మలుపులు తిరుగుతున్న కర్ణాటక "గాలి" రాజకీయం

కర్ణాటక రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. నాయకత్వ మార్పిడి జరిగి తీరాల్సిందేనని గాలి బ్రదర్స్ పట్టుబట్టారు. మొన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన వీరిద్దరు ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 8:27 am

వైఎస్సార్ ఉన్నపుడే ప్రరాపాతో పొత్తు చర్చ: జేసీ

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించివున్నపుడే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై చర్చకు వచ్చిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రరాపా పొత్తుపై ఆయన సోమవారం స్పందనను వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 8:14 am

అమ్మకాల్లో 32 శాతం వృద్ధి సాధించిన మారుతి

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం తొలి నెల అక్టోబర్‌లో మారుతి కార్ల అమ్మకాలలో 32.45 శాతం వృద్ధి జరిగి 85,415 వాహనాలు అమ్ముడైనట్లు మారుతి కంపెనీ తెలిపింది. అదే నిరుడు ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం తొలి నెల అక్టోబర్ నెలలో జరిగిన అమ్మకాలతో పోలిస్తే 32.45 శాతం వృద్ధి జరిగిందని కంపెనీ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 7:28 am

పీఆర్పీతో పొత్తు పెట్టుకుంటే.. టీడీపీకి మద్దతిస్తాం: రాజశేఖర్

ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని సినీ నటుడు రాజశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు పీఆర్పీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే.. జరిగిన అన్ని విషయాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ సంయమనం పాటించారని.. ఇలాంటి సమయంలో జగన్ నోరు విప్పాల్సిన అవసరం ఉందని రాజశేఖర్ కోరారు.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 7:14 am

చిరంజీవికి సిగ్గు లేదా...?: జీవిత-రాజశేఖర్

కాంగ్రెస్- ప్రరాపా గ్రేటర్ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంపై జీవితా- రాజశేఖర్ దంపతులు మండిపడ్డారు. ఓ ప్రైవేటు ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 7:08 am

భారత్, పాక్ ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాడాలి: ఖురేషీ

ఉగ్రవాదంపై పోరాడేందుకు భారత్, పాక్ సంయుక్తంగా కలిసి పోరాడాలని పాకిస్థాన్ విదేశాంగ శాఖామంత్రి షా మెహమూద్ ఖురేషీ అన్నారు.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 6:55 am

తమన్నా... నాతో నటిస్తావా...?: షారుక్ ఖాన్

గజినీ హీరోయిన్ అసిన్‌ను తన తదుపరి చిత్రంలో నటించాల్సిందిగా షారుక్ ఖాన్ అడిగితే ఆమె అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో షారుక్ అసిన్‌ పేరెత్తితే పళ్లు నూరుతున్నాడట. ఆమెకు పోటీగా తమిళంలో నటిస్తున్న ఓ అందాల తారను తన తదుపరి చిత్రంలో నటింపజేయడానికి అనేక రకాలుగా యత్నాలు చేస్తున్నాడట. ఇందులో భాగంగా షారుక్ తన బ్లాగులో తన సరసన నటించేందుకు ఆసక్తిగల తమిళ హీరోయిన్లు సంప్రదించగలరు అని బహిరంగంగా ప్రకటన ఇచ్చేశాడట. ఇదిలావుంటే షారుక్ సరసన తెల్లపిల్ల తమన్నా అయితే సూపర్‌గా ఉంటుందని ఎవరో చెప్పారట. ఆ వార్త.. అలా.. అలా తమన్నా చెవికి చేరడంతో, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మేఘాలలో తేలిపోతోందట. కోలీవుడ్ కోవాగా పేరుతెచ్చుకున్న తమన్నా, తన అందంతో శ్రేయ, అసిన్‌లను కోలీవుడ్ నుంచి తరిమికొట్టిందన్న వార్తలున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తమ బూట్లలో కాళ్లు పెడుతుందేమోనని శ్రేయ, అసిన్, త్రిష ఆందోళన పడుతున్నట్లు భోగట్టా.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Nov 2009 | 6:51 am

జాబ్స్: పోలీసు శాఖలో 6,718 ఉద్యోగాలు

ఢిల్లీ పోలీసు శాఖలో 6,718 కానిస్టెబుల్ ఉద్యోగుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఈ క్రింద ఇవ్వబడింది. ఎగ్జిక్యూటివ్ కానిస్టేబుల్.. మొత్తం 6,302 ఖాళీలున్నాయి. ఇందులో ఎస్సీలకు.. 945, ఎస్టీలకు.. 473, ఓబీసీలకు.. 1,702, జనరల్ కేటగిరీలకు.. 3,182 ఉన్నాయి. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగి ఉండాలి. పురుషుల మాత్రమే అర్హులు. 2009, జూలై 1వ తేదీ నాటికి...
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 6:34 am

అమ్మకాల్లో వృద్ధి సాధించిన జనరల్ మోటార్స్

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తృతీయ త్రైమాసికం ప్రారంభపు నెల అక్టోబర్‌లో తమ సంస్థకు చెందిన 7413 వాహనాలు అమ్ముడైనాయని ఇది నిరుడు ఆర్థిక సంవత్సరం అక్టోబర్ నెలలో 6465 వాహనాలు అమ్మడైనట్లు జనరల్ మోటార్స్ కంపెనీ సోమవారం న్యూ ఢిల్లీలో వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 6:07 am

కాంగ్రెస్-ప్రరాపా పొత్తు : వ్యతిరేకిస్తున్న జగన్ వర్గం!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 5:52 am

నష్టాల్లో ఆసియా స్టాక్ మార్కెట్లు

బ్యాంకింగ్ యేతర స్టాకులు లాభాల్లో నడిచినప్పటికీ.. ఆసియా మార్కెట్లు నష్టాల్లో నడుస్తున్నాయి. హాంగ్ సెంగ్- 1.7 శాతంతో 376 పాయింట్లు నష్టపోయి 21,378 వద్దకు చేరుకుంది. నిక్కీ- 2.7 శాతంతో 272 పాయింట్లు బలహీనపడి 9,763 వద్దకు చేరుకుంది. మూడు నెలల కనిష్ఠ స్థాయి. సియోల్ కంపోజిట్- 13 పాయింట్లు కోల్పోయి 1,567 వద్దకు చేరుకుంది. షాంఘై కంపోజిట్- 15 పాయింట్లు లాభపడి 3,010 వద్దకు చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 2 Nov 2009 | 5:41 am

డిశెంబరులో "పవర్ స్టార్" సినిమా ప్రారంభం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా యువదర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో బడే రవి సమర్పణలో నటుడు గణేష్ బాబు పరమేశ్వర ఆర్ట్స్ పతాకంపై నిర్మిస్తున్న ప్రొడక్షన్ నెం.3 కి పక్కాగా స్క్రిప్ట్ రెడీ అయింది. ఈ చిత్రం గురించి నిర్మాత గణేష్ బాబు మాట్లాడుతూ, "పవర్‌ స్టార్ పవన్ కల్యాణ్ హరీష్ శంకర్‌ల కాంబినేషన్‌లో ఓ మంచి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించడానికి ప్లాన్ చేశాం. పవన్ కల్యాణ్ సరసన ఇద్దరు ప్రముఖ హీరోయిన్లు నటిస్తారు. గతంలో పవన్ కల్యాణ్ సూపర్ హిట్ చిత్రానికి మ్యూజిక్ చేసిన యువ సంగీత దర్శకుడు ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తారు. అలాగే ఇటీవల బాలీవుడ్‌లో ఓ సెన్సేషనల్ హిట్ చిత్రానికి కెమేరామెన్‌గా వర్క్ చేసిన టాప్ టెక్నీషియన్ ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ నిర్వహిస్తారు. ఓ ప్రముఖ ఫైట్ మాస్టర్ పవన్ కల్యాణ్‍తో ఫస్ట్‌టైమ్ చేయబోతున్నారు." అని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 2 Nov 2009 | 4:32 am

వైఎస్సార్ ఉన్నపుడే ప్రరాపాతో పొత్తు చర్చ: జేసీ

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవించివున్నపుడే ప్రజారాజ్యం పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై చర్చకు వచ్చిందని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జేసీ.దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రరాపా పొత్తుపై ఆయన సోమవారం స్పందనను వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 3:00 am

మలుపులు తిరుగుతున్న కర్ణాటక "గాలి" రాజకీయం

కర్ణాటక రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. నాయకత్వ మార్పిడి జరిగి తీరాల్సిందేనని గాలి బ్రదర్స్ పట్టుబట్టారు. మొన్నటి వరకు హైదరాబాద్ కేంద్రంగా రాజకీయాలు చేసిన వీరిద్దరు ప్రస్తుతం ఢిల్లీకి చేరుకున్నారు.
Source: జాతీయ | 2 Nov 2009 | 2:58 am

పీఆర్పీతో పొత్తు పెట్టుకుంటే.. టీడీపీకి మద్దతిస్తాం: రాజశేఖర్

ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే.. తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తామని సినీ నటుడు రాజశేఖర్ వెల్లడించారు. కాంగ్రెస్‌కు పీఆర్పీతో పొత్తు పెట్టుకోవలసిన అవసరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే.. జరిగిన అన్ని విషయాలపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైఎస్ జగన్ సంయమనం పాటించారని.. ఇలాంటి సమయంలో జగన్ నోరు విప్పాల్సిన అవసరం ఉందని రాజశేఖర్ కోరారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 1:59 am

చిరంజీవికి సిగ్గు లేదా...?: జీవిత-రాజశేఖర్

కాంగ్రెస్- ప్రరాపా గ్రేటర్ ఎన్నికల పొత్తు కుదుర్చుకోవడంపై జీవితా- రాజశేఖర్ దంపతులు మండిపడ్డారు. ఓ ప్రైవేటు ఛానల్ లైవ్ షోలో మాట్లాడుతూ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని లక్ష్యంగా చేసుకుని వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 1:59 am

"పొత్తు" పొడుపు: కాంగ్రెస్‌-ప్రరాపాలో ప్రకంపనలు!

ముఖ్యమంత్రి వైఎస్ దుర్మరణం అనంతరం రాష్ట్ర రాజకీయాలు రోజుకో విధంగా మలుపులు తిరుగుతున్నాయి. వైఎస్ ఉన్నంత వరకు నోరు మెదిపేందుకు సాహసం చేయని అధికార, ప్రతిపక్ష నేతలు ఇపుడు తమేద రాజ్యమన్నట్టుగా వ్యవహరిస్తూ.. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 12:51 am

చర్యకు సమానమైన ప్రతి చర్య తప్పదు: రఘువీరా

దివంగత నేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గాన్ని అణగదొక్కాలని ప్రయత్నిస్తే అంతగా పైకి ఎదుగుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి ఎన్.రఘువీరా రెడ్డి హెచ్చరించారు. కాంగ్రెస్ - ప్రజారాజ్యం పొత్తుపై ఆయన మండిపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 12:47 am

కాంగ్రెస్-ప్రరాపా పొత్తు : వ్యతిరేకిస్తున్న జగన్ వర్గం!

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీతో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకోవడాన్ని వైఎస్.జగన్మోహన్ రెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు.
Source: ఏపీ న్యూస్ | 2 Nov 2009 | 12:22 am

కిడ్నాపైన డాక్టర్లను కనిపెట్టండి.. లేదా సమ్మె తప్పదు!

కిడ్నాప్‌కు గురైన డాక్టర్లను ఎక్కడున్నారో కనిపెట్టకపోతే.. బీహార్‌లో వైద్య సేవలను నిలిపివేస్తామని భారత మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) సోమవారం హెచ్చరించింది. బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఇద్దరు డాక్టర్లు కిడ్నాప్‌కు గురై 48 గంటలు కావస్తున్న నేపథ్యంలో.. ఐఎంఏ ఈ హెచ్చరికలు చేసింది.
Source: జాతీయ | 1 Nov 2009 | 11:45 pm

మహారాష్ట్ర అసెంబ్లీలో 143 మంది కొత్త సభ్యులు!

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందిన 288 మంది సభ్యుల్లో సగం మంది అంటే.. 143 మంది కొత్తవారే కావడం గమనార్హం. ఇంత భారీ సంఖ్యలో కొత్త సభ్యులు సభకు ఎన్నిక కావడం ఇదే తొలిసారని విధాన సభ అధికారి ఒకరు వెల్లడించారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 11:30 pm

జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చిన పొన్నాల: కొండ

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలయజ్ఞాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి పొన్నాల లక్ష్మయ్య ధనయజ్ఞంగా మార్చారని ఎమ్మెల్సీ కొండా మురళీ ఆరోపించారు. మంత్రి పొన్నాల వైఖరి వల్ల ఈ ప్రాజెక్టు నీరుగారి పోతోందని ఆయన ధ్వజమెత్తారు.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2009 | 11:20 pm

గ్రేటర్ ప్రకంపనలు: నేడు వైఎస్.జగన్ శిబిరం భేటీ!

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల హడావుడి రాష్ట్రంలో ఆరంభమైంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలు కలిసి పోటీ చేయాలని భావించాయి. ఈ కలయిక వైఎస్.జగన్ శిబిరాన్ని కలవరపెడుతోంది. దీనిపై చర్చించేందుకు జగన్ శిబిరం సోమవారం ప్రత్యేకంగా సమావేశం కానుంది.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2009 | 11:09 pm

"ఆపరేషన్ నక్సల్స్‌"కు సర్వం సిద్ధం: సిగ్నలే తరువాయి!

దేశంలో నానాటికీ పెరిగిపోతున్న నక్సల్స్ కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం నడుంబిగించింది. ఆపరేషన్ నక్సల్స్ పేరుతో ఈ ఏరివేత కార్యక్రమం సాగనుంది. మావోయిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండే రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ సాగిస్తారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 9:14 pm

కేంద్రం ఆహ్వానిస్తే భారత్‌కు వస్తా: ఎంఎఫ్ హుస్సేన్

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం స్వదేశానికి రావాలని తనను ఆహ్వానిస్తేనే భారత్‌కు వస్తానని ప్రముఖ చిత్రకారుడు ఎంఎఫ్ హుస్సేన్ స్పష్టం చేశారు. ఆయన కుంచె నుంచి జాలువారిన పలు చిత్రలేఖనాలపై పలు వివాదాలు చెలరేగాయి.
Source: జాతీయ | 1 Nov 2009 | 8:50 pm

మా పార్టీని విమర్శించే హక్కు లేదు: ప్రరాపా

ఆదివారం ప్రజారాజ్యం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మల్యే కన్నా బాబు మాట్లాడుతూ... రాష్ట్రంలో దగాకోరు రాజకీయాలు చేయడంలో పేటెంటు పొందిన తెదేపా అధ్యక్షుడు, ఆ పార్టీ నేతలకు తమ పార్టీని విమర్శించే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2009 | 6:11 am

మావోయిస్టులు ఆయుధాలు పట్టకూడదు: చిదంబరం

తన చివరి శ్వాస ఉన్నంత వరకు మావోయిస్టులు ఆయుధాలు పట్టుకుని విప్లవాన్ని సృష్టించలేరని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం అన్నారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 5:32 am

ప్రారంభమైన వైఎస్ఆర్ అభయ హస్తం పథకం

రాష్ట్రంలో నవంబర్ ఒకటవ తేదీన వైఎస్ఆర్ అభయ హస్తం పథకం ప్రారంభమైంది. ఈ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య రంగారెడ్డి జిల్లా చేవెళ్ళలో లాంఛనంగా ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2009 | 4:45 am

స్వైన్‌ఫ్లూ నివారణకు రూ. 124 కోట్ల మందులు

దేశంలో స్వైన్‌ఫ్లూ వ్యాధిని నివారించేందకుగాను రూ. 123.89 కోట్ల విలువ చేసే టామీ ఫ్లూ మందులను కొనుగోలు చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ డైరెక్టర్ పి. రవీంద్రన్ తెలిపారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 4:12 am

రైలును ఢీకొన్న ట్రక్కు: 11 మంది మృతి

లక్నోలోని గోండా ప్రాంతంలోనున్న మానవ రహిత రైల్వే క్రాసింగ్ వద్ద ఆదివారం మధ్యాహ్నం గోరఖ్‌పుర్- అయోధ్యా మధ్య నడుస్తున్న రైలును ఓ ట్రక్కు ఢీకొంది. ప్రమాదం జరగడంతో 11 మంది అక్కడికక్కడే చనిపోయారు. అలాగే చాలామందికి తీవ్ర గాయాలైనట్లు లక్నో డీఆర్ఎమ్ అశోక్ సింగ్ తెలిపారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 3:04 am

అరుణ్ జైట్లీతో సమావేశమైన కర్నాటక స్పీకర్

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంలో రేగిన "గాలి" దుమారం ఇంకా కొనసా..గుతోంది. అసమ్మతికి నేతృత్వం వహిస్తున్న శాసనసభాపతి జగదీష్ షెట్టర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీతో సమావేశమైనారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 1:42 am