సరిహద్దు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్: హిల్లరీ

దక్షిణాసియాలో సరిహద్దు తీవ్రవాదాన్ని పాకిస్థాన్ ప్రోత్సహిస్తోందని అమెరికా విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. అమెరికాకు చెందిన ఒక రేడియో సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె పైవిధంగా విమర్శలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 8:53 am

రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి: వీహెచ్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ యువనేతలు నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హితవు పలికారు. తనను భావి ప్రధానిగా చూడవద్దని వినయంగా ప్రకటించిన రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువనాయకులకు ఆదర్శప్రాయుడిగా మారారని వీహెచ్ ప్రశంసించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనానికి ఆదర్శమని కొనియాడారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 8:47 am

పార్లమెంట్‍‌లో చెరకు దడ: రెండు రోజుల వాయిదా!

చెరకు మద్దతు ధరపై పార్లమెంట్ మరోమారు దద్ధరిల్లింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు సమావేశమైన పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు చెరకు మద్దతు ధరపై పట్టుబట్టాయి.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 8:42 am

పుంజుకున్న యూరప్ మార్కెట్ ట్రేడింగ్: లాభాల్లో సెన్సెక్స్

యూరప్ మార్కెట్ సూచీలైన ఎఫ్‌టీఎస్ఈ100, డాక్స్‌లు లాభాల వైపు పయనించడంతో బాంబే స్టాక్ మార్కెట్ పురోగమనం వైపు ర్యాలీని కొనసాగిస్తోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో పుంజుకుని ఏకంగా 186 పాయింట్లు లాభపడింది. దీంతో సెన్సెక్స్ సూచీ 16,972 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 39 పాయింట్లు వృద్ధి చెంది, 5, 028 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 8:18 am

35 శాతం వాటాలను అమ్మనున్న సుజలాన్

గాలి మరల నుండి విద్యుదుత్పత్తి చేసే కంపెనీల్లో అగ్రగామిగానున్న సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్ అనుబంధ సంస్థలైన ఏఈ రోటర్ హోల్డింగ్ బీవీ బెల్జియంకు చెందిన గాలిమరల విద్యుత్, పారిశ్రామిక గేర్ బాక్స్ కంపెనీ అయిన హైంసన్ ట్రాన్స్‌మిషన్స్‌లో తన వాటాను అమ్మనుంది.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 7:53 am

నష్టాల్లోనే కొనసాగుతోన్న బాంబే స్టాక్ మార్కెట్

సోమవారంతో ప్రారంభమైన ఈ వారంలోని చివరి మూడు రోజుల్లో సెన్సెక్స్ తిరోగమనం పయనిస్తోంది. బుధ, గురువారాల్లో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ వారాంతమైన శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 108 పాయింట్లు భారీగా క్షీణించి, 16,677 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 52 పాయింట్లు పతనమై, 4,936 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 7:19 am

హబ్బా... అన్నానంటే గ్రీన్ టీ వచ్చేస్తుంది: హాన్సిక

"దేశముదురు"తో ముందుకు వచ్చిన హాన్సిక తన బ్యాగ్‌లో ఏమున్నా లేకపోయినా అది లేకుండా బయటకు కాలు పెట్టదట. అదంటే ఏదో అనుకునేరు. అది గ్రీన్ టీ ప్యాకెట్ అట. అలసిపోయి హబ్బా అని అనిపిస్తే వెంటనే గ్రీన్ టీ ప్యాకెట్ ఓపెన్ చేసి ఓ కప్పు లాగించేస్తుందట. అంతే... పరుగెత్తుకుంటూ ఒంట్లోకి హుషారు వచ్చేస్తుందట. అన్నట్లు హాన్సిక ఇంకా టీనేజ్‌ను దాటనేలేదట. ఇంత చిన్న వయసులోనే బాగా సంపాదించేస్తున్న హాన్సికను తన స్నేహితులు అంత డబ్బును ఎక్కడ దాస్తున్నావని అడిగితే అంతా అమ్మకే ఇస్తున్నాను అంటోంది. అమ్మ నాకు మార్గదర్శకమని చెపుతోంది. ఎన్ని గంటలకు నిద్రలేవాలి, టిఫిన్ ఎప్పుడు తినాలి. భోజనం ఎన్ని క్యాలరీలు ఉండాలి అనేవి తన తల్లే నిర్ణయిస్తుందని చెపుతోంది ఈ తెల్లపిల్ల. తను అలసటగా ఉన్నట్లు కనిపిస్తే తన తల్లి చిన్నప్పుడు గ్రీన్ టీ ఇచ్చేదనీ, ఇప్పుడు కూడా అలసట తీరేందుకు దానినే ఆశ్రయిస్తున్నాననీ చెపుతోంది. తాజాగా "సీతారాముల కల్యాణం లంకలో" చిత్రం షూటింగ్ గ్యాప్ లో కూడా గ్రీన్ టీని సిప్ చేస్తూ కనబడిందట. మొత్తానికి హాన్సిక ఎనర్జీ వెనుక గ్రీన్ టీ హస్తం ఉందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Nov 2009 | 7:16 am

నష్టాల్లోనే విదేశీ సూచీలు: సెన్సెక్స్ పతనం

విదేశీ స్టాక్ మార్కెట్లు తిరోగమనంవైపు పయనిస్తున్న కారణంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ నష్టాల్లో కూరుకుపోయింది. వారాంతమైన శుక్రవారం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 42 పాయింట్లు పడిపోయి, 16,743 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14పాయింట్ల నష్టంతో 4,974 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 6:20 am

2వేల మందిని తొలగించనున్న సోనీ ఎరిక్సన్

మొబైల్ హ్యాండ్‌సెట్‌ల తయారీదార్లలో అగ్రగామిగానున్న సోనీ ఎరిక్సన్ సంస్థ ప్రపంచవ్యాప్తంగానున్న తమ సంస్థలలోని ఉద్యోగులను తొలగించనుంది.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 6:08 am

కేంద్ర మాజీ మంత్రి శంకరానంద్ కన్నుమూత

కాంగ్రెస్ వృద్ద సీనియర్ నేత, మాజీ మంత్రి బి.శంకరానంద్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 6:08 am

అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ప్రధాని

దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయన ఒక షరతు విధించారు. పాక్ గడ్డపై నుంచి భారత్‌పైకి తీవ్రవాద దాడులు జరుగకుండా చూడాలన్ని ప్రధాన షరతుగా ఆయన చెప్పుకొచ్చారు.
Source: Yahoo! Telugu: News | 20 Nov 2009 | 5:53 am

"యువరాజు"తో జతకట్టనున్న సానియా మీర్జా!

భారత అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా ఆటతోనే కాకుండా గ్లామర్‌తో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించింది. గ్లామర్‌తో అభిమానులను ఆకట్టుకుంటోన్న సానియా మీర్జాపై టాలీవుడ్ నిర్మాతలు కన్నేశారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. అంతేగాకుండా.. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌తో సానియా మీర్జా నటిస్తుందని "శివాజీ" షూటింగ్ సమయంలోనే వార్తలు షికార్లు చేశాయి. కానీ సానియా మీర్జా ఆడపాదడపా ప్రకటనలకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం టాలీవుడ్ ప్రిన్స్ మహేష్‌బాబుతో సానియా నటిస్తోంది. కానీ.. ఇదేదో సినిమా అనుకుంటే మాత్రం పప్పులో కాలిసినట్టే..!. ఓ ఎయిర్‌సెల్ కంపెనీకి తమిళంలో సూర్య. జాతీయ స్థాయిలో ధోనీ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఆ అవకాశం తెలుగులో మహేష్ బాబుకు, సానియాకు లభించిందని ఫిలిమ్ నగర్ వర్గాల సమాచారం. మరి ఈ జంట ఈ ప్రకటన ద్వారా ప్రేక్షకులను, అభిమానులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాల్సిందే..!
Source: Yahoo! Telugu: Entertainment | 20 Nov 2009 | 4:15 am

రాహుల్ గాంధీని చూసి నేర్చుకోండి: వీహెచ్

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీని చూసి కాంగ్రెస్ యువనేతలు నేర్చుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు హితవు పలికారు. తనను భావి ప్రధానిగా చూడవద్దని వినయంగా ప్రకటించిన రాహుల్ గాంధీ రాజకీయాల్లో యువనాయకులకు ఆదర్శప్రాయుడిగా మారారని వీహెచ్ ప్రశంసించారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఆయన హుందాతనానికి ఆదర్శమని కొనియాడారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 3:17 am

పార్లమెంట్‍‌లో చెరకు దడ: రెండు రోజుల వాయిదా!

చెరకు మద్దతు ధరపై పార్లమెంట్ మరోమారు దద్ధరిల్లింది. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా శుక్రవారం రెండో రోజు సమావేశమైన పార్లమెంట్‌లో ప్రతిపక్ష పార్టీలు చెరకు మద్దతు ధరపై పట్టుబట్టాయి.
Source: జాతీయ | 20 Nov 2009 | 3:13 am

కేంద్ర మాజీ మంత్రి శంకరానంద్ కన్నుమూత

కాంగ్రెస్ వృద్ద సీనియర్ నేత, మాజీ మంత్రి బి.శంకరానంద్ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. కిడ్నీ సంబంధింత వ్యాధితో బాధపడుతూ వచ్చిన ఆయన కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాంలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Source: జాతీయ | 20 Nov 2009 | 12:39 am

అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం: ప్రధాని

దాయాది దేశం పాకిస్థాన్‌తో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ మరోమారు స్పష్టం చేశారు. ఇందుకోసం ఆయన ఒక షరతు విధించారు. పాక్ గడ్డపై నుంచి భారత్‌పైకి తీవ్రవాద దాడులు జరుగకుండా చూడాలన్ని ప్రధాన షరతుగా ఆయన చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 20 Nov 2009 | 12:27 am

గ్రేటర్ హైదరాబాద్ మేయర్ కుర్చీ మాదే: బాలయ్య

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని తమ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత, సినీనటుడు నందమూరి బాలకృష్ణ జోస్యం చెప్పారు. శుక్రవారం ఉదయం ఆయన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తెదేపా అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 12:27 am

గ్రేటర్ అభివృద్ధి ఘనత వైఎస్సార్‌దే: డి.శ్రీనివాస్

దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి చేసిన గ్రేటర్ అభివృద్ధిపై పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రపంచ స్థాయి నగరం తీర్చిదిద్దే ప్రణాళికలో భాగంగా శివారు మున్సిపాలిటీలను కలిపి గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు చేసిన ఘనత వైఎస్. రాజశేఖర రెడ్డిదేనని డీఎస్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 12:27 am

తెలంగాణా మహిళల రక్షణలో కేసీఆర్ ఆమరణ దీక్ష!

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఈనెల 29వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు చేపట్టనున్న ఆమరణ నిరాహారదీక్ష పూర్తిగా మహిళా రక్షణలో సాగనుంది. తన దీక్షకు రాష్ట్ర పోలీసు యంత్రాంగం ఎలాంటి ఆటంకాలు కలిగించకుండా ఉండేందుకు వీలుగా తెరాస ఈ ఎత్తుగడ వేసింది.
Source: ఏపీ న్యూస్ | 20 Nov 2009 | 12:26 am

"గ్రేటర్ ఎన్నికల" ప్రచానికి శ్రీకారం చుట్టిన వైఎస్.జగన్!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం శ్రీకారం చుట్టారు. ఆయన రెండు రోజుల పాటు 15 డివిజన్లలో ప్రచారం చేస్తారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2009 | 11:47 pm

ట్రాక్‌ను పేల్చివేసిన మావోలు: పట్టాలు తప్పిన రైలు

జార్ఖండ్ రాష్ట్రంలో మావోయిస్టులో మరోమారు రైల్వే ఆస్తులకు నష్టం కలిగించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని సంగ్‌‌భుమ్ పశ్చిమ జిల్లాలో రైల్వే ట్రాక్‌ను పేల్చి వేశారు. ఫలితంగా టాటా-బిస్లాపూర్ ప్యాసింజర్ రైలుకు చెందిన ఎనిమిది బోగీలు పట్టాలు తప్పాయి. ఘగ్రా సమీపంలో ఈ సంఘటన చోటు చేసుకుంది.
Source: జాతీయ | 19 Nov 2009 | 11:10 pm

రోజా పునరాగమనానికి మోకాలడ్డుతున్న భువనేశ్వరి!

తెలుగు మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు కె.రోజా తిరిగి సొంత గూటికి చేరుకునేందుకు తహతహలాడుతున్నారు. అయితే, ఆమె రాకను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు సమాచారం. ఒకదశంలో చంద్రబాబు సైతం విముఖత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2009 | 10:56 pm

ఫలించిన రాహుల్ గాంధీ కృషి: బుందేల్‌ఖండ్‌కు ప్యాకేజీ!

కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ కృషి ఫలించింది. ఉత్తరప్రదేశ్-మధ్యప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుల్లోని బుందేల్‌ఖండ్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఇందుకోసం 7,266 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేయనుంది.
Source: జాతీయ | 19 Nov 2009 | 9:31 pm

రాహుల్‌ను నిందితునిగా పరిగణించలేం: ముంబై కమిషనర్

బాలీవుడ్ నటుడు రాహుల్ భట్‌ను ముంబై దాడుల కేసుల్లో ఒక నిందితునిగా పరిగణించలేమని, అయితే, ఒక సాక్షిగా చూస్తున్నట్టు ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా తెలిపారు. రాహుల్‌ స్వచ్ఛందంగా వచ్చి సమాచారం తెలిపారన్నారు. అందువల్ల ఆయనను నిందితుడిగా పరిగణించలేమన్నారు.
Source: జాతీయ | 19 Nov 2009 | 8:44 pm

కీలక సన్నివేశాల్లో "నమో వెంకటేశ"

విక్టరీ వెంటేష్, త్రిష కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం నమో వెంకటేశ. శ్రీను వైట్ల దర్శకత్వంలో గోపీ, రాము, అనిల్ నిర్మిస్తున్నారు. డి. సురేష్ బాబు సమర్పిస్తున్నారు. నానక్‌రామ్‌గూడా సినీ విలేజ్‌లో వేసిన అద్భుతమైన సెట్లో గత కొద్ది రోజులుగా కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. గురువారంనాడు వెంకటేష్, త్రిష, కోట శ్రీనివాసరావు, ముఖేష్ రుషి, ఢిల్లీ రాజేశ్వరి, తెలంగాణా శకుంతల, బెనర్జీ, బ్రహ్మానందం, మాస్టర్ భరత్‌పై కొన్ని సన్నివేశాలు చిత్రించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2009 | 1:52 pm

"కాస్కో" వైభవ్ మినీ రవితేజ

గొడవ ఫేమ్ వైభవ్ బాడీ లాంగ్వేజ్‌లో చిలిపితనముంది. ఎంతో చలాకీగా నటిస్తున్నాడు. అతను మినీ రవితేజ అవుతాడని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఎ.కోదండరామిరెడ్డి సమర్పిస్తున్న కాస్కో చిత్ర ఆడియో ఆవిష్కరణ జూబ్లీ హిల్స్‌లో జరిగింది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో సునీల్ రెడ్డి, భారతి నిర్మిస్తున్నారు. ఆడియో సీడీని పద్మశ్రీ బ్రహ్మానందం విడుదల చేసి డాక్టర్ పరుచూరి గోపాలకృష్ణకు అందించారు. ఈ సందర్భంగా హాజరైన ప్రముఖులు ఎ. కోదండరామిరెడ్డితో తమకు గల సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకున్నారు. "నేను అవకాశాలకోసం ఎదురు చూస్తున్న రోజుల్లో కోదండ రామిరెడ్డిని కలిసి సిరిమల్లె పువ్వు కథ చెప్పాను. నచ్చలేదు. ఆయన మంచి ఆర్టిస్ట్. తన చిత్రాలకు ఆయనే బొమ్మలు గీసి చూపిస్తాడు. వారి తనయుడు వైభవ్ తొలి సినిమా గొడవకు నేనే రాశాను. కాస్కో మంచి సక్సెస్ ఇస్తుందని ఆశిస్తున్నాన"ని పరుచూరి అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2009 | 1:34 pm

చెరకు రైతుల ఆందోళన: ప్రధాని అత్యవసర సమావేశం

చెరకు రైతుల ఆందోళన తీవ్రత దృష్ట్యా ప్రధాని మన్మోహన్ సింగ్ అత్యవసర కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ, న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ, వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్, హోం మంత్రి పి. చిదంబరం పాల్గొన్నారు.
Source: జాతీయ | 19 Nov 2009 | 8:31 am

రనౌత్‌కు హెడ్లీతో లింకు లేదు: కంగనా తండ్రి

ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధమున్న హెడ్లీతో తన కుమార్తె కంగనా రనౌత్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆమె తండ్రి చెప్పారు. పేలుళ్లు జరుగక ముందు హెడ్లీ పలు బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి తిరిగాడని వార్తలు వచ్చిన సంగతి విదితమే. హెడ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారిలో ఆర్తీ చాబ్రియాతోపాటు మరో ఐదుగురు తారలు ఉన్నట్లు భోగట్టా. ఆ ఐదుగురిలో కంగనా పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదనీ, తన కుమార్తెకు హెడ్లీ ఎవరో తెలియదని ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ వెల్లడించాడు. ఈ అభూత కల్పనకు కారకులైన వారిపై తాము చర్య తీసుకునేందుకు న్యాయవాదిని సంప్రదిస్తున్నట్లు ఆయన తెలిపారు. "మరి మహేష్ భట్ చిత్రాల్లో కంగనా నటించింది కదా".. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "మహేష్ భట్ చిత్రాల్లో నటించిన మాట నిజమే. కానీ ఆయన కుమారుడు రాహుల్ భట్‌తో ఆమెకు ఎలాంటి పరిచయం లేదు. రాహుల్ భట్ పరిచయమే లేకపోతే హెడ్లీతో స్నేహం అనే ప్రశ్నకు తావెక్కడుంది" అని ప్రశ్నిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2009 | 8:30 am

నగ్నానికి కూతవేటు దూరంలో బాలీ భామలు

వెండితెరపై ముద్దులు హద్దులు మీరుతున్నాయి. చీకటి సన్నివేశపు ముద్దులు నేడు గాఢ చుంబనలుగా మారి నిర్భయంగా తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు ముద్దు సన్నివేశం వస్తుందనగానే దృశ్యం నలుపు రంగుకు మారి చీకటి కనబడేది. ఆ చీకట్లో సదరు జంట ముద్దు అనుభవాన్ని చవిచూస్తున్నట్లు సంభాషణ మాత్రం వినిపించి వదిలేసేవారు. క్రమంగా అటువంటి దృశ్యాలు కనుమరుగై గాఢ చుంబన దృశ్యాలు వెండితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. వేడి ముద్దులను ఇవ్వడంలో హాలీవుడ్ సినీ పరిశ్రమదే తొలి స్థానం. అయితే పాశ్చాత్య పోకడలను వ్యతిరేకించే భారత్‌లోనూ నేడు క్రమంగా హాలీవుడ్ స్థాయి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. గాఢ చుంబనలు నేడు సర్వసాధారణమైపోయాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2009 | 5:29 am

మూడు రోజుల పర్యటనకు అమెరికా వెళ్లనున్న ప్రధాని

మన్మోహన్ అమెరికా పర్యటనలో ఇరు దేశాల మధ్య సంబంధాల పటిష్టతకు తీసుకోవల్సిన చర్యలతోపాటు ప్రపంచ సమస్యలైన వాతావరణ కాలుష్యంపై ఆసియా దేశాలు పోషించాల్సిన పాత్రపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు.
Source: జాతీయ | 19 Nov 2009 | 5:23 am

గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌కు చేరుతున్న వరద నీరు

ఒంగోలు తదితర ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షం కారణంగా గుండ్లకమ్మ ప్రాజెక్టులో భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరుతోంది. గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌లో భారీగా వరద నీరు చేరుతుండటంతో గురువారం నాడు నాలుగు గేట్లు ఎత్తివేసినట్లు ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. గేట్లను ఎత్తివేసి నీటిని కిందకు వదిలేస్తున్నారు. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2009 | 5:13 am

బంగ్లాదేశ్ ప్రధానికి ఇందిరాగాంధీ శాంతి పురస్కారం

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ ఏడాది ఇందిరా గాంధీ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ప్రతి ఏడాది అంతర్జాతీయంగా శాంతిని అభివృద్ధి పరచే అంశంలో భాగంగా అందజేసే ఇందిరా గాంధీ శాంతి బహుమతికి బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాను భారత ప్రభుత్వం ఎంపిక చేసింది.
Source: జాతీయ | 19 Nov 2009 | 4:59 am