ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం!

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆందోళనలకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. కర్ర చేత బట్టి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో యుద్ధ వాతావరణాన్నిసృష్టించారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 8:37 am

మా కంటే వాళ్లే ఎక్కువ ఎక్స్‌పోజింగ్ చేస్తారు: విద్యా మల్‌వాడే

బాలీవుడ్ నటి "చెక్ దే ఇండియా", కిడ్నాప్ ఫేమ్ విద్యా మల్‌వాడే తెలుగులో నటిస్తానని ప్రకటించింది. అయితే బాలీవుడ్‌కు వచ్చిన దర్శకనిర్మాతలంతా మోడల్స్‌ను ఆకర్షిస్తున్నారని విమర్శిస్తోంది. తాను తెలుగు నటించడానికి సిద్ధమేనని, అందుకు తానేమీ ఆంక్షలు విధించబోనని స్పష్టం చేసింది. ప్రస్తుతం తాను నటించిన తాజా చిత్రం ఈ నెల 29న విడుదలవుతుందని, ఇంకా రెండు బాలీవుడ్‌ల చిత్రాల్లో నటిస్తున్నానని తెలిపింది. శనివారం నాడు హైదరాబాద్‌లో ఓ జ్యూవల్లరీ షాప్ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె పలు విషయాలను వెల్లడించింది. ఎక్స్‌పోజింగ్ అనేది నటిగా పెద్ద విషయం కాదని, దీన్ని ఎందుకనో మీడియా ఎక్కువ ఎక్స్‌పోజ్ చేస్తుందని విద్యా మల్‌వాడే చమత్కరించింది. ఇప్పటి కల్చర్ చాలా మారిందని, పబ్‌ల్లో మాకంటే అందగత్తెలు ఎక్స్‌పోజింగ్ బాగా చేస్తారని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 8:30 am

కేసీఆర్‌ను 14 రోజుల రిమాండ్‌కు పంపిన మేజిస్ట్రేట్

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు ఖమ్మం రెండో తరగతి మేజిస్ట్రేట్ శ్రీరామమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో కేసీఆర్‌ను పోలీసులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు.. కేసీఆర్‌ను జైలుకు తరలించకుండా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డుకొని ఆటంకాలు సృష్టించాయి. గ్రేహౌండ్స్ దళాల రంగ ప్రవేశంతో వీరంతా పారిపోయారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 8:25 am

తెలంగాణా బంద్‌కు పిలుపునిచ్చిన తెరాస

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా సోవారం తెలంగాణ ప్రాంతాల్లో బంద్‌కు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. తమ బంద్ పిలుపును గౌరవించి తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని, బంద్‌లో పాల్గొని తమకు మద్దతుగా నిలవాలని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 8:17 am

డిసెంబర్ 11న వస్తోన్న 'సలీమ్'

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో డా. మోహన్ బాబు నిర్మిస్తున్న "సలీం" చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. మంచు విష్ణు, ఇలియానా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని రిలయన్స్ బిగ్ఎఫ్ఎం కలిసి నిర్మిస్తోంది. ఈ సందర్భంగా ఎగ్టిక్యూటివ్ నిర్మాత రావ్ శనివారం నాడు చిత్రం గురించి వివరిస్తూ.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న సలీమ్.. త్వరలో సెన్సార్‌ను కూడా పూర్తిచేసుకుంటాడని చెప్పారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని డిసెంబర్ 11వ తేదీన చిత్రాన్ని విడుదల చేస్తున్నామని ఎగ్జిక్యూటివ్ నిర్మాత తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 8:10 am

ప్రేమికుల రోజున స్టార్ ట్వంటీ-20 మ్యాచ్!

మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వృద్ధ కళాకారుల కోసం ఓ నిధి ఏర్పాటు చేయడం కోసం క్రికెట్ మ్యాచ్ నిర్వహించబోతున్నారు. ఈ విషయాన్ని సినీ నటుడు బాలకృష్ణ శనివారంనాడు ప్రకటించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. నవంబర్‌లోనే ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నామని, స్టార్‌నైట్ కార్యక్రమం వల్ల దీన్ని వాయిదా వేయాల్సి వచ్చిందని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Nov 2009 | 7:53 am

పాక్‌లో నెలకొన్న గందరగోళానికి ముష్ కారణం: షరీఫ్

పాకిస్థాన్‌లో నెలకొన్న అస్తవ్యస్త పరిపాలనకు, గందరగోళానికి మాజీ నియంత పర్వేజ్ ముషారఫే బాధ్యత వహించాలని ఆ దేశ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆరోపించారు. ముషారఫ్ అధికారంలో ఉండగా, తమ పార్టీ విధానాలు మరుగున పడి పోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 6:35 am

దుబాయ్ సంక్షోభంతో ఆందోళన వద్దు: విత్తమంత్రి

దుబాయ్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం వల్ల భారతీయులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ స్పష్టం చేశారు. ఈ ప్రభావం భారత్‌పై పెద్దగా చూపబోదన్నారు. చండీగఢ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 6:05 am

నక్సల్స్ ఏరివేతకు మరో ఎనిమిది బెటాలియన్లు: బీఎస్ఎఫ్

దేశంలో పెరుగుతున్న నక్సల్స్ కార్యకలాపాలను అణిచి వేసేందుకు మరో ఎనిమిది బెటాలియన్ దళాలను పంపనున్నట్టు బీఎస్ఎప్ డైరక్టర్ జనరల్ రామన్ శ్రీవాస్తవ తెలిపారు. దీనిపై ఆయన శనివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. నక్సల్స్ అణివేత కార్యకలాపాల కోసం ఇప్పటికే ఐదు బెటాలియన్ దళాల (ఐదు వేల మంది సిబ్బంది)ను పంపించామన్నారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 5:56 am

కేసీఆర్ పునరాలోచించాలి: కాంగ్రెస్ నేత వీహెచ్

ప్రత్యేక తెలంగాణపై నిరాహార దీక్ష చేపట్టే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు పునరాలోచన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచన చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య పరిధిలో లేదని.. అందుచేత దీనిపై కేసీఆర్ పునరాలోచిస్తే మంచిదని వీహెచ్ హితవు పలికారు. హింసాత్మక ఘటనల వల్ల నష్టమేనని, దీంతో తెలంగాణకు ఒరిగేదేమి లేదని వీహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 5:45 am

కేసీఆర్‌పై కేసు నమోదు: మేజిస్ట్రేట్ ఎదుట హాజరు!

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావుపై ఖమ్మం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శాంతిభద్రతలకు విఘాతం కలింగించే రీతిలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 114, 117, 202, 209 సెక్షన్ల కింది అభియోగాలు నమోదు చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 5:36 am

సౌదీ అరేబియాలో భారీ వరదలు: 106 మంది మృతి

పశ్చిమ సౌదీ అరేబియాను భారీ వరదలు ముంచెత్తాయి. భారీ వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. ఆదివారానికి వరదల్లో మరణించిన వారి సంఖ్య 106కు చేరింది. ఎడతెరపిలేతుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగానే వరదలు సంభవించినట్లు సౌదికి చెందిన ఓ అధికారి తెలిపారు. ఇంకా భారీ వరదల కారణంగా పెద్ద ఎత్తున ఇళ్లు, వంతెనలు కూలిపోయాయి. దీంతో ప్రాణనష్టం అధికంగా జరిగిందని తెలిసింది.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 5:26 am

బాబ్రీ కూల్చివేతలో వాజ్‌పేయి పాల్గొనలేదు: కళ్యాణ్ సింగ్

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతలో మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బీహారీ వాజ్‌పేయి పాల్గొనలేదని ఆ పార్టీ మాజీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ స్పష్టం చేశారు. 1992 డిసెంబరు ఆరో తేదీన ఆగ్రహోద్రుక్తులైన కరసేవకులే బాబ్రీ మసీదును కూల్చివేశారని గుర్తు చేశారు.
Source: Yahoo! Telugu: News | 29 Nov 2009 | 5:24 am

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్త వాతావరణం!

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖరరావు అరెస్టుకు నిరసనగా రాష్ట్ర రాజధానిలోని ఉస్మానియా విశ్వవిద్యాలయం రణరంగమైంది. తెలంగాణా ప్రాంతానికి చెందిన విద్యార్థులు ఆందోళనలకు దిగారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. కర్ర చేత బట్టి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో యుద్ధ వాతావరణాన్నిసృష్టించారు.
Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 3:08 am

కేసీఆర్‌ను 14 రోజుల రిమాండ్‌కు పంపిన మేజిస్ట్రేట్

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు ఖమ్మం రెండో తరగతి మేజిస్ట్రేట్ శ్రీరామమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీనితో కేసీఆర్‌ను పోలీసులు ఖమ్మం జిల్లా కేంద్రంలోని సబ్ జైలుకు తరలించారు. అంతకుముందు.. కేసీఆర్‌ను జైలుకు తరలించకుండా తెరాస శ్రేణులు పెద్ద ఎత్తున అడ్డుకొని ఆటంకాలు సృష్టించాయి. గ్రేహౌండ్స్ దళాల రంగ ప్రవేశంతో వీరంతా పారిపోయారు.
Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 2:56 am

తెలంగాణా బంద్‌కు పిలుపునిచ్చిన తెరాస

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా సోవారం తెలంగాణ ప్రాంతాల్లో బంద్‌కు ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. తమ బంద్ పిలుపును గౌరవించి తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు మూసివేయాలని, బంద్‌లో పాల్గొని తమకు మద్దతుగా నిలవాలని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 2:48 am

నక్సల్స్ ఏరివేతకు మరో ఎనిమిది బెటాలియన్లు: బీఎస్ఎఫ్

దేశంలో పెరుగుతున్న నక్సల్స్ కార్యకలాపాలను అణిచి వేసేందుకు మరో ఎనిమిది బెటాలియన్ దళాలను పంపనున్నట్టు బీఎస్ఎప్ డైరక్టర్ జనరల్ రామన్ శ్రీవాస్తవ తెలిపారు. దీనిపై ఆయన శనివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. నక్సల్స్ అణివేత కార్యకలాపాల కోసం ఇప్పటికే ఐదు బెటాలియన్ దళాల (ఐదు వేల మంది సిబ్బంది)ను పంపించామన్నారు.
Source: జాతీయ | 29 Nov 2009 | 12:27 am

కేసీఆర్ పునరాలోచించాలి: కాంగ్రెస్ నేత వీహెచ్

ప్రత్యేక తెలంగాణపై నిరాహార దీక్ష చేపట్టే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు పునరాలోచన చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సూచన చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.రోశయ్య పరిధిలో లేదని.. అందుచేత దీనిపై కేసీఆర్ పునరాలోచిస్తే మంచిదని వీహెచ్ హితవు పలికారు. హింసాత్మక ఘటనల వల్ల నష్టమేనని, దీంతో తెలంగాణకు ఒరిగేదేమి లేదని వీహెచ్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 12:15 am

కేసీఆర్‌పై కేసు నమోదు: మేజిస్ట్రేట్ ఎదుట హాజరు!

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావుపై ఖమ్మం జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల శాంతిభద్రతలకు విఘాతం కలింగించే రీతిలో ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఆయనపై ఐపీసీ 114, 117, 202, 209 సెక్షన్ల కింది అభియోగాలు నమోదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Nov 2009 | 12:06 am

బాబ్రీ కూల్చివేతలో వాజ్‌పేయి పాల్గొనలేదు: కళ్యాణ్ సింగ్

అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేతలో మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బీహారీ వాజ్‌పేయి పాల్గొనలేదని ఆ పార్టీ మాజీ నేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ స్పష్టం చేశారు. 1992 డిసెంబరు ఆరో తేదీన ఆగ్రహోద్రుక్తులైన కరసేవకులే బాబ్రీ మసీదును కూల్చివేశారని గుర్తు చేశారు.
Source: జాతీయ | 28 Nov 2009 | 11:54 pm

హరీష్‌రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు

తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె. చంద్రశేఖర రావు అరెస్టుకు నిరసనగా నిరాహారాదీక్ష చేపట్టిన ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు దీక్షలో ఉన్న పద్మా దేవేందర్, రామలింగారెడ్డి, మందకృష్ణ మాదిగ తదితరులను కూడా అదుపులోకి తీసుకున్నారు. కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమానికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 11:35 pm

మనుశర్మ విడుదల చట్ట వ్యతిరేకం లేదు: దీక్షిత్

జస్సికాలాల్ హత్య కేసులో దోషిగా తేలిన మను శర్మను పెరోల్‌పై విడుదల చేయడంలో ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని, ఈ చర్య చట్ట విరుద్ధమేమీ కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 28 Nov 2009 | 11:15 pm

సీఎల్పీ నేతగా కె.రోశయ్యే: అధిష్టానం ఆమోదం!

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభాపక్షం నేతగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్యను ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఎంపిక చేశారు. దీంతో గత 24 గంటల సస్పెన్స్‌కు తెరపడింది. కేంద్ర ఆర్థికమంత్రి ప్రణబ్‌ముఖర్జీ, రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి వీరప్ప మొయిలీ శనివారం సాయంత్రం సోనియా గాంధీని కలిశారు.
Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 10:51 pm

విష కిరణాలు లీకు: 50 మందికి అస్వస్థత!

కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉన్న కైగా అణు విద్యుత్ కేంద్రం నుంచి విష పూరిత రేడియో ధార్మిక కిరణాలు (పదార్థాలు) లీకైన కాణంగా యాభై మంది సిబ్బంది అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. ప్లాంట్‌లోని విషపూరిత నీటిని తాగడం వల్ల అస్వస్థతకు గురైనట్టు అణు కేంద్రం వర్గాలు చెపుతున్నాయి.
Source: జాతీయ | 28 Nov 2009 | 10:03 pm

కేసీఆర్ అరెస్ట్: దీక్షలో కూర్చున్న హరీష్‌రావు!

ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ఆమరణ దీక్ష చేపట్టేందుకు సిద్ధిపేట బయలుదేరిన తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర రావును ఆదివారం పోలీసులు అరెస్టు చేశారు. కేసీఆర్‌ ఆమరణ దీక్షను భగ్నం చేసేందుకు పోలీసు శాఖ వ్యూహాత్మకంగా చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... అలుగునూరు కూడలి వద్ద సిద్ధిపేటకు వెళుతున్న కేసీఆర్‌ను పోలీసులు చాకచక్యంగా అరెస్టు చేసి, ఆర్టీసీ బస్సులో వరంగల్ వైపుకు తీసుకు వెళ్లారు. ఈ సందర్భంలో వరంగల్ ఎస్పీ సజ్జనార్ కేసీఆర్‌ వెంట ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 9:10 pm

నేను "అమ్మ"ను కావాలనుకుంటున్నా: శిల్పాశెట్టి

పెళ్లయి రెండు మూడు రోజులు గడిచిందో లేదో శిల్పాశెట్టి తన కోరికల చిట్టాను విప్పుతోంది. ఎంత త్వరగా తల్లినయితే అంత త్వరగా చూసుకోవాలని కుతూహలంగా ఉందని చెపుతోంది. తల్లినయ్యేందుకు వివాహ ఘడియలు ఎప్పుడొస్తాయా.. అని ఎన్నాళ్లగానో ఎదురు చూశాననీ, అనుకున్న క్షణాలు రానే వచ్చాయనీ, దేవుడు లాంటి భర్త దొరికాడని కుంద్రాను పొగడ్తలతో ముంచెత్తుతోంది. తన భర్త రాజ్‌కు తనేంటో తెలుసనీ, అదేవిధంగా రాజ్ అంటే ఏమిటో తనకు తెలుసుననీ, వివాహానికి ముందు గత కొన్ని నెలలుగా అతడితో స్నేహం చేశానని చెపుతోంది. ఆయనలాంటి వ్యక్తి తనకు ఎవరూ తారసపడలేదని అంటోంది. తన పెళ్లిరోజు వేడుకను గురించి గుర్తు చేసుకుంటూ... ఆ రోజు మా ఇద్దరి జంటను చూసేందుకు అభిమానులు, ఫోటోగ్రాఫర్లు గోడలు, చెట్లు ఎక్కి ఎంతో ఆసక్తి కనబరచారని చెప్పుకొచ్చింది. తన హనీమూన్ వివరాల గురించి చెపుతూ... బహమాస్‌కు వెళ్లనున్నామనీ, అక్కడి అందాలను తిలికించేందుకు తన భర్త తన కుటుంబ సభ్యులందరినీ ఆహ్వానించారని అంది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 12:22 pm

అభిమానులంటే పడి చస్తాను: షెర్లిన్

హాట్ గాళ్ షెర్లిన్ చోప్రా అభిమానులను తన ప్రాణంతో సమానంగా చూసుకుంటుందట. తనను కలిసేందుకు సుదూర ప్రాంతాలనుంచి ఎంతో ప్రేమగా వచ్చినా పలు కారణాల వల్ల వారిని కలవలేకపోతుండటంపై చాలా మధనపడుతూ ఉంటుందట. అందుకే ఆమె తన బ్లాగులో అభిమానుల శుభాకాంక్షలను, పలకరింపులను చూసేందుకు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించిందట. అభిమానులకు సమాధానాలు చెప్పే సమయంలో ఎంతటి పెద్ద అవసరం వచ్చినా తల పక్కకి కూడా తిప్పదట. ముందు... అభిమానులు. తర్వాతే ఏదైనా అని ముఖం మీదే చెప్పేస్తుందట. తనను చూడాలని, తనతో మాట్లాడాలని తహతహలాడే కొందరు అభిమానులు వారి మనసుల్లో ఉన్న ఆ భావాలను సందేశాల రూపంలో పంపిస్తూ ఉంటారనీ, వాటిని చూసినపుడు తన శరీరం కొత్త ఉత్సాహానికి లోనవుతుందని మైమరిచిపోతూ చెపుతోంది. నిజంగా షెర్లిన్ అభిమానులు ఎంతో అదృష్టవంతులు కదూ...!!
Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 11:41 am

గోవా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో నాలుగు బిగ్ పిక్చర్స్!

అంతర్జాతీయ చిత్రోత్సవాలలో రిలయన్స్ బిగ్ పిక్చర్స్ నిర్మాణ సారథ్యంలో రూపొందిన నాలుగు చిత్రాలు ఎంపికయ్యాయి. ఇంటర్నేషనల్ ఫిలిమ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ)లో జనాలా, కుట్టి ష్రాంక్, ఇజోడు, షోబ్ చరిత్రో కాల్పొనిక్ అనే నాలుగు చిత్రాలు ప్రదర్శంచబడనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పై నాలుగు చిత్రాలకు నిర్మాణ సారథ్యం వహించిన ఎం.ఎస్. సత్యు మాట్లాడుతూ.. కన్నడ సినిమా ఇజోడు, షాజీ కరుణ్.. మలయాళ చిత్రం కుట్టి ష్రాంక్, బెంగాలీ సినిమా షోబ్ చరిత్రో కాల్పొనిక్ అనే సినిమాలను ప్రదర్శించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 9:56 am

వైఎస్‌కు నల్లమల అడవుల శాపమే తగిలింది: కేసీఆర్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డికి నల్లమల అడవుల శాపం తగిలి, ఆ అడవుల్లోనే శాశ్వతంగా కలిసి పోయాడని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. ఆయన శనివారం కరీంనగర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2004 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైఎస్.. శాంతి చర్చల పేరుతో నక్సలైట్లను బాహ్య ప్రపంచంలోని ఆహ్వానించారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 7:45 am

కరీనా.. నీ నగ్న వీపు ఊపులకు... కాసులు రాలవ్!!

బాలీవుడ్ సెక్సీతార కరీనా కపూర్ నటించిన కుర్బాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బొక్కబోర్లా పడింది. కరీనా తన నగ్న వీపును ప్రదర్శించడంతో ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు పెగ్గీలు కొట్టారు. చివరికి కలెక్షన్లు వారు ఆశించనంత స్థాయిలో లేకపోవడంతో నీరసించిపోయారు. ఆ సంగతి అలా ఉంటే... కరీనా వ్యతిరేక వర్గం మాత్రం కరీనా, నీ నగ్న వీపు రేంజ్ ఏమిటో తేలిపోయిందిగా... అని పగలబడి నవ్వుతున్నారట. వీపును నగ్నంగా చూపించినంత మాత్రానికే కాసులు రాలతాయని అనుకుంటే... హాలీవుడ్ చిత్రాలు అంతకంటే మించిన వసూళ్లే రాబట్టగలవని ఎగతాళి చేస్తున్నారట. భారీ అంచనాలతో కుర్బాన్ చిత్రాన్ని 38 కోట్ల రూపాయలతో నిర్మించారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ యూటీవీకి కరీనా నగ్న వీపును చూపించి ఎకాఎకిన 50 కోట్ల రూపాయలకు ఆ చిత్రాన్ని అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆ చిత్రాన్ని యూటీవి ప్రపంచవ్యాప్తంగా 17 వేల తెరలపై విడుదల చేసింది. ఆ పిదప ప్రేక్షకులు రద్దీని చూసి గుడ్లు తేలేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 6:06 am

రాష్ట్రంలో నంబర్‌ వన్ 'గజదొంగ' బాబు: కేసీఆర్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో నంబర్ వన్ గజదొంగ అని తెలంగాణా రాష్ట్ర అధినేత కె.చంద్రశేఖరరావు ఆరోపించారు. జంట నగరాల చుట్టూ ఉన్న అసైన్డ్ భూములను ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన బడా పారిశ్రామికవేత్తలే స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 5:10 am

డిసెంబర్ 3న ఎన్టీఆర్, నయనల "అదుర్స్" ఆడియో

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం "అదుర్స్". వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం అదుర్స్ చిత్రం షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ మూడో తేదీన "అదుర్స్" ఆడియోను విడుదల చేసి, డిసెంబర్ మూడోవారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమర్పకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 4:16 am

డిసెంబర్ 11న వస్తోన్న 'వాడే కావాలి'

"బంపర్ ఆఫర్" వంటి హిట్ చిత్రంలో నటించిన సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం "వాడే కావాలి". ఎస్.వి.ఆర్. మీడియా సమర్పణలో సద్గురు సినిమా, వీరూ క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో, రఘునాథ్ సోగి నిర్మించిన ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్. మీడియా సీఈవో శోభ మాట్లాడుతూ.. సాయిరామ్ శంకర్ అద్భుతమైన నటన, ఆర్.పి.పట్నాయక్ సూపర్ మ్యూజిక్‌తో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే ప్రేమ కథాంశంతో "వాడేకావాలి' సినిమా రూపొందిందని చెప్పారు. బంపర్ ఆఫర్ తర్వాత సాయిరామ్ శంకర్‌కు ఇది మరో బంపర్ హిట్ అవుతుందని, డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 3:48 am

1998 అణు పరీక్ష వంద శాతం సక్సెస్: కకోద్కర్

దేశ రక్షణ నిమిత్తం 1998లో నిర్వహించిన అణు పరీక్ష నూటికి నూరు శాతం విజయవంతమైందని భారత అణుశక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన టుటికోరిన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 1998లో నిర్వహించిన అణు పరీక్ష వంద శాతం సక్సెస్ అయింది. వివిధ పద్దతుల్లో దీన్ని పరీక్షించి నిర్ధారించాం. నూటికి నూరు శాతం విజయవంతమైందని స్పష్టం చేశారు
Source: జాతీయ | 28 Nov 2009 | 3:18 am

ఇండియన్ నయాగరా.. ఔషధీ జలపాతం "హొగెనక్కల్"

కావేరీ నదిమీద ప్రకృతి సహజసిద్ధంగా ఏర్పడిన హొగెనక్కల్ జలపాతం భారతీయ నయాగరాగా పేరుగాంచింది. తమిళనాడు రాష్ట్రంలోని ధర్మపురి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ జలపాతం, వనమూలికల ఔషధ విలువలతో అలరారుతూ సందర్శకులకు ఓ వైపు ఆహ్లాదాన్ని, మరోవైపు ఆరోగ్యాన్ని అందిస్తోంది. దక్షిణ ఆసియాలోనే అతి ప్రాచీన కార్బొనెట్ శిలలు ఉన్న ఈ జలపాతం బోటు షికారుకు కూడా పెట్టింది పేరు.
Source: వినోదం | 28 Nov 2009 | 3:08 am

తుపాకీ నీడలో శాంతి చర్చలు అసాధ్యం: శశిథరూర్

భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తుపాకీ నీడలో శాంతి చర్చలు అసాధ్యమని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ స్పష్టం చేశారు. తీవ్రవాద నిర్మూనలలో పాక్ నేతలు చేస్తున్న మాటలను చేతల్లో చూపించాలని ఆయన గట్టిగా కోరారు.
Source: జాతీయ | 28 Nov 2009 | 2:06 am

26/11 ముంబై తీవ్రవాదులపై 36 వేల బుల్లెట్లు

అది నవంబరు 26, 2008. వాణిజ్య రాజధానిలోకి చొరబడ్డ 10 మంది ఉగ్రవాదులు... ఉగ్రవాదులపై మన సెక్యూరిటీ దళాలు వదిలిన తుపాకీ గుళ్లు 36 వేలు. 10 మంది ఉగ్రవాదులలో కసబ్ మినహా మిగిలినవారి తూటాలకు మృతి చెందారు.
Source: జాతీయ | 28 Nov 2009 | 2:01 am