|
ఉద్యోగాలు కల్పించనున్న టిసిఎస్, డౌ కెమికల్స్దేశీయ సాఫ్ట్‌పవేర్ సేవల రంగంలో అగ్రగామిగానున్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ తన వ్యాపార లావాదేవీలను మరింత అభివృద్ధి చేసుకునేందుకుగాను అమెరికాలో ఉద్యోగావకాశాలు కల్పించనుందని టిసిఎస్ సంస్థ తెలిపింది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 8:47 am మెక్‌మిష్ సిస్టమ్స్‌ను కొనేందుకు సిద్ధమైన ఇన్ఫోసిస్దేశీయ ఐటీ రంగంలో అగ్రగామిగానున్న ఐన్ఫోసిస్ టెక్నాలజీస్ సంస్థకు అనుబంధమైన ఇన్ఫోసిస్ బిపిఒ సంస్థ మెక్‌మిష్ సిస్టమ్స్‌ను కొనుగోలు చేసేందుకు సిద్ధమౌతోంది. ఇది అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ అని ఇన్ఫోసిస్ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 8:17 am కొనుగోళ్లవైపు మదుపుదారుల దృష్టి: సెన్సెక్స్ వృద్ధికొనుగోళ్లవైపు మదుపుదారులు మొగ్గుచూపడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాలను నమోదు చేసుకుంటోంది. శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభం నుంచే లాభాల బాటలో పయనిస్తోన్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో 165 పాయింట్ల మేర వృద్ధి చెంది, 16,861 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 48 పాయింట్లు బలపడి, 5వేల మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 7:45 am ఎగరాలకున్న "కుర్రాడు" కూలబడ్డాడుఈ కుర్రాడి జీవితంలో మూడే ఆశయాలుంటాయి. కొత్త బైక్ కొనుక్కోవడం, దానిపై తన ప్రేయసితో షికార్లు చేయడం, తండ్రిని జాగ్రత్తగా చూసుకోవడం అనేవి. తెరపైకి వెళితే... పదవక్లాసు కూడా పాస్‌కాని కుర్రాడి కథ. ఉద్యోగం లేకపోయినా మంచి బైక్ కొనుక్కుని తిరగాలనుకుంటాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం. కొడుకు పోరుపడలేక తండ్రి తన కూతురు పెళ్లికి దాచిన డబ్బును ఏదో మంచి పనిచేస్తాడనే నమ్మకంతో ఇస్తాడు. బైక్ రాగానే బ్యాంక్‌లో లోన్ రికవరీ ఏజెంట్‌గా ఉద్యోగం కూడా వస్తుంది. దాంతో గర్ల్‌ఫ్రెండ్‌తో షికార్లు చేస్తుంటాడు. ఇప్పటికి 2 కోరికలు నెరవేరినట్లే... సడెన్‌గా ఆ సమయంలో వరుణ్ బైక్ మాయమవుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2009 | 7:38 am భారతీయ టాక్సీ డ్రైవర్‌పై దాడి: ఆరేళ్ళ జైలు శిక్ష!ఆస్ట్రేలియాలో భారతీయునిపై దాడి చేసిన వ్యక్తికి మెల్‌బోర్న్ కోర్టు ఆరేళ్ళ కఠినకారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. తాజాగా ఈతీర్పు వెల్లడైంది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 7:28 am లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 98 పాయింట్ల వృద్ధిశుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే లాభాలను నమోదు చేసుకున్న బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్.. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలోనూ లాభాల దిశగానే ర్యాలీని కొనసాగిస్తోంది. దీంతో సెన్సెక్స్ 98 పాయింట్లు బలపడి, 16,794 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 41 పాయింట్లు వృద్ధి చెంది, 4,994 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 7:22 am పలు మార్లు భారత్‌కు వచ్చిన హాడ్లీ: ఐఎంతో లింకు!?తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన కోలెమెన్ హాడ్లీ రెండు మూడు మార్లు భారత్‌కు వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. అలాగే, ఆయనకు ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 7:10 am బాబు లక్షమంది మధుకొడాలతో సమానం: గాలిఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అవినీతి జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గాలి జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తాజ్ బంజారాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విరుచుకపడ్డారు.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 7:04 am చంద్రబాబు శవాలపై చిల్లర ఏరుకునే రకం: గాలి ధ్వజంతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శవాలపై చిల్లర ఏరుకునే రకమని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్థనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి నీచమైన నాయకుడిని తాను దేశంలో ఎక్కడా చూడలేదని, ఆంధ్రప్రజలు నీచబుద్ధిని క్షమించరని తాజ్ బంజారాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి జనార్థన రెడ్డి విమర్శించారు.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 6:49 am పారిశ్రామికోత్పత్తి వృద్ధి: లాభాల్లో స్టాక్ మార్కెట్మెటల్, ఐటీ స్టాక్ వాటాల కొనుగోళ్లు పుంజుకోవడంతో బాంబే స్టాక్ మార్కెట్ లాభాల దిశగా పయనిస్తోంది. దేశీయ పారిశ్రామిక ఉత్పత్తి 9.1 శాతం వృద్ధి సాధించడంతో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 155 పాయింట్లు పుంజుకుని, 16,851 మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 58 పాయింట్లు బలపడి 5,011 మార్కు వద్ద ర్యాలీని కొనసాగిస్తోంది.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 6:13 am పోలవరం ప్రాజెక్టుకు అడ్డుకునేందుకు కుట్ర: ఎంపీ హరిప్రతిష్టాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి ఆరోపించారు. ప్రాజెక్ట్ పనులు మొదలైనప్పటి నుంచి ప్రస్తుతం కాలువ పనులు కూడా చివరి దశలోకి వస్తున్న తరుణంలో.. ప్రాజెక్టు పనులను తాత్సారం చేసేందుకు రిటైర్డ్ నీటి పారుదల శాఖ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని హరి విమర్శించారు.Source: Yahoo! Telugu: News | 13 Nov 2009 | 5:59 am టాలీవుడ్ ఫంక్షన్స్‌లో హాటీస్ బ్లో అప్బాలీవుడ్ సంగతేమోగానీ టాలీవుడ్ లో ఏదేని ఫంక్షన్ జరుగుతుంటే.. అక్కడ హాటీస్ నయనానందాన్ని కలుగజేస్తున్నారంటున్నారు ఫిలిమ్ నగర్ సినీ వర్గాలు. సినిమాల్లో కొన్ని సన్నివేశాలకే పరిమితమయ్యే కురుచ దుస్తులు ఏకంగా ఆడియో ఫంక్షన్లకు నడిచి వచ్చి తమ అందాలను కనువిందు చేస్తున్నాయి.Source: Yahoo! Telugu: Entertainment | 13 Nov 2009 | 4:57 am బాబు లక్షమంది మధుకొడాలతో సమానం: గాలిఓబుళాపురం మైనింగ్ కంపెనీలో అవినీతి జరిగిందంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గాలి జనార్థన్ రెడ్డి ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లోని తాజ్ బంజారాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని విరుచుకపడ్డారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 1:45 am పలు మార్లు భారత్‌కు వచ్చిన హాడ్లీ: ఐఎంతో లింకు!?తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలు కలిగిన కోలెమెన్ హాడ్లీ రెండు మూడు మార్లు భారత్‌కు వచ్చినట్టు విచారణలో వెల్లడైంది. అలాగే, ఆయనకు ఇండియన్ ముజాహిదీన్‌తో సంబంధాలు ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.Source: జాతీయ | 13 Nov 2009 | 1:41 am చంద్రబాబు శవాలపై చిల్లర ఏరుకునే రకం: గాలి ధ్వజంతెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శవాలపై చిల్లర ఏరుకునే రకమని ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధినేత గాలి జనార్థనరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు లాంటి నీచమైన నాయకుడిని తాను దేశంలో ఎక్కడా చూడలేదని, ఆంధ్రప్రజలు నీచబుద్ధిని క్షమించరని తాజ్ బంజారాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గాలి జనార్థన రెడ్డి విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 1:19 am పోలవరం ప్రాజెక్టుకు అడ్డుకునేందుకు కుట్ర: ఎంపీ హరిప్రతిష్టాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టును అడ్డుకోవడానికి కుట్ర జరుగుతుందని అనకాపల్లి పార్లమెంట్ సభ్యుడు సబ్బం హరి ఆరోపించారు. ప్రాజెక్ట్ పనులు మొదలైనప్పటి నుంచి ప్రస్తుతం కాలువ పనులు కూడా చివరి దశలోకి వస్తున్న తరుణంలో.. ప్రాజెక్టు పనులను తాత్సారం చేసేందుకు రిటైర్డ్ నీటి పారుదల శాఖ ఉద్యోగులు, రాజకీయ నాయకులు కుట్ర పన్నుతున్నారని హరి విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 13 Nov 2009 | 12:30 am హేడ్లీతో స్నేహమా?: మహేష్ భట్ కుమారునికి ప్రశ్నబాలీవుడ్ నిర్మాత మహేష్ భట్ కుమారుడు రాహుల్ భట్ ఎఫ్‌బీఐకు పట్టుబడ్డ హేడ్లీతో సంబంధాలను కలిగి ఉన్నట్లు తేలడంతో పోలీసులు అతడిని ప్రశ్నించారు. కరడుగట్టిన తీవ్రవాద సంస్థ కార్యకలాపాలలో చురుకుగా పాలుపంచుకుంటున్న హేడ్లీతో ఉన్నటువంటి స్నేహం ఎలాంటిదని రాహుల్‌ను ప్రశ్నించినట్లు పోలీసులు తెలిపారు.Source: జాతీయ | 13 Nov 2009 | 12:15 am ఓబుళాపురం వ్యవహారంపై విచారణ జరపాలి: చిరుఓబుళాపురం గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరుతూ ప్రజారాజ్యం అధినేత చిరంజీవి శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్యకు వినతి పత్రం సమర్పించారు. శుక్రవారం ముఖ్యమంత్రిని కలిసిన చిరంజీవి.. ఓబుళాపురం వ్యవహారంపై సమగ్ర విచారణకు చర్యలు తీసుకోవాలని కోరారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 10:43 pm ఒరిస్సాలో మందుపాతర పేలి ముగ్గురు జవాన్ల మృతిమావోయిస్టుల విధ్వంసానికి ముగ్గురు జవాన్లు బలైయ్యారు. ఒరిస్సాలోని మల్కాన్‌గిరిలో మావోయిస్టులు మరోసారి విధ్వంసానికి పాల్పడ్డారు. సీఆర్‌పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోలు శుక్రవారం మందుపాతరతో పేల్చి వేశారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, ఏడుగురు గాయపడ్డారు.Source: జాతీయ | 12 Nov 2009 | 10:31 pm లోక్‌సత్తావి కూడా ఓటు బ్యాంకు రాజకీయాలే: భాజపాలోక్సత్తా కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ఎం.వెంకయ్య నాయుడు ఆరోపించారు. దీనిపై ఆయన శుక్రవారం హైదరాబాద్‌లో మాట్లాడుతూ.. లోక్‌సత్తా కూడా దిగజారుడు రాజకీయాలకు శ్రీకారం చుట్టిందని విమర్శించారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 9:40 pm అధిష్టానానికి కట్టుబడి తలవంచాను: కర్ణాటక సీఎంతనకు ఇష్టమున్నా లేకపోయినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి నడుచుకోక తప్పదని కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప స్పష్టం చేశారు. అయితే, ధన, కండ బలానికి తలొగ్గే నేతను మాత్రం కానని తేల్చి చెప్పారు. అదేసమయంలో తనపై ఒత్తిడి ఉన్న మాట వాస్తవమేనని అన్నారు.Source: జాతీయ | 12 Nov 2009 | 9:23 pm జార్ఖండ్‌లో ఆర్జేడీ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసిన మావోలుజార్ఖండ్ రాష్ట్రంలో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యేను మావోయిస్టులు గురువారం రాత్రి కిడ్నాప్ చేశారు. ఈ విషయాన్ని జార్ఖండ్ రాష్ట్ర డీజీపీ నిర్ధారించారు. జార్ఖండ్ రాష్ట్రంలోని మనీలా అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రామ్‌చందర్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నారు.Source: జాతీయ | 12 Nov 2009 | 9:14 pm బాలల చిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: గీతారెడ్డిరాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో జరుగనున్న అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 14 నుంచి 20వరకు జరుగనున్న ఈ చిత్రోత్సవాలకు 14వ తేదీన అంబికాసోని, రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్యతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు హాజరుకానున్నారని సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి గీతారెడ్డి చెప్పారు. గురువారం గోల్కొండ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో గీతారెడ్డి ఉత్సవాల వివరాలను తెలియజేస్తూ.. గుల్జార్, విశాల్ భరద్వాజ్, వెంకటేష్, నాగార్జున, తరుణ్, తారే జమీన్ పర్ ఫేమ్ దర్ఘీర్, ఇలియానా, త్రిష, రేవతి మీనన్, శాంతా సిన్హా, ఆశిష్ విద్యార్థి వంటి ప్రముఖులు హాజరుకానున్నారని వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 12:35 pm ఇంటిపేరు "తాగుబోతు" అవుతుందని భయపడ్డా!: అక్కినేని65 సంవత్సరాల సుదీర్ఘ సినీ చరిత్ర గల అక్కినేని నాగేశ్వరరావుకు తన నటజీవితంలో గుర్తుకు వచ్చిన సంఘటనల సమాహారంగా ఆ మధ్య మాటీవీలో ఓ కార్యక్రమం జరిగింది. వాటిని 25 భాగాలుగా వీసీడీల రూపంలో "గుర్తుకొస్తున్నాయి" పేరుతో విడుదల చేశారు. ఈ సందర్భంగా అక్కినేని మాట్లాడుతూ.. "దేవదాసు" తీసిన తర్వాత అన్నీ తాగుబోతు పాత్రలే ఉన్న కథలతో చాలామంది నా దగ్గరకు వచ్చారు. దీంతో నా ఇంటిపేరు 'అక్కినేని'కి బదులు 'తాగుబోతు'గా మారిపోతుందనే భయంకూడా ఏర్పడింది. అలాంటి జ్ఞాపకాలు, ఆనందాలు, అవమానాలు, సంతోషాలు, దుఃఖాలు, మనోవేదన, అసహ్యం ఇలా ఎన్నో కోణాలను ఆవిష్కరించే భాగ్యం కలిగింది. 89 ఏళ్ళ వయస్సులో ఇంకా నా మెదడు షార్ప్‌గా పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను" అని నాగేశ్వరరావు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 11:53 am ఇలియానా కాలు విరిగిందిసలీం షూటింగ్ రాజస్థాన్ ప్రాంతాల్లో జరుగుతున్నప్పుడు యాక్షన్ సన్నివేశాల్లో ఇలియానా పడిపోవడంతో ఆమె కాలు విరిగింది. దానివల్ల సినిమా ఆలస్యమయిందనీ, దానికితోడు తన పెండ్లి కూడా జరగడంతో మరింత ఆలస్యమయిందనీ సలీం చిత్రం ఆలస్యానికి కారణాన్ని హీరో విష్ణువర్థన్ తెలియజేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 11:07 am రూ. 23 కోట్ల రూపాయలతో "సలీమ్"సలీం ఆడియో ఆవిష్కరణ బుధవారం రాత్రి శిల్పారామంలో జరిగింది. ఈ సందర్భంగా మోహన్ బాబు చిత్రం గురించి మాట్లాడారు. "దర్శకుడు చౌదరి నా బిడ్డను బాగా చూపించాడు. బడ్జెట్ ఎక్కువయినా బాగా వచ్చింది. ఇందులో నేను ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాను" అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 11:01 am హేడ్లీ, రాణాలపై ఎన్ఐఏ కేసు నమోదుపాకిస్తాన్లో పుట్టి అమెరికా పౌరసత్వాన్ని కలిగి ఉన్న హేడ్లీతోపాటు కెనడాకు చెందిన తహవ్వుర్ హుస్సేన్ రాణాలిద్దరికీ 26/11 ముంబయి దాడులలో హస్తమున్నట్లు తేలింది. అంతేకాదు భవిష్యత్తులో భారత్‌లోని ప్రధాన నగరాల్లో దాడులకు పథకరచన చేసినట్లు వెల్లడైంది. దీంతో నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజన్సీ గురువారం ఇరువురిపై కేసు నమోదు చేసింది.Source: జాతీయ | 12 Nov 2009 | 8:41 am శ్రియ అంటే ఎవరు?: టబు ప్రశ్నఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి టబు, శ్రియలు హాజరయ్యారు. టబును పలువురు సినీ ప్రముఖులు పలకరిస్తోన్న సమయంలో శ్రియ కూడా వెళ్లి ఆమెను పలుకరించడంతో టబు పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని టబు దృష్టికి తీసుకువెళితే... అసలు శ్రియ ఎవరని ఎదురు ప్రశ్నించి మరింత అవమానపరచింది టబు. అయితే శ్రియ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. టబు అంత మహానటికి తాను తెలియకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మాట్లాడింది. శ్రియ పాజిటివ్ ఆటిట్యూడ్‌కు అందరూ మెచ్చుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 8:14 am 18న నవదీప్, కాజల్‌ల "ఓం శాంతి" లోగో ఆవిష్కరణనవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బింధుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో 'వైజయంతి' హౌస్ నుంచి త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఓంశాంతి". శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కనున్న "ఓం శాంతి" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో ఆవిష్కరణ నవంబర్ 18న జరుగనుంది. అలాగే ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో నవంబర్ 27వ తేదీన విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 7:08 am ర్యాగింగ్ కేసు: ముగ్గురికి ఏడాదిపాటు జైలుశిక్షజూనియర్లపై ర్యాగింగ్‌కు పాల్పడిన ముగ్గురు మెడికల్ విద్యార్థులకు న్యాయస్థానం ఏడాది జైలుశిక్ష విధించింది. 2007 సంవత్సరంలో సిద్ధార్థ మెడికల్ కళాశాలలో జూనియర్లపై ర్యాగింగ్ చేసిన వెంకటాచలపతి, రాంప్రసాద్, సురేష్‌లకు స్థానిక కోర్టు ఏడాదిపాటు జైలుశిక్ష విధిస్తూ ఆదేశాలు జారిచేసింది. ఏడాది జైలుతో పాటు తలో వెయ్యి రూపాయల జరిమాను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 6:48 am నందమూరి తారకరత్న.. విలన్!!గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఓ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమరావతి అనే పేరును నిర్ణయించారు. హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి తెలియదేశారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా చిత్రాలను తీసే రవిబాబు కథ చెప్పగానే ఆనంద్ ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రేమ, యాక్షన్ అంశాలున్నా అవి కథాగమనంలో ఆసక్తికరంగా సాగుతాయన్నారు. మెడికో విద్యార్థులు ఓ పరిశోధన నిమిత్తం తలకోన అటవీ ప్రాంతాలలోకి వెళితే... అక్కడ జరిగే సంఘటలేమిటనేదే ఈ చిత్రమని సమాచారం. ఇందులో విశేషమేమిటంటే... హీరోగా 9 చిత్రాలను ఏక కాలంలో ప్రారంభించి సక్సెస్ కొట్టలేకపోయిన నందమూరి తారకరత్న విలన్‌గా నటించడం. ఇకపై తను విలనీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని ఈ చిత్రం ద్వారా చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 6:35 am సీఎం రోశయ్య అనర్హత కేసు: 17వతేదీకి వాయిదారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి కె. రోశయ్య అనర్హులని దాఖలైన పిటిషన్‌పై విచారణను రాష్ట్ర హైకోర్టు వాయిదా వేసింది. సీఎం పదవిలో రోశయ్య కొనసాగడంపై కోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వాజ్యం విచారణకు వచ్చింది. పిటిషనర్ తరపు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసును ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ ఆదేశాలు జారీ చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 6:35 am సత్యకృష్ణన్ కోసం "మెంటల్ కృష్ణ" తంటాలుపెక్యులర్ గాత్రంతో ఆనంద్ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన సత్యకృష్ణన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో వదిన, అక్క పాత్రలను పోషించింది. హీరోయిన్‌గా నటించాలనే ఆమెకున్న కోరికను పసిగట్టిన కృష్ణమురళి ఆమెను మెంటల్ కృష్ణ చిత్రం ద్వారా హీరోయిన్‌ను చేశాడు. ఆ చిత్రంలో ఆమె కాళ్ల నుంచి పై వరకూ వర్ణించి ఒక రకంగా మేలు చేయబోయి చెడు చేశాడన్న అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ఆ చిత్రం తర్వాత సత్యకృష్ణన్‌కు అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె బాధ్యతను పోసాని నెత్తినేసుకున్నట్లు తెలిసింది. ఇండస్ట్రీలో అందరిపైనా విమర్శలు గుప్పించి ఆవేశంగా మాట్లాడే పోసాని ఈ మధ్య చాలా కామ్‌గా కూల్‌గా ఉంటున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నాక ఆవేశం తగ్గించుకున్నాడని మొదట్లో అనుకున్నా... కారణం అది కాదనీ, సత్యకృష్ణన్‌తో పోసాని కలిసి ఉండటం వల్లే ఈ కూల్‌నెస్ వచ్చిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 4:32 am గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన "చంద్రబాబు"గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచార శంఖారావాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం పూరించారు. గ్రేటర్ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన చంద్రబాబు అనంతరం కుత్బుల్లాపూర్ డివిజన్ నుంచి చంద్రబాబు పచ్చజెండా ఊపుతూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తూ చంద్రబాబు మాట్లాడారు. హైదరాబాద్‌లో ఎవరి హయాంలో నిజంగా అభివృద్ధి జరిగిందో గుర్తించి ఓటర్లు ఓటు వేయాలని కోరారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 4:29 am నక్సలైట్లు రాజకీయ రంగప్రవేశం చేయడం సంతోషం: మమతపశ్చిమ బెంగాల్‌లో కొందరు నక్సలైట్లు హింసను విడనాడి రాజకీయాల్లోకి రావడంతో ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చే పరిణామమని ఆమె కొనియాడారు.Source: జాతీయ | 12 Nov 2009 | 4:06 am భారత్‌కు రానున్న ఎఫ్‌బీఐ బృందంలష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఉగ్రవాది డేవిడ్ కోల్‌మెన్ హెడ్లీని ఇటీవల ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అతనికున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేసేందుకుగాను ఈ బృందం భారతదేశానికి వస్తున్నట్లు సమాచారం.Source: జాతీయ | 12 Nov 2009 | 3:06 am శ్రియ అంటే ఎవరు?: టబు ప్రశ్నఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి టబు, శ్రియలు హాజరయ్యారు. టబును పలువురు సినీ ప్రముఖులు పలకరిస్తోన్న సమయంలో శ్రియ కూడా వెళ్లి ఆమెను పలుకరించడంతో టబు పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని టబు దృష్టికి తీసుకువెళితే... అసలు శ్రియ ఎవరని ఎదురు ప్రశ్నించి మరింత అవమానపరచింది టబు. అయితే శ్రియ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. టబు అంత మహానటికి...Source: వినోదం | 12 Nov 2009 | 2:47 am గుంటూరు గురజాలలో సోలార్ సిటీ: మంత్రి కన్నాగుంటూరు జిల్లా గురజాలలో నాలుగువేల ఎకరాల్లో సోలార్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటించారు. అలాగే 2010 జూన్ నాటికి విజయవాడకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులోకి వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 2:25 am కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి: చంద్రబాబు పిలుపుగ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 1:50 am
|