లాభాలతో కొనసాగుతున్న విదేశీ మార్కెట్లు

మంగళవారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 3.30 గంటలకు యూరప్, ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 3.30 గంటల ప్రాంతంలో 246 పాయింట్ల భారీ లాభంతో 17,172 పాయింట్ల మార్కును తాకింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 95 పాయింట్లు భారీగా పుంజుకుని 5,127 మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 92 పాయింట్ల లాభంతో 5,282 పాయింట్ల వద్ద లాభాలతో కొనసాగుతోండగా, డాక్స్ కూడా 111 పాయింట్ల లాభంతో 5,737 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.అలాగే ఆసియా మార్కెట్లు కూడా మంగళవారం లాభాల బాటలో ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా నికాయ్ 225 సూచీ.. 226 పాయింట్లు పుంజుకుని 9,572 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. హాంగ్ షెంగ్ 291 పాయింట్లు భారీగా వృద్ధి చెంది, 22,113 పాయింట్ల వద్ద పయనిస్తోంది. అదేవిధంగా అమెరికా స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాలతో ముగిశాయి.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 8:27 am

లిబర్హాన్ నివేదికపై చర్చ: వచ్చే వారానికి వాయిదా!

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరిపిన డాక్టర్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిటీ సమర్పించిన నివేదికపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టలేదు. ఈ కమిషన్‌ నివేదిక పూర్తిగా ఆంగ్లంలో ఉంది. దీన్ని హిందీలోకి తర్జుమా చేసి ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. దీంతో ఈ నివేదికపై జరగాల్సిన చర్చను వచ్చే వారానికి వాయిదా పడింది.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 8:22 am

పుంజుకున్న వాటాల కొనుగోళ్లు: సెన్సెక్స్ పై.. పైకి..!

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు అన్ని విధాలా కలిసొచ్చింది. ట్రేడింగ్ ప్రారంభం నుంచి లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 208 పాయింట్లు పుంజుకుని, 17,134 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 65 పాయింట్లు బలపడి, 5,097 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 8:19 am

లాడెన్ సమాచారం ఉంటే మాతో పంచుకోండి: గిలానీ

అంతర్జాతీయ తీవ్రవాది, అల్‌ఖైదా ఉగ్రవాద సంస్థ చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు సంబంధించిన సమాచారం బ్రిటన్, అమెరికా నిఘా వర్గాల వద్ద ఉంటే తమతో పంచుకోవాలని పాకిస్థాన్ ప్రధాని యూసఫ్ రజా గిలానీ విజ్ఞప్తి చేశారు. లాడెన్ ఎక్కడ ఉన్నాడో తెలిపితే తప్పకుండా తమ దేశం చర్యలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 7:55 am

కేసీఆర్ ఆరోగ్యం భేష్... తరలించవద్దు: కోర్టు ఆదేశం

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం భేషుగ్గా ఉందని, అందువల్ల ఆయనను ఖమ్మం సబ్ జైలు నుంచి తరలించాల్సిన పని లేదని ఖమ్మం జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, తనను వేరే ఆస్పత్రికి మార్చాలని కేసీఆర్ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 7:33 am

లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 169 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా ర్యాలీని కొనసాగిస్తోంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 169 పాయింట్ల మేర పుంజుకుని 17,096 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 55 పాయింట్లు బలపడి, 5,088 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 7:09 am

ఆర్‌డీ చేయండి..బీమా పొందండి: సెంట్రల్ బ్యాంక్

దేశంలో రికరింగ్ డిపాజిట్ (ఆర్‌డీ) స్కీంను కొత్త తరహాలో ప్రవేశపెడుతున్నామని, ఇందులో తమ బ్యాంక్ ఖాతాదారులు ఆర్‌డీ ఖాతాను ప్రారంభిస్తే వారికి వ్యక్తిగత ప్రమాద బీమాను వర్తింపజేస్తామని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంగళవారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 7:02 am

ముసలాళ్లతో కూడా నటిస్తా: శృతి హాసన్

కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ తండ్రి బాటలో పయనిస్తున్నట్లు కనబడుతోంది. విలక్షణ నటిగా పేరు తెచ్చుకోవాలని తాపత్రయపడుతోంది. కుర్ర హీరోలు, సీనియర్ నటులతోపాటు అవసరమైతే వృద్ధ నటులతో కూడా నటిస్తానని చెపుతోందట. ఇప్పటికే బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలతో మహా బిజీగా ఉన్న ఈ తార తాజాగా టాలీవుడ్‌పై దృష్టి సారించింది. ప్రస్తుతం యువహీరో సిద్ధార్ద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. పనిలోపనిగా షూటింగ్ మధ్యలో తెలుగు భాషను నేర్చుకునేందుకు కసరత్తు చేస్తోందట. తెలుగు భాషను నేర్చుకోవడం మొదలుపెట్టిన దగ్గర్నుంచి కొందరు యువహీరోలు శృతికి అప్పుడప్పుడు తెలుగు భాషపై క్లాసులు తీసుకుంటున్నారట. యువహీరోల తెలుగు భాష బోధనతో శృతికి తెలుగుపై త్వరలోనే పట్టు సాధించేస్తుందని టాలీవుడ్ సినీజనం అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2009 | 6:57 am

ఇకపై.. అమ్మాయిల వెంట.. మా అబ్బాయి...: కింగ్

అక్కినేని వంశం నుంచి తెలుగు చిత్ర సీమను యువసామ్రాట్‌గా శాసిస్తున్న నటుడు నాగార్జున. నాగార్జున హీరో అయినప్పటి నుంచి కామాక్షిమూవీస్ అధినేత శివప్రసాద్‌రెడ్డి ఏర్పడిన పరిచయం స్నేహంగా మారి ఇప్పటివరకు 25 సంవత్సరాలు పూర్తయింది. అందుకు గుర్తుగా మళ్లీ అక్కినేని నాగార్జునతో ఓ కొత్త చిత్రాన్ని నిర్మించారు. దీనికి "కేడి" అనే పేరు పెట్టారు.ప్రశ్న: "కేడి" అనే టైటిల్ పెట్టడానికి కారణం?ఈ చిత్రంలో పాత్రపరంగా కేడి పనులు చేస్తుంటాను. అందుకే సరైన టైటిల్ అని దాన్ని పెట్టాం. ప్రశ్న: ఎవరికి "కేడి"? అమ్మాయిలకా?జ: కానేకాదు. మనుషుల్ని మాయచేసి బతికేస్తుంటాను. ఇదొక యాక్షన్ ఎంటర్‌టైనర్.ప్రశ్న: రొమాన్స్ చిత్రాలు చేసే మీరు ఒక్కసారిగా ట్రెండ్ మార్చేందుకు కారణం?జ: ఎన్నిరోజులు రొమాన్స్ చేయమంటారు. ఇంకా అమ్మాయిల చుట్టూ తిరగాలా? దానికి మా అబ్బాయి ఉన్నాడు. (పెద్దగా నవ్వుతూ) వాడే చూసుకుంటాడు. వయస్సును బట్టి కూడా కథలు ఎంపిక చేసుకోవాలి కదా.
Source: Yahoo! Telugu: Entertainment | 1 Dec 2009 | 6:55 am

డార్జిలింగ్ భూ కుంభకోణ నిందితులపై కఠని చర్య: కేంద్రం

డార్జిలింగ్ భూ కుంభకోణం కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్ళం రాజు స్పష్టం చేశారు. కాగా, 290 కోట్ల రూపాయల విలువ చేసే భూకుంభకోణంలో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు నిందితుడిగా తేలిన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 6:23 am

లంక అధ్యక్ష ఎన్నికలు: లంక తమిళుల ప్రతినిధి పోటీ!

వచ్చే యేడాది జనవరి 26వ తేదీన జరుగనున్న శ్రీలంక అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక తమిళుల తరపున తమిళ్ దేశీయ కూట్టమైప్పు ఆధ్వర్యంలో ఆర్.సంబంధన్ పోటీ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ అంశంపై శ్రీలంకలోని తమిళ పార్టీలకు చెందిన రాజకీయ నేతలు చర్చిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 6:08 am

వడ్డీ రేట్లలో కోత విధించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా

దేశీయ బ్యాంకింగ్ రంగంలో అగ్రగామిగానున్న బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడుల మొత్తంలో కాలవ్యవధిననుసరించి 0.25 శాతం వడ్డీ రేట్లను సవరించి తగ్గించినట్లు బ్యాంక్ ప్రకటించింది.
Source: Yahoo! Telugu: News | 1 Dec 2009 | 6:04 am

ఉప ఎన్నిక: నామినేషన్ దాఖలు చేసిన విజయమ్మ

పులివెందుల అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉప ఎన్నిక కోసం దివంగత వైఎస్సార్ సతీమణి వైఎస్.విజయలక్ష్మి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ పత్రాలను స్థానిక రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. పులివెందుల ఎమ్మార్వో కార్యాలయంలో విజయలక్ష్మి తన నామినేషన్ పత్రాలను అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 3:16 am

లిబర్హాన్ నివేదికపై చర్చ: వచ్చే వారానికి వాయిదా!

బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై విచారణ జరిపిన డాక్టర్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిటీ సమర్పించిన నివేదికపై పార్లమెంట్‌లో చర్చ చేపట్టలేదు. ఈ కమిషన్‌ నివేదిక పూర్తిగా ఆంగ్లంలో ఉంది. దీన్ని హిందీలోకి తర్జుమా చేసి ఇవ్వాలని పలువురు సభ్యులు కోరారు. దీంతో ఈ నివేదికపై జరగాల్సిన చర్చను వచ్చే వారానికి వాయిదా పడింది.
Source: జాతీయ | 1 Dec 2009 | 2:53 am

కేసీఆర్ ఆరోగ్యం భేష్... తరలించవద్దు: కోర్టు ఆదేశం

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం భేషుగ్గా ఉందని, అందువల్ల ఆయనను ఖమ్మం సబ్ జైలు నుంచి తరలించాల్సిన పని లేదని ఖమ్మం జిల్లా మేజిస్ట్రేట్ కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా, తనను వేరే ఆస్పత్రికి మార్చాలని కేసీఆర్ దాఖలు చేసుకున్న పిటీషన్‌ను కూడా కోర్టు తిరస్కరించింది.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 2:04 am

డార్జిలింగ్ భూ కుంభకోణ నిందితులపై కఠని చర్య: కేంద్రం

డార్జిలింగ్ భూ కుంభకోణం కేసులో దోషులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి పళ్ళం రాజు స్పష్టం చేశారు. కాగా, 290 కోట్ల రూపాయల విలువ చేసే భూకుంభకోణంలో ఆర్మీకి చెందిన ఉన్నతాధికారి ఒకరు నిందితుడిగా తేలిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 1 Dec 2009 | 12:53 am

కోర్టుకెళతా.. వదిలిపెట్టండయ్యా: ఖాకీలతో కేసీఆర్!

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు జైలు జీవితం ఎలా ఉంటుందో తెలిసి వచ్చినట్టుంది. మళ్ళీ జైలు గదిలోకి వెళ్లేందుకు ఆయన నిరాకరించారు. తనను కోర్టులో ప్రవేశపెట్టాలని పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. మీరు ప్రవేశపెట్టక పోయినా ఫర్వాలేదు.. తనను వదిలి పెడితే తానే వెళతానని పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.
Source: ఏపీ న్యూస్ | 1 Dec 2009 | 12:29 am

పార్లమెంట్‌కు ఎంపీల గైర్హాజరు: సోనియా సీరియస్

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయానికి కాంగ్రెస్ ఎంపీలు పలువురు గైర్హాజరయ్యారు. వారిపట్ల కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని ఆమె భావిస్తున్నారు.
Source: జాతీయ | 30 Nov 2009 | 11:53 pm

దేశ రాజధానిలో మహిళామణులకు రక్షణ శూన్యం!

దేశ రాజధాని న్యూఢిల్లీలో నివశించే మహిళలకు భద్రత కరువైంది. ఇక్కడ నివశించే నారీమణులు ఏదో విధంగా అన్యాయానికి గురవుతూనే ఉన్నారు. మహిళలను వివిధ రకాలుగా వేధించినందుకు ఇప్పటి వరకు 1200 కేసులు నమోదయ్యాయి.
Source: జాతీయ | 30 Nov 2009 | 11:32 pm

ఈనెల ఏడో తేదీ నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు!

రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈనెల ఏడో తేదీ నుంచి 23వ తేదీ వరకు నిర్వహించాలని రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. సోమవారం ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన సచివాలయంలో సమావేశమైన కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 10:39 pm

దీక్ష విరమించలేదు.. కొనసాగిస్తూనే ఉన్నా: కేసీఆర్

తాను చేపట్టిన ఆమరణ నిరాహారదీక్ష విరమించలేదని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ప్రకటించారు. పోలీసులు బలవంతం చేయడం వల్లే సోమవారం కొద్దిగా పళ్ళ రసం తీసుకుని, సెలైన్ ఎక్కించుకున్నట్టు కేసీఆర్ చెప్పుకొచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 10:28 pm

నేడు విజయలక్ష్మి నామినేషన్‌: ఏకగ్రీవమే తరువాయి!

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి మరణంతో ఖాళీ ఏర్పడిన పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ఆయన సతీమణి వైఎస్.విజయలక్ష్మి మంగళవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ దాఖలు కార్యక్రమానికి వైఎస్‌ తనయుడు, కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్‌ సోదరుడు, ఎమ్మెల్సీ వివేకానందరెడ్డి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 10:02 pm

ముంబై దాడులకు ప్రభుత్వానిదే బాధ్యత: కమిషన్

ముంబై దాడులకు ప్రభుత్వమే నైతిక బాధ్యత వహించాలని ఈ దాడులపై విచారణ జరిపి ప్రధాస్ కమిటీ తేల్చి చెప్పింది. 200 పేజీలతో కూడిన నివేదికను కమిటీ కేంద్రానికి అప్పగించింది. ఈ నివేదికలో పలు అంశాలను పొందు పరిచింది. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టింది.
Source: జాతీయ | 30 Nov 2009 | 9:13 pm

కైగా లీకేజీ.. భయమేలనోయి: ప్రధాని మన్మోహన్

కర్ణాటకలోని కైగా అణు విద్యుత్ కేంద్రంలో తాగునీటిలో ట్రీటియం అనే రేడియోధార్మిక పదార్థాలు కలిసి పోయిన ఘటనపై ప్రధాని మన్మోహన్ సింగ్ స్పందించారు. దీనిపై ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇప్పటికే దీనిపై విచారణ ప్రారంభమైందని ఆయన గుర్తు చేశారు.
Source: జాతీయ | 30 Nov 2009 | 8:45 pm

'దేవదాసు' వై.వి.ఎస్‌తో ఇలియానా డేటింగ్..!?

టాలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో కట్టి పడేస్తున్న అందాలముద్దుగుమ్మ, పొడవుకాళ్ల సుందరి ఇలియానా ఈ మధ్య వై.వి.ఎస్‌తో ప్రేమాయణం సాగిస్తోందన్న వార్తలు ఫిలిమ్ నగర్‌లో వినిపిస్తున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమకు "దేవదాసు" చిత్రం ద్వారా ఇలియానాను వై.వి.ఎస్ పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఆ చిత్రం నుంచి ఇలియానా, వైవిఎస్‌తో ప్రేమాయణం కొనసాగిస్తుందని, ఇంకా వీరిద్దరి మధ్య డేటింగ్ కూడా జరుగుతుందని సినీ జనం చెవులుకొరుక్కుంటున్నారు.విష్ణువర్ధన్, ఇలియానాలు జంటగా నటించిన "సలీమ్" చిత్ర ఆడియో వేడుకలో ఇలియానాపై వై.వి.ఎస్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమెను శ్రీదేవి, సిమ్రాన్‌లతో పోల్చి మునగచెట్టు ఎక్కించేశాడు. ఇదంతా ఇలియానాపై ఉన్న ప్రేమతోనే వై.వి.ఎస్. మాట్లాడినట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఇలియానా కూడా టాలీవుడ్‌లో తానొకరిని ప్రేమిస్తున్నానని తన సన్నిహితుల దగ్గర చెబుతోందట. అంతేకాదు.. ఇలియానా, వై.వి.ఎస్ మాటలు చూస్తుంటే వీరిద్దరి మధ్య ఎఫైర్ కొనసాగుతోందని టాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Nov 2009 | 11:31 am

వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వంలో "బద్మాష్"

గాయకుడు, సంగీత దర్శకుడైన వందేమాతరం శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడిగా అవతారమెత్తారు. "బద్మాష్" పేరిట వందేమాతరం శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని తెలుగుదేశం పార్టీకి చెందిన పారిశ్రామికవేత్త డాక్టర్ జి. నాగయ్య నిర్మిస్తున్నారు.ఇందులో నాగ సిద్ధార్థ్ హీరోగా, ఏక్తా హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభమైంది. తొలిషాట్‌కు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు క్లాప్ కొట్టగా, హీరో గోపిచంద్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Nov 2009 | 10:34 am

ఒక్క పూట ఉపవాసం ఉండలేని కేసీఆర్: గద్దర్ ధ్వజం

"ఈ కేసీఆర్.. ఒక్క పూట ఉపవాసం ఉండలేడు. ఇలాంటి వాళ్ళా ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం తెచ్చేది" అని ప్రజాగాయకుడు గద్దర్ ధ్వజమెత్తారు. ఆమరణ దీక్షకు దిగిన కేసీఆర్ 33 గంటలు కూడా పూర్తికాకముందే దీక్ష విరమించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 8:36 am

పులివెందుల ఉప సమరానికి తెదేపా దూరం: బాబు

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 19వ తేదీన జరుగనున్న ఉప ఎన్నిక పోటీకి ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ దూరంగా ఉంటుందని ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సోమవారం స్వయంగా ప్రకటించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 7:38 am

తెరాసది పైశాచిక వికృత రాజకీయ క్రీడ: జేపీ

గత రెండు రోజులుగా తెలంగాణా రాష్ట్ర సమితి చేసిన ఆందోళనపై లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ తీవ్రంగా స్పందించారు. ఈ పరిణామాలను సంప్రదాయ ఓట్ల కోసం తెలంగాణా రాష్ట్ర సమితి ఆడిన పైశాచిక రాజకీయ క్రీడగా అభివర్ణించారు.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 7:26 am

పళ్లరసం తాగి దీక్ష విరమించిన తెరాస అధినేత!

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహార దీక్ష విరమించారు. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో వైద్యుల సలహా మేరకు దీక్ష ఉపసంహరించుకున్నారు. గత రెండు రోజులుగా ఖమ్మం సబ్‌జైలులో కారాగారవాసం చేసిన కేసీఆర్‌ను ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం మధ్యాహ్నం ఖమ్మం జిల్లా కేంద్రంలోని మహాత్మాగాంధీ ఆస్పత్రికి తరలించిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 6:37 am

తీవ్రవాది కసబ్ న్యాయవాది తొలగింపు: ప్రత్యేక కోర్టు

ముంబై దాడుల్లో సజీవంగా పట్టుబడిన పాకిస్థాన్ తీవ్రవాది అజ్మల్ కసబ్ తరపున వాదిస్తూ వచ్చిన న్యాయవాది అబ్బాస్ ఖజ్మీని ముంబై ప్రత్యేక కోర్టు సోమవారం అర్ధాంతరంగా తొలగించింది. కసబ్ తనకు సహకరించడం లేదంటూ తప్పుడు ప్రకటన చేసి, ఆ తర్వాత అంతా వట్టిదేనంటూ ప్రకటన చేయడం పట్ల కోర్టు ఆగ్రహించింది.
Source: జాతీయ | 30 Nov 2009 | 6:27 am

థ్రిల్లర్‌మంజు దర్శకత్వంలో ఆకాష్ హీరోగా "జయహే"

తెలుగు, కన్నడ భాషల్లో "జయహే" అనే చిత్రాన్ని థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఈ చిత్ర టైటిల్‌ను రిజిష్టర్ చేశారు. తెలుగులో ఇదే టైటిల్‌ను రిజిష్టర్ చేస్తామని, ఒక వేళ ఇదే టైటిల్ వేరే సినిమాకు ఉంటే మారుస్తామని ఆదివారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంజు అన్నారు. ఇందులో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడని మంజు చెప్పారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఆకాష్, థ్రిల్లర్‌మంజులతో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న గౌరిపండిట్, అయేషాపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Nov 2009 | 4:40 am

సైబర్‌క్రైమ్ నేపథ్యంలో సాగే "యు అండ్ ఐ"

సైబర్‌క్రైమ్ అంశాన్ని టచ్‌చేస్తూ "యు అండ్ ఐ" చిత్రం రూపొందింది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆదివారం నాడు చిత్ర దర్శకుడు రంజిత్ బెల్లూరి పలు విషయాలు తెలియజేశారు. ఈ కథలో ప్రధానంగా హీరో రోహన్ పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు అందుకు అనుగుణంగా తాము చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాలేజీల్లోనూ పెద్ద పెద్ద మాల్స్‌లోనూ బాక్స్ పెట్టి పుస్తకాలను అందులో వేస్తే వాటిని పేదవారికి అందించే ఏర్పాటు చేస్తామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Nov 2009 | 4:27 am

'కైగా' నుంచి అణుధార్మిక పదార్థాల లీకేజీ లేదు: గుప్తా

కర్ణాటక రాష్ట్రంలోని కైగా అణు విద్యుత్ కేంద్రం నుంచి ట్రీటియం అనే రేడియోధార్మిక పదార్థం లీకేజీ కాలేదని కేంద్రానికి చెందిన సీనియర్ శాస్త్రవేత్తలు సోమవారం స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆందోళన చెందాల్సిన పని లేదని వారు అంటున్నారు. సీనియర్ శాస్త్రవేత్తలతో కలిసి కైగా అణు విద్యుత్ కేంద్రంలోని స్టేషన్ డైరక్టర్ జేపీ.గుప్తా సోమవారం మీడీయాతో మాట్లాడారు.
Source: జాతీయ | 30 Nov 2009 | 3:57 am