మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన రోశయ్య!

ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 8:21 am

హెడ్లీ-రాణాలకు సహకరించిన హైకమిషన్ సిబ్బంది!

లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ, రాణాలకు ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయ సిబ్బంది తమ వంతు సహకారం అందించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 7:56 am

నష్టాల్లోనే బాంబే స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ పతనం

మంగళవారం బాంబే స్టాక్ మార్కెట్‌కు కలిసిరాలేదు. ట్రేడింగ్ ప్రారంభంలోనే నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలోనూ యధావిధిగా తిరోగమన దిశగా ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో సెన్సెక్స్ వంద పాయింట్లు కోల్పోయి, 16,931 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 32 పాయింట్లు క్షీణించి, 5,025 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 7:51 am

2009-10 ఆర్థిక ఏడాదిలో 6 శాతం జీడీపీ వృద్ధి!?

జపాన్ దేశపు జీడీపీ వృద్ధిరేటు సోమవారం 1.2 శాతంగా పెరిగిన నేపథ్యంలో.. భారతీయ జీడీపీ వృద్ధిరేటు శాతం కూడా పెరిగే అవకాశం ఉందని సర్వేలో తేలింది. 2009-10 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు ఆరుశాతం పెరిగే సూచనలున్నాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆర్థిక నిపుణులు, పరిశీలకులు చేసిన సర్వే పేర్కొంటోంది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 7:31 am

అమ్మకపు ఒత్తిడిలో దేశీయ వాటాలు: నష్టాల్లో సెన్సెక్స్

దేశీయ వాటాలు అమ్మకపు ఒత్తిడికి గురవడంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల బాటలో కొనసాగుతోంది. మదుపుదారులు అమ్మకాలవైపు మొగ్గు చూపడంతో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 118 పాయింట్ల మేర క్షీణించి, 16,914 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పతనమై, 5,026 పాయింట్ల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 7:01 am

జూడాలు సమ్మె విరమించాల్సిందే: హైకోర్టు హెచ్చరిక

ఉపకార వేతనం పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తోన్న సమ్మెను వెంటనే విరమించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. గత వారం రోజులుగా జూడాలు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 6:50 am

గాయకుడు మనోజ్ తివారీ ఇంటిపై సేన శ్రేణుల దాడి!

ముంబైలో శివసేన కార్యకర్తలు మరో దురాగతానికి పాల్పడ్డారు. సబర్బన్ ముంబైలో నివశిస్తున్న భోజ్‌పురి నటుడు, గాయకుడైన మనోజ్ తివారీ ఇంటిపై శివసేన కార్యకర్తలు సోమవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ముంబై వీడి వెళ్లిపోవాలని వారు నినాదాలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 6:21 am

విదేశీ మార్కెట్ల ప్రభావం: నష్టాల్లో స్టాక్ మార్కెట్

ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో బాంబే స్టాక్ మార్కెట్ నష్టాల్లో పయనిస్తోంది. అమ్మకాల ఒత్తిడి, ఆసియా మార్కెట్ల ట్రేడింగ్ బలహీనత వంటి కారణాలతో ట్రేడింగ్ ప్రారంభంలో నష్టాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 56 పాయింట్లు క్షీణించి, 17వేల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 23 పాయింట్లు పతనమై 5,034 పాయింట్ల నష్టంతో ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 6:12 am

టిబెట్ చైనాకే చెందుతున్న అమెరికా: నవ్వుతున్న చైనా

చైనాతో ద్వైపాక్షిక చర్చల సందర్భంలో వివాదస్పద టిబెట్ అంశం గురించి మంగళవారం ఒబామా మాట్లాడుతూ... టిబెట్ చైనాకే చెందుతుందని వ్యాఖ్యానించారు. దీంతో ఎప్పటినుంచో చైనా చెపుతూ వస్తున్న మాటలను ఒబామా నోటి వెంట నుంచి వచ్చే విధంగా చేయడంలో చైనా సఫలీకృతమయిందని చెప్పాలి.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 6:09 am

ఆఫ్గన్-పాక్ పరిస్థితులపై రష్యాతో హాల్ బ్రూక్ చర్చలు!

ఆఫ్గనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులపై ఈ రెండు దేశాలకు గాను అమెరికా నియమించిన ప్రత్యేక ప్రతినిధి హాల్ బ్రూక్ రష్యా అధికారులతో చర్చలు జరిపినట్టు అమెరికా మంగళవారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 17 Nov 2009 | 5:42 am

"మగధీర"తో నటించడం లేదు: కాజల్ అగర్వాల్

"మగధీర" చిత్రం తన కెరీర్‌ను పూర్తిగా మార్చేసిందని నటి కాజల్ అగర్వాల్ అంటోంది. తాజాగా ఆమె అశ్వనీదత్ కుమార్తె శేషుగుప్తా నిర్మిస్తోన్న "ఓం శాంతి" చిత్రంలో నటిస్తోంది. నవదీప్, అఖిల్, అతిది శర్మ, బిందు మాధవిలతో కలిసి నటిస్తోంది. ఈ చిత్రంలోని ఓ పాటను అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె వెల్లడించిన పలు విషయాలు మీ కోసం..ప్రశ్న: "ఓం శాంతి" అంటే అర్థమేమిటి?జ: ఓం అనేది బిగినింగ్‌కు వాడుతాం. శాంతి అనేది ఎండింగ్. ఐదుగురు వ్యక్తుల జీవితాల్లో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అందరి కథలు ఒక చోట ఆరంభమై చివరికి శాంతియుతంగా ముగుస్తాయి. నేను ఇందులో మేహన అనే పాత్ర పోషించాను.ప్రశ్న: ప్రస్తుతం చేస్తున్న చిత్ర వివరాలు?జ: ప్రభాస్‌తో 'డార్లింగ్'. ఎన్టీఆర్‌తో 'బృందావనం', కార్తీక్‌తో "నాన్ మహాన్ ఇళ్ళై (తమిళం)" వంటి చేస్తున్నాను.ప్రశ్న: రామ్‌చరణ్ హీరోగా 'బొమ్మరిల్లు' భాస్కర్ చిత్రంలో నటిస్తున్నారని నాగబాబు ప్రకటించారు?జ: అందులో చేయడం లేదు. ఇంతవరకు అగ్రిమెంట్లో సంతకం కూడా పెట్టలేదు. ప్రశ్న: నిజజీవితంలో ఎవరినైనా ప్రేమించారా?జ: ఇప్పటివరకు లేదు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 4:39 am

"బంపర్ ఆఫర్"ను హిట్‌చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్: పూరి

సాయిరాం శంకర్, బిందు మాధవి హీరోహీరోయిన్లుగా వైష్ణో అకాడమీ పతాకంపై విడుదలైన చిత్రం "బంఫర్ ఆఫర్". జయరవీంద్ర దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రాన్ని డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించారు. ఈ సినిమా ప్లాటినం డిస్క్ వేడుకలో డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ.. మీ అందరి సమక్షంలో ఈ ఫంక్షన్ జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్య హిట్ సినిమాలు తియ్యడం చాలా కష్టమైంది. వంద సినిమాలు రిలీజ్ అయితే అందులో ఐదు మాత్రమే విజయానికి నోచుకుంటున్నాయి. ఆ ఐదులో మా బంపర్ ఆఫర్ కూడా స్థానం సంపాదించడం సంతోషంగా ఉంది. బంపర్ ఆఫర్ హిట్ కావడంతో సాయిరాంశంకర్‌కు, బిందు మాధవికి మంచి గుర్తింపు లభించింది. ఇంత మంచి హిట్ చిత్రాన్ని అందించిన నా స్నేహితుడు, దర్శకుడు జయరవీంద్రకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానని పూరీ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Nov 2009 | 4:31 am

మైనింగ్ అక్రమాలపై సీబీఐ విచారణ కోరిన రోశయ్య!

ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ)తో దర్యాప్తు జరిపించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 2:51 am

హెడ్లీ-రాణాలకు సహకరించిన హైకమిషన్ సిబ్బంది!

లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగివున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ, రాణాలకు ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయ సిబ్బంది తమ వంతు సహకారం అందించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Source: జాతీయ | 17 Nov 2009 | 2:27 am

జూడాలు సమ్మె విరమించాల్సిందే: హైకోర్టు హెచ్చరిక

ఉపకార వేతనం పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు కొనసాగిస్తోన్న సమ్మెను వెంటనే విరమించాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. గత వారం రోజులుగా జూడాలు చేస్తున్న సమ్మెపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కూడా సోమవారం ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదని మంగళవారం హైకోర్టు స్పష్టం చేసింది.
Source: ఏపీ న్యూస్ | 17 Nov 2009 | 1:21 am

గాయకుడు మనోజ్ తివారీ ఇంటిపై సేన శ్రేణుల దాడి!

ముంబైలో శివసేన కార్యకర్తలు మరో దురాగతానికి పాల్పడ్డారు. సబర్బన్ ముంబైలో నివశిస్తున్న భోజ్‌పురి నటుడు, గాయకుడైన మనోజ్ తివారీ ఇంటిపై శివసేన కార్యకర్తలు సోమవారం రాత్రి రాళ్లతో దాడి చేశారు. ముంబై వీడి వెళ్లిపోవాలని వారు నినాదాలు చేశారు.
Source: జాతీయ | 17 Nov 2009 | 12:52 am

యధావిధిగా అణు కార్యక్రమాలు: అనిల్ కగోద్కర్

దేశ అవసరాల రీత్యా అణు కార్యక్రమాలు యధావిధిగా సాగుతున్నట్టు భారత అణుశక్తి సంస్థ ఛైర్మన్ అనిల్ కగోద్కర్ స్పష్టం చేశారు. తీవ్రవాదుల దాడుల హెచ్చరికల నేపథ్యంలో తాము అణు కార్యక్రమాలను నిలిపి వేయలేదని, ఆ పనులు ఎప్పటిలాగనే సాగుతున్నాయని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 17 Nov 2009 | 12:34 am

ఆమరణ దీక్ష: నలుగురు జూడాల పరిస్థితి విషమం

ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ.. గత ఐదు రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. గాంధీ ఆస్పత్రి వద్ద దీక్షలో పాల్గొన్న నలుగురు జూనియర్ డాక్టర్ల పరిస్థితి విషమంగా ఉందని, వారికి తక్షణమే వైద్య సహాయం అందించకుంటే ప్రమాదకరమని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ తెలిపారు. అయితే తమ డిమాండ్లు పరిష్కరించేంతవరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్లు తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 11:50 pm

లక్ష్య సాధనే ధ్యేయంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష!

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు ఈనెల 29వ తేదీ నుంచి ఆమరణ నిరాహారదీక్షకు శ్రీకారం చుట్టనున్నారు. సిద్దిపేటలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు కేసీఆర్ దీక్షను ప్రారంభిస్తారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 11:46 pm

దేశ వ్యాప్తంగా అందుబాటులో టామీ ఫ్లూ మాత్రలు

ప్రపంచాన్ని వణికిస్తున్న స్వైన్ ఫ్లూ వ్యాధిని అరికట్టే టామీ ఫ్లూ మందులు దేశ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అనుమతి పొందిన, ఎంపిక చేసిన మెడికల్ షాపుల్లోనే ఈ మందుల విక్రయాలు జరుగుతాయి.
Source: జాతీయ | 16 Nov 2009 | 11:37 pm

"గ్రేటర్ హైదరాబాద్" ఒకరబ్బ సొత్తు కాదు: జయప్రకాష్

గ్రేటర్ హైదరాబాద్ నగరం ఒకరబ్బ సొత్తు కాదని లోక్‌సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ్ అభిప్రాయపడ్డారు. ఈ గడ్డపై నివాసం ఉంటున్న వారందరికీ చెందుతుందని ఆయన అన్నారు. ఇలాంటి గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతాన్ని జాతీయతకు ప్రతీకగా తాము అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 11:10 pm

బోడో ఉగ్రవాదుల చెర నుంచి కృష్ణారావుకు విముక్తి!

అస్సోం రాష్ట్రంలోని బోడో ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన రాష్ట్రానికి చెందిన ఇంజనీర్ పి.కృష్ణారావు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. ఆయనను మంగళవారం ఉదయం ఉగ్రవాదులు విడుదల చేశారు. దీంతో కృష్ణారావు పని చేసే కంపెనీ గాయత్రి కనస్ట్రక్షన్ కార్యాలయానికి సురక్షితంగా చేరుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 11:03 pm

తనకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించండి: అబూ అజ్మీ

తనకు జెడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని సమాజ్‌వాది పార్టీకి చెందిన శాసనసభ్యుడు అబూ అజ్మీ మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మహారాష్ట్ర హో మంత్రి ఆర్.ఆర్.పాటిల్‌ను కలుసుకుని వినతిపత్రం సమర్పించారు.
Source: జాతీయ | 16 Nov 2009 | 10:25 pm

నేడు ప్రధానితో భేటీ కానున్న కెనడా ప్రధాని హార్పర్!

మూడో రోజుల అధికారిక పర్యటన నిమిత్తం కెనడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఆయన పర్యటనలో భాగంగా మంగళవారం ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ కానున్నారు. సింగపూర్‌లో జరిగిన అపెక్‌ సదస్సుకు హాజరైన హార్పర్‌ అక్కడ నుంచి నేరుగా ముంబైకు చేరుకున్నారు.
Source: జాతీయ | 16 Nov 2009 | 9:22 pm

నిఘా వర్గాల హెచ్చరిక: అణు కేంద్రాల వద్ద హై అలెర్ట్

దేశంలోని అణు కేంద్రాల వద్ద హైఅలెర్ట్ ప్రకటించారు. ఈ కేంద్రాలపై ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించడంతో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టారు. పాకిస్థాన్‌కు చెందిన గూఢచారిని న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పోలీసులు అరెస్టు చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 16 Nov 2009 | 8:49 pm

భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో చూపించాం: సైఫ్

సినిమాల్లో శృంగారం అనేది సెక్స్ కిందకు రాదనీ, దాన్ని సృజనాత్మకంగా చూడాలని నటుడు సైఫ్ అలీఖాన్ పేర్కొంటున్నాడు. కరీనాకపూర్‌తో కలిసి జంటగా నటించిన తాజా చిత్రం "ఖుర్బాన్" యూటీవీ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా సోమవారంనాడు ఆయన హైదరాబాద్ వచ్చారు. పీవీఆర్ థియేటర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ముందుగా ప్రొమోస్ చూపించారు. అందులో కరీనా, సైఫ్‌లిద్దరూ బెడ్‌రూమ్‌లో పాల్గొన్న సన్నివేశాలు ఉన్నాయి. నాలుగు గోడల మధ్య జరిగే దృశ్యాలు అవసరమా...? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు.. సైఫ్ బదులిస్తూ.. సెన్సార్ బోర్డ్ దీన్ని అబక్షన్ లేకుండానే అడల్ట్ మూవీగా ఇచ్చింది. భార్యాభర్తల మధ్య జరిగే విషయాలు హ్యూమన్ బీయింగ్‌గా అందరికీ తెలిసిందే. ప్రేమ, యాక్షన్ కోపతాపాలు అనేవి పాత్రపరంగా రియల్‌గా చేస్తున్నప్పుడు పడక సన్నివేశాలు చేయడంలో తప్పులేదని బదులిచ్చారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 11:04 am

"ప్రవరాఖ్యుడు"ను ట్రైలర్లో తిలకించండి

జగపతిబాబు, ప్రియమణి, హంసానందిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రవరాఖ్యుడు'. "శుభలగ్నం" వంటి హిట్ చిత్రాల ద్వారా మహిళా ప్రేక్షకుల్లో విశేష అభిమానం చూరగొన్న కథానాయకుడు జగపతిబాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని "ఆ నలుగురు" వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 9:15 am

భూమిక, స్నేహాల "అమరావతి" సినిమా ట్రైలర్

సెక్సీతారలు భూమికా చావ్లా, స్నేహలు ప్రధాన పాత్రలో, నందమూరి తారకరత్న విలన్‌గా నటిస్తోన్న చిత్రం "అమరావతి". గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఈ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 9:02 am

మంచు మనోజ్ "బిందాస్" సినిమా ట్రైలర్ మీ కోసం..

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ప్రయాణం' ఫేమ్ మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 8:53 am

శేఖర్ కమ్ముల, రాణాల "లీడర్" ట్రైలర్‌ను వీక్షించండి

కళాశాల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ‘హ్యాపిడేస్’గా మలచిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ‘లీడర్’ చిత్రం ద్వారా తెరపై చూపెట్టనున్నారు. డి. రామానాయుడు మనుమడు సురేష్ బాబు కుమారుడు రాణా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఎ.వి.ఎం. సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 8:35 am

పీఆర్పీ సలహాదారు పర్వతనేని ఉపేంద్ర ఇకలేరు!

మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న మాజీ కేంద్ర మంత్రి, ప్రజారాజ్యం పార్టీ నేత పర్వతనేని ఉపేంద్ర సోమవారం కన్నుమూశారు. విజయవాడ మాజీ ఎంపీ అయిన పర్వతనేని గత ఆరు రోజులుగా బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. కానీ చికిత్స ఫలించక ఉపేంద్ర ఆరోగ్యం విషమించడంతో సోమవారం ఆరు గంటల ప్రాంతంలో ఆసత్ప్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబీకులు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 7:30 am

పీఆర్పీ గొప్ప నేతను కోల్పోయింది: చిరంజీవి

ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత రాజకీయ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర మృతిపై ఆ పార్టీ అధినేత చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తమ పార్టీ ఒక మంచి నేతను కల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపేంద్ర మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని విచారాన్ని వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 7:23 am

పీఆర్పీ నేత ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం!

ముత్రపిండాల వ్యాధితో ప్రజారాజ్యం కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపేంద్రను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీ నటుడు మురళీమోహన్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పరామర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 7:13 am

"అదుర్స్"గా వస్తోన్న ఎన్టీఆర్, నయనతారల చిత్రం

ఎన్టీఆర్, నయనతార, షీల కాంబినేషన్‌లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి "అదుర్స్" అనే పేరును ఖరారు చేశారు. ఆదివారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర లోగోను ఎన్టీఆర్, వినాయక్‌లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "వినాయక్‌తో హ్యాట్రిక్ కొట్టాలని చాలా జాగ్రత్తగా ఆలోచించి కథను తయారుచేశాం. అదుర్స్ అనే టైటిల్ అందరికి నచ్చిన టైటిల్. ఈ రోజు చిత్రంలోని చివరిపాటను పూర్తిచేశాం. ఇంకా రెండు రోజుల ప్యాచ్‌వర్క్ మిగిలి ఉంది. డిసెంబరులో సినిమాలు విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని" చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 6:21 am

సచిన్ వ్యాఖ్యలు భారత్‌ను ఏకం చేస్తాయి: "మహా" సీఎం

శివసేన అధినేత బాల్‌థాక్రే సచిన్ వ్యాఖ్యలపై మండిపడుతుంటే... ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్ మాత్రం టెండూల్కర్ మాటలు భారతదేశం ఐక్యంగా ఉండటానికి దోహదం చేస్తాయన్నారు. ఒక నిజమైన ఆటగాడికుండే స్ఫూర్తితో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడని చవాన్ అన్నారు.
Source: జాతీయ | 16 Nov 2009 | 6:20 am

"సలీమ్"ను ట్రైలర్లో తిలకించండి

విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం "సలీమ్" ('దుమ్ముదులుపుతాడు అనే ట్యాగ్). డిసెంబరు మూడో వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 5:35 am

భార్యాభర్తల మధ్య ఏం జరుగుతుందో చూపించాం: సైఫ్

సినిమాల్లో శృంగారం అనేది సెక్స్ కిందకు రాదనీ, దాన్ని సృజనాత్మకంగా చూడాలని నటుడు సైఫ్ అలీఖాన్ పేర్కొంటున్నాడు. కరీనాకపూర్‌తో కలిసి జంటగా నటించిన తాజా చిత్రం "ఖుర్బాన్" యూటీవీ మోషన్ పిక్చర్స్ ద్వారా ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషన్‌లో భాగంగా సోమవారంనాడు ఆయన హైదరాబాద్ వచ్చారు.
Source: వినోదం | 16 Nov 2009 | 5:35 am

నా నగ్న వీపును కళాత్మక దృష్టితో చూడండి: సేనకు కరీనా సూచన

నవంబరు 20వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానున్న కరీనా చిత్రం "కుర్బాన్"కు సంబంధించిన కరీనా బేర్‌బ్యాక్ వాల్‌పోస్టర్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. కరీనాకపూర్ సిగ్గు లేకుండా వీపు మొత్తాన్ని నగ్నంగా చూపించిందని శివసేన విరుచుకుపడటమే కాక చీర కట్టుక తిరగాలని కరీనాకు సూచించింది. శివసేన మాటలకు కరీనా కపూర్ స్పందించింది. శివసేన తనకు మంచి చీర పంపిస్తే ఆనందంగా స్వీకరిస్తాననీ, అయితే తనకు ఇప్పటివరకూ శివసేన నుంచి ఎటువంటి చీర అందలేదని తెలిపింది. ఇదిలావుంటే శివసేన మహిళా కార్యకర్తలు కొందరు కరీనా నగ్నవీపుతో ముంబయి నగరంలో అతికించి ఉన్న పోస్టర్లన్నిటికీ చీరలను చుట్టి తమ నిరసనలను తెలిపారు. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు కరీనాపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇటువంటి నగ్న వేషాలను ప్రదర్శించడం నీచమని ధ్వజమెత్తారు. కరీనాకపూర్ మాత్రం దీనికి మరోలా స్పందించింది. కళాత్మక దృష్టితో చూస్తే తన నగ్న వీపు వెనుక ఉన్న అర్థం గోచరిస్తుందనీ, వక్రంగా చూస్తే వక్రపు ఆలోచనలే వస్తాయని తెలిపింది. అసలు అందులో తప్పేమీ లేదని కొట్టి పారేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 5:23 am

రాహుల్‌జీ.. ముంబై వీడి వెళ్లొద్దు: ఎన్ఐఏ హుకుం

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ తనయుడు రాహుల్ భట్ ముంబై వీడి వెళ్ళరాదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) హుకుం జారీ చేసింది. తమకు తెలియకుండా ముంబైను సరిహద్దులను దాటి వెళ్లవద్దని కోరింది.
Source: జాతీయ | 16 Nov 2009 | 5:13 am

ఓఎంసిపై తప్పక దర్యాప్తు చేస్తాం: రోశయ్య

ఓబుళాపురం గనుల్లో జరుగుతున్న అవకతవకలపై తమ ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరించి విచారణ చేపడుతుందని రాష్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 4:30 am

"ప్రవరాఖ్యుడు"ను ట్రైలర్లో తిలకించండి

జగపతిబాబు, ప్రియమణి, హంసానందిని హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం 'ప్రవరాఖ్యుడు'. "శుభలగ్నం" వంటి హిట్ చిత్రాల ద్వారా మహిళా ప్రేక్షకుల్లో విశేష అభిమానం చూరగొన్న కథానాయకుడు జగపతిబాబు హీరోగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని "ఆ నలుగురు" వంటి ఉత్తమ చిత్రానికి రచన చేసిన మదన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: వినోదం | 16 Nov 2009 | 3:48 am

భూమిక, స్నేహాల "అమరావతి" సినిమా ట్రైలర్

సెక్సీతారలు భూమికా చావ్లా, స్నేహలు ప్రధాన పాత్రలో, నందమూరి తారకరత్న విలన్‌గా నటిస్తోన్న చిత్రం "అమరావతి". గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఈ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు.
Source: వినోదం | 16 Nov 2009 | 3:33 am

ఆటపై దృష్టి ఉంచు.. రాజకీయాలపై కాదు: బాల్‌థాక్రే

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శివసేన చీఫ్ బాల్‌థాక్రే ఆగ్రహానికి గురయ్యారు. సచిన్ రాజకీయాల్లోకి తలదూర్చకుండా.. ఆటపై దృష్టి కేంద్రీకరించాలని థాక్రే సూచించారు.
Source: జాతీయ | 16 Nov 2009 | 3:31 am

శేఖర్ కమ్ముల, రాణాల "లీడర్" ట్రైలర్‌ను వీక్షించండి

కళాశాల జీవితాన్ని కళ్లకు కట్టినట్టు ‘హ్యాపిడేస్’గా మలచిన ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల నాయకుడు అనేవాడు ఎలా ఉండాలో ‘లీడర్’ చిత్రం ద్వారా తెరపై చూపెట్టనున్నారు. డి. రామానాయుడు మనుమడు సురేష్ బాబు కుమారుడు రాణా హీరోగా నటిస్తోన్న ఈ చిత్రంలో రిచా గంగోపాధ్యాయ్, ప్రియా ఆనంద్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రతిష్టాత్మక ఎ.వి.ఎం. సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని డిసెంబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Source: వినోదం | 16 Nov 2009 | 3:26 am

మంచు మనోజ్ "బిందాస్" సినిమా ట్రైలర్ మీ కోసం..

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై 'ప్రయాణం' ఫేమ్ మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరూ పోట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: వినోదం | 16 Nov 2009 | 3:24 am

"అదుర్స్"గా వస్తోన్న ఎన్టీఆర్, నయనతారల చిత్రం

ఎన్టీఆర్, నయనతార, షీల కాంబినేషన్‌లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి "అదుర్స్" అనే పేరును ఖరారు చేశారు. ఆదివారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర లోగోను ఎన్టీఆర్, వినాయక్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "వినాయక్‌తో హ్యాట్రిక్ కొట్టాలని చాలా జాగ్రత్తగా ఆలోచించి కథను తయారుచేశాం. అదుర్స్ అనే టైటిల్ అందరికి నచ్చిన టైటిల్. ఈ రోజు చిత్రంలోని చివరిపాటను పూర్తిచేశాం. ఇంకా రెండు రోజుల ప్యాచ్‌వర్క్ మిగిలి ఉంది. డిసెంబరులో సినిమాలు విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని" చెప్పారు.
Source: వినోదం | 16 Nov 2009 | 2:50 am