెరువులో పడిపోయింది. ఈ దుర్ఘటనలో 9 మంది విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఓ అధ్యాపకురాలుండటం గమనార్హం. మరో 11 మందికి తీవ్రగాయాలైనాయి.
Source: జాతీయ | 2 Dec 2009 | 10:52 pm

కేసీఆర్‌‌ను నిమ్స్‌ ఆసుపత్రికి తరలించిన అధికారులు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావును ఖమ్మం ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆసుపత్రికి గురువారం తెల్లవారుజామున 108 వాహనంలో తరలించారు. కేసీఆర్‌ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకు క్షీణిస్తుండటంతో ఆయనను గురువారం ఉదయం ఖమ్మం ప్రభుత్వాసుపత్రి నుంచి హైదరాబాద్‌‍లోని నిమ్స్ ఆసుపత్రికి గట్టి పోలీసు భద్రత నడుమ తరలించారు. ఆయన ఆంబులెన్స్ వెంట దాదాపు 30 వాహనాలకు పైగా కాన్వాయ్ వెళ్ళింది.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 10:38 pm

డిసెంబర్ ఆరు నుంచి ప్రధాని రష్యా పర్యటన

ప్రధాని మన్మోహన్ సింగ్ ఈ నెల ఆరవ తేదీ నుంచి మూడు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాస్కోలో భారత్-రష్యా దేశాల మధ్య నెలకొన్న సంబంధాలను మరింత మెరుగుపరచుకునేందుకు పలు ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.
Source: జాతీయ | 2 Dec 2009 | 9:15 pm

కాశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలకు సిద్ధం: కేంద్రం

కాశ్మీర్‌ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్న ఆశాభావాన్ని కేంద్రహోంమంత్రి పి. చిదంబరం బుధవారం వ్యక్తం చేశారు. జమ్మూ-కాశ్మీర్‌లో వేర్పాటు వాదులతో కేంద్ర ప్రభుత్వం చర్చిస్తోందని తెలిపారు. రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌, నేను హురియత్‌‌తో సహా జమ్మూ-కాశ్మీర్‌లోని అన్ని వర్గాల ప్రజలతో చర్చలకు సిద్ధంగా ఉన్నామని తెలిపామని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
Source: జాతీయ | 2 Dec 2009 | 8:51 pm

సింధుమీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న "సుభద్ర"

శ్రీకాంత్ టాకీస్ పతాకంపై చందమామ ఫేమ్ సింధు మీనన్ ప్రధాన పాత్రధారిణిగా "సుభద్ర" అనే చిత్రం రూపొందుతోంది. రాజా వన్నెంరెడ్డి దర్శకత్వంలో ఇ. శ్రీకాంత్ గౌడ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్ర బేనర్, టైటిల్ లోగో, ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాలు ఫిలింక్లబ్‌లో జరిగాయి. ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ బేనర్‌ను ఆవిష్కరించగా, డా.డి. రామానాయుడు లోగో ఆవిష్కరించారు. పాటలను నిర్మాత స్నేహితుడు ప్రభాకర్ యాదవ్ విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 11:49 am

4న "సారాయి వీర్రాజు"గా వస్తోన్న అజయ్

అజయ్ హీరోగా, విశ్వ, మదులిక, రమ్య ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "సారాయి వీర్రాజు". కణ్ణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన "సారాయి వీర్రాజు" చిత్రాన్ని ఈ నెల నాలుగన విడుదల చేస్తున్నట్లు నిర్మాత పి.ఆర్.కె. రావు తెలియజేశారు. బుధవారం నాడు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని దిల్‌రాజు వంటి కొందరు ప్రముఖులు చూసి ప్రశంసించారని తెలిపారు. ముఖ్యంగా ఫైట్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. కెమెరా పనితనం అద్భుతందా వచ్చింది. కణ్ణన్ సమర్థవంతంగా తెరకెక్కించారని నిర్మాత వెల్లడించారు
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 11:30 am

గాళ్‌ఫ్రెండ్‌తో హ్యారీ పోటర్ నగ్నంగా నటన.. ఆపై ముద్దు

హ్యారీ పోటర్ సిరీస్‌ చిత్రాల్లో తొలుత చిన్న కుర్రాడిలా కనిపించిన డేనియల్ రాడ్‌క్లిఫ్ మొన్నామధ్య విడుదలైన చిత్రంలో టీనేజ్ బాయ్‌గా కనిపించాడు. ఇప్పుడు హ్యారీ పోటర్ చిత్ర దర్శకుడు సిరీస్‌లోని తదుపరి రెండు చిత్రాలను రూపొందించనున్నాడు. వీటిలో మొదటిది వచ్చే ఏడాది నవంబరు నెలలో విడుదల కానుండగా రెండోది 2011 సంవత్సరంలో విడుదలవుతుంది. ఈ చిత్రాల్లో డేనియల్ పెద్దవాడిలా కనిపిస్తాడట. అంతేకాదండోయ్... ప్రేయసితో రొమాన్స్ చేసే సన్నివేశాలలో నటిస్తాడట. ఇందులో భాగంగా డేనియల్ కొన్ని సన్నివేశాల్లో నగ్నంగా కనబడతాడట. ప్రేయసికి వేడి ముద్దు ఇచ్చే సన్నివేశంలో డేనియల్ పూర్తి నగ్నంగా కనిపిస్తాడట. ఇటువంటి సన్నివేశాలు తాజా చిత్రంలోనే కాక 2011లో విడుదల చేసే చిత్రంలోనూ ఉంటాయని దర్శకుడు చెపుతున్నాడు. డేనియల్ సంగతి సరే... హీరోయిన్‌ని కూడా నగ్నంగా చూపుతున్నారా...? అని అడిగిన ప్రశ్నకు.. దర్శకుడు ముసిముసిగా నవ్వుతూ తెరపై చూస్తారుగా అన్నాడట. మరి సిల్వర్ స్క్రీన్‌పై ఏం చూపిస్తాడో.. ఏమో?
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 9:36 am

"మిస్ చింతామణి యం.ఎ"గా వస్తోన్న పోసాని!

గతంలో అనేక విజయవంతమైన చిత్రాల్ని ప్రేక్షకులకు అందించిన ఎ.ఎ.ఆర్ట్స్ సంస్థ రచయిత కమ్ నటుడు పోసాని కృష్ణమురళి హీరోగా "మిస్ చింతామణి యం.ఎ" (కేరాఫ్ సుబ్బిగాడు) అనే చిత్రం తెరకెక్కనుంది. యం.కె. మూవీస్ పతాకంపై అందరూ మెచ్చే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. రాజా వన్నెంరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం (డిసెంబర్ 2) సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుడి పటాలపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 8:52 am

కాసు బ్రహ్మానంద రెడ్డి విగ్రహంపై నల్లరంగు

తెలంగాణ ప్రాంతంలో ప్రత్యేక తెలంగాణ వాదం నానాటికీ పెరిగిపోతోంది. దీనికి తార్కాణంగా బుధవారం హైదరాబాద్‌లోని కేబీఆర్ ఉద్యానవనం వద్దనున్న కాసు బ్రహ్మానందరెడ్డి విగ్రహానికి తెరాస కార్యకర్తలు నల్లరంగు వేశారు. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 8:09 am

తెలంగాణ ఒక సంవత్సరంలో తేలేదికాదు: రోశయ్య

తెలంగాణ అంశం ఒక సంవత్సరంలో తేలది కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య అన్నారు. తెలంగాణ అంశం ఏకాభిప్రాయ సాధన ద్వారా మాత్రమే తేలే అంశమని, ప్రస్తుతం ఈ అంశం ఇది కేంద్రం పరిశీలనలో ఉందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న యుపిఎ ప్రభుత్వంలో భాగస్వాములైన ఇతర పార్టీల ఆమోదం కూడా అవసరం ఉందన్నారు. వారిని ఒప్పించేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తీవ్రంగా కృషి చేస్తున్నారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 8:08 am

భారతదేశంలో గూగుల్‌ను నిషేధించండి: కారత్

భారతదేశంలో గూగుల్ సెర్చ్ ఇంజన్‌ను నిషేధించి, గూగుల్ ఇండియా చీఫ్‌ను అరెస్ట్ చేయాలని సిపిఎంకు చెందిన ఎంపీ బృందా కారత్ బుధవారం రాజ్యసభలో డిమాండ్ చేశారు.
Source: జాతీయ | 2 Dec 2009 | 7:13 am

నమ్ముకున్న వారే తూట్లు పొడిచారు: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తన మనస్సులో ఇన్నాళ్లు దాచుకున్న ఆవేదనను వెళ్ళగక్కారు. రాజకీయ జీవితంలో అట్టర్ ఫ్లాప్ కావడానికి గల కారణాలను ఆయన వివరించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో తన వెంట ఉన్నవారే తూట్లు పొడిచారని చిరంజీవి ఆరోపించారు. ఫలితంగానే తమ పార్టీ ఈ దుస్థికి జారుకోవడానికి ప్రధాన కారణమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 6:57 am

పులివెందులు ఉప ఎన్నిక: విజయలక్ష్మీ ఏక్రగీవం!

పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నిక అనుకున్నట్టుగానే ఏకగ్రీవమైంది. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే, దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించాల్సి వుంది.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 5:09 am

అన్నమయ్య కీర్తనలు రెహ్మాన్ కొత్త రాగంలో...!!?

వందేమాతరం గీతాన్ని తనదైన బాణీలో ఆలపించి భారతదేశాన్నే కాక యావత్‌ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న ఏఆర్ రెహ్మాన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు కలిసినట్లు భోగట్టా. అలనాడు అన్నమయ్య కమనీయంగా ఆలపించిన కీర్తనలను కొత్త రాగాల్లో వినిపించాలని రెహ్మాన్‌ను తితిదే కోరినట్లు సమాచారం. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే అన్నమయ్య గీతాలను అంతే స్థాయిలో సాంప్రదాయ పద్ధతిలో కొత్త కోణంలో ఆవిష్కరించమని టిటిడి అడిగినట్లు భోగట్టా. గోవిందుని కీర్తనలను తనదైన బాణీలో భక్తులకు అందించడానికి రెహ్మాన్ సంసిద్ధత తెలియజేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక నిజమైతే తాళ్లపాక అన్నమాచార్యులవారి పదకవితలకు రెహ్మాన్ ఎటువంటి బాణీలను అందిస్తారో చూడాల్సిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 5:06 am

బాలయ్య సరసన నటించనున్న సెక్సీడాళ్ నయనతార!

నందమూరి బాలకృష్ణ సరసన ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో రాజసం, వీరత్వం హావభావాలు పలికించే హీరోయిన్‌కోసం చాలామందిని అనుకున్నాం. ఆఖరికి నయనతార బాగుటుందని ఎంపికచేశామని "సింహా" చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి, దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. నయనతార పేరు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ డేట్స్ కుదరక ఆగామని, అందుకే ఇప్పుడు ప్రకటిస్తున్నామని సింహా దర్శక నిర్మాతలు వెల్లడించారు. గత కొద్దిరోజులుగా "సింహా" సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా.. బుధవారం నాడు పబ్లిక్ గార్డెన్స్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ రోజుతో హైదరాబాద్‌లో షూటింగ్ పూర్తవుతుందని చెప్పారు. ఆ తర్వాత వైజాగ్, బొబ్బిలి, విజయనగరం, వరంగల్ తదితర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తామని బోయపాటి శ్రీను తెలిపారు. "సింహా"లో బాలకృష్ణ కొత్తకోణంలో కనబడతారని, లుక్, బాడీలాంగ్వేజ్ వైవిధ్యంగా ఉంటుందని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 5:00 am

దివినున్న కైలాసాన్ని తలపించే "మధ్యకైలాష్"

కైలాసాన్ని, అక్కడి మహిమాన్వితాన్ని కన్నులారా తిలకించాలంటే కవుల వర్ణనలలో దర్శించగలమే తప్ప స్వయంగా చూడాలంటే అసాధ్యమైనపని. అలాంటి అనుభూతిని కలిగించే ఓ ఆలయం ఉందంటే ఎంత భాగ్యమో కదూ.. ఎలాగైనా సరే ఆ భూ కైలాసాన్ని చూసి తీరాల్సిందేనని మనసు పరుగులు తీయటం ఎవరికైనా సహజం. అయితే మరెందుకు ఆలస్యం వెంటనే చెన్నైకి బయల్దేరితే సరి..!
Source: వినోదం | 2 Dec 2009 | 4:53 am

ఏ అధికారి అమెరికాకు వెళ్లడం లేదు: కేంద్రం

లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాది డేవిడ్ హెడ్లీని ప్రశ్నించేందుకు అమెరికా ఏ అధికారి వెళ్లడం లేదని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెల్చి చెప్పింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్ మకెన్ రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 2 Dec 2009 | 4:14 am

బాలయ్య సరసన నటించనున్న సెక్సీడాళ్ నయనతార!

నందమూరి బాలకృష్ణ సరసన ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే ఎపిసోడ్‌లో రాజసం, వీరత్వం హావభావాలు పలికించే హీరోయిన్‌కోసం చాలామందిని అనుకున్నాం. ఆఖరికి నయనతార బాగుటుందని ఎంపికచేశామని "సింహా" చిత్ర నిర్మాత పరుచూరి కిరీటి, దర్శకుడు బోయపాటి శ్రీను తెలియజేశారు. నయనతార పేరు ముందుగానే ప్రకటించాల్సి ఉన్నప్పటికీ డేట్స్ కుదరక ఆగామని, అందుకే ఇప్పుడు ప్రకటిస్తున్నామని సింహా దర్శక నిర్మాతలు వెల్లడించారు.
Source: వినోదం | 2 Dec 2009 | 4:11 am

తెలుగులో "యుద్ధభూమి"గా వస్తోన్న "3 కింగ్‌డమ్స్"

"16 డేస్" వంటి అందరూ మెచ్చిన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత డి.వై.చౌదరి తాజాగా చైనాలో ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించిన "3 కింగ్‌డమ్స్" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. దీనికి 'యుద్ధభూమి' అనే పేరును కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక సాధారణ యోధుడైన జాహు శాంతి సమైక్యలతో ఏవిధంగా దారికి తేగలుగుతాడు? అనేదే ఈ చిత్రం" అని చెప్పారు. ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ రెండు లేక మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డి.వై. చౌదరి అన్నారు. ఇంకా ఈ చిత్రంలో మ్యాగీక్యూ, యాండీలా, శామోహుమ్, యాండియాన్, వెన్సేల్‌లు ప్రధాన పాత్రల్ని పోషించగా, వేలాదిమంది జూనియర్ కళాకారులు ఈ సినిమాలో నటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 3:58 am

హురియత్‌తో చర్చలు జరిపిన కేంద్రం: మంత్రి చిదంబరం

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుతున్నట్టు కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం తెలిపారు. అయితే, ఈ చర్చలకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.
Source: జాతీయ | 2 Dec 2009 | 3:39 am

సముద్రంలో మునిగిపోనున్న ఆ మూడు నగరాలు!

2100 నాటికి ముంబై, కోల్‌కతా, చెన్నయ్ నగరాలు సముద్రపు నీటిలో మునిగి పోతాయని అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రజ్ఞులు జోస్యం చెపుతున్నారు. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్రంలో నీటి మట్టం నాలుగు అడుగుల ఎత్తు పెరగవచ్చని దీనివల్ల భారత్‌లోని చెన్నయ్, కోల్‌కతా, ముంబై నగరాలు జలమయం కావచ్చని శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
Source: జాతీయ | 2 Dec 2009 | 2:43 am