|
లాభాలతో కొనసాగుతున్న విదేశీ మార్కెట్లుబుధవారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లు లాభాలను నమోదు చేసుకుంటున్నాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 4.00 గంటలకు యూరప్, ఆసియా మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. అలాగే దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మాత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి 67 పాయింట్ల లాభంతో 17,198 0పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 17 పాయింట్ల స్వల్ప లాభంతో పుంజుకుని 5,108 మార్కు వద్ద ర్యాలీని ముగించింది.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 9:02 am రాజకీయ పార్టీలకు సీఎం మాయావతి హెచ్చరిక!అయోధ్య అంశాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించారు.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 8:38 am ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్దేశీయ వాటాల కొనుగోళ్లు ఊపందుకోవడంతో పాటు విదేశీ మార్కెట్ల సూచీలు లాభాదాయకంగా కొనసాగడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. ఆసియా, యూరప్ మార్కెట్ల ఆశాజనక సంకేతాలు బాంబే స్టాక్ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి. దీంతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 86 పాయింట్లు లాభపడి, 17,217 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 18 పాయింట్ల వృద్ధితో 5, 109 పాయింట్ల వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 8:31 am ముంబై దోషులను కఠినంగా శిక్షించాలి: ఒబామాభారతదేశంలోనున్న ఆర్థిక రాజధానిగా వెలుగొందుతున్న ముంబైలో నిరుడు నవంబర్‌లో జరిగిన దాడులకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని ఒబామా అన్నారు.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 8:22 am లాభాల్లో విదేశీ సూచీలు: సెన్సెక్స్ వృద్ధిబుధవారం బాంబే స్టాక్ మార్కెట్ లాభాల్లో పయనిస్తోంది. ఆసియా, యూరప్ మార్కెట్లకు చెందిన సూచీలు ఆశాజనకంగా ర్యాలీని కొనసాగిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 101 పాయింట్లు పుంజుకుని, 17,232 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 24 పాయింట్లు బలపడి, 5,114 పాయింట్ల వద్ద పయనిస్తోంది. ఇకపోతే.. ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎమ్‌సీజీ, పీఎస్‌యూ మరియు మెటల్, ఆటో, ఐటీ, టెక్, బ్యాంక్, పవర్ వాటాల ట్రేడింగ్ పుంజుకోగా, హెల్త్‌కేర్, రియాల్టీ వాటాల ట్రేడింగ్ నత్తనడకన పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 8:00 am పుంజుకున్న కొనుగోళ్లు: లాభాల్లో సెన్సెక్స్దేశీయ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతోంది. ఆసియా, యూరప్ మార్కెట్లు లాభదాయకంగా పయనించడం కూడా బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకోవడానికి ప్రధాన కారణమైంది. ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూ, మెటల్ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బుధవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని, 17,259 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 35 పాయింట్లు బలపడి, 5,125 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 7:20 am అబ్బాయికి ఐస్ క్యూబ్... నీతూ చంద్రకు ఎర్ర మిరపకాయనీతూ చంద్రకు రాజశేఖర్‌తో వివాదం ఏర్పడిన తర్వాత తెలుగులో చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదు. చేసేది లేక పొలోమంటూ కోలీవుడ్ సినీ పరిశ్రమకు వెళ్లి తమిళ సినీ అవకాశాలు వెతుక్కుంటోంది. అందాల ఆరబోతకు ముందుండే నీతూ చంద్రా... తమిళంలో నటించే తెలుగు కుర్ర హీరో విశాల్ నటించే తెలుగు, తమిళ వెర్షన్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంలో దర్శకుడు ఆమెను ఎర్ర మిరపకాయలలో పొర్లాడుతూ నటించమని చెప్పాడట. చిత్రం... అంతటి ఎర్రగారపు మిరపకాయల్లో దొర్లాడినా నీతు శరీరానికి కాస్త మంటైనా అనిపించలేదట.Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2009 | 7:13 am భారతీయ వంటకాలతో అలరించిన వైట్హౌస్అమెరికా అధ్యక్షునిగా ఒబామా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలి రాజకీయ అతిథిగా విచ్చేసిన భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులకు వైట్‌హౌస్‌లో భారతీయ వంటకాలను సిద్ధం చేశారు.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 7:12 am అమెరికాతో ఒప్పందం చేసుకున్న దేశీయ కంపెనీలుభారతప్రధాని మన్మోహన్ సింగ్ అమెరికా పర్యటన సందర్భంగా టాటా కమ్యునికేషన్స్, ఇన్ఫోసిస్ టెక్నాలజీస్‌తోపాటు మరో ఆరు భారతీయ కంపెనీలు వాషింగ్‌టన్‌లో అమెరికా కంపెనీలతో పలు ఒప్పందాలు చేసుకున్నాయి.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 7:00 am పులివెందుల ఉపఎన్నిక: విజయలక్ష్మీకే కాంగ్రెస్ టిక్కెట్?పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మీ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించినట్టు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 6:56 am 26/11 తేదీన కాలుబయటపెట్టని ఆర్ఆర్: భుజ్బల్ముంబై నగరంలోకి తీవ్రవాదులు చొరబడి భీభత్సం సృష్టిస్తున్నారని వార్త తెలిసినప్పటికీ.. అప్పటి హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ బయటకు వచ్చేందుకు ముందుకు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 25 Nov 2009 | 6:36 am అనుష్కతో మార్నింగ్ వాక్ వద్దంటున్న గోపిచంద్విలన్ కమ్ హీరో గోపిచంద్‌కు "అరుంధతి" బొమ్మాళీ గండమని ఫిలింనగర్ వాసులు అంటున్నారు. లక్ష్యం, శౌర్యం చిత్రాల నుంచి గోపిచంద్‌కి, అనుష్కకు మధ్య ఏదో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే అవన్నీ అసత్యమని ఇద్దరూ విడివిడిగానే ఖండించారు.తాజాగా ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా చేయాలని అంటే.. గోపిచంద్ ఆనందంగా ఒప్పేసుకున్నాడట. అయితే వీరిద్దరి కాంబినేషన్ గురించి ఇంట్లో వారు వద్దన్నారట. అసలు విషయం ఏమిటంటే..? ఆ మధ్య అనుష్క గోపించంద్ ఇంటికి తరచూ వెళుతుండేది. మార్నింగ్ వాకింగ్‌కు కలిసి వెళ్ళేవారట. దీంతో ఇకపై ఎవరినీ ఇంటికి రానివ్వనని గోపిచంద్ తేల్చి చెబుతున్నాడు. చివరికి ఇంట్లో బాధ తట్టుకోలేక నిర్మాతకు ఫోన్‌చేసి డేట్స్ కుదరలేదు. అనుష్కతో కలిసి సినిమా చేయనని చెప్పాడట. దాంతో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ రవితేజను తీసుకున్నారు. "డాన్‌శీను" పేరుతో తయారవుతున్న ఈ చిత్రానికి మలినేని గోపి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇంకేముంది..? గోపిచంద్‌కు బొమ్మాళీతోనే గండం ఉందని సినీ పండితులు జోస్యం చెబుతున్నారు. మరి మీరేమంటారు..?Source: Yahoo! Telugu: Entertainment | 25 Nov 2009 | 4:26 am రాజకీయ పార్టీలకు సీఎం మాయావతి హెచ్చరిక!అయోధ్య అంశాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి హెచ్చరించారు.Source: జాతీయ | 25 Nov 2009 | 3:09 am పులివెందుల ఉపఎన్నిక: విజయలక్ష్మీకే కాంగ్రెస్ టిక్కెట్?పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్.విజయలక్ష్మీ పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆమెకు కాంగ్రెస్ అధిష్టానం టిక్కెట్ కేటాయించినట్టు పలు మీడియాల్లో వార్తలు వచ్చాయి.Source: ఏపీ న్యూస్ | 25 Nov 2009 | 1:27 am 26/11 తేదీన కాలుబయటపెట్టని ఆర్ఆర్: భుజ్బల్ముంబై నగరంలోకి తీవ్రవాదులు చొరబడి భీభత్సం సృష్టిస్తున్నారని వార్త తెలిసినప్పటికీ.. అప్పటి హోంమంత్రి ఆర్.ఆర్.పాటిల్ బయటకు వచ్చేందుకు ముందుకు రాలేదని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి చగన్ భుజ్‌బల్ తెలిపారు.Source: జాతీయ | 25 Nov 2009 | 1:06 am మావోయిస్టుల ఆటంకం: మందకొడిగా పోలింగ్!జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఊహించినట్టుగానే మావోయిస్టులు ఆటంకం కలిగించారు. వీరికి తోడు పగటి ఉష్ణోగ్రత ఆరు డిగ్రీలకు పడిపోయింది. ఫలితంగా ఓటింగ్ సరళి మందకొడిగా సాగుతోంది.Source: జాతీయ | 25 Nov 2009 | 12:56 am కరువు నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షకరువు నివారణ చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య బుధవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి బుధవారం విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయం, పశుసంవర్థక ఉపాధి హామీ, తాగునీరు, ఆరోగ్యం, కరువు వంటి తదితర ప్రధాన సమస్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 11:51 pm కిడ్నాపర్లచే రియల్టర్ అశోక్ రెడ్డి హత్యకుషాయిగూడలో మంగళవారం కిడ్నాప్‌కు గురైన రియల్టర్ అశోక్ రెడ్డి హత్యకు గురైయ్యాడు. రియల్టర్ అశోక్ రెడ్డి మృతదేహం మహబూబ్‌నగర్ శివారు ప్రాంతంలో లభ్యమైందని పోలీసులు తెలిపారు. అశోక్‌రెడ్డిని కిడ్నాప్ చేయడానికి ప్రధాన కారణమేమిటి? హత్యకు గల ప్రధాన కారణాలపై విభిన్న కోణాల్లో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కిడ్నాపర్ల ఆచూకీ కోసం పోలీసులు విచారణ జరుపుతున్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 11:42 pm "గ్రేటర్" వాసులు ఇంత.. సోమరిపోతులా?: జేపీగ్రేటర్ హైదరాబాద్ నగర వాసులు ఇంత సోమరిపోతులని తాను ఏనాడూ ఊహిచుకోలేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ మండిపడ్డారు. క్రికెట్ టిక్కెట్ల కోసం రేయింబవుళ్లు క్యూలలో నిలుచుంటారన్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 11:39 pm డిసెంబర్ తొలివారంలో హస్తినకు సీఎం పయనంరాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య డిసెంబర్ మొదటివారంలో హస్తినకు వెళ్లే అవకాశాలున్నాయని తెలిసింది. సీఎల్పీ భేటీ నుంచి గ్రేటర్ మేయర్ పదవి వరకు వివిధ అంశాలపై అధిష్టానంతో చర్చించేందుకు రోశయ్య ఢిల్లీకి పయనమవుతారని పార్టీ శ్రేణుల సమాచారం. గ్రేటర్ మేయర్ అభ్యర్థి ఎవరనే విషయమై పీసీసీ ఓ నిర్ణయానికి వస్తుంది. తదనంతరం అభ్యర్థుల వివరాలతో ఢిల్లీ పెద్దలను కలవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 11:14 pm గ్రేటర్ ఎన్నికలు: ఓట్ల లెక్కింపుకు పటిష్ట భద్రతగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల సమరం మంగళవారంతో పూర్తి కావడంతో ఓట్ల లెక్కింపుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 26న జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఎలాంటి అవాంతర సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 11:05 pm సుఖోయ్-30 రకం యుద్ధ విమానంలో రాష్ట్రపతి పాటిల్సుఖోయ్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ బుధవారం ప్రయాణించారు. పూణెలోని లోహెగావ్ వైమానిక స్థావరం నుంచి సుఖోయ్-30 రకం యుద్ధ విమానంలో ఆమె ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఈ విమానాన్ని అవార్డు గ్రహీత, 3,200 గంటల ఫ్లైయింగ్ అనుభవం గడించిన ఎస్.షాజన్ నడుపుతున్నారు. ఆయనతో పాటు మరో ఇద్దరు సహ పైలట్లు కూడా ఇందులో ప్రయాణిస్తున్నారు.Source: జాతీయ | 24 Nov 2009 | 10:59 pm ఉదారవాద ముసుగులో ఉన్న నేతలు: లిబర్హాన్ నివేదికభారతీయ జనతా పార్టీలోని అగ్రనేతలు ఉదారవాద ముసుగులో ఉన్న రాజకీయనాయకులని జస్టీస్ మన్మోహన్ సింగ్ లిబర్హాన్ కమిషన్ తన నివేదికలో పేర్కొంది.Source: జాతీయ | 24 Nov 2009 | 9:31 pm జార్ఖండ్‌లో ప్రారంభమైన తొలి దశ ఎన్నికల పోలింగ్!జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా తొలి దశ ఎన్నికల పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య బుధవారం ప్రారంభమైంది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మావోయిస్టుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో పోలింగ్ కేంద్రాల వద్ద కనీవినీ ఎరుగని రీతిలో సాయుధ బలగాలను మొహరించారు.Source: జాతీయ | 24 Nov 2009 | 8:33 pm "మిస్ ఆంధ్ర"కు చేజారిపోతున్న ఆఫర్లు..!మిస్ ఆంధ్రగా టైటిల్‌ను సొంతం చేసుకున్న నటి పూనమ్‌కౌర్. తెలుగులో అడపా దడపా చిత్రాల్లో నటించిన పూనమ్ కౌర్‌కు అంతగా గుర్తింపు రాలేదు. హ్యాపీడేస్ ఫేమ్ కృష్ణుడు హీరోగా నటించిన "వినాయకుడు" చిత్రంలో హీరోయిన్ ఫ్రెండ్‌గా కూడా నటించింది. అయితే బ్రేక్ రాలేదు. అయితే పూనమ్‌కౌర్‌కు ఇటీవలే ఓ టీవీషోకు యాంకర్‌గా వ్యవహరించే ఛాన్స్ దొరికింది. అయితే తెలుగు సరిగ్గా మాట్లాడటం రాకపోవడంతో అదికాస్తా చేజారిపోయిందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. హైదరాబాద్‌లో స్థిరనివాసం ఏర్పరుచుకున్న పూనమ్ కౌర్ ప్రస్తుతం తెలుగు సినిమాల్లో నటించేందుకు దృష్టి పెడుతుంది. కానీ మంచి ఆఫర్లు రాకపోవడంతో కోలీవుడ్‌లోనూ అవకాశాల కోసం వేచి చూస్తోంది. మరి పూనమ్‌కౌర్ మంచి ఆఫర్లు సొంతం చేసుకోవాలని ఆశిద్దామా..!.Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 8:15 am ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడమే నా గోల్: హన్సికతాజాగా నితిన్‌తో "సీతారాముల కళ్యాణం" (లంకలో) నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతోంది. నితిన్, హన్సికలపై రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? జ: ఛాలెంజింగ్ పాత్ర. హీరోతో కలిసి విలన్‌ను ఛాలెంజ్‌చేసే క్యారెక్టర్. ప్రశ్న: నితిన్‌తో నటించడం ఎలా అనిపించింది? జ: నితిన్ చాలా సైలెంట్ మనిషి. జెంటిల్మెన్. ఆయనతో పనిచేయడం కంఫర్ట్‌బుల్‌గా ఉంది. ప్రశ్న: తెలుగు సినీ ఇండస్ట్రీ మీకు నచ్చిందా? జ: తెలుగు ఫీల్డులో డిసిప్లెన్ ఎక్కువ. ఏదైనా టైమ్ టు టైమ్ జరుగుతుంది. నేను హిందీలో నటిస్తున్నాను కానీ అక్కడ ఇది లేదు. ప్రశ్న: మీరు చేస్తున్న చిత్రాలు? జ: బాలీవుడ్ ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు మరో ప్రముఖ హీరో చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో ఐదు చిత్రాలు కమిట్ అయ్యాను. ఇందులో గోపిచంద్‌తో కలిసి ఓ చిత్రంలో చేస్తున్నాను. ప్రశ్న: మీ రోల్‌మోడల్..? జ: మా అమ్మే నా రోల్‌మోడల్. ప్రశ్న: సినిమా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి? జ: ముందుగా స్క్రిప్ట్ చూసుకుంటా. బేనర్‌తో పనిలేదు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 7:22 am మైఖేల్ జాక్సన్‌కు అమెరికన్ మ్యూజిక్ అవార్డులుపాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినా.. ఆయన ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో విహరిస్తునే ఉంది. ఆదివారం రాత్రి లాస్ ఏంజెలిస్‌లోని నోకియా థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన అమెరికన్ మ్యూజిక్ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో అవార్డులు నెగ్గి.. సంగీత ప్రపంచంలో తానింకా బతికే ఉన్నానని మైఖేల్ చాటుకున్నారు. మైఖేల్ జాక్సన్ తరపున ఆయన సోదరుడు జర్మైన్ జాక్సన్ అవార్డులను అందుకున్నాడు.Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 6:37 am ఓఎంసీ మైనింగ్ తక్షణమే ఆపండి: సాధికార కమిటీ సూచనఓబుళాపురం గనులతో సహా మరో 6 గనుల్లో అక్రమ తవ్వకాలు జరిగిన మాట వాస్తవమని సుప్రీంకోర్టు నియమించిన సాధికార కమిటీ నిర్థారణకు వచ్చింది. ఈ మేరకు కమిటీ ఆ గనులలో మైనింగ్ తక్షణమే నిలిపి వేయాలని రాష్ట్రాన్ని కోరింది. ఓఎంసీతో సహా మిగిలిన ఆరు గనుల్లో తవ్విన ఇనుప ఖనిజం రవాణాను తక్షణమే నిలుపుదల చేయాలని సర్కారుకు సూచించింది.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 6:31 am జగనా.. ఆయనెవరు.. ఎలా ఉంటారు: కె.కేశవరావుప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఏఐసీసీ అధికార ప్రతినిధి కే.కేశవరావుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదట. అసలు ఆయన ఎలా ఉంటారో కూడా ఏనాడు తాను చూడలేదని సెలవిస్తున్నారు. పద్మావతి అమ్మవారిని దర్శనార్థం ఆయన మంగళవారం తిరుచానూరుకు వచ్చారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 6:22 am డాలర్ శేషాద్రి పదవీకాలం పొడగింపుపై స్టే రద్దు!డాలర్ శేషాద్రి పదవీకాలం పొడగింపుపై రాష్ట్ర హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు మంగళవారం తొలగించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగి శేషాద్రి పదవీ కాలాన్ని పెంచుతూ తితిదే గతంలో రెండు మార్లు పొడగించంది. తితిదేలో డాలర్ల మాయానికి.....Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 5:48 am కుటుంబ సభ్యులతో నేడు జగన్ మంతనాలు!పులివెందుల టిక్కెట్ కేటాయింపు అంశం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులందరితో చర్చించి, ఒక ఏకాభిప్రాయానికి రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 5:20 am నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం: మంత్రి మొయిలీలిబర్హాన్ కమిషన్ సూచించిన సూచనల మేరకు సంబంధిత శాఖలు తగిన చర్యలు తీసుకుంటాయని కేంద్ర న్యాయ శాఖామంత్రి వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. లిబర్హాన్ కమిషన్‌లో పేర్కొన్న అంశాలపై ఆయన న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ... లిబర్హాన్ కమిషన్ పేర్కొన్న అంశాలను కేంద్రం పరిశీలిస్తోందన్నారు.Source: జాతీయ | 24 Nov 2009 | 5:02 am ఒకే గదిలో లారాదత్తా & మహేష్ భూపతిబాలీవుడ్ నటీమణులకు బాయ్‌ఫ్రెండ్‌లను మార్చడం వెన్నతో పెట్టిన విద్య అంటారు అక్కడి సినీజనం. ఈ కోవలోకి ఇప్పుడు లారాదత్తా కూడా చేరిపోయింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ డినో మోరియాకు హ్యాండ్ ఇచ్చి కొత్తగా టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రక్కన ప్రత్యక్షమవుతోందని బాలీవుడ్ గుసగసలు పోతోంది. వివరాలలోకి వెళితే... లారాదత్తా, మహేష్ భూపతి లండన్‌లోని జెడబ్ల్యూ మారియట్ హోటల్‌లో ఒకే గదిలో కలిసి గత కొద్ది రోజులుగా గడుపుతున్నట్లు భోగట్టా. ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండటాన్ని బట్టి ఇరువురి మధ్య ఎఫైర్ ముదిరిపోయిందని అంటున్నారు. ఇదే విషయంపై మహేష్ భూపతి సన్నిహితులను కదిలిస్తే... లారా మహేష్‌తో కలిసి ఉన్నమాట నిజమేననీ, కానీ వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నదో లేదో తమకు తెలియదని అంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే... లారా వదిలేసిన బాయ్‌ఫ్రెండ్ డినో మోరియా మాత్రం లారా పేరు చెబితే పళ్లు పట పట కొరుకుతున్నాడట. ఇలాగే సల్మాన్ ఖాన్ కూడా కత్రినా విషయంలో పళ్లు నూరి.. నూరి వాటిని అరగదీసుకుంటున్నాడని పాపం మోరియాకు తెలియదేమో!!!Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 5:02 am ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడమే నా గోల్: హన్సికతాజాగా నితిన్‌తో "సీతారాముల కళ్యాణం" (లంకలో) నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతోంది. నితిన్, హన్సికలపై రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? జ: ఛాలెంజింగ్ పాత్ర. హీరోతో కలిసి విలన్‌ను ఛాలెంజ్‌చేసే క్యారెక్టర్. ప్రశ్న: నితిన్‌తో నటించడం ఎలా అనిపించింది? ..Source: వినోదం | 24 Nov 2009 | 4:55 am ప్రభాస్ ఏక్ నిరంజన్ ట్రెయిలర్యువహీరో ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ జంటగా.. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యరామ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ ఆదిత్యమూవీస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. సోనూసూద్, ముకుల్‌దేవ్, మకరన్, దేశ్‌పాండే, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, పోసాని, సత్యప్రకాష్, అలీ, సునీల్ తదితరులు నటించిన ఈ చిత్రానికి క్లైమాక్స్ సన్నివేశం హైలైట్‌గా నిలిచిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 4:16 am పాక్-ఆఫ్ఘన్‌లు ఉగ్రవాద కేంద్ర బిందువులు: ఆంటోనీఉగ్రవాద కేంద్ర బిందువులుగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు ఉన్నాయని కేంద్ర రక్షణ శాఖామంత్రి ఏకే.ఆంటోనీ అన్నారు. ఈ రెండు దేశాల్లో తిష్టవేసిన ఉగ్రవాదులు ప్రపంచాన్ని శాసిస్తన్నారన్నారు. న్యూఢిల్లో జరిగిన ఒక అంతర్జాతీయ సదస్సులో మంత్రి ఆంటోనీ పాల్గొని ప్రసంగించారు.Source: జాతీయ | 24 Nov 2009 | 3:21 am అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలం: డీఆర్డీవోభారత సైనిక దళం ఉపయోగార్ధం సోమవారం రాత్రి ప్రయోగించిన క్షిపణి-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైనట్టు భారత రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మంగళవారం ప్రకటించింది. భూ ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని ఒరిస్సా తీరంలోని వీలర్ దీవి నించి ప్రయోగించారు.Source: జాతీయ | 24 Nov 2009 | 2:23 am
|