వెంకీ, ఇలియానాల ఆటోగ్రాఫ్ కోసం పోలీసులే ఎగబడితే..?

అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాల ప్రారంభోత్సవంలో జరిగిన నృత్యాలు, మిమిక్రీ, ఇంద్రజాలం అందరి ఆకట్టుకున్నాయి. ఇంకా విక్టరీ వెంకటేష్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. ఆయన రాగానే ఒక్కసారిగా అక్కడి వాతావరణం కేరింతలతో మునిగింది. చాలామంది పిల్లలు ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. కానీ ఆ తర్వాత ఇలియానా వచ్చిన వెంటనే ఆమె ఆటోగ్రాఫ్ కోసం ఎగబడ్డారు. ఏదైనా సినిమా గ్లామరే కారణమని.. దాసరి వ్యాఖ్యానించడం.. దానికి ఆయన పక్కన ఉన్నవారు అవుననడం.. విశేషం. ఇకపోతే.. పోలీసు అధికారులు సైతం తమ పిల్లలను వెంకటేష్, ఇలియానాల దగ్గరకు తీసుకెళ్ళడం ఇందులో మరో ఆసక్తికరమైన అంశం.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2009 | 8:31 am

ఓఎంసిపై తప్పక దర్యాప్తు చేస్తాం: రోశయ్య

ఓబుళాపురం గనుల్లో జరుగుతున్న అవకతవకలకు తమ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించి విచారణ చేపడుతుందని రాష్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 8:30 am

అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలు ప్రారంభం

16వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలు శనివారంనాడు హైదరాబాద్‌లోని లలితకళాతోరణంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి అంబికాసోని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలలకు వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించడంలో చిల్డ్రన్ ఫిలిం సొసైటీ ఆఫ్ ఇండియా చేస్తున్న కృషిని అభినందించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 15 Nov 2009 | 8:09 am

నక్సలైట్లతో పోరాడేందుకు మానవరహిత విమానాలు

దేశంలోని దట్టమైన అడవులు, కొండప్రాంతాల్లో ఉంటున్న నక్సలైట్ల స్థావరాలను కనుగొని, వారి కార్యకలాపాలను తెలుసుకుని వారిపై దాడులు చేసేందుకు కొత్తగా మానవరహిత విమానాల(యూఏవీ)ను ఉపయోగించేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమౌతోంది
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 6:56 am

ఉగ్రవాద శిబిరాన్ని నడుపుతున్న పాక్ సైన్యం

పాక్ సైన్యం సీఐఏతో కలిసి ఇస్లామిక్ ఉగ్రవాదుల కొరకు ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నడుపుతోందని ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ ఉగ్రవాద నిరోధక విశేషజ్ఞుడు, న్యాయవాది అయిన జ్యాం లూయీస్ బ్రుగైరే తన పుస్తకంలో పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 6:41 am

9/11 దోషులపై విచారణ న్యూయార్క్‌లోనే

అమెరికాలో గతంలో 9/11న జరిగిన దాడులకు పాల్పడ్డ రూపకర్త ఖలీద్ షేక్ ముహమ్మద్‌తోపాటు మరో నలుగురిని న్యూయార్క్‌లోని ఓ కోర్టులో విచారించనున్నామని అమెరికా అటార్ని జనరల్ ఇరిక్ హోల్డర్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 5:46 am

మహారాష్టల్రో స్వల్పంగా కంపించిన భూమి

మహారాష్టల్రోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. సతారా జిల్లా, కొల్హాపుర్, ముంబై తదితర ప్రాంతాల్లో భూమికంపించిందని అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 5:24 am

గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ధర్మపురి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెక్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆదివారం లాఛనంగా ప్రారంభించారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 4:57 am

ఓఎంసి అక్రమాలపై సిఎంకు ఫిర్యాదు చేసిన అఖిల పక్షం

ఓబుళాపురం గనుల త్రవ్వకాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు ఆదివారం అఖిలపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 4:19 am

బధిరుడైన భారత సంతతి యువకుడు భేష్

భారత సంతతికి చెందిన ఓ బధిర యువకుడు దక్షిణాఫ్రికాలో తన సత్తా చాటుకున్నాడు. దక్షిణాఫ్రికాలో మూడు నెలలపాటు నిర్వహించిన జాతీయ స్థాయి ట్యాలెంట్ షోలో రాజ్‌బల్ విజేతగా నిలిచాడు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 4:07 am

ఎట్టకేలకు ఏఐ సంస్థకు కేంద్రం సాయం

దేశీయ విమానయాన రంగమైన ఎయిర్‌ ఇండియాకు తొలివిడతగా రూ. 800 కోట్లను డిసెంబర్‌లోగా సమకూర్చనున్నట్లు పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్‌ పటేల్‌ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 3:31 am

ప్రభుత్వానికి వ్యతిరేకంగా జూడాల వినూత్న నిరసన

తమకు స్టైఫండ్ పెంచాలని కోరుతూ జూనియర్ వైద్యులు గత కొద్ది రోజులుగా నిరసనలు, నిరాహార దీక్షలు చేపడుతున్న విషయం విదితమే. ఆదివారం నాడు వినూత్నంగా శాంతియుతంగా రక్తదానం చేసి తమ నిరసన వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 3:18 am

మార్కెట్లో కోడిగుడ్లు ధరలు

రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్‌లలో శుక్రవారం కోడిగుడ్ల ధరలు కింది విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌ మార్కెట్‌లో వంద కోడిగుడ్లు ధర రూ.289గా ఉండగా, చిల్లరగా ఒక్క గుడ్డు ధర రూ.3.20గా ఉంది. అలాగే.. వరంగల్ మార్కెట్‌లో రూ.290 గాను, విజయవాడలో రూ.285, విశాఖపట్నంలో రూ.290, గోదావరి మార్కెట్‌లో రూ.285, తూర్పుగోదావరిలో రూ.285, చిత్తూరులో 293 రూపాయలుగా ఉంది. ఇకపోతే.. పొరుగు రాష్ట్రమైన తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నైలో వంద కోడిగుడ్లు ధర రూ.300 పలుకగా, కోళ్ళ పరిశ్రమకు ఆయువుపట్టుగా ఉన్న నామక్కల్‌లో 285 రూపాయలుగా పలుకుతోంది.
Source: Yahoo! Telugu: News | 15 Nov 2009 | 3:10 am

ఓఎంసిపై తప్పక దర్యాప్తు చేస్తాం: రోశయ్య

ఓబుళాపురం గనుల్లో జరుగుతున్న అవకతవకలకు తమ ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరించి విచారణ చేపడుతుందని రాష్ర ముఖ్యమంత్రి కొణజేటి రోశయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 15 Nov 2009 | 3:00 am

నక్సలైట్లతో పోరాడేందుకు మానవరహిత విమానాలు

దేశంలోని దట్టమైన అడవులు, కొండప్రాంతాల్లో ఉంటున్న నక్సలైట్ల స్థావరాలను కనుగొని, వారి కార్యకలాపాలను తెలుసుకుని వారిపై దాడులు చేసేందుకు కొత్తగా మానవరహిత విమానాల(యూఏవీ)ను ఉపయోగించేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమౌతోంది
Source: జాతీయ | 15 Nov 2009 | 1:27 am

మహారాష్టల్రో స్వల్పంగా కంపించిన భూమి

మహారాష్టల్రోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భూమి స్వల్పంగా కంపించింది. సతారా జిల్లా, కొల్హాపుర్, ముంబై తదితర ప్రాంతాల్లో భూమికంపించిందని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 14 Nov 2009 | 11:54 pm

గ్రేటర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ధర్మపురి

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల ప్రచారాన్ని రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెక్ కమిటీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ ఆదివారం లాఛనంగా ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 11:29 pm

ఓఎంసి అక్రమాలపై సిఎంకు ఫిర్యాదు చేసిన అఖిల పక్షం

ఓబుళాపురం గనుల త్రవ్వకాలలో అక్రమాలు జరుగుతున్నాయంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యకు ఆదివారం అఖిలపక్ష నేతలు ఫిర్యాదు చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 10:50 pm

2013లో చంద్రయాన్ ప్రయోగం: రాధాకృష్ణన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2013లో చంద్రయాన్ ప్రయోగం చేస్తుందని ఇస్రో ఛైర్మన్ రాధా కృష్ణన్ తెలిపారు. ఆదివారం తిరుమలేశుని దర్శించుకున్న రాధాకృష్ణన్ విలేకరులతో మాట్లాడారు. 2013లో చంద్రయాన్ ప్రయోగం ఉంటుందని రాధాకృష్ణన్ వెల్లడించారు.
Source: జాతీయ | 14 Nov 2009 | 9:33 pm

ఒరిస్సాలో 180 మంది విద్యార్థులకు స్వైన్ ఫ్లూ లక్షణాలు

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి మనదేశంలోని ఒరిస్సాలో స్వైర విహారం చేస్తోంది. ఒరిస్సా రాష్ట్రంలో దాదాపు 180 మంది విద్యార్థులకు స్వైన్ ఫ్లూ లక్షణాలున్నట్లు తేలింది. దీంతో స్వైన్ ఫ్లూ లక్షణాలున్న విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, మెరుగైన చికిత్స కోసం తగిన చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. అంతేగాకుండా.. హెచ్1ఎన్1 వైరస్ సోకిన ప్రదీప్ బుందియా అనే వ్యాపారి మరణించినట్లు వారు వెల్లడించారు.
Source: జాతీయ | 14 Nov 2009 | 9:13 pm

ఓబుళాపురంపై ఎలాంటి విచారణకైనా సిద్ధం: రఘువీరా

ఓబుళాపురం గనుల వ్యవహారంపై ఎలాంటి విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరారెడ్డి చెప్పారు. ఓబుళాపురం గనులపై తెలుగుదేశం, పీఆర్పీలు సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేసిన నేపథ్యంలో.. ప్రభుత్వానికి ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 8:46 pm

"గుండు" చేయించుకోవడానికి రెడీ: కత్రినా

తెలుగు ప్రేక్షకులకు ఆధునిక మల్లీశ్వరిగా పరిచయమైన కత్రినాకైఫ్ బాలీవుడ్‌లో దుమ్ము రేపుతోంది. తనకంటే ముందుకు దూసుకుపోతున్నట్లు ఎవరైనా కనిపిస్తే... వారి అవకాశాలను ఇట్టే లాగేసుకుంటోంది. దక్షిణాది తారలైన అసిన్, శ్రియ వంటి తారలను ఓ కంటకనిపెడుతూ రేసులో ముందుకు వెళుతోంది. తన కెరీర్‌లో మంచి బ్రేక్‌నివ్వగల కథతో ఎవరైనా వస్తే తాను నటించడానికి రెడీ అంటోందట. ఆఖరికి ఆ పాత్రలో తను గుండు చేయించుకుని నటించమన్నా నటిస్తానని చెపుతోందట. ఈ వార్త తెలుసుకున్న బాలీవుడ్ దర్శకనిర్మాతలు కత్రినాకైఫ్ గుండు చేయించుకుంటే ఎలా ఉంటుందోనని కొన్ని ఊహా చిత్రాలను గీయించుకోవడమే కాక రచయితలకు ఓ పవర్‌ఫుల్ "గుండు" హీరోయిన్ లీడ్ రోల్ ఉండే విధంగా కథను తయారు చేయమని చెపుతున్నారట. మొత్తానికి కత్రినా "గుండు" ఆలోచన బాలీవుడ్ రచయితల మెదళ్లకు పదును పెట్టిందన్నమాట.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 1:37 pm

మాకు పెళ్లయిన మగాళ్లే కావాలి: క్యూట్ హీరోయిన్స్

బాలీవుడ్ సుందరాంగులు పెళ్లైన మగాళ్లంటే తెగ మోజు పడుతున్నారట. అంతేకాదు సదరు పెళ్లైన పురుషుడు అంగీకరిస్తే పెళ్లికి సై అంటున్నారు. ఉదాహరణకు తాజాగా పొడుగు కాళ్ల సుందరి శిల్పాశెట్టి ఆల్రెడీ పెళ్లయిపోయిన లండన్ ఆధారిత వ్యాపారస్తుడు రాజ్ కుంద్రాను వివాహమాడబోతోంది. రాజ్ తనను అపూరూపంగా చూసుకుంటాడని కితాబిస్తోంది. అతనికి ముందే పెళ్లయిపోయిందిగా అనంటే... అయితేనేం అతనంటే నాకు చెప్పలేనంత ఇష్టం. అసలు మగడుగా అతనిని తప్ప మరెవరినీ ఊహించుకోలేనని తెగేసి చెప్పింది.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 11:30 am

25న ప్రేక్షకుల ముందుకు "మా నాన్న చిరంజీవి"

ఫ్రైమ్‌స్టార్ జగపతిబాబు హీరోగా 'తమ్ముడు' ఫేమ్ అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో జయశ్రీ సమర్పణలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "మా నాన్న చిరంజీవి". లాఫింగ్ లార్డ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని నవంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం గురించి హీరో జగపతిబాబు మాట్లాడుతూ.. అరుణ్‌ప్రసాద్ కథ చెప్పగానే నచ్చింది. భారీ బడ్జెట్ సినిమాగా, తన క్యారెక్టర్‌ను అద్భుతంగా చిత్రీకరించారని చెప్పారు. ఇందులో తన క్యారెక్టర్ పేరు చిరంజీవి, తన కొడుక్కి పెద్ద హీరోని. బాగా స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్. ప్రతి మనిషికి స్ట్రగుల్ వుంటుంది. కానీ మనం ఎలాంటి స్ట్రగుల్ ఎదుర్కొంటున్నా.. నవ్వుతూ ముందుకు సాగాలి అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. ఎంటర్‌టైన్‌మెంట్, సెంటిమెంట్ అంశాల కలబోతగా ఫ్యామిలీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ సినిమా కోసం యూనిట్ అంతా కష్టపడి పనిచేసిందని జగపతి బాబు అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 10:46 am

మీడియా సెంటర్‌ను ప్రారంభించిన 'గీతారెడ్డి'

16వ భారత అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్‌లోని ఐమాక్స్ థియేటర్‌లో మీడియా సెంటర్‌ను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి డా.జె. గీతారెడ్డి ప్రారంభించారు. దేశ, విదేశీ ప్రతినిధులకు మీడియాకు ఉపయోగపడే విధంగా ఇంటర్‌నెట్ సౌకర్యం, ఫ్యాక్స్, టెలిఫోన్, వెబ్‌సైట్స్ ప్రారంభించామని, వాటిని వినియోగించుకోవాల్సిందిగా గీతారెడ్డి సూచించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 10:09 am

చంద్రబాబు కుయుక్తులు తమకు తెలియవు: చిరు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఉన్న కుయుక్తులు తమకు తెలియవని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం మాట్లాడుతూ.. మైనార్టీల అభివృద్ధి కోసం సంచార్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని చిరంజీవి గ్రేటర్ ప్రజల వాసులకు వాగ్ధానం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 7:50 am

చదువే ఉన్నత స్థాయికి చేర్చుతుంది: ప్రధాని మన్మోహన్

ఒక వ్యక్తి ఉన్నత స్థాయికి చేరుకోవడంలో కీలక పాత్ర పోషించేది చదువేనని ప్రధాన మన్మోహన్ సింగ్ అన్నారు. తాను ఈ స్థాయిలో ఉండటానికి ప్రధాన కారణంగా కూడా ఇదేనని ఆయన చెప్పుకొచ్చారు.
Source: జాతీయ | 14 Nov 2009 | 7:19 am

"ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాటకు 'బంపర్ ఆఫర్'

"ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తోంది. "బంపర్ ఆఫర్" చిత్రం విజయానికి ఈ పాట ఎంతో దోహదపడింది. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ వైష్టో అకాడమీ పతాకంపై సోదరుడు సాయిరామ్‌శంక్ హీరోగా, శిష్యుడు జయరవీంద్ర దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు. పూరీ జగన్నాథ్ మిత్రుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా రూపొందించిన "బంపర్ ఆఫర్" మంచి హిట్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అయిన బంపర్ ఆడియో బంపర్ హిట్ అయి ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించిన సందర్భంగా నవంబర్ 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సుదర్శన్ 70 ఎంఎంలో ఫంక్షన్ జరుపుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 7:03 am

సందేశాత్మకంగా తెరకెక్కనున్న "యుగళగీతం"

విద్యార్థిదశ ప్రతి ఒక్కరికి ఎంతో కీలకమైంది. జీవితగమ్యాన్ని నిర్దేశించే ఈ దశలో ఎంతో జాగ్రత్త అవసరం. చెడుమార్గంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తును బంగారుబాట చేసుకోవాలనే కథాంశంతో "యుగళగీతం" చిత్రం రూపొందుతోందని దర్శకుడు శివాజీ తెలిపారు. ఇక టీనేజ్‌లో గాడితప్పిన విద్యార్థులు, క్రమశిక్షణతో మెలిగే విద్యార్థుల జీవితాల తారతమ్యాన్ని చూపిస్తూ.. ఈ చిత్రాన్ని జీవిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. అభిషేక్, శ్రీకర్, చందు, శివ ముప్పాళ్ళ, సోనిచరిష్ట, సబ్రినా, హాష్మి, శ్రీ అంజలి, దీప్తి ఇందులో ప్రధాన తారాగణం. కవిత ఇంజేటి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణనంతర పనులు పూర్తికావడంతో తొలికాపీ సిద్ధమైంది. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 6:50 am

కరీనా... చీర కట్టుకుంటావా..? లేదా..? :శివసేన

"కుర్బాన్" చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్‌లో కరీనా తన వీపును పూర్తి నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రియుడు సైఫ్ ఎదుట నిలిచి ఉంటుంది. ఈ పోస్టర్ ముంబయి ప్రధాన కూడళ్లలో దర్శనమిస్తోంది. వీటిని చూసిన శివసేన శివాలెత్తిపోతోంది. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఒళ్లంతా చూపెట్టడమే కాక దానిని ఆయా కూడళ్లలో ప్రదర్శించడంపై మండి పడుతోంది. ఈ పోస్టర్లు ఎక్కడ ఉన్నా తొలగించాల్సిందిగా సేన తన కార్యకర్తలకు సూచించింది. దీంతో ముంబయిలోని జుహు, అంధేరి, మరోల్ తదితర ప్రాంతాల్లో అంటించి ఉన్న పోస్టర్లను వెతికి మరీ చింపి పారేస్తున్నారు. సుమారు 100 మంది శివసేన కార్యకర్తలు కరీనా నగ్న వీపుతో కూడుకున్న పోస్టర్లు ఎక్కడ కనబడినా వాటిని తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరీనా నగ్న వీపు ప్రదర్శన గురించి శివసేనకు చెందిన యాక్టివిస్ట్ జితేంద్ర మాట్లాడుతూ..." పోస్టర్లలో అర్థనగ్న శరీరాలను ప్రదర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు గొడ్డలిపెట్టు లాంటిది. ఈ సంస్కృతిని తక్షణమే విడనాడాలి" అని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 6:10 am

కళ్యాణ్ సింగ్‌తో సంబంధాలు తెంచుకున్న ములాయం!

మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్‌తో ఉన్న అన్ని రకాల సంబంధాలను తెంచుకుంటున్నట్టు ఎస్పీ అధినేత ములాయం సింగ్ ప్రకటించారు. దీనిపై ఆయన శనివారం లక్నోలో మీడియాతో మాట్లాడుతూ.. సమాజ్‌వాదీ పార్టీలో కళ్యాణ్ సింగ్ భాగస్వామి కాదన్నారు
Source: జాతీయ | 14 Nov 2009 | 5:43 am

స్కిన్ షో చేయనుగాక చేయను: స్నేహ

గ్లామర్ ఫీల్డులో గ్లామర్ అంటే చాలా అర్థాలున్నాయి. అందంగా ఉండటం, బికినీలు వేసుకుని మరింత అందాన్ని చూపెట్టడం అంటూ పలు విధాలుగా ఉన్నాయి. స్నేహ దృష్టిలో మాత్రం గ్లామర్ అంటే చర్మ సౌందర్యం కాదు. చూడగానే బాగుంది అనిపించాలంటోంది. ఇటీవల తాను బికినీలో నటిస్తున్నాననీ, దానికి మించిన అందం ఏముందని అని తన గురించి ఓ తమిళ దర్శకుడు అన్న మాటపై ఆమె స్పందించింది. ఏదో స్కిన్ షో చేసేది గ్లామర్ కాదని అంటోంది. తానెప్పుడూ డబ్బుకోసం కక్కుర్తి పడలేదనీ, ఇక ముందు కూడా పడబోననీ అంటోంది. స్నేహ ఎందుకిలా చేసింది అని అభిమానులను నొప్పించననీ, ఇంటిల్లిపాది చూసే విధంగా యూత్‌ను ఆకట్టుకునేవిధంగా నా డ్రెస్‌లు సినిమాలుంటాయని చెబుతోంది. తాజాగా ఆమె భవానీ ఐపీఎస్ అనే తెలుగు, తమిళ చిత్రంలో నటిస్తోంది. అందులోనూ ఓ సందర్భంలో టైట్ దుస్తులు ధరిస్తుంది. ఆ సినిమా విడుదలయితే కానీ స్నేహ స్కిన్ షో ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం.
Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 5:26 am

నేటి తరంలో చిరంజీవి అంటే అభిమానం: సీఎం రోశయ్య

ప్రస్తుత తరంలోని నటుల్లో చిరంజీవి అంటే అభిమానమెక్కువని, అలాగే, అక్కినేని నాగార్జున నటించిన 'అన్నమయ్య', 'శ్రీరామదాసు' వంటి చిత్రాలు కూడా బాగా నచ్చాయని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 4:11 am

ఎగరాలనుకున్న "కుర్రాడు" కూలబడ్డాడు

ఈ కుర్రాడి జీవితంలో మూడే ఆశయాలుంటాయి. కొత్త బైక్ కొనుక్కోవడం, దానిపై తన ప్రేయసితో షికార్లు చేయడం, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం అనేవి. తెరపైకి వెళితే... పదవక్లాసు కూడా పాస్‌కాని కుర్రాడి కథ. ఉద్యోగం లేకపోయినా మంచి బైక్ కొనుక్కుని తిరగాలనుకుంటాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. కొడుకు పోరుపడలేక తండ్రి తన కూతురు పెళ్లికి దాచిన డబ్బును ఏదో మంచి పనిచేస్తాడనే నమ్మకంతో ఇస్తాడు. బైక్ రాగానే బ్యాంక్‌లో లోన్ రికవరీ ఏజెంట్‌గా ఉద్యోగం కూడా వస్తుంది. దాంతో గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లు చేస్తుంటాడు. ఇప్పటికి 2 కోరికలు నెరవేరినట్లే... సడెన్‌గా ఆ సమయంలో వరుణ్ బైక్ మాయమవుతుంది.
Source: వినోదం | 14 Nov 2009 | 3:21 am

ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు.. దర్యాప్తు: మంత్రి చిదంబరం

లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ నుంచి సేకరించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించలేమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు.
Source: జాతీయ | 14 Nov 2009 | 2:45 am

"ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాటకు 'బంపర్ ఆఫర్'

"ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తోంది. "బంపర్ ఆఫర్" చిత్రం విజయానికి ఈ పాట ఎంతో దోహదపడింది. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ వైష్టో అకాడమీ పతాకంపై సోదరుడు సాయిరామ్‌శంక్ హీరోగా, శిష్యుడు జయరవీంద్ర దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు. పూరీ జగన్నాథ్ మిత్రుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా రూపొందించిన "బంపర్ ఆఫర్" మంచి హిట్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అయిన బంపర్ ఆడియో బంపర్ హిట్ అయి ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించిన సందర్భంగా నవంబర్ 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సుదర్శన్ 70 ఎంఎంలో ఫంక్షన్ జరుపుతున్నారు.
Source: వినోదం | 14 Nov 2009 | 2:21 am

సందేశాత్మకంగా తెరకెక్కనున్న "యుగళగీతం"

విద్యార్థిదశ ప్రతి ఒక్కరికి ఎంతో కీలకమైంది. జీవితగమ్యాన్ని నిర్దేశించే ఈ దశలో ఎంతో జాగ్రత్త అవసరం. చెడుమార్గంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తును బంగారుబాట చేసుకోవాలనే కథాంశంతో "యుగళగీతం" చిత్రం రూపొందుతోందని దర్శకుడు శివాజీ తెలిపారు. ఇక టీనేజ్‌లో గాడితప్పిన విద్యార్థులు, క్రమశిక్షణతో మెలిగే విద్యార్థుల జీవితాల తారతమ్యాన్ని చూపిస్తూ.. ఈ చిత్రాన్ని జీవిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. అభిషేక్, శ్రీకర్, చందు, శివ ముప్పాళ్ళ, సోనిచరిష్ట, సబ్రినా, హాష్మి, శ్రీ అంజలి, దీప్తి ఇందులో ప్రధాన తారాగణం. కవిత ఇంజేటి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణనంతర పనులు పూర్తికావడంతో తొలికాపీ సిద్ధమైంది. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Source: వినోదం | 14 Nov 2009 | 2:21 am

భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీ!

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీ నియమితులు కానున్నారు. ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌తో గడ్కారీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన నియామకానికి ఆర్ఎస్ఎస్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.
Source: జాతీయ | 14 Nov 2009 | 2:10 am