పోర్టింగ్ ఛార్జీలు రూ.19కు మించరాదు: ట్రాయ్

ఒక మొబైల్ ఆపరేటర్ నుంచి మరొక ఆపరేటర్‌కు మారేందుకు పోర్టింగ్ ఛార్జీని రూ.19కి మించి వసూలు చేయారాదని టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) ఆదేశాలు జారీ చేసింది.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 8:33 am

సముద్రంలో మునిగిన నౌక: 228 మంది జలసమాధి

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో ప్రయాణికులతో వెళుతున్న నౌక ఒకటి మునిగి పోయింది. ఈ ప్రమాదంలో నౌకలోని 228 మంది ప్రయాణికులు జలసమాధి అయినట్టు ప్రాథమిక సమాచారం. ఈ విషయాన్ని ఇండోనేషియా టెలివిజన్ న్యూస్ ఛానల్ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 7:28 am

ఒక్క సీటు ఎక్కువ గెలిచినా రాజీనామా చేస్తా: రోశయ్య

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి తమ పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రకటించారు. ఈ సవాల్‌ను చంద్రబాబు స్వీకరించేందుకు సిద్ధమా అంటు సవాల్ విసిరారు.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 7:09 am

జమ్మూకాశ్మీర్‌లో 700 మంది తీవ్రవాదులు: డీజీపీ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 700 మంది తీవ్రవాదులు ఉన్నట్టు ఆ రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కుల్దీప్ ఖోడా తెలిపారు. వీరికి నిధులతో పాటు.. ఆయుధాలను పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 6:30 am

యాపిల్ ఉత్పత్తి: ఇజ్రాయేల్‌తో హిమాచల్ ఒప్పందం!

దేశంలో హిమాచల్ ప్రదేశ్‌లో ఉత్పత్తి అయ్యే యాపిల్ పండ్లకు మంచి గిరాకీ ఉంది. ఈ పండ్లు మరింత మేలైనవిగా, నాణ్యవంతంగా ఉత్పత్తి చేసేందుకు ఇజ్రాయేల్ సంస్థతో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 6:19 am

చైనా బొగ్గు గనిలో ప్రమాదం: 87కు పెరిగిన మృతులు

చైనాలోని ఒక బొగ్గు గనిలో శనివారం జరిగిన భారీ పేలుడు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 87కు పెరిగింది. చైనాలోని కిలాంగ్షియాంగ్ ప్రొవియన్స్‌లో ఉన్న హేకాంగ్ నగరంలో బొగ్గు గనిలో శనివారం తెల్లవారు జామున 2.30 గంటలకు గ్యాస్ కారణంగా భారీ పేలుడు చోటు చేసుకుంది.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 6:06 am

ఆమరణ దీక్షకు ముందే కేసీఆర్ గృహ నిర్భంధం!

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగంగా ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్షను తలపెట్టారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షకు రెండు రోజుల ముందుగానే గృహ నిర్భంధంలోకి తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం భావిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 5:40 am

వైఎస్ కుటుంబానికే పులివెందుల టిక్కెట్: ధర్మపురి

పులివెందుల ఉప ఎన్నికల టిక్కెట్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కటుంబానికే కేటాయించనున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. కాగా, వచ్చే నెల 19వ తేదీన పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 5:29 am

అస్సోంలో వరుస పేలుళ్లు: నలుగురి మృత్యువాత

అస్సోం రాష్ట్రం మరోమారు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. ఈ రాష్ట్రంలోని నల్బోరి జిల్లాలో ఆదివారం మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 5:19 am

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రరాపాకు బోణీ కష్టమే: చిరు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ బోణీ కొట్టడం కష్టమేనని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభిప్రాయపడ్డారు. అందుకే ఎన్ని సీట్లు వస్తాయని ఆశించడం కంటే.. ఏ మేరకు ఓట్లు పడతాయి, ఎంతశాతం వస్తాయనే అంశాలే తమకు ముఖ్యమన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Nov 2009 | 4:45 am

నాగార్జున సినిమా "రమ్మీ" కాదు "మోసగాడు"

నాగార్జున హీరోగా డి. శివప్రసాదరెడ్డి నిర్మిస్తున్న తాజా చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఇంకా పేరు నిర్ణయించని చిత్రానికి తొలుత రమ్మీ అనుకున్నారు. ఇప్పుడు మోసగాడు పేరును పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Nov 2009 | 4:45 am

రామ్- ఇలియానా... టామ్ అండ్ జెర్రీ

రామ్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా స్రవంతి మూవీస్ పతాకంపై రవికిషోర్ గణేష్ చిత్రాన్ని నిర్మించారు. కాగా తాజాగా రామ్‌తో కిక్ చిత్ర దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ చిత్రాన్ని రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇలియానా హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి "టామ్ అండ్ జెర్రీ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 22 Nov 2009 | 4:29 am

ఒక్క సీటు ఎక్కువ గెలిచినా రాజీనామా చేస్తా: రోశయ్య

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీకి తమ పార్టీ కంటే ఒక్క సీటు ఎక్కువ వచ్చినా తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి కె.రోశయ్య ప్రకటించారు. ఈ సవాల్‌ను చంద్రబాబు స్వీకరించేందుకు సిద్ధమా అంటు సవాల్ విసిరారు.
Source: ఏపీ న్యూస్ | 22 Nov 2009 | 1:39 am

జమ్మూకాశ్మీర్‌లో 700 మంది తీవ్రవాదులు: డీజీపీ

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో సుమారు 700 మంది తీవ్రవాదులు ఉన్నట్టు ఆ రాష్ట్ర డైరక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు కుల్దీప్ ఖోడా తెలిపారు. వీరికి నిధులతో పాటు.. ఆయుధాలను పాకిస్థాన్ నుంచి వస్తున్నాయని ఆయన ఆరోపించారు.
Source: జాతీయ | 22 Nov 2009 | 1:00 am

ఆమరణ దీక్షకు ముందే కేసీఆర్ గృహ నిర్భంధం!

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనలో భాగంగా ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఆమరణ నిరాహారదీక్షను తలపెట్టారు. ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని దీక్షకు రెండు రోజుల ముందుగానే గృహ నిర్భంధంలోకి తీసుకోవాలని రాష్ట్ర పోలీసు యంత్రాంగం భావిస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 22 Nov 2009 | 12:11 am

వైఎస్ కుటుంబానికే పులివెందుల టిక్కెట్: ధర్మపురి

పులివెందుల ఉప ఎన్నికల టిక్కెట్‌ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి కటుంబానికే కేటాయించనున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు. కాగా, వచ్చే నెల 19వ తేదీన పులివెందుల స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ జరుగనున్న విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2009 | 11:59 pm

అస్సోంలో వరుస పేలుళ్లు: నలుగురి మృత్యువాత

అస్సోం రాష్ట్రం మరోమారు బాంబు పేలుళ్ళతో దద్ధరిల్లింది. ఈ రాష్ట్రంలోని నల్బోరి జిల్లాలో ఆదివారం మూడు వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్ళలో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది గాయపడ్డారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 11:50 pm

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రరాపాకు బోణీ కష్టమే: చిరు

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ బోణీ కొట్టడం కష్టమేనని ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభిప్రాయపడ్డారు. అందుకే ఎన్ని సీట్లు వస్తాయని ఆశించడం కంటే.. ఏ మేరకు ఓట్లు పడతాయి, ఎంతశాతం వస్తాయనే అంశాలే తమకు ముఖ్యమన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2009 | 11:15 pm

ఖనిజ సంపదను దోచుకుంటున్న గాలి బ్రదర్స్: కోడెల

రాష్ట్రంలోని ఖనిజ సంపదను కర్ణాటకకు చెందిన గాలి జనార్ధన్ రెడ్డి సోదరులు దోచుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ రావు ఆరోపించారు. ఓబుళాపురం మైనింగ్ కంపెనీల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నట్టు సుప్రీం సాధికారిక కమిటీ స్పష్టం చేసినా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2009 | 10:56 pm

చెరకు మద్దతు ధరపై కేంద్రం రాజకీయం: మాయావతి

రైతుల డిమాండ్ మేరకు చెరకుకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్రం తాత్సారం చేయడంలో ఆంతర్యంమేమిటని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ప్రశ్నించారు. మరికొన్ని రోజులు ఆలస్యం చేసి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని యూపీఏ ప్రభుత్వం భావిస్తోందని ఆమె ఆరోపించారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 10:17 pm

ప్రాంతీయ భాషల్లో కూడా రైల్వే పరీక్షలు: మంత్రి మమతా

రైల్వే పరీక్షలను ప్రాంతీయ భాషల్లో కూడా నిర్వహిస్తామని రైల్వే మంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఉత్తర భారతదేశం నుంచి రైల్వే పరీక్షలు రాయడానికి వస్తున్న అభ్యర్థులపై మహారాష్ట్ర సవనిర్మాణ్‌ సేన దాడులు చేస్తుండడంతో మమతాబెనర్జీ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 9:37 pm

రెండంటే రెండు పెగ్గులే తాగుతా: మోహన్ బాబు

ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం అంటూ సినీ ఇండస్ట్రీలో ఎవరున్నారంటే... మంచు మోహన్ బాబు గుర్తుకు వస్తారు. తన డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్న విలక్షణ నటుడు మోహన్ బాబు. తన గురువుగారంటూ.. చెప్పుకునే దాసరి నారాయణరావు ఆయనను సినీరంగానికి పరిచయం చేశారు. అసిస్టెంట్ దర్శకుడిగా, కో డైరెక్టర్‌గా పలు చిత్రాలకు పనిచేసిన ఆయన దాసరి వద్ద దర్శకశాఖకు ఫుల్‌స్టాప్ పెట్టాడు. దాసరి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తూ స్వర్గం- నరకంలో మోహన్ బాబుకు నటుడిగా ఛాన్స్ ఇచ్చాడు. సరిగ్గా ఆ చిత్రం విడుదలై రేపటికి (ఆదివారం 22.11.2009) 35 ఏళ్లు అయింది. ఈ సందర్భంగా ఆయన తన సన్నిహితులైన ముగ్గురు మీడియా అధినేతలతో ముచ్చటించారు. పలు విషయాలు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 11:54 am

సెన్సార్ పూర్తయిన "తాజ్ మహల్"

శివాజీ, శృతి హీరోహీరోయిన్లుగా అరుణ్ సింగార్ దర్శకత్వంలో శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై హీరో శివాజీ నిర్మిస్తున్న తాజ్ మహల్ చిత్రం సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ, ఈ చిత్రం క్లీన్ యు సర్టిఫికేట్ పొందింది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 11:50 am

డిసెంబరు 25న మా నాన్న చిరంజీవి

జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం మా నాన్న చిరంజీవి చిత్రాన్ని లాఫింగ్ లార్డ్స్ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై వి.టి. గిరిధరరావు, మురళీ సంయుక్తంగా నిర్మించారు. అరుణ్ ప్రసాద్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 10:07 am

నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు

నవంబరు 23న నాగచైతన్య పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని ఆలిండియా నాగార్జున ఫ్యాన్స్ అసోసియేషన్ హైదరాబాద్ అధ్యక్షుడు పి.రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారంనాడు అన్నపూర్ణా స్టూడియోలో వరద బాధితల సహాయార్థం 10 కుటుంబాలకు 10వేల చొప్పున లక్షరూపాయలను అందజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 9:57 am

మహారాష్ట్ర ముఖ్యమంత్రి చవాన్ నోట "స్థానిక నినాదం"

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూడా స్థానిక నినాదాన్ని అందుకున్నారు. రైల్వే శాఖ ఖాళీల్లో స్థానికులకే అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 6:14 am

ముగిసిన గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. శనివారం సాయంత్రం నుంచి 24వ తేదీ ఉదయం ఆరు గంటల వరకు ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 24వ తేదీన మంగళవారం జరిగే ఎన్నికల పోలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2009 | 6:03 am

డిసెంబరు 4న వస్తోన్న మన్మథులు

యువ నిర్మాత వి. సురేష్ చౌదరి సూర్య పవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై తెలుగు ప్రేక్షకులకు అందిస్తోన్న మన్మథులు చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబరు 4న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. అంతా కొత్త నటీనటులతో ఈ చిత్రాన్ని రూపొందించాం. తమిళంలో ఈ చిత్రం బిగ్ హిట్ సాధించింది. అందరూ మెచ్చే చిత్రంగా తెరకక్కిన ఈ సినిమాకు చాలా కాలం తర్వాత ఇళయరాజా సంగీతం అందించారు అని అన్నారు. అతిరూపన్, ప్రీతిరంగయాని జంటగా నటించిన ఈ చిత్రంలో బాబిలోనా, స్టెఫి ఇతర పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వేలు రాజా
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 5:57 am

మమత "మోహనం"గా బొడ్డు కింద టాట్టూ...

టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోనే కాకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో ఎక్కువ కాలం మనుగడ సాగించాలని భావించే హీరోయిన్లు అంగాంగ ప్రదర్శనలకు ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. ముఖ్యంగా.. తెలుగులో పొడవుకాళ్ల సుందరిగా పేరొందిన త్రిష టాట్టూ (పచ్చబొట్టు)ని ఎదపై వేయించుకుంటే.. కొందరు భాచితపైనా, మరికొందరు బొడ్డుపైనా వేసుకున్నారు. ఈ జాబితాలో మమతామోహన్‌దాస్ కూడా తాజాగా చేరింది. యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం రమ్మీలో ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. ఈ చిత్రంలో అందాలను ఆరబోసేందుకు మమతా పోటీ పడుతోందట. అంతేకాదు.. టాట్టూను బొడ్డుకింద వేయించుకుని గ్లామర్‌ను ప్రదర్శిస్తుందని సినీ వర్గాల్లో టాక్. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందోనని వేచి చూడాల్సిందే.ముఖ్యంగా.. తెలుగులో నటించే హీరోయిన్ల మధ్య ఎక్కువగా పోటీ నెలకొనివుంది. దీంతో పదహారణాల తెలుగు ముద్దుగుమ్మలు సైతం పోటీ పడుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Nov 2009 | 5:47 am

కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు గాలి కుట్ర: వీహెచ్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులను ఓడించేందుకు కర్ణాటక మంత్రి, ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి కుట్ర పన్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వీహెచ్.హనుమంతరావు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Nov 2009 | 4:43 am

మీడియా సంస్థపై దాడి: కస్టడీకి సేన కార్యకర్తలు

ముంబైలోని ఐబీఎన్ లోక్‌మత్ మరాఠీ న్యూస్ ఛానల్‌ కార్యాలయంపై దాడి చేసిన కేసులో 17 మంది శివసేన కార్యకర్తలను స్థానిక కోర్టు పోలీలు కస్టడీకి పంపించింది. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం నిందితులను కస్టడీకి అనుమతి ఇచ్చింది.
Source: జాతీయ | 21 Nov 2009 | 3:57 am

రాహుల్ పట్టించుకోలేదు... మీరైనా న్యాయం చేయండి

అమేథీలోని ముషింగంజ్ అతిథి గృహానికి వెళుతున్న ప్రియాంకా గాంధీ వాధ్రా వాహనాన్ని ఒక ప్రైవేటు వస్త్ర పరిశ్రమకు చెందిన కార్మికులు కొందరు అడ్డుకున్నారు. తాము పనిచేస్తున్న కంపెనీ గత ఎనిమిది నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనీ, ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.
Source: జాతీయ | 21 Nov 2009 | 2:37 am