చాలా రోజుల తర్వాత ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. పాత అసెంబ్లీ హాలులో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలు హాజరయ్యారు. సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 8:45 am

ఈద్-ఉల్-అజ్‌‌హాను ఘనంగా జరుపుకున్న ముస్లింలు

ముస్లింల పవిత్రమైన పండుగ, త్యాగనిరతికి ప్రతీక అయిన ఈద్-ఉల్-అజ్‌‌హా (బక్రీద్) పండుగను ప్రపంచంలోని పలు దేశాల్లో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. అదే విధంగా భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోను శుక్రవారం జరుపుకోవడం గమనార్హం. కాని భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో రేపు అంటే శనివారం ఈ పండుగను జరుపుకోనున్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 8:41 am

'గ్రేటర్' ఓటమికి నైతిక బాధ్యత నాదే: జయప్రకాష్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 8:30 am

కోర్టు ఆదేశంతో ప్రవీణ్ మహాజన్ పెరోల్‌పై విడుదల

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ హత్య కేసులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్‌ను పెరోల్‌పై విడుదలకు కోర్టు అనుమతి ఇచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం 14 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు నట్టు దోషి కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 8:17 am

డిబిఎస్‌‌తో ఒప్పందం చేసుకున్న ఎస్‌బీఐ

దక్షిణ తూర్పు ఆసియాలో అత్యంత పెద్దదైన డిబిఎస్ బ్యాంక్‌తో భారతీయ స్టేట్ బ్యాంక్ వ్యాపార లావాదేవీలు నిర్వహించేందుకు ఒప్పందం చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 8:08 am

భారీ నష్టాల్లోనే బాంబే స్టాక్ మార్కెట్

శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొని తిరోగమనం దిశగా పయవిస్తోన్న బాంబే స్టాక్ మార్కెట్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనూ కోలుకోలేదు. దీంతో శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 325 పాయింట్లు క్షీణించి, 16,529 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. ఇదే విధంగా.. నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 98 పాయింట్ల నష్టంతో, 4,906 పాయింట్ల వద్ద నిలిచింది. ఆయిల్, గ్యాస్, క్యాపిటల్ గూడ్స్, ఐటీ, పీఎయూ, రీఎస్‌యూ, పవర్ వాటాలు అమ్మకపు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 7:58 am

బలహీనపడిన రూపాయి: 38 పైసలు మేర పతనం

రూపాయి మరోసారి బలహీనపడింది. ఆసియా మార్కెట్లు బలహీనం కావడంతో భారతదేశ రూపాయి విలువ 38 పైసలు మేర పడిపోయింది. ఇంటర్ బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్‌లో అంతకుముందు 46.82 డాలర్‌ ముగింపు విలువతో ఉన్న మార్కెట్, మరుసటి రోజు శుక్రవారం ప్రారంభమైన ఐదు నిమిషాల వ్యవధిలోనే 46.44 డాలర్‌కి పడిపోయింది.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 7:53 am

అమ్మకాల ఒత్తిడి: సెన్సెక్స్ భారీ పతనం

బాంబే స్టాక్ మార్కెట్ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురికావడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ భారీ నష్టాలను నమోదు చేసుకుంది. గురువారం కూడా ఒడిదుడుకులను ఎదుర్కొన్న సెన్సెక్స్ శుక్రవారం కూడా భారీ నష్టాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ 569 పాయింట్లు భారీగా క్షీణించి, 16,285 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 196 పాయింట్లు భారీగా పతనమై, 4,808 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 7:47 am

త్రిపుర గవర్నర్‌గా డీవై.పాటిల్ ప్రమాణ స్వీకారం!

మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త డి.వై.పాటిల్ శుక్రవారం త్రిపుర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్తీ ఛలమేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. 74 సంవత్సరాల పాటిల్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 7:17 am

భారత్-పాకిస్థాన్ విదేశాంగ మంత్రుల భేటీ లేదు!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగనున్న కామన్వెల్త్ దేశాల సదస్సులో భారత్, పాకిస్థాన్ దేశాలకు చెందిన విదేశాంగ మంత్రుల ముఖాముఖి సదస్సు ఉండబోదనే వార్తలు వస్తున్నాయి. ఈ సదస్సుకు కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.ఎం.కృష్ణ, పాక్ విదేశాంగ మంత్రి షా మొహ్మద్ ఖురేషీలు హాజరుకానున్నారు.
Source: Yahoo! Telugu: News | 27 Nov 2009 | 6:27 am

అబ్బాయిలు నన్ను గుడ్లప్పగించి చూస్తారు... ఎందుకో?

బికినీలు ధరించి పాపులరైన హాటెస్ట్ తార నీతూ చంద్రా. తెలుగులో అడపాదడపా పాత్రలు వచ్చినా హిట్ రాలేదు కానీ ప్రేక్షకులలో హీట్ కల్గించిందన్న ఇమేజ్ మాత్రం వచ్చింది. టాలీవుడ్‌లో తనకు అవకాశాలు మిణుకు మిణుకు అంటుండంతో చివరికి కోలీవుడ్‌కు తన మకాం మార్చేసింది. తన రూపం గురించి నీతును ప్రశ్నిస్తే... ఖచ్చితంగా చెప్పడం కష్టం అంటోంది. అసలు తన రూపం ఎవరిలా ఉంటుందో పోల్చుకుని చూడాలని చాలాసార్లు చాలామందిని చూసిందట. ఇంటర్నెట్‌లో తనలాంటి పోలికలున్న వ్యక్తులెవరైనా కనబడతారేమోనని తెగ వెతికిందట. కానీ ప్రయోజనం శూన్యమేనని చెపుతోంది. అంటే తనలాంటి వ్యక్తి ఈ భూ ప్రపంచంలో లేరన్నమాట. అయితే తను ఎక్కడ కనబడినా అబ్బాయిలు మాత్రం కళ్లార్పకుండా గుడ్లప్పగించి అదేపనిగా చూస్తుంటారనీ, తనలో అంతగా ఆకర్షించే అంశాలు ఏమున్నాయో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉంటుందని చెపుతోందట. మంచి ఆలోచనే కదా...
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2009 | 6:17 am

జనవరి 13న ప్రేక్షకుల ముందుకు "ఓం శాంతి"

నూతన సంవత్సరం 2010, జనవరి 13న సంక్రాంతి కానుకగా "ఓం శాంతి" ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో మెగా ప్రొడ్యూసర్ అశ్వనీదత్ సంక్రాంతికి అందించిన "అగ్నిపర్వతం", "పెళ్లి సందడి" వంటి చిత్రాలు అద్భుత విజయాలను సాధించిన నేపధ్యంలో "ఓం శాంతి" అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విభిన్న కథా చిత్రం అవుతుందని దర్శక నిర్మాతలు అంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 27 Nov 2009 | 5:32 am

చాలా రోజుల తర్వాత ప్రారంభమైన సీఎల్పీ సమావేశం

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాఖ శాసనసభాపక్ష సమావేశం శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైంది. పాత అసెంబ్లీ హాలులో జరుగుతున్న ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు ప్రణబ్ ముఖర్జీ, వీరప్ప మొయిలీలు హాజరయ్యారు. సమావేశానికి ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ అధ్యక్షత వహించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 3:16 am

'గ్రేటర్' ఓటమికి నైతిక బాధ్యత నాదే: జయప్రకాష్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎదురైన ఓటమికి పూర్తి నైతిక బాధ్యత వహిస్తున్నట్టు లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం గ్రేటర్ హైదరాబాద్ నేతలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 27 Nov 2009 | 3:01 am

కోర్టు ఆదేశంతో ప్రవీణ్ మహాజన్ పెరోల్‌పై విడుదల

భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రమోద్ మహాజన్ హత్య కేసులో జీవిత కారాగారశిక్షను అనుభవిస్తున్న ఆయన సోదరుడు ప్రవీణ్ మహాజన్‌ను పెరోల్‌పై విడుదలకు కోర్టు అనుమతి ఇచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం 14 రోజుల పాటు పెరోల్‌పై విడుదల చేస్తూ.. కోర్టు ఆదేశాలు జారీ చేసినట్టు నట్టు దోషి కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు.
Source: జాతీయ | 27 Nov 2009 | 2:48 am

త్రిపుర గవర్నర్‌గా డీవై.పాటిల్ ప్రమాణ స్వీకారం!

మహారాష్ట్రకు చెందిన విద్యావేత్త డి.వై.పాటిల్ శుక్రవారం త్రిపుర గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్తీ ఛలమేశ్వర్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలులో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. 74 సంవత్సరాల పాటిల్.. పద్మశ్రీ అవార్డు గ్రహీత.
Source: జాతీయ | 27 Nov 2009 | 1:48 am

సమితి పర్యావరణ సదస్సుకు ప్రధాని మన్మోహన్!

వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై జరుగనున్న అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మన్మోహన్ సింగ్ పాల్గొనే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర పర్యావరణ శాఖామంత్రి జైరామ్ రమేష్ తెలిపారు.
Source: జాతీయ | 27 Nov 2009 | 12:09 am

ప్రణబ్ ముఖర్జీ కనుసన్నల్లో సీఎల్పీ సమావేశం!

కేంద్ర ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ అధిష్టానం నమ్మినబంటు, రాజకీయ కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ కనుసన్నల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర శాసనసభాపక్ష సమావేశం (సీఎల్పీ) శుక్రవారం జరుగనుంది. ఈ సమావేశానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) పరిశీలకులుగా రాష్ట్ర వ్యవహారా ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీతోపాటు.. కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ కూడా హాజరువుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 11:45 pm

విధుల నుంచి తప్పుకుంటా: రాకేష్ మారియా

దివంగత ఐపీఎస్ అధికారి అశోక్ కామ్టే సతీమణి వినితా కామ్టే రాసిన "ది లాస్ట్ బుల్లెట్" అనే పుస్తకంలో తనపై విమర్శలు చేయడం పట్ల ముంబై నగర జాయింట్ కమిషనర్ (క్రైమ్) రాకేష్ మారియా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముంబై దాడుల్లో మారియా పాత్రపై పలు విమర్శలు చేశారు.
Source: జాతీయ | 26 Nov 2009 | 11:20 pm

పులివెందుల నుంచి పోటీ చేయడం లేదు: వైఎస్.జగన్

పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే, మా అమ్మ విజయలక్ష్మీ కూడా పోటీ చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేయడం లేదని ఆయన మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 10:58 pm

తిరుపతిలో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

తిరుపతిలో నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలతో సహా శ్రీ కాళహస్తి, కాణిపాకం ఆలయాలపై ఉగ్రవాదులు కన్నేశారు. వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఈ ఆలయాలతో పాటు కల్కి, ఆశ్రమంపై దాడులకు పాకిస్తాన్ ముష్కరులు పథక రచన చేస్తున్నట్లు నిఘా సంస్థలు వెల్లడించాయి. దీంతో తిరుపతి పోలీసులు అప్రమత్తమై నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 10:51 pm

"అత్తమ్మ" కోటలో పని చేయని "జగన్మో"హనాస్త్రం!

అత్తమ్మ కోటలో జగన్మోహనాస్త్రం పని చేయలేదు. సబితా ఇంద్రారెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న మహేశ్వరం (గతంలో చేవెళ్ల) నియోజకవర్గంలో జగన్ ప్రచారం చేసినప్పటికీ.. ఓటర్లు మాత్రం తిరస్కరించారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వైపు మొగ్గు చూపారు.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 10:42 pm

2012లో ప్రళయం సంభవించదు: అబ్దుల్ కలాం

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 2012లో ప్రళయం సంభవిస్తుందన్న వార్తల్లో నిజం లేదని మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం అన్నారు. ప్రళయం వస్తుందన్న అంశంపై ఎవ్వరూ భయభ్రాంతులకు లోనవ్వాల్సిన అవసరం లేదని ఆయన ప్రజలకు సూచించారు.
Source: జాతీయ | 26 Nov 2009 | 9:23 pm

బరాక్ ఒబామా బలహీనుడు: జాన్ గాల్‌టంగ్

అంతర్జాతీయ శాంతి, వికాస నెట్‌వర్క్ డైరెక్టర్ మరియు నార్వేకు చెందిన ప్రముఖ విద్వాంసుడు గాల్‌టంగ్ అహ్మదాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ... అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఓ బలహీనమైన వ్యక్తి అని, అతనో అమాయకుడని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 26 Nov 2009 | 9:22 pm

ఐశ్వర్యా... సల్మాన్ సరసన నటించవూ... ప్లీజ్‌జ్!!

ఐశ్వర్యారాయ్ సల్మాన్ ఖాన్ సరసన నటించడమా...? ఇది కుదిరే పనేనా..? ఛాన్సే లేదని అందరూ అంటారు. కానీ వీళ్లని జోడీగా చేసి సినిమా తీస్తానని బాలీవుడ్ రచయిత ఛాలెంజ్ చేస్తున్నాడు. తను కొత్తగా నిర్మించబోయే చిత్రంలో సల్మాన్ ఖాన్, ఐశ్వర్యా‌రాయ్‌లిద్దరినీ కలిపి నటింపజేస్తానని అక్తర్ చెపుతున్నాడు. ఇప్పటికే సల్మాన్ కాల్షీట్లను కూడా తీసుకున్నాడట. ఇంతకీ కథ ఏమిటని అడిగితే... ఐష్- సల్మాన్ జీవితాలను ఆధారంగా చేసుకుని సాగే ప్రేమకథ అని చెపుతున్నాడట. ఈ చిత్రానికి "అజబ్ హై ఇష్క్" అనే పేరును కూడా నిర్ణయించాడట. ఇక ఐశ్వర్యారాయ్ అంగీకారమే తరువాయి. ఇప్పటికే ఈ విషయాన్ని ఐశ్వర్య చెవిన వేశాడట. కానీ ఐష్ వద్ద నుంచి ఎటువంటి సమాధానం రాలేదని తెలిసింది. సల్మాన్-ఐష్ ఇద్దరూ కలిసి నటించిన చిత్రం "హమ్ దిల్ దే చుకే సనమ్" బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య చిగురించిన ప్రేమ కూడా అలాగే పేలిపోయిందనుకోండి. ఆ తర్వాత ఎవరికి వారు విడిపోయారు. ఐష్- అభిని వివాహమాడి జీవితంలో స్థిరపడింది.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 12:40 pm

అరకు సమీపంలో "డార్లింగ్" కోసం భారీసెట్!

బిల్లా, ఏక్‌నిరంజన్ అంటూ ప్రేక్షకులను అలరించిన యూత్ స్టార్ ప్రభాస్ "డార్లింగ్" అంటూ తెరపైకి రానున్నాడు. "మగధీర' ఫేమ్ కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాన్ని పవన్‌కళ్యాణ్ తొలిప్రేమ సినిమాకు దర్శకత్వం వహించిన కరుణాకరన్ అద్భుతంగా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై వి.వి.ఎన్.ఎస్. ప్రసాద్ "డార్లింగ్"ను నిర్మిస్తున్నారు.మాస్‌ను ఆకట్టుకునే దిశగా జతకట్టిన ప్రభాస్, కాజల్ అగర్వాల్ డార్లింగ్ సినిమా కోసం అరకు సమీపంలో రెండో కోట్ల రూపాయల వ్యయంతో భారీ సెట్‌ను నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 10:28 am

అరకులో "శంభో శివ శంభో" పాటల చిత్రీకరణ

"కిక్" హీరో రవితేజ, అల్లరి నరేష్, శివబాలాజీ, ప్రియమణి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "శంభో శివ శంభో". తమిళం "నాడోడిగళ్" సినిమాకు రీమేక్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సంబంధించిన పాటలను అరకులో చిత్రీకరిస్తున్నట్లు యూనిట్ వర్గాలు తెలిపాయి. సముద్రకని దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను సాయిగణేష్ ప్రొడక్షన్స్‌పై బెల్లంకొండ సురేష్ నిర్మిస్తున్నారు. అరకులో అల్లరి నరేష్, ప్రియమణి, రవితేజ, శివ బాలాజీలపై రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 10:24 am

26/11 మృతులకు పార్లమెంట్ ఘన నివాళి

నిరుడు పాక్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముంబై వాసులను పార్లమెంట్ గురువారం స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించింది.
Source: జాతీయ | 26 Nov 2009 | 8:32 am

నేను గొప్ప నాయకుడిని కాదు : రాహుల్‌ గాంధీ

నేను గొప్ప నాయకుడిని కాదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ తెలిపారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తాను గొప్ప నాయకుడిని మాత్రం కాదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ యువజన విభాగాలను పటిష్ట పరచడంలో ఒక ఉత్ప్రేరకుని పాత్ర మాత్రమే పోషించగలనని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 26 Nov 2009 | 8:12 am

అమీర్ ఖాన్‌కు దెబ్బలు... కత్రినా కైఫ్‌కు పసికర్లు

3 ఇడియట్స్ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ "గజినీ" అమీర్ ఖాన్ బ్యాడ్మింటన్ ఆడుతుండగా కాలికి గాయమై గ్రౌండ్లోనే కుప్పకూలాడట. దీంతో అతడిని ప్రథమ చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారట. అంతేకాదు... త్రీ ఇడియట్స్ చిత్రం ప్రారంభం నుంచి అమీర్‌కు అప్పుడప్పుడూ చిన్నచిన్న దెబ్బలు తగులుతూనే ఉన్నాయట. ఈ సంగతి తెలుసుకున్న తమిళ హీరో మాధవన్ కాలుతీసి కాలు బయట పెట్టడం లేదట. త్రీ ఇడియట్స్ నెగిటివ్ సెంటిమెంట్ బలంగా ఉందన్నమాట. అమీర్ సంగతి ఇలా ఉంటే... బాలీవుడ్ కోవా కత్రినాకైఫ్ పసికర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి కారణంగా కత్రినా శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ గణనీయంగా తగ్గిపోయిందట. అయితే తనకు పసికర్ల వ్యాధి ఉన్నదని గ్రహించని కత్రినా, గత వారమంతా షూటింగ్‌లతో మహా బిజీగా గడిపింది. గత ఆదివారం పూర్తిగా నీరసించి బెడ్‌పై నుంచి లేవలేకపోయింది. దీంతో తనకు ఏదో వ్యాధి ఉందని అనుమానం వచ్చిన కత్రినా వైద్యుని సంప్రదింస్తే... పసికర్ల వ్యాధి వున్నట్లు నిర్థారణ అయింది. దీంతో మరో రెండు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని కత్రినాకు వైద్యులు సలహా ఇచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 7:40 am

ఉగ్రవాది కసబ్‌ ఏడాది ఖర్చు రూ. 30 కోట్లు

ముంబయి ఉగ్రవాద దాడుల్లో సజీవంగా పట్టుబడ్డ తీవ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌పై గత సంవత్సర కాలంగా మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు అక్షరాలా 30 కోట్ల రూపాయలు. ఒక వ్యక్తిపై సంవత్సరానికి ఇంత ఖర్చా...? అని ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది నిజమంటున్నారు సంబంధిత అధికారగణం.
Source: జాతీయ | 26 Nov 2009 | 4:59 am

నమిత-శరత్‌బాబులు సహజీవనం చేస్తున్నారా..?!

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న బొద్దందాల ముద్దుగుమ్మ నమిత గురించి తెలియని వారంటూ ఉండరు. గ్లామర్ ఫీల్డ్‌లో బ్యూటీ క్వీన్‌గా తన హవాను కొనసాగిస్తున్న ఈమె గత కొంత కాలంగా ప్రముఖ నటుడు శరత్‌బాబుతో సహజీవనం కొనసాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.గతంలో దశావతారం హీరో కమల్ హాసన్-గౌతమి, పవన్ కళ్యాణ్- రేణు దేశ్యాయ్, సిద్ధార్థ్-సోహా, నయనతార- ప్రభుదేవాల తరహాలోనే నమిత-శరత్‌బాబులు రహస్యంగా సహజీవనం గడుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.ఈ విషయమై నమితను కదిలిస్తే.. శరత్‌బాబుతో తనకెలాంటి సంబంధం లేదని దాటవేసింది. అంతేకాదు.. ఆయన తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. ఇంకా శరత్‌బాబు మంచి మనసున్న మనిషి అని, మానవతావాది అని ప్రశంసలతో ముంచెత్తింది.ఇలా శరత్‌బాబును గురించి కితాబివ్వడం విన్న సినీ పండితులు నమిత-శరత్ బాబుల మధ్య ప్రేమాయణం నడుస్తోందని అనుకుంటున్నారు. మరి వీరి సహజీవనం ఎంతవరకు వస్తుందో వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 4:30 am

గ్రేటర్ ఎన్నికల్లో ఎన్నికైన విజేతలు

జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్నికైన అభ్యర్థుల వివరాలు... 1** అత్తాపూర్ - ఫర్హానా బేగం (ఎంఐఎం) 2** బంజారా హిల్స్- భారతీ నాయక్ (కాంగ్రెస్) 3** ఫలక్‌‌నుమా - నూర్జహాన్ బేగం (ఎంఐఎం) 4** కార్వాన్ - ఆవుల అరుణ (ఎంఐఎం) 5** సఫిల్ గూడా - మంజుల (టిడిపి) 6** ఓల్డ్ మల్కాజ్‌గిరి- ప్రేమ్‌కుమార్ (టిడిపి)
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 4:22 am

రేపు సమావేశం కానున్న కాంగ్రెస్ శాసన సభాపక్షం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సిఎల్పీ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమవుతుందని ఏఐసిసి కార్యాలయం గురువారం వెల్లడించింది. సుధీర్ఘకాలంగా సిఎల్పీ సమావేశం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలకు ఇది ఎంతో సంతోషకర విషయంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను చూస్తునే సిఎల్పీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 2:35 am

గ్రేటర్ ఉత్కంఠకు తెరపడింది... ఫలితం...హంగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ కచ్చితమైన మెజారిటీని ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 1310 మంది అభ్యర్థులు 150 స్థానాల్లో వివిధ పార్టీల మద్దతుతో బరిలోకి దిగారు. ఇందులో 52 స్థానాల్లో విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకొని 45 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 2:34 am

జమ్మూ-కాశ్మీర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

జమ్మూ-కాశ్మీర్‌లోని దోఢా జిల్లాలోని ఖతీదార్, గుర్ముల్ అటవీ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు తమ విధి నిర్వహణలో భాగంగా బుధవారం రాత్రి కూంబింగ్ నిర్వహించాయి. ఇందులో భాగంగా నక్సలైట్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారని గురువారం పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు
Source: జాతీయ | 26 Nov 2009 | 2:04 am