|
టాలీవుడ్‌లో దమ్మున్న మగాడు లేడు: తమ్మారెడ్డితెలుగు చిత్ర పరిశ్రమలో దమ్మున్న మగాడు ఒక్కడు కూడా లేరని ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్‌డమ్‌కు కట్టుబడి సాలెగూడు మధ్యలోనే సినీ ప్రయాణాన్ని సాగదీస్తున్నారని ఆయన అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 8:49 am హుండాయ్ మోటార్స్ లగ్జరీ కారు లిమోజిన్: ఇక్యుస్హుండాయ్ మోటార్స్ సంస్థ ఇక్యుస్ అనే పేరుగల ఓ పెద్ద వీల్‌బేస్ లగ్జరీ సీడాన్ కారును మార్కెట్లోకి ఇటీవలే విడుదల చేసింది. ఇది కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అన్ని కార్లకంటే అతి పెద్దది, అతి ఖరీదైనది కూడా అని కంపెనీ పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 8:39 am భారత్ ప్రజాస్వామిక దేశమే...కాని కాస్త ఎక్కువే: మహాతిర్ఆసియా దేశాల్లో భారతదేశం ప్రజాస్వామిక దేశమని, కాని ఇది కాస్త ఎక్కువేనని మలేషియా మాజీ ప్రధాని మహాతిర్ ముహమ్మద్ అన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 8:16 am మీకు అభ్యంతరకరంగా ఉంటే కేసు పెట్టండి: హైకోర్టుతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే అతనిపై పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా, ఈ నెల 29వ తేదీన సిద్ధిపేటలో ప్రారంభించనున్న ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం కొట్టివేసిందిSource: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 8:11 am హెడ్లీ కేసులో రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం: పోలీసులులష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలో సన్నిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీ కేసులో బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 7:54 am ఆధ్యాత్మిక చింతనలో హాటెస్ట్ తార భువనేశ్వరిహాట్ తార భువనేశ్వరి ఉన్నట్లుండి తన మార్గాన్ని మార్చేసుకుంది. ప్రేక్షలకు పొట్టి దుస్తుల్లో కన్పించి రెచ్చగొట్టే భువన ఒక్కసారిగా ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి సారించింది. తన ఇంటిని రకరకాల దేవుళ్ల ఫోటోలతో నింపేసింది. అంతేకాదు.. ఆమె ఇంటి నిండా భక్తి రసాన్ని నూరిపోసే పుస్తకాలు దర్శనమిస్తున్నాయి. ఎందుకిలా.. అని ఎవరైనా అడిగితే, అదో రకమైన నవ్వు నవ్వుతూ, ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ప్రశాంతత మరిక్కెడా లభ్యం కాదని చెపుతోందట. కానీ కోలీవుడ్ ఫిలిమ్ వర్గాలు మాత్రం భువన వ్యవహార శైలిపై మరో రకంగా చెపుతున్నారు. బిగ్ స్క్రీన్ మరియు బుల్లితెరపై భువనేశ్వరికి పెద్దగా అవకాశాలు రావడం లేదనీ, దాంతో తీవ్రమైన ఒత్తిడికి గురై ఆధ్యాత్మిక మార్గంవైపు దృష్టి మరల్చి ప్రశాంత జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తోందంటున్నారు. అంతేగా మరి... ఒత్తిడి విరుగుడుకి ఆధ్యాత్మిక మార్గమే మంచి మందు కదా!!Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 7:47 am భారత్‌కన్నా పాక్ వద్దే అణ్వస్త్రాలు ఎక్కువ: అమెరికాభారత దేశం వద్ద ఉన్న అణ్వాయుధాలకన్నా పాకిస్థాన్ వద్దే ఎక్కువగా ఉన్నాయని అమెరికాకు చెందిన ఇద్దరు అణుశాస్త్ర వేత్తలు తెలిపారు. పాకిస్థాన్ చైనా దేశంతో కలిసి ఈ ఆయుధాలను సమకూర్చుకుందని, భవిష్యత్తులో వీటిని అభివృద్ధి పరచుకునేందుకు పాకిస్థాన్ చర్యలు తీసుకుంటోందని వారు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 6:58 am విదేశీ మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత: నష్టాల్లో సెన్సెక్స్అంతర్జాతీయ మార్కెట్ల ట్రేడింగ్ క్షీణించడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. బుధవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 36 పాయింట్లు పతనమై 17,014 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ 5 పాయింట్ల స్వల్ప నష్టంతో 5,056 పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 6:32 am మన్మోహన్ పర్యటన ఏర్పాట్లపై వైట్‌హౌస్ బిజిబిజీ!ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ చేపట్టనున్న అమెరికా పర్యటన కోసం అగ్రదేశ అధికార పరిపాలనా భవమైన వైట్‌హౌస్ ఏర్పాట్లలో పూర్తిగా నిమగ్నమైవుంది. దీంతో వైట్‌హౌస్ అధికారులు బిజిబిజీగా గడుపుతున్నారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 6:24 am తన్యను "నాతో రా" అంటోన్న నాగచైతన్య!?యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు "నాగచైతన్య" జోష్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కుర్రహీరోగా టాలీవుడ్‌లో క్రేజ్ హీరోగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్ననాగచైతన్య.. "జోష్"లో స్టూడెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ "మగధీర" రికార్డులో "జోష్" కొట్టుకుపోయాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే తన తొలిసినిమా "జోష్"లో ప్రముఖ కథానాయిక రాధ కుమార్తె కార్తికతో జతకట్టిన నాగచైతన్య "నాతో రా" చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. ఇందులో తన్య హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ "జోష్"కు ముందుగానే ప్రారంభమైందని, దీనికి "నాతో రా.." అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినిమా వర్గాల సమాచారం.Source: Yahoo! Telugu: Entertainment | 18 Nov 2009 | 6:15 am రాజకీయ సన్యాసం స్వీకరించిన ప్రరాపా నేత "పులి"!ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం స్వీకరించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగినట్టు వినికిడి.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 5:59 am తగ్గిన ముడి చమురు ఉత్పత్తులు: సిఎమ్ఐఈప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో దేశీయ ముడి చమురు ఉత్పత్తులు దాదాపు 1.2 శాతం తగ్గాయి. దేశీయ ముడి చమురు ఉత్పత్తి కంపెనీ అయిన ఓఎన్‌జీసీలో ఉత్పత్తులు తగ్గడంతో ఈ పరిస్థితి నెలకొందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సిఎమ్ఐఈ) తన తాజా నివేదికలో పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 5:58 am భారీవర్షాలతో సీఎం విజయవాడ పర్యటన రద్దుఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్షాలు పడుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి రాష్ట్రానికి వస్తోన్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకే ముఖ్యమంత్రి విజయవాడ వెళ్ళాల్సి ఉంది. అయితే విజయవాడలో రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతుండటంతో రోశయ్య పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు.Source: Yahoo! Telugu: News | 18 Nov 2009 | 5:36 am మీకు అభ్యంతరకరంగా ఉంటే కేసు పెట్టండి: హైకోర్టుతెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు చేస్తున్న వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉంటే అతనిపై పోలీసు స్టేషన్‌లో కేసులు పెట్టాలని రాష్ట్ర హైకోర్టు సూచించింది. కేసీఆర్‌కు వ్యతిరేకంగా, ఈ నెల 29వ తేదీన సిద్ధిపేటలో ప్రారంభించనున్న ఆమరణ నిరాహార దీక్షను అడ్డుకోవాలని దాఖలైన పిటిషన్ ను హైకోర్టు బుధవారం కొట్టివేసిందిSource: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 3:14 am హెడ్లీ కేసులో రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం: పోలీసులులష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలో సన్నిత సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అమెరికా పౌరుడు డేవిడ్ హెడ్లీ కేసులో బాలీవుడ్ అగ్ర దర్శకుడు మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ ప్రధాన సాక్ష్యం అని పోలీసు ఉన్నతాధికారులు అన్నారు.Source: జాతీయ | 18 Nov 2009 | 2:26 am అర్కిటెక్ట్‌లకు పద్మశ్రీ ఇవ్వాలి: మంత్రి పిల్లి సుభాష్భవన నిర్మాణ రంగంలో కీలక పాత్ర పోషించే ఆర్కిటెక్‌లతో పాటు.. ఇంటీరియల్ డిజైనర్‌లకు కూడా పద్మశ్రీ అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ఆర్కిటెక్‌లందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 12:58 am రాజకీయ సన్యాసం స్వీకరించిన ప్రరాపా నేత "పులి"!ప్రజారాజ్యం పార్టీ అనుబంధ విభాగమైన యువరాజ్యం అధ్యక్షుడు, సినీ హీరో పవన్ కళ్యాణ్ రాజకీయ సన్యాసం స్వీకరించినట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి రాజకీయాల నుంచి పూర్తిగా వైదొలగినట్టు వినికిడి.Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 12:32 am భారీవర్షాలతో సీఎం విజయవాడ పర్యటన రద్దుఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ రాష్ట్రానికి చేరుకున్న నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం విజయవాడ పర్యటనను రద్దు చేసుకున్నారు. వర్షాలు పడుతున్న కారణంగా ఈ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే.. రాహుల్ గాంధీకి రాష్ట్రానికి వస్తోన్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకే ముఖ్యమంత్రి విజయవాడ వెళ్ళాల్సి ఉంది. అయితే విజయవాడలో రెండు రోజుల నుంచి భారీగా వర్షాలు పడుతుండటంతో రోశయ్య పర్యటన రద్దైనట్లు అధికారులు తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 18 Nov 2009 | 12:06 am మరోమారు పాక్‌కు ఆధారాలు అందించిన భారత్!ముంబై మారణహోమానికి సంబంధించి భారత్ మరోమారు పాకిస్థాన్‌కు ఆధారాలను సమర్పించింది. ముంబై దాడుల కుట్ర పాక్‌లోనే జరిగిందని, సూత్రధారులు కూడా ముంబైలోనే ఉన్నారని భారత్ ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటి వరకు ఆరు సార్లు ఆధారాలను సమర్పించింది.Source: జాతీయ | 18 Nov 2009 | 12:01 am మైనింగ్ మాఫియాపై పోరాటం చేస్తాం: ప్రకాష్ కారత్మైనింగ్ మాఫియాపై తెలుగుదేశంతో కలిసి పోరాటం చేస్తామని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ మీడియాతో అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో ప్రకాష్ కారత్ బుధవారం భేటీ అయ్యారు. గురువారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా.. ధరల పెరుగుదల, మైనింగ్ మాఫియా, వరద పరిస్థితులు, కరువు వంటి పలు అంశాలపై కేంద్రాన్ని నిలదీస్తామని ప్రకాశ్ కారత్ అన్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 10:45 pm శబరిమలైకు 420 ప్రత్యేక రైళ్లు: రైల్వే మంత్రి అహ్మెద్ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శబరిమలైకు 420 ప్రత్యేక రైలు సర్వీసులను నడుపనున్నట్టు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి ఇ.అహ్మెద్ తెలిపారు. మకరవిలక్కు ఫెస్టివల్ (కార్తీక దీపోత్సవాలు)ను పురస్కరించుకుని దేశం నలుమూలల నుంచి శబరిమలైకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ సర్వీసులను నడుపనున్నట్టు చెప్పారు.Source: జాతీయ | 17 Nov 2009 | 10:16 pm నేడు రాష్ట్రానికి రాహుల్: షెడ్యూల్ వివరాలు!కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ఒక రోజు పర్యటన నిమిత్తం బుధవారం రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన ఉదయం 10.20 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో కృష్ణాజిల్లాలోని గన్నవరం విమానశ్రయానికి చేరుకుంటారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 9:59 pm ప్రభుత్వాలను శాసిస్తున్న మైనింగ్ లాబీ: ప్రకాష్ కారత్దేశ రాజకీయాలతో పాటు.. పలు రాష్ట్ర ప్రభుత్వాలను మైనింగ్ మాఫియా శాసిస్తోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ అభిప్రాయపడ్డారు. ఆయన మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మైనింగ్ లాబీ ఈ తరహా రాజకీయాలను కర్ణాటకలో తొలుత ప్రారంభమయ్యాయని అన్నారు.Source: జాతీయ | 17 Nov 2009 | 9:45 pm కాలం ముగియక ముందే తప్పుకుంటా: రాజ్‌నాథ్ సింగ్తన పదవీకాలం ముగియకముందే భారతీయ జనతా పార్టీ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తన స్థానంలో మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కారీ నియమితులయ్యే అవకాశాలు ఉన్నట్టు ఆయన సూచన ప్రాయంగా వెల్లడించారు.Source: జాతీయ | 17 Nov 2009 | 8:58 pm జనవరిలో నితిన్, హన్సికల "సీతారాముల కళ్యాణం"యూత్ హీరో నితిన్, సెక్సీడాళ్ హన్సిక జంటగా నటిస్తోన్న చిత్రం "సీతారాముల కళ్యాణం". ఈశ్వర్ దర్శకత్వంలో డా. విజయప్రసాద్ మల్ల నిర్మిస్తోన్న ఈ చిత్రానికి "లంకలో" అనేది ఉపశీర్షిక. గత కొద్దిరోజులు నానక్‌రామ్‌గూడా విలేజ్‌లోని సెట్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాత చిత్రం గురించి చెబుతూ.. "గతంలో నేను తీసిన "సిద్ధు ఫ్రమ్ శీకాకుళం" ఎంతో పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం అదే దర్శకుడితో మంచి కథను సినిమాగా తీస్తున్నాను. ఈ సినిమా టైటిల్ ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అనూప్ రూబెల్ సీనియర్ గాయనీగాయకులతో ఈ చిత్రంలో పాటలు పాడించారు. ఆడియోను వచ్చేనెల 19న విడుదల చేస్తున్నాం. జనవరి 8న సినిమాను విడుదల చేస్తాం" అని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 10:27 am పిల్లలకోసం వేసిన చిత్రాలను వారే ఎందుకు చూడటం లేదు?హైదరాబాదులో జరుగుతున్న 16వ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించే చిత్రాల గురించి ప్రతివారి మదిలో మెదిలే ప్రశ్న ఇది. చాలామంది పిల్లలు వాటిని సక్రమంగా వినియోగించుకోవడం లేదని పలు పత్రికల్లో వస్తున్న వార్తలపై మంగళవారంనాడు ఐమాక్స్‌లో జరిగిన మీడియా సమావేశంలో పలువురు వక్తలు తమ స్పందనను వినిపించారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 10:23 am షూటింగ్‌ను పూర్తి చేసుకున్న "చేత వెన్నముద్ద"అల్తాఫ్, "హ్యాపీడేస్" ఫేమ్ క్రితిక క్రిష్టన్ హీరోహీరోయిన్లుగా రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి. ఆర్. కుమార్ నిర్మిస్తోన్న "చేత వెన్నముద్ద" చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. హ్యాపీడేస్ ఫేమ్ "కృష్ణుడు" నటిస్తోన్న ఈ చిత్రం గురించి ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ కుమార్ మాట్లాడుతూ.. హీరోహీరోయిన్లతో పాటు పలువురు విదేశీ అమ్మాయిలపై "అందాలపూదోట తోటలో ఒక మేడ.." అనే పాట చిత్రీకరణ జరుగుతోందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 10:10 am రజనీ సరసన ఒకే ఒక్క ఛాన్స్ చాలు: తమన్నాతమిళనాట అగ్రహీరోల సరసన నటిస్తూ మహా బిజీగా ఉన్న తమన్నా, సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో నటించాలని ఆశపడుతున్నట్లు చెప్పింది. కుర్ర హీరోలతో నటిస్తున్నప్పటికీ రజనీతో జీవితంలో ఒకే ఒక్క సినిమా చేస్తే చాలు... తన కెరీర్‌లో ఒక గోల్ పూర్తి చేసినట్లు ఫీలవుతానని చెపుతోంది. కుర్ర హీరోలతో అనుభవం ఎలా ఉందని కదిలిస్తే.. సూర్య, ధనుష్, విజయ్, భరత్, జయం రవి... ఇలా అందరినీ పేరుపేరునా పొగడ్తలతో ముంచెత్తింది. తమన్నాకు సక్సెస్ సీక్రెట్ బాగానే తెలిసినట్లుంది. అంతేకాదండోయ్... రజనీకాంత్ సరసన ఛాన్స్ వస్తే ఆ తార ఇండస్ట్రీలో అగ్రస్థానంలో ఉన్నట్లే లెఖ్ఖ అని కొత్త సమీకరణాలు చెపుతోంది. మరి కథానాయకుడులో రజనీ సరసన నటించిన నయనతార కోలీవుడ్ లో నెంబర్ వన్ గా ఉన్నదా...? అని అంటే, ఏమీ తెలియనట్లు, విననట్లు షూటింగ్ లో నిమగ్నమైంది. నయనతారను అడిగితే ఏం చెపుతుందో..?Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 8:56 am మాస్టర్ బ్లాస్టర్‌ను వెనకేసుకొచ్చిన విలాస్‌రావ్ దేశ్‌ముఖ్!ముంబై అందరిదని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చేసిన వ్యాఖ్యలపై శివసేన రద్దాంతం చేస్తుండగా.. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వెనకేసుకొచ్చారు. మాస్టర్ వ్యాఖ్యలను శివసేన అధ్యక్షుడు బాల్ థాకరే వివాదస్పదం చేయడంపై విలాస్‌రావ్ మండిపడ్డారు. సచిన్ వ్యాఖ్యలను వివాదస్పదం చేయడం శివసేన చవకబారు రాజకీయాలను నిదర్శనమని దేశ్‌ముఖ్ అన్నారు.Source: జాతీయ | 17 Nov 2009 | 7:52 am కేంద్రంపై రాష్ట్ర ఎంపీలు ఒత్తిడి తేవాలి: రోశయ్యపార్లమెంటు సమావేశాల్లో రాష్ట్ర ఎంపీలు రాష్ట్ర సంబంధిత సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య కోరారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉన్నందువల్ల ఎన్టీపీసీ నుంచి అదనపు విద్యుత్ సాధించేందుకు ఎంపీలు ప్రయత్నించాలన్నారు. రైల్వే శాఖలో మన రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని చెప్పారు. రైల్వే మంత్రి మమత బెనర్జీ తన రాష్ట్రానికి మాత్రమే మేలు కలిగేలా చూసుకుంటున్నారని రోశయ్య తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 7:29 am జూడాలపై "ఎస్మా" అస్త్రాన్ని ప్రయోగించిన ప్రభుత్వం!ఉపకార వేతనాన్ని పెంచాలంటూ వారం రోజులుగా సమ్మె చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించింది. విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు చేస్తున్న సమ్మెపై ప్రభుత్వం కన్నెర్ర చేసింది. ఇందులో భాగంగా.. జూనియర్ డాక్టర్లపై ప్రభుత్వం ఎస్మా అనే చివరి అస్త్రాన్ని ప్రయోగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆరునెలల పాటు సమ్మెలపై నిషేధం విధించింది. జూనియర్ డాక్టర్లను మరోసారి చర్చలకు రమ్మని ఆహ్వానించింది.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 7:14 am జూడాలు సమ్మె విరమించాల్సిందే: హైకోర్టు హెచ్చరికఉపకార వేతనం పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తోన్న సమ్మెను వెంటనే విరమించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. గత వారం రోజులుగా జూడాలు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 7:05 am ఓఎంసీ యాజమాన్యంతో మాకేంటి లింకు: వైఎస్.జగన్ఓబుళాపురం మైనింగ్ కంపెనీ యాజమాన్యంతో తమకేంటి సంబంధం అని కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఒకే చిరునామా ఉన్నంత మాత్రాన తమకు వారికి సంబంధాలు అంటగడతారా అని ఆయన ఎదురుదాడికి దిగారు.Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 7:02 am "మగధీర"తో నటించడం లేదు: కాజల్ అగర్వాల్"మగధీర" చిత్రం తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని నటి కాజల్ అగర్వాల్ అంటోంది. తాజాగా ఆమె అశ్వనీదత్ కుమార్తె శేషుగుప్తా నిర్మిస్తోన్న "ఓం శాంతి" చిత్రంలో నటిస్తోంది. నవదీప్, అఖిల్, అతిది శర్మ, బిందు మాధవిలతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన పలు విషయాలు మీ కోసం..ప్రశ్న: "ఓం శాంతి" అంటే అర్థమేమిటి?జ: ఓం అనేది బిగినింగ్‌కు వాడుతాం. శాంతి అనేది ఎండింగ్. ఐదుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అందరి కథలు ఒక చోట ఆరంభమై చివరికి శాంతియుతంగా ముగుస్తాయి. నేను ఇందులో మేహన అనే పాత్ర పోషించాను.ప్రశ్న: ప్రస్తుతం చేస్తున్న చిత్ర వివరాలు?జ: ప్రభాస్‌తో 'డార్లింగ్'. ఎన్టీఆర్‌తో 'బృందావనం', కార్తీక్‌తో "నాన్ మహాన్ ఇళ్ళై (తమిళం)" వంటి చేస్తున్నాను.ప్రశ్న: రామ్‌చరణ్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారని నాగబాబు ప్రకటించారు?జ: అందులో చేయడం లేదు. ఇంతవరకు అగ్రిమెంట్లో సంతకం కూడా పెట్టలేదు. ప్రశ్న: నిజజీవితంలో ఎవరినైనా ప్రేమించారా?జ: ఇప్పటివరకు లేదు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 4:39 am "బంపర్ ఆఫర్"ను హిట్‌చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్: పూరిసాయిరాం శంకర్, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా వైష్ణో అకాడమీ పతాకంపై విడుదలైన చిత్రం "బంఫర్ ఆఫర్". జయరవీంద్ర దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్లాటినం డిస్క్ వేడుకలో డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. మీ అందరి సమక్షంలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య హిట్ సినిమాలు తియ్యడం చాలా కష్టమైంది. వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఐదు మాత్రమే విజయానికి నోచుకుంటున్నాయి. ఆ ఐదులో మా బంపర్ ఆఫర్ కూడా స్థానం సంపాదించడం సంతోషంగా ఉంది. బంపర్ ఆఫర్ హిట్ కావడంతో సాయిరాంశంకర్‌కు, బిందు మాధవికి మంచి గుర్తింపు లభించింది. ఇంత మంచి హిట్ చిత్రాన్ని అందించిన నా స్నేహితుడు, దర్శకుడు జయరవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పూరీ చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 4:31 am హెడ్లీ-రాణాలకు సహకరించిన హైకమిషన్ సిబ్బంది!లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ, రాణాలకు ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయ సిబ్బంది తమ వంతు సహకారం అందించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.Source: జాతీయ | 17 Nov 2009 | 2:27 am
|