దమ్ము ధైర్యముంటే ముందుకు రండి: రేణుక

ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికి పందలు చేసే పనులు ఇలానే ఉంటాయన్నారు. దమ్ము, ధైర్యముంటే ముందుకు రావాలని ఆమె సవాల్ విసిరారు. ఎనకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి పరిణామాలకైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 8:56 am

"మిస్ చింతామణి యం.ఎ"గా వస్తోన్న పోసాని!

గతంలో అనేక విజయవంతమైన చిత్రాల్ని ప్రేక్షకులకు అందించిన ఎ.ఎ.ఆర్ట్స్ సంస్థ రచయిత కమ్ నటుడు పోసాని కృష్ణమురళి హీరోగా "మిస్ చింతామణి యం.ఎ" (కేరాఫ్ సుబ్బిగాడు) అనే చిత్రం తెరకెక్కనుంది. యం.కె. మూవీస్ పతాకంపై అందరూ మెచ్చే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. రాజా వన్నెంరెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ బుధవారం (డిసెంబర్ 2) సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. దేవుడి పటాలపై ముహూర్తపు సన్నివేశాన్ని చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 8:52 am

ఆస్తుల ధ్వసం చేయకూడదు: చంద్రబాబు వినతి

ఒక్క ప్రత్యేక తెలంగాణ అంశం విషయంలోనే కాకుండా, ఆందోళనలు చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం చేయరాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 8:44 am

అమ్మకాల్లో వృద్ధి సాధించిన బజాజ్ బైకులు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలోని నవంబర్ నెలలో తమ సంస్థకు చెందిన మోటారు వాహనాల అమ్మకాలలో 84.07శాతం వృద్ధి చెంది 2,42,390 వాహనాలను అమ్ముడుపోయినట్లు బజాజ్ ఆటో లిమిటెడ్ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 8:34 am

ఖమ్మం కోర్టులో తెరాస అధినేతకు చుక్కెదురు!

ఖమ్మం జిల్లా కోర్టులో తెలంగాణా రాష్ట్ర సమితి కె.చంద్రశేఖర రావుకు చుక్కెదురైంది. తన వాదనను వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపున బుధవారం ఖమ్మం మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. పిటీషన్‌ను కొట్టివేసింది. అయితే, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు మాత్రం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 8:21 am

సముద్రంలో మునిగిపోనున్న ఆ మూడు నగరాలు!

2100 నాటికి ముంబై, కోల్‌కతా, చెన్నయ్ నగరాలు సముద్రపు నీటిలో మునిగి పోతాయని అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రజ్ఞులు జోస్యం చెపుతున్నారు. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్రంలో నీటి మట్టం నాలుగు అడుగుల ఎత్తు పెరగవచ్చని దీనివల్ల భారత్‌లోని చెన్నయ్, కోల్‌కతా, ముంబై నగరాలు జలమయం కావచ్చని శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 8:12 am

మళ్లీ పుంజుకున్న స్టాక్ మార్కెట్: లాభాల్లో సెన్సెక్స్

బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం ఒడిదుడుకులను ఎదుర్కుంటోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 46 పాయింట్లు పుంజుకుని, 17, 244 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 17 పాయింట్ల స్వల్ప లాభంతో 5, 139 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 8:08 am

తెలంగాణ అంశాన్ని అధిష్టానం తేల్చుతుంది: రోశయ్య

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేల్చుతుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన బుధవారం హస్తినకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 7:55 am

బంగ్లాదేశ్‌లో ఉల్ఫా అగ్రనేత రోజ్‌కోవా అరెస్టు!

యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సోం (ఉల్ఫా) తీవ్రవాద సంస్థకు చెందిన అగ్రనేత అరబిందో రాజ్‌కోవా బంగ్లాదేశ్‌లో అరెస్టు చేశారు. అలాగే, ఆయనతో పాటు ప్రచార కార్యదర్శి అపుర్బా బారువాను కూడా అరెస్టు చేసినట్టు బంగ్లా పోలీసులు వెల్లడించారు. ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ వర్గాలు బుధవారం వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 7:38 am

అమ్మకపు ఒత్తిడి: తిరోగమనంలో సెన్సెక్స్

ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ మార్కెట్ బుధవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో స్వల్ప నష్టాలను నమోదు చేసుకుంది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో ఒక్కసారిగా సెన్సెక్స్ నష్టాలను చవిచూసింది. దీంతో సెన్సెక్స్ 17 పాయింట్ల స్వల్ప నష్టంతో, 17,180 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా కేవలం ఒక పాయింట్ స్వల్ప నష్టంతో 5, 120 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 7:35 am

కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం: ప్రభుత్వం

రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర రావుతో వ్యక్తిగతంగా చర్చలు జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 2 Dec 2009 | 7:12 am

అన్నమయ్య కీర్తనలు రెహ్మాన్ కొత్త రాగంలో...!!?

వందేమాతరం గీతాన్ని తనదైన బాణీలో ఆలపించి భారతదేశాన్నే కాక యావత్‌ప్రపంచ దృష్టిని ఆకట్టుకున్న ఏఆర్ రెహ్మాన్‌ను తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు కలిసినట్లు భోగట్టా. అలనాడు అన్నమయ్య కమనీయంగా ఆలపించిన కీర్తనలను కొత్త రాగాల్లో వినిపించాలని రెహ్మాన్‌ను తితిదే కోరినట్లు సమాచారం. ఆధ్యాత్మిక సాగరంలో ఓలలాడించే అన్నమయ్య గీతాలను అంతే స్థాయిలో సాంప్రదాయ పద్ధతిలో కొత్త కోణంలో ఆవిష్కరించమని టిటిడి అడిగినట్లు భోగట్టా. గోవిందుని కీర్తనలను తనదైన బాణీలో భక్తులకు అందించడానికి రెహ్మాన్ సంసిద్ధత తెలియజేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. అదే గనుక నిజమైతే తాళ్లపాక అన్నమాచార్యులవారి పదకవితలకు రెహ్మాన్ ఎటువంటి బాణీలను అందిస్తారో చూడాల్సిందే.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 5:06 am

బాలయ్య సరసన నటించనున్న సెక్సీడాళ్ నయనతార!

దక్షిణాది సినీ పరిశ్రమలో అగ్ర హీరోయిన్‌‌గా ముద్రవేసుకున్న సెక్సీతార నయనతార.. నందమూరి హీరో బాలకృష్ణతో నటించనుందని తెలిసింది. తాజాగా బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న "సింహా"లో నయన కథానాయిక పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. ఇందులో స్నేహా ఉల్లాల్, సెక్సీక్వీన్ నమితలు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. టాలీవుడ్, కోలీవుడ్ సినీ రంగాల్లో అగ్ర హీరోలతో పాటు యంగ్ హీరోల సరసన నటించిన నయనతార.. తెలుగులో యంగ్ నందమూరి హీరో ఎన్టీఆర్ హీరోగా నటించే అదుర్స్ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే అమ్మడు కాల్షీట్ ఇచ్చేందుకు "సింహా" యూనిట్ వర్గాలు సిద్ధమయ్యాయని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. ఇంకా చెప్పాలంటే.. "అదుర్స్" సినిమాలో నటించిన సమయంలో నిర్మాతలకు సలాం వేసి నయనతార "సింహా"లో నటించే ఛాన్స్‌ను కొట్టేసిందని సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇకపోతే.. "అదుర్స్" చిత్రానికి బోయపాటి శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. పరుచూరి కిరీటి నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 5:00 am

తెలుగులో "యుద్ధభూమి"గా వస్తోన్న "3 కింగ్‌డమ్స్"

"16 డేస్" వంటి అందరూ మెచ్చిన చిత్రాన్ని ప్రేక్షకులకు అందించిన ప్రముఖ నిర్మాత డి.వై.చౌదరి తాజాగా చైనాలో ఈ మధ్యనే విడుదలై ఘనవిజయం సాధించిన "3 కింగ్‌డమ్స్" చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది. దీనికి 'యుద్ధభూమి' అనే పేరును కూడా ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అనువాద కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక సాధారణ యోధుడైన జాహు శాంతి సమైక్యలతో ఏవిధంగా దారికి తేగలుగుతాడు? అనేదే ఈ చిత్రం" అని చెప్పారు. ఈ భారీ చిత్రాన్ని డిసెంబర్ రెండు లేక మూడో వారంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని డి.వై. చౌదరి అన్నారు. ఇంకా ఈ చిత్రంలో మ్యాగీక్యూ, యాండీలా, శామోహుమ్, యాండియాన్, వెన్సేల్‌లు ప్రధాన పాత్రల్ని పోషించగా, వేలాదిమంది జూనియర్ కళాకారులు ఈ సినిమాలో నటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Dec 2009 | 3:58 am

దమ్ము ధైర్యముంటే ముందుకు రండి: రేణుక

ఖమ్మం జిల్లా కేంద్రంలోని తన పార్టీ కార్యాలయానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం పట్ల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ రేణుకా చౌదరీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిరికి పందలు చేసే పనులు ఇలానే ఉంటాయన్నారు. దమ్ము, ధైర్యముంటే ముందుకు రావాలని ఆమె సవాల్ విసిరారు. ఎనకు వ్యతిరేకంగా జరిగే ఎలాంటి పరిణామాలకైనా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆమె ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 3:28 am

ఆస్తుల ధ్వసం చేయకూడదు: చంద్రబాబు వినతి

ఒక్క ప్రత్యేక తెలంగాణ అంశం విషయంలోనే కాకుండా, ఆందోళనలు చేసే సమయంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల ధ్వంసం చేయరాదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు. ఆందోళనకారులు తమ ఉద్యమాన్ని శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 3:16 am

ఖమ్మం కోర్టులో తెరాస అధినేతకు చుక్కెదురు!

ఖమ్మం జిల్లా కోర్టులో తెలంగాణా రాష్ట్ర సమితి కె.చంద్రశేఖర రావుకు చుక్కెదురైంది. తన వాదనను వినిపించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆయన తరపున బుధవారం ఖమ్మం మేజిస్ట్రేట్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని పరిశీలించిన కోర్టు.. పిటీషన్‌ను కొట్టివేసింది. అయితే, ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులకు మాత్రం కొన్ని ఆదేశాలు జారీ చేసింది.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 2:52 am

సముద్రంలో మునిగిపోనున్న ఆ మూడు నగరాలు!

2100 నాటికి ముంబై, కోల్‌కతా, చెన్నయ్ నగరాలు సముద్రపు నీటిలో మునిగి పోతాయని అంతర్జాతీయ పర్యావరణ శాస్త్రజ్ఞులు జోస్యం చెపుతున్నారు. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల వల్ల సముద్రంలో నీటి మట్టం నాలుగు అడుగుల ఎత్తు పెరగవచ్చని దీనివల్ల భారత్‌లోని చెన్నయ్, కోల్‌కతా, ముంబై నగరాలు జలమయం కావచ్చని శాస్త్రజ్ఞులు నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది.
Source: జాతీయ | 2 Dec 2009 | 2:43 am

తెలంగాణ అంశాన్ని అధిష్టానం తేల్చుతుంది: రోశయ్య

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అంశాన్ని కాంగ్రెస్ అధిష్టానం తేల్చుతుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఆయన బుధవారం హస్తినకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ అంశంపై పార్టీ అధిష్టానం స్పందిస్తుందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 2:25 am

కేసీఆర్‌తో చర్చలు జరిపేందుకు సిద్ధం: ప్రభుత్వం

రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం దీక్ష చేపట్టిన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కే చంద్రశేఖర రావుతో వ్యక్తిగతంగా చర్చలు జరిపేందుకు రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 1:42 am

అనువైన చోటికి కేసీఆర్‌ను తరలించండి: హెచ్‌ఆర్‌సి

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు రాష్ట్ర మానవహక్కుల సంఘానికి చేసుకున్న వినతి ఫలించింది. ఆయనను తక్షణం ఖమ్మం నుంచి అనువైన చోటికి తరలించాలని జైళ్ళ శాఖ డీఐజీని హక్కుల సంఘం ఆదేశించింది. హైదరాబాద్‌లోని చంచల్‌గూడా లేదా చర్లపల్లి జైలుకు తరలించాలని సూచించింది.
Source: ఏపీ న్యూస్ | 2 Dec 2009 | 12:58 am

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మధుకోడా సతీమణి!

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మధుకోడా సతీమణి గీతా కోడా నిమగ్నమయ్యారు. తన భర్త, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు రెండు రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెల్సిందే. దీంతో మధుకోడా సొంత పార్టీ జై భారత్ సమంతా పార్టీ తరపున గీతా కోడా ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.
Source: జాతీయ | 2 Dec 2009 | 12:46 am

చైనా అభ్యంతరాలకు తలొగ్గం: సీఎం ధూర్జీ ఖండూ

పొరుగు దేశం చైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ ఈశాన్య సరిహద్దుల వెంబడి చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆపేది లేదని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ధూర్జీ ఖండూ స్పష్టం చేశారు. తమ భూభాగంలోని మౌలిక సదుపాయాల అభివృద్ధిని ఆపమనే హక్కు చైనాకు లేదని ఆయన నొక్కివక్కాణించారు. ఈ స్థలం కొంతమంది తమదని చెపుతుంటారు.
Source: జాతీయ | 1 Dec 2009 | 11:35 pm

హరీష్ రావు రూ.40 లక్షలు చెల్లించాలి: టి-విద్యార్థులు

తెలంగాణా రాష్ట్ర సమితి నేత, ఆ పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మేనల్లుడైన కె.హరీష్ రావు తమకు 40 లక్షల రూపాయలు చెల్లించాలని తెలంగాణా విద్యార్థులు (టి-విద్యార్థులు) డిమాండ్ చేస్తున్నారు. ఆయన మాటమీద నిలబడే రకం అయితే, వెంటనే తన జేబులోని ఈ మొత్తాన్ని తమకు అందజేయాలని వారు కోరుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 11:06 pm

ప్లీజ్.. నన్ను హైదారాబాద్‌ ఆస్పత్రికి మార్చండి: కేసీఆర్

ఖమ్మం ఆస్పత్రిలో వైద్య సౌకర్యాలు సరిగా లేవని అందువల్ల హైదరాబాద్ ఆస్పత్రికి మార్చాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు మొత్తుకుంటున్నారు. అయితే, అటు ప్రభుత్వం, ఇటు కోర్టు, పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఇక చేసేదేమి లేక రాష్ట్ర మానవహక్కుల కమిషన్‌ ఛైర్మన్ జస్టీస్ కె.సుభాషణ్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 10:54 pm

రెండు రోజుల పర్యటనకు ఢిల్లీ వెళ్లిన రోశయ్య,

రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కె.రోశయ్య బుధవారం హస్తినకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభాపక్షం నేతగా ఎన్నికైన తర్వాత పూర్తి స్థాయి ముఖ్యమంత్రిగా రోశయ్య ఢిల్లీ పర్యటనకు బుధవారం వెళ్లారు.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 10:47 pm

జార్ఖండ్ ఎన్నికలు: రెండో దశ పోలింగ్ ప్రారంభం!

జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం రెండో దశ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రారంభమైంది. మావోయిస్టులు తలపెట్టిన 48 గంటల బంద్ తర్వాత ఈ పోలింగ్ జరుగుతుండటం గమనార్హం. రెండో దశలో మొత్తం 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహిస్తున్నారు.
Source: జాతీయ | 1 Dec 2009 | 9:21 pm

దేశ అణు స్థావరాలపై తీవ్రవాదుల గురి: ప్రభుత్వం

దేశంలోని అణు స్థావరాలపై దాడులు చేసేందుకు తీవ్రవాదులు లక్ష్యంగా ఎంచుకున్నట్టు నిఘా వర్గాల నుంచి సమాచారం వస్తోందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి ఎం.రామచంద్రన్ లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానం ఇచ్చారు.
Source: జాతీయ | 1 Dec 2009 | 9:01 pm

బొద్దందాల ముద్దుగుమ్మ 'నమిత' పర్సనల్ టచ్

దక్షిణాది సినీ పరిశ్రమను తన అందచందాలతో ఓ ఊపు ఊపుతున్న అందాల బొద్దుగుమ్మ "నమిత". తాజాగా "జగన్మోహిని" చిత్రం కోలీవుడ్‌లో రిలీజ్ అయి ఘన విజయం సాధించిన నేపథ్యంలో.. ఆమెకు ఇదే తరహా పాత్రలు వెల్లువల్లా వచ్చి పడుతున్నాయట. తెలుగులోనూ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న 'సింహా' చిత్రంలో నమిత గ్లామర్ రోల్‌ను పోషిస్తోంది. తెలుగు, తమిళ చిత్రాల్లో భారీగా అందాలను ఆరబోసే ఈ ముద్దుగుమ్మ తాజాగా మలయాళంలో రూపుదిద్దుకోనున్న కొత్త చిత్రంలో బార్ డ్యాన్సర్‌గా కనిపించబోతుందట. తెలుగులో ఇద్దరు మొనగాళ్లు, ప్రేమోత్సవం, దేశద్రోహి వంటి చిత్రాల్లో నటిస్తోన్న నమిత గురించి కొంచెం తెలుసుకుందామా..?అసలు పేరు: నమిత ముకేష్ వాంక్వాలా.పుట్టిన తేదీ: జనవరి 27, 1977.నటించిన చిత్రాలు: 30కిపైగా.అభిమాన సంఘాలు: 2500కి పైగా, జన్మస్థలం: సూరత్,చదువు: బి.ఎ..
Source: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2009 | 11:46 am

నాగార్జున మరీ ఇంత దిగజారుతారనుకోలేదు...

"రమ్మి" చిత్రం టైటిల్ గురించి తమను సంప్రదిస్తే 12 లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు నాగార్జున చెప్పడం తమను బాధించిందని, అసలు అది నిజం కాదని నిర్మాత సురేంద్ర అన్నారు. వివరాలలోకి వెళితే.. కామాక్షి మూవీస్ పతాకంపై శివప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రానికి "రమ్మి" అనే పేరు పెట్టడానికి ఇంతకుముందే టైటిల్ రిజిస్టర్ చేసిన వ్యక్తిని సంప్రదిస్తే 12 లక్షలు డిమాండ్ చేశారని దీనిపై ఛాంబర్‌కు ఫిర్యాదు చేస్తానని సోమవారం రాత్రి నాగార్జున తెలియజేశారు. దీనికి కౌంటర్‌గా మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని తన సాఫ్ట్‌వేర్ కార్యాలయంలో సురేంద్ర అనే నిర్మాత వివరణ ఇచ్చారు. తమకు సాఫ్ట్‌వేర్ కంపెనీలున్నాయనీ, రమ్మీ పేరుతో సినిమా తీయాలని ఆ పేరును రిజిస్టర్ చేసి, హీరో శివాజీ, బ్రహ్మానందం, వేణు మాధవ్ తదితరులకు అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామనీ అనుకోకుండా చిత్ర దర్శకుడు శరత్ చ్చంద్ర హఠాన్మరణం చెందడంతో వాయిదా పడిందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2009 | 10:33 am

ఖమ్మం ప్రభుత్వాసుపత్రి వద్ద నెలకొన్న ఉద్రిక్తత

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖరరావు ఖమ్మంలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు. దీంతో ఆయనను కలిసేందుకు టీఆర్ఎస్ అగ్రనేతలు ప్రయత్నించడంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఆసుపత్రివద్ద పోలీసులు టీఆర్ఎస్ నేతలను అడ్డుకోవడంతో ఆసుపత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అంతకు మునుపు న్యాయవాదులు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. వీరిని కూడా పోలీసులు నిరాకరించడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 8:27 am

ముసలాళ్లతో కూడా నటిస్తా: శృతి హాసన్

కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తండ్రి బాటలో పయనిస్తున్నట్లు కనబడుతోంది. విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. కుర్ర హీరోలు, సీనియర్ నటులతోపాటు అవసరమైతే వృద్ధ నటులతో కూడా నటిస్తానని చెపుతోందట. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో మహా బిజీగా ఉన్న ఈ తార తాజాగా టాలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం యువహీరో సిద్ధార్ద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. పనిలోపనిగా షూటింగ్ మధ్యలో తెలుగు భాషను నేర్చుకునేందుకు కసరత్తు చేస్తోందట. తెలుగు భాషను నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కొందరు యువహీరోలు శృతికి అప్పుడప్పుడు తెలుగు భాషపై క్లాసులు తీసుకుంటున్నారట. యువహీరోల తెలుగు భాష బోధనతో శృతికి తెలుగుపై త్వరలోనే పట్టు సాధించేస్తుందని టాలీవుడ్ సినీజనం అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2009 | 6:57 am

ఇకపై.. అమ్మాయిల వెంట.. మా అబ్బాయి...: కింగ్

అక్కినేని వంశం నుంచి తెలుగు చిత్ర సీమను యువసామ్రాట్‌గా శాసిస్తున్న నటుడు నాగార్జున. నాగార్జున హీరో అయినప్పటి నుంచి కామాక్షిమూవీస్ అధినేత శివప్రసాద్‌రెడ్డి ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ఇప్పటివరకు 25 సంవత్సరాలు పూర్తయింది. అందుకు గుర్తుగా మళ్లీ అక్కినేని నాగార్జునతో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించారు. దీనికి "కేడి" అనే పేరు పెట్టారు.ప్రశ్న: "కేడి" అనే టైటిల్ పెట్టడానికి కారణం?ఈ చిత్రంలో పాత్రపరంగా కేడి పనులు చేస్తుంటాను. అందుకే సరైన టైటిల్ అని దాన్ని పెట్టాం. ప్రశ్న: ఎవరికి "కేడి"? అమ్మాయిలకా?జ: కానేకాదు. మనుషుల్ని మాయచేసి బతికేస్తుంటాను. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్.ప్రశ్న: రొమాన్స్ చిత్రాలు చేసే మీరు ఒక్కసారిగా ట్రెండ్ మార్చేందుకు కారణం?జ: ఎన్నిరోజులు రొమాన్స్ చేయమంటారు. ఇంకా అమ్మాయిల చుట్టూ తిరగాలా? దానికి మా అబ్బాయి ఉన్నాడు. (పెద్దగా నవ్వుతూ) వాడే చూసుకుంటాడు. వయస్సును బట్టి కూడా కథలు ఎంపిక చేసుకోవాలి కదా.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2009 | 6:55 am

డార్జిలింగ్ భూ కుంభకోణ నిందితులపై కఠిన చర్య: కేంద్రం

డార్జిలింగ్ భూ కుంభకోణం కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్ళం రాజు స్పష్టం చేశారు. కాగా, 290 కోట్ల రూపాయల విలువ చేసే భూకుంభకోణంలో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు నిందితుడిగా తేలిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 1 Dec 2009 | 6:05 am

ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు సమిష్టి పోరు: సోనియా

దేశంలో ఎయిడ్స్ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేందుకు సమిష్టి పోరు చేయాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూఢిల్లీలో రెడ్ రిబ్బన్ ఎక్స్‌ప్రెస్‌కు ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎయిడ్స్ నిర్మూలనకు కేంద్రంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ అధిక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.
Source: జాతీయ | 1 Dec 2009 | 4:33 am

లిబర్హాన్ నివేదికపై చర్చ: వచ్చే వారానికి వాయిదా!

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరిపిన డాక్టర్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిటీ సమర్పించిన నివేదికపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టలేదు. ఈ కమిషన్‌ నివేదిక పూర్తిగా ఆంగ్లంలో ఉంది. దీన్ని హిందీలోకి తర్జుమా చేసి ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. దీంతో ఈ నివేదికపై జరగాల్సిన చర్చను వచ్చే వారానికి వాయిదా పడింది.
Source: జాతీయ | 1 Dec 2009 | 2:53 am