|
నవంబర్ 14 నుంచి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవంరెండేళ్లకొకసారి నిర్వహించే బాలల చిత్రోత్సవాలు నవంబర్ 14 నుంచి 20వరకు హైదరాబాద్‌లో జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని, పిల్లల్లో సృజనాత్మకశక్తిని పెంపొందించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయని రాష్ట్ర మంత్రి గీతారెడ్డి అన్నారు. 16వ అంతర్జాతీయ బాలల చిత్రోత్సవ వివరాలను గీతారెడ్డి తెలియజేస్తూ..బాలల్లో చక్కని సంస్కృతిని, విజ్ఞానాన్ని పెంపొందించడం సామాజిక లక్ష్యాలలో ప్రధానమైందన్నారు. ప్రభుత్వపరంగా అన్ని శాఖలూ ఈ ఉత్సవాలకు సహకారాలందిస్తున్నాయని ఆమె పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 8:37 am 106 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్స్టాక్ మార్కెట్ 106 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,170 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు పుంజుకుని 4,795 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.66 శాతం, నిఫ్టీ 0.63 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 8:36 am కాంగ్రెస్‌లో ధర్మపురి మాటకే విలువలేదు: కోటగిరికాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అధిష్టానం వద్ద కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మాటకు విలువలేదనే విషయం తాజా పరిణాలు స్పష్టం చేశాయని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత పొలిట్‌బ్యూరో సభ్యుడు కోటగిరి విద్యాధరరావు ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 8:34 am చార్జీలు పెంచిన జెట్, కింగ్ఫిషర్తాము దేశీయ ప్రయాణీకులపై చార్జీల భారం మోపనున్నట్లు దేశీయ విమానయాన కంపనీలైన జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ సంస్థలు శుక్రవారం వెల్లడించాయి. ప్రస్తుతం ముడి చమురు ధరలు పెరగడంతో తాము ఆ భర్తీని ప్రయాణీకులపై వేయక తప్పలేదని కింగ్‌ఫిషర్ సంస్థ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 8:31 am 'భారతీయ వంటకాలు స్వైన్ ఫ్లూను నివారించగలవు'ఘాటైన భారతీయ వంటకాలు.. స్వైన్ ఫ్లూతో సహా సాధారణ జలుబు మరియు ఇతరత్రా వ్యాధులను నియంత్రించే శక్తిని కలిగి ఉన్నాయంటూ.. రష్యా వైద్యులు తాజాగా వెల్లడించారు. అల్లం, పసుపులతో తయారైన ఘాటైన కూరలు.. మనుష్యుల్లో రోగనిరోధక శక్తిని మరింతగా పెంపొందిస్తున్నట్లు తాము గుర్తించామని వారు అంటున్నారు.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 8:13 am కనిష్ఠ స్థాయిల నుంచి సెన్సెక్స్ రికవరీస్టాక్ మార్కెట్ కనిష్ఠ స్థాయిల నుంచి రికవరీ అయింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 139 పాయింట్లు పుంజుకుని 16,203 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 4,806 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.80 శాతం, నిఫ్టీ 0.84 శాతం మేరకు వృద్ధి చెందాయి.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 7:52 am హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం: 22 మంది మృతిహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మశాలకు 45 కిలోమీటర్ల దూరంలో కంగరా జిల్లాలోని హరిపూర్ సమీపంలో ప్రయాణికులతో కూడిన బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 7:46 am టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతి: ఎంపీ సర్వేఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమని ఆ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, నిజమైన కార్యకర్తలకు, గెలుపు గుర్రాలకు అన్యాయం జరగడం అనేది ప్రతి ఎన్నికల్లో చూస్తూ వస్తున్న విషయమేనని తేల్చి చెప్పారు.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 6:36 am స్టాక్ మార్కెట్లో తగ్గుముఖం పట్టిన లాభాలుస్టాక్ మార్కెట్ లాభాలు తగ్గుముఖం పట్టాయి. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 72 పాయింట్లు లాభపడి 16,136 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు పుంజుకుని 4,779 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.45 శాతం, నిఫ్టీ 0.28 శాతం మేరకు లాభపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 6:26 am లష్కర్‌తో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమే: చిదంబరంభారత్లో దాడులకు పాల్పడుతున్న లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థతో పాకిస్థాన్‌కు సంబంధం ఉన్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం ఆరోపించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల వద్ద జరిపిన విచారణలో ఈ విషయం స్పష్టమైందన్నారు.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 6:24 am పెరిగిన ముడి చమురు ధరలుడిసెంబర్ నెలలో డెలివరీకి సిద్ధంగానున్న ముడి చమురు ఏకంగా 47 సెంట్లు పెరిగి ప్రతి బ్యారెల్ ధర 80.09 డాలర్లకు చేరుకుందని న్యూయార్క్ మర్కెంటైల్ ఎక్స్‌ఛేంజ్ శుక్రవారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 6 Nov 2009 | 6:10 am నాకు అలాంటి ఉద్దేశమే లేదు. నన్ను వివాదాల్లోకి లాగకండి..!"దేవదాసు" చిత్రంతోనే తెలుగువారిని ఉర్రూతలూగించిన అందాల ముద్దుగుమ్మ ఇలియానా... తెలుగు సినిమాలే చేస్తానని నొక్కి చెబుతోంది. తాజాగా ఆమె మంచు విష్ణువర్ధన్‌బాబుతో, వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో "సలీం"లో కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే సుపారియా, సోప్స్, షాంపూలకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తోన్న ఇలియానా గురువారం హైదరాబాద్ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం.. ప్రశ్న: ఎన్నికల సీజన్లో.. ప్రచారానికి వెళ్తారా?జ: రాజకీయాల గురించి నాకు తెలియదు. నన్ను ఎవరూ పిలవరు. పిలిచినా వెళ్ళను. ప్రశ్న: పోనీ ఏదైనా పార్టీకి అంబాసిడర్‌గా ఉంటారా?జ: నన్ను వివాదాల్లోకి లాగకండి.. నాకు అలాంటి ఉద్దేశ్యమేలేదు.ప్రశ్న: ఆర్టిస్టుగా మీరు చేయలేని పాత్ర ఏమైనా ఉందా?జ: మేకప్‌లేకుండా.. విలేజ్ అమ్మాయిగా నటించాలనుంది.ప్రశ్న: మీలో ఉన్న మైనస్సులు?జ: నేను హాట్‌టెంపర్‌ను. నాలో ఉన్న మైనస్ అదే. నన్ను ఎంతమంది విమర్శించినా అందులో నిజం లేకపోతే.. చీల్చి చెండాలనేంతగా ఆవేశం వస్తుంది. ప్రశ్న: మీకు ఎవరైనా గుడి కడితే..?జ: అలాంటివాటికి నేను వ్యతిరేకం.Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 6:00 am "విలేజ్‌లో వినాయకుడు" ఓ డాక్టర్‌ను ప్రేమిస్తే..!?వినాయకుడు చిత్రానికి కొనసాగింపుగా "విలేజ్‌లో వినాయకుడు" చిత్రం తీసినట్లుంది. వినాయకుడులో కథ, కథనం, సంభాషణలు ఆసక్తి కలిగించాయి. ఆ కోవలో వెళ్ళినదే అయినా కథాగమనంలో అంత ఇంట్రెస్ట్ క్రియేట్ చేయలేకపోవడం మైనసే. కార్తీక్‌గా కృష్ణుడు తన పాత్రమేరకు బాగానే చేశాడు. అమాయకత్వం, ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం. ఏమీ తెలియనట్లు బెల్లతనం చూపించడం అనేవి ముఖకవళికల్లో ఉట్టిపడుతాయి. వినాయకుడు తరహాలోనే కృష్ణుడు నటన ఉంటుంది. కావ్య పాత్రలో శరణ్యామోహన్ తొలిసారిగా తెలుగుకు పరిచయమైన నటి. చాలా చిన్నవయస్సులో ఆమె సందర్భానుసారంగా పలికిన హావభావాలు ప్రేక్షకుడిని కథలో లీనంచేస్తాయి. రావు రమేష్ పాత్ర ఊరిపెద్దగా, ఇంటిపెద్దగా బాగానే ఉంది. మిగిలిన వారంతా కొత్తవారే. యండమూరి వీరేంద్రనాథ్ పాత్ర కాస్త నవ్వు, కాస్త పజిల్‌గా ఉంటుంది. అందరిపై పజిల్స్‌వేసి చివరికి తనకు కార్తీక్‌వేసిన పజిల్‌తో తికమకపడతాడు. సాహిత్యపరంగా వనమాలి బాగా రాశాడు.Source: Yahoo! Telugu: Entertainment | 6 Nov 2009 | 5:02 am కాంగ్రెస్‌లో ధర్మపురి మాటకే విలువలేదు: కోటగిరికాంగ్రెస్ రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా అధిష్టానం వద్ద కూడా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ మాటకు విలువలేదనే విషయం తాజా పరిణాలు స్పష్టం చేశాయని ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత పొలిట్‌బ్యూరో సభ్యుడు కోటగిరి విద్యాధరరావు ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 3:04 am హిమాచల్ ప్రదేశ్‌లో బస్సు ప్రమాదం: 22 మంది మృతిహిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ధర్మశాలకు 45 కిలోమీటర్ల దూరంలో కంగరా జిల్లాలోని హరిపూర్ సమీపంలో ప్రయాణికులతో కూడిన బస్సు లోయలో పడిపోయింది ఈ ప్రమాదంలో 22 మంది మృతి చెందగా, మరో 48 మంది గాయపడ్డారు.Source: జాతీయ | 6 Nov 2009 | 2:17 am టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతి: ఎంపీ సర్వేఎన్నికల్లో టిక్కెట్లు అమ్ముకోవడం కాంగ్రెస్ సంస్కృతిలో భాగమని ఆ పార్టీ ఎంపీ సర్వే సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే, నిజమైన కార్యకర్తలకు, గెలుపు గుర్రాలకు అన్యాయం జరగడం అనేది ప్రతి ఎన్నికల్లో చూస్తూ వస్తున్న విషయమేనని తేల్చి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 6 Nov 2009 | 1:07 am లష్కర్‌తో పాకిస్థాన్‌కు సంబంధాలు నిజమే: చిదంబరంభారత్లో దాడులకు పాల్పడుతున్న లష్కర్ ఇ తోయిబా తీవ్రవాద సంస్థతో పాకిస్థాన్‌కు సంబంధం ఉన్నాయని కేంద్ర హోంమంత్రి చిదంబరం ఆరోపించారు. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ అరెస్టు చేసిన ఇద్దరు వ్యక్తుల వద్ద జరిపిన విచారణలో ఈ విషయం స్పష్టమైందన్నారు.Source: జాతీయ | 6 Nov 2009 | 12:54 am అధిష్టానానికి షాక్: అసమ్మతి ఎమ్మెల్యేల రాజీనామా!కర్ణాటక రాష్ట్ర రాజకీయం మరింత రసదాయకంలో పడింది. ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పను మార్చే ప్రసక్తే లేదని కమలనాథులు తేల్చి చెప్పారు. దీంతో అమీ తుమీ తేల్చుకునేందుకు తరుగుబాటు ఎమ్మెల్యేలు సిద్ధమయ్యారు.Source: జాతీయ | 5 Nov 2009 | 11:35 pm 40 స్థానాల్లో పోటీ చేస్తున్న ప్రజారాజ్యం: వాసిరెడ్డి పద్మగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం 40 స్థానాల్లో పోటీ చేస్తుందని ఆ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తెలిపారు. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై మల్లగుల్లాలు పడిన ఆ పార్టీ అధిష్టానం....Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 11:16 pm నేడు హస్తినాపురానికి వెళ్లనున్న సీఎం రోశయ్య!రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొణిజేటి రోశయ్య శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆయన శనివారం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అవుతారు. ఈ మేరకు అధిష్టానం నుంచి రోశయ్యకు వర్తమానం వచ్చింది.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 11:06 pm రేపు ఏడు రాష్ట్రాల్లో ఉప ఎన్నికల పోలింగ్: సర్వం సిద్ధం!ఏడు రాష్ట్రాల్లోని 31 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక లోక్‌సభకు శనివారం ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానాల్లో ఉప ఎన్నికల పోలింగ్ గురువారం సాయంత్రంతో ముగిసింది. ఈ స్థానాలకు శనివారం పోలింగ్ జరగనుంది.Source: జాతీయ | 5 Nov 2009 | 10:43 pm రాజీనామా బాటలో గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని శాసనసభ సభ్యులు రాజీనామా దిశగా యోచన చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో తమ ప్రమేయం లేకుండా పూర్తి చేయడం పట్ల వారు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 10:36 pm కాంగ్రెస్‌లో గ్రేటర్ లొల్లి: గ్రేటర్ పదవికి దానం గుడ్‌బై!గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కాంగ్రెస్‌లో అలజడి సృష్టిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికలను డబ్బులకు అమ్ముకున్నారని పలువురు ఆరోపించారు. వీటితో కలత చెందిన గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ రాజీనామా చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 10:04 pm తీవ్రవాదిని హతం చేసిన రుక్సానాకు జాతీయ అవార్డు!ఉగ్రవాదిని హత్య చేసి దేశ మీడియా దృష్టిని ఆకర్షించిన కాశ్మీర్ వనిత రుక్సానా కౌసర్ (22)కు జాతీయ సాహస అవార్డును ఇవ్వాలని జమ్మూకాశ్మీర్ రాష్ట్ర గవర్నర్ వీఎన్.వోహ్రా కేంద్రానికి సిఫార్సు చేశారు.Source: జాతీయ | 5 Nov 2009 | 9:41 pm మధు కోడా నేడు విడుదలు: ఏ క్షణమైనా అరెస్టు!జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మధుకోడాను ఆదాయాపన్ను శాఖ అధికారులు ఏక్షణమైనా అరెస్టు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. హవాలా కుంభకోణంలో చిక్కుకున్న ఆయనను ఐటీ అధికారుల విచారించారు.Source: జాతీయ | 5 Nov 2009 | 8:49 pm డిసెంబరులో "సలీమ్"గా వస్తున్న విష్ణువర్ధన్విలక్షణ నటుడు మోహన్‌బాబు తనయుడు విష్ణువర్థన్ బాబు, ఇలియానా జంటగా నటిస్తున్న చిత్రం "సలీమ్" ('దుమ్ముదులుపుతాడు అనే ట్యాగ్). ఈ చిత్రం లోగో ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో గురువారం జరిగింది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 10:27 am ఆర్య-2 ట్రెయిలర్ మీకోసం...అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్య-2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో నవదీప్, శ్రద్దాదాస్ మరో జంట నటిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు ఈ చిత్రానికి నిర్మాతలు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 7:05 am 'వందేమాతరం' ఇస్లాంకు వ్యతిరేకం కాదు: ముస్లిం గ్రూపులు'వందేమాతరం' ఇస్లాంకు వ్యతిరేకం కాదని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రెండు ప్రముఖ ముస్లిం గ్రూపులు గురువారం వెల్లడించాయి. వందేమాతర జాతీయ గీతం ఇస్లాంకు వ్యతిరేకంగా ఉందంటూ.. జమాయిత్ ఉలేమా ఇ హింద్ రెండు రోజుల క్రితం ఫత్వా జారీ చేసిన సంగతి తెలిసిందే.Source: జాతీయ | 5 Nov 2009 | 6:49 am ఆడియో కంపెనీలపై పడి ఏడుస్తారెందుకు?ఈమధ్య చాలా ఆడియో ఫంక్షన్లలో ఆడియో కంపెనీలు సరిగ్గా అమ్మకాలు జరపడం లేదనీ, ఆడియో విడుదల తర్వాత ఎవరికివారు చేతులు దులుపుకుంటున్నారనీ నిర్మాతకు దానివల్ల నష్టం వాటిల్లుతున్నదని దాసరి నారాయణరావు ధ్వజమెత్తారు. దానికి కౌంటర్‌గా ఆడియో కంపెనీకి చెందిన మధుర ఎంటర్‌టైన్‌మెంట్ అధినేత శ్రీధర్ ఘాటుగా స్పందించారు. "మనమంతా 6వ తరగతిలోనే డిమాండ్- సప్లయిల గురించి చదువుకున్నాం. సినిమా రంగమే కాదు ఏ రంగంలోనైనా ఈ సూత్రం వర్తిస్తుంది. ఆడియో అమ్మకాలు ఒక్కోచోట బాగా జరుగుతాయి. ఒక్కోచోట జరగవు. అక్కడకు మేం వెళ్లి ఆడియో క్యాసెట్లు వేసి డబ్బులు పోగోట్టుకోలేం. ముందుగా నిర్మాతలంతా సినిమా బాగా చేద్దాం అని ఆలోచించాలి. సినిమా బాగుంటే ఆడియో ఎక్కడికైనా వెళుతుంది.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 6:21 am చిరుకు వ్యతిరేకంగా ప్రరాపా శ్రేణుల నినాదాలుగ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై డైలామాలో ఉన్న ప్రజారాజ్యం పార్టీ వైఖరితో ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయరాదని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ అభిప్రాయపడింది.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 5:38 am జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా-జేడీయూ పోటీత్వరలో జరుగనున్న జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యు)లు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ విషయాన్ని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ వెల్లడించారు.Source: జాతీయ | 5 Nov 2009 | 5:13 am ఆడవారిలో శీలం పోయే పార్ట్‌లు ఉన్నాయా?: పోసానిసమాజంలోని ప్రతిఒక్కరు ఆడవారి గురించి మాట్లాడేటపుడు మాటకు ముందు శీలం గురించి చర్చిస్తారు. అసలు ఆడవారికి శీలం ఎలా పోతుంది. ఎందుకు పోతుందని. శీలం పోయే పార్ట్‌లు ఆడవారిలో ఉన్నాయా అని ప్రముఖ రచయిత, నిర్మాత, దర్శకుడు, హీరో పోసాని కృష్ణమురళి ప్రశ్నించారు.Source: Yahoo! Telugu: Entertainment | 5 Nov 2009 | 4:04 am "గ్రేటర్" మహా సమరానికి తెరాస దూరం: కేసీఆర్గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమరం నుంచి తెలంగాణా రాష్ట్ర సమితి తప్పుకుంది. గ్రేటర్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే తమ ధ్యేయమని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 3:51 am షరతులతో కూడిన చర్చలకు సిద్ధం: మావో అగ్రనేతగ్రీన్ హంట్ ఆపరేషన్ ఆరంభమైన 24 గంటలకే మావోయిస్టు ఆగ్రనేతలు దిగివచ్చారు. కేంద్రంతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే, ఇందుకోసం కొన్ని షరతులను విధించారు.Source: జాతీయ | 5 Nov 2009 | 2:43 am అనూష కుటుంబానికి చిరు దంపతుల ఆర్థిక సాయంరాజమండ్రిలో ప్రేమోన్మాది చేతిలో తల్లిదండ్రులను కోల్పోయిన అనూషతో పాటు.. ఆమె ఇద్దరి చెల్లెళ్లకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి దంపతలు రూ.1.50 లక్షల ఆర్థిక సాయం చేశారు. బాధితులను ప్రరాపా కార్యాలయానికి పిలిచి ఈ ఆర్థిక సాయం అందించారు.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 2:22 am విద్యార్థి అనూష ఆత్మహత్యపై విచారణకు ఆదేశంహైదరాబాద్, సోమాజీగూడాలోని విల్లామేరీ కళాశాలకు చెందిన విద్యార్థిని అనూష ఆత్మహత్యపై ఉన్నత విద్యామండలి విచారణకు ఆదేశించింది. ఈ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్న అనూష.. గురువారం ఉదయం కళాశాల భవనం మూడో అంతస్తు పైనుంచి కిందికి దూకింది.Source: ఏపీ న్యూస్ | 5 Nov 2009 | 2:04 am
|