లష్కర్ సాయంతో భారత్‌పై దాడులకు అల్‌ఖైదా కుట్ర!

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తీవ్రవాద సంస్థలైన అల్‌ఖైదా, లష్కర్ తోయిబా తీవ్రవాద సంస్థలు భారత్‌పై పగబట్టాయి. అంతర్జాతీయ తీవ్రవాద సంస్థగా గుర్తింపు పొందిన అల్‌ఖైదా తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా సంస్థతో కలిసి దాడులు జరిపేందుకు కుట్ర పన్నినట్టు అమెరికా నిఘా సంస్థ ఎఫ్‌బీఐ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 8:46 am

పాకిస్థాన్-ఆఫ్ఘన్ సంఘటనలపై ప్రధాని ఆందోళన!

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో వరుసగా జరుగుతున్న సంఘటనల పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా ఉపఖండంలో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని అందించాలని ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 8:18 am

పులివెందులలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి పోటీ!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో ఖాళీ ఏర్పడిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సతీమణి వైఎస్‌.విజయలక్ష్మి పోటీ చేయనున్నారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 7:47 am

మూడు మిలియన్ సబ్‌స్క్రైబర్లపై బిగ్ టీవీ దృష్టి!

ప్రైవేటు డిష్ టీవీ రంగంలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన రిలయన్స్ బిగ్ టీవీ వచ్చే యేడాది మార్చి నాటికి మూడు మిలియన్ సబ్‌స్క్రైబర్లను ఆకర్షించడమే ధ్యేయంగా పెట్టుకుంది. అలాగే, ప్రస్తుతం అందిస్తున్న ఛానల్స్‌తో పాటు.. అదనంగా 25-30 ఛానల్స్‌ను జోడించాలని నిర్ణయించింది.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 7:25 am

మొన్న.. నిన్నా... నేడు.. ఎన్నటికీ మెగాస్టారే!

వరదల్లో బాధితులైన వారి సహాయార్థం ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి జోలె పట్టి విశాఖపట్నంలో విరాళాలు సేకరించారు. ఈ జోలె యాత్రలో 32,48,654 రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని శనివారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన సినీతారల స్టార్‌నైట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్యకు సిఎం సహాయనిధికి అందజేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 6:36 am

సీఎం సహాయ నిధికి "మా" విరాళం రూ.ఐదు కోట్లు

ముఖ్యమంత్రి సహాయ నిధికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఐదు కోట్ల 28 లక్షల 47 వేల 101 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మా అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 6:21 am

పెషావర్‌లో పేలిన కారు బాంబు: 10 మంది మృతి

పాకిస్థాన్‌లోని పెషావర్ నగరంలో ఆదివారం కారు బాంబు పేలింది. ఈ ప్రమాదంలో పది మంది మృత్యువాత పడగా, మరో 20 మంది గాయపడ్డారు. పెషావర్ ఈశాన్య ప్రాంతంలోని స్థానిక మేయర్ ఇంటికి సమీపంలో ఒక ఆత్మహుతి దళ సభ్యుడు కారును పేల్చి వేశాడని అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 6:00 am

వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన: ఆనం

అకాల వర్షంతో వరద తాకిడికి గురైన నెల్లూరు జిల్లా పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అకాల వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లా వరద తాకిడికి గురైంది. నెలరోజుల సగటు వర్షపాతం మూడు రోజుల్లోనే నమోదైందని మంత్రి వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 5:37 am

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే మధు కోడా అరెస్టు: ఈడీ

కడుపునొప్పి, అధిక రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 5:14 am

దుబాయ్‌లో బ్రాంచ్‌ని ప్రారంభించనున్న ఐడీబీఐ బ్యాంకు

విదేశీ మార్కెట్‌‌పై కన్నేసిన ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) దుబాయ్‌లో తొలిసారి ఓ బ్రాంచ్‌ను ప్రారంభించనుంది. ఈ బ్యాంకుకు ఇదే తొలి విదేశీ బ్యాంచ్ కావడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 8 Nov 2009 | 4:51 am

పాకిస్థాన్-ఆఫ్ఘన్ సంఘటనలపై ప్రధాని ఆందోళన!

పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్‌లలో వరుసగా జరుగుతున్న సంఘటనల పట్ల ప్రధాని మన్మోహన్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఆసియా ఉపఖండంలో శాంతి నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం అందిస్తున్న సహకారాన్ని అందించాలని ఆయన మరోమారు విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 8 Nov 2009 | 2:49 am

పులివెందులలో వైఎస్ సతీమణి విజయలక్ష్మి పోటీ!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో ఖాళీ ఏర్పడిన పులివెందుల అసెంబ్లీ స్థానం నుంచి ఆయన సతీమణి వైఎస్‌.విజయలక్ష్మి పోటీ చేయనున్నారు. విజయలక్ష్మికి టిక్కెట్ ఇచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 2:19 am

మొన్న.. నిన్నా... నేడు.. ఎన్నటికీ మెగాస్టారే!

వరదల్లో బాధితులైన వారి సహాయార్థం ప్రజారాజ్యం అధినేతగా చిరంజీవి జోలె పట్టి విశాఖపట్నంలో విరాళాలు సేకరించారు. ఈ జోలె యాత్రలో 32,48,654 రూపాయలు వచ్చాయి. ఈ మొత్తాన్ని శనివారం రాత్రి గచ్చిబౌలిలో జరిగిన సినీతారల స్టార్‌నైట్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రోశయ్యకు సిఎం సహాయనిధికి అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 1:07 am

సీఎం సహాయ నిధికి "మా" విరాళం రూ.ఐదు కోట్లు

ముఖ్యమంత్రి సహాయ నిధికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఐదు కోట్ల 28 లక్షల 47 వేల 101 రూపాయల చెక్కును ముఖ్యమంత్రి కె.రోశయ్యకు మా అసోసియేషన్ ప్రతినిధులు అందజేశారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 12:51 am

వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు పరిశీలన: ఆనం

అకాల వర్షంతో వరద తాకిడికి గురైన నెల్లూరు జిల్లా పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉన్నారని మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అకాల వర్షాలు కురవడంతో నెల్లూరు జిల్లా వరద తాకిడికి గురైంది. నెలరోజుల సగటు వర్షపాతం మూడు రోజుల్లోనే నమోదైందని మంత్రి వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 8 Nov 2009 | 12:08 am

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ కాగానే మధు కోడా అరెస్టు: ఈడీ

కడుపునొప్పి, అధిక రక్తపోటు తదితర సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధు కోడాను డిశ్చార్జ్ అయిన వెంటనే అరెస్టు చేస్తామని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 7 Nov 2009 | 11:44 pm

ఆర్.ఆర్.బి ఛైర్మన్లను తొలగించిన రైల్వే మంత్రి మమత

రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (ఆర్ఆర్‌బి) ప్రక్షాళనకు కేంద్ర రైల్వే శాఖామంత్రి మమతా బెనర్జీ శ్రీకారం చుట్టారు. ఇందులోభాగంగా ఖాళీల భర్తీ పేరుతో భారీ ఎత్తున అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఛైర్మన్లను మూకుమ్మడిగా తొలగించారు.
Source: జాతీయ | 7 Nov 2009 | 10:52 pm

అధ్యక్షుడి ఎంపిక తర్వాతే అద్వానీకి విరామం: ఆర్ఎస్ఎస్

భారతీయ జనతా పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీ రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోవడమే అనివార్యమే అయినప్పటికీ.. భారతీయ జనతా పార్టీకి కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్న తర్వాతే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటారని ఆర్ఎస్ఎస్ నేత రామ్ మాధవ్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 7 Nov 2009 | 10:07 pm

అధినేత్రి ఎపుడంటే అపుడు సీఎల్పీ భేటీ: రోశయ్య

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఎపుడంటే అపుడే కాంగ్రెస్ శాసన సభాపక్ష సమావేశం జరుగుతుందని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. సిఎల్పీ సమావేశం గురించి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆరా తీశారని ఆయన చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 9:52 pm

ప్రభాస్, కంగనల "ఏక్‌ నిరంజన్" ట్రైలర్ మీకోసం

రెబల్‌స్టార్‌ ప్రభాస్‌, బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ జంటగా.. డాషింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యరామ్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ ఛైర్మన్‌ ఆదిత్యరామ్‌ ఆదిత్యమూవీస్‌ పతాకంపై నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను అలరిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2009 | 10:11 am

నవంబర్ 13న తెరకెక్కనున్న "పదహారేళ్ల వయసు"

డ్రీమ్‌గర్ల్, అలనాటి సినీతార శ్రీదేవి నటించిన 'పదహారేళ్ల వయసు' సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదే పేరుతో భూషణ్, ఆర్యా ఓరా హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ మరియు సెన్సార్ సిగ్నల్ కోసం వేచి వున్న ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత హరి ప్రసాద్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2009 | 10:02 am

"బొమ్మాళీ" బాటలో కాజల్, మీరాజాస్మిన్..!

'అరుంధతి' సినిమాతో హారర్ మూవీల క్రేజ్, లేడి ఓరియెంటెడ్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన బొమ్మాళీ బాటలోనే మరికొందరు హీరోయిన్లు పయనిస్తున్నట్లు సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ "మగధీర"లో యువరాణిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది."ఛాంది" అనే పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఎం.ఎస్. రాజు ర్మాణ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులోని లేడి ఓరియెంటెడ్ పాత్రలో అందాల బొద్దుగుమ్మ ఛార్మిని ఎంపిక చేయాలని ముందు భావించారు. కానీ "మగధీర" రికార్డుతో ఛార్మి ఛాన్సును కాజల్ అగర్వాల్ కొట్టేసిందని తెలిసింది. ఇదేవిధంగా 'మోక్ష' పేరుతో రూపుదిద్దుకోనున్న మరో హారర్ చిత్రంలో "మీరా జాస్మిన్" కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి "బ్లాక్ అండ్ వైట్" ఫేమ్ శ్రీకాంత్ వేముల దర్శకత్వం వహిస్తున్నారు. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజీవ్ మోహన్, నాజర్, రాహుల్ దేవ్‌లు నటించనున్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2009 | 5:40 am

"పోకిరి" మహేష్‌కు చెక్ పెట్టిన "మగధీరుడు"

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో యువ హీరోల ఆధిపత్య పోరు ఆరంభమైంది. నిన్నమొన్నటి వరకు టాలీవుడ్‌ను ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు హవా కొనసాగింది. ఇపుడు వీరి ప్రభంజాన్ని జూనియర్ మెగాస్టార్ అడ్డుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2009 | 5:37 am

"గ్రేటర్" ఎన్నికల ప్రచారానికి వైఎస్.జగన్ దూరం!?

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారానికి కడప పార్లమెంట్ సభ్యుడు, వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 5:30 am

నవంబర్ 13న తెరకెక్కనున్న "పదహారేళ్ల వయసు"

డ్రీమ్‌గర్ల్, అలనాటి సినీతార శ్రీదేవి నటించిన 'పదహారేళ్ల వయసు' సినిమా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అదే పేరుతో భూషణ్, ఆర్యా ఓరా హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ మరియు సెన్సార్ సిగ్నల్ కోసం వేచి వున్న ఈ సినిమాను ఈ నెల 13వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత హరి ప్రసాద్ తెలిపారు.
Source: వినోదం | 7 Nov 2009 | 4:32 am

ఏడుగురు స్వతంత్రులకు హోడా కేబినెట్‌లో చోటు

బలపరీక్షలో తమకు మద్దతుగా నిలిచిన ఏడుగురు స్వతంత్ర అభ్యర్థులకు హర్యానా ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హూడా మంత్రిపదవులతో సత్కరించారు.
Source: జాతీయ | 7 Nov 2009 | 4:24 am

దానం నాగేందర్ రాజీనామాను తిరస్కరించిన డీఎస్

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ లేఖను తిరస్కరిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 2:53 am

కర్ణాటక సంక్షోభం ముగిసి పోలేదు: గాలి జనార్ధన్ రెడ్డి

ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప మార్పు అంశంపై కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ సర్కారులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదని ఆ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి, అసమ్మతి వర్గం అధినేత గాలి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Source: జాతీయ | 7 Nov 2009 | 2:34 am