అరుణ్ జైట్లీతో సమావేశమైన కర్నాటక స్పీకర్

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంలో రేగిన "గాలి" దుమారం ఇంకా కొనసా..గుతోంది. అసమ్మతికి నేతృత్వం వహిస్తున్న శాసనసభాపతి జగదీష్ షెట్టర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీతో సమావేశమైనారు.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 7:11 am

నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు

నేటి ఫారంగేట్ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి.... హైదరాబాద్ (ఒక గుడ్డు) - రూ. 2.75 (వంద గుడ్లు) - రూ. 259 విజయవాడ - రూ. 259 విశాఖపట్నం - రూ. 264 చెన్నై - 268 నమక్కల్ - రూ. 260
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 6:56 am

పాక్‌లో విద్యాలయాన్ని పేల్చేసిన ఉగ్రవాదులు

పాక్‌లోని కబాయిలీ జిల్లాలోనున్న ఓ విద్యాలయ భవనాన్ని బాంబులతో ఉగ్రవాదులు పేల్చేశారు. పేలుళ్ళ కారణంగా విద్యాలయం సమీపంలోనున్న ఇండ్లుకూడా పూర్తిగా ధ్వంసమైనాయని, నలుగురికి తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 6:42 am

నేటి బులియన్ మార్కెట్ ధరలు

నేటి బులియన్ మార్కెట్‌లో బంగారు, వెండి ధరలు ఇలా ఉన్నాయి... హైదరాబాద్ 24 క్యారెట్ - రూ. 16,150, వెండి కిలో - రూ. 27,500. చెన్నై 24 క్యారెట్ - రూ. 15,025 - రూ. 16,030, వెండి కిలో - రూ. 26,655 - రూ. 27,175. విజయవాడ - రూ. 16,180 - రూ. 16,180, వెండి కిలో - రూ. 26,250 - రూ. 26,750.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 6:19 am

9 శాతం పెరిగిన జెట్ ఫ్యూయెల్ ధరలు

ముడి చమురు ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడంతో దేశీయ చమురు కంపెనీలు విమాన ఇంధనమైన ఏటీఎఫ్ ధరలను 9 శాతానికి పెంచి ప్రతి కిలో లీటరుకు రూ. 39,000లు చేసినట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 6:13 am

కాంగ్రెస్-ప్రరాపాల మధ్య కుదరనున్న పొత్తు

గ్రేటర్ హైదరాబాద్‌కు ఈ నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనుందని, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పొత్తు విషయమై ప్రరాపా అధినేత చిరంజీవి సమక్షంలో చర్చలు జరుగుతాయని ప్రజారాజ్యం అగ్రనేత బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 5:54 am

సౌదీ ఆర్థిక మంత్రిని కలిసిన ప్రణబ్

భారత్, సౌదీ అరబ్ దేశాల మధ్య ఆర్థికపరమైన అంశాలు మెరుగుపరచుకోవాలని, ఇరుదేశాల సంబంధ బాంధ్యవ్యాలను పటిష్టపరచుకోవాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ సౌదీ అరబ్ ఆర్థిక మంత్రి, విదేశాంగ మంత్రులను కలిసి సూచించారు.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 5:24 am

లష్కర్‌ తీవ్రవాదిని హతమార్చిన సైన్యం

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో భాగంగా లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని అంతమొందించారు.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 5:07 am

పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్, హిల్లరీ భేటీ

అమెరికా విదేశాంగ శాఖ మంత్రి హిల్లరీ క్లింటన్, పాలస్తీనా అధ్యక్షుడు మొహ్మద్ అబ్బాస్‌లు శనివారం కీలక చర్చల్లో పాల్గొన్నారు. శాంతి చర్చలను పున: ప్రారంభించేందుకు తమ వంతు ప్రయత్నం చేయాలని ఈ సమావేశంలో భాగంగా చర్చించినట్లు తెలిసింది.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 4:59 am

తెలంగాణ భవనంపై రెపరెపలాడిన నల్లజెండా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాని తెలంగాణ రాష్ట్ర సమతి (టిఆర్ఎస్) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించి తెలంగాణ భవనంపై నల్లజెండాను ఎగురవేసింది.
Source: Yahoo! Telugu: News | 1 Nov 2009 | 4:46 am

అరుణ్ జైట్లీతో సమావేశమైన కర్నాటక స్పీకర్

కర్నాటక రాష్ట్ర ప్రభుత్వంలో రేగిన "గాలి" దుమారం ఇంకా కొనసా..గుతోంది. అసమ్మతికి నేతృత్వం వహిస్తున్న శాసనసభాపతి జగదీష్ షెట్టర్ ఆదివారం బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీతో సమావేశమైనారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 1:42 am

కాంగ్రెస్-ప్రరాపాల మధ్య కుదరనున్న పొత్తు

గ్రేటర్ హైదరాబాద్‌కు ఈ నెలలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో తమ పార్టీ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనుందని, కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీల మధ్య పొత్తు విషయమై ప్రరాపా అధినేత చిరంజీవి సమక్షంలో చర్చలు జరుగుతాయని ప్రజారాజ్యం అగ్రనేత బూరగడ్డ వేదవ్యాస్ తెలిపారు.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2009 | 1:24 am

లష్కర్‌ తీవ్రవాదిని హతమార్చిన సైన్యం

జమ్మూ-కాశ్మీర్ రాష్ట్రంలోని రియాసీ జిల్లాలో ఆదివారం ఉదయం భద్రతా దళాలు జరిపిన ఆపరేషన్‌లో భాగంగా లష్కర్-ఏ-తొయిబాకు చెందిన ఓ ఉగ్రవాదిని అంతమొందించారు.
Source: జాతీయ | 1 Nov 2009 | 12:37 am

తెలంగాణ భవనంపై రెపరెపలాడిన నల్లజెండా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యావత్ రాష్ట్ర ప్రజలు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. కాని తెలంగాణ రాష్ట్ర సమతి (టిఆర్ఎస్) రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ ఈ రోజును విద్రోహ దినంగా ప్రకటించి తెలంగాణ భవనంపై నల్లజెండాను ఎగురవేసింది.
Source: ఏపీ న్యూస్ | 1 Nov 2009 | 12:16 am

రాష్ట్రంలో ప్రారంభమైన అవతరణ దినోత్సవం వేడుకలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సం రాష్ట్ర ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఎన్టీఆర్ స్టేడియంలో ఈ వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 10:53 pm

అమితాబచ్చన్‌కు బెదిరింపు ఫోన్ కాల్స్

బాలీవుడ్ బిగ్‌ బీ పేరొందిన అమితాబ్ బచ్చన్‌కు గత కొంత కాలంగా ఓ అజ్ఞాత వ్యక్తి బెదింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. ఈ విషయాన్ని బిగ్ బీ తన అధికారిక బ్లాగు.. బిగడ్డాడాట్‌కామ్‌లో వెల్లడించారు. ఇటీవలే అమితాబ్.. హిందూ దేవాలయాలను, ముస్లింల దర్గాలను సందర్శించారు.
Source: జాతీయ | 31 Oct 2009 | 10:02 pm

ఐశ్వర్యారాయ్ బచ్చన్ : హ్యాపీ బర్త్ డే

1973 నవంబర్ 1న ప్రపంచసుందరి ఐశ్వర్యారాయ్ బచ్చన్ జన్మించారు. ఇప్పుడు ఆమె 36వ సంవత్సరంలోకి అడుగిడుతున్నారు. తన అందచందాలతో ప్రపంచంలోని సౌందర్యారాధకులకు ఆమె ఆరాధ్య దేవత. ఇప్పటికికూడా ఆమె అందం, నడకతీరు, అమాయకత్వం, కళ్ళల్లోనున్న చురుకైన చూపులకు కుర్రకారు ఠారెత్తిపోతుంటారు. ఆమె తన అందచందాలతో ప్రతి ఒక్కరిని మంత్రముగ్దులను చేస్తుందనడంలో సందేహం లేదు. అయినప్పటికీ వయసు దాగదుకదా...! వయసు పెరిగేకొద్దీ శారీరకంగా, మానసికంగా పరిపక్వ దశకు చేరుకుంటారు. ఇప్పుడు ఐష్ పరిస్థితి ఇలాగే ఉంది. వెండితెరపై అమ్మాయిలాగా, తన అందమైన మోముతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంది. అలాగే ఓ మహిళగాను నటించి పలువురి ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఓ గృహిణిగా రాణిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 3:18 pm

అలెప్పీలో యాక్షన్ చేస్తోన్న "వరుడు"

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్సల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న "వరుడు" షెడ్యూల్ కేరళలోని అలెప్పీలో జరుగుతోంది.ఈ సందర్భంగా నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ.. అక్టోబర్ 28 నుంచి నవంబర్ పది వరకు అలెప్పీలో జరిగే షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌ని తీస్తున్నామన్నారు. అలాగే ఓ పాటను కూడా చిత్రీకరిస్తామని తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 10:17 am

గోవాలో "కింగ్" నాగార్జున కొత్త చిత్రం!

"కింగ్" నాగార్జున హీరోగా కామాక్షి కళామూవీస్ పతాకంపై అగ్రనిర్మాత డి. శివప్రసాదరెడ్డి కిరణ్ దర్శకత్వంలో నిర్మిస్తోన్న భారీ చిత్రం షెడ్యూల్ గోవాలో అక్టోబర్ 10 నుంచి జరుగుతోంది. ఈ షెడ్యూల్ వివరాల్ని నిర్మాత డి. శివప్రసాదరెడ్డి చెబుతూ.. హీరో నాగార్జున, మోడల్స్ పాల్గొన్న ఓ పాటని సెట్‌వేసి చిత్రీకరించామన్నారు. నాగార్జున, షాయాజీ షిండే, బ్రహ్మానందం పాల్గొన్న కొన్ని ముఖ్య సన్నివేశాల్ని కూడా తీశామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 10:03 am

గ్రేటర్ ఎన్నికలు: బీజేపీ తొలి జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ చేసే 33 మంది అభ్యర్థుల పేర్లతో కూడిన జాబితాను భారతీయ జనతా పార్టీ శనివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 11 మంది మహిళలు, 22 మంది పురుషులు ఉన్నారు. ఇంకా ఈ అభ్యర్థులలో 24మంది బీసీలు ఉన్నారు. ఇదిలా ఉంటే.. తెలుగుదేశం పార్టీ హయాంలో సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలో తాను గెలవడం ఆ పార్టీతో పొత్తువల్ల సాధ్యం కాదని నిరూపించుకోవాలని బండారు దత్తాత్రేయ కృతనిశ్చయంతో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 8:30 am

"సురేఖ" రాజీనామా వెనుక "జగన్" ప్రోద్బలం లేదు..!

మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ రాజీనామా వెనుక వైఎస్సార్ తనయుడు జగన్ ప్రోద్బలం ఉందని పార్టీలోని ఓ వర్గం చేస్తున్న ప్రచారం వాస్తవం కాదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ స్పష్టం చేశారు. సురేఖ రాజీనామా ఆమె వ్యక్తిగత విషయమని మొయిలీ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 7:50 am

శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే

ఆపద మొక్కులవాడు, తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే శనివారం దర్శించుకున్నారు. లంక నుంచి ప్రత్యేక విమానం ద్వారా రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన, కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అనంతరం తిరుమలకు చేరుకున్నారు. తిరుమలకు చేరుకున్న రాజపక్సేను తిరుమల పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. మహాద్వారం ద్వారా రాజపక్సేను ఆలయంలోకి ప్రవేశం కల్పించడంతో.. రాజపక్సే శ్రీవారిని దర్శించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 6:14 am

ఇస్రో ఛైర్మెన్‌గా బాధ్యతలు స్వీకరించి రాధాకృష్ణన్

ఇస్రో ఛైర్మెన్‌గా రాధాకృష్ణన్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు రాధాకృష్ణన్ తిరువనంతపురంలోనున్న విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(విఎస్ఎస్‌సీ) డైరెక్టర్‌గావున్నారు.
Source: జాతీయ | 31 Oct 2009 | 6:02 am

"ఏక్ నిరంజన్"‌ను ట్రైలర్లో చూడండి

యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన భారీ చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 5:04 am

"కళ్యాణి" చాప్టర్-6 ట్రైలర్ మీ కోసం..

"సత్యం" చిత్రం దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో ఆయన భార్య, నటీమణి కళ్యాణి నిర్మిస్తున్నచిత్రం ‘చాప్టర్-6’. బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటీవలే ఆడియో విడుదలైన ఈ సినిమా గురించి కళ్యాణి మాట్లాడుతూ.. కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. కథాంశం పరంగా ప్రేమకథలా కాకుండా పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 4:59 am

"శ్రీమతి కళ్యాణం" ట్రైలర్‌ను తిలకించండి

వడ్డే నవీన్, సంగీత జంటగా శివాల్ దర్శకత్వంతో భానుకిరణ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శ్రీమతి కళ్యాణం’. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌తో పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను వర్షంలో చిత్రీకరించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 4:45 am

తెరాస ఎన్ని సీట్లు గెలుస్తుందో నేను చెబుతా..?: లగడపాటి

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేస్తుందో? లేదో అన్న విషయాన్ని చెబితే ఎన్ని సీట్లు గెలుస్తుందనే విషయాన్ని తాను చెబుతానని విజయవాడ ఎంపీ లగడపాటి అన్నారు. తెరాస అధ్యక్షుడు కేసీఆర్‌ వైఖరిపై మండిపడిన లగడపాటి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ మీడియాలో జీవించడం కాదని, ప్రజల్లో జీవించాలని హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 4:13 am

తిరుపతికి చేరిన శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే

ఆపద్భాంధవుడు, అఖిలాండ బ్రహ్మాండనాయకుడైన శ్రీవారి దర్శనార్థం శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే శనివారం తిరుపతికి చేరుకున్నారు. లంక నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన రాజపక్సే శనివారం మధ్యాహ్నం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తదనంతరం రాజపక్సే శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల బయలుదేరి వెళ్తారు.
Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 4:02 am

కోలుకుంటున్న గుజరాత్ సీఎం నరేంద్ర మోడీ

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీకి సోకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి నుంచి ఆయన మెల్ల మెల్లగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. రష్యా పర్యటన ముగించుకుని బుధవారం స్వదేశం చేరుకున్న నరేంద్ర మోడీ జలుబు, జ్వరంతో బాధపడటంతో ఆయనకు జరిపిన స్వైన్ ఫ్లూ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిన విషయం తెలిసిందే.
Source: జాతీయ | 31 Oct 2009 | 3:52 am

ఢిల్లీ రండి: అసమ్మతివాదులకు భాజపా అధిష్ఠానం పిలుపు

కర్నాటకలో తలెత్తిన సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భాజపా అధిష్ఠానం నడుం బిగించింది. అసమ్మతివాదులు అక్కడా... ఇక్కడా తిరగకుండా నేరుగా ఢిల్లీ రావాలనీ, సమస్యలను ఇక్కడే పరిష్కరించుకుందామని పిలుపునిచ్చింది.
Source: జాతీయ | 31 Oct 2009 | 2:59 am