స్టాక్ మార్కెట్: 400 పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్

ముంబై స్టాక్ మార్కెట్‌ భారీగా నష్టాన్ని చవిసూచింది. మూడు రోజుల విరామం తర్వాత మంగళవారం తిరిగి ప్రారంభమైన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ సూచీ ఆరంభంలో 20 పాయింట్లు మాత్రమే కోల్పోయింది. మధ్యాహ్నం ట్రేడింగ్‌లో 27 పాయింట్ల వృద్ధిని చవి చూసింది.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 8:30 am

గ్రేటర్ పొత్తు ఎఫెక్టు: రెంటికీ చెడ్డ రేవడిగా ప్రజారాజ్యం

అధికార కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల పొత్తు పెటాకులైంది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపి యుగళగీతం ఆలపించాలన్న కలలు కలగానే మిగిలి పోయింది. ఈ రెండు పార్టీలు ఏక తాటిపై నడవాలని రోజే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు భగ్గుమన్నాయి.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 8:19 am

ముంబై తరహా దాడులు జరగవచ్చు: ఆర్మీ చీఫ్

దేశంలో ముంబై తరహా దాడులు మరిన్ని జరగవచ్చని దేశ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 7:44 am

ఆర్థిక వృద్ధి 8 శాతానికి చేరుకోవచ్చు: ప్రణాళికా సంఘం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరాంతానికి ఆర్థిక వృద్ధి 6.3 శాతానికి చేరుకుంటుందని, అదే వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి చెంది 8 శాతానికి ఎగబాకుతుందని ప్రణాళికా సంఘం తాజా నివేదికలో పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 7:27 am

వైఎస్.జగన్‌తో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 7:08 am

ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి అరెస్టుపై హైకోర్టు స్టే

దేవరకద్ర నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి అరెస్టుపై రాష్ట్ర హైకోర్టు మంగళారం స్టే విధించింది. ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్న విషయ తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 7:02 am

స్టాక్ మార్కెట్: మళ్లీ నష్టాల్లోకి సెన్సెక్స్

స్టాక్ మార్కెట్ మళ్లీ నష్టాల్లోకి జారుకుంది. మంగళవారం ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ మధ్యాహ్నం 12 గంటల సమయంలో 18 పాయింట్ల మేరకు వృద్ధి చెందిన సెన్సెక్, మరో గంట వ్యవధిలో 75 పాయింట్ల మేరకు నష్టపోయింది. ఫలితంగా సెన్సెక్స్ సూచీ 15820 వద్ద ట్రేడింగ్ సాగుతోంది.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 6:55 am

కంగ్రాచ్యులేషన్స్ కర్జాయ్ ! : ఒబామా

అధ్యక్ష ఎన్నికలలో గెలుపొందిన హమీద్ కర్జాయ్‌కు అమెరికా అధ్యక్షుడు ఒబామా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రెండవసారి అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక దేశంలో కొత్త అధ్యాయానికి నాంది పలికారని, అవినీతితో పోరాడాలని ఒబామా సూచించారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 6:32 am

ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్న ఐసీఐసీఐ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి వచ్చిన నికర ఆదాయం వృద్ధి జరగడంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తమ సంస్థలోని ఉద్యోగులకు బోనస్ ఇస్తామని ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ చందా కోచర్ వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 6:17 am

కొనసాగుతున్న మహా సంక్షోభం: గవర్నర్‌తో చవాన్ భేటీ!

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ సీఎల్పీ నేత అశోక్ చవాన్ ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్సీ.జమీర్‌తో భేటీ అయ్యారు. ఆయనతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభ అంశంపై చర్చలు జరిపారు.
Source: Yahoo! Telugu: News | 3 Nov 2009 | 5:58 am

సైఫ్- కరీనా లండన్ నగరంలో వారం రోజులు

సైఫ్ అలీ ఖాన్, సెక్సీతార కరీనాకపూర్ ఓ వారంరోజులపాటు లండన్, న్యూయార్క్ నగరాల్లో గడిపారు. ఎందుకలా...? అని ఎవరైనా అడిగితే తమ తదుపరి చిత్రం ప్రమోషన్లో భాగంగానే తాము వారంరోజుల పాటు ఇక్కడకు వచ్చినట్లు చెపుతున్నారట. అయితే అది నిజం కాదనీ, సైఫ్- బిబోలిద్దరికీ ఏకాంత ప్రదేశం దొరకక ముంబయి నుంచి కొన్నాళ్లు విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకుని వెళ్లారని బాలీవుడ్ సినీజనం అంటున్నారు. అయితే ముంబయిలో కూడా వారికంటూ ప్రత్యేకమైన బంగళాను ఏర్పాటు చేసుకున్నట్లు భోగట్టా. లండన్, న్యూయార్క్ నగరాల నుంచి తిరిగి వచ్చాక మరో నెలరోజులపాటు కాల్షీట్లు ఎవరికీ ఇవ్వనని చెపుతోందట కరీనాకపూర్. ఎందుకలా...?
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 5:48 am

తెలుగు వెండితెరపై కొలంబియా వారి "ది గ్రడ్జ్"

అత్యున్నత సాంకేతిక విలువలతో కొలంబియా పిక్చర్స్ నిర్మించిన హార్రర్ మూవీ "ది గ్రడ్జ్". ప్రపంచవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన "స్పైడర్ మేన్" చిత్రానికి దర్శకత్వం వహించిన సరా మైఖేల్ గిల్లార్ ఈ చిత్రాన్ని రూపొందించడం విశేషం. హార్రర్ పిక్చర్స్‌లోనే ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చి అందరి ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం అమెరికాలో 110 మిలియన్ డాలర్లను వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ చిత్రాన్ని విక్టరీ ఫిలిమ్స్ టి.దుర్గారావు సమర్పణలో "ది గ్రడ్జ్ క్షుద్రనిలయం" పేరుతో ఆర్.ప్రసాద్ రాజు తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 54 ప్రింట్లతో నవంబర్ మూడోవారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 3 Nov 2009 | 4:38 am

గ్రేటర్ పొత్తు ఎఫెక్టు: రెంటికీ చెడ్డ రేవడిగా ప్రజారాజ్యం

అధికార కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల పొత్తు పెటాకులైంది. ఈ రెండు పార్టీలు చేతులు కలిపి యుగళగీతం ఆలపించాలన్న కలలు కలగానే మిగిలి పోయింది. ఈ రెండు పార్టీలు ఏక తాటిపై నడవాలని రోజే కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు భగ్గుమన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 2:50 am

ముంబై తరహా దాడులు జరగవచ్చు: ఆర్మీ చీఫ్

దేశంలో ముంబై తరహా దాడులు మరిన్ని జరగవచ్చని దేశ ఆర్మీ చీఫ్ జనరల్ దీపక్ కపూర్ అభిప్రాయపడ్డారు. ఇలాంటి దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు దేశం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 2:15 am

వైఎస్.జగన్‌తో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల భేటీ!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డితో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ఎన్నికల ప్రచారం తదితర అంశాలపై వీరు చర్చించినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 1:47 am

ఎమ్మెల్యే సీతాదయాకర్‌రెడ్డి అరెస్టుపై హైకోర్టు స్టే

దేవరకద్ర నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి అరెస్టుపై రాష్ట్ర హైకోర్టు మంగళారం స్టే విధించింది. ప్రస్తుతం ఆమె అజ్ఞాతంలో ఉన్న విషయ తెల్సిందే.
Source: ఏపీ న్యూస్ | 3 Nov 2009 | 1:46 am

కొనసాగుతున్న మహా సంక్షోభం: గవర్నర్‌తో చవాన్ భేటీ!

మహారాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటు గడువు మంగళవారం సాయంత్రంతో ముగియనుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్ సీఎల్పీ నేత అశోక్ చవాన్ ఆ రాష్ట్ర గవర్నర్ ఎస్సీ.జమీర్‌తో భేటీ అయ్యారు. ఆయనతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సంక్షోభ అంశంపై చర్చలు జరిపారు.
Source: జాతీయ | 3 Nov 2009 | 12:30 am

స్వైన్ ఫ్లూ మహమ్మారి: పూణెలో మృతులు 97

స్వైన్ ఫ్లూ మహమ్మారి దేశ వ్యాప్తంగా తగ్గుముఖం పడుతున్నా పూణెలో మాత్రం రోజురోజుకూ మరింతగా ప్రబలుతోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతోంది. తాజాగా 29 సంవత్సరాల వ్యక్తి స్వైన్ ఫ్లూతో మరణించినట్టు స్థానిక వైద్య అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 11:29 pm

చివరి క్షణాల్లో మౌనంగా సేదతీరిన వైఎస్: నివేదిక

జనహృదయ నేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తన చివరి క్షణాల్లోనూ సేదతీరుతూ, మౌనంగానే తిరిగి రానిలోకాలకు చేరుకున్నట్టు సమాచారం. ఆయన ప్రయాణించిన హెలికాప్టర్ ప్రమాదానికి లోనయ్యే ముందు ఎలాంటి హెచ్చరికులు లేకుండానే పావురాల గుట్టను ఢీకొంది.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 11:29 pm

ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దుల్లో మావోల సమస్య: డీజీపీ

ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల బెడద ఉన్నట్టు రాష్ట్ర డీజీపీ గిరీష్ కుమార్ అంగీకరించారు. అందువల్ల సరిహద్దు జిల్లాల పోలీసు యంత్రాంగాలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 10:35 pm

20 మంది సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడి

ఎన్నో వివాదాల అనంతరం ఎట్టకేలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన 20 మంది న్యాయమూర్తులు తమ ఆస్తుల వివరాలను బహిరంగ పరిచారు. వీరిలో ప్రధాన న్యాయమూర్తి కేజీ.బాలకృష్ణన్‌ కూడా ఉన్నారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 9:33 pm

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పే: రాజ్‌నాథ్ సింగ్

కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పను మార్చే ప్రసక్తే లేదని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ తెగేసి చెప్పారు. దీంతో కన్నడ రాష్ట్రంలో అసమ్మతి సెగలు మరింత వేడెక్కాయి. అయితే అసమ్మతి ఎమ్మెల్యేలు, ఎంపిలతో చర్చలు కొనసాగుతాయని వెల్లడించారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 8:50 pm

"కళావర్ కింగ్"లో శ్వేతాబసు ప్రసాద్

పేకాటలో కళావర్ కింగ్ కోసం ఎదురుచూస్తుంటారు. పేక ముక్కల్లో దానికే అగ్రస్థానం. నిజజీవితంలో ఓ వ్యక్తికూడా అలాంటివాడే. అతను తన చుట్టుప్రక్కల ఉన్నవారికోసం ఏం చేశాడు? తనకోసం ఏం చేసుకున్నాడు? అనే కథాంశంతో కళావర్ కింగ్ చిత్రం రూపొందుతోంది. శ్వేతాబసు ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ఎల్ సురేష్ దర్శకుడు. సోమవారంనాడు ఈ చిత్ర టైటిల్‌ను ఖరారు చేశారు. నిఖిల్ మాట్లాడుతూ... రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తయింది. రాజమండ్రి, హైదరాబాదులలో వాటి చిత్రీకరణ జరుగుతుంది. త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Nov 2009 | 10:10 am

అల్లు అర్జున్ "ఆర్య-2" ఆడియో విడుదల

అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆర్య-2 చిత్రం ఆడియో విడుదల ఆదివారం రాత్రి శిల్పకళా వేదికలో జరిగింది. ఇందులో నవదీప్, శ్రద్దాదాస్ మరో జంట నటిస్తున్నారు. భోగవల్లి ప్రసాద్, ఆదిత్యబాబు ఈ చిత్రానికి నిర్మాతలు. ఈ కార్యక్రమంలో విశేషమేమిటంటే... ఆర్య-2 చిత్రంలోని పాటలకు డాన్సర్లు డాన్స్ చేయడం. ఒక్కో పాటను ఒక్కొక్కరు విడుదల చేశారు. దిల్ రాజు, మాగంటి బాబు, శ్రీను వైట్ల, వరుణ్ సందేశ్, ఆర్యన్ రాజేష్, మెహర్ రమేష్ తలోపాటను విడుదల చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Nov 2009 | 9:46 am

ప్రత్యేక పోలీసు అధికారిణిగా రుక్సానా కౌసర్

లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఉగ్రవాదిని మహర్నవమినాడు హతమార్చిన తర్వాత వార్తల్లో ఆధునిక దుర్గగా నిలిచిన కాశ్మీరీ వీర వనిత రుక్సానా కౌసర్ ప్రత్యేక పోలీసు అధికారిణి (ఎస్‌‌పీఓ)గా జమ్మూ-కాశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. రజౌరీ జిల్లా ఎస్‌పీఓగా రుక్సానా కౌసర్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిందని రజౌరీ జిల్లా సీనియర్ ఎస్‌పీ షఫ్‌కత్ వట్టాలీ విలేకరులకు తెలిపారు
Source: జాతీయ | 2 Nov 2009 | 7:25 am

చిరంజీవికి సిగ్గు లేదా...?: జీవిత-రాజశేఖర్

కాంగ్రెస్- ప్రరాపా గ్రేటర్ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంపై జీవితా- రాజశేఖర్ దంపతులు మండిపడ్డారు. ఓ ప్రైవేటు ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 7:25 am

తమన్నా... నాతో నటిస్తావా...?: షారుక్ ఖాన్

గజినీ హీరోయిన్ అసిన్‌ను తన తదుపరి చిత్రంలో నటించాల్సిందిగా షారుక్ ఖాన్ అడిగితే ఆమె అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో షారుక్ అసిన్‌ పేరెత్తితే పళ్లు నూరుతున్నాడట. ఆమెకు పోటీగా తమిళంలో నటిస్తున్న ఓ అందాల తారను తన తదుపరి చిత్రంలో నటింపజేయడానికి అనేక రకాలుగా యత్నాలు చేస్తున్నాడట. ఇందులో భాగంగా షారుక్ తన బ్లాగులో తన సరసన నటించేందుకు ఆసక్తిగల తమిళ హీరోయిన్లు సంప్రదించగలరు అని బహిరంగంగా ప్రకటన ఇచ్చేశాడట. ఇదిలావుంటే షారుక్ సరసన తెల్లపిల్ల తమన్నా అయితే సూపర్‌గా ఉంటుందని ఎవరో చెప్పారట. ఆ వార్త.. అలా.. అలా తమన్నా చెవికి చేరడంతో, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మేఘాలలో తేలిపోతోందట. కోలీవుడ్ కోవాగా పేరుతెచ్చుకున్న తమన్నా, తన అందంతో శ్రేయ, అసిన్‌లను కోలీవుడ్ నుంచి తరిమికొట్టిందన్న వార్తలున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తమ బూట్లలో కాళ్లు పెడుతుందేమోనని శ్రేయ, అసిన్, త్రిష ఆందోళన పడుతున్నట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Nov 2009 | 6:51 am

వారిద్దరిని బట్టలూడదీసి కొట్టడం ఖాయం: వాసిరెడ్డి పద్మ

సినీ నటులైన రాజశేఖర్, జీవిత దంపతులను తమ పార్టీ కార్యకర్తలు బట్టలూడదీసి కొట్టడం ఖాయమని ప్రజారాజ్యం పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. తమ పార్టీ అధినేత చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు, స్థాయి వారికెక్కడదని ఆమె దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 5:42 am

మరాఠీలో ప్రమాణ స్వీకారం: రాజ్‌థాక్రే హెచ్చరిక

మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాక్రే కొత్త ఎమ్మెల్యేలకు హెచ్చరిక చేశాడు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన సభ్యులందరూ మరాఠీలో ప్రమాణ స్వీకారం చేయాలని హుకుం జారీ చేశారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 5:23 am

ప్రజారాజ్యంతో పొత్తు ప్రస్తావన లేదు: వీరప్ప మొయిలీ

ప్రజారాజ్యంతో పొత్తు ప్రస్తావనే రాలేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్, కేంద్రమంత్రి వీరప్ప మొయిలీ తేల్చి చెప్పారు. ప్రధానంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి ఎలాంటి పొత్తు చర్చలు సాగలేదని ఆయన సోమవారం ఢిల్లీలో స్పష్టం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 4:58 am

డిశెంబరులో "పవర్ స్టార్" సినిమా ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువదర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో బడే రవి సమర్పణలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 కి పక్కాగా స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ, "పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో ఓ మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేశాం. పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు. గతంలో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ చేసిన యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో ఓ సెన్సేషనల్ హిట్ చిత్రానికి కెమేరామెన్‌గా వర్క్ చేసిన టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ నిర్వహిస్తారు. ఓ ప్రముఖ ఫైట్ మాస్టర్ పవన్ కల్యాణ్‍తో ఫస్ట్‌టైమ్ చేయబోతున్నారు." అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Nov 2009 | 4:32 am

మధ్యప్రదేశ్ మంత్రివర్గ విస్తరణ: ఉమాశంకర్‌కు హోం

మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదివారం రాత్రి విస్తరించారు. రాష్ట్ర హోం మంత్రిశాఖ బాధ్యలను ఉమశంకర్‌ గుప్తాకు అప్పగించారు. ఈయన దక్షిణ భోపాల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 4:11 am

పీఆర్పీతో పొత్తు పెట్టుకుంటే.. టీడీపీకి మద్దతిస్తాం: రాజశేఖర్

ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని సినీ నటుడు రాజశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు పీఆర్పీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే.. జరిగిన అన్ని విషయాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ సంయమనం పాటించారని.. ఇలాంటి సమయంలో జగన్ నోరు విప్పాల్సిన అవసరం ఉందని రాజశేఖర్ కోరారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 3:32 am

వైఎస్సార్ ఉన్నపుడే ప్రరాపాతో పొత్తు చర్చ: జేసీ

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించివున్నపుడే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై చర్చకు వచ్చిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రరాపా పొత్తుపై ఆయన సోమవారం స్పందనను వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 3:00 am

మలుపులు తిరుగుతున్న కర్ణాటక "గాలి" రాజకీయం

కర్ణాటక రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. నాయకత్వ మార్పిడి జరిగి తీరాల్సిందేనని గాలి బ్రదర్స్ పట్టుబట్టారు. మొన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన వీరిద్దరు ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 2:58 am