|
స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న నష్టాలుస్టాక్ మార్కెట్లో నష్టాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 125 పాయింట్లు కోల్పోయి 16,724 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 42 పాయింట్లు నష్టపోయి 4,962 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.74 శాతం, నిఫ్టీ 0.84 శాతం మేరకు క్షీణించాయిSource: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 8:37 am శ్రియ అంటే ఎవరు?: టబు ప్రశ్నఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి టబు, శ్రియలు హాజరయ్యారు. టబును పలువురు సినీ ప్రముఖులు పలకరిస్తోన్న సమయంలో శ్రియ కూడా వెళ్లి ఆమెను పలుకరించడంతో టబు పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని టబు దృష్టికి తీసుకువెళితే... అసలు శ్రియ ఎవరని ఎదురు ప్రశ్నించి మరింత అవమానపరచింది టబు. అయితే శ్రియ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. టబు అంత మహానటికి తాను తెలియకపోవడం పెద్ద విషయమేమీ కాదన్నట్లుగా మాట్లాడింది. శ్రియ పాజిటివ్ ఆటిట్యూడ్‌కు అందరూ మెచ్చుకున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 8:14 am గుంటూరు గురజాలలో సోలార్ సిటీ: మంత్రి కన్నాగుంటూరు జిల్లా గురజాలలో నాలుగువేల ఎకరాల్లో సోలార్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటించారు. అలాగే 2010 జూన్ నాటికి విజయవాడకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులోకి వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 7:54 am 35 కోట్లకు చేరిన జీఎస్ఎమ్ వినియోగదారులుప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికంలోని అక్టోబర్ నెలలో జీఎస్ఎమ్ టెలిఫోన్ వినియోగదారులు ఒక కోటి ఇరవై లక్షలమంది నమోదయ్యారు. దీంతో దేశంలో జీఎస్ఎమ్ టెలిఫోన్ మొబైళ్ళు వాడేవారి సంఖ్య 35 కోట్ల 52 లక్షల 50 వేలకు చేరుకుందని సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ) తెలిపింది.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 7:44 am మళ్లీ నష్టాల బాటలోకి స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల బాటలోకి ప్రవేశించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 72 పాయింట్లు కోల్పోయి 16,778 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు బలహీనపడి 4,980 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.43 శాతం, నిఫ్టీ 0.47 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 7:35 am కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి: చంద్రబాబు పిలుపుగ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 7:20 am భారత్‌కు రానున్న ఎఫ్‌బీఐ బృందంలష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఉగ్రవాది డేవిడ్ కోల్‌మెన్ హెడ్లీని ఇటీవల ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అతనికున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేసేందుకుగాను ఈ బృందం భారతదేశానికి వస్తున్నట్లు సమాచారం.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 7:09 am 18న నవదీప్, కాజల్‌ల "ఓం శాంతి" లోగో ఆవిష్కరణనవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, బింధుమాధవి, అదితి శర్మ ప్రధాన పాత్రల్లో 'వైజయంతి' హౌస్ నుంచి త్రీ ఏంజిల్స్ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం "ఓంశాంతి". శేషు ప్రియాంక చలసాని నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రకాష్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విభిన్న కథా చిత్రంగా తెరకెక్కనున్న "ఓం శాంతి" నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో ఆవిష్కరణ నవంబర్ 18న జరుగనుంది. అలాగే ఇళయరాజా సంగీత సారథ్యంలో రూపొందిన ఆడియో నవంబర్ 27వ తేదీన విడుదల కానుంది.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 7:08 am ఐఐపీ సంఖ్యలు: మార్కెట్లు రికవరీపారిశ్రామిక ఉత్పత్తి సంఖ్యలు స్టాక్ మార్కెట్ రికవరీకి దోహదం చేశాయి. కానీ, సెన్సెక్స్ ఇంకా రెడ్ మార్కులోనే పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 94 పాయింట్లు కోల్పోయి 16,756 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 4,978 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 6:37 am నందమూరి తారకరత్న.. విలన్!!గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఓ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమరావతి అనే పేరును నిర్ణయించారు. హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి తెలియదేశారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా చిత్రాలను తీసే రవిబాబు కథ చెప్పగానే ఆనంద్ ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రేమ, యాక్షన్ అంశాలున్నా అవి కథాగమనంలో ఆసక్తికరంగా సాగుతాయన్నారు. మెడికో విద్యార్థులు ఓ పరిశోధన నిమిత్తం తలకోన అటవీ ప్రాంతాలలోకి వెళితే... అక్కడ జరిగే సంఘటలేమిటనేదే ఈ చిత్రమని సమాచారం. ఇందులో విశేషమేమిటంటే... హీరోగా 9 చిత్రాలను ఏక కాలంలో ప్రారంభించి సక్సెస్ కొట్టలేకపోయిన నందమూరి తారకరత్న విలన్‌గా నటించడం. ఇకపై తను విలనీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని ఈ చిత్రం ద్వారా చెపుతున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 6:35 am లంచం తీసుకున్న జర్దారీ: లిబరల్ పత్రికపాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ 1994లో ఫ్రాన్స్ నుంచి మూడు జలాంతర్గాములను కొనే సందర్భంలో కొన్ని లక్షల డాలర్లు లంచంగా తీసుకున్నారని ఫ్రాన్స్‌కు చెందిన లిబరల్ దినపత్రిక పేర్కొంది.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 6:20 am టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్‌దే..!: తలసానిడబ్బులకు టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని తెలుగుదేసం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాతే మేయర్ అభ్యర్థి ఎంపిక జరుగుతుందని తలసాని అన్నారు. గురువారం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. మేయర్ పదవిపై అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 6:01 am అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లుఅమెరికా స్టాక్ మార్కెట్లు... డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 44 పాయింట్లు పుంజుకుని 10,291 వద్దకు చేరుకుంది. స్టాండార్డ్ అండ్ పూర్స్ 500 ఇండెక్స్- ఆరు పాయింట్లు లాభపడి 1,099 వద్దకు చేరుకుంది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 16 పాయింట్లు బలపడి 2,167 వద్దకు చేరుకుంది. ఆసియా స్టాక్ మార్కెట్లు... హాంగ్ సెంగ్- 111 పాయింట్లు కోల్పోయి 22,516 వద్దకు చేరుకుంది. నిక్కీ- 68 పాయింట్లు నష్టపోయి 9,803 వద్దకు చేరుకుంది. షాంఘై కంపోజిట్- 15 పాయింట్లు బలహీనపడి 9,191 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్- 1,588 వద్ద స్థిరంగా పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 12 Nov 2009 | 5:43 am సత్యకృష్ణన్ కోసం "మెంటల్ కృష్ణ" తంటాలుపెక్యులర్ గాత్రంతో ఆనంద్ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన సత్యకృష్ణన్ ఆ తర్వాత పలు చిత్రాల్లో వదిన, అక్క పాత్రలను పోషించింది. హీరోయిన్‌గా నటించాలనే ఆమెకున్న కోరికను పసిగట్టిన కృష్ణమురళి ఆమెను మెంటల్ కృష్ణ చిత్రం ద్వారా హీరోయిన్‌ను చేశాడు. ఆ చిత్రంలో ఆమె కాళ్ల నుంచి పై వరకూ వర్ణించి ఒక రకంగా మేలు చేయబోయి చెడు చేశాడన్న అపకీర్తిని మూటగట్టుకున్నాడు. ఆ చిత్రం తర్వాత సత్యకృష్ణన్‌కు అవకాశాలు పెద్దగా రాలేదు. దీంతో ఆమె బాధ్యతను పోసాని నెత్తినేసుకున్నట్లు తెలిసింది. ఇండస్ట్రీలో అందరిపైనా విమర్శలు గుప్పించి ఆవేశంగా మాట్లాడే పోసాని ఈ మధ్య చాలా కామ్‌గా కూల్‌గా ఉంటున్నాడు. ప్రజారాజ్యం పార్టీ తీర్థం పుచ్చుకున్నాక ఆవేశం తగ్గించుకున్నాడని మొదట్లో అనుకున్నా... కారణం అది కాదనీ, సత్యకృష్ణన్‌తో పోసాని కలిసి ఉండటం వల్లే ఈ కూల్‌నెస్ వచ్చిందని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 12 Nov 2009 | 4:32 am భారత్‌కు రానున్న ఎఫ్‌బీఐ బృందంలష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఉగ్రవాది డేవిడ్ కోల్‌మెన్ హెడ్లీని ఇటీవల ఎఫ్‌బీఐ అదుపులోకి తీసుకున్న విషయం విదితమే. అతనికున్న నెట్‌వర్క్‌పై దర్యాప్తు చేసేందుకుగాను ఈ బృందం భారతదేశానికి వస్తున్నట్లు సమాచారం.Source: జాతీయ | 12 Nov 2009 | 3:06 am శ్రియ అంటే ఎవరు?: టబు ప్రశ్నఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి టబు, శ్రియలు హాజరయ్యారు. టబును పలువురు సినీ ప్రముఖులు పలకరిస్తోన్న సమయంలో శ్రియ కూడా వెళ్లి ఆమెను పలుకరించడంతో టబు పట్టించుకోకుండా వెళ్లిపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని టబు దృష్టికి తీసుకువెళితే... అసలు శ్రియ ఎవరని ఎదురు ప్రశ్నించి మరింత అవమానపరచింది టబు. అయితే శ్రియ ఈ విషయంపై పెద్దగా స్పందించలేదు. టబు అంత మహానటికి...Source: వినోదం | 12 Nov 2009 | 2:47 am గుంటూరు గురజాలలో సోలార్ సిటీ: మంత్రి కన్నాగుంటూరు జిల్లా గురజాలలో నాలుగువేల ఎకరాల్లో సోలార్ సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు భారీ పరిశ్రమల శాఖా మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ ప్రకటించారు. అలాగే 2010 జూన్ నాటికి విజయవాడకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. పైప్‌లైన్ గ్యాస్ అందుబాటులోకి వస్తే రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 2:25 am కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించాలి: చంద్రబాబు పిలుపుగ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ప్రజలకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ పార్టీని ఓడించే సత్తా ఒక్క తెలుగుదేశం పార్టీకే ఉందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 1:50 am నందమూరి తారకరత్న.. విలన్!!గతంలో శౌర్యం చిత్రాన్ని నిర్మించిన ఆనందప్రసాద్ తాజాగా ఓ హార్రర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవిబాబు దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రంలో భూమికా చావ్లా, స్నేహ ఇద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ చిత్రానికి అమరావతి అనే పేరును నిర్ణయించారు. హారర్, సస్పెన్స్ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోందని ఎగ్జిక్యూటివ్ నిర్మాత రవి తెలియదేశారు. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్‌కు భిన్నంగా చిత్రాలను తీసే రవిబాబు కథ చెప్పగానే ఆనంద్ ప్రసాద్ ముందుకు వచ్చారు. ప్రేమ, యాక్షన్ అంశాలున్నా అవి కథాగమనంలో ఆసక్తికరంగా సాగుతాయన్నారు. మెడికో విద్యార్థులు ఓ పరిశోధన నిమిత్తం తలకోన అటవీ ప్రాంతాలలోకి వెళితే... అక్కడ జరిగే సంఘటలేమిటనేదే ఈ చిత్రమని సమాచారం. ఇందులో విశేషమేమిటంటే... హీరోగా 9 చిత్రాలను ఏక కాలంలో ప్రారంభించి సక్సెస్ కొట్టలేకపోయిన నందమూరి తారకరత్న విలన్‌గా నటించడం. ఇకపై తను విలనీ పాత్రలు చేయడానికి కూడా సిద్ధమేనని ఈ చిత్రం ద్వారా చెపుతున్నారు.Source: వినోదం | 12 Nov 2009 | 1:07 am ప్రజలకు సేవ చేయడమే లక్ష్యం: విజయశాంతితెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు సోదరిగా కొన్ని రోజులుగా ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నోళ్లల్లో నానిన మెదక్ ఎంపీ విజయశాంతి కొత్తపల్లవి పాడుతున్నారు. రాజకీయాల్లోకి తనను లాగకండని, తన నియోజకవర్గ ప్రజలకు సేవచేయడమే ప్రధాన లక్ష్యమని విజయశాంతి పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 12:39 am టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్‌దే..!: తలసానిడబ్బులకు టిక్కెట్లు అమ్ముకునే సంస్కృతి కాంగ్రెస్ పార్టీదేనని తెలుగుదేసం పార్టీ సీనియర్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల తర్వాతే మేయర్ అభ్యర్థి ఎంపిక జరుగుతుందని తలసాని అన్నారు. గురువారం తలసాని మీడియాతో మాట్లాడుతూ.. మేయర్ పదవిపై అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు వచ్చిన వార్తలు కేవలం ఊహాగానాలేనని కొట్టిపారేశారు.Source: ఏపీ న్యూస్ | 12 Nov 2009 | 12:32 am ఇకపై రైల్వే స్టేషన్లలో ‘జన్ ఆహార్’రైళ్ళలో ప్రయాణించే ప్రయాణీకులకు తక్కువ ధరలకే ఆహార పదార్థాలు అందించాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ప్రత్యేక హోటళ్లను తెరవాలని నిర్ణయించిందిSource: జాతీయ | 12 Nov 2009 | 12:06 am 'మేడమ్' దృష్టిలో జగన్ ఉన్నారు: నేదురుమల్లిదివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వైఎస్. జగన్మోహన రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీ దృష్టిలో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అన్నారు. జగన్‌ను ఎలా ఉపయోగించుకోవాలో, ఎప్పుడు రాజకీయాల్లోకి తీసుకురావాలో మేడమ్‌కు బాగా తెలుసునని నేదురుమల్లి పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 11:14 pm వీరప్ప మొయిలీ గ్రేటర్ ఎన్నికల ప్రచారం రద్దు!గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారానికి పార్టీలన్ని సిద్ధమవుతోన్న నేపథ్యంలో.. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనటం లేదని తెలిసింది. దీంతో మొయిలీ హైదరాబాద్ పర్యటన రద్దైనట్లు పార్టీశ్రేణులు వెల్లడించాయి. మరోవైపు.. గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని మంత్రులకు పీసీసీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ వ్యక్తిగతంగా లేఖలు రాసినట్లు సమాచారం.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 10:38 pm అనుకున్నట్టుగానే తీరం దాటిన ఫయాన్ముంబై సమీపంలో ఫయాన్ తుఫాన్ తీరాన్ని దాటింది. దీంతో తుఫాను బలహీనపడి వాయుగుండంగా మారిందని, ప్రస్తుతం ఇది దక్షిణ గుజరాత్-ఉత్తర మహారాష్ట్ర సరిహద్దు భూభాగంపై ఉందని వాతావరణ శాఖ తెలిపింది.Source: జాతీయ | 11 Nov 2009 | 10:28 pm కేసీఆర్ ప్రజలకు దూరమయ్యారు: అంబటితెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ప్రజలకు దూరమై గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితికి చేరుకున్నారని పీసీసీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఇంకా కేసీఆర్ హింసను ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తున్నారని అంబటి ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 10:26 pm ఏంట్రా! అంత డల్‌గా ఉన్నావ్?"ఏంట్రా! అంత డల్‌గా ఉన్నావ్? ఏంటి సంగతి..?" అడిగాడు సుందర్ "ఏం లేదురా సురేఖ లవ్ లెటర్ ఇచ్చిందిరా..!" చెప్పాడు బాధగా రాజేష్..Source: వినోదం | 11 Nov 2009 | 10:08 pm అమ్మా! భిక్షం పెట్టు తల్లీ..!"ఓ ఇంటి ముందు భిక్షగాడు ఇలా అడుక్కున్నాడు అమ్మా! భిక్షం పెట్టు తల్లీ..!" "ఇంట్లో వంటచేసేది అమ్మగారు...Source: వినోదం | 11 Nov 2009 | 10:07 pm అవినీతి ఆరోపణలపై ప్రత్యేక బిల్లు: మొయిలీఈ నెలలో జరుగనున్న పార్లమెంట్ సమావేశాలలో న్యాయ శాఖలో వినిపిస్తున్న అవినీతి ఆరోపణలపై కేంద్రం ఓ ప్రత్యేక బిల్లును ప్రేవేశ పెట్టనుంది.Source: జాతీయ | 11 Nov 2009 | 9:31 pm భారత్‌లో పర్యటించిన ఆస్ట్రేలియా ప్రధానిఆస్ట్రేలియా ప్రధానమంత్రి కేవిన్‌రూడ్ భారత పర్యటన నిమిత్తం బుధవారం విచ్చేశారు. తన పర్యటనలో ఆర్థిక, వ్యాపార సంబంధమైన చర్చలే కాకుండా ఆస్ట్రేలియాలో భారత విద్యార్థులపై జరుగుతున్న దాడుల గురించి ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉందని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి విష్ణుప్రకాష్ విలేకరులకు వెల్లడించారుSource: జాతీయ | 11 Nov 2009 | 9:25 pm హీరోయిన్లకోసమే కొత్త నిర్మాతలొస్తున్నారు: విఎన్ ఆదిత్యసుప్రీం మ్యూజిక్ అధినేత రాజు హిర్వాణి నిర్మాతగా ముంబయి తార విమలా రామన్, తరుణ్ నటిస్తోన్న చుక్కలాంటి అమ్మాయి... చక్కనైన అబ్బాయి చిత్రానికి ఇప్పటి వరకూ ముగ్గురు దర్శకులు మారారు. ఎందుకని ఆరా తీస్తే... దాని వెనుక ఎన్నో లుకలుకలు ఉన్నాయని సమాచారం. చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న గోగినేని శ్రీను ఆ మధ్య చిత్ర షూటింగ్‌ను బ్యాంకాక్‌లో చేపట్టమని రెండో దర్శకుడు విఎన్ ఆదిత్యకు పురమాయించాడట. అనుకున్నట్లుగానే ఆదిత్య చిత్రం షూటింగ్ చేస్తున్నాడట. షూటింగ్ జరుగుతున్న సమయంలో హీరోయిన్ విమలా రామన్ చెప్పా పెట్టకుండా ముంబయి చెక్కేసిందట. కారణం ఏమిటి చెప్మా... అని ఆమెను కదిలిస్తే... గొల్లుమందట. తనను ఎగ్జిక్యూటివ్ నిర్మాత శ్రీను మానసికంగా వేధిస్తున్నాడనీ, అందుకే వచ్చేశానని వాపోయిందట. ఈ సంగతి ఇలా ఉంటే సదరు చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విఎన్ ఆదిత్యను కూడా శ్రీను "అన్ఫిట్" అనేశాడట. దీనికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2009 | 11:15 am రోశయ్యకు ముందుంది ముసళ్ళ పండుగ: నాగంముఖ్యమంత్రి రోశయ్యకు మున్ముందు కష్టాలు తప్పవని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప గతే రోశయ్యకు పడుతుందని నాగం జోస్యం చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 9:49 am హమ్మయ్య...ఫైయాన్ తుఫాన్ ముప్పు తప్పినట్లే...ఫైయాన్ తుఫాన్ బలహీనపడి తీరప్రాంతాన్ని దాటడంతో మహరాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలకు ప్రకటించిన హెచ్చరికలను వాతావరణ శాఖ ఉపసంహరించుకుంది. గురువారం తెల్లవారే సరికి ఫైయాన్ మరింతగా బలహీనపడి అల్పపీడనంగా మారుతుందని అధికారులు ప్రకటించారు.Source: జాతీయ | 11 Nov 2009 | 8:23 am అరేబియా సముద్రంలో 80 బోట్లు గల్లంతుముంబయి మహానగరాన్ని అతలాకుతలం చేసిన ప్యాన్ తుఫాన్ తీరం దాటినా దాని ప్రభావంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లిన 80 పడవలు గల్లంతైనట్లు అధికారులు వెల్లడించారు. ఒక్కో పడవలో కనీసం 10 మంది చొప్పున మొత్తం 800 మంది దాకా గల్లంతై ఉండవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.Source: జాతీయ | 11 Nov 2009 | 7:08 am ముఖ్యమంత్రి పదవిపై జగన్ ఆశ... సీనియర్ల స్పందనముఖ్యమంత్రి కావడానికి సరిపడ వయస్సు నాకింకా రాలేదు. నేను ముఖ్యమంత్రిని అయ్యేందుకు నన్నెవరూ ఆపలేరు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యే తీరుతాను....మాజీ మంత్రి జేసీ. దివాకర్ రెడ్డి మాట్లాడుతూ...జగన్ ముఖ్యమంత్రి కావాలనుకోవడం కాలమే నిర్ణయిస్తుంది. ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా జగన్ పనిచేసుకోవడం మంచిదేనని ఆయన తన సలహాగా సూచించారు.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 7:05 am రాబోయే రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రిని: వైఎస్ జగన్ముఖ్యమంత్రినయ్యే వయ్యస్సు నాకింకా రాలేదు. నేను ముఖ్యమంత్రినయ్యేందుకు నన్నెవరూ ఆపలేరు. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని అయ్యే తీరుతాను. సోనియాగాంధీ అన్యాయం చేయరు. ఈ రోజో, ఈ ఏడాదో లేకపోతే మరి కొంత కాలంలో నేను మీ చిన్న తమ్ముడిగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించి మీ ముందుకు వస్తానంటూ కడప ఎంపి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం కడపలో వ్యాఖ్యానించారు.Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 5:55 am సస్పెన్స్ థ్రిల్లర్‌గా "గద్దె సింధూర" కొత్త చిత్రంయాదగిరిరాజు సమర్పణలో శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై 'గద్దె సింధూర' ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. నగేష్ దర్శకత్వంలో నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం.. ఇటీవలే తలకోనలో తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2009 | 4:20 am 90 శాతం పూర్తయిన "ఇష్టపడితే (ప్రేమేనా?)"సుభాయ్‌రాయల్, ఫరాఖాన్, అమృతవల్లి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఇష్టపడితే (ప్రేమేనా?)". ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వరలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2009 | 4:18 am అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: లాలూవచ్చే యేడాది జరుగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోబోమని ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. శివన్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు.Source: జాతీయ | 11 Nov 2009 | 3:06 am
|