|
కాంగ్రెస్-ప్రరాపాల మధ్య జోరుగా "విలీన" మంతనాలు!కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన అగ్రనేతల మధ్య జోరుగా రహస్య మంతనాలు జరుగుతున్నాయి. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలను ప్రధానాంశంగా చేసుకుని ప్రరాపా అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో సమావేశమయ్యారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 8:44 am ఆసియాతో మంచి సంబంధాలు కొనసాగిస్తాం: ఒబామాఆసియాను ఓ ప్రాంతంగా చూస్తామని అది ఓ ఖండమైనప్పటికి మాకు అన్ని విధాలా మంచి మితృత్వం కలిగినవిగా ఉంటాయని ఆయన శనివారం నాడు డిపిఏ వార్తా ఏజెన్సీ ద్వారా తెలిపారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 8:29 am ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు.. దర్యాప్తు: మంత్రి చిదంబరంలష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ నుంచి సేకరించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించలేమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 8:14 am భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీ!భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీ నియమితులు కానున్నారు. ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌తో గడ్కారీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన నియామకానికి ఆర్ఎస్ఎస్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 7:40 am "ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాటకు 'బంపర్ ఆఫర్'"ఎందుకే రవణమ్మా.. పెళ్ళెందుకే.." పాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ను ఊపేస్తోంది. "బంపర్ ఆఫర్" చిత్రం విజయానికి ఈ పాట ఎంతో దోహదపడింది. డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ వైష్టో అకాడమీ పతాకంపై సోదరుడు సాయిరామ్‌శంక్ హీరోగా, శిష్యుడు జయరవీంద్ర దర్శకుడిగా ఈ సినిమాను రూపొందించారు. పూరీ జగన్నాథ్ మిత్రుడు రఘు కుంచె సంగీత దర్శకుడిగా రూపొందించిన "బంపర్ ఆఫర్" మంచి హిట్ అయ్యింది. పూరి సంగీత్ ద్వారా రిలీజ్ అయిన బంపర్ ఆడియో బంపర్ హిట్ అయి ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ సాధించిన సందర్భంగా నవంబర్ 15వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సుదర్శన్ 70 ఎంఎంలో ఫంక్షన్ జరుపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 7:03 am సందేశాత్మకంగా తెరకెక్కనున్న "యుగళగీతం"విద్యార్థిదశ ప్రతి ఒక్కరికి ఎంతో కీలకమైంది. జీవితగమ్యాన్ని నిర్దేశించే ఈ దశలో ఎంతో జాగ్రత్త అవసరం. చెడుమార్గంలోకి వెళ్ళకుండా, భవిష్యత్తును బంగారుబాట చేసుకోవాలనే కథాంశంతో "యుగళగీతం" చిత్రం రూపొందుతోందని దర్శకుడు శివాజీ తెలిపారు. ఇక టీనేజ్‌లో గాడితప్పిన విద్యార్థులు, క్రమశిక్షణతో మెలిగే విద్యార్థుల జీవితాల తారతమ్యాన్ని చూపిస్తూ.. ఈ చిత్రాన్ని జీవిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. అభిషేక్, శ్రీకర్, చందు, శివ ముప్పాళ్ళ, సోనిచరిష్ట, సబ్రినా, హాష్మి, శ్రీ అంజలి, దీప్తి ఇందులో ప్రధాన తారాగణం. కవిత ఇంజేటి నిర్మిస్తున్న ఈ చిత్రం నిర్మాణనంతర పనులు పూర్తికావడంతో తొలికాపీ సిద్ధమైంది. ఈ వారంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తవుతాయి. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 6:50 am 2 సంవత్సరాల తర్వాతో గోధుమల దిగుమతిభారతదేశం 2007 తర్వాత తొలిసారిగా గోధుమలను దిగుమతి చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆస్ట్రేలియా నుంచి పది వేల టన్నుల గోధుమలను దిగమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందిSource: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 6:49 am నిరుద్యోగులకు "స్వయంకృషి" ద్వారా ఉపాధి: చిరునిరుద్యోగులకు స్వయంకృషి ద్వారా ఉపాధి మార్గాలను చూపిస్తామని ప్రజారాజ్యం పార్టీ పేర్కొంది. తద్వారా నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చిరంజీవి అన్నారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 6:26 am యూబా నగరం మేయర్‌గా సిక్కు మతస్థుడు!కాలిఫోర్నియాలోని యూబా నగరానికి మేయర్‌గా మొట్టమొదటి సారి ఒక భారతీయుడు బాధ్యతలు స్వీకరించారు. ఈయన సిక్కు మతస్థుడు కావడం గమనార్హం. దీంతో ఇది ఆ దేశంలోని తొలి పంజాబ్ గ్రామంగా పేరు గడించింది.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 6:10 am కరీనా... చీర కట్టుకుంటావా..? లేదా..? :శివసేన"కుర్బాన్" చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సంచలనం సృష్టించింది. ఆ పోస్టర్‌లో కరీనా తన వీపును పూర్తి నగ్నంగా ప్రదర్శిస్తూ ప్రియుడు సైఫ్ ఎదుట నిలిచి ఉంటుంది. ఈ పోస్టర్ ముంబయి ప్రధాన కూడళ్లలో దర్శనమిస్తోంది. వీటిని చూసిన శివసేన శివాలెత్తిపోతోంది. సిగ్గూ ఎగ్గూ లేకుండా ఒళ్లంతా చూపెట్టడమే కాక దానిని ఆయా కూడళ్లలో ప్రదర్శించడంపై మండి పడుతోంది. ఈ పోస్టర్లు ఎక్కడ ఉన్నా తొలగించాల్సిందిగా సేన తన కార్యకర్తలకు సూచించింది. దీంతో ముంబయిలోని జుహు, అంధేరి, మరోల్ తదితర ప్రాంతాల్లో అంటించి ఉన్న పోస్టర్లను వెతికి మరీ చింపి పారేస్తున్నారు. సుమారు 100 మంది శివసేన కార్యకర్తలు కరీనా నగ్న వీపుతో కూడుకున్న పోస్టర్లు ఎక్కడ కనబడినా వాటిని తొలగించే పనిలో నిమగ్నమై ఉన్నారు. కరీనా నగ్న వీపు ప్రదర్శన గురించి శివసేనకు చెందిన యాక్టివిస్ట్ జితేంద్ర మాట్లాడుతూ..." పోస్టర్లలో అర్థనగ్న శరీరాలను ప్రదర్శించడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇది భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు గొడ్డలిపెట్టు లాంటిది. ఈ సంస్కృతిని తక్షణమే విడనాడాలి" అని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 6:10 am గన్నవరంలో ఐటీపార్కుకు సీఎం గ్రీన్‌సిగ్నల్!బెజవాడలో ఐటీపార్కు ప్రారంభోత్సవం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పచ్చజెండా ఊపినట్లు గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటబాలవర్థనరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఈ నెల 21న ఐటీపార్కు ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన విలేకరులతో తెలిపారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 6:09 am హెడ్లీతో రాహుల్ భట్ సంబంధాలు: ఎన్ఐఏ విచారణ?లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ తీవ్రవాది డేవిడ్ కొలెమన్ హెడ్లీతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మహేష్ భట్ తనయుడు రాహుల్ భట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారించనుంది.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 5:53 am యూఐడిలో మీకిష్టమైన నెంబర్ దొరకదు: నీలేకనిదేశంలో పౌరులకు ప్రత్యేక గుర్తింపు కలిగిన నెంబరును కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అదే యూఐడి నెంబర్. ఇందులో లక్కీ నెంబర్ లభించదని యూఐడి అద్యక్షుడు నందన్ నీలేకని అన్నారు.Source: Yahoo! Telugu: News | 14 Nov 2009 | 5:39 am స్కిన్ షో చేయనుగాక చేయను: స్నేహగ్లామర్ ఫీల్డులో గ్లామర్ అంటే చాలా అర్థాలున్నాయి. అందంగా ఉండటం, బికినీలు వేసుకుని మరింత అందాన్ని చూపెట్టడం అంటూ పలు విధాలుగా ఉన్నాయి. స్నేహ దృష్టిలో మాత్రం గ్లామర్ అంటే చర్మ సౌందర్యం కాదు. చూడగానే బాగుంది అనిపించాలంటోంది. ఇటీవల తాను బికినీలో నటిస్తున్నాననీ, దానికి మించిన అందం ఏముందని అని తన గురించి ఓ తమిళ దర్శకుడు అన్న మాటపై ఆమె స్పందించింది. ఏదో స్కిన్ షో చేసేది గ్లామర్ కాదని అంటోంది. తానెప్పుడూ డబ్బుకోసం కక్కుర్తి పడలేదనీ, ఇక ముందు కూడా పడబోననీ అంటోంది. స్నేహ ఎందుకిలా చేసింది అని అభిమానులను నొప్పించననీ, ఇంటిల్లిపాది చూసే విధంగా యూత్‌ను ఆకట్టుకునేవిధంగా నా డ్రెస్‌లు సినిమాలుంటాయని చెబుతోంది. తాజాగా ఆమె భవానీ ఐపీఎస్ అనే తెలుగు, తమిళ చిత్రంలో నటిస్తోంది. అందులోనూ ఓ సందర్భంలో టైట్ దుస్తులు ధరిస్తుంది. ఆ సినిమా విడుదలయితే కానీ స్నేహ స్కిన్ షో ఎంతమేరకు ఉంటుందో చెప్పలేం.Source: Yahoo! Telugu: Entertainment | 14 Nov 2009 | 5:26 am ఇదేం క్రికెట్ మ్యాచ్ కాదు.. దర్యాప్తు: మంత్రి చిదంబరంలష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న డేవిడ్ హెడ్లీ నుంచి సేకరించిన పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించలేమని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు.Source: జాతీయ | 14 Nov 2009 | 2:45 am భాజపా జాతీయ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీ!భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నితిన్ గడ్కారీ నియమితులు కానున్నారు. ఆ పార్టీ మాతృసంస్థ ఆర్ఎస్ఎస్‌తో గడ్కారీకి సన్నిహిత సంబంధాలు ఉండటంతో ఆయన నియామకానికి ఆర్ఎస్ఎస్ కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం.Source: జాతీయ | 14 Nov 2009 | 2:10 am నిరుద్యోగులకు "స్వయంకృషి" ద్వారా ఉపాధి: చిరునిరుద్యోగులకు స్వయంకృషి ద్వారా ఉపాధి మార్గాలను చూపిస్తామని ప్రజారాజ్యం పార్టీ పేర్కొంది. తద్వారా నిరుద్యోగ యువత తమ కాళ్లపై తాము నిలబడేలా చూస్తామని ఆ పార్టీ అధ్యక్షుడు కె.చిరంజీవి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 12:59 am గన్నవరంలో ఐటీపార్కుకు సీఎం గ్రీన్‌సిగ్నల్!బెజవాడలో ఐటీపార్కు ప్రారంభోత్సవం చేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య పచ్చజెండా ఊపినట్లు గన్నవరం ఎమ్మెల్యే డాక్టర్ దాసరి వెంకటబాలవర్థనరావు తెలిపారు. ముఖ్యమంత్రి అనుమతి మేరకు ఈ నెల 21న ఐటీపార్కు ప్రారంభోత్సవం ఉంటుందని ఆయన విలేకరులతో తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 14 Nov 2009 | 12:39 am హెడ్లీతో రాహుల్ భట్ సంబంధాలు: ఎన్ఐఏ విచారణ?లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థ తీవ్రవాది డేవిడ్ కొలెమన్ హెడ్లీతో సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రఖ్యాత బాలీవుడ్ నటుడు మహేష్ భట్ తనయుడు రాహుల్ భట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) విచారించనుంది.Source: జాతీయ | 14 Nov 2009 | 12:24 am యూఐడిలో మీకిష్టమైన నెంబర్ దొరకదు: నీలేకనిదేశంలో పౌరులకు ప్రత్యేక గుర్తింపు కలిగిన నెంబరును కేంద్ర ప్రభుత్వం ఇవ్వనుంది. అదే యూఐడి నెంబర్. ఇందులో లక్కీ నెంబర్ లభించదని యూఐడి అద్యక్షుడు నందన్ నీలేకని అన్నారు.Source: జాతీయ | 14 Nov 2009 | 12:10 am సింగూరులో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ: మమతా బెనర్జీగతంలో పశ్చిమబెంగాల్‌లోని సింగూర్‌లో టాటా మోటార్స్ సంస్థ ఆశలు వదులుకొని వెళ్లిన ప్రదేశంలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని నెలకొల్పి ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టాలని, తద్వారా టాటా సంస్థ అందిస్తానన్న వేలాది ఉద్యోగావాకాశాలు ప్రభుత్వపరంగా ప్రజలకు అందించాలని రైల్వే శాఖామంత్రి మమత బెనర్జీ అభిలషిస్తున్నారు.Source: జాతీయ | 13 Nov 2009 | 11:57 pm ప్రజల వద్దకు వెళ్లే అధికారం నాకుంది: హరీష్ రావుస్థానిక ఎమ్మెల్యేగా ప్రజల వద్దకు వెళ్లే అధికారం తనకు ఉందని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ప్రజల వద్దకు వెళ్లే క్రమంలో తనను ఎవరూ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. రాఘవపూర్ దిళితుల భూవివాదంపై తెరాస, టీడీపీ ఎమ్మెల్యేల బహిరంగ చర్చలో పాల్గొనేందుకు వెళుతున్న ఎమ్మెల్యే హరీష్ రావును పోలీసులు అడ్డుకుని గజ్వేల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 11:55 pm హరీష్ రావును అరెస్ట్ చేసిన పోలీసులుసిద్దిపేట మండలం రాఘవాపూర్‌లో బహిరంగ చర్చకు వెళుతున్న తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యే టి. హరీష్ రావును పోలీసులు ముస్తాబాద్ చౌరస్తాలోనున్న సిద్దిపేట డిగ్రీ కాలేజి వద్ద అడ్డుకున్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు, తెరాస కార్యకర్తలు - పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుందిSource: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 11:52 pm గ్రేటర్ ఎన్నికలు: పాతబస్తీలో చిరంజీవి ప్రచార రథంగ్రేటర్ ఎన్నికల సమరానికి అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గ్రేటర్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని పూరించింది. ఇదే తరహాలో ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి కీలకమైన పాతబస్తీలో శనివారం ప్రచారం చేపట్టన్నారు. శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు చిరంజీవి ప్రచార రథం పాతబస్తీలోకి బయలుదేరనుంది.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 11:40 pm 18న రాష్ట్ర పర్యటనకు రానున్న రాహుల్ గాంధీ!ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ 18వ తేదీన రాష్ట్ర పర్యటన నిమిత్తం హైదరాబాద్ చేరుకోనున్నారు. 18న నగరంలోని విశ్వవిద్యాలయ విద్యార్థులతో ముఖాముఖి చర్చల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఉస్మానియా, సెంట్రల్ యూనివర్శిటీ, జేఎన్‌టీయూల విద్యార్థులతో ఎవరితో ఆయన ముఖాముఖి ఉంటుందనేది ఇంకా తెలియరాలేదు. అయితే రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించేందుకు రాహుల్ గాంధీ నగరానికి చేరుకోనున్నట్లు కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 10:18 pm పట్టాలు తప్పిన మండోరి ఎక్స్‌ప్రెస్: ఐదుగురి మృతిరాజస్థాన్లోని దౌసా జిల్లాలో బాంసకూ ప్రాంతం వద్ద జోధ్‌పుర్ నుంచి ఢిల్లీ వెళుతున్న మండోరి ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం ఉదయాత్పూర్వం పట్టాలు తప్పింది. దీంతో ఓ బాలికతోపాటు ఐదుగురు మృతి చెందారు. 50 మందికి పైగా తీవ్ర గాయాలపాలైనారు.Source: జాతీయ | 13 Nov 2009 | 8:41 pm జాయ్ పాటలు విడుదలఅవితేజ్, త్రినాథ్ హీరోలుగా వైనవి, పార్వతి హీరోయిన్లుగా నటిస్తోన్న "జాయ్" చిత్రం పాటలు విడుదలయ్యాయి. బి.రాజా దర్శకత్వంలో అరుణై పిక్చర్స్ పతాకంపై ఇ.వి.వి కంభన్ నిర్మిస్తున్నారు. గురువారం రాత్రి ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన కార్యక్రమంలో తమ్మారెడ్డి భరద్వాజ ఆడియోను విడుదల చేసి పరుచూరి గోపాలకృష్ణకు అందించారు.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2009 | 1:31 pm నీచ నికృష్టుడు చంద్రబాబు: గాలి జనార్ధన్ రెడ్డిగత కొద్ది రోజులుగా తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓబుళాపురం...ఓబుళాపురం...ఓబుళాపురం అంటూ పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడని, అతనో నీచ నికృష్టుడని తమపై లేనిపోని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని కర్నాటక మంత్రి, ఓబుళాపురం మైనింగ్ యజమాని గాలి జనార్ధన్ రెడ్డి అన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 9:11 am జగన్‌కు మావోయిస్టులతో ప్రాణహాని..!వైఎస్ జగన్‌కు ప్రాణహాని ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. జగన్‌ను కడప, బెంగుళూరు, అనంతపురం ప్రాంతాల్లో మట్టుబెట్టేందుకు మావోయిస్టులు పథకం పన్నారని ఇంటెలిజెన్స్ వర్గాలు చెపుతున్నాయిSource: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 8:53 am 26/11 దాడులు ఎక్కడ చేయాలో హేడ్లీ చెప్పాడా...?నిరుడు నవంబర్ నెల 26న ముంబైలో జరిగిన పేలుళ్ళ దురాగతానికి ప్రధాన సూత్రధారి హఫీజ్ సయీద్‌కు అమెరికాలో పట్టుబడ్డ లష్కర్ తీవ్రవాది డేవిడ్ హెడ్లీకి సంబంధమున్నట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ముంబై పేలుళ్ళ వెనుక హడ్లీ హస్తం ఉన్నట్లు నిఘా విభాగ అధికారులు అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 13 Nov 2009 | 8:06 am హేడ్లీతో రాహుల్‌కు ఏ సంబంధం లేదు: మహేశ్ భట్తన కుమారుడు రాహుల్ భట్‌కు డేవిడ్ హేడ్లీతో ఎలాంటి సంబంధాలు లేవని బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత మహేశ్ భట్ అన్నారు.Source: జాతీయ | 13 Nov 2009 | 7:49 am ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించనున్న జూడాలుతమకు స్టైఫండ్ పెంచాలని గత కొద్ది రోజులుగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె రోజురోజుకు ఉధృతమౌతోంది. దీంతో ప్రభుత్వం జూడా నాయకులతో చర్చలు కొనసాగించింది. అయినా కూడా వారి సమస్యలకు ప్రభుత్వం పరిష్కారం కనుగొనలేకపోయింది. దీంతో రేపట్నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు జూనియర్ డాక్టర్ల సంఘం తెలిపింది.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 7:48 am ఎగరాలనుకున్న "కుర్రాడు" కూలబడ్డాడుఈ కుర్రాడి జీవితంలో మూడే ఆశయాలుంటాయి. కొత్త బైక్ కొనుక్కోవడం, దానిపై తన ప్రేయసితో షికార్లు చేయడం, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం అనేవి. తెరపైకి వెళితే... పదవక్లాసు కూడా పాస్‌కాని కుర్రాడి కథ. ఉద్యోగం లేకపోయినా మంచి బైక్ కొనుక్కుని తిరగాలనుకుంటాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. కొడుకు పోరుపడలేక తండ్రి తన కూతురు పెళ్లికి దాచిన డబ్బును ఏదో మంచి పనిచేస్తాడనే నమ్మకంతో ఇస్తాడు. బైక్ రాగానే బ్యాంక్‌లో లోన్ రికవరీ ఏజెంట్‌గా ఉద్యోగం కూడా వస్తుంది. దాంతో గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లు చేస్తుంటాడు. ఇప్పటికి 2 కోరికలు నెరవేరినట్లే... సడెన్‌గా ఆ సమయంలో వరుణ్ బైక్ మాయమవుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2009 | 7:38 am టాలీవుడ్ ఫంక్షన్స్‌లో హాటీస్ బ్లో అప్బాలీవుడ్ సంగతేమోగానీ టాలీవుడ్ లో ఏదేని ఫంక్షన్ జరుగుతుంటే.. అక్కడ హాటీస్ నయనానందాన్ని కలుగజేస్తున్నారంటున్నారు ఫిలిమ్ నగర్ సినీ వర్గాలు. సినిమాల్లో కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యే కురుచ దుస్తులు ఏకంగా ఆడియో ఫంక్షన్లకు నడిచి వచ్చి తమ అందాలను కనువిందు చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2009 | 4:57 am దేశ వ్యాప్తంగా 514కు చేరిన స్వైన్ ఫ్లూ మరణాలుదేశంలో స్వైన్ ఫ్లూ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. ఇప్పటి వరకు ఈ వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 514కు చేరుకుంది. మరో 15 వేల మందికి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు నిర్ధారించినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి.Source: జాతీయ | 13 Nov 2009 | 4:33 am చిన్న పార్టీలకు ఓట్లేయవద్దు: తెదేపా అధినేత బాబుగ్రేటర్ హైదరాబాద్ మునిసిపిల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీలో ఉన్న చిన్న పార్టీలకు ఓట్లు వేయవద్దని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ఈ పార్టీల వల్ల ఒరిగేదేమి ఉండబోదన్నారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 4:22 am ఎగరాలనుకున్న "కుర్రాడు" కూలబడ్డాడుఈ కుర్రాడి జీవితంలో మూడే ఆశయాలుంటాయి. కొత్త బైక్ కొనుక్కోవడం, దానిపై తన ప్రేయసితో షికార్లు చేయడం, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం అనేవి. తెరపైకి వెళితే... పదవక్లాసు కూడా పాస్‌కాని కుర్రాడి కథ. ఉద్యోగం లేకపోయినా మంచి బైక్ కొనుక్కుని తిరగాలనుకుంటాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. కొడుకు పోరుపడలేక తండ్రి తన కూతురు పెళ్లికి దాచిన డబ్బును ఏదో మంచి పనిచేస్తాడనే నమ్మకంతో ఇస్తాడు.Source: వినోదం | 13 Nov 2009 | 3:22 am
|