రికవరీ నుంచి తిరిగి నష్టాల్లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ రికవరీ నుంచి తిరిగి నష్టాల్లోకి జారుకుంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 77 పాయింట్లు కోల్పోయి 16,422 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 4,873 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.46 శాతం, నిఫ్టీ 0.51 శాతం మేరకు క్షిణించాయి.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 8:44 am

తమిళనాడులో భారీ వర్షాలు: 71 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుసున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 8:42 am

లాడెన్ బ్రతికే ఉన్నాడు: ఆఫ్గన్ వార్‌లార్డ్

ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అల్‌ఖైదా తీవ్రవాది ఒసామా బిన్ లాడెన్ ఇంకా బ్రతికే ఉన్నాడని ఆఫ్గన్ వార్‌లార్డ్, హిజ్బ్-ఏ-ఇస్లామి చీఫ్ గుల్‌‌బుదిన్ హెక్‌మత్యార్ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 8:40 am

ఈనెల 12 నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి దానం నాంగేందర్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 7:58 am

ప్రోత్సాహక ప్యాకేజీలుంటాయి: ఆనంద్ శర్మ

దేశంలోని ఉత్పత్తుల ఎగుమతులకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహక ప్యాకేజీలు ఇస్తుందని కేంద్ర వాణిజ్య శాఖామంత్రి ఆనంద్ శర్మ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 7:56 am

ఉప ఎన్నికలు: కమ్యూనిస్టుల ఎర్రకోటలో కాంగ్రెస్ పాగా!

కమ్యూనిస్టులు పాలనలో ఉన్న కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 7:38 am

ఆఫ్గన్-పాక్‌పై రేపు చర్చించనున్న ఒబామా

ఆఫ్గనిస్థాన్-పాకిస్థాన్ దేశాల గురించి నిర్ణయించుకునేందుకుగాను అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా తమ భద్రతా సిబ్బందితో బుధవారం సిచ్యుయేషన్ రూంలో చర్చలు జరపనున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 7:27 am

సెన్సెక్స్ రికవరీ: కానీ, రెడ్ మార్కులోనే పయనం

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రికవరీ దిశగా సాగుతోంది. కానీ, ఇంకా రెడ్ మార్కులోనే పయనిస్తోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్ 42 పాయింట్లు కోల్పోయి 16,457 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 12 పాయింట్లన నష్టపోయి 4,886 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.25 శాతం, నిఫ్టీ 0.24 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 7:26 am

న్యూయార్క్‌లో భారతీయ చలన చిత్రోత్సవం

భారతీయ కళలు, సంస్కృతిని పెంపొందించాలనే ఉద్దేశంతో నవంబర్ 11న మహీంద్రా భారత్-అమెరికా కళాపరిషత్ ఫిల్మోత్సవ్ సంబరాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ నటీనటులు పాల్గొననున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 6:41 am

ఈనెల 15వ తేదీన "మగధీర" శతదినోత్స వేడుకలు!

టాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ "మగధీర" సినిమా శతదినోత్సవ వేడుకలు ఈనెల 15వ తేదీన జరుగనున్నాయి. జులై 31వ తేదీన 14 దేశాల్లో 1200 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం.. 223 థియేటర్లలో వంద రోజులను పూర్తి చేసుకుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 6:36 am

రెడ్ మార్కులో సెన్సెక్స్: నష్టాల్లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 28 పాయింట్లు పుంజుకుని 16,471 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 4,890 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.17 శాతం, నిఫ్టీ 0.18 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ చమురు మరియు సహజవాయువు, మెటల్ ఇండెక్స్‌లు ఒక శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 6:28 am

అంతర్జాతీయ పర్యాటక సదస్సుకు బీజింగ్ ఆతిథ్యం

2010 అంతర్జాతీయ పర్యటన మరియు పర్యాటక సదస్సుకు బీజింగ్ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది మే 25వ తేదీన జరిగే ఈ సదస్సును బీజింగ్‌లో నిర్వహించాలని నిర్ణయించినట్లు ప్రపంచ పర్యటన మరియు పర్యాటక మండలి ప్రకటించింది. ఈ సదస్సుకు వివిధ దేశాల అంతర్జాతీయ పర్యాటక సంస్థల నేతలు హాజరుకానున్నారు.
Source: Yahoo! Telugu: News | 10 Nov 2009 | 6:09 am

"స్లమ్‌డాగ్ మిలియనీర్"ను వెంటాడుతోన్న అవార్డులు

ప్రముఖ దర్శకుడు డానీ బోయెల్ రూపొందించి ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం "స్లమ్‌డాగ్ మిలియనీర్". ఇప్పటికే ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా తాజాగా ప్రతిష్టాత్మక యురోపియన్ ఫిల్మ్ అవార్డ్‌కు చెందిన ఐదు కేటగిరీల్లో నామినేట్ అయింది. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ నటుడు, ఉత్తమ సినిమా, ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత, ఉత్తమ కెమెరామెన్ వంటి తదితర విభాగాల్లో స్లమ్‌డాగ్ మిలియనీర్ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. జాక్వెస్ ఆడియార్డ్ సినిమా "ఎ ప్రోఫెట్" స్లమ్‌డాగ్ మిలియనీర్ చిత్రానికి ఈ ఐదు కేటగిరీల్లో గట్టిపోటీనివ్వనుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 5:51 am

విడుదలకు సిద్ధమైన శ్రీహరి, ఆర్యన్ రాజేష్‌ల "రోమియో"

శ్రీహరి, ఆర్యన్ రాజేష్ కలిసి నటించిన చిత్రం "రోమియో". దీనికి ఎ డిఫరెంట్ లవర్ అనే ట్యాగ్‌లైన్‌ను జోడించారు. సుధ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రూపుదిద్దుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ నెల మూడోవారంలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. దర్శకుడు చెప్పినదానికంటే ఈ సినిమాను చాలా బాగా మలిచారని తెలిపారు. ప్రేక్షకులకు మంచి థ్రిల్‌ను కలుగజేసే చిత్రమిదని, ఇందులో ఓ ధనవంతుడైన వ్యక్తి పాత్రను శ్రీహరి పోషించారు. కథానాయిక అయిన శ్రీహరి చెల్లెలి ప్రేమను హీరో ఎలా పొందాడన్న విషయాన్ని తెరపై చూడాల్సిందేనని నిర్మాత వెల్లడించారు. మధుర ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించిందని శ్రీనివాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 5:28 am

డిసెంబరులో వస్తోన్న సాయిరాంశంకర్ "వాడేకావాలి"

'బంపర్ ఆఫర్' హీరో సాయిరామ్ శంకర్ నటించిన మరో యూత్‌ఫుల్ రొమాంటిక్, కామెడీ ఎంటర్‌టైనర్ "వాడే కావాలి". వీరేష్‌బాబు, రఘునాథ్ సోగి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని దశావతారం, సూర్య సన్నాఫ్ కృష్ణన్ లాంటి భారీ చిత్రాలు విడుదల చేసిన ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సమర్పిస్తోంది. ఈ సందర్భంగా ఎస్.వి.ఆర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సి.ఇ.ఓ శోభారాణి మాట్లాడుతూ.. వైవిధ్యమైన ప్రేమకథగా రూపొందుతోన్న ఈ చిత్రం సాయిరాంశంకర్‌కి "బంపర్ ఆఫర్" తర్వాత చాలా మంచి చిత్రమవుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక విలువలతో మలేషియాలో చక్కని లొకేషన్స్‌లో 40 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకుని డిసెంబర్ ప్రథమార్థంలో విడుదల కానుంది. సాయిరామ్‌శంకర్, సుహాసి జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో నరేష్, వేణుమాధవ్, అలీ, చంద్రవాస్, కోట శంకరరావు, చిత్రం శ్రీను, రఘుబాబు, శ్రీనివాస్‌వర్మ, రవిప్రకాష్, పిట్ల రాజేష్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 5:14 am

నవంబరులో రానున్న "మన్మధులు"

యువనిర్మాత వి. సురేష్ చౌదరి నిర్మించి తమిళంలో విజయవంతమైన "కాదల్ కదై" చిత్రాన్ని 'మన్మధులు' పేరిట తెలుగులోకి అనువదించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. సూర్యపవర్‌ఫుల్ మూవీస్ పతాకంపై సూర్యడీజిల్స్ సమర్పిస్తున్న ఈ చిత్రం తొలికాపీ సిద్ధమైంది. అంతా కొత్త నటీనటులతో రూపుదిద్దుకున్న 'మన్మధులు' చిత్రం గురించి నిర్మాత వి. సురేష్ చౌదరి మాట్లాడుతూ.. ఒక కొత్త పాయింట్‌తో వచ్చిన ప్రేమకథా చిత్రమిదన్నారు. దీన్ని దర్శకుడు వేలురాజా ఎంతో శ్రమించి అన్ని తరగతుల వారికి నచ్చేలా అన్ని అంశాల్ని మేళవించి తీర్చిదిద్దారని చెప్పారు. ముఖ్యంగా నేటి యువత తెలుసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఇందులో ఉన్నాయన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 10 Nov 2009 | 4:33 am

తమిళనాడులో భారీ వర్షాలు: 71 మంది మృతి

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కురుసున్న భారీ వర్షాలకు ఇప్పటి వరకు 71 మంది ప్రాణాలు కోల్పోయారు.
Source: జాతీయ | 10 Nov 2009 | 3:12 am

ఈనెల 12 నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారం!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్టు గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి దానం నాంగేందర్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2009 | 2:29 am

ఉప ఎన్నికలు: కమ్యూనిస్టుల ఎర్రకోటలో కాంగ్రెస్ పాగా!

కమ్యూనిస్టులు పాలనలో ఉన్న కేరళ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో కొన్ని స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు
Source: జాతీయ | 10 Nov 2009 | 2:08 am

బ్లాక్ మనీ కోసం కేసీఆర్ బ్లాక్‌మెయిలింగ్!?

తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) భవిష్యత్ కోసం ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు పడరాని పాట్లు పడుతున్నారు. పార్టీని నడిపేందుకు నిధులు లేక పోవడంతో ఆయన సరికొత్త ఎత్తుడ వేశారు.
Source: ఏపీ న్యూస్ | 10 Nov 2009 | 12:25 am

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో మధు కోడా సతీమణి!

జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడా హవాలా కుంభకోణంలో చిక్కుకోవడంతో ఆయన భార్య గీతా కోడా ఎన్నికల బరిలోకి దిగనున్నారు. ఆ రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో తన భర్త ప్రాతినిథ్యం వహించిన జగన్నాథపూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 11:58 pm

భూ కబ్జాలపై ఎస్సీ-ఎస్టీ కమిషన్‌కు కేసీఆర్ ఫిర్యాదు

రాష్ట్రంలో ఆక్రమణకు గురైన దళితుల భూములపై జాతీయ ఎస్సీఎస్టీ కమిషన్‌కు తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఫిర్యాదు చేశారు. దళితుల భూములు భూకబ్జాకు గురైన ప్రాంతాల్లో ఆ కమిషన్ బృందం పర్యటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 11:12 pm

రాష్ట్రంలో మరింత ఉధృతంగా జూనియర్ డాక్టర్ల సమ్మె!

ఇతర రాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తమకు ఉపకారవేతనాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్రంలో జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె మరింత తీవ్రరూపం దాల్చుతోంది. తమ డిమాండ్లకు ప్రభుత్వం తలొగ్గక పోతే పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 10:55 pm

ఎంఎన్ఎస్ ఎమ్మెల్యేలపై నాలుగేళ్ళ బహిష్కరణ వేటు!

మరాఠీ భాషలో కాకుండా హిందీలో ప్రమాణస్వీకారం చేసిన సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే అబూ అజ్మీపై చేయిచేసుకున్న నలుగురు మహారాష్ట్ర నవ్ నిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) ఎమ్మెల్యేలపై వేటు పడింది.
Source: జాతీయ | 9 Nov 2009 | 10:20 pm

12వ తేదీ నుంచి చిరంజీవి గ్రేటర్ ప్రచారం: వాసిరెడ్డి

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ఈనెల 12వ తేదీన గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న డివిజన్లలో ఆయన ప్రచారం చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 10:02 pm

కాంగ్రెస్ గూటికి చేరిన భాజపా నేత తిరునావుక్కరసర్!

తమిళనాడు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి ఎస్.తిరునావుక్కరస్ ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ సమయంలో కేంద్ర మంత్రులు పి.చిదంబరం, గులాం నబీ ఆజాద్‌లు ఉన్నారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 9:17 pm

ప్రశాంతంగా సాగుతున్న ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు!

దేశ వ్యాప్తంగా ఒక లోక్‌సభ, 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు గత శనివారం జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉపఎన్నికలో బాలీవుడ్‌ నటుడు రాజ్‌ బబ్బర్‌ ఈసారి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 8:47 pm

"బొమ్మాళీ" అనుష్క పర్సనల్ టచ్

"ఈనాడు" హీరో కమల్ హాసన్ పుట్టిన రోజునే "అరుంధతి" పుట్టింది. సినీరంగంలో 50 సంవత్సరాలపాటు తన హవాను కొనసాగిస్తున్న లెజండ్ స్టార్ కమల్ హాసన్‌కు ఈ నెల ఏడోతేదీన పుట్టినరోజు. అదే రోజున బిల్లా సుందరి, అరుంధతి తార బొమ్మాళీకి కూడా పుట్టినరోజు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ రంగాలతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతోన్న అనుష్క వేట్టైక్కారన్ (తమిళం), వేదం (తెలుగు) చిత్రాల్లో నటిస్తోంది. ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నాగార్జున నటించిన "సూపర్" చిత్రం ద్వారా సినీరంగంలో అడుగుపెట్టిన అనుష్క.. తర్వాత విక్రమార్కుడు, లక్ష్యం, ఒక్కమగాడు, డాన్, చింతకాయల రవి వంటి పలు హిట్ చిత్రాల్లో నటించింది. బెంగళూరు నగరానికి చెందిన యోగా టీచర్ అయిన అనుష్కకు గ్లామర్ పంటతో హీరోయిన్ రోల్స్ ఒకవైపు మంచి పేరు సంపాదించిపెట్టగా, మరోవైపు "అరుంధతి" సినిమా ఆమె కెరీర్‌కు గుర్తింపు తెచ్చిపెట్టింది. ఇకపోతే.. అనుష్క పుట్టిన స్థలం: మంగళూరు (కర్ణాటక)పుట్టిన తేదీ: నవంబర్ 7, 1981 (1981-11-07)మాతృభాష: తులు.అసలు పేరు: స్వీటి శెట్టిఇతర పేర్లు: స్వీటీ, టొమ్ములు, ఎత్తు: 5 అడుగుల 7.5 అంగులాలు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 10:15 am

పవన్-మహేష్‌లపై ఆరు నెలల నిషేధం సాధ్యమేనా!

వరద బాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన స్టార్‌నైట్‌కు హాజరుకాని నటీనటులపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు గంభీరంగా ప్రకటించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 9:56 am

"బంపర్ ఆఫర్" ట్రైలర్ మీ కోసం..

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా, 'ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్ బిందు మాధవి హీరోయిన్‌గా నటించిన చిత్రం "బంపర్ ఆఫర్". ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పూరి జగన్నాథ్ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:36 am

'బెండుఅప్పారావు'ను ట్రైలర్లో చూడండి

అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామెడీ చిత్రాలు తీసిన ఇ.వి.వి. తాజాగా అల్లరి నరేష్‌తో "బెండు అప్పారావు" చిత్రాన్ని తెరకెక్కించారు. కామ్నా జఠ్మలాని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బొబ్బర్లంక అనే పల్లెలో బెండుఅప్పారావు (అల్లరి నరేష్) అనే ఆర్.ఎంపి డాక్టర్ తనకు తెలిసిన వైద్యం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తూ వెలిగిపోతూంటాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:28 am

"బొమ్మాళీ" అనుష్క పర్సనల్ టచ్

"ఈనాడు" హీరో కమల్ హాసన్ పుట్టిన రోజునే "అరుంధతి" పుట్టింది. సినీరంగంలో 50 సంవత్సరాలపాటు తన హవాను కొనసాగిస్తున్న లెజండ్ స్టార్ కమల్ హాసన్‌కు ఈ నెల ఏడోతేదీన పుట్టినరోజు. అదే రోజున బిల్లా సుందరి, అరుంధతి తార బొమ్మాళీకి కూడా పుట్టినరోజు. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ రంగాలతో పాటు దక్షిణాది సినీ పరిశ్రమల్లో అగ్రహీరోయిన్‌గా కొనసాగుతోన్న అనుష్క వేట్టైక్కారన్ (తమిళం), వేదం (తెలుగు) చిత్రాల్లో నటిస్తోంది.
Source: వినోదం | 9 Nov 2009 | 4:46 am

కర్ణాటకలో భాజపా మహిళా మంత్రి శోభా రాజీనామా!

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పకు అత్యంత నమ్మకస్తులైన మంత్రులుగా వారిలో మహిళా మంత్రి శోభా కరందలజే ఒకరు. ఈమె సోమవారం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ముఖ్యమంత్రి యడ్యూరప్పకు అందజేశారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 4:45 am

పవన్-మహేష్‌లపై ఆరు నెలల నిషేధం సాధ్యమేనా!

వరద బాధితుల సహాయార్థం మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నిర్వహించిన స్టార్‌నైట్‌కు హాజరుకాని నటీనటులపై ఆరు నెలల పాటు నిషేధం విధిస్తామని దర్శకరత్న దాసరి నారాయణరావు గంభీరంగా ప్రకటించారు.
Source: వినోదం | 9 Nov 2009 | 4:27 am

కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుదాం: బాబు

రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడుదామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అసమర్థ పాలనను అంతం చేయడానికి ఇదే సరైన తరుణమని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 3:53 am

మహారాష్ట్ర అసెంబ్లీలో రగడ: ఎస్పీ ఎమ్మెల్యేపై దాడి!

ముందు హెచ్చరించినట్టుగానే మహరాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) సభ్యులు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీభత్సం సృష్టించారు. హిందీలో ప్రమాణం చేస్తుండగా సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే అబు అజ్మీపై ఎంఎన్ఎస్ సభ్యులు దాడికి పాల్పడ్డారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 3:45 am

రాష్ట్రంలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం!

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 2:37 am