వీక్లీ అప్‌డేట్: సగం నష్టాలు.. సగం లాభాలు

ఈ వారంలో మొదట నష్టాలు.. ఆ తర్వాత లాభాల పంట పండింది. నిన్న వారాంతంలో స్టాక్ మార్కెట్ 1.65 శాతంతో 262 పాయింట్లు లాభపడి 16,158 వద్ద నిలిచింది. నిఫ్టీ కూడా 1.79 శాతంతో 84.45 పాయింట్లు పుంజుకుని 4,796.15 వద్ద ముగిసింది. గత వారం నష్టాలను కొనసాగిస్తూ.. ఈ వారం అత్యంత బలహీనంగా స్టాక్ మార్కెట్ ప్రారంభమైంది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 8:36 am

దానం నాగేందర్ రాజీనామాను తిరస్కరించిన డీఎస్

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ లేఖను తిరస్కరిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 8:22 am

కర్ణాటక సంక్షోభం ముగిసి పోలేదు: గాలి జనార్ధన్ రెడ్డి

ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప మార్పు అంశంపై కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ సర్కారులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదని ఆ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి, అసమ్మతి వర్గం అధినేత గాలి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 8:04 am

తగ్గుముఖం పట్టిన భారత ఫారెక్స్ నిల్వలు

భారత ఫారెక్స్ నిల్వలు తగ్గుముఖం పట్టాయి. అక్టోబర్ 30వ తేదీ నాటికి.. భారత విదేశీ మారక నిల్వలు.. 284.391 బిలయన్ డాలర్లకు పడిపోయింది. అంతకుముందు వారంలో.. విదేశీ మారక నిల్వలు.. రూ. 285.520 బిలియన్ డాలర్లు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఈ వివరాలను వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 7:55 am

ఎమ్మెల్యే-ఎంపీ సిఫార్సులకే ప్రాధాన్యం ఇచ్చాం: డీఎస్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం చేపట్టిన అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందజేసిన సిఫార్సు లేఖల్లో సూచించిన వారికే టిక్కెట్లు కేటాయించామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 6:38 am

సకుటుంబ సపరివారంగా "జగన్" హస్తిన యాత్ర!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. వెళుతూ వెళ్తూ ఆయన వెంట తల్లి విజయలక్ష్మీ, భార్య భారతీ రెడ్డి, సోదరిణి షర్మిల కూడా తీసుకెళ్ళారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 6:24 am

డిపాజిట్ రేట్లను కుదించిన స్టేట్ బ్యాంక్

దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్ వడ్డీ రేట్లను కుదించింది. ఈ తగ్గించిన డిపాజిట్ వడ్డీ రేట్లు నవంబర్ 9వ తేదీ నుంచి అమలులోకి తేనున్నట్లు ఎస్‌బీఐ వెల్లడించింది. ప్రస్తుతం డిపాజిట్ రేట్లను 0.25 నుంచి 0.5 శాతం మేరకు తగ్గించనున్నట్లు తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 6:23 am

మా ఇద్దరిలో ఎవరో ఒకరు శిరసావహించాలి: రోశయ్య

పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను లేదా వైఎస్ తనయుడులలో ఎవరో ఒకరు శిరసా వహించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. తనను రాజీనామా చేయాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన మరుక్షణమే బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 6:10 am

ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉప ఎన్నికల పోలింగ్!

ఏడు రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక లోక్‌సభకు శనివారం ఉదయం ఆరంభమైన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 5:52 am

"బొమ్మాళీ" బాటలో కాజల్, మీరాజాస్మిన్..!

'అరుంధతి' సినిమాతో హారర్ మూవీల క్రేజ్, లేడి ఓరియెంటెడ్ పాత్రలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించిన బొమ్మాళీ బాటలోనే మరికొందరు హీరోయిన్లు పయనిస్తున్నట్లు సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్‌చరణ్ తేజ "మగధీర"లో యువరాణిగా ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్ అగర్వాల్ ఓ హారర్ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది."ఛాంది" అనే పేరుతో సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకోనున్న ఈ సినిమాకు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా, ఎం.ఎస్. రాజు ర్మాణ పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇందులోని లేడి ఓరియెంటెడ్ పాత్రలో అందాల బొద్దుగుమ్మ ఛార్మిని ఎంపిక చేయాలని ముందు భావించారు. కానీ "మగధీర" రికార్డుతో ఛార్మి ఛాన్సును కాజల్ అగర్వాల్ కొట్టేసిందని తెలిసింది. ఇదేవిధంగా 'మోక్ష' పేరుతో రూపుదిద్దుకోనున్న మరో హారర్ చిత్రంలో "మీరా జాస్మిన్" కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి "బ్లాక్ అండ్ వైట్" ఫేమ్ శ్రీకాంత్ వేముల దర్శకత్వం వహిస్తున్నారు. గ్రాఫిక్స్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాజీవ్ మోహన్, నాజర్, రాహుల్ దేవ్‌లు నటించనున్నట్లు సమాచారం.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2009 | 5:40 am

"పోకిరి" మహేష్‌కు చెక్ పెట్టిన "మగధీరుడు"

టాలీవుడ్‌ చిత్ర పరిశ్రమలో యువ హీరోల ఆధిపత్య పోరు ఆరంభమైంది. నిన్నమొన్నటి వరకు టాలీవుడ్‌ను ప్రిన్స్ మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు హవా కొనసాగింది. ఇపుడు వీరి ప్రభంజాన్ని జూనియర్ మెగాస్టార్ అడ్డుకున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 7 Nov 2009 | 5:37 am

బరాక్ ఒబామా జపాన్ పర్యటన వాయిదా

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా జపాన్ పర్యటన వాయిదా పడింది. టెక్సాన్ సైనిక శిబిరంలో జరిగిన కాల్పుల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకుగానూ ఈ పర్యటనను వాయిదా వేసుకున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు తెలిపాయి. దీంతో ఒబామా వచ్చేవారం జపాన్‌కు వెళ్లే అవకాశం ఉందని వైట్‌హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 7 Nov 2009 | 5:04 am

దానం నాగేందర్ రాజీనామాను తిరస్కరించిన డీఎస్

గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాష్ట్ర ఆరోగ్య మంత్రి దానం నాగేందర్ లేఖను తిరస్కరిస్తున్నట్టు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 2:53 am

కర్ణాటక సంక్షోభం ముగిసి పోలేదు: గాలి జనార్ధన్ రెడ్డి

ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్ప మార్పు అంశంపై కర్ణాటకలోని భారతీయ జనతా పార్టీ సర్కారులో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ఇంకా తెరపడలేదని ఆ రాష్ట్ర పర్యాటక శాఖామంత్రి, అసమ్మతి వర్గం అధినేత గాలి జనార్ధన్ రెడ్డి స్పష్టం చేశారు.
Source: జాతీయ | 7 Nov 2009 | 2:34 am

సకుటుంబ సపరివారంగా "జగన్" హస్తిన యాత్ర!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శనివారం ఆకస్మికంగా ఢిల్లీకి వెళ్లారు. వెళుతూ వెళ్తూ ఆయన వెంట తల్లి విజయలక్ష్మీ, భార్య భారతీ రెడ్డి, సోదరిణి షర్మిల కూడా తీసుకెళ్ళారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 1:21 am

ఎమ్మెల్యే-ఎంపీ సిఫార్సులకే ప్రాధాన్యం ఇచ్చాం: డీఎస్

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కోసం చేపట్టిన అభ్యర్థుల ఎంపికలో ఎలాంటి అవినీతి చోటు చేసుకోలేదని, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు అందజేసిన సిఫార్సు లేఖల్లో సూచించిన వారికే టిక్కెట్లు కేటాయించామని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డి.శ్రీనివాస్ స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 1:08 am

మా ఇద్దరిలో ఎవరో ఒకరు శిరసావహించాలి: రోశయ్య

పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయానికి తాను లేదా వైఎస్ తనయుడులలో ఎవరో ఒకరు శిరసా వహించాలని ముఖ్యమంత్రి కె.రోశయ్య అన్నారు. తనను రాజీనామా చేయాలని పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆదేశించిన మరుక్షణమే బాధ్యతల నుంచి తప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 7 Nov 2009 | 12:41 am

ఏడు రాష్ట్రాల్లో ప్రశాంతంగా ఉప ఎన్నికల పోలింగ్!

ఏడు రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక లోక్‌సభకు శనివారం ఉదయం ఆరంభమైన ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. ఈ పోలింగ్ సాయంత్రం ఐదు గంటలతో ముగియనుంది.
Source: జాతీయ | 7 Nov 2009 | 12:22 am

మొన్న రాజ్‌థాక్రే.. నేడు ఎంపీ సీఎం శివరాజ్ చౌహాన్

భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్‌ కూడా బీహారీలకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టింది. దీనికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ చౌహానే నాయకుడు కావడం గమనార్హం. పొట్ట చేతబట్టుకుని రాష్ట్రానికి వచ్చే బీహారీ ప్రజలకు ఉపాధి కల్పించరాదని ఆయన రాష్ట్రంలోని కంపెనీలను విజ్ఞప్తి చేశారు.
Source: జాతీయ | 6 Nov 2009 | 10:49 pm

నేడు ఢిల్లీ వెళ్లనున్న మంత్రి దానం నాగేందర్

రాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపిల్ కార్పొరేషన్ ఎన్నికల టిక్కెట్ల కేటాయింపుల్లో ఆయనపై తీవ్రమైన ఆరోపణలు వచ్చిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 10:29 pm

ప్రత్యేక తెలంగాణాకు మద్దతు ఇవ్వండి: కేసీఆర్

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు ముఖ్యమంత్రి రోశయ్యతో సహా ప్రతి ఒక్కరూ మద్దతు ఇవ్వాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె.చంద్రశేఖర రావు విజ్ఞప్తి చేశారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 10:18 pm

ప్రధాని-సోనియాతో భేటీ కానున్న సీఎం రోశయ్య!

ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీలతో ముఖ్యమంత్రి కె.రోశయ్య శనివారం భేటీ కానున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన తొలిసారి ఢిల్లీకి వెళ్లిన విషయం తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 9:59 pm

పెరుగుతున్న జనాభా: తగ్గుతున్న ఆహార ఉత్పత్తి!

దేశంలో ఆహార ఉత్పత్తుల కొరత భవిష్యత్‌లో తలెత్తనుందా.? తలెత్తనుందనే అంటున్నారు కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ యాదవ్. గత 1950 నుంచి 2008 మధ్య కాలంలో స్థూల జాతీయోత్పత్తిలో (జీడీపీ)లో వ్యవసాయం వాటా 51 శాతం నుంచి కేవలం 18 శాతానికి పడిపోయిందని ఆయన చెప్పారు.
Source: జాతీయ | 6 Nov 2009 | 8:56 pm

నేడు కొలువుదీరనున్న మహా ప్రభుత్వం!

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం శనివారం కొలువుదీరనుంది. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై పక్షం రోజులుగా నెలకొన్న ప్రతిష్టంభన ఎట్టకేలకు 48 గంటల క్రితం ముగిసిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం శనివారం ప్రమాణం చేయనుంది.
Source: జాతీయ | 6 Nov 2009 | 8:46 pm

"స్టార్‌నైట్"కు హాజరుకానున్న ముఖ్యమంత్రి రోశయ్య

వరదబాధితుల కోసం తెలుగు చిత్ర పరిశ్రమ శనివారం (నవంబర్-7) స్టార్‌నైట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకానున్న ఈ కార్యక్రమం హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరుగనుంది.శనివారం సాయంత్రం 5.40 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో నందమూరి హీరో బాలకృష్ణ "భువనవిజయం" డ్రామాలో కీలక పాత్ర పోషిస్తారు. ఫ్లడ్ రిలీఫ్ కమిటీ ఛైర్మన్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమం కీరవాణి పాటతో ఆరంభమవుతుంది. మ్యూజికల్ నైట్ (సంగీతవిభావరి)లో 25 గాయకులు, 14 సంగీత దర్శకులు పాల్గొంటారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 11:49 am

శిల్పారామంలో "బిందాస్" ఆడియో వేడుక

ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మంచు మనోజ్ హీరోగా, షీనా కథానాయికగా నటిస్తోన్న చిత్రం "బిందాస్". "అజయ్‌గాడి విజయగాథ" అనేది ఈ సినిమాకు ఉపశీర్షిక. ఈ చిత్రం ద్వారా వర్షం, నువ్వొస్తానంటే.. నేనొద్దంటానా, పౌర్ణమి చిత్రాలకు రచయితగా పనిచేసిన వీరుపోట్ల దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 10:16 am

ఏవీఎం 174వ చిత్రంగా రాణా "లీడర్"

ప్రముఖ ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ తాజాగా డా.డి. రామానాయుడు మనుమడు రాణాను కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. "లీడర్" అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో ఏవీఎం 174వ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి "హ్యాపీడేస్" ఫేమ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకు కథానాయకుని స్టిల్స్ రిలీజ్ చేయలేదు. వెరైటీగా మొహం సరిగ్గా కన్పించకుండా అంతా బ్లాక్‌లో ఉండేవిధంగా హీరో పోస్టర్లను గురువారం రాత్రి విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 9:58 am

డిసెంబర్ 18న ఎన్టీఆర్-నయనల "అదుర్స్"..!

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తూ.. వైష్ణవి ఆర్ట్స్‌పై రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో నయనతార, షీలాలు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమా ఎన్టీఆర్‌కి టర్నింగ్ పాయింట్. మంచి కథాబలం, కమర్షియల్ విలువల జోడింపుతో ఇంటిల్లపాది చూడదగ్గ చిత్రంగా ఉంటుందని వంశీ వెల్లడించారు. ఎన్టీఆర్-వినాయక్ కాంబినేషన్‌లో "ఆది" తర్వాత వస్తోన్న సినిమాలోనూ యాక్షన్, సస్పెన్స్ వంటి పలు అంశాలు పుష్కలంగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో ఎన్టీఆర్ ప్రేక్షకులకు కొత్తగా కన్పిస్తాడని నిర్మాత తెలిపారు. ఇకపోతే.. వినాయక్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తొలిసారిగా ఓ పూర్తిస్థాయి వినోదంతో కూడిన ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందించారు. యాక్షన్, కామెడీ, పాటలు, వినాయక్ టేకింగ్, ఎన్టీఆర్ నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని డాక్టర్ వంశీ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 9:33 am

కర్నాటక రాష్ట్ర మంత్రి వర్గం నుంచి శోభా తొలగింపు

కర్నాటక రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి ప్రధాన కారణమైన శోభను తొలగించి సంక్షోభానికి తెరదించేందుకు ప్రయత్నాల్లో భాగంగా శోభను తొలగించినట్లు భారతీయ జనతా పార్టీ తెలిపింది.
Source: జాతీయ | 6 Nov 2009 | 8:45 am

ముషారఫ్‌‍ను కూడా విచారిస్తాం: ఐరాస

పాకిస్థాన్ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య జరిగిన తీరుపై ఐక్యరాజ్యసమితి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అప్పటి ఆ దేశాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్‌ను కూడా తాము ప్రశ్నించాలని నిర్ణయించినట్లు ఐరాస తెలిపింది.
Source: జాతీయ | 6 Nov 2009 | 8:43 am

నవంబర్ 14 నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

రెండేళ్లకొకసారి నిర్వహించే బాలల చిత్రోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, పిల్లల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. 16వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ వివరాలను గీతారెడ్డి తెలియజేస్తూ..బాలల్లో చక్కని సంస్కృతిని, విజ్ఞానాన్ని పెంపొందించడం సామాజిక లక్ష్యాలలో ప్రధానమైందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని శాఖలూ ఈ ఉత్సవాలకు సహకారాలందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 8:37 am

నాపై ఆరోపణలు కుట్రలో భాగమే: దానం నాగేందర్

నవంబర్ నెలలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికలలో టికెట్లు ఇచ్చేందుకు తాను డబ్బులు తీసుకున్నానని వచ్చిన ఆరోపణలు అవాస్తవ దూరమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 8:03 am

తమిళనాడులో భారీ వర్షాలు: 12 మంది మృతి

తమిళనాడు రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే దాదాపు 12 మంది మృతి చెందారు. ఈ భారీ వర్షాలు మరో రెండు రోజులుంటాయని శుక్రవారం నాడు వాతావరణ శాఖ ప్రకటించింది.
Source: జాతీయ | 6 Nov 2009 | 6:40 am

గాంధీ భవన్‌పై రాళ్ళ దాడి: నేతల దిష్టిబొమ్మలు దగ్ధం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్లు ఆశించి భంగపడిన అసంతృప్తుల్లో ఒక్కసారి ఆగ్రహంతో రెచ్చిపోయారు. పార్టీ ప్రధాన కార్యాలయమైన గాంధీ భవన్‌పై రాళ్ళ వర్షం కురిపించారు.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 6:02 am

నాకు అలాంటి ఉద్దేశమే లేదు. నన్ను వివాదాల్లోకి లాగకండి..!

"దేవదాసు" చిత్రంతోనే తెలుగువారిని ఉర్రూతలూగించిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా... తెలుగు సినిమాలే చేస్తానని నొక్కి చెబుతోంది. తాజాగా ఆమె మంచు విష్ణువర్ధన్‌బాబుతో, వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో "సలీం"లో కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సుపారియా, సోప్స్, షాంపూలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఇలియానా గురువారం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఎన్నికల సీజన్లో.. ప్రచారానికి వెళ్తారా?జ: రాజకీయాల గురించి నాకు తెలియదు. నన్ను ఎవరూ పిలవరు. పిలిచినా వెళ్ళను. ప్రశ్న: పోనీ ఏదైనా పార్టీకి అంబాసిడర్‌గా ఉంటారా?జ: నన్ను వివాదాల్లోకి లాగకండి.. నాకు అలాంటి ఉద్దేశ్యమేలేదు.ప్రశ్న: ఆర్టిస్టుగా మీరు చేయలేని పాత్ర ఏమైనా ఉందా?జ: మేకప్‌లేకుండా.. విలేజ్‌ అమ్మాయిగా నటించాలనుంది.ప్రశ్న: మీలో ఉన్న మైనస్సులు?జ: నేను హాట్‌టెంపర్‌ను. నాలో ఉన్న మైనస్ అదే. నన్ను ఎంతమంది విమర్శించినా అందులో నిజం లేకపోతే.. చీల్చి చెండాలనేంతగా ఆవేశం వస్తుంది. ప్రశ్న: మీకు ఎవరైనా గుడి కడితే..?జ: అలాంటివాటికి నేను వ్యతిరేకం.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 6:00 am

"విలేజ్‌లో వినాయకుడు" ఓ డాక్టర్‌ను ప్రేమిస్తే..!?

వినాయకుడు చిత్రానికి కొనసాగింపుగా "విలేజ్‌లో వినాయకుడు" చిత్రం తీసినట్లుంది. వినాయకుడులో కథ, కథనం, సంభాషణలు ఆసక్తి కలిగించాయి. ఆ కోవలో వెళ్ళినదే అయినా కథాగమనంలో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోవడం మైనసే. కార్తీక్‌గా కృష్ణుడు తన పాత్రమేరకు బాగానే చేశాడు. అమాయకత్వం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. ఏమీ తెలియనట్లు బెల్లతనం చూపించడం అనేవి ముఖకవళికల్లో ఉట్టిపడుతాయి. వినాయకుడు తరహాలోనే కృష్ణుడు నటన ఉంటుంది. కావ్య పాత్రలో శరణ్యామోహన్ తొలిసారిగా తెలుగుకు పరిచయమైన నటి. చాలా చిన్నవయస్సులో ఆమె సందర్భానుసారంగా పలికిన హావభావాలు ప్రేక్షకుడిని కథలో లీనంచేస్తాయి. రావు రమేష్ పాత్ర ఊరిపెద్దగా, ఇంటిపెద్దగా బాగానే ఉంది. మిగిలిన వారంతా కొత్తవారే. యండమూరి వీరేంద్రనాథ్ పాత్ర కాస్త నవ్వు, కాస్త పజిల్‌గా ఉంటుంది. అందరిపై పజిల్స్‌వేసి చివరికి తనకు కార్తీక్‌వేసిన పజిల్‌తో తికమకపడతాడు. సాహిత్యపరంగా వనమాలి బాగా రాశాడు.
Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 5:02 am

రేపు కొలువుదీరనున్న కాంగ్రెస్-ఎన్.సి.పి సర్కారు

మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీల కూటమి ప్రభుత్వం శనివారం కొలువుదీరనుంది. ముఖ్యమంత్రి అశోక్ చౌహాన్‌తో పాటు.. ఇరు పార్టీలకు చెందిన కొత్త మంత్రులు ప్రమాణం చేయనున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ సీఎల్పీ నేత అశోక్ చౌహాన్ శుక్రవారం స్పష్టం చేశారు.
Source: జాతీయ | 6 Nov 2009 | 4:54 am

డిసెంబర్ 18న ఎన్టీఆర్-నయనల "అదుర్స్"..!

ఎన్టీఆర్ కథానాయకుడిగా నటిస్తూ.. వైష్ణవి ఆర్ట్స్‌పై రూపుదిద్దుకుంటోన్న తాజా చిత్రం ఒక్క పాట మినహా షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఇంకా పేరు ఖరారు కాని ఈ సినిమాలో నయనతార, షీలాలు కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కనున్న..
Source: వినోదం | 6 Nov 2009 | 4:52 am

ఏవీఎం 174వ చిత్రంగా రాణా "లీడర్"

ప్రముఖ ఏవీఎం ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ తాజాగా డా.డి. రామానాయుడు మనుమడు రాణాను కథానాయకుడిగా పరిచయం చేస్తూ.. "లీడర్" అనే చిత్రాన్ని నిర్మిస్తోంది. దీంతో ఏవీఎం 174వ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ చిత్రానికి "హ్యాపీడేస్" ఫేమ్ శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కూడా పూర్తయింది. కానీ ఇంతవరకు కథానాయకుని స్టిల్స్ రిలీజ్ చేయలేదు. వెరైటీగా మొహం సరిగ్గా కన్పించకుండా అంతా బ్లాక్‌లో ఉండేవిధంగా హీరో పోస్టర్లను గురువారం రాత్రి విడుదల చేశారు.
Source: వినోదం | 6 Nov 2009 | 4:28 am

తెదేపా గ్రేటర్ మేయర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కృతి

గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మేయర్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నికైన సుధీష్ రాంభొట్లా నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీంతో ఆయన స్థానంలో సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డిని మేయర్ అభ్యర్థిగా తెదేపా ప్రకటించింది.
Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 4:10 am

నవంబర్ 14 నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవం

రెండేళ్లకొకసారి నిర్వహించే బాలల చిత్రోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, పిల్లల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. 16వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ వివరాలను గీతారెడ్డి తెలియజేస్తూ..బాలల్లో చక్కని సంస్కృతిని, విజ్ఞానాన్ని పెంపొందించడం సామాజిక లక్ష్యాలలో ప్రధానమైందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని శాఖలూ ఈ ఉత్సవాలకు సహకారాలందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.
Source: వినోదం | 6 Nov 2009 | 3:08 am

హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం: 22 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మశాలకు 45 కిలోమీటర్ల దూరంలో కంగరా జిల్లాలోని హరిపూర్ సమీపంలో ప్రయాణికులతో కూడిన బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.
Source: జాతీయ | 6 Nov 2009 | 2:17 am