అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలం: డీఆర్‌డీవో

భారత సైనిక దళం ఉపయోగార్ధం సోమవారం రాత్రి ప్రయోగించిన క్షిపణి-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైనట్టు భారత రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మంగళవారం ప్రకటించింది. భూ ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని ఒరిస్సా తీరంలోని వీలర్ దీవి నించి ప్రయోగించారు.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 7:52 am

పాకిస్థాన్ నిజాయితీతో చర్చలకు రావాలి: ప్రధాని

దాయాది దేశం పాక్‌కు ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు స్నేహాస్తం అందించేందుకు సంకేతాలు పంపారు. దృఢనమ్మకం, నిజాయితీతో వివాదాస్పద అంశాలపై చర్చకు రావాలని ఆయన పాకిస్థాన్‌కు సూచించారు. అమెరికాలో నాలుగు రోజుల అధికారిక పర్యటనలో ఉన్న ఆయన సోమవారం జరిగిన కౌన్సిల్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్)ను ఉద్దేశించి ప్రసంగించారు.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 7:42 am

నాకింకా 18 సంవత్సరాలే: హన్సిక మొత్వాని

తాజాగా నితిన్‌తో "సీతారాముల కళ్యాణం" (లంకలో) నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ రామకృష్ణ సినీ స్టూడియోలో జరుగుతోంది. నితిన్, హన్సికలపై రెండు పాటల చిత్రీకరణ చేస్తున్నారు. ఈ సందర్భంగా మంగళవారం నాడు ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఈ చిత్రంలో మీ పాత్ర ఎలా ఉంటుంది? జ: ఛాలెంజింగ్ పాత్ర. హీరోతో కలిసి విలన్‌ను ఛాలెంజ్‌చేసే క్యారెక్టర్. ప్రశ్న: నితిన్‌తో నటించడం ఎలా అనిపించింది? జ: నితిన్ చాలా సైలెంట్ మనిషి. జెంటిల్మెన్. ఆయనతో పనిచేయడం కంఫర్ట్‌బుల్‌గా ఉంది. ప్రశ్న: తెలుగు సినీ ఇండస్ట్రీ మీకు నచ్చిందా? జ: తెలుగు ఫీల్డులో డిసిప్లెన్ ఎక్కువ. ఏదైనా టైమ్ టు టైమ్ జరుగుతుంది. నేను హిందీలో నటిస్తున్నాను కానీ అక్కడ ఇది లేదు. ప్రశ్న: మీరు చేస్తున్న చిత్రాలు? జ: బాలీవుడ్ ఇమ్రాన్‌ఖాన్‌తో పాటు మరో ప్రముఖ హీరో చిత్రంలో నటిస్తున్నా. తెలుగులో ఐదు చిత్రాలు కమిట్ అయ్యాను. ఇందులో గోపిచంద్‌తో కలిసి ఓ చిత్రంలో చేస్తున్నాను. ప్రశ్న: మీ రోల్‌మోడల్..? జ: మా అమ్మే నా రోల్‌మోడల్. ప్రశ్న: సినిమా ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలేమిటి? జ: ముందుగా స్క్రిప్ట్ చూసుకుంటా. బేనర్‌తో పనిలేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 7:22 am

కొత్త మోడళ్లతో వినియోగదారులను ఆకర్షించే పనిలో బజాజ్

గత ఏడాది అనూహ్యంగా మోటార్ బైకుల అమ్మకాలు తగ్గిపోయిన నేపధ్యంలో బజాజ్ మోటార్స్ తమ ద్విచక్ర వాహనాల అమ్మకాల పెంపుపై దృష్టి సారించింది. వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫార్ములాలతో ద్విచక్ర వాహనాలను రూపొందించడానికి కసరత్తు చేస్తోంది.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 6:51 am

భారీ నష్టాల దిశగా స్టాక్ మార్కెట్ పయనం

మదుపుదారులు అమ్మకాల వైపు మొగ్గుచూపడంతో బాంబే స్టాక్ మార్కెట్ భారీ నష్టాల దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. మంగళవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 102 పాయింట్ల మేర పతనమై, 17,077 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 25 పాయింట్లు క్షీణించి, 5,077 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 6:45 am

మైఖేల్ జాక్సన్‌కు అమెరికన్ మ్యూజిక్ అవార్డులు

పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయినా.. ఆయన ప్రతిష్ట ప్రపంచ దేశాల్లో విహరిస్తునే ఉంది. ఆదివారం రాత్రి లాస్ ఏంజెలిస్‌లోని నోకియా థియేటర్‌లో అంగరంగ వైభవంగా జరిగిన అమెరికన్ మ్యూజిక్ అవార్డుల్లో నాలుగు విభాగాల్లో అవార్డులు నెగ్గి.. సంగీత ప్రపంచంలో తానింకా బతికే ఉన్నానని మైఖేల్ చాటుకున్నారు. మైఖేల్ జాక్సన్ తరపున ఆయన సోదరుడు జర్మైన్ జాక్సన్ అవార్డులను అందుకున్నాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 6:37 am

డాలర్‌కు ప్రత్యామ్నాయం చూడటం లేదు: ప్రధాని

ప్రపంచ ఆర్థిక మాంద్యం కారణంగా ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న అమెరికా ఈ గడ్డు పరిస్థితులను నుంచి గట్టెక్కుతుందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, అమెరికా డాలర్‌కు ప్రత్యామ్నాయం కూడా లేదని ఈ ఆర్థికవేత్త స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 6:21 am

అర్హులైన అందరికీ పదవులు రావు: రోశయ్య

అర్హులైన అందరికీ పదవులు వస్తాయనుకోవడం ఏ మాత్రం సబబు కాదని, అర్హతతో పాటు అదృష్టమూ కలిసి రావాలని ముఖ్యమంత్రి అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కొమ్మినేని శేషగిరిరావు స్మారక అవార్డుల కార్యక్రమంలో సీఎం హాజరయ్యారు. పార్టీకోసం ఏళ్ల తరబడి కష్టపడిన కొమ్మినేని శేషగిరిరావుకు తగిన న్యాయం జరగలేదని రావీగాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు నాగుండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పందించారు.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 6:17 am

పాక్-ఇరాన్ నిధుల లావాదేవీలపై కన్నువేయండి!

పాకిస్థాన్, ఇరాన్ వంటి దేశాల నుంచి జరిగే లావాదేవీలపై ఓ కన్ను వేయాలని భారత రిజర్వు బ్యాంకు హెచ్చరించింది. ఈ దేశాల నుంచి బ్యాంకులకు వచ్చే నిధులను తీవ్రవాదుల చేతుల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అందువల్ల నిశితంగా పరిశీలించాలని కోరింది.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 6:09 am

అమెరికా నిధుల మళ్ళింపుపై భారత్ ఆందోళన

పాకిస్థాన్‌కు అమెరికా అందజేస్తున్న నిధులు దుర్వినియోగం కావడం పట్ల భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ నిధులు తీవ్రవాదంపై పోరుకు ఉపయోగించకుండా సైనిక సంపంత్తిని పెంచుకునేందుకు ఉపయోగిస్తున్నారని అమెరికా పర్యటనలో ప్రధాని మన్మోహన్ సింగ్ వెంట ఉన్న కేంద్ర విదేశాంగ కార్యదర్శి నిరుపమా రావు అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 5:57 am

లిబర్హాన్ కమిషన్ బహిర్గతం: 26వ తేదీన సభలో చర్చ!

ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం లిహర్హాన్ కమిషన్ నివేదికను మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నివేదికను కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం సభ ముందుకు తెచ్చారు. కాగా, ఈ నివేదికపై ఈనెల 26వ తేదీన పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి సునీల్ కుమార్ బన్సల్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 5:35 am

అమ్మకపు ఒత్తిడిలో స్టాక్ మార్కెట్: నష్టాల్లో సెన్సెక్స్

ఆటో, రియాల్టీ, కంజ్యూమర్ డ్యూరబుల్స్, హెల్త్‌కేర్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ మంగళవారం తిరోగమనం వైపు పయనిస్తోంది. ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 55 పాయింట్ల మేర కోల్పోయి, 17,124 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 16 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,086 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 24 Nov 2009 | 5:16 am

ఒకే గదిలో లారాదత్తా & మహేష్ భూపతి

బాలీవుడ్ నటీమణులకు బాయ్‌ఫ్రెండ్‌లను మార్చడం వెన్నతో పెట్టిన విద్య అంటారు అక్కడి సినీజనం. ఈ కోవలోకి ఇప్పుడు లారాదత్తా కూడా చేరిపోయింది. ఆమె తన బాయ్‌ఫ్రెండ్ డినో మోరియాకు హ్యాండ్ ఇచ్చి కొత్తగా టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి ప్రక్కన ప్రత్యక్షమవుతోందని బాలీవుడ్ గుసగసలు పోతోంది. వివరాలలోకి వెళితే... లారాదత్తా, మహేష్ భూపతి లండన్‌లోని జెడబ్ల్యూ మారియట్ హోటల్‌లో ఒకే గదిలో కలిసి గత కొద్ది రోజులుగా గడుపుతున్నట్లు భోగట్టా. ఇద్దరూ కలిసి ఒకే గదిలో ఉండటాన్ని బట్టి ఇరువురి మధ్య ఎఫైర్ ముదిరిపోయిందని అంటున్నారు. ఇదే విషయంపై మహేష్ భూపతి సన్నిహితులను కదిలిస్తే... లారా మహేష్‌తో కలిసి ఉన్నమాట నిజమేననీ, కానీ వారిద్దరి మధ్య ఎఫైర్ ఉన్నదో లేదో తమకు తెలియదని అంటున్నారు. ఈ సంగతి ఇలా ఉంటే... లారా వదిలేసిన బాయ్‌ఫ్రెండ్ డినో మోరియా మాత్రం లారా పేరు చెబితే పళ్లు పట పట కొరుకుతున్నాడట. ఇలాగే సల్మాన్ ఖాన్ కూడా కత్రినా విషయంలో పళ్లు నూరి.. నూరి వాటిని అరగదీసుకుంటున్నాడని పాపం మోరియాకు తెలియదేమో!!!
Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 5:02 am

ప్రభాస్ ఏక్ నిరంజన్ ట్రెయిలర్

యువహీరో ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జంటగా.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యరామ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఆదిత్యరామ్‌ ఆదిత్యమూవీస్‌ పతాకంపై నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది. సోనూసూద్‌, ముకుల్‌దేవ్‌, మకరన్‌, దేశ్‌పాండే, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, తనికెళ్ళభరణి, పోసాని, సత్యప్రకాష్‌, అలీ, సునీల్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి క్లైమాక్స్ సన్నివేశం హైలైట్‌గా నిలిచిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Nov 2009 | 4:16 am

అగ్ని-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలం: డీఆర్‌డీవో

భారత సైనిక దళం ఉపయోగార్ధం సోమవారం రాత్రి ప్రయోగించిన క్షిపణి-2 బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం విఫలమైనట్టు భారత రక్షణ పరిశోధనా మరియు అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) మంగళవారం ప్రకటించింది. భూ ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని ఒరిస్సా తీరంలోని వీలర్ దీవి నించి ప్రయోగించారు.
Source: జాతీయ | 24 Nov 2009 | 2:23 am

అర్హులైన అందరికీ పదవులు రావు: రోశయ్య

అర్హులైన అందరికీ పదవులు వస్తాయనుకోవడం ఏ మాత్రం సబబు కాదని, అర్హతతో పాటు అదృష్టమూ కలిసి రావాలని ముఖ్యమంత్రి అన్నారు. గాంధీభవన్‌లో జరిగిన కొమ్మినేని శేషగిరిరావు స్మారక అవార్డుల కార్యక్రమంలో సీఎం హాజరయ్యారు. పార్టీకోసం ఏళ్ల తరబడి కష్టపడిన కొమ్మినేని శేషగిరిరావుకు తగిన న్యాయం జరగలేదని రావీగాంధీ పంచాయతీరాజ్ సంఘటన రాష్ట్ర అధ్యక్షుడు నాగుండి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య స్పందించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Nov 2009 | 12:47 am

లిబర్హాన్ కమిషన్ బహిర్గతం: 26వ తేదీన సభలో చర్చ!

ప్రతిపక్షాల ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం లిహర్హాన్ కమిషన్ నివేదికను మంగళవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. నివేదికను కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం సభ ముందుకు తెచ్చారు. కాగా, ఈ నివేదికపై ఈనెల 26వ తేదీన పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చ జరుగుతుందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖామంత్రి సునీల్ కుమార్ బన్సల్ తెలిపారు.
Source: జాతీయ | 24 Nov 2009 | 12:07 am

శాంభవి, ఉషారాణిలపై నంద్యాలలో విచారణ

మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు మంగళవారం శాంభవి, ఉషారాణిలపై నంద్యాల ఆర్టీఓ కార్యాలయంలో విచారణ నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా హేతువాద సంఘాలు నంద్యాల చేరుకున్నాయి. బడికి వెళ్లాల్సిన వయసులో ముక్కుపచ్చలారని చిన్నారిని గుడిలో కూర్చోబెట్టి ఆధ్యాత్మిక ప్రసంగాలు చేయిస్తుందని ఉషారాణిపై చర్యలు తీసుకోవాల్సిందిగా అంతర్జాతీయ మానవవాద-హేతువాద సంఘాల సమాఖ్య.. మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది. ఈ ఫిర్యాదు మేరకు మంగళవారం మానవ హక్కుల సంఘం శాంభవి, ఉషారాణిల వద్ద నంద్యాల ఆర్టీవో కార్యాలయంలో విచారణ జరుపనుందని తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 11:39 pm

కుటుంబ సభ్యులతో నేడు జగన్ మంతనాలు!

పులివెందుల టిక్కెట్ కేటాయింపు అంశం దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో చిచ్చుపెట్టేలా కనిపిస్తోంది. దీంతో కుటుంబ సభ్యులందరితో చర్చించి, ఒక ఏకాభిప్రాయానికి రావాలని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్ణయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 11:09 pm

విద్యాసంస్థల బంద్‌కు బీసీ సంఘాల పిలుపు

విద్యాసంస్థల బంద్‌కు బీసీ సంఘాలు పిలుపు నిచ్చాయి. ఉపకార వేతనాలు, బోధనా రుసుములపై ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మంగళవారం విద్యా సంస్థల బంద్ జరుగనుంది. విద్యాసంవత్సరం ప్రారంభమై ఆరు నెలలు గడుస్తున్నా ఒక్క రెన్యువల్ విద్యార్థికి స్కాలర్‌షిప్ మంజూరు చేయలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ యువజన సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 11:09 pm

త్రిసభ్య కమిటి నివేదికను బహిర్గతం చేయాలి: తెదేపా

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అక్రమాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ పరిశీలించి సమర్పించిన నివేదికను బహిర్గతం చేయాలని ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఆ పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి మంగళవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. ఓఎంసీ కంపెనీకి ప్రభుత్వం అందదండలు పుష్కలంగా ఉన్నాయన్నాని ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 10:54 pm

నేడు పార్లమెంట్‌లో లిబర్హాన్ నివేదిక వెల్లడి: కేంద్రం

ఎట్టకేలకు ప్రతిపక్షాల ఒత్తిడికి కేంద్రం తలొగ్గింది. బాబ్రీ మసీదు కూల్చివేతకు కారకులను బయటపెట్టే లిబర్హాన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయాలని కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు నివేదికను సభ ముందు ప్రవేశపెడతామని కేంద్ర హోంశాఖ మంత్రి పి.చిదంబరం తెలిపారు.
Source: జాతీయ | 23 Nov 2009 | 10:28 pm

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: ముగిసిన తొలిదశ ప్రచారం

జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా తొలి దశ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. రేపు (బుధవారం) 26 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. నక్సల్ ప్రాబల్య ప్రాంతం కావడంతో భారీ సంఖ్యలో సాయుధ బలగాలను కేంద్రం మొహరించింది.
Source: జాతీయ | 23 Nov 2009 | 9:14 pm

భారత సైనిక అమ్ముల పొదిలో అగ్ని-2 క్షిపణి!

భారత సైనికదళం అమ్ముల పొదిలో మరో క్షిపణి చేరింది. భూ ఉపరితలంలోని లక్ష్యాలను ఛేదించగల అగ్ని-2 మధ్య తరహా బాలిస్టిక్ క్షిపణిని రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి. ఒరిస్సా తీరంలోని వీలర్ దీవిలో ఉన్న బాలాసోర్ కేంద్రం నుంచి సోమవారం రాత్రి ఈ క్షిపణిని ప్రయోగం విజయంగా పూర్తి చేసినట్టు ఆ శాఖ అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 23 Nov 2009 | 9:07 pm

పాటల రికార్డింగ్‌లో "శ్రీ తులసీదేవి మహత్యమ్"

గతంలో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో "సంకీర్తన" చిత్రాన్ని నిర్మించిన డా. ఎం. గంగయ్య మళ్లీ 25 ఏళ్ళకు "శ్రీ తులసీదేవి మహత్యమ్" చిత్రానికి శ్రీకారం చుట్టారు. కోణాక్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి గణేశసాయి దర్శకత్వం వహించగా, గురురాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ ప్రసాద్‌ల్యాబ్స్ స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ.. ఇది మహిళా చిత్రం. అగ్గిపెట్టెలాంటి ఇంటిలో కూడా తులసీ మొక్కకు ప్రాధాన్యత ఇస్తారు. తులసీ మొక్క ఎలా పుట్టింది. వాటి పూర్వపరాలేమిటి? అనే నేపథ్యంలో కథ తయారుచేసుకున్నాను. మొదటిభాగం ఆధ్యాత్మికంగానూ, రెండోభాగం సోషియో ఫాంటసీగానూ కథ సాగుతుందన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 11:09 am

దాసరి 149వ చిత్రం "యంగ్ ఇండియా" ప్రారంభం

ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా గిన్నిస్ రికార్డ్ సాధించిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రం "యంగ్ ఇండియా" షూటింగ్ నవంబర్ 22 న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 35 ఏళ్ళ క్రితం నవంబర్ 22న దాసరి అందరూ కొత్తవారితో తీసిన "స్వర్గం-నరకం" రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కాగా, ఈ నవంబర్ 22న యంగ్ ఇండియా ప్రారంభం కావడం విశేషం. నాటి "స్వర్గం-నరకం"తో పరిచయం అయిన మోహన్ హాహు ఈ యంగ్ ఇండియాకు క్లాప్ కొట్టడం మరో విశేషం.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 10:54 am

11న రొమాంటిక్ థ్రిల్లర్ "అమావాస్య"

"2012" హాలీవుడ్ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రాలకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది. తాజాగా పీవీఆర్ థియేటర్స్ గ్రూప్ "ది ట్విలైట్ సాగా- న్యూ మూన్" చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11న అమావాస్య పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. క్రిస్‌టెన్ స్టీవార్డ్, రాబర్ట్ పాటిన్‌సన్, టాయ్‌లర్ లాథర్ నటించిన ఈ చిత్రానికి క్రిస్ విడ్జ్ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టీఫనీ మేయర్ రొమాంటిక్ థ్రిల్లర్ "న్యూ మూన్" నవల ఆధారంగా నిర్మాణమైన ఈ చిత్రంపై బిజినెస్‌పరంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా ఇండియాలో సైతం రికార్డులు సృష్టించడానికి పివిఆర్ ద్వారా "అమావాస్య" డిసెంబర్ 11న విడుదల కానుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 10:28 am

డిసెంబర్ 25న "మా నాన్న చిరంజీవి"

జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం "మా నాన్న చిరంజీవి" (పేద్ద హీరో. లాఫింగ్‌లార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వి.టి. గిరిధరరావు, మురళీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు.విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన గిరిధరరావు మాట్లాడుతూ.. 35రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందన్నారు. సినిమా చేయడం తెలుసుగానీ డిస్ట్రిబ్యూషన్ తెలియదు. అందుచేత నట్టికుమార్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 9:48 am

ప్రశాంతంగా ముగిసిన గ్రేటర్ ఎన్నికల పోలింగ్

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల సమరంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని నగర పోలీస్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. చిన్నపాటి గొడవలు మినహా ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోలేదని ప్రసాదరావు స్పష్టం చేశారు. ఈ గొడవలకు సంబంధించి 12 కేసులు నమోదు కాగా, తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 7:19 am

"మిస్టర్ పర్‌ఫెక్ట్‌‌"గా వస్తోన్న మహేష్ బాబు

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా "కిక్" సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ఆర్.ఆర్. మూవీ మేకర్స్ అధినేత వెంకట్ "మిస్టర్ పర్‌ఫెక్ట్" అనే భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ చిత్రం గురంచి హీరో మహేష్ బాబు మాట్లాడుతూ.. "కథ వినగానే ఎంతో ఎక్సైట్ అయ్యాను. నా కెరీర్‌లో ఇది మరో సెన్సేషనల్ మూవీ అవుతుంది" అని అన్నారు. దర్శకుడు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ.. మహేష్‌బాబుతో సూపర్ డూపర్ హిట్ ఇవ్వాలన్న పట్టుదలతో ఈ ప్రాజెక్ట్ చేస్తున్నాను. "కిక్"లాంటి సూపర్‌హిట్ తీసిన ఆర్.ఆర్. మూవీ మేకర్స్ వెంకట్ పతాకంపై మళ్లీ ఇంత భారీ చిత్రం చెయ్యడం హ్యాపీగా ఉంది" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 6:16 am

శ్రీకాంత్, సదా, మీరా "అ..ఆ.. ఇ...ఈ" ట్రైలర్

"మహాత్మా" చిత్రంతో వంద సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్, గ్లామర్ హీరోయిన్లు మీరా జాస్మిన్, సదాలతో కలిసి నటించిన చిత్రం "అ.. ఆ.. ఇ.. ఈ..". ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో కామిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సెంటిమెంట్, మిస్టరీ వంటి పలు అంశాలను కూడా మేళవించారు. ఇందులో శ్రీకాంత్ మీరాజాస్మిన్, సదాల ముద్దుల భర్తగా అద్భుతంగా నటించాడు. మీరాజాస్మిన్, సదాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Nov 2009 | 6:03 am

పాటల రికార్డింగ్‌లో "శ్రీ తులసీదేవి మహత్యమ్"

గతంలో నాగార్జున, రమ్యకృష్ణ కాంబినేషన్‌లో "సంకీర్తన" చిత్రాన్ని నిర్మించిన డా. ఎం. గంగయ్య మళ్లీ 25 ఏళ్ళకు "శ్రీ తులసీదేవి మహత్యమ్" చిత్రానికి శ్రీకారం చుట్టారు. కోణాక్క్ మూవీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి గణేశసాయి దర్శకత్వం వహించగా, గురురాజ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా పాటల రికార్డింగ్ ప్రసాద్‌ల్యాబ్స్ స్టూడియోలో జరిగింది. ఈ సందర్భంగా చిత్రం గురించి దర్శకుడు వివరిస్తూ.. ఇది మహిళా చిత్రం. అగ్గిపెట్టెలాంటి ఇంటిలో కూడా తులసీ మొక్కకు ప్రాధాన్యత ఇస్తారు. తులసీ మొక్క ఎలా పుట్టింది. వాటి పూర్వపరాలేమిటి? అనే నేపథ్యంలో కథ తయారుచేసుకున్నాను. మొదటిభాగం ఆధ్యాత్మికంగానూ, రెండోభాగం సోషియో ఫాంటసీగానూ కథ సాగుతుందన్నారు.
Source: వినోదం | 23 Nov 2009 | 5:40 am

దాసరి 149వ చిత్రం "యంగ్ ఇండియా" ప్రారంభం

ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన ఏకైక దర్శకుడిగా గిన్నిస్ రికార్డ్ సాధించిన దర్శకరత్న డా. దాసరి నారాయణరావు దర్శకత్వం వహిస్తున్న 149వ చిత్రం "యంగ్ ఇండియా" షూటింగ్ నవంబర్ 22 న రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. సిరి మీడియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై శ్రీమతి దాసరి పద్మ సమర్పణలో రామకృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 35 ఏళ్ళ క్రితం నవంబర్ 22న దాసరి అందరూ కొత్తవారితో తీసిన "స్వర్గం-నరకం" రిలీజ్ అయి సెన్సేషనల్ హిట్ కాగా, ఈ నవంబర్ 22న యంగ్ ఇండియా ప్రారంభం కావడం విశేషం. నాటి "స్వర్గం-నరకం"తో పరిచయం అయిన మోహన్ హాహు ఈ యంగ్ ఇండియాకు క్లాప్ కొట్టడం మరో విశేషం.
Source: వినోదం | 23 Nov 2009 | 5:25 am

11న రొమాంటిక్ థ్రిల్లర్ "అమావాస్య"

"2012" హాలీవుడ్ చిత్రం సూపర్‌హిట్ కావడంతో ఇంగ్లీష్ డబ్బింగ్ చిత్రాలకు ఓ స్పెషల్ క్రేజ్ వచ్చింది. తాజాగా పీవీఆర్ థియేటర్స్ గ్రూప్ "ది ట్విలైట్ సాగా- న్యూ మూన్" చిత్రాన్ని రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 11న అమావాస్య పేరుతో విడుదల చేయడానికి సన్నాహాలు చేసింది. క్రిస్‌టెన్ స్టీవార్డ్, రాబర్ట్ పాటిన్‌సన్, టాయ్‌లర్ లాథర్ నటించిన ఈ చిత్రానికి క్రిస్ విడ్జ్ దర్శకత్వం వహించారు. ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన స్టీఫనీ మేయర్ రొమాంటిక్ థ్రిల్లర్ "న్యూ మూన్" నవల ఆధారంగా నిర్మాణమైన ఈ చిత్రంపై బిజినెస్‌పరంగా చాలా పెద్ద క్రేజ్ వచ్చింది. కలెక్షన్స్ పరంగా ఇండియాలో సైతం రికార్డులు సృష్టించడానికి పివిఆర్ ద్వారా "అమావాస్య" డిసెంబర్ 11న విడుదల కానుంది.
Source: వినోదం | 23 Nov 2009 | 5:09 am

డిసెంబర్ 25న "మా నాన్న చిరంజీవి"

జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం "మా నాన్న చిరంజీవి" (పేద్ద హీరో. లాఫింగ్‌లార్డ్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వి.టి. గిరిధరరావు, మురళీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం గురించి నిర్మాతల్లో ఒకరైన గిరిధరరావు మాట్లాడుతూ.. 35రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తయిందన్నారు. సినిమా చేయడం తెలుసుగానీ డిస్ట్రిబ్యూషన్ తెలియదు. అందుచేత నట్టికుమార్ సహకారంతో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నామని తెలిపారు.
Source: వినోదం | 23 Nov 2009 | 4:20 am

సచిన్ టెండూల్కర్ స్వార్థపరుడు: ఎంపీ సంజయ్ రౌత్

'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్‌పై శివసేన మరోమారు విమర్శలు వర్షం గుప్పించింది. ఈ దఫా మాత్రం సేన చీఫ్ బాల్‌థాక్రే ఆ పాత్రను పోషించలేదు. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ రౌత్ స్వీకరించారు. పార్టీ పత్రికలో సచిన్‌పై విమర్శల వర్షం గుప్పించారు. సచిన్ నిజమైన మహారాష్ట్ర వాది కాదని ధ్వజమెత్తారు.
Source: జాతీయ | 23 Nov 2009 | 3:44 am

గ్రేటర్ సమరం: ఓటేసిన టెన్నిస్ తార సానియా మీర్జా

గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో ప్రజలతో పాటు రాజకీయ నాయకులు, ప్రముఖ టాలీవుడ్ స్టార్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన ఓటు హక్కును వినియోగించారు. కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 3:12 am

తెలంగాణాకు జైకొట్టిన "యాష్కీ" మగాడు: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు ఇచ్చిన ఎంపీ మధుయాష్కీ నిజమైన మగాడు అని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు అన్నారు. సోమవారం వరంగంలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో జరిగిన తెలంగాణా విద్యార్థుల సదస్సులో పాల్గొని ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 3:00 am

రోశయ్య ధృతరాష్ట్రుడైతే.. నాగేందర్ దుర్యోధనుడు..!

రాష్ట్రంలో ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని ఇటీవల ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ మరోసారి కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడింది. రోశయ్య ధృతరాష్ట్రుడు అయితే దానం నాగేందర్ దుర్యోధనుడిలా చెలరేగుతున్నారని తెదేపా నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికల పోలింగ్‌లో కాంగ్రెస్ అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Nov 2009 | 2:01 am

ఈ సమావేశాల్లో సభ ముందుకు నివేదిక: చిదంబరం

బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ జరిపిన జస్టీస్ లిబర్హాన్ కమిషన్ సమర్పించిన నివేదికను ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాల్లోనే సభ ముందు ఉంచుతామని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు. అలాగే, ఒక ఆంగ్ర వార్తపత్రికలో వచ్చిన కథనం సారాంశంపై ఆయన స్పందించేందుకు నిరాకరించారు.
Source: జాతీయ | 23 Nov 2009 | 1:59 am