దేశంలో జరుగుతున్న దాడుల సిగ్గుచేటు: కేవిన రుడ్

స్వదేశంలో నివశిస్తున్న విదేశీ విద్యార్థులు, పౌరులపై జరుగుతున్న దాడుల పట్ల ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్ రుడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దాడులు దేశానికే సిగ్గుచేటని, తలవంపులు తెచ్చేలా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఒకానొక దశలో ఆయన కంట కన్నీరు కూడా పెట్టారు.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 8:38 am

మహ్మద్ ఆలీ జిన్నాను తలపిస్తున్న బాల్‌థాక్రే: బీసీసీఐ

శివసేన చీఫ్ బాల్‌థాక్రే వ్యాఖ్యలు పాకిస్థాన్ నేత మహ్మద్ ఆలీ జిన్నా మాటలను తలపిస్తున్నాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభిప్రాపడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై థాక్రే చేసిన విమర్శల పట్ల బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 8:18 am

పెరిగిన జపాన్ జీడీపీ వృద్ధిరేటు: లాభాల్లో సెన్సెక్స్

జపాన్ దేశపు జీడీపీ వృద్ధిరేటు 1.2 శాతంగా పెరగడంతో ఆసియా మార్కెట్లు ఆశాజనకంగా కొనసాగుతున్నాయి. జపాన్ ఆర్థిక వృద్ధిరేటు పెరగడం విదేశీ మార్కెట్లతో పాటు బాంబే స్టాక్ మార్కెట్‌కు కూడా కలిసొచ్చింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాలను నమోదు చేసుకుంటున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో 196 పాయింట్ల వృద్ధితో, 17, 045 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 55 పాయింట్లు పుంజుకుని, 5,054 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 8:18 am

విమాన ఇంధన ధరలు మళ్లీ పెరిగాయ్!

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలు జెట్ ఫ్యూయల్ ధరలు మళ్లీ పెరిగాయి. పదిహేను రోజుల్లో మరోసారి విమానయాన ఇంధన (ఎటిఎఫ్) ధరలు ఆదివారంతో 2.4 శాతం మేర పెరిగాయి. పెంచిన ధరలు ఆదివారం అర్థరాత్రి నుంచే అమల్లోకి వస్తాయి.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 8:00 am

నిలకడగా లాభాలతో కొనసాగుతోన్న సెన్సెక్స్

సోమవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం, మదుపుదారులు కొనుగోళ్లపై దృష్టిసారించడం వంటి కారణాలు బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీని లాభాల బాటలో పయనింపజేశాయి. దీంతో సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో సెన్సెక్స్ 196 పాయింట్ల లాభంతో 17,045 పాయింట్ల వద్ద నిలకడగా కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 64 పాయింట్లు బలపడి, ఐదువేల పాయింట్ల వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 7:47 am

2020 నాటికి గల్ఫ్ దేశాల జనాభా 53 మిలియన్లు!

ప్రపంచంలో జనాభా వేగంగా వృద్ధి చెందుతున్న దేశాలుగా గల్ఫ్ దేశాలు గుర్తింపుపొందాయి. వచ్చే 2020 సంవత్సరం నాటికి ఈ దేశాల మొత్తం జనాభా 53 మిలియన్లకు చేరుకోనుంది ది గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 7:43 am

పీఆర్పీ నేత ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం!

ముత్రపిండాల వ్యాధితో ప్రజారాజ్యం కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపేంద్రను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీ నటుడు మురళీమోహన్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పరామర్శించారు.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 7:38 am

జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదు: హెచ్ఆర్‌సీ

విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్లు డాక్టర్లు సమ్మెచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ల పనిచేయకపోవడం, జూనియర్ల డాక్టర్ల సమ్మెతో ఏడుగురు శిశువులు బలైన సంగతి తెలిసిందే.ఈ దుర్ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మానవ హక్కుల కమిషన్.. జూనియర్ డాక్టర్ల సమ్మెపై తీవ్రంగా స్పందించింది. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం అంటే దుష్ప్రవర్తన కలిగి ఉండటేమనని కమిషన్ అభిప్రాయపడింది.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 7:24 am

మా నాన్న నన్ను లష్కరేకు అమ్ముకున్నాడు: కసబ్

గత ఏడాది నవంబరు 26వ తారీఖున ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో దాడులకు పాల్పడి 50 మంది మరణానికి వందమందికి పైగా తీవ్రగాయాలు పాలవడానికి కారణమైన కసబ్ మరో విషయాన్ని బయటపెట్టాడు. డబ్బుకోసం తన తండ్రి తనను ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అమ్ముకున్నాడని వెల్లడించాడు.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 6:37 am

"వందేమాతరం"పై ఫత్వాను అంగీకరించం: మంత్రి సల్మాన్

జాతీయ గీతం "వందేమాతరం"పై జమైతే ఉలేమా హింద్ జారీ చేసిన ఫత్వాను అంగీకరించబోమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. ఈ చర్య దేశంలోని ముస్లిం వర్గంతో సహా యావత్ సమాజానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: Yahoo! Telugu: News | 16 Nov 2009 | 6:30 am

"అదుర్స్"గా వస్తోన్న ఎన్టీఆర్, నయనతారల చిత్రం

ఎన్టీఆర్, నయనతార, షీల కాంబినేషన్‌లో వి.వి. వినాయక్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రానికి "అదుర్స్" అనే పేరును ఖరారు చేశారు. ఆదివారంనాడు అన్నపూర్ణ స్టూడియోలో చిత్ర లోగోను ఎన్టీఆర్, వినాయక్‌లు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. "వినాయక్‌తో హ్యాట్రిక్ కొట్టాలని చాలా జాగ్రత్తగా ఆలోచించి కథను తయారుచేశాం. అదుర్స్ అనే టైటిల్ అందరికి నచ్చిన టైటిల్. ఈ రోజు చిత్రంలోని చివరిపాటను పూర్తిచేశాం. ఇంకా రెండు రోజుల ప్యాచ్‌వర్క్ మిగిలి ఉంది. డిసెంబరులో సినిమాలు విడుదలచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని" చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 6:21 am

"సలీమ్"ను ట్రైలర్లో తిలకించండి

విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం "సలీమ్" ('దుమ్ముదులుపుతాడు అనే ట్యాగ్). డిసెంబరు మూడో వారంలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నటుడు మోహన్‌బాబు నిర్మిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 5:35 am

నా నగ్న వీపును కళాత్మక దృష్టితో చూడండి: సేనకు కరీనా సూచన

నవంబరు 20వ తేదీన దేశవ్యాప్తంగా విడుదల కానున్న కరీనా చిత్రం "కుర్బాన్"కు సంబంధించిన కరీనా బేర్‌బ్యాక్ వాల్‌పోస్టర్ వ్యవహారం ఇంకా సద్దుమణగలేదు. కరీనాకపూర్ సిగ్గు లేకుండా వీపు మొత్తాన్ని నగ్నంగా చూపించిందని శివసేన విరుచుకుపడటమే కాక చీర కట్టుక తిరగాలని కరీనాకు సూచించింది. శివసేన మాటలకు కరీనా కపూర్ స్పందించింది. శివసేన తనకు మంచి చీర పంపిస్తే ఆనందంగా స్వీకరిస్తాననీ, అయితే తనకు ఇప్పటివరకూ శివసేన నుంచి ఎటువంటి చీర అందలేదని తెలిపింది. ఇదిలావుంటే శివసేన మహిళా కార్యకర్తలు కొందరు కరీనా నగ్నవీపుతో ముంబయి నగరంలో అతికించి ఉన్న పోస్టర్లన్నిటికీ చీరలను చుట్టి తమ నిరసనలను తెలిపారు. ఈ సందర్భంగా శివసేన కార్యకర్తలు కరీనాపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇటువంటి నగ్న వేషాలను ప్రదర్శించడం నీచమని ధ్వజమెత్తారు. కరీనాకపూర్ మాత్రం దీనికి మరోలా స్పందించింది. కళాత్మక దృష్టితో చూస్తే తన నగ్న వీపు వెనుక ఉన్న అర్థం గోచరిస్తుందనీ, వక్రంగా చూస్తే వక్రపు ఆలోచనలే వస్తాయని తెలిపింది. అసలు అందులో తప్పేమీ లేదని కొట్టి పారేసింది.
Source: Yahoo! Telugu: Entertainment | 16 Nov 2009 | 5:23 am

మహ్మద్ ఆలీ జిన్నాను తలపిస్తున్న బాల్‌థాక్రే: బీసీసీఐ

శివసేన చీఫ్ బాల్‌థాక్రే వ్యాఖ్యలు పాకిస్థాన్ నేత మహ్మద్ ఆలీ జిన్నా మాటలను తలపిస్తున్నాయని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు అభిప్రాపడింది. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌పై థాక్రే చేసిన విమర్శల పట్ల బీసీసీఐ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Source: జాతీయ | 16 Nov 2009 | 2:49 am

పీఆర్పీ నేత ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమం!

ముత్రపిండాల వ్యాధితో ప్రజారాజ్యం కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత పర్వతనేని ఉపేంద్ర తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బంజారాహిల్స్‌లోని స్టార్ ఆస్పత్రిలో నాలుగు రోజులుగా చికిత్స పొందుతున్న ఉపేంద్ర ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఉపేంద్రను ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి, సినీ నటుడు మురళీమోహన్, విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తదితరులు పరామర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 2:09 am

జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కులేదు: హెచ్ఆర్‌సీ

విధి నిర్వహణలకు ఆటంకం కలిగించే విధంగా జూనియర్ డాక్టర్లకు సమ్మె చేసే హక్కు లేదని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. ఉపకార వేతనం పెంచాలని డిమాండ్ చేస్తూ.. జూనియర్లు డాక్టర్లు సమ్మెచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో వెంటిలేటర్ల పనిచేయకపోవడం, జూనియర్ల డాక్టర్ల సమ్మెతో ఏడుగురు శిశువులు బలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మానవ హక్కుల కమిషన్.. జూనియర్ డాక్టర్ల సమ్మెపై తీవ్రంగా స్పందించింది. జూనియర్ డాక్టర్లు సమ్మె చేయడం అంటే దుష్ప్రవర్తన కలిగి ఉండటేమనని కమిషన్ అభిప్రాయపడింది.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 1:54 am

మా నాన్న నన్ను లష్కరేకు అమ్ముకున్నాడు: కసబ్

గత ఏడాది నవంబరు 26వ తారీఖున ముంబయి ఛత్రపతి శివాజీ టెర్మినస్ లో దాడులకు పాల్పడి 50 మంది మరణానికి వందమందికి పైగా తీవ్రగాయాలు పాలవడానికి కారణమైన కసబ్ మరో విషయాన్ని బయటపెట్టాడు. డబ్బుకోసం తన తండ్రి తనను ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు అమ్ముకున్నాడని వెల్లడించాడు.
Source: జాతీయ | 16 Nov 2009 | 1:08 am

"వందేమాతరం"పై ఫత్వాను అంగీకరించం: మంత్రి సల్మాన్

జాతీయ గీతం "వందేమాతరం"పై జమైతే ఉలేమా హింద్ జారీ చేసిన ఫత్వాను అంగీకరించబోమని కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖామంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. ఈ చర్య దేశంలోని ముస్లిం వర్గంతో సహా యావత్ సమాజానికి వ్యతిరేకమని ఆయన అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 16 Nov 2009 | 1:00 am

శిశు మరణాలపై మానవహక్కుల కమిషన్ సీరియస్!

రాష్ట్ర వాణిజ్య రాజధాని విజయవాడలోని ప్రభుత్వాసుపత్రిలో సోమవారం చోటు చేసుకున్న శిశు మరణాలపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఈ కేసును సుమోటాగా స్వీకరించిన కమిషన్.. 24 గంటల్లోగా సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర మెడికల్ డైరక్టరేట్‌ను ఆదేశించింది.
Source: ఏపీ న్యూస్ | 16 Nov 2009 | 12:37 am

బీఎస్ఎఫ్ వాహనం పేల్చివేత: డీఐజీ దుర్మరణం!

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో మిలిటెంట్లు పెట్రేగి పోయారు. బీఎస్ఎఫ్ వాహనాన్ని పేల్చి వేశారు. ఈ సంఘటనలో డీఐజీ ర్యాంకు అధికారి దుర్మరణం చెందగా, మరికొందరు గాయపడ్డారు. సాంబా సెక్టార్‌లోని రామ్‌ఘర్ జిల్లాలో సోమవారం ఈ సంఘటన జరిగింది.
Source: జాతీయ | 15 Nov 2009 | 11:56 pm

ఆటపై దృష్టి ఉంచు.. రాజకీయాలపై కాదు: బాల్‌థాక్రే

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ శివసేన చీఫ్ బాల్‌థాక్రే ఆగ్రహానికి గురయ్యారు. సచిన్ రాజకీయాల్లోకి తలదూర్చకుండా.. ఆటపై దృష్టి కేంద్రీకరించాలని థాక్రే సూచించారు.
Source: జాతీయ | 15 Nov 2009 | 11:36 pm

గుంటూరులో భారీ పేలుడు: 15 మంది దుర్మరణం

గుంటూరు జిల్లాలోని ఓ గోడౌన్‌లో సంభవించిన భారీ పేలుడులో 15 మంది దుర్మరణం పాలైయ్యారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం నారాయణపురంలోని ఓ గోడౌన్‌లో సోమవారం ఉదయం భారీ బాంబు పేలుళ్లు సంభవించాయి. రెండు నిమిషాల వ్యవధిలోనే జరిగిన భారీ పేలుళ్లకు 15 మంది మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 11:34 pm

రాజధానిలో నేటి నుంచి సీపీఎం కార్యవర్గ సమావేశాలు!

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం రాష్ట్ర రాజధానిలో ప్రారంభమయ్యాయి. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్‌తో సహా, పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరీ, ఇతర అగ్రనేతలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 11:33 pm

వారిద్దరికి ప్రధాని స్థాయి భద్రతా.. నో ఛాన్స్: హోంశాఖ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతిలకు రాష్ట్రపతి, ప్రధాని స్థాయి భద్రత కల్పించేంత సీన్ లేదని కేంద్ర హోం శాఖ తేల్చి చెప్పింది. ఈ మేరకు ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పంపిన ప్రతిపాదనలను హోంమంత్రిత్వ శాఖ తిప్పి పంపింది.
Source: జాతీయ | 15 Nov 2009 | 11:22 pm

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మరో శిశువు మృతి

ప్రభుత్వ ఆస్పత్రుల్లో గల లోపాలు ఏడుగురు శిశువులను బలికొంది. విజయవాడలోని పాత ప్రభుత్వాస్పత్రిలో ఆదివారం ఉదయం ఏడు నుంచి రాత్రి ఏడు గంటల మధ్య ఈ మృత్యు పరంపర సాగింది. పిల్లల వార్డులో ఐసీయులో అవసరమైనన్ని వెంటిలేటర్లు లేకపోవడం, ఉన్న ఒక్క వెంటిలేటర్ సరిగా పనిచేయకపోవడం, స్టాఫ్ నర్సు నిర్లక్ష్యం వంటి కారణాలతో ఆదివారం ఆరుగురు శిశువులు మృతిచెందారు. అలాగే సోమవారం మరో శిశువు మృతి చెందింది. దీంతో మృతి చెందిన శిశువుల సంఖ్య ఏడుకు చేరింది.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 11:15 pm

భాజపా తదుపరి అధ్యక్షునిగా గడ్కారీ పేరు ఖరారు!

భారతీయ జనతా పార్టీ తదుపరి అధ్యక్షుడిగా మహారాష్ట్రకు చెందిన నితిన్ గడ్కారీ పేరును భాజపా అధిష్టానం ఖరారు చేసినట్టు సమాచారం. ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచన మేరకు భాజపా అగ్రనేత ఎల్కే.అద్వానీ గడ్కారీ పేరుకు ఆమోదముద్ర వేసినట్టు ఆ పార్టీ నేతలు వెల్లడించారు
Source: జాతీయ | 15 Nov 2009 | 8:58 pm

"కె. రాఘవేంద్రరావు" దర్శకత్వంలో 'మంచు మనోజ్' కొత్త చిత్రం!

శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ పతాకంపై "ప్రయాణం" ఫేమ్ మంచు మనోజ్ హీరోగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రముఖ నటుడు మోహన్ బాబు బేనర్‌పై కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది. హీరో మంచు మనోజ్‌పై తీసిన తొలిషాట్‌కు దాసరి నారాయణరావు క్లాప్ కొట్టగా, మోహన్ బాబు స్నేహితుడు పద్మభూషణ్ గ్రహీత వరప్రసాద్ రెడ్డి కెమెరా స్విచ్ఛాన్ చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2009 | 10:24 am

వెంకీ, ఇలియానాల ఆటోగ్రాఫ్ కోసం పోలీసులే ఎగబడితే..?

అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల ప్రారంభోత్సవంలో జరిగిన నృత్యాలు, మిమిక్రీ, ఇంద్రజాలం అందరి ఆకట్టుకున్నాయి. ఇంకా విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆయన రాగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం కేరింతలతో మునిగింది. చాలామంది పిల్లలు ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. కానీ ఆ తర్వాత ఇలియానా వచ్చిన వెంటనే ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఏదైనా సినిమా గ్లామరే కారణమని.. దాసరి వ్యాఖ్యానించడం.. దానికి ఆయన పక్కన ఉన్నవారు అవుననడం.. విశేషం. ఇకపోతే.. పోలీసు అధికారులు సైతం తమ పిల్లలను వెంకటేష్, ఇలియానాల దగ్గరకు తీసుకెళ్ళడం ఇందులో మరో ఆసక్తికరమైన అంశం.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2009 | 8:31 am

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం

16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు శనివారంనాడు హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషిని అభినందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2009 | 8:09 am

ఢిల్లీలో లష్కర్ ఉగ్రవాది అరెస్ట్

తాము ఆదివారం నాడు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లష్కర్-ఏ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నామని, ఇతనికి హెడ్లీతో మంచి సంబంధాలున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 15 Nov 2009 | 5:12 am

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూడాల వినూత్న నిరసన

తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ వైద్యులు గత కొద్ది రోజులుగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. ఆదివారం నాడు వినూత్నంగా శాంతియుతంగా రక్తదానం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 3:18 am

ఓఎంసిపై తప్పక దర్యాప్తు చేస్తాం: రోశయ్య

ఓబుళాపురం గనుల్లో జరుగుతున్న అవకతవకలకు తమ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించి విచారణ చేపడుతుందని రాష్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 3:00 am