గ్రేటర్ ఉత్కంఠకు తెరపడింది... ఫలితం...హంగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ కచ్చితమైన మెజారిటీని ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 1310 మంది అభ్యర్థులు 150 స్థానాల్లో వివిధ పార్టీల మద్దతుతో బరిలోకి దిగారు. ఇందులో 52 స్థానాల్లో విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకొని 45 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 8:02 am

అమీర్ ఖాన్‌కు దెబ్బలు... కత్రినా కైఫ్‌కు పసికర్లు

3 ఇడియట్స్ చిత్రం ప్రమోషన్‌లో బిజీగా ఉన్న బాలీవుడ్ "గజినీ" అమీర్ ఖాన్ బ్యాడ్మిటన్ ఆడుతుండగా కాలికి గాయమై గ్రౌండ్లోనే కుప్పకూలాడట. దీంతో అతనిడిని ప్రథమ చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారట. అంతేకాదు... త్రీ ఇడియట్స్ చిత్రం ప్రారంభం నుంచి అమీర్‌కు అప్పుడప్పుడూ చిన్నచిన్న దెబ్బలు తగులుతూనే ఉన్నాయట. ఈ సంగతి తెలుసుకున్న తమిళ హీరో మాధవన్ కాలుతీసి కాలు బయట పెట్టడం లేదట. త్రీ ఇడియట్స్ నెగిటివ్ సెంటిమెంట్ బలంగా ఉందన్నమాట. అమీర్ సంగతి ఇలా ఉంటే... బాలీవుడ్ కోవా కత్రినాకైఫ్ పసికర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు సమాచారం. ఈ వ్యాధి కారణంగా కత్రినా శరీరంలో హిమోగ్లోబిన్ కౌంట్ గణనీయంగా తగ్గిపోయిందట. అయితే తనకు పసికర్ల వ్యాధి ఉన్నదని గ్రహించని కత్రినా, గత వారమంతా షూటింగ్‌లతో మహా బిజీగా గడిపింది. గత ఆదివారం పూర్తిగా నీరసించి బెడ్‌పై నుంచి లేవలేకపోయింది. దీంతో తనకు ఏదో వ్యాధి ఉందని అనుమానం వచ్చిన కత్రినా వైద్యుని సంప్రదింస్తే... పసికర్ల వ్యాధి వున్నట్లు నిర్థారణ అయింది. దీంతో మరో రెండు వారాలపాటు పూర్తి విశ్రాంతి తీసుకోమని కత్రినాకు వైద్యులు సలహా ఇచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 7:40 am

జమ్మూ-కాశ్మీర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

జమ్మూ-కాశ్మీర్‌లోని దోఢా జిల్లాలోని ఖతీదార్, గుర్ముల్ అటవీ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు తమ విధి నిర్వహణలో భాగంగా బుధవారం రాత్రి కూంబింగ్ నిర్వహించాయి. ఇందులో భాగంగా నక్సలైట్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారని గురువారం పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 7:33 am

"పా"తో ఒప్పందం చేసుకున్న బజాజ్

దేశీయ ప్రైవేట్ జీవిత బీమా రంగంలో అగ్రగామిగానున్న బజాజ్ అలయన్స్ సంస్థ తన ప్రకటనలలో భాగంగా జియో బేఫిక్ర్...ను మరింత ప్రభావితం చేసేందుకు బాలీవుడ్ నటుడు బిగ్ బీ నటించిన " పా " సినిమాతో ఒప్పందం చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 7:11 am

నష్టాల్లో మార్కెట్: సెన్సెక్స్ 110 పాయింట్ల పతనం

బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటన పయనిస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 110 పాయింట్ల నష్టపోయి, 17,088 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు పతనమై, 5,068 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 7:07 am

వైఎస్ జగన్ పర్యటించిన చోట కాంగ్రెస్ ఓడిందట...

రాష్ట్ర రాజధాని హైదరాబాదు గ్రేటర్ ఎన్నికలు పాలకప్రతిపక్ష పార్టీలకు ప్రజలలో ఉన్న ఆదరణ ఏపాటిదో చాటిచెప్పాయి. చిరంజీవి ప్రజారాజ్యంతోపాటు గ్రేటర్ వాసులు సోమరిపోతులంటూ మండిపడ్డ లోక్‌సత్తా జయప్రకాష్ నారాయణకు గ్రేటర్ వాసులు ఒక్క చోట కూడా అవకాశం ఇవ్వకుండా మూడు పార్టీలకు మాత్రమే ప్రాధాన్యమిచ్చారు. దీంతో పీఆర్పీ, లోక్‌సత్తా ఆత్మశోధనలో పడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 7:03 am

ముంబై మృతులకు పార్లమెంట్ ఘన నివాళి

నిరుడు పాక్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముంబై వాసులను పార్లమెంట్ గురువారం స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించింది.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 6:44 am

అమెరికాకు ఎలాంటి లాభం కలగదు: తాలిబన్

ప్రస్తుతం అమెరికా దేశం ఆఫ్గనిస్థాన్‌లో తమ సైనికులను మరింతగా పెంచుకుంటోందని, దీనివలన అమెరికాకు ఎలాంటి లాభం కలగదని ఆఫ్గనిస్థాన్‌కు చెందిన తాలిబన్ నాయకుడు ముల్లా ఉమర్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 6:26 am

మందుపాతరల ఉత్పత్తిని నిషేధించేది లేదు: అమెరికా

మందుపాతరలపై నిషేధం విధించేది లేదని అమెరికా స్పష్టం చేసింది. గతంలో అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ప్రభుత్వ విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించాలని యోచిస్తోందని, ఈ నేపథ్యంలోనే మందుపాతరల ఉత్పత్తిపై నిషేధం విధించేది లేదని ఆ దేశ ప్రతినిధి ఇయాన్ కెల్లీ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 6:12 am

కసబ్‌ను ఉరితీయండి: ముంబైవాసులు

ముంబయి ఉగ్రవాద దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా హింసకు చరమగీతం పాడాలంటూ ముంబయి మహానగరంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు పెరేడ్ నిర్వహించి తమ సత్తాను చాటారు.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 6:07 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో సెన్సెక్స్

అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను చవిచూస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే తిరోగమనంలో పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 60 పాయింట్ల మేర క్షీణించి, 17,138 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 30 పాయింట్లు పతనమై 5,077 పాయింట్ల వద్ద ర్యాలీని పయనింపజేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Nov 2009 | 5:59 am

నమిత-శరత్‌బాబులు సహజీవనం చేస్తున్నారా..?!

టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకులను తన అందచందాలతో ఇట్టే ఆకట్టుకున్న బొద్దందాల ముద్దుగుమ్మ నమిత గురించి తెలియని వారంటూ ఉండరు. గ్లామర్ ఫీల్డ్‌లో బ్యూటీ క్వీన్‌గా తన హవాను కొనసాగిస్తున్న ఈమె గత కొంత కాలంగా ప్రముఖ నటుడు శరత్‌బాబుతో సహజీవనం కొనసాగిస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.గతంలో దశావతారం హీరో కమల్ హాసన్-గౌతమి, పవన్ కళ్యాణ్- రేణు దేశ్యాయ్, సిద్ధార్థ్-సోహా, నయనతార- ప్రభుదేవాల తరహాలోనే నమిత-శరత్‌బాబులు రహస్యంగా సహజీవనం గడుపుతున్నట్లు ఫిలిమ్ నగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు.ఈ విషయమై నమితను కదిలిస్తే.. శరత్‌బాబుతో తనకెలాంటి సంబంధం లేదని దాటవేసింది. అంతేకాదు.. ఆయన తనకు మంచి స్నేహితుడు మాత్రమేనని తెలిపింది. ఇంకా శరత్‌బాబు మంచి మనసున్న మనిషి అని, మానవతావాది అని ప్రశంసలతో ముంచెత్తింది.ఇలా శరత్‌బాబును గురించి కితాబివ్వడం విన్న సినీ పండితులు నమిత-శరత్ బాబుల మధ్య ప్రేమాయణం నడుస్తోందని అనుకుంటున్నారు. మరి వీరి సహజీవనం ఎంతవరకు వస్తుందో వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 26 Nov 2009 | 4:30 am

రేపు సమావేశం కానున్న కాంగ్రెస్ శాసన సభాపక్షం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో సిఎల్పీ రేపు మధ్యాహ్నం రెండు గంటలకు సమావేశమవుతుందని ఏఐసిసి కార్యాలయం గురువారం వెల్లడించింది. సుధీర్ఘకాలంగా సిఎల్పీ సమావేశం కోసం ఎదురు చూస్తున్న కాంగ్రెస్ ఎమ్మల్యేలు, ఎమ్మెల్సీలకు ఇది ఎంతో సంతోషకర విషయంగా రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాలను చూస్తునే సిఎల్పీ సమావేశం నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 2:35 am

గ్రేటర్ ఉత్కంఠకు తెరపడింది... ఫలితం...హంగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకీ కచ్చితమైన మెజారిటీని ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లో మొత్తం 1310 మంది అభ్యర్థులు 150 స్థానాల్లో వివిధ పార్టీల మద్దతుతో బరిలోకి దిగారు. ఇందులో 52 స్థానాల్లో విజయాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ జిహెచ్ఎంసీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాగా, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అనూహ్యంగా తన బలాన్ని పెంచుకొని 45 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
Source: ఏపీ న్యూస్ | 26 Nov 2009 | 2:34 am

జమ్మూ-కాశ్మీర్‌లో ఇద్దరు మావోయిస్టుల మృతి

జమ్మూ-కాశ్మీర్‌లోని దోఢా జిల్లాలోని ఖతీదార్, గుర్ముల్ అటవీ ప్రాంతంలో రాష్ట్రీయ రైఫిల్స్ దళాలు తమ విధి నిర్వహణలో భాగంగా బుధవారం రాత్రి కూంబింగ్ నిర్వహించాయి. ఇందులో భాగంగా నక్సలైట్లు భద్రతా దళాలపై కాల్పులకు పాల్పడ్డారు. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరుపగా ఇద్దరు నక్సలైట్లు మృతి చెందారని గురువారం పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు
Source: జాతీయ | 26 Nov 2009 | 2:04 am

ముంబై మృతులకు పార్లమెంట్ ఘన నివాళి

నిరుడు పాక్ తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ముంబై వాసులను పార్లమెంట్ గురువారం స్మరించుకుని ఘనమైన నివాళులు అర్పించింది.
Source: జాతీయ | 26 Nov 2009 | 1:15 am

కసబ్‌ను ఉరితీయండి: ముంబైవాసులు

ముంబయి ఉగ్రవాద దాడులకు ఏడాది పూర్తయిన సందర్భంగా హింసకు చరమగీతం పాడాలంటూ ముంబయి మహానగరంలో గురువారం ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు పెరేడ్ నిర్వహించి తమ సత్తాను చాటారు.
Source: జాతీయ | 26 Nov 2009 | 12:39 am

26/11 పీడకలకు ఏడాది పూర్తి

ఏడాది క్రితం సరిగ్గా ఇదే రోజున(నవంబరు 26,2008) భారతదేశ వాణిజ్య నగరమైన ముంబయిపై ఉగ్రవాదులు పంజా విసిరి సుమారు 200 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు. తాజ్ హోటల్‌లో నవంబరు 26న చొరబడ్డ ఉగ్రవాదులు అందులో బసచేసిన పర్యాటకులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి బలితీసుకున్నారు.
Source: జాతీయ | 25 Nov 2009 | 11:36 pm

ఖాతా తెరవని ప్రరాపా, లోక్‌సత్తా

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కార్యక్రమం గురువారం ఉదయం ప్రారంభమైంది. అధికారులు ప్రకటించిన ఫలితాల్లో మెగాస్టార్ చిరంజీవికి చెందిన ప్రజారాజ్యం పార్టీ, జయప్రకాష్ నారాయణకు చెందిన లోక్‌సత్తా పార్టీలు ఇంత వరకు ఎలాంటి ఖాతాను తెరవకపోవడం గమనార్హం
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 11:22 pm

గ్రేటర్ ఫలితాలు: లేడీ డాన్ ఫరాఖాన్‌కు 12 ఓట్లే!

గ్రేటర్ ఎన్నికల లెక్కింపు ప్రక్రియ గురువారం జోరుగా సాగుతోంది. గ్రేటర్ ఫలితాల్లో భాగంగా కాంగ్రెస్ ఆధిక్యంలో నిలిచి తన హవాను కొనసాగిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం గట్టిపోటీనిస్తోంది. గురువారం విడుదలైన గ్రేటర్ లెక్కింపు ఫలితాల్లో ప్రజారాజ్యం, బీజేపీలు ఇంకా ఖాతా తెరవని నేపథ్యంలో.. లేడి ఢాన్ ఫరాఖాన్‌కు కేవలం 12 ఓట్లు మాత్రమే పోలయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 11:18 pm

హస్తినకు ప్రయాణం కానున్న చంద్రబాబు

మైనింగ్ మాఫియా కార్యకలాపాలపై జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం హస్తినకు చేరుకోనున్నారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీకి ప్రయాణం కానున్న చంద్రబాబు, హస్తినలో వామపక్షాలు, భావ సారూప్యం ఉన్న పార్టీ నేతలతో భేటీ అవుతారు. ఇంకా ఓబుళాపురం ఇతర గనుల వ్యవహారాలను వారికి వివరిస్తారు. అలాగే ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు తమ పార్టీ మద్దతు ఇస్తోందని చంద్రబాబు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 10:40 pm

ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు ప్రకటించిన వివరాల మేరకు...గురువారం ఉదయం గం. 10లకు వచ్చిన ఫలితాలననుసరించి కాంగ్రెస్ పార్టీ 41 స్థానాల్లో గెలుపు సాధించగా, తెదేపాకు 28 స్థానాలు గెలుచుకుంది.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 10:02 pm

ఛోటా షకీల్ అనుచరుని మృతి

ముంబైలోని ఠానే పోలీసు స్టేషన్ పరిధిలో ఛోటా షకీల్ అనుచరుడు ముస్తఫా షేక్‌ను పోలీలుసులు దాడి చేసి హతమార్చారు. రహస్య సమాచారం అందుకున్న తాము స్థానిక పోలీసు కౌసా ప్రాంతంలోని ఓ కాలేజీ వద్ద ముస్తఫా షేక్ (32)ను కనుగొన్నారు. దీంతో అతనిని చుట్టుముట్టి కాల్చి హతమార్చామని పోలీసులు వర్గాలు వెల్లడించాయి.
Source: జాతీయ | 25 Nov 2009 | 9:13 pm

గ్రేటర్ కౌంటింగ్: ముసారాంబాగ్‌లో టీడీపీ గెలుపు

గ్రేటర్ ఎన్నికల కౌంటింగ్ సోమవారం ప్రారంభమైంది. ఈ ఫలితాల్లో భాగంగా.. ముసారాంబాగ్ డివిజన్‌లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది. తెదేపా అభ్యర్థి అస్లాంపాషా 2, 799 ఓట్ల ఆధిక్యంలో గెలుపొందారు. అలాగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఎంఐఎం ఫతేదర్వాజ్ డివిజన్‌లో గెలిచింది. ఈ డివిజన్‌లో పోటీ చేసిన ఎంఐఎం అభ్యర్థి మహ్మద్ విరాజ్ విజయం సాధించారు. ఇదే విధంగా పాతబస్తీలో ఎంఐఎం హవా కొనసాగుతోంది. పాతబస్తీలో ఎంఐఎం అభ్యర్థులు అధిక స్థానాల్లో కొనసాగుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 9:04 pm

నేను నాయకుడిని కాదు : రాహుల్‌ గాంధీ

నేను గొప్ప నాయకుడిని కాదని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్‌ గాంధీ తెలిపారు. జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... తాను గొప్ప నాయకుడిని మాత్రం కాదని, ప్రస్తుతం కాంగ్రెస్‌ యువజన విభాగాలను పటిష్ట పరచడంలో ఒక ఉత్ప్రేరకుని పాత్ర మాత్రమే పోషించగలనని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 25 Nov 2009 | 8:45 pm

ప్రారంభమైన గ్రేటర్ కౌంటింగ్

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురువారం ఉదయం ప్రారంభమైంది. ఉదయం గం.9.00లలోపే తొలి ఫలితం విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఓట్ల లెక్కింపు కార్యక్రమానికిగాను మొత్తం 54 హాళ్ళు ఏర్పాటు చేశారు. వీటిలో 672 టేబుళ్ళు ఓట్ల లెక్కింపుకు వినియోగిస్తున్నారు. ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం 532 రౌండ్లలో పూర్తి కానుందని అధికారులు వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 8:37 pm

అబ్బాయికి ఐస్ క్యూబ్... నీతూ చంద్రకు ఎర్ర మిరపకాయ

నీతూ చంద్రకు రాజశేఖర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చేసేది లేక పొలోమంటూ కోలీవుడ్ సినీ పరిశ్రమకు వెళ్లి తమిళ సినీ అవకాశాలు వెతుక్కుంటోంది. అందాల ఆరబోతకు ముందుండే నీతూ చంద్రా... తమిళంలో నటించే తెలుగు కుర్ర హీరో విశాల్ నటించే తెలుగు, తమిళ వెర్షన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు ఆమెను ఎర్ర మిరపకాయలలో పొర్లాడుతూ నటించమని చెప్పాడట. చిత్రం... అంతటి ఎర్రగారపు మిరపకాయల్లో దొర్లాడినా నీతు శరీరానికి కాస్త మంటైనా అనిపించలేదట.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2009 | 7:13 am

విపక్షాలు సానుకూలంగా స్పందిస్తే బాగుంటుంది: రవి

దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి సతీమణి విజయలక్ష్మి పులివెందుల ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంతో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీతో పాటు అన్ని ప్రతిపక్షాలు సానుకూలంగా స్పందించాలని కాంగ్రెస్ నాయకుడు మల్లురవి కోరారు. వైఎస్సార్ సతీమణి విజయలక్ష్మి పులివెందుల ఉపఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నిక చేయడంలో ప్రతిపక్షాలు సహకరిస్తాయని మల్లురవి ఆకాంక్షించారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 7:11 am

వైఎస్ సతీమణిని ఎమ్మెల్యేగా చూడలేం: లగడపాటి

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మీని ఒక సాధారణ ఎమ్మెల్యేగా చూడలేమని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అభిప్రాయపడ్డారు. తాను మాత్రమే కాకుండా.. వైఎస్ అభిమానులు ఎవరూ దీన్ని జీర్ణించుకోలేరని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 5:01 am

అనుష్కతో మార్నింగ్ వాక్ వద్దంటున్న గోపిచంద్‌

విలన్ కమ్ హీరో గోపిచంద్‌కు "అరుంధతి" బొమ్మాళీ గండమని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. లక్ష్యం, శౌర్యం చిత్రాల నుంచి గోపిచంద్‌కి, అనుష్కకు మధ్య ఏదో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే అవన్నీ అసత్యమని ఇద్దరూ విడివిడిగానే ఖండించారు.తాజాగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలని అంటే.. గోపిచంద్ ఆనందంగా ఒప్పేసుకున్నాడట. అయితే వీరిద్దరి కాంబినేషన్ గురించి ఇంట్లో వారు వద్దన్నారట. అసలు విషయం ఏమిటంటే..? ఆ మధ్య అనుష్క గోపించంద్ ఇంటికి తరచూ వెళుతుండేది. మార్నింగ్ వాకింగ్‌కు కలిసి వెళ్ళేవారట. దీంతో ఇకపై ఎవరినీ ఇంటికి రానివ్వనని గోపిచంద్ తేల్చి చెబుతున్నాడు. చివరికి ఇంట్లో బాధ తట్టుకోలేక నిర్మాతకు ఫోన్‌చేసి డేట్స్ కుదరలేదు. అనుష్కతో కలిసి సినిమా చేయనని చెప్పాడట. దాంతో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ రవితేజను తీసుకున్నారు. "డాన్‌శీను" పేరుతో తయారవుతున్న ఈ చిత్రానికి మలినేని గోపి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకేముంది..? గోపిచంద్‌కు బొమ్మాళీతోనే గండం ఉందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. మరి మీరేమంటారు..?
Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2009 | 4:26 am

యుద్ధ విమానాల వినియోగం: ఎన్‌ఎస్‌జికి అనుమతి

దేశ రక్షణలో భాగంగా, అత్యవసర పరిస్థితుల్లో యుద్ధ విమానాలు ఉపయోగించుకునేందుకు జాతీయ భద్రతా దళం (ఎన్‌ఎస్‌జి)కి భారత వైమానిక దళం అనుమతి ఇచ్చింది. సంఘటనా స్థలానికి త్వరతిగతిన కమాండోలోను చేరవేసేందుకు ఈ విమానాలను ఇకపై ఉపయోగిస్తారు.
Source: జాతీయ | 25 Nov 2009 | 4:12 am

రాజకీయ పార్టీలకు సీఎం మాయావతి హెచ్చరిక!

అయోధ్య అంశాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించారు.
Source: జాతీయ | 25 Nov 2009 | 3:09 am