|
పుంజుకున్న కొనుగోళ్లు: సెన్సెక్స్ 340 పాయింట్ల వృద్ధిమెటల్, రియాల్టీ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ లాభాలను నమోదు చేసుకుంటోంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి భారీ లాభాల్లో పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 340 పాయింట్ల మేర పుంజుకుని 16,972 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 105 పాయింట్లు లాభపడి, 5,046 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 8:41 am జీడీపీ వృద్ధిరేటు ప్రకటన: వృద్ధి బాటలో సెన్సెక్స్కేంద్ర ప్రభుత్వం సోమవారం జీడీపీ వృద్ధిరేటును ప్రకటించండం ద్వారా సెన్సెక్స్ వృద్ధి బాటలో కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ముగిసిన రెండో త్రైమాసికంలో జీడీపీ రేటు 7.9 శాతంగా నమోదైంది. దీంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 375 పాయింట్లు భారీగా లాభపడి, 17,007 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 121 పాయింట్లు వృద్ధి చెంది, 5,063 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 8:32 am అన్ని జిల్లాల్లో బంద్ ప్రశాంతం: హోమం మంత్రి సబితతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసగా ఆ పార్టీ ఇచ్చిన బంద్ ప్రభావం అన్ని తెలంగాణా జిల్లాల్లో ఉందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ బంద్‌లో కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 8:30 am మంత్రులందరూ పులివెందులకు రండి: అరుణ పిలుపుదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి నామినేషన్ వేయనున్న సందర్భంగా మంత్రులు పులివెందుల రావాల్సిందిగా కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గల్లా అరుణకుమారి కోరారు.రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో విజలక్ష్మి నామినేషన్‌పై చర్చ జరిగింది.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 8:23 am లడఖ్‌లో రహదారి నిర్మాణం చేపట్టొద్దు: చైనాలడఖ్లో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద నిర్మిస్తున్న రహదారిని చైనీయులు అడ్డుకున్నారు. లడఖ్‌లోని డెమ్‌చుక్ ప్రాంతంలో రహదారి నిర్మాణంలో ఉన్నవారిని చైనా భద్రతా దళాలు అడ్డుకుని రహదారి నిర్మాణం చేపట్టవద్దని బెదిరించినట్లు తెలిసింది. దీంతో భారత్‌పై చైనా విద్వేషపూరిత వైఖరిని వ్యవహరిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రహదారి నిర్మాణం చేపట్టవద్దంటూ చైనా భద్రతా దళాలు అడ్డుకున్న విషయాన్ని జమ్మూ-కాశ్మీర్ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 8:09 am లాభాల్లో స్టాక్ మార్కెట్: 17వేల మార్కును తాకిన సెన్సెక్స్వారాంతమైన శుక్రవారం భారీ నష్టాలతో 16వేల మార్కుకు పడిపోయిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే భారీ లాభాలను నమోదు చేసుకోవడంతో 17వేల మార్కును తాకింది. దేశీయ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడం, ఆసియా, అమెరికా మార్కెట్ల ట్రేడింగ్ ఊపందుకోవడం వంటి కారణాలతో సెన్సెక్స్ సోమవారం ఆశాజనకంగా కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 7:40 am కొరియర్ సంస్థను ప్రారంభించాలనుకుంటే...ప్రస్తుతం మన దేశంలో పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలలో చాలా కొరియర్ కంపెనీలు విస్తారంగా వ్యాపించివున్నాయి. కాని చిన్న పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో వీటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఇలాంటి పట్టణాలు, పెద్ద పెద్ద గ్రామాల్లో కొరియర్ సంస్థను స్థాపిస్తే లాభసాటిగా ఉంటుంది. కొరియర్ సంస్థను స్థాపించేందుకు ఏ విద్యాలయం కూడా ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ ఇవ్వడం లేదు. కాబట్టి మీరు కొరియర్ సంస్థను స్థాపించాలనుకుంటే ఏదైనా కొరియర్ సంస్థలో ఒకటి లేదా రెండు సంవత్సరాలు పనిచేయండి.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 7:34 am తెరాస బంద్ పిలుపు: అవస్థలు పడుతున్న ప్రయాణికులుతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ ప్రాంతాల్లో రవాణా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తెరాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బస్సులు డిపోలు దాటి ముందుకు కదలలేదు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 6:46 am అమ్మకాల్లో జోరందుకోనున్న ద్విచక్ర వాహనాలుదేశంలోని యువత వచ్చే ఆరు నెలల కాలంలో ద్విచక్ర వాహనాలను విరివిగా కొంటారని తాము నిర్వహించిన సర్వేలో తేలినట్లు బోస్టన్ ఎనాలిటిక్స్ సంస్థ తెలిపింది. దీనికంతటికి కారణం దేశంలోని పలు బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించాయని, దీంతో యువత ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేసేందుకు డబ్బును ఎక్కువగా ఖర్చు చేస్తారని సంస్థకు చెందిన అధికారులు వెల్లడించారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 6:35 am జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా అరెస్టుజార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను ఆ రాష్ట్ర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హవాలా కుంభకోణానికి సంబంధించిన విచారణకు గైర్హాజరు కావడంతో ఆయనను చాయ్‌బాసా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి ఆ రాష్ట్ర రాజధాని రాంచీకి మధుకోడాను తరలించనున్నారు.Source: Yahoo! Telugu: News | 30 Nov 2009 | 6:31 am థ్రిల్లర్‌మంజు దర్శకత్వంలో ఆకాష్ హీరోగా "జయహే"తెలుగు, కన్నడ భాషల్లో "జయహే" అనే చిత్రాన్ని థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో రూపొందుతోంది. ఇప్పటికే బెంగళూరులో ఈ చిత్ర టైటిల్‌ను రిజిష్టర్ చేశారు. తెలుగులో ఇదే టైటిల్‌ను రిజిష్టర్ చేస్తామని, ఒక వేళ ఇదే టైటిల్ వేరే సినిమాకు ఉంటే మారుస్తామని ఆదివారం నాడు ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మంజు అన్నారు. ఇందులో ఆకాష్ హీరోగా నటిస్తున్నాడని మంజు చెప్పారు. ఆదివారం అన్నపూర్ణ స్టూడియోలో ఆకాష్, థ్రిల్లర్‌మంజులతో పాటు హీరోయిన్లుగా నటిస్తున్న గౌరిపండిట్, అయేషాపై ముహూర్తపు షాట్ చిత్రీకరించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Nov 2009 | 4:40 am సైబర్‌క్రైమ్ నేపథ్యంలో సాగే "యు అండ్ ఐ"సైబర్‌క్రైమ్ అంశాన్ని టచ్‌చేస్తూ "యు అండ్ ఐ" చిత్రం రూపొందింది. ఇప్పటికే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి ఆదివారం నాడు చిత్ర దర్శకుడు రంజిత్ బెల్లూరి పలు విషయాలు తెలియజేశారు. ఈ కథలో ప్రధానంగా హీరో రోహన్ పుస్తకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తాడు అందుకు అనుగుణంగా తాము చిత్ర ప్రమోషన్‌లో భాగంగా కాలేజీల్లోనూ పెద్ద పెద్ద మాల్స్‌లోనూ బాక్స్ పెట్టి పుస్తకాలను అందులో వేస్తే వాటిని పేదవారికి అందించే ఏర్పాటు చేస్తామన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Nov 2009 | 4:27 am అన్ని జిల్లాల్లో బంద్ ప్రశాంతం: హోమం మంత్రి సబితతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసగా ఆ పార్టీ ఇచ్చిన బంద్ ప్రభావం అన్ని తెలంగాణా జిల్లాల్లో ఉందని రాష్ట్ర హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఈ బంద్‌లో కొన్ని చెదురుముదురు సంఘటనలు మినహా బంద్ ప్రశాంతంగా జరిగిందని ఆమె తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 3:00 am మంత్రులందరూ పులివెందులకు రండి: అరుణ పిలుపుదివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి నామినేషన్ వేయనున్న సందర్భంగా మంత్రులు పులివెందుల రావాల్సిందిగా కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి గల్లా అరుణకుమారి కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య సీఎల్పీ నేతగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో విజలక్ష్మి నామినేషన్‌పై చర్చ జరిగింది.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 2:53 am తెరాస బంద్ పిలుపు: అవస్థలు పడుతున్న ప్రయాణికులుతెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ ప్రాంతాల్లో రవాణా రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ అష్టకష్టాలు పడుతున్నారు. తెరాస ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ వ్యాప్తంగా బస్సులు డిపోలు దాటి ముందుకు కదలలేదు.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 1:16 am జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా అరెస్టుజార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను ఆ రాష్ట్ర పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. హవాలా కుంభకోణానికి సంబంధించిన విచారణకు గైర్హాజరు కావడంతో ఆయనను చాయ్‌బాసా జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అక్కడ నుంచి ఆ రాష్ట్ర రాజధాని రాంచీకి మధుకోడాను తరలించనున్నారు.Source: జాతీయ | 30 Nov 2009 | 1:01 am ఖమ్మం సబ్‌జైల్లోని కేసీఆర్ ఆరోగ్యం భేష్: వైద్యులుఖమ్మం జిల్లా సబ్ జైలులో ఉన్న తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోగ్యం బేషుగ్గా ఉన్నట్టు సోమవారం ఉదయం ఆయనను పరీక్షించిన వైద్యులు వెల్లడించారు. రక్తపుపోటు, షుగర్ పరిణామాలు తగు మోతాదులోనే ఉన్నట్టు వారు తెలిపారు. అయితే, జైలులో సి క్లాస్ సెల్‌లో ఉన్న ఆయన అక్కడే నిరాహారదీక్ష చేస్తున్నారు. ఈ దీక్ష సోమవారానికి రెండో రోజుకు చేరుకుంది.Source: ఏపీ న్యూస్ | 30 Nov 2009 | 12:45 am వేలాది మంది సిబ్బందిలో రేడియోధార్మిక ప్రభావం!కర్ణాటక రాష్ట్రంలోని కైగా అణు విద్యుత్ కేంద్రంలో ట్రటియం అనే రేడియోధార్మిక పదార్థం కలిసిన నీటిని సేవించడం వల్ల వేలాది మంది సిబ్బంది శరీరాల్లో ఈ పదార్ధం ప్రభావం ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరంతా పర్మినెంట్ ఉద్యోగులా లేక కాంట్రాక్టు ఉద్యోగులా అని చెప్పడం కష్టతరమని అణు విద్యుత్ కేంద్ర ఉన్నతాధికారులు అంటున్నారు.Source: జాతీయ | 30 Nov 2009 | 12:19 am పోలీసు ఉన్నతాధికారి రవీంద్రను డిస్మిస్ చేయాలిఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జ్ చేయించిన పోలీసు ఉన్నతాధికారి స్టీఫెన్ రవీంద్రను తక్షణం డిస్మిస్ చేయాలని తెలంగాణా రాష్ట్ర సమితి నేత హరీష్ రావు డిమాండ్ చేశారు. దీనిపై ఆయన సోమవారం సిద్ధిపేటలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయడం అమానుష చర్యగా పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 11:54 pm కర్నూలులో పర్యటించనున్న రోశయ్య, యడ్యూరప్పరాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య, కర్ణాటక సీఎం యడ్యూరప్ప వచ్చే నెల రెండో తేదీన కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. కర్నూలు జిల్లాలోని మంత్రాలయానికి రానున్న ముఖ్యమంత్రులు.. పర్యటనలో భాగంగా రాఘవేంద్రస్వామి మఠంలో ఉత్తర, దక్షిణ ప్రాకారాలకు శంకుస్థాపన చేస్తారు.Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 11:54 pm బెంగాల్‌లో భాజపా బంద్ హింసాత్మకం: రైళ్ళ మళ్లింపు!పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఇచ్చిన 12 గంటల బంద్ పిలుపు హింసాత్మకంగా మారింది. ఆందోళనకారులు పలు బస్సులకు నిప్పు అంటించారు. వీటిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులతో వారు ఘర్షణలకు దిగారు. దీంతో బస్సు సర్వీసులను రద్దు చేయగా, పలు రైళ్ళను దారిమళ్లించారు.Source: జాతీయ | 29 Nov 2009 | 11:46 pm కేంద్ర హోం మంత్రి చిదంబరం పని తీరు భేష్!కేంద్ర హోంమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలోనే పళనియప్పన్ చిదంబరం ఎంతో మెరుగైన పనితీరును కనబరిచారు. అంతర్గత నిఘా వ్యవస్థ పటిష్టతతో పాటు వివిధ భద్రతా సంస్థల మధ్య సమన్వయం మెరుగు పడేందుకు ఆయన చేపట్టిన చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి.Source: జాతీయ | 29 Nov 2009 | 11:00 pm తెలంగాణ ఏర్పాటుకు కేసీఆర్ ప్రధాన శత్రువు: గద్దర్ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావే ప్రధాన శత్రువని ప్రజాగాయకుడు గద్దర్ ఆరోపించారు. కేవలం కేసీఆర్ ఒక్కరి వల్లే తెలంగాణా రాష్ట్రం రాదని అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలపై గద్దర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక తెలంగాణ కోసం కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్షలో లోపం ఉందని చెప్పుకొచ్చారు.Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 10:31 pm విజయలక్ష్మి ఎన్నికను ఏకగ్రీవం చేద్ధాం: రోశయ్య వినతిపులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 19వ తేదీన జరుగనున్న ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న వైఎస్.విజయలక్ష్మిని ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు అన్ని రాజకీయపార్టీల నేతలు సహకరించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఈ అంశంపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు సీఎం ఫోన్ చేసి చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 10:30 pm తెరాస బంద్ పిలుపు: తెలంగాణా జిల్లాల్లో ప్రభావంతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణా ప్రాంతాల్లో బంద్ జరుగుతోంది. ఈ బంద్ ప్రభావం తెలంగాణాలోని అన్ని జిల్లాల్లో ఉంది. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ అధికారులు బస్సు సర్వీసులను నిలిపి వేశారు.Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 10:02 pm అతి నమ్మకం వల్లే ఓటమిపాలయ్యాం: అమర్ సింగ్ఫిరోజాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి ఓటమి చెందడానికి అతి నమ్మకమే ప్రధాన కారణమని సమాజ్‌వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి అమర్ సింగ్ అభిప్రాయపడ్డారు. పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్‌కు కంచుకోటలాంటి ఈ స్థానంలో ఆయన కోడలు డింపుల్ యాదవ్ తప్పకుండా గెలుస్తారనే ధీమా ఎస్పీ శ్రేణుల్లో ఆది నుంచి ఏర్పడిందన్నారు.Source: జాతీయ | 29 Nov 2009 | 9:17 pm కైగా అణు సంఘటనపై విచారణ: మంత్రి పృథ్విరాజ్కర్ణాటక రాష్ట్రంలోని కైగా అణు విద్యుత్ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకున్న సంఘటనపై విచారణ జరిపిస్తామని కేంద్రం శాస్త్ర సాంకేతిక శాఖ సహాయ మంత్రి పృథ్విరాజ్ చౌహాన్ తెలిపారు. ఎవరో విద్వేషంతోనే మంచినీటి కూలర్‌లో ట్రిటియం (హైడ్రోజన్-3)ని కలిపారని ఆయన అన్నారు.Source: జాతీయ | 29 Nov 2009 | 8:27 pm ఫిబ్రవరిలో 'మహేష్‌బాబు-శ్రీనువైట్ల కొత్త చిత్రం!సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా హ్యాట్రిక్ డైరక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో ఫిబ్రవరిలో ఓ భారీ చిత్రం ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్‌తో "నమో వెంకటేశా" చిత్రాన్ని నిర్మిస్తు్న యువనిర్మాతలు రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట, అనిల్ సుంకర 14 రీల్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వితీయ చిత్రంగా ఈ ప్రెస్టీజియస్ మూవీని నిర్మిస్తున్నారు. తొలిసారిగా మహేష్‌బాబు కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాను సెన్సేషనల్ హిట్ అయ్యేలా రూపొందించడానికి సాయశక్తులా ప్రయత్నిస్తామని శ్రీనువైట్ల అన్నారు. జనవరిలో "నమో వెంకటేశా" రిలీజ్ అవగానే ఫిబ్రవరిలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభిస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 10:58 am మా కంటే వాళ్లే ఎక్కువ ఎక్స్‌పోజింగ్ చేస్తారు: విద్యా మల్వాడేబాలీవుడ్ నటి "చెక్ దే ఇండియా", కిడ్నాప్ ఫేమ్ విద్యా మల్‌వాడే తెలుగులో నటిస్తానని ప్రకటించింది. అయితే బాలీవుడ్‌కు వచ్చిన దర్శకనిర్మాతలంతా మోడల్స్‌ను ఆకర్షిస్తున్నారని విమర్శిస్తోంది. తాను తెలుగు నటించడానికి సిద్ధమేనని, అందుకు తానేమీ ఆంక్షలు విధించబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను నటించిన తాజా చిత్రం ఈ నెల 29న విడుదలవుతుందని, ఇంకా రెండు బాలీవుడ్‌ల చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపింది. శనివారం నాడు హైదరాబాద్‌లో ఓ జ్యూవల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె పలు విషయాలను వెల్లడించింది. ఎక్స్‌పోజింగ్ అనేది నటిగా పెద్ద విషయం కాదని, దీన్ని ఎందుకనో మీడియా ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తుందని విద్యా మల్‌వాడే చమత్కరించింది. ఇప్పటి కల్చర్ చాలా మారిందని, పబ్‌ల్లో మాకంటే అందగత్తెలు ఎక్స్‌పోజింగ్ బాగా చేస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 8:30 am డిసెంబర్ 11న వస్తోన్న 'సలీమ్'శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మిస్తున్న "సలీం" చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. మంచు విష్ణు, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ బిగ్ఎఫ్ఎం కలిసి నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ఎగ్టిక్యూటివ్ నిర్మాత రావ్ శనివారం నాడు చిత్రం గురించి వివరిస్తూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సలీమ్.. త్వరలో సెన్సార్‌ను కూడా పూర్తిచేసుకుంటాడని చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 11వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 8:10 am ప్రేమికుల రోజున స్టార్ ట్వంటీ-20 మ్యాచ్!మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధ కళాకారుల కోసం ఓ నిధి ఏర్పాటు చేయడం కోసం క్రికెట్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని సినీ నటుడు బాలకృష్ణ శనివారంనాడు ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నామని, స్టార్‌నైట్ కార్యక్రమం వల్ల దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 7:53 am శాంతియుత ఉద్యమాన్ని హింస్మాత్మకం చేశారు: కేసీఆర్తాము శాంతియుతంగా చేపట్టిన ఉద్యమాన్ని పోలీసుల సాయంతో ప్రభుత్వం హింసాత్మకం చేసిందని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆరోపించారు. ఖమ్మం జిల్లా సబ్ జైలులో ఆయన ఆవేశంగా ప్రసంగించారు. శాంతియుతంగా నడపాలనుకున్న తమ ఉద్యమాన్ని ప్రభుత్వంతో పాటు కొందరు ఆంధ్రానేతలు హింసాత్మకంగా మార్చారని ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 5:24 am అణ్వస్త్రాల భద్రత అతి ముఖ్యం: పాక్‌కు కపూర్ సూచన!తమ ఆధీనంలో ఉన్న అణ్వస్త్రాలు సంఘ విద్రోహశక్తులు లేదా తీవ్రవాదులు/ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ సూచించారు. అణ్వస్త్రాలపై ఆధిపత్యం పరాయి చేతుల్లోకి జారకుండా చూడాలని కోరారు.Source: జాతీయ | 29 Nov 2009 | 3:58 am
|