లాభాల్లో సెన్సెక్స్: రిలయన్స్ వృద్ధి

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం లాభాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 349 పాయింట్లు పుంజుకుని 16,508 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 106 పాయింట్లు లాభపడి 4,902 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.16 శాతం, నిఫ్టీ 2.21 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 8:45 am

జగన్‌కు కేంద్ర మంత్రి పదవి: హస్తినలో ఊహాగానాలు!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టనున్నారు. ఈ మేరకు హస్తినలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని అన్ని జాతీయ టీవీ ఛానల్స్ ఈ అంశాన్నే ప్రసారం చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 8:30 am

మూడు రోజులపాటు మూతపడనున్న టాటా మోటార్స్

పూనాలోని తమ కర్మాగారాన్ని మూడు రోజులపాటు మూసేయాలని నిర్ణయించినట్లు టాటా మోటార్స్ సంస్థ సోమవారం వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 8:26 am

రాష్ట్రంలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం!

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 8:07 am

311 పాయింట్లు లాభపడ్డ స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ 311 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,469 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 93 పాయింట్లు పుంజుకుని 4,889 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.92 శాతం, నిఫ్టీ 1.94 శాతం మేరకు పుంజుకున్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 8:03 am

మరోసారి దాడికి పాల్పడ్డ ఆస్ట్రేలియన్లు

మెల్‌బోర్న్‌లో ఇద్దరు భారతీయ విద్యార్థులపై ఆస్ట్ర్లేలియాకు చెందిన దుండగులు దాడికి దిగారు. దీంతో దేశీయ విద్యార్థులు తీవ్ర గాయాలపాలైనారు.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 7:34 am

ఆయుధాలు వీడితో నక్సల్స్‌తో చర్చలు: బుద్ధదేవ్

ప్రజాయుద్ధం సాగిస్తున్న నక్సలైట్లు ఆయుధాలు వీడితే చర్చలు సిద్ధమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసను వీడి ప్రజా జీవితంలో కలిసి పోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 6:47 am

ఆసియాలో వ్యాపారాభివృద్ధికి ప్రణాళికలు: బార్‌క్లేస్

యూకేకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ రంగమైన బార్‌క్లేస్ సంస్థ ఆసియా ఖండంలో తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 6:40 am

రాష్ట్రపతితో అన్ని అంశాలు చర్చించా: కేసీఆర్

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో అన్ని అంశాలు చర్చించినట్టు తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఊపుతో ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఆయన చర్యలు చేపట్టారు.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 6:33 am

స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న లాభాలు

స్టాక్ మార్కెట్లో లాభాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 2187 పాయింట్లు పుంజుకుని 16,376 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 60 పాయింట్లు లాభపడి 4,856 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.35 శాతం, నిఫ్టీ 1.25 శాతం మేరకు బలపడ్డాయి. ఇప్పటి వరకు మొత్తం 2,444 వాటాలు ట్రేడ్ అవగా, 1,537 వాటాలు లాభపడ్డాయి. అలాగే 829 వాటాలు నష్టాల్లో పయనిస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 9 Nov 2009 | 6:30 am

"బంపర్ ఆఫర్" ట్రైలర్ మీ కోసం..

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాం శంకర్ హీరోగా, 'ఆవకాయ్ బిర్యానీ' ఫేమ్ బిందు మాధవి హీరోయిన్‌గా నటించిన చిత్రం "బంపర్ ఆఫర్". ఇప్పటికే థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోన్న ఈ చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పూరి జగన్నాథ్ చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:36 am

'బెండుఅప్పారావు'ను ట్రైలర్లో చూడండి

అప్పుల అప్పారావు, ఆ ఒక్కటీ అడక్కు వంటి ఎన్నో నవ్వొచ్చే కామెడీ చిత్రాలు తీసిన ఇ.వి.వి. తాజాగా అల్లరి నరేష్‌తో "బెండు అప్పారావు" చిత్రాన్ని తెరకెక్కించారు. కామ్నా జఠ్మలాని కథానాయికగా నటించిన ఈ చిత్రంలో బొబ్బర్లంక అనే పల్లెలో బెండుఅప్పారావు (అల్లరి నరేష్) అనే ఆర్.ఎంపి డాక్టర్ తనకు తెలిసిన వైద్యం చేస్తూ అడ్డదిడ్డంగా సంపాదిస్తూ వెలిగిపోతూంటాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:28 am

ఏమిటీ.. నంది అవార్డుల గొప్ప: నారాయణ మూర్తి

నంది అవార్డుల గొప్పతనమేమిటని ప్రముఖ విప్లవ కథానాయకుడు ఆర్.నారాయణ మూర్తి ప్రశ్నించారు. సామాజిక స్పృహతో తీసిన చిత్రాలకు ఈ అవార్డులు దక్కవని, పైరవీ చేసి నిర్మాతలకే ఈ అవార్డులను ప్రకటిస్తారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:24 am

ఎలా వచ్చిందని అడిగితే పళ్లు రాలిపోతాయ్: బాలయ్య

తనకు నంది అవార్డు ఎలా వచ్చిందని ఎవరైనా అడిగితే వారి పళ్ళు రాలిపోతాయని సినీహీరో యువరత్న బాలకృష్ణ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:13 am

'ఏడుకొండలవాడా వెంకటరమణ' సినిమా ట్రైలర్

సురేంద్ర, సునీల్‌, శివారెడ్డి ప్రధాన పాత్రలో శ్రీ కాశీనాయన కళామందిర్‌ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న చిత్రం ఏడు కొండలవాడా వెంకటరణ (అందరూ బాగుండాలి). సూర్య ఇంజమూరి దర్శకత్వంలో గుండ్లకుంట్ల శ్రీరాములు నిర్మించిన ఈ సినిమా 'ప్రస్తుతం డి.టి.యస్‌ కార్యక్రమాలు జరుపుకుంటుంది.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 5:11 am

"అ.. ఆ.. ఇ.. ఈ.." సినిమా ట్రైలర్‌‌ను తిలకించండి

"మహాత్మా" చిత్రంతో వంద సినిమాలను తన ఖాతాలో వేసుకున్న శ్రీకాంత్, గ్లామర్ స్టార్స్ మీరా జాస్మిన్, సదా హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం "అ.. ఆ.. ఇ.. ఈ..". ఈ సినిమా ఈ నెల ఆరోతేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో కామిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సెంటిమెంట్, మిస్టరీ వంటి పలు అంశాలను కూడా మేళవించారు. ఇందులో శ్రీకాంత్ మీరాజాస్మిన్, సదాల ముద్దుల భర్తగా అద్భుతంగా నటించాడు. మీరాజాస్మిన్, సదాలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 9 Nov 2009 | 4:41 am

రాష్ట్రంలో భారీ వర్షాలు: జనజీవనం అస్తవ్యస్తం!

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా కోస్తా, రాయలసీమ జిల్లాలతో పాటు.. తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 2:37 am

ఆయుధాలు వీడితో నక్సల్స్‌తో చర్చలు: బుద్ధదేవ్

ప్రజాయుద్ధం సాగిస్తున్న నక్సలైట్లు ఆయుధాలు వీడితే చర్చలు సిద్ధమని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య స్పష్టం చేశారు. మావోయిస్టులు హింసను వీడి ప్రజా జీవితంలో కలిసి పోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 1:18 am

రాష్ట్రపతితో అన్ని అంశాలు చర్చించా: కేసీఆర్

రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌తో అన్ని అంశాలు చర్చించినట్టు తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు తెలిపారు. ప్రత్యేక రాష్ట్ర సాధనలో భాగంగా ఆయన చేపట్టిన ఉద్యమాన్ని మరింత ఊపుతో ముందుకు తీసుకెళ్లేందుకు వీలుగా ఆయన చర్యలు చేపట్టారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 1:03 am

మావో దుశ్చర్యలను అణిసి వేస్తాం: డీజీపీ గిరీష్

దేశంలో విధ్వంసానికి పాల్పడుతున్న మావోయిస్టు చర్యలకు సమాధానం చెప్పే సత్తా మన రాష్ట్ర పోలీసులకు ఉందని రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 12:57 am

ఈనెల 12వ తేదీ నుంచి చంద్రబాబు గ్రేటర్ ప్రచారం!

ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం తొలిసారి జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల ప్రచార వేడి రాష్ట్ర రాజధానిలో వెడెక్కింది. ఇప్పటికే నామినేషన్ల దాఖలు ఘట్టం పూర్తయింది.
Source: ఏపీ న్యూస్ | 9 Nov 2009 | 12:49 am

భద్రతను పటిష్టం చేయడమే తొలి ప్రాధాన్యం: పాటిల్

గతంలో జరిగిన 26/11 దాడులు పునరావృత్తం కాకుండా దేశ వాణిజ్య రాజధానితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను మరింత పటిష్టం చేయడమే తన ప్రధాన అజెండా అని మహారాష్ట్ర హోం మంత్రి ఆర్.ఆర్.పాటిల్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 9 Nov 2009 | 12:14 am

మహారాష్ట్ర హోంమంత్రిగా ఆర్.ఆర్.పాటిల్ నియామకం

మహారాష్ట్ర హోం మంత్రిగా తిరిగి ఆర్.ఆర్.పాటిల్‌ నియమితులయ్యారు. కాంగ్రెస్-ఎన్సీపీ నేతృత్వంలో ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రిపదవులు కేటాయింపు సోమవారం జరిగింది. ఇందులో హోంమంత్రిత్వ శాఖను పాటిల్‌కే అప్పగించారు.
Source: జాతీయ | 8 Nov 2009 | 11:33 pm

పొట్టి శ్రీరాములుకు ఒక న్యాయం.. నాకొకటా: కేసీఆర్

ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం ప్రాణ త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములుకు ఒక న్యాయం నాకొక న్యాయమా అంటూ తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ప్రశ్నించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 11:09 pm

హలో కేసీఆర్‌ గారు.. చచ్చి సాధించేదేముంది: నన్నపనేని

తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుకు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ అయిన నన్నపనేని రాజకుమారి ఒక ఉచిత సలహా ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్ ప్రాణత్యాగం (ఆమరణ నిరాహారదీక్ష) చేయాలని భావించడం పట్ల నన్నపనేనికి తెగ బాధపడి పోతున్నారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 10:22 pm

ఉప ఎన్నికలు ప్రశాంతం: సగటున 60 పోలింగ్ నమోదు!

దేశంలో ఏడు రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ, ఒక పార్లమెంట్ స్థానానికి ఆదివారం జరిగిన ఉప ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ ఎన్నికల్లో 60 శాతం మేరకు పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం అందికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 8 Nov 2009 | 9:20 pm

మాజీ సీఎం మధు కోడాకు సమన్లు జారీ చేసిన ఈడీ

జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ (ఈడి) సమన్లు జారీ చేసింది. నిధుల దుర్వినియోగం కేసులో ఈనెల 12, 13 తేదీల్లో తమ శాఖ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నారు.
Source: జాతీయ | 8 Nov 2009 | 8:46 pm

బీఎస్-గాలిల మధ్య రాజీ: కర్ణాటక సంక్షోభానికి తెర!

ఎట్టకేలకు కర్ణాటక రాజకీయ సంక్షోభానికి తెరపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప, అసమ్మతి నేత గాలి జనార్ధన్ రెడ్డిల మధ్య తలెత్తిన విభేదాలు పరిష్కారమయ్యాయి. వీరిద్దరు ఒకేచోట సమావేశమై మనస్సువిప్పి మాట్లాడుకున్నారు.
Source: జాతీయ | 8 Nov 2009 | 5:06 am

చైనా కమ్యూనిస్టు ప్రభుత్వంపై దలైలామా ఆరోపణలు

చైనా కమ్యూనిస్టు ప్రభత్వంపై టిబెటెన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా ధ్వజమెత్తారు. తనపై చైనా పాలకులు లేనివిధంగా అసత్య ప్రచారం చేస్తోందని ఆరోపించారు. వారం రోజుల పర్యటన కోసం దలైలామా శనివారం అరుణాచల్ ప్రదేశ్‌ పర్యటనకు వచ్చిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 8 Nov 2009 | 4:08 am

పాకిస్థాన్-ఆఫ్ఘన్ సంఘటనలపై ప్రధాని ఆందోళన!

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో వరుసగా జరుగుతున్న సంఘటనల పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా ఉపఖండంలో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని అందించాలని ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 8 Nov 2009 | 2:49 am

పులివెందులలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి పోటీ!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో ఖాళీ ఏర్పడిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సతీమణి వైఎస్‌.విజయలక్ష్మి పోటీ చేయనున్నారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 2:19 am