రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే తెదేపా ధ్యేయం: జేపీ

రాష్ట్రాన్ని ముక్కులు చేయడమే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా ఉందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన బుధవారం ప్రమాణం చేయించారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 8:23 am

356 పాయింట్లు లాభపడ్డ స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 356 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,797 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 107 పాయింట్లు లాభపడి 4,989 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.17 శాతం, నిఫ్టీ 2.19 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 8:12 am

ప్రజల మనోభావాలను తెలిపేందుకే రాజీనామా: సురేఖ

ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్ర ప్రజల మనోభావాలను, అభీష్టాన్ని అధిష్టానానికి తెలియజేసేందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖామంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బుధవారం ఆమె తొలిసారి వరంగల్ జిల్లాకు వచ్చారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 8:06 am

లండన్‌లో భారతీయ విద్యార్థులపై దాడి

లండన్‌లో భారతీయ విద్యార్థులపై లండన్ వాసులు దాడులకు పాల్పడ్డారు. లండన్‌లోని సిటీ విశ్వవిద్యాలయంలో చదువుతున్న ఆరుగురు విద్యార్థులపై ఆ దేశానికి చెందిన దుండుగులు దాడులకు పాల్పడ్డారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 8:04 am

కేసీఆర్‌కు - హైదరాబాద్‌కు ఏం సంబంధం: తలసాని

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఏమిటి సంబంధం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 7:59 am

గ్రేటర్‌లోనూ సామాజిక న్యాయం పాటించాం: చిరంజీవి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తున్న 64 మంది అభ్యర్థుల్లో 40 మంది సామాజిక వర్గాలకు చెందిన వారేనని ఆయన వివరించారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 7:29 am

రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడింది: చిరంజీవి జోస్యం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని, అందుకే తమ పార్టీని విలీనం చేయాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న 64 మంది అభ్యర్థులతో ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 7:15 am

ముంబైలో భారీ వర్ష సూచన: అప్రమత్తమైన అధికారులు

ముంబై మరియు ఇతర ప్రాంతాల్లో తుఫాను సూచనలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఏర్పడిందని.. ఇది భారత్ వైపు దూసుకొస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు వాతావరణ శాఖ 'ఫయాన్' అనే పేరును నామకరణం చేసింది.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 7:05 am

యూకే సంస్థ నుంచి భారీ ఆర్డరు పొందిన భెల్

యూకేకు చెందిన పవర్ ఇంజనీర్స్ కాంట్రాక్టింగ్ కంపెనీకి గ్యాస్ టర్బైన్ జెనరేట్ చేసే యూనిట్లు సప్లై చేసేందుకుగాను భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ సంస్థ రూ. 91 కోట్ల ఆర్డర్‌ను పొందినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 7:04 am

అమెరికాలోని ఆరోగ్యకేంద్రంపై కాల్పులు: ఇద్దరి మృతి

అమెరికాలోని ఆరేగన్ ప్రాంతంలోని ఓ ఆరోగ్య కేంద్రంపై మంగళవారం ఓ అజ్ఞాత వ్యక్తి తుపాకీ ధరించి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో ఓ మహిళను చంపి అతను కూడా స్వయంగా కాల్చుకున్నాడు.
Source: Yahoo! Telugu: News | 11 Nov 2009 | 6:32 am

సస్పెన్స్ థ్రిల్లర్‌గా "గద్దె సింధూర" కొత్త చిత్రం

యాదగిరిరాజు సమర్పణలో శ్రీనివాస క్రియేషన్స్ పతాకంపై 'గద్దె సింధూర' ప్రధాన పాత్రలో రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. నగేష్ దర్శకత్వంలో నూతన నిర్మాత కిరణ్ నిర్మిస్తోన్న ప్రొడక్షన్ నెం.1 చిత్రం.. ఇటీవలే తలకోనలో తొలిషెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2009 | 4:20 am

90 శాతం పూర్తయిన "ఇష్టపడితే (ప్రేమేనా?)"

సుభాయ్‌రాయల్, ఫరాఖాన్, అమృతవల్లి హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "ఇష్టపడితే (ప్రేమేనా?)". ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమా వరలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 11 Nov 2009 | 4:18 am

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదు: లాలూ

వచ్చే యేడాది జరుగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపెట్టుకోబోమని ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ స్పష్టం చేశారు. శివన్ జిల్లాల్లో ఆయన పర్యటిస్తున్నారు.
Source: జాతీయ | 11 Nov 2009 | 3:06 am

రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే తెదేపా ధ్యేయం: జేపీ

రాష్ట్రాన్ని ముక్కులు చేయడమే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ధ్యేయంగా ఉందని లోక్‌సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో లోక్‌సత్తా పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులతో ఆయన బుధవారం ప్రమాణం చేయించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 2:54 am

ప్రజల మనోభావాలను తెలిపేందుకే రాజీనామా: సురేఖ

ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్ర ప్రజల మనోభావాలను, అభీష్టాన్ని అధిష్టానానికి తెలియజేసేందుకే తాను మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖామంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత బుధవారం ఆమె తొలిసారి వరంగల్ జిల్లాకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 2:37 am

కేసీఆర్‌కు - హైదరాబాద్‌కు ఏం సంబంధం: తలసాని

తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావుకు, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు ఏమిటి సంబంధం అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 2:29 am

గ్రేటర్‌లోనూ సామాజిక న్యాయం పాటించాం: చిరంజీవి

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ తమ పార్టీ సామాజిక న్యాయానికి పెద్దపీట వేసిందని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తున్న 64 మంది అభ్యర్థుల్లో 40 మంది సామాజిక వర్గాలకు చెందిన వారేనని ఆయన వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 2:00 am

రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడింది: చిరంజీవి జోస్యం

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలహీన పడిందని, అందుకే తమ పార్టీని విలీనం చేయాలని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేస్తున్న 64 మంది అభ్యర్థులతో ఆయన బుధవారం పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 1:46 am

ముంబైలో భారీ వర్ష సూచన: అప్రమత్తమైన అధికారులు

ముంబై మరియు ఇతర ప్రాంతాల్లో తుఫాను సూచనలున్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఏర్పడిందని.. ఇది భారత్ వైపు దూసుకొస్తున్నట్లు ఆ శాఖ తెలిపింది. ఈ తుఫానుకు వాతావరణ శాఖ 'ఫయాన్' అనే పేరును నామకరణం చేసింది.
Source: జాతీయ | 11 Nov 2009 | 1:35 am

డాక్టర్ల సమ్మె ఉధృతం: ఎమర్జెన్సీ సేవలూ కట్

రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె నేటితో మూడో రోజుకు చేరుకుంది. ఉపకార వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు ఈ సమ్మెను చేపట్టిన విషయం తెలిసిందే. తమ డిమాండ్లను ఒప్పుకునే దాకా సమ్మెను మరింత ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. సోమవారం నుంచి ప్రారంభమైన ఈ సమ్మెతో డాక్టర్లు విధులను బహిష్కరించారు.
Source: ఏపీ న్యూస్ | 11 Nov 2009 | 12:53 am

ఆజ్మీకి కాదు.. సభకు క్షమాపణలు చెపుతాం: ఎంఎన్ఎస్

మహారాష్ట్రలో కొత్త అసెంబ్లీ కొలువుదీరిన తొలిరోజునే వీరంగం సృష్టించిన మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) సభ్యులు ఎట్టకేలకు దిగివస్తున్నారు. తాము ప్రవర్తించిన తీరుకు సభకు క్షమాపణలు చెప్పేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు.
Source: జాతీయ | 11 Nov 2009 | 12:30 am

మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌గా ఎన్సీపీ నేత దిలీప్ పాటిల్

మహారాష్ట్ర 12వ అసెంబ్లీ సభాపతిగా నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత దిలీప్ వాల్సే పాటిల్‌ ఎన్నిక కానున్నారు. ఈయన ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం.
Source: జాతీయ | 11 Nov 2009 | 12:14 am

రోశయ్యకు ముందుంది మొసళ్ళ పండుగ: నాగం

ముఖ్యమంత్రి రోశయ్యకు మున్ముందు కష్టాలు తప్పవని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నాగం జనార్ధన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప గతే రోశయ్యకు పడుతుందని నాగం జోస్యం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2009 | 11:43 pm

ఏడు రాష్ట్రాల ఉప ఎన్నికలు: తృణమూల్-బీఎస్పీ హవా

దేశ వ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లో జరిగిన 31 అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్, బహుజన సమాజ్‌ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు తమ హవాను కొనసాగించాయి. ఉప ఎన్నిక జరిగిన లోక్‌సభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
Source: జాతీయ | 10 Nov 2009 | 11:15 pm

ఇక.. దృష్టంతా అభివృద్ధిపైనే: వైఎస్.జగన్మోహన్ రెడ్డి

ఇకపై తన దృష్టంతా రాష్ట్ర అభివృద్ధిపైనే కేంద్రీకరిస్తానని కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అలాగే.. కడప జిల్లా అభివృద్ధికి తన తండ్రి చేపట్టిన వివిధ పథకాల కూడా మందగమనంతో సాగుతున్నాయని వీటిని కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2009 | 10:43 pm

రాష్ట్ర కాంగ్రెస్ రథ సారథిగా వైఎస్.జగన్మోహన్ రెడ్డి?

ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రథ సారథిగా దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డిని నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఆయన వర్గీయులు అభిప్రాయపడుతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2009 | 10:25 pm

ఎమ్మెల్యే అబూ అజ్మీపై దాడి: సుప్రీంకోర్టులో ఫిర్యాదు!

మహారాష్ట్ర అసెంబ్లీలో సమాజ్‌వాదీ పార్టీకి చెందిన శాసనసభ్యుడు అబూ ఆజ్మీపై మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఎమ్మెల్యేలు దాడి చేసిన వ్యవహారంపై సుప్రీంకోర్టులో ఒకరు ఫిర్యాదు చేశారు.
Source: జాతీయ | 10 Nov 2009 | 9:29 pm

రెండు మూడు సంవత్సరాల్లో నక్సల్స్ అణిచివేత: పీసీ

దేశంలో వచ్చే రెండు మూడు సంవత్సరాల్లో నక్సల్స్ కార్యకలాపాలను పూర్తిగా అణిచి వేస్తామని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం ధీమా వ్యక్తం చేశారు. దేశ అంతర్గత భద్రతకు హాని కలిగించే విధంగా మావోయిస్టులు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఎంతమాత్రం సహించబోమని ఆయన తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 10 Nov 2009 | 8:51 pm

పంచదార బొమ్మతో దేవదాసు డేటింగో.. డేటింగ్!!

"దేవదాసు" ఫేమ్ రామ్- "మగధీర" హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇద్దరి మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" నడుస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. గణేష్ చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ జంట ఒకే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. కాజల్ హైదరాబాదు వచ్చినపుడల్లా బాగా పొద్దుపోయే వరకూ రామ్‌తో కాలక్షేపం చేస్తోందట. గణేష్ చిత్రం షూటింగ్ సమయంలో కూడా అనేకసార్లు వీళ్లిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరిగిందనీ, ఆ షూటింగ్ సమయంలోనూ కాజల్ హోటల్‌లో కాకుండా రామ్ ఇంట్లోనే గడిపిందని విశ్వసనీయ సమాచారం. టాలీవుడ్ అంటున్నట్లు వీళ్లద్దరి మధ్య... "సమ్‌థింగ్... సమ్‌థింగ్" నిజంగా ఉందో లేదో తెలియాలంటే గణేష్-2 వచ్చేదాకా చూడాలి మరి.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 9:43 am

మాయమైన కర్కరే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్

ఏటీఎఫ్ చీఫ్ హేమంత్ కర్కరే ధరించిన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఏమైందంటూ అతని భార్య కవిత సమాచార హక్కు చట్టం ద్వారా అధికారులను ప్రశ్నించగా...కర్కరే మృతదేహాన్ని గుర్తించినప్పుడు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ కనిపించలేదని అధికారులు సమాధానమిచ్చారని ఆమె ఓ వార్తా సంస్థకిచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Source: జాతీయ | 10 Nov 2009 | 9:07 am

విద్యార్థుల మనోభావాలకు అద్దంపట్టే "9th క్లాస్ c/o ఏలేశ్వరం"

డాక్టర్. ఎ. చంద్రశేఖర్ (మాజీ మంత్రి) సమర్పణలో ఎమ్. రాజ్‌కుమార్ నిర్మాతగా ప్రణయ్, రాఖీసేన్ హీరోహీరోయిన్లుగా పి. రామకృష్ణగౌడ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం "9th క్లాస్ c/o ఏలేశ్వరం". మానస ఆర్ట్ మూవీస్ పతాకంపై తెరకెక్కనున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌లో 30 శాతం టాకీనీ పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 8:56 am

న్యూయార్క్‌లో భారతీయ చలన చిత్రోత్సవం

భారతీయ కళలు, సంస్కృతిని పెంపొందించాలనే ఉద్దేశంతో నవంబర్ 11న మహీంద్రా భారత్-అమెరికా కళాపరిషత్ ఫిల్మోత్సవ్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులు పాల్గొననున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 6:41 am

ఈనెల 15వ తేదీన "మగధీర" శతదినోత్స వేడుకలు!

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ "మగధీర" సినిమా శతదినోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీన జరుగనున్నాయి. జులై 31వ తేదీన 14 దేశాల్లో 1200 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. 223 థియేటర్లలో వంద రోజులను పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 6:36 am

"స్లమ్‌డాగ్ మిలియనీర్"ను వెంటాడుతోన్న అవార్డులు

ప్రముఖ దర్శకుడు డానీ బోయెల్ రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం "స్లమ్‌డాగ్ మిలియనీర్". ఇప్పటికే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రతిష్టాత్మక యురోపియన్ ఫిల్మ్ అవార్డ్‌కు చెందిన ఐదు కేటగిరీల్లో నామినేట్ అయింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత, ఉత్తమ కెమెరామెన్ వంటి తదితర విభాగాల్లో స్లమ్‌డాగ్ మిలియనీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జాక్వెస్ ఆడియార్డ్ సినిమా "ఎ ప్రోఫెట్" స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ఈ ఐదు కేటగిరీల్లో గట్టిపోటీనివ్వనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 5:51 am

విడుదలకు సిద్ధమైన శ్రీహరి, ఆర్యన్ రాజేష్‌ల "రోమియో"

శ్రీహరి, ఆర్యన్ రాజేష్ కలిసి నటించిన చిత్రం "రోమియో". దీనికి ఎ డిఫరెంట్ లవర్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల మూడోవారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు చెప్పినదానికంటే ఈ సినిమాను చాలా బాగా మలిచారని తెలిపారు. ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను కలుగజేసే చిత్రమిదని, ఇందులో ఓ ధనవంతుడైన వ్యక్తి పాత్రను శ్రీహరి పోషించారు. కథానాయిక అయిన శ్రీహరి చెల్లెలి ప్రేమను హీరో ఎలా పొందాడన్న విషయాన్ని తెరపై చూడాల్సిందేనని నిర్మాత వెల్లడించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని శ్రీనివాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 5:28 am

డిసెంబరులో వస్తోన్న సాయిరాంశంకర్ "వాడేకావాలి"

'బంపర్ ఆఫర్' హీరో సాయిరామ్ శంకర్ నటించిన మరో యూత్‌ఫుల్ రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్ "వాడే కావాలి". వీరేష్‌బాబు, రఘునాథ్ సోగి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి భారీ చిత్రాలు విడుదల చేసిన ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సి.ఇ.ఓ శోభారాణి మాట్లాడుతూ.. వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతోన్న ఈ చిత్రం సాయిరాంశంకర్‌కి "బంపర్ ఆఫర్" తర్వాత చాలా మంచి చిత్రమవుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక విలువలతో మలేషియాలో చక్కని లొకేషన్స్‌లో 40 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని డిసెంబర్ ప్రథమార్థంలో విడుదల కానుంది. సాయిరామ్‌శంకర్, సుహాసి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, వేణుమాధవ్, అలీ, చంద్రవాస్, కోట శంకరరావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాస్‌వర్మ, రవిప్రకాష్, పిట్ల రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 5:14 am

గనుల తవ్వకాల్లో రూ.10 వేల కోట్ల కుంభకోణం: బాబు

ఓబుళాపురం ఖనిజ గనుల తవ్వకాల్లో పది వేల కోట్ల రూపాయల మేరకు అవినీతి చోటు చేసుకుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాష్ట్రంలో దర్జాగా సాగుతున్న మైనింగ్ మాఫియాకు అడ్డుకట్ట వేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2009 | 5:04 am

ఉప ఎన్నికలు ఫలితాలు: చిత్తుగా ఓడిన లెఫ్ట్ కూటమి

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరిగిన పది అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికల్లో అధికార లెఫ్ట్ ఫ్రంట్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మొత్తం పది స్థానాలకు గాను కాంగ్రెస్- తృణమూల్ కాంగ్రెస్ కూటమి ఐదు స్థానాల్లో విజయబావుటా ఎగురవేసింది.
Source: జాతీయ | 10 Nov 2009 | 4:43 am

నవంబరులో రానున్న "మన్మధులు"

యువనిర్మాత వి. సురేష్ చౌదరి నిర్మించి తమిళంలో విజయవంతమైన "కాదల్ కదై" చిత్రాన్ని 'మన్మధులు' పేరిట తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూర్యపవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై సూర్యడీజిల్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. అంతా కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న 'మన్మధులు' చిత్రం గురించి నిర్మాత వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. ఒక కొత్త పాయింట్‌తో వచ్చిన ప్రేమకథా చిత్రమిదన్నారు. దీన్ని దర్శకుడు వేలురాజా ఎంతో శ్రమించి అన్ని తరగతుల వారికి నచ్చేలా అన్ని అంశాల్ని మేళవించి తీర్చిదిద్దారని చెప్పారు. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 4:33 am

పంచదార బొమ్మతో దేవదాసు డేటింగో.. డేటింగ్!!

"దేవదాసు" ఫేమ్ రామ్- "మగధీర" హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇద్దరి మధ్య "సమ్‌థింగ్.. సమ్‌థింగ్" నడుస్తోందని టాలీవుడ్ కోడై కూస్తోంది. గణేష్ చిత్రం ద్వారా పాపులర్ అయిన ఈ జంట ఒకే ఫ్లాట్‌లో నివాసముంటున్నారు. కాజల్ హైదరాబాదు వచ్చినపుడల్లా బాగా పొద్దుపోయే వరకూ రామ్‌తో కాలక్షేపం చేస్తోందట. గణేష్ చిత్రం షూటింగ్ సమయంలో కూడా అనేకసార్లు వీళ్లిద్దరూ కలిసి పార్టీలకు వెళ్లడం జరిగిందనీ, ఆ షూటింగ్ సమయంలోనూ..
Source: వినోదం | 10 Nov 2009 | 4:19 am

ములాయం కంచుకోటలో బీఎస్సీ అభ్యర్థి విజయం

సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌కు కంచుకోటగా ఉంటూ వచ్చిన భర్థానా అసెంబ్లీ స్థానంలో బీఎస్పీ అభ్యర్థి గెలుపొందారు. ఈ స్థానం ములాయం సింగ్‌కు హోమ్‌టౌన్ లాంటింది. ఇక్కడ పోటీ చేసిన ఎస్పీ అభ్యర్థి శివ ప్రసాద్ యాదవ్‌ను బీఎస్పీ అభ్యర్థి చిత్తుగా ఓడించారు.
Source: జాతీయ | 10 Nov 2009 | 4:10 am

న్యూయార్క్‌లో భారతీయ చలన చిత్రోత్సవం

భారతీయ కళలు, సంస్కృతిని పెంపొందించాలనే ఉద్దేశంతో నవంబర్ 11న మహీంద్రా భారత్-అమెరికా కళాపరిషత్ ఫిల్మోత్సవ్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులు పాల్గొననున్నారు.
Source: వినోదం | 10 Nov 2009 | 3:29 am