'వందేమాతరం'పై నా సమక్షంలో తీర్మానం చేయలేదు: పీసీ

జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించరాదని జమాయిత్ ఎ ఉలేమా హింద్ (జేఈయూ) తన సమక్షంలో ఎలాంటి తీర్మానం చేయలేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 7:58 am

ఉగ్రవాదులకు ఉద్యోగాలు : నైజీరియా

ఉగ్రవాదాన్ని విడనాడిన ఉగ్రవాదులకు తాము ఉద్యోగావకాశాలతోపాటు మరిన్ని సదుపాయాలు కల్పించనున్నట్లు నైజీరియా డెల్టాకు చెందిన మంత్రి ఉఫోట్ ఎకేటే తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 7:27 am

428 పాయింట్లు లాభపడ్డ స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 428 పాయింట్లు లాభపడటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 15,833 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 113 పాయింట్లు పుంజుకుని 4,677 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.78 శాతం, నిఫ్టీ 2.47 శాతం మేరకు వృద్ధి చెందాయి. బీఎస్ఈ మధ్యతరహా కంపెనీల ఇండెక్స్ 2.30 శాతం, బీఎస్ఈ చిన్నతరహా కంపెనీల ఇండెక్స్ 1.22 శాతం మేరకు లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లు సైతం దాదాపు లాభాల్లోనే నమోదు చేస్తున్నాయి.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 7:19 am

ఇరాన్‌లో భూకంపం: 269 మందికి గాయాలు

ఇరాన్‌లోని దక్షిణ ఇరానియన్ పోర్ట్ సిటీ బందర్ అబ్బాస్‌లో బుధవారం ఉదయాత్పూర్వం స్థానిక సమయం గం.2.56లకు భూకంపం సంభవించడంతో దాదాపు 269 మందికి పైగా ప్రజలు తీవ్రగాయాలపాలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 7:08 am

భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ భారీ లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 394 పాయింట్లు పుంజుకుని 15,799 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 112 పాయింట్లు లాభపడి 4,675 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 2.62 శాతం, నిఫ్టీ 2.45 శాతం మేరకు వృద్ధి చెందాయి.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 6:41 am

విముక్తి ప్రాంతం అబూజ్‌మడ్‌కు ఎందుకింత ప్రచారం!

అబూజ్‌మడ్.. ఈ పేరు వింటేనే పలు రాష్ట్ర పోలీసు యంత్రాంగాలను హడల్. మావోయిస్టులకు కేంద్ర స్థావరం. ఇక్కడ తిష్టవేసిన నక్సలైట్లు బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఒరిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంపై కేంద్రం గురిపెట్టింది.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 6:26 am

రేంజ్ రోవర్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టిన టాటా మోటార్స్

స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (ఎస్‌యూవీ) రేంజ్ రోవర్ మోడల్ 2010ను మార్కెట్లో ప్రవేశపెట్టినట్లు టాటా మోటార్స్ సంస్థ ప్రకటించింది. ముంబైలో ఎక్స్ షో రూం ధర రూ. 98.5 లక్షలుగా ఉంటుందని కంపెనీ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 5:59 am

'నేనున్నాను'.. అధైర్యపడకు: చిరుకు డీఎస్ భరోసా!

తాజా సంఘటనకు బాధపడకు. అధైర్యపడవద్దు. పొత్తు విడుపుకు పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నా. భవిష్యత్‌లో "స్నేహాస్తం" కలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అని చిరంజీవికి పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 5:58 am

అమెరికా, ఆసియా స్టాక్ మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ఫలితాలు వెలువడ్డాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 18 పాయింట్లు కోల్పోయి 9,772 వద్దకు చేరుకుంది. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ప్రకటనలు డౌ జోన్సను కష్టాల్లోకి నెట్టాయి. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 8 పాయింట్లు నష్టపోయి 2,057 వద్దకు చేరుకుంది. రైల్వే రోడ్డు హస్తగతం చేసుకోవడంపై వస్తున్న భిన్న కథనాలు నాస్‌డాక్‌ను నష్టాల్లోకి నెట్టాయి. ఆసియా స్టాక్ మార్కెట్లు లాభాల్లో పయనిస్తున్నాయి. హాంగ్ సెంగ్- 1.6 శాతంతో 347 పాయింట్లు బలపడి 21,587 వద్దకు చేరుకుంది. నిక్కీ- 14 పాయింట్లు పెరిగి 9,817 వద్దకు చేరుకుంది. సియోల్ కంపోజిట్- 1.5 శాతంతో 24 పాయింట్లు లాభఫడి 1,574 వద్దకు చేరుకుంది. షాంఘై- 20 పాయింట్లు లాభపడి 3,134 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 5:56 am

బాక్సర్ ఆత్మహత్యపై విచారణకు మంత్రి ఆదేశం

రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో అత్మహత్య చేసుకున్న మహిళా బాక్సర్ అమరావతి ఉదంతంపై విచాణకు ఆదేశిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖామంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 4 Nov 2009 | 5:46 am

నాలో సోనియా గాంధీ పోలికలున్నాయా..?: కత్రినా

ప్రేక్షకుల్లో ఎక్కువగా యువతరం ఉంటుంది. కాబట్టి నేటి ట్రెండ్‌కు తగ్గ హీరోయిన్‌గా తను నిలదొక్కుకున్నట్లే అని కత్రినా కైఫ్ అనుకుంటోంది. ప్రస్తుతం మల్టీఫ్లేక్ ఫాలోయింగ్ చిత్రాలే చేస్తుంది. పైసా వసూల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. రాజ్‌కుమార్ సంతోషి, ప్రకాష్ ఝా తీస్తున్న చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో కూడా తనకు ఆఫర్లు వస్తున్నా, పెద్దగా మనసుకు నచ్చలేదని చెప్పింది. మల్లీశ్వరి తర్వాత అలాంటి పాత్రలే వస్తుంటే రొటీన్ అని తిరస్కరించినట్లు చెప్పింది. ప్రకాష్ ఝా చిత్రంలో సోనియాగాంధీ పాత్ర పోషిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదని చెపుతోంది కత్రినా. తను భోపాల్ వెళ్లినపుడు చీరలో వెళ్లిందట. అక్కడివారు తనను చీరలో చూసి అలా అనుకున్నారనీ, నిజానికి తనలో సోనియా పోలికలు కన్పించవని చెబుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Nov 2009 | 4:32 am

రెక్కలుండవు... కానీ ఆకాశంలో ఎగురుతుంటా: త్రిష

యవ్వనంలో ఉన్న అమ్మాయికి ఎటువంటి కలలు వస్తాయి...? సహజంగా రాకుమారుడు లాంటి భర్త కావాలన్న కలలు వస్తాయి. కానీ త్రిషకు మాత్రం కళ్లు మూస్తే కొత్త కలలు వెంటాడుతున్నాయట. ఆ కలల సారాంశం కాస్త చెప్పవూ... అని కదిలిస్తే ఇలా చెప్పుకొచ్చింది. "ఆకాశం నుంచి దూకేసినట్లు తరచూ కల వస్తుంది. ఆకాశంలో నుంచి కిందికి దూకేటపుడు చాలా తేలికగా ఎగురుతూ ఉంటాను. ఎంతసేపటికీ భూమిపైకి రాలేను. భూమికి దూరంగా ఉన్నా కంగారు పడకూడదని అనిపిస్తుంది. అయితే ఒక్కోసారి పడిపోతానేమోనని భయమేస్తుంది. ఆ భయంతో గొంతు తడారి నాలుక పిడచ కట్టుక పోతుంది. భూమి సమీపించే కొద్దీ నాలో ఆందోళన బయలుదేరుతుంది. భూమ్మీద దబ్బున కింద పడిపోతానేమోనన్న భయం రెట్టింపవుతుంది. అంతే ఒక్కసారిగా మెలకువ వస్తుంది. లేచి చూద్దును కదా... మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎంచక్కా నిద్ర లాగించేస్తుంటారు. ఓహ్ ఇది కలా అని అనుకుంటాను. అయితే గొంతు తడారి నాలుక పిడచకట్టుక పోవడంతో ఓ చెంబుడు మంచినీళ్లు తాగి తిరిగి కళ్లు మూసుకుంటాను" అంటూ తనకు తరచూ వచ్చే కలను గురించి చెప్పింది త్రిష.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Nov 2009 | 4:07 am

'వందేమాతరం'పై నా సమక్షంలో తీర్మానం చేయలేదు: పీసీ

జాతీయ గేయం వందేమాతరాన్ని ఆలపించరాదని జమాయిత్ ఎ ఉలేమా హింద్ (జేఈయూ) తన సమక్షంలో ఎలాంటి తీర్మానం చేయలేదని కేంద్ర హోం మంత్రి పి.చిదంబరం స్పష్టం చేశారు.
Source: జాతీయ | 4 Nov 2009 | 2:28 am

విముక్తి ప్రాంతం అబూజ్‌మడ్‌కు ఎందుకింత ప్రచారం!

అబూజ్‌మడ్.. ఈ పేరు వింటేనే పలు రాష్ట్ర పోలీసు యంత్రాంగాలను హడల్. మావోయిస్టులకు కేంద్ర స్థావరం. ఇక్కడ తిష్టవేసిన నక్సలైట్లు బెంగాల్, ఛత్తీస్‌గడ్, ఒరిస్సా, జార్ఖండ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నారు. అందుకే ఈ ప్రాంతంపై కేంద్రం గురిపెట్టింది.
Source: జాతీయ | 4 Nov 2009 | 12:56 am

'నేనున్నాను'.. అధైర్యపడకు: చిరుకు డీఎస్ భరోసా!

తాజా సంఘటనకు బాధపడకు. అధైర్యపడవద్దు. పొత్తు విడుపుకు పూర్తిగా నేనే బాధ్యత వహిస్తున్నా. భవిష్యత్‌లో "స్నేహాస్తం" కలిపేందుకు శాయశక్తులా కృషి చేస్తాను అని చిరంజీవికి పీసీసీ చీఫ్ డి.శ్రీనివాస్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 12:29 am

బాక్సర్ ఆత్మహత్యపై విచారణకు మంత్రి ఆదేశం

రాష్ట్ర రాజధానిలోని ఎల్బీ స్టేడియంలో అత్మహత్య చేసుకున్న మహిళా బాక్సర్ అమరావతి ఉదంతంపై విచాణకు ఆదేశిస్తున్నట్టు రాష్ట్ర క్రీడాశాఖామంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 12:16 am

కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలతో లాభం: తెదేపా

కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలే తమకు మేలు చేస్తుందని తెలుగుదేశం పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మహేందర్ రెడ్డి అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రంగారెడ్డి జిల్లా పరిధిలోని 45 డివిజన్లకు అభ్యర్థులను ఖరారు చేశామన్నారు.
Source: ఏపీ న్యూస్ | 4 Nov 2009 | 12:04 am

నేషనల్ డిఫెన్స్ కాలేజ్‌పై దాడికి లష్కర్ కుట్ర: ఎఫ్‌బీఐ

దేశంలోని జాతీయ సైనిక కళాశాల (నేషనల్ డిఫెన్స్ కాలేజ్)పై తీవ్రవాద సంస్థ లష్కర్ తోయిబా కుట్ర పన్నినట్టు అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) వెల్లడించింది. ఇందుకోసం లష్కర్ తోయిబా నేతలు వ్యూహం పన్నారని తెలిపింది.
Source: జాతీయ | 3 Nov 2009 | 11:44 pm

రోశయ్య... జగన్‌లతో పోటాపోటీగా నేతల భేటీ!

ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవించి ఉన్న సమయంలో ఆయనకు వ్యతిరేకులుగా ముద్రపడిన వారందరూ ముఖ్యమంత్రి రోశయ్యకు సన్నిహితంగా మెలిగేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. అలాగే వైఎస్ అనుచర వర్గంగా గుర్తింపు పొందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు వైఎస్.జగన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 11:19 pm

దురుద్దేశ పూరితంగానే అసత్య ప్రచారం: కేకే

తనపై దురుద్దేశ పూరితంగానే అసత్య ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు మండిపడ్డారు. ప్రస్తుతం జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా ఆయన వ్యవహరిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 11:08 pm

కమలనాథులను కుదుపుతున్న "గాలి" సంక్షోభం!

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పను భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఢిల్లీకి రావాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆయన బుధవారం హుటాహుటిన హస్తినకు బయలుదేరి వెళ్లారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 10:45 pm

మత విద్వేషాల వల్లే బాబ్రీ కూల్చివేత: మంత్రి చిదంబరం

మత విద్వేషాల వల్లే బాబ్రీ మసీదును ఓ వర్గం కూల్చి వేసిందని కేంద్ర హోంమంత్రి పి.చిదంబరం అభిప్రాయపడ్డారు. మనం చేపట్టే చర్య మతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా ఉండరాదని, దీనికి ప్రతి పౌరుడు బాధ్యత తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 8:30 pm

నక్సల్స్ ఏరివేత ఆపరేషన్ "గ్రీన్‌హంట్‌" ప్రారంభం!

దేశ అంతర్గత భద్రతకు పెనుముప్పుగా పరిణమించిన మావోయిస్టులను ఏరివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రీన్‌హంట్ ఆపరేషన్ కౌంట్‌డౌన్ ఆరంభమైంది. మావోయిస్టులకు కేంద్ర స్థావరంగా ఉన్న అబూజ్‌మడ్‌పై పట్టు సాధించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.
Source: జాతీయ | 3 Nov 2009 | 8:21 pm

సంధ్య "హాసిని" 90 శాతం పూర్తి

అభి ఫేమ్ కమలాకర్ హీరోగా సంధ్య హీరోయిన్‌గా నటిస్తోన్న తాజా చిత్రం హాసిని 90 శాతం షూటింగ్ పూర్తయిందని చిత్ర దర్శకుడు బి.వి. రమణారెడ్డి తెలియజేశారు. మంగళవారంనాడు చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ, "చిన్నపెద్దా అందరినీ గిలిగింతలు పెట్టేట్లుగా పూర్తిస్థాయి హాస్యభరితంగా చిత్రాన్ని తీర్చిదిద్దాం. ఇప్పటికి 90 శాతం షూటింగ్ పూర్తయింది. ఇంకా మూడు పాటలను చిత్రీకరించాల్సి ఉంది. ఒక పాటను ఈ నెల 10 నుంచి ఊటీలో చిత్రీకరిస్తాం. మిగిలిన 2 పాటలను ఈ నెలాఖరులోగా విదేశాల్లో తీస్తాం. డిసెంబరులో సినిమాను విడుదల చేస్తామ"ని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 1:14 pm

"ఏక్ నిరంజన్" పైరసీ సీడీల పట్టివేత

ప్రభాస్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో ఆదిత్యరామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యరామ్ నిర్మించిన "ఏక్ నిరంజన్" అక్టోబరు 29న 350కి పైగా ప్రింట్లతో 700కి పైగా థియేటర్లలో విడుదలైంది. ఐతే ఈ చిత్రాన్ని కొందరు వీడియో పైరసీ చేయడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం వచ్చంది. దీంతో ఆదిత్యారామ్ కార్యాలయంలో వీడియో పైరసీని అరికట్టడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం రాష్ట్రమంతా రైడ్ చేసి వరంగల్, కడప, హైదరాబాద్, అవనిగడ్డలలో "ఏక్ నిరంజన్" పైరసీ సీడీలను పట్టుకొని పైరసీకి పాల్పడిన నిందితులను అరెస్టు చేయించారు. ప్రింట్లపై ఉన్న స్పెషల్ కోడ్స్ ద్వారా పైరసీ ఏ ప్రింటు నుండి జరిగిందో తేలిగా కనుక్కోవచ్చు కనుక పైరసీదారులను వెంటనే పట్టుకుని శిక్షించడానికి చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 10:18 am

నటుడు శివాజీ చిత్రం తాజ్‌మహల్ ఆడియో విడుదల

కన్నడ చిత్రమైన తాజ్‌మహల్‌ను తెలుగులో అదే పేరుతో నటుడు శివాజీ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ఆడియో విడుదల సోమవారం రాత్రి రామానాయుడు స్టూడియోలో జరిగింది. ముఖ్య అతిథి దాసరి నారాయణరావు ఆడియో సీడీని విడుదల చేసి హీరో శ్రీకాంత్‌కు అందించారు. నటి భూమిక క్యాసెట్‌ను విడుదల చేశారు. దాసరి మాట్లాడుతూ... "నటులకు స్వంత సంస్థ ఉండాలి. అప్పుడే తమకు నచ్చిన కథలను సినిమాగా రూపొందిస్తారు. శివాజీ తనకంటూ ఓ స్టైల్ ఏర్పరుచుకుని మళ్లీ రూటు మార్చాడు. మళ్లీ ఇప్పుడు తన రూటులోకి వచ్చాడు. నిర్మాతగా కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అన్నారు. శ్రీకాంత్ మాట్లాడుతూ... "14 ఏళ్ల క్రితం తాజ్‌మహల్ పేరుతో సినిమా చేశాను. ఆ చిత్రం నాకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ప్రస్తుతం శివాజీ నిర్మిస్తున్న చిత్రం కూడా అంతపేరు తెస్తుందని ఆశిస్తున్నాను" అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 9:56 am

యడ్యూరప్ప సీఎంగా కొనసాగే ఛాన్సే లేదు

కర్నాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప కొనసాగుతారని భాజపా కేంద్ర అధినాయకత్వం చెపుతుంటే ఆ రాష్ట్ర రెవిన్యూమంత్రి అసమ్మతి నేత గాలి కరుణాకర్ రెడ్డి ఆయన సోదరులు మాత్రం తమకు ఆ విషయం తెలియదంటున్నారు. అసలు రాజ్‌నాథ్ తమతో అలా చెప్పలేదని విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 8:13 am

గ్రేటర్ ఎన్నికల్లో ఒంటరి పోరే: తేల్చి చెప్పిన ప్రరాపా

త్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నట్టు ప్రజారాజ్యం పార్టీ తేల్చిచెప్పింది. అలాగే, ప్రరాపాను కాంగ్రెస్‌లో విలీనం చేయాలంటూ మంత్రి రఘువీరా రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రరాపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 6:11 am

సైఫ్- కరీనా లండన్ నగరంలో వారం రోజులు

సైఫ్ అలీ ఖాన్, సెక్సీతార కరీనాకపూర్ ఓ వారంరోజులపాటు లండన్, న్యూయార్క్ నగరాల్లో గడిపారు. ఎందుకలా...? అని ఎవరైనా అడిగితే తమ తదుపరి చిత్రం ప్రమోషన్లో భాగంగానే తాము వారంరోజుల పాటు ఇక్కడకు వచ్చినట్లు చెపుతున్నారట. అయితే అది నిజం కాదనీ, సైఫ్- బిబోలిద్దరికీ ఏకాంత ప్రదేశం దొరకక ముంబయి నుంచి కొన్నాళ్లు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లారని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. అయితే ముంబయిలో కూడా వారికంటూ ప్రత్యేకమైన బంగళాను ఏర్పాటు చేసుకున్నట్లు భోగట్టా. లండన్, న్యూయార్క్ నగరాల నుంచి తిరిగి వచ్చాక మరో నెలరోజులపాటు కాల్షీట్లు ఎవరికీ ఇవ్వనని చెపుతోందట కరీనాకపూర్. ఎందుకలా...?
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 5:48 am

ఈనెల 5వ తేదీన కాంగ్రెస్ గ్రేటర్ అభ్యర్థుల జాబితా!

వచ్చే ఐదో తేదీన కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను విడుదల చేయనున్నట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖామంత్రి దానం నాగేందర్ తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వ్యూహం, అభ్యర్థుల ఖరారుపై చర్చించేందుకు దానం మంగళవారం ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్‌తో సమావేశయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 5:08 am

గ్రేటర్ పొత్తు ఎఫెక్టు: రెంటికీ చెడ్డ రేవడిగా ప్రజారాజ్యం

అధికార కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల పొత్తు పెటాకులైంది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపి యుగళగీతం ఆలపించాలన్న కలలు కలగానే మిగిలి పోయింది. ఈ రెండు పార్టీలు ఏక తాటిపై నడవాలని రోజే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు భగ్గుమన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 5:03 am

తెలుగు వెండితెరపై కొలంబియా వారి "ది గ్రడ్జ్"

అత్యున్నత సాంకేతిక విలువలతో కొలంబియా పిక్చర్స్ నిర్మించిన హార్రర్ మూవీ "ది గ్రడ్జ్". ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన "స్పైడర్ మేన్" చిత్రానికి దర్శకత్వం వహించిన సరా మైఖేల్ గిల్లార్ ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. హార్రర్ పిక్చర్స్‌లోనే ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చి అందరి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అమెరికాలో 110 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని విక్టరీ ఫిలిమ్స్ టి.దుర్గారావు సమర్పణలో "ది గ్రడ్జ్ క్షుద్రనిలయం" పేరుతో ఆర్.ప్రసాద్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 54 ప్రింట్లతో నవంబర్ మూడోవారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 4:38 am

గ్రేటర్ సమరం: సీపీఎంకు గాలం వేస్తున్న తెదేపా

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. కాంగ్రెస్-ప్రజారాజ్యం పార్టీల మధ్య చర్చకు వచ్చిన పొత్తు అంశానికి ఆదిలోనే బ్రేక్ పడింది. తాజాగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వామపక్ష పార్టీ అయిన సీపీఎంతో పొత్తుకు అర్రులు చాస్తోంది.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 4:12 am

బయట నుంచి మద్దతుకు సిద్ధం: ఎన్సీపీ నేత భుజ్‌బల్

మహారాష్ట్రలో కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటయ్యే ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇస్తామని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నేత, ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి చగన్ భుజ్‌బల్ తెలిపారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 3:47 am

ముంబై తరహా దాడులు జరగవచ్చు: ఆర్మీ చీఫ్

దేశంలో ముంబై తరహా దాడులు మరిన్ని జరగవచ్చని దేశ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 2:15 am

వైఎస్.జగన్‌తో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 1:47 am