|
1998 అణు పరీక్ష వంద శాతం సక్సెస్: కకోద్కర్దేశ రక్షణ నిమిత్తం 1998లో నిర్వహించిన అణు పరీక్ష నూటికి నూరు శాతం విజయవంతమైందని భారత అణుశక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన టుటికోరిన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 1998లో నిర్వహించిన అణు పరీక్ష వంద శాతం సక్సెస్ అయింది. వివిధ పద్దతుల్లో దీన్ని పరీక్షించి నిర్ధారించాం. నూటికి నూరు శాతం విజయవంతమైందని స్పష్టం చేశారుSource: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 8:47 am అక్టోబరులో 6.6 శాతం మేరకు తగ్గిన ఎగుమతులు!ముగిసిన అక్టోబరు నెలలో దేశ ఎగుమతులు 6.6 శాతం తగ్గిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర పరిశ్రమల శాఖామంత్రి ఆనంద్ శర్మ తెలిపారు. అయితే, పూర్తి స్థాయి గణాంకాలను మాత్రం వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. కాగా, దేశ ఎగుమతుల శాతంలో తగ్గుదల కనిపించడం గత 2008 సంవత్సరం నుంచి ఇది వరుసగా 12వ నెల కావడం గమనార్హం.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 8:27 am భారత ఐటీ పరిశ్రమలో దుబాయ్ సంక్షోభం ఉండదు!దుబాయ్‌లో ఏర్పడిన ఆర్థిక మాంద్య ప్రభావం భారతీయ ఐటీ పరిశ్రమపై ఉండదని దేశ ఐటీ దిగ్గజ కంపెనీలైన టాటా టెలీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రో సంస్థలు అభిప్రాయపడ్డాయి. దుబాయ్ తమ కార్యకలాపాలు చాల తక్కువ మొత్తంలో సాగుతున్నాయని, అలాగే, ప్రాజెక్టులు కూడా స్వల్పంగానే ఉన్నాయని గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 7:59 am ప్రపంచ స్టాక్ మార్కెట్లు వణుకుతున్నాయి...ఈ వారాంతంలో భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ ప్రభావం వచ్చే సోమవారం ప్రారంభం మార్కెట్‌లోనూ ఉండవచ్చని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దుబాయ్ ఆర్థిక సంక్షోభం ఇప్పట్లో తీరేది కాదు కనుక దాని ప్రభావం మార్కెట్ సెంటిమెంట్‌ను బలంగా తాకుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 7:56 am హెడ్లీ-రాణాలను ప్రశ్నించడం వీలుపడదు: యూఎస్లష్కర్ తీవ్రవాదులు డేవిడ్ హెడ్లీ, తహావూర్ రాణాలను భారత దర్యాప్తు అధికారులు ప్రశ్నించడం వీలుపడదని అమెరికా స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి కొన్ని న్యాయ పరమైన చిక్కులు ఉత్పన్నమవుతున్నాయని, అందువల్ల వీరిద్దరిని ఎన్.ఐ.ఏ అధికారులు ప్రశ్నించలేరని పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 7:48 am తుపాకీ నీడలో శాంతి చర్చలు అసాధ్యం: శశిథరూర్భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తుపాకీ నీడలో శాంతి చర్చలు అసాధ్యమని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ స్పష్టం చేశారు. తీవ్రవాద నిర్మూనలలో పాక్ నేతలు చేస్తున్న మాటలను చేతల్లో చూపించాలని ఆయన గట్టిగా కోరారు.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 7:36 am 26/11 ముంబై తీవ్రవాదులపై 36 వేల బుల్లెట్లుఅది నవంబరు 26, 2008. వాణిజ్య రాజధానిలోకి చొరబడ్డ 10 మంది ఉగ్రవాదులు... ఉగ్రవాదులపై మన సెక్యూరిటీ దళాలు వదిలిన తుపాకీ గుళ్లు 36 వేలు. 10 మంది ఉగ్రవాదులలో కసబ్ మినహా మిగిలినవారి తూటాలకు మృతి చెందారు.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 7:30 am పాకిస్థాన్ దేశ ప్రధాని పదవిపై కన్నేసిన జర్దారీ?పాకిస్థాన్ దేశ ప్రధానమంత్రి పదవిపై ఆ దేశ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ కన్నేసినట్టు ఉన్నారు. అందుకే ప్రధానికి మరిన్ని అధికారాలను బదిలీ చేసేందుకు సమయాత్తమవుతున్నారు. ఇందులోభాగంగా. దేశ అణ్వస్త్రాల సంపదను కంట్రోల్ చేసే అధికారాన్ని ప్రధాని యూసఫ్ రజా గిలానీకి జర్దారీ తాజాగా అప్పగించారు.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 6:34 am భాగ్యనగరానికి రానున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదుకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని నగరంలోని కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ బి. ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు డిసెంబర్ ఒకటోతేదీ వరకు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ రాకను పురస్కరించుకుని నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రసాదరావు అన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 6:18 am కరీనా.. నీ నగ్న వీపు ఊపులకు... కాసులు రాలవ్!!బాలీవుడ్ సెక్సీతార కరీనా కపూర్ నటించిన కుర్బాన్ చిత్రం బాక్సాఫీసు వద్ద మోకాళ్లు చీరుకుపోతూ బొక్కబోర్లా పడింది. కరీనా తన నగ్న వీపును ప్రదర్శించడంతో ఆ చిత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుందని దర్శక నిర్మాతలు పెగ్గీలు కొట్టారు. చివరికి కలెక్షన్లు వారు ఆశించనంత స్థాయిలో లేకపోవడంతో నీరసించిపోయారు. ఆ సంగతి అలా ఉంటే... కరీనా వ్యతిరేక వర్గం మాత్రం కరీనా, నీ నగ్న వీపు రేంజ్ ఏమిటో తేలిపోయిందిగా... అని పగలబడి నవ్వుతున్నారట. వీపును నగ్నంగా చూపించినంత మాత్రానికే కాసులు రాలతాయని అనుకుంటే... హాలీవుడ్ చిత్రాలు అంతకంటే మించిన వసూళ్లే రాబట్టగలవని ఎగతాళి చేస్తున్నారట. భారీ అంచనాలతో కుర్బాన్ చిత్రాన్ని 38 కోట్ల రూపాయలతో నిర్మించారు. చిత్ర నిర్మాత కరణ్ జోహార్ యూటీవీకి కరీనా నగ్న వీపును చూపించి ఎకాఎకిన 50 కోట్ల రూపాయలకు ఆ చిత్రాన్ని అమ్ముకున్నాడు. ఆ తర్వాత ఎంతో ఉత్సాహంతో ఆ చిత్రాన్ని యూటీవి ప్రపంచవ్యాప్తంగా 17 వేల తెరలపై విడుదల చేసింది. ఆ పిదప ప్రేక్షకులు రద్దీని చూసి గుడ్లు తేలేసింది.Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 6:06 am గ్రేటర్ ఎన్నికల్లో లోక్‌సత్తా' వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలకపోవడం, కేవలం ఒక్క సీటూ కూడా రాకపోవడంపై.. ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ వైఫల్యానికి తనదే బాధ్యత అని అని జయప్రకాష్ నారాయణ్ ఈ సందర్భంగా అంగీకరించారు. భవిష్యత్తులో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై పార్టీ నేతలతో జేపీ చర్చించారు.Source: Yahoo! Telugu: News | 28 Nov 2009 | 5:50 am డిసెంబర్ 3న ఎన్టీఆర్, నయనల "అదుర్స్" ఆడియోయంగ్టైగర్ ఎన్టీఆర్ కథానాయకుడిగా సెన్సేషనల్ డైరక్టర్ వి.వి. వినాయక్ దర్శకత్వంలో కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు సమర్పణలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం "అదుర్స్". వైష్ణవి ఆర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వల్లభనేని వంశీమోహన్ నిర్మిస్తున్న భారీ చిత్రం అదుర్స్ చిత్రం షూటింగ్ పూర్తయింది. డిసెంబర్ మూడో తేదీన "అదుర్స్" ఆడియోను విడుదల చేసి, డిసెంబర్ మూడోవారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమర్పకులు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 4:16 am డిసెంబర్ 11న వస్తోన్న 'వాడే కావాలి'"బంపర్ ఆఫర్" వంటి హిట్ చిత్రంలో నటించిన సాయిరామ్ శంకర్ హీరోగా నటిస్తోన్న చిత్రం "వాడే కావాలి". ఎస్.వి.ఆర్. మీడియా సమర్పణలో సద్గురు సినిమా, వీరూ క్రియేషన్స్ పతాకంపై రాజేంద్రదర్శన్ దర్శకత్వంలో, రఘునాథ్ సోగి నిర్మించిన ఈ సినిమా తొలి కాపీ సిద్ధమైంది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్. మీడియా సీఈవో శోభ మాట్లాడుతూ.. సాయిరామ్ శంకర్ అద్భుతమైన నటన, ఆర్.పి.పట్నాయక్ సూపర్ మ్యూజిక్‌తో యువతరాన్ని విశేషంగా ఆకట్టుకునే ప్రేమ కథాంశంతో "వాడేకావాలి' సినిమా రూపొందిందని చెప్పారు. బంపర్ ఆఫర్ తర్వాత సాయిరామ్ శంకర్‌కు ఇది మరో బంపర్ హిట్ అవుతుందని, డిసెంబర్ 11న ఈ చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Nov 2009 | 3:48 am 1998 అణు పరీక్ష వంద శాతం సక్సెస్: కకోద్కర్దేశ రక్షణ నిమిత్తం 1998లో నిర్వహించిన అణు పరీక్ష నూటికి నూరు శాతం విజయవంతమైందని భారత అణుశక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కకోద్కర్ స్పష్టం చేశారు. దీనిపై ఆయన టుటికోరిన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. 1998లో నిర్వహించిన అణు పరీక్ష వంద శాతం సక్సెస్ అయింది. వివిధ పద్దతుల్లో దీన్ని పరీక్షించి నిర్ధారించాం. నూటికి నూరు శాతం విజయవంతమైందని స్పష్టం చేశారుSource: జాతీయ | 28 Nov 2009 | 3:18 am తుపాకీ నీడలో శాంతి చర్చలు అసాధ్యం: శశిథరూర్భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తుపాకీ నీడలో శాంతి చర్చలు అసాధ్యమని కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి శశిథరూర్ స్పష్టం చేశారు. తీవ్రవాద నిర్మూనలలో పాక్ నేతలు చేస్తున్న మాటలను చేతల్లో చూపించాలని ఆయన గట్టిగా కోరారు.Source: జాతీయ | 28 Nov 2009 | 2:06 am 26/11 ముంబై తీవ్రవాదులపై 36 వేల బుల్లెట్లుఅది నవంబరు 26, 2008. వాణిజ్య రాజధానిలోకి చొరబడ్డ 10 మంది ఉగ్రవాదులు... ఉగ్రవాదులపై మన సెక్యూరిటీ దళాలు వదిలిన తుపాకీ గుళ్లు 36 వేలు. 10 మంది ఉగ్రవాదులలో కసబ్ మినహా మిగిలినవారి తూటాలకు మృతి చెందారు.Source: జాతీయ | 28 Nov 2009 | 2:01 am భాగ్యనగరానికి రానున్న రాష్ట్రపతి ప్రతిభా పాటిల్రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాదుకు చేరుకోనున్నారు. రాష్ట్రపతి రాష్ట్ర పర్యటనను పురస్కరించుకుని నగరంలోని కొన్ని చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ నగర పోలీస్ కమిషనర్ బి. ప్రసాదరావు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆంక్షలు డిసెంబర్ ఒకటోతేదీ వరకు అమల్లో ఉంటాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రపతి హైదరాబాద్ రాకను పురస్కరించుకుని నగరంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ప్రసాదరావు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 12:48 am గ్రేటర్ ఎన్నికల్లో లోక్‌సత్తా' వైఫల్యానికి నాదే బాధ్యత: జేపీగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీకి ఆశించిన స్థాయిలో ఓట్లు రాలకపోవడం, కేవలం ఒక్క సీటూ కూడా రాకపోవడంపై.. ఆ పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తమ పార్టీ వైఫల్యానికి తనదే బాధ్యత అని అని జయప్రకాష్ నారాయణ్ ఈ సందర్భంగా అంగీకరించారు. భవిష్యత్తులో పార్టీని ఎలా పటిష్టం చేయాలనే అంశంపై పార్టీ నేతలతో జేపీ చర్చించారు.Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 12:20 am కేసీఆర్ గృహనిర్భంధం తథ్యం: పోలీసు వర్గాలుకరీంనగర్ జిల్లా సిద్ధిపేటలో ఆమరణ నిరాహార దీక్షను చేపట్టిన తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావును దీక్షా సమయానికి ముందుగానే గృహ నిర్భంధంలో ఉంచడం ఖాయమని పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందుకు ప్రభుత్వం అనుమతి కోసం వేచి చూస్తున్నట్టు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 28 Nov 2009 | 12:17 am యేడాదికి రూ.2,000 కోట్లు వసూలు చేస్తున్న మావోలుదేశంలో అంతర్గత భద్రతకు ప్రధాన శుత్రువులుగా పరిణమించిన మావోయిస్టులు యేడాదికి రెండు వేల కోట్ల రూపాయల మేరకు బలవంతపు వసూళ్ళు చేస్తున్నారని ఛత్తీస్‌గఢ్ డీజీపీ విశ్వరంజన్ ఆరోపించారు. ఇనుము, బొగ్గు గనుల కంపెనీలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టు కాంట్రాక్టర్లు, టెండు పట్టా (బీడీ ఆకులు) బిజినెస్‌మెన్‌ల వీరు నిధులను సేకరిస్తున్నట్టు ఆయన తెలిపారు.Source: జాతీయ | 27 Nov 2009 | 11:58 pm కాంగ్రెస్‌లో చేరనున్న శివసేన చీఫ్ బాల్‌థాక్రే కోడలు!మహారాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న శివసేన పార్టీ చీఫ్ బాల్‌థాక్రేకు సొంత ఇంటి నుంచే తిరుగుబాటు ఎదురైంది. ఆయన కోడలు స్మితా థాక్రే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి శనివారం తెలిపారు.Source: జాతీయ | 27 Nov 2009 | 10:35 pm వైస్ సతీమణికి కాంగ్రెస్ బీ ఫామ్: అందుకున్న కేవీపీ!పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వైఎస్ సతీమణి వైఎస్.విజయలక్ష్మినే బరిలోకి దించాలని ఆ పార్టీ అధిష్టానం స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది. అందుకే ఆమెకు బీఫామ్‌కు అందజేసింది. ఈ పత్రానికి ఆమె తరపున వైఎస్ ప్రాణ స్నేహితుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు సహాయకుడు అందుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 10:13 pm కేసీఆర్ దీక్షకు అనుమతి ఇవ్వలేదు: ఏఎస్పీతెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖ రావు తలపెట్టిన ఆమరణ నిరాహారదీక్షకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదని సిద్ధిపేట ఏఎస్పీ విజయలక్ష్మీ స్పష్టం చేశారు. అందువల్ల ఈ దీక్షకు ఎవరు సహకరించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 9:48 pm తాగిన మైకంలో రైతును చితకబాదిన కానిస్టేబుల్!తప్ప తాగిన మైకంలో ఒక రైతుని కానిస్టేబుల్ చితకబాదిన ఉదంతం దేవనకొండ మండలం పి. కోటకొండ గ్రామంలో చోటుచేసుకుంది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు.. కానిస్టేబుల్‌ని పట్టుకుని పంచాయతీ కార్యాలయంలో నిర్భంధించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులపై గ్రామస్తులు తిరగబడ్డారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు కోటకొండ గ్రామస్తులపై లాఠీ చార్జీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 9:44 pm పౌరసత్వ గుర్తింపు కార్డులు కాదు: నందన్ నీలేకనిదేశ పౌరులకు త్వరలో జారీ చేయనన్న యునిక్ ఐడీ గుర్తింపు నంబరు ఒక వ్యక్తి పౌరసత్వ గుర్తింపును ధృవీకరించేది కాదని యునిక్ ఐడీ ప్రాజెక్టు ఛైర్మన్ నందన్ నీలేకని తెలిపారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. గుర్తింపు కార్డులో పేర్కొనే నంబరు కేవలం ఒక అఫ్షన్ మాత్రమే. అంతేకానీ, ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిర్ధారించేది కాదన్నారు.Source: జాతీయ | 27 Nov 2009 | 9:37 pm విచారణకు హాజరుకాని మధు కోడా: మళ్లీ సమన్లు!జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధుకోడా ఏసీబీ అధికారుల విచారణకు మరోమారు డుమ్మా కొట్టారు. దీంతో ఆయనకు ఏసీబీ విజిలెన్స్ కమిషనర్ మళ్లీ సమన్లు జారీ చేశారు. నాలుగు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించి ఆయన వద్ద ఏసీబీ అధికారులు విచారణ జరపాలని నిర్ణయించిన విషయం తెల్సిందే.Source: జాతీయ | 27 Nov 2009 | 8:39 pm స్నేహం కోసం భార్యనే దానం చేసే "ఆర్య-2"స్నేహితుడంటే ప్రాణమిచ్చే పాత్రలో అల్లు అర్జున్ బాగానే చేశాడు. అతని కోసం పచ్చబొట్టు పొడిపించుకోవడం, అతన్ని ఎవరేమన్నా రక్తం కళ్ళచూసే విధానం సైకోలా ఉన్నా "గే" తరహాలో అల్లుఅర్జున్ పాత్ర ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్న పాత్రను అర్జున్ పోషించాడు. డాన్స్, ఫైట్లు బాగా చేశాడు. దానికి రివర్స్ పాత్ర నవదీప్‌ది. దర్శకుడు అతని పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక కాజల్ పాత్ర అమాయకత్వం. ప్రేమకోసం ఇద్దరి మధ్య నలిగే తీరు బాగానే ప్రెజెంట్ చేసింది. శ్రద్ధాఆర్య పాత్ర సోసోగా ఉంది. రొటీన్‌గానే ఫ్యాక్షన్ లీడర్‌గా ముఖేష్‌రుషి బాగా చేశాడు. సైకాలిస్ట్‌గా బ్రహ్మానందం కాసేపు అలరించినా టోటల్‌గా చూస్తే సినిమాలో వినోదం తక్కువే.ఇక సాంకేతికపరంగా అన్ని శాఖలు బాగానే పనిచేశాయి. సాహిత్యపరంగా "రింగారింగా" పాట అలరించింది. వనమాలి, చంద్రబోస్‌లు పాటలు బాగానే రాశారు. దేవీశ్రీప్రసాద్ సంగీతం పర్వాలేదు. మొదటిభాగం ఆర్య ఛాయల్లో సాగుతూ ఎంటర్‌టైన్‌చేస్తే రెండో భాగం మొత్తం ఫ్యాక్షన్‌తో బెంబేలెత్తింపజేస్తుంది. ఇక్కడే స్క్రీన్‌ప్లే పట్టు తప్పింది.Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2009 | 9:51 am తిరుగుబాట్లు కారణంగానే ఓటమి: ధర్మపురి శ్రీనివాస్గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తిరుగుబాటు అభ్యర్థులు, ఒక వర్గం దుష్ప్రచారం చేయడం వంటి కారణాల వల్లే తాము ఆశించిన స్థానాలను కైవసం చేసుకోలేక పోయామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 6:58 am సంతృప్తినివ్వని గ్రేటర్ ఎన్నికల ఫలితాలు: మొయిలీతాజాగా వెల్లడైన గ్రేటర్ హైదరాబాద్ మనిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ఏమాత్రం సంతృప్తిని ఇవ్వలేదని కేంద్ర న్యాయ శాఖామంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అన్నారు. సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మరో కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీతో కలిసి మీడియాతో మాట్లాడారు.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 6:47 am అబ్బాయిలు నన్ను గుడ్లప్పగించి చూస్తారు... ఎందుకో?బికినీలు ధరించి పాపులరైన హాటెస్ట్ తార నీతూ చంద్రా. తెలుగులో అడపాదడపా పాత్రలు వచ్చినా హిట్ రాలేదు కానీ ప్రేక్షకులలో హీట్ కల్గించిందన్న ఇమేజ్ మాత్రం వచ్చింది. టాలీవుడ్‌లో తనకు అవకాశాలు మిణుకు మిణుకు అంటుండంతో చివరికి కోలీవుడ్‌కు తన మకాం మార్చేసింది. తన రూపం గురించి నీతును ప్రశ్నిస్తే... ఖచ్చితంగా చెప్పడం కష్టం అంటోంది. అసలు తన రూపం ఎవరిలా ఉంటుందో పోల్చుకుని చూడాలని చాలాసార్లు చాలామందిని చూసిందట. ఇంటర్నెట్‌లో తనలాంటి పోలికలున్న వ్యక్తులెవరైనా కనబడతారేమోనని తెగ వెతికిందట. కానీ ప్రయోజనం శూన్యమేనని చెపుతోంది. అంటే తనలాంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో లేరన్నమాట. అయితే తను ఎక్కడ కనబడినా అబ్బాయిలు మాత్రం కళ్లార్పకుండా గుడ్లప్పగించి అదేపనిగా చూస్తుంటారనీ, తనలో అంతగా ఆకర్షించే అంశాలు ఏమున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉంటుందని చెపుతోందట. మంచి ఆలోచనే కదా...Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2009 | 6:17 am మందిర్ ఉద్యమంలో పాల్గొన్న వాజ్‌పేయి: సింఘాల్రామజన్మభూమి ఉద్యమంలో మాజీ ప్రధాని, భారతీయ జనతా పార్టీ అగ్రనేత అటల్ బీహారీ వాజ్‌పేయి కూడా పాలుపంచుకున్నారని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ చెప్పారు. దీనిపై ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఈ ఉద్యమంలో అటల్‌జీ కూడా పాలు పంచుకున్నారు.Source: జాతీయ | 27 Nov 2009 | 6:02 am జనవరి 13న ప్రేక్షకుల ముందుకు "ఓం శాంతి"నూతన సంవత్సరం 2010, జనవరి 13న సంక్రాంతి కానుకగా "ఓం శాంతి" ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సంక్రాంతికి అందించిన "అగ్నిపర్వతం", "పెళ్లి సందడి" వంటి చిత్రాలు అద్భుత విజయాలను సాధించిన నేపధ్యంలో "ఓం శాంతి" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్న కథా చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2009 | 5:32 am డిప్యూటీ మేయర్ ఇస్తే ఎంఐఎంకు మద్దతు: తెదేపాతమకు డిప్యూటీ మేయర్ పదవిని కేటాయిస్తే మజ్లీస్ పార్టీ (ఎంఐఎం) తరపున పోటీ చేసే మేయర్ అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రధాన తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. శుక్రవారం వెల్లడైన గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా 45 సీట్లను కైవసం చేసుకుని రెండో స్థానంలో నిలిచి విషయం తెల్సిందే.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 5:02 am చైనా-పాకిస్థాన్ సంబంధాలపై ఆందోళన: మంత్రి ఆంటోనీపొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లు సైనిక పరంగా సత్ సంబంధాలు కొనసాగించడం పట్ల కేంద్ర రక్షణ మంత్రి ఏకే.ఆంటోనీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంపై భారత్ ఓ కన్నేసి ఉంచాలని ఆయన సూచించారు.Source: జాతీయ | 27 Nov 2009 | 4:27 am స్నేహం కోసం భార్యనే దానం చేసే "ఆర్య-2"స్నేహితుడంటే ప్రాణమిచ్చే పాత్రలో అల్లు అర్జున్ బాగానే చేశాడు. అతని కోసం పచ్చబొట్టు పొడిపించుకోవడం, అతన్ని ఎవరేమన్నా రక్తం కళ్ళచూసే విధానం సైకోలా ఉన్నా "గే" తరహాలో అల్లుఅర్జున్ పాత్ర ఉన్నట్లు అనిపిస్తుంది. చాలా ఎనర్జిటిక్‌గా ఉన్న పాత్రను అర్జున్ పోషించాడు. డాన్స్, ఫైట్లు బాగా చేశాడు. దానికి రివర్స్ పాత్ర నవదీప్‌ది. దర్శకుడు అతని పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇక కాజల్ పాత్ర అమాయకత్వం.Source: వినోదం | 27 Nov 2009 | 4:24 am సీఎల్పీ నేతగా కె.రోశయ్య ఏకగ్రీవ ఎన్నికకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని ఏఐసీసీ పరిశీలుగా హాజరైన కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ మీడియా ముందుకు వచ్చి ప్రకటించారు.Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 3:54 am కోర్టు ఆదేశంతో ప్రవీణ్ మహాజన్ పెరోల్‌పై విడుదలభారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ హత్య కేసులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్‌ను పెరోల్‌పై విడుదలకు కోర్టు అనుమతి ఇచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం 14 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు నట్టు దోషి కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.Source: జాతీయ | 27 Nov 2009 | 2:48 am
|