తిరోగమనం వైపు అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు

గురువారం దేశీయ బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు విదేశీ ఆసియా, యూరప్ మార్కెట్లకు ఏ మాత్రం కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను నమోదు చేసుకున్న స్టాక్ మార్కెట్లు భారత కాలమానం ప్రకారం సాయంత్రం నాలుగు గంటలకు కూడా యధావిధిగా నష్టాల్లోనే ర్యాలీని కొనసాగిస్తున్నాయి. ఇందులో దేశీయ బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 184 పాయింట్ల నష్టంతో 16,813 పాయింట్ల మార్కు వద్ద నిలిచింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 65 పాయింట్లు పతనమై 4,989 మార్కు వద్ద ర్యాలీని ముగించింది. అలాగే ఆసియా మార్కెట్లు నికాయ్ 225 సూచీ.. 127 పాయింట్ల నష్టంతో 9,549 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. హాంగ్ షెంగ్ 197 పాయింట్లు భారీగా పతనమై, 22,643 పాయింట్ల వద్ద పయనిస్తోంది. ఇకపోతే.. యూరప్ మార్కెట్లు ఎఫ్‌టీఎస్ఈ 100 సూచీ 18 పాయింట్ల స్వల్ప నష్టంతో, 5,323 పాయింట్ల వద్ద కొనసాగుతోండగా, డాక్స్ 28 పాయింట్ల నష్టంతో 5,758 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 8:36 am

రనౌత్‌కు హెడ్లీతో లింకు లేదు: కంగనా తండ్రి

ముంబయి ఉగ్రవాద దాడులతో సంబంధమున్న హెడ్లీతో తన కుమార్తె కంగనా రనౌత్‌కు ఎటువంటి సంబంధం లేదని ఆమె తండ్రి చెప్పారు. పేలుళ్లు జరుగక ముందు హెడ్లీ పలు బాలీవుడ్ హీరోయిన్లతో కలిసి తిరిగాడని వార్తలు వచ్చిన సంగతి విదితమే. హెడ్లీతో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన వారిలో ఆర్తీ చాబ్రియాతోపాటు మరో ఐదుగురు తారలు ఉన్నట్లు భోగట్టా. ఆ ఐదుగురిలో కంగనా పేరు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలో నిజం లేదనీ, తన కుమార్తెకు హెడ్లీ ఎవరో తెలియదని ఆమె తండ్రి అమర్‌దీప్ రనౌత్ వెల్లడించాడు. ఈ అభూత కల్పనకు కారకులైన వారిపై తాము చర్య తీసుకునేందుకు న్యాయవాదిని సంప్రదిస్తున్నట్లు ఆయన తెలిపారు. "మరి మహేష్ భట్ చిత్రాల్లో కంగనా నటించింది కదా".. అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, "మహేష్ భట్ చిత్రాల్లో నటించిన మాట నిజమే. కానీ ఆయన కుమారుడు రాహుల్ భట్‌తో ఆమెకు ఎలాంటి పరిచయం లేదు. రాహుల్ భట్ పరిచయమే లేకపోతే హెడ్లీతో స్నేహం అనే ప్రశ్నకు తావెక్కడుంది" అని ప్రశ్నిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2009 | 8:30 am

అమ్మకాల ఒత్తిడి: భారీ నష్టాల్లో సెన్సెక్స్

దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ భారీ నష్టాల్లో పయనిస్తోంది. రియాల్టీ, ఐటీ, బ్యాంకింగ్, మెటల్ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురవడంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 260 పాయింట్లు భారీ క్షీణించి, 16,737 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 84 పాయింట్లు పడిపోయి, 4,970 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 8:27 am

14.55 శాతానికి పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు

నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పప్పుదినుసులు, మాంసం, మసాలా దినుసులు నవంబర్ 7తో ముగిసిన వారాంతంలో నిరుడు ఇదే కాలానికి పెరిగిన ధరలతో పోలిస్తే దాదాపు 14.55 శాతానికి పెరిగింది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 8:09 am

నష్టాల బాటలోనే బాంబే స్టాక్ మార్కెట్

విదేశీ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాలను నమోదు చేసుకుంటోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే నష్టాలను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో 73 పాయింట్లు క్షీణించి, 16,925 వేల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 27 పాయింట్లు కోల్పోయి, 5,026 మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే.. మధ్యాహ్నం 1.30 గంటలకు 140 పాయింట్ల మేర క్షీణించిన సెన్సెక్స్ మెల్లమెల్లగా కోలుకుని 70 పాయింట్ల వద్దకు చేరుకుంటుందని స్టాక్ మార్కెట్ నిపుణులు అంటున్నారు. దీంతో ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్ మార్కెట్ స్వల్ప నష్టాల్లో ముగిసే అవకాశముందని వారు అంచనా వేస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 8:08 am

ముజీబ్ హంతకులకు ఉరిశిక్ష విధించిన కోర్టు

బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడిన గెలిచిన షేక్ ముజీబ్-ఉర్-రెహ్మాన్‌ను హతమార్చిన ఐదుగురు నిందితులకు దేశంలోని ఉన్నత న్యాయస్థానం వారికి ఉరిశిక్షను విధించింది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 7:27 am

సినీ నటుడు బాలకృష్ణకు అరెస్ట్ వారెంట్

గతంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలను అతిక్రమించిన కేసులో టాలీవుడ్ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుని హోదాలు పాల్గొన్న బాలకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 6:56 am

అనువాదకులు కావలెను

మీకు ఇంగ్లీషు నుంచి తెలుగుకు అనువాదం చేసే సామర్థ్యం ఉన్నదా...? డిగ్రీ ఉత్తీర్ణులై ఖాళీగా ఉన్నారా...? వెబ్‌దునియా తెలుగు మీకు ఉద్యోగ అవకాశం కల్పిస్తుంది. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతలు... ఇంగ్లీషు నుంచి తెలుగు అనువాదం చేయగలగడమే ప్రధాన అర్హత. స్త్రీ, పురుషులు ఎవరైనా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అదనపు అర్హతగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే ఇంకా మంచిది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 6:54 am

చెరకు మద్దతు ధరపై స్థంభించిన లోక్‌సభ

లోక్‌సభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన వెంటనే దివంగత నేతలకు నివాళులర్పించిన తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెరకు మద్దతు ధరలపై విపక్షాలు సభను స్థంభింపజేశాయి. దీంతో సభను సజావుగా నడిపేందుకు వీలుగా రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 6:44 am

టాటా సంస్థలకు వారసుడు కావాలి: రతన్ టాటా

ఉప్పు నుంచి ఉక్కు వరకు అమ్మే సత్తాగల వ్యక్తి కోసం టాటా సంస్థ ఎదురు చూస్తోంది. అంటే ప్రపంచంలోనే పెద్ద పారిశ్రామిక, వ్యాపార గ్రూపు కంపెనీలకు అధిపతయ్యే అవకాశం ఎవరికి దక్కనుందో...! రతన్ టాటాకు వారసుడు కావాలి. దేశ-విదేశాల్లో అతి పెద్ద సంస్థ అయిన టాటా సంస్థను సమర్ధవంతంగా నడిపేందుకు అత్యంత సమర్ధుడైన నాయకుడు కావాలి. భారతీయుడైతే మరీ మంచిదంటున్నారు రతన్ టాటా.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 5:57 am

ఊపందుకోని విదేశీ మార్కెట్ల ట్రేడింగ్: సెన్సెక్స్ పతనం

అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ పుంజుకోకపోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. గురువారం ట్రేడింగ్ ప్రారంభం నుంచి నష్టాల బాటలో పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 66 పాయింట్లు పతనమై, 16,932వేల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,040 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 19 Nov 2009 | 5:54 am

నగ్నానికి కూతవేటు దూరంలో బాలీ భామలు

వెండితెరపై ముద్దులు హద్దులు మీరుతున్నాయి. చీకటి సన్నివేశపు ముద్దులు నేడు గాఢ చుంబనలుగా మారి నిర్భయంగా తెరకెక్కుతున్నాయి. ఒకప్పుడు ముద్దు సన్నివేశం వస్తుందనగానే దృశ్యం నలుపు రంగుకు మారి చీకటి కనబడేది. ఆ చీకట్లో సదరు జంట ముద్దు అనుభవాన్ని చవిచూస్తున్నట్లు సంభాషణ మాత్రం వినిపించి వదిలేసేవారు. క్రమంగా అటువంటి దృశ్యాలు కనుమరుగై గాఢ చుంబన దృశ్యాలు వెండితెరపై ప్రత్యక్షమవుతున్నాయి. వేడి ముద్దులను ఇవ్వడంలో హాలీవుడ్ సినీ పరిశ్రమదే తొలి స్థానం. అయితే పాశ్చాత్య పోకడలను వ్యతిరేకించే భారత్‌లోనూ నేడు క్రమంగా హాలీవుడ్ స్థాయి సన్నివేశాలు కనిపిస్తున్నాయి. గాఢ చుంబనలు నేడు సర్వసాధారణమైపోయాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 19 Nov 2009 | 5:29 am

సినీ నటుడు బాలకృష్ణకు అరెస్ట్ వారెంట్

గతంలో జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నిబంధనలను అతిక్రమించిన కేసులో టాలీవుడ్ సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ నాయకుని హోదాలు పాల్గొన్న బాలకృష్ణకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2009 | 1:35 am

చెరకు మద్దతు ధరపై స్థంభించిన లోక్‌సభ

లోక్‌సభ శీతాకాల సమావేశాలు గురువారం ప్రారంభమైన వెంటనే దివంగత నేతలకు నివాళులర్పించిన తర్వాత దేశంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న చెరకు మద్దతు ధరలపై విపక్షాలు సభను స్థంభింపజేశాయి. దీంతో సభను సజావుగా నడిపేందుకు వీలుగా రెండు సార్లు వాయిదా వేయడం జరిగింది. అయినప్పటికీ సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను రేపటికి వాయిదా వేశారు.
Source: జాతీయ | 19 Nov 2009 | 1:14 am

రంగారెడ్డి నుంచి జగన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి వైఎస్సార్ తనయుడు, కడప ఎంపీ వైఎస్. జగన్‌మోహనరెడ్డి సిద్ధమయ్యారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి జగన్ గ్రేటర్ ఎన్నికల ప్రచారం ప్రారంభమౌతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్ గ్రేటర్ ప్రచారంలో భాగంగా.. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఖైరతాబాద్‌లోని రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం ప్రచారానికి బయలుదేరుతారు.
Source: ఏపీ న్యూస్ | 19 Nov 2009 | 12:09 am

ఘనంగా ఇందిరా గాంధీ జయంతి ఉత్సవాలు

భారతదేశ తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 92వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ఇందిర చేసిన సేవలను స్మరించుకుంటూ జయంతి వేడుకలను జరుపుకుంటున్నారు.
Source: జాతీయ | 18 Nov 2009 | 11:37 pm

ప్రారంభమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

పార్లమెంట్ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ రోజు ప్రారంభమైన సమావేశాలు దాదాపు నెల రోజులపాటు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పలు అంశాలు చర్చకు రానున్నాయి.
Source: జాతీయ | 18 Nov 2009 | 11:23 pm

నేటి నుంచి పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు

పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచే ప్రారంభం కాబోతున్నాయి. ఇటీవల వచ్చిన టెలికాం కుంభకోణం నుంచి మధుకోడాపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ధరల పెరుగుదలతో సహా పలు అంశాలపై ఈ శీతాకాల సమావేశాల్లో వాడివేడి చర్చలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.
Source: జాతీయ | 18 Nov 2009 | 11:21 pm

జీవిత, రాజశేఖర్‌లు కాంగ్రెస్‌కు అమ్ముడుపోయారు: ప్రరాపా

జీవిత, రాజశేఖర్‌లు ఇద్దరు కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోయారని, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని విమర్శించడమే వారు తమ ధ్యేయంగా పెట్టుకున్నారని ప్రజారాజ్యం పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కాట్రగడ్డ శంకర్‌బాబు విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 10:50 pm

భారీ వర్షాలు: ఉప్పుటేరు వాగుకు వరద ముప్పు

ప్రకాశం జిల్లాలోని ఉప్పుటేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. భారీగా కురుస్తున్న వర్షాలతో ఉప్పుటేరు వాగుకు వరద ముంపు పొంచి ఉంది. దీంతో అధికారులు ముందుజాగ్రత్తగా చర్యగా కందకూరు-గుడ్లూర్ మధ్య రాకపోకలను నిలిపి వేశారు. పరిసర ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనుల్లో జిల్లా ప్రభుత్వ అధికారులు నిమగ్నమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 9:43 pm

కడపలో ఎన్‌కౌంటర్: మావోయిస్టు మృతి

కడప జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. గాలీవుడ్ మండలం తుమ్మిగుంట వద్ద పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మరణించినట్లు పోలీసులు తెలిపారు. దాదాపు 25 నిమిషాల పాటు ఈ కాల్పులు జరిగినట్లు తెలిసింది.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 9:36 pm

సుఖోయ్‌లో ప్రయాణం...నాకెందుకు భయం: ప్రతిభాపాటిల్

రెండు సీట్లున్న సుఖోయ్‌ -30 యుద్ధ విమానంలో ప్రయాణమంటే తాను భయపడడంలేదని రాష్టప్రతి ప్రతిభా పాటిల్‌ అన్నారు
Source: జాతీయ | 18 Nov 2009 | 9:00 pm

వినూత్నంగా "ఓం శాంతి" లోగో ఆవిష్కరణ

నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బిందుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం "ఓంశాంతి". వైజయంతి హౌస్ నుంచి త్రీ ఏంజిల్స్ స్టూడియోస్ పతాకంపై ప్రకాష్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ, ప్రియాంక చలసాని నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ చిత్రం నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. "ఓంశాంతి" లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని సినీ చరిత్రలో ఎవరూ చేయని విధంగా త్రీ ఏంజెల్స్ స్టూడియోస్ చేసింది. స్టేజ్‌పై స్పాట్‌లైట్‌లు పడుతుండగా చిత్రంలో నటించిన నవదీప్, కాజల్ అగర్వాల్, నిఖిల్, బిందుమాధవి, అదితిశర్మ తమ పాత్రల పేరుతో పరిచయం చేసుకుని తమ కథ గురించి భిన్నంగా చెప్పడం జరిగింది.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 10:10 am

మార్చి 22 నుంచి పదవ తరగతి పరీక్షలు

మార్చి 22 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు రాష్ట్ర సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ (ఎస్‌ఎస్‌సీ) బోర్డు బుధవారం ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 9:13 am

టాలీవుడ్‌లో దమ్మున్న మగాడు లేడు: తమ్మారెడ్డి

తెలుగు చిత్ర పరిశ్రమలో దమ్మున్న మగాడు ఒక్కడు కూడా లేరని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్‌డమ్‌కు కట్టుబడి సాలెగూడు మధ్యలోనే సినీ ప్రయాణాన్ని సాగదీస్తున్నారని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 8:49 am

జగన్‌ను ముఖ్యమంత్రిగా చూడాలని వుంది: రాహుల్

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు, కడప ఎంపి వైఎస్ జగన్‌‌ను ముఖ్యమంత్రిగా చూడాలనివుందని, తనకు కూడా ఆ కోరిక బలీయంగానే ఉందని ఏఐసిసి ప్రధాన కార్యదర్శి, అమేథీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 8:40 am

ఆధ్యాత్మిక చింతనలో హాటెస్ట్ తార భువనేశ్వరి

హాట్ తార భువనేశ్వరి ఉన్నట్లుండి తన మార్గాన్ని మార్చేసుకుంది. ప్రేక్షలకు పొట్టి దుస్తుల్లో కన్పించి రెచ్చగొట్టే భువన ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి సారించింది. తన ఇంటిని రకరకాల దేవుళ్ల ఫోటోలతో నింపేసింది. అంతేకాదు.. ఆమె ఇంటి నిండా భక్తి రసాన్ని నూరిపోసే పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. ఎందుకిలా.. అని ఎవరైనా అడిగితే, అదో రకమైన నవ్వు నవ్వుతూ, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రశాంతత మరిక్కెడా లభ్యం కాదని చెపుతోందట. కానీ కోలీవుడ్ ఫిలిమ్ వర్గాలు మాత్రం భువన వ్యవహార శైలిపై మరో రకంగా చెపుతున్నారు. బిగ్ స్క్రీన్ మరియు బుల్లితెరపై భువనేశ్వరికి పెద్దగా అవకాశాలు రావడం లేదనీ, దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురై ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి మరల్చి ప్రశాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తోందంటున్నారు. అంతేగా మరి... ఒత్తిడి విరుగుడుకి ఆధ్యాత్మిక మార్గమే మంచి మందు కదా!!
Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 7:47 am

రెండు రోజుల పాటు జగన్ గ్రేటర్ ప్రచారం: దానం

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేన్ ఎన్నికల్లో భాగంగా చివరి రెండు రోజుల పాటు వైఎస్.జగన్ ప్రచారం చేస్తారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 6:35 am

తన్యను "నాతో రా" అంటోన్న నాగచైతన్య!?

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు "నాగచైతన్య" జోష్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కుర్రహీరోగా టాలీవుడ్‌‌లో క్రేజ్ హీరోగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్ననాగచైతన్య.. "జోష్"లో స్టూడెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ "మగధీర" రికార్డులో "జోష్" కొట్టుకుపోయాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే తన తొలిసినిమా "జోష్‌"లో ప్రముఖ కథానాయిక రాధ కుమార్తె కార్తికతో జతకట్టిన నాగచైతన్య "నాతో రా" చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. ఇందులో తన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ "జోష్‌"కు ముందుగానే ప్రారంభమైందని, దీనికి "నాతో రా.." అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినిమా వర్గాల సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 6:15 am

బాలీవుడ్ నటి ఆర్తీ చాబ్రియాతో హెడ్లీ డేటింగ్

లష్కరే తోయిబా భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నెరపడానికి తురుపు ముక్కలా ఉపయోగపడిన డేవిడ్ హెడ్లీ బాలీవుడ్‌లోని పలువురు తారలతో డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా ఆర్తీ చాబ్రియాతో అతను టచ్‌లో ఉన్నట్లు బాలీవుడ్ సినీపరిశ్రమలో వార్తలు వస్తున్నాయి.
Source: జాతీయ | 18 Nov 2009 | 4:42 am

భవిష్యత్ ప్రధానిగా భావించవద్దు: రాహుల్ గాంధీ

భవిష్యత్‌ను ఒకరు నిర్ధేశించలేరని, అది ఎవరి చేతుల్లోనూ లేదని, అందువల్ల తనను భవిష్యత్ ప్రధానిగా భావించవద్దని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేశారు. తనను భవిష్యత్ ప్రధాని అనేక కోణంలో చూడొద్దని కోరారు.
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 4:19 am

చైనా పాత్రను అంగీకరించం: విదేశాంగ మంత్రి కృష్ణ

భారత, పాకిస్థాన్‌ల మధ్య సత్ సంబంధాలు నెలకొనేందుకు, దీర్ఘకాలి సమస్యల పరిష్కారం కోసం చైనా కీలక పాత్ర వహించాలని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన ప్రతిపాదనను భారత్ నిర్ధ్వంధంగా తోసిపుచ్చింది.
Source: జాతీయ | 18 Nov 2009 | 4:07 am

మీకు అభ్యంతరకరంగా ఉంటే కేసు పెట్టండి: హైకోర్టు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే అతనిపై పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా, ఈ నెల 29వ తేదీన సిద్ధిపేటలో ప్రారంభించనున్న ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం కొట్టివేసింది
Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 3:14 am

హెడ్లీ కేసులో రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం: పోలీసులు

లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలో సన్నిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీ కేసులో బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు.
Source: జాతీయ | 18 Nov 2009 | 2:26 am

ఆధ్యాత్మిక చింతనలో హాటెస్ట్ తార భువనేశ్వరి

హాట్ తార భువనేశ్వరి ఉన్నట్లుండి తన మార్గాన్ని మార్చేసుకుంది. ప్రేక్షలకు పొట్టి దుస్తుల్లో కన్పించి రెచ్చగొట్టే భువన ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి సారించింది. తన ఇంటిని రకరకాల దేవుళ్ల ఫోటోలతో నింపేసింది. అంతేకాదు.. ఆమె ఇంటి నిండా భక్తి రసాన్ని నూరిపోసే పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. ఎందుకిలా.. అని ఎవరైనా అడిగితే, అదో రకమైన నవ్వు నవ్వుతూ, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రశాంతత మరిక్కెడా లభ్యం కాదని...
Source: వినోదం | 18 Nov 2009 | 2:18 am