|
గ్రేటర్ ఎన్నికలు: 110 డివిజన్లలో పీఆర్పీ పోటీగ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ ఎన్నికల సమరానికి నోటిఫికేషన్, షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఈ ఎలక్షన్‌లో ప్రజారాజ్యం పార్టీ 110 డివిజన్లలో పోటీ చేస్తుందని ప్రకటించింది.ఈ మేరకు శనివారం పీఆర్పీ నేత హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 20 నుంచి 30 డివిజన్లలో నెగ్గినా కార్పొరేషన్‌ను ఓ ఆటాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 7:27 am తల్లితో కలిసి హస్తినకు వెళ్లనున్న జగన్!దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఆదివారం హస్తినకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి ప్రయాణమయ్యే వీరిద్దరూ.. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని కలుసుకుంటారని సన్నిహిత వర్గాల సమాచారం. మేడమ్‌ను కలుసుకునేందుకు జగన్, విజయలక్ష్మిలకు అపాయింట్‌మెంట్ కూడా లభించిందని తెలిసింది.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 7:13 am ఇక లక్షల్లో ఉద్యోగాలు : అమెరికాఒబామా ప్రభుత్వం అమెరికాలో ఈ ఏడాది ఆర్థిక ప్రోత్సాహక ప్యాకేజీ విడుదల చేసిన తర్వాత కొత్తగా 640,000 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు వైట్‌హౌస్ ప్రతినిధి రాబర్ట్ గిబ్స్ తెలిపారు.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 6:59 am స్టాక్ మార్కెట్: ఈ వారం సమీక్షకేవలం రెండు వారాల్లో 10 శాతం కోల్పోయి బీఎస్ఈ- 30 షేర్ల బెంచ్‌మార్క్ ఇండెక్స్ 16వేల మార్కును బ్రేక్ చేసింది. ద్రవ్యోల్బణం పెరగడం.. రుచించని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి విధానం వెరసి స్టాక్ మార్కెట్‌ను నష్టాల్లోకి నడిపించాయి. దీనికి తోడు ఆర్‌బీఐ ఉద్ధీపనలను ఉపసంహరణ ప్రారంభించనుందనే ఆందోళనలు అగ్నికి ఆజ్యం పోశాయి.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 6:45 am అణు ఒప్పందం భారత్‌కు ఓ పాస్‌పోర్టు లాంటిది: బుష్అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ భారత్-అమెరికా అణు ఒప్పందంపై మరోసారి మాట్లాడారు. అణు ఒప్పందం భారతదేశానికి ప్రపంచానికే ఓ పాస్‌పోర్టు వంటిదని ఆయన అభివర్ణించారు. ఈ ఒప్పందంతో భారతదేశ ఆర్థిక వృద్ధి మరింత బలోపేతమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 6:41 am తగ్గుముఖం పట్టిన సిండికేట్ బ్యాంక్ లాభాలుప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో వచ్చిన లాభాలలో దాదాపు 32 శాతం తగ్గిందని, నిరుడు ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి తమ బ్యాంక్‌కు రూ. 262 కోట్ల లాభాలు వచ్చాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసిన గత త్రైమాసికంలో రూ. 178 కోట్లు నికర లాభాలు వచ్చాయని సిండికేట్ బ్యాంక్ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 6:33 am గ్రేటర్ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తే మంచిదే: వీహెచ్గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీనికి అస్త్రంగా దివంగత మహానేత వై.ఎస్. జగన్‌ను ప్రచార రంగంలోకి దింపాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. గ్రేటర్ ఎన్నికల్లో వై.ఎస్. జగన్‌ను ఎంపీలా వినియోగించుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అంటే.. మరోవైపు జగన్ ప్రచారం నిర్వహిస్తే మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 6:18 am గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలగ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. గ్రేటర్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను జీహెచ్ఎంసీ శనివారం విడుదల చేసి గ్రేటర్ ఎన్నికల్లో మరో ఘట్టానికి తెరలేపింది. జీహెచ్ఎంసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఆరో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల కార్యక్రమం జరుగుతుంది.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 5:59 am 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలుపార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 21వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ నెలాఖరులో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందుగా ముగిస్తాయి.Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 5:30 am సీఎం పోస్టు సరే... కనీసం పీసీసి పదవైనా దక్కుతుందా?జగన్మోహన్ రెడ్డికి పీసీసి చీఫ్ పదవి దక్కుతుందా? లేదా? ప్రస్తుత పీసీసి చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ కోరుకుంటున్నారా? ఆయన రాజ్యసభకు వెళితే ఆ పదవి ఎవరిని వరిస్తుంది? అధిష్టానంతో చనువుగా ఉన్నంత మాత్రాన పీసీసి పదవి వస్తుందా? స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి ఏఐసీసి చేస్తున్న ఆలోచన ఏమిటి?Source: Yahoo! Telugu: News | 31 Oct 2009 | 5:29 am "ఏక్ నిరంజన్"ను ట్రైలర్లో చూడండియంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా, డాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన భారీ చిత్రం "ఏక్‌నిరంజన్". ఆదిత్యారామ్ మూవీస్ పతాకంపై ఆదిత్యారామ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ఆదిత్యరామ్ నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 5:04 am "కళ్యాణి" చాప్టర్-6 ట్రైలర్ మీ కోసం.."సత్యం" చిత్రం దర్శకుడు సూర్యకిరణ్ దర్శకత్వంలో ఆయన భార్య, నటీమణి కళ్యాణి నిర్మిస్తున్నచిత్రం ‘చాప్టర్-6’. బాల, సోనియా సూరి హీరోహీరోయిన్లుగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కళ్యాణి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు.ఇటీవలే ఆడియో విడుదలైన ఈ సినిమా గురించి కళ్యాణి మాట్లాడుతూ.. కథ నచ్చడంతో నిర్మాతగా మారాను. కథాంశం పరంగా ప్రేమకథలా కాకుండా పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉంటుందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 4:59 am "శ్రీమతి కళ్యాణం" ట్రైలర్‌ను తిలకించండివడ్డే నవీన్, సంగీత జంటగా శివాల్ దర్శకత్వంతో భానుకిరణ్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘శ్రీమతి కళ్యాణం’. ఈ సినిమా షూటింగ్‌ను హైదరాబాద్‌తో పాటు వివిధ లొకేషన్లలో చిత్రీకరించారు. ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ సన్నివేశాలను వర్షంలో చిత్రీకరించినట్లు చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 31 Oct 2009 | 4:45 am గ్రేటర్ ఎన్నికలు: 110 డివిజన్లలో పీఆర్పీ పోటీగ్రేటర్ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. గ్రేటర్ ఎన్నికల సమరానికి నోటిఫికేషన్, షెడ్యూల్‌ను ఎన్నికల కమిషన్ విడుదల చేసిన నేపథ్యంలో.. ఈ ఎలక్షన్‌లో ప్రజారాజ్యం పార్టీ 110 డివిజన్లలో పోటీ చేస్తుందని ప్రకటించింది. ఈ మేరకు శనివారం పీఆర్పీ నేత హరిరామ జోగయ్య మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో తాము 20 నుంచి 30 డివిజన్లలో నెగ్గినా కార్పొరేషన్‌ను ఓ ఆటాడిస్తామని ధీమా వ్యక్తం చేశారు.Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 1:58 am గ్రేటర్ ఎన్నికల్లో జగన్ ప్రచారం చేస్తే మంచిదే: వీహెచ్గ్రేటర్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయపరంపర కొనసాగించాలని చూస్తోంది. దీనికి అస్త్రంగా దివంగత మహానేత వై.ఎస్. జగన్‌ను ప్రచార రంగంలోకి దింపాలని సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా.. గ్రేటర్ ఎన్నికల్లో వై.ఎస్. జగన్‌ను ఎంపీలా వినియోగించుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ అంటే.. మరోవైపు జగన్ ప్రచారం నిర్వహిస్తే మంచిదేనని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు అన్నారు.Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 1:44 am తల్లితో కలిసి హస్తినకు వెళ్లనున్న జగన్!దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.ఎస్. జగన్ తన తల్లి విజయలక్ష్మితో కలిసి ఆదివారం హస్తినకు బయలుదేరనున్నట్లు తెలిసింది. ఆదివారం సాయంత్రం ఢిల్లీకి ప్రయాణమయ్యే వీరిద్దరూ.. సోమవారం కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీని కలుసుకుంటారని సన్నిహిత వర్గాల సమాచారం. మేడమ్‌ను కలుసుకునేందుకు జగన్, విజయలక్ష్మిలకు అపాయింట్‌మెంట్ కూడా లభించిందని తెలిసింది.Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 1:43 am గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలగ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ శనివారం విడుదలైంది. గ్రేటర్ స్థానిక ఎన్నికల నోటిఫికేషన్‌ను జీహెచ్ఎంసీ శనివారం విడుదల చేసి గ్రేటర్ ఎన్నికల్లో మరో ఘట్టానికి తెరలేపింది. జీహెచ్ఎంసీ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నవంబర్ ఆరో తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల కార్యక్రమం జరుగుతుంది.Source: ఏపీ న్యూస్ | 31 Oct 2009 | 12:42 am 19 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలుపార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 19వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు జరిగే ఈ సమావేశాలు డిసెంబర్ 21వ తేదీతో ముగుస్తాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి ప్రణబ్ ముఖర్జీ అధ్యక్షతన జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది. శీతాకాల సమావేశాలు సాధారణంగా నవంబర్ నెలాఖరులో ప్రారంభమై క్రిస్మస్ పండుగకు ముందుగా ముగిస్తాయి.Source: జాతీయ | 31 Oct 2009 | 12:01 am జగన్‌ను ఎంపీగానే ఉపయోగించుకుంటాం: మొయిలీదివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి తనయుడు వై.ఎస్. జగన్‌ను.. గ్రేటర్ ఎన్నికల్లో ఎంపీలాగానే ఉపయోగించుకుంటామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల మంత్రి వీరప్ప మొయిలీ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో మిగిలిన ఎంపీల్లాగానే జగన్‌మోహనరెడ్డిని సేవలను ఉపయోగించుకుంటామని కేంద్రమంత్రి చెప్పారు.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2009 | 11:47 pm ఇందిరాగాంధీకి నివాళులర్పించిన ప్రముఖులుభారతదేశ మాజీ ప్రధానమంత్రి, స్వర్గీయ ఇందిరా గాంధీ 25వ వర్ధంతిని పురస్కరించుకొని జాతి అమెకు ఘనంగా నివాళులర్పించింది.Source: జాతీయ | 30 Oct 2009 | 10:14 pm రుక్సానా ఇంటిపై దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులురజౌరీ జిల్లాలోని థానామండీలోనున్న రుక్సానా ఇంటిపై తీవ్రవాదులు శుక్రవారం రాత్రి గ్రెనేడ్లు విసిరారని, ఆ సమయంలో ఇంట్లో రుక్సానాతోపాటు ఎవ్వరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని జిల్లా కలెక్టర్ ఎస్. జయపాల్ సింగ్ అన్నారు.Source: జాతీయ | 30 Oct 2009 | 9:18 pm మావోయిస్టులకు రక్షణ కవచంగా మమత: బుద్ధదేవ్రాజధాని ఎక్స్‌ప్రెస్ హైజాక్ వ్యవహారంపై మమతా బెనర్జీ వైఖరిని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీ తప్పుబట్టారు. మావోయిస్టులకు షీల్డు కవరుగా రైల్వేమంత్రి ప్రవర్తించడంపై మండిపడ్డారు.Source: జాతీయ | 30 Oct 2009 | 8:40 pm నయన- ప్రభుదేవాల మధ్య "కెమిస్ట్రీ" నిజమేనేమో!!నయనతార, ప్రభుదేవా మరోసారి సన్నిహితంగా కెమేరా కంటికి చిక్కారు. హైదరాబాదులో సౌత్ స్కోప్ స్టయిల్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో వీళ్లిద్దరూ ప్రక్కప్రక్కనే కూచుని పదే పదే ఒకరి చెవిలో ఒకరు గుసగుసమని ఊసులాడుతూ కనిపించారు. దీంతో అందరి కళ్లూ వీళ్లద్దరినే చూడటం మొదలుపెట్టాయి. అయితే ఇదేమీ పట్టని నయన- ప్రభుదేవాలు తమదైన లోకంలో విహరించారు. జంకూ గొంకూ లేకుండా ఒకరిప్రక్కన ఒకరు కూచుని ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వీరి వ్యవహార శైలిని చూసిన టాలీవుడ్ సినీజనం, ఇద్దరి మధ్య "కెమిస్ట్రీ" నడుస్తున్న సంగతి నిజమే అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అంతకుముందు నయనతార ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ... ప్రభుదేవా అంటే తనకు పిచ్చప్రేమ అని పలికింది. అంతేకాదు ప్రభుదేవా భార్య తనపై మండిపడిందన్న వార్తలను తేలిగ్గా కొట్టి పారేసిందట. తను నటిని కాక ముందు నుంచే ప్రభుదేవా టాప్‌స్టార్ అనీ, అతని డ్యాన్సుకు తాను కాలేజీ రోజుల్లోనే ప్లాటయ్యానని చెప్పుకొచ్చిందట. ఇప్పుడు నేరుగా చూసింది కనుక ప్లాటుమీద ప్లాటయ్యిందన్నమాట.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 12:54 pm ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాజేంద్రప్రసాద్ "గుడు గుడు గుంజం""గుడు గుడు గుంజం.. గుండే రాగం, పావుల పట్నం పడగేరాగం.." ఇది చిన్న పిల్లలాట.. పిడికిలి బిగించి ఆడే ఈ ఆటని ఒక వేళ పెద్దలు గుప్పెట్లో నిజం దాచుకుని ఆడితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచనతో అల్లిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "గుడు గుడు గుంజం"డాక్టర్. రాజేంద్ర ప్రసాద్, కస్తూరి, సితార మిడిల్ ఏజిడ్ లవ్‌స్టోరీ నాయికా, నాయకులుగా, పార్థు (నవదీప్ బ్రదర్స్), చాహత్, రిథిమ, ఆర్తి యువ జంటగా కామెడీని పండించారు. క్లైమాక్స్ పిక్నిక్ సాంగ్ మినహా చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. నవంబరులో.. ఎడిటింగ్, డబ్బింగ్, రీ-రికార్డింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను పూర్తి చేసి, డిసెంబరులో సినిమాను విడుదల చేయనున్నట్లు నిర్మాత వి. రవికుమార్ రెడ్డి తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 11:46 am ప్రేమిస్తే మీకే ముందు చెబుతా..!: జెనీలియాబొమ్మరిల్లు చిత్రంలోని హాసిని పాత్ర జెనీలియా కెరీర్‌ను మార్చేసింది. తాజాగా గుణ్ణం గంగరాజు నిర్మిస్తోన్న "కథ" చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నవంబర్ మొదటివారంలో విడుదలకానుంది. ఈ సందర్భంగా జెనీలియాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాంశాలు మీ కోసం.. ప్రశ్న: పాత్రల ఎంపికలో ఎటువంటి రూల్స్ పెట్టుకుంటారు?జ: ముందుగా బేనర్. తర్వాత దర్శకుడు, హీరోను చూస్తాను.ప్రశ్న: హీరోయిన్లంతా బికినీలవైపు మొగ్గుచూపుతున్నారు? మీరు కూడా రెడీనా?జ: కాస్ట్యూమ్స్ విషయంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. బికినీలు వేసుకోమంటే.. వాటికి నేను దూరం. ముందు చెప్పినట్లు వస్త్రధారణ ఉంటేనే నటిస్తాను. ప్రశ్న: బాలీవుడ్‌లో ఎక్స్‌పోజింగ్‌కు దూరమైతే పాత్రలు దూరమవుతాయేమో?జ: అదేం లేదు. నాకు ముఖాన్ని ముఖకవళికలను ఎక్స్‌పోజింగ్ చేయడమే తెలుసు. అంతకు మించి బాడీ ఎక్స్‌పోజింగ్ చేయను.ప్రశ్న: రితీష్ దేశ్‌ముఖ్‌తో మీ వ్యవహారం పెండ్లిదాక వచ్చిందనే వార్తలు వచ్చాయి?జ: రితీష్ మంచి స్నేహితుడు మాత్రమే. నేను ప్రేమిస్తే, పెండ్లిచేసుకుంటే ముందు మీకే (మీడియా)కు చెబుతాను. ప్రశ్న: ఎటువంటివాడైతే ఇష్టపడతారు?జ: నన్ను నన్నుగా గౌరవించాలి.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 11:12 am నరేంద్ర మోడీకి సోకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి..!ప్రపంచ దేశాలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కూడా సోకింది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. రష్యా పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం ఆయనలో స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని వైద్యులు చెప్పారు. దీంతో నరేంద్రమోడీని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడిన నరేంద్ర మోడీకి జరిపిన స్వైన్ ఫ్లూ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని వైద్యులు చెప్పారు.Source: జాతీయ | 30 Oct 2009 | 9:47 am జార్ఖండ్ శాసన సభకు రేపు నోటిఫికేషన్ జారీ!జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ ఈనెల 31వ తేదీన విడుదల కానుంది. ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం వెల్లడించింది. మొత్తం 81 స్థానాలు కలిగిన జార్ఖండ్ శాసనసభకు నవంబరు, డిసెంబరు నెలల్లో ఐదు విడతలుగా ఎన్నికలు నిర్వహించనుంది.Source: జాతీయ | 30 Oct 2009 | 7:12 am మెగాస్టార్ 'చిరంజీవి' కుటుంబం నుంచి మరో నటవారసుడు..?!టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో నటవారసులు హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు "చిరుత"గా రంగ ప్రవేశం చేసి, "మగధీర"గా ప్రేక్షకుల మదిలో నిలిచాడు. మరోవైపు యువసామ్రాట్ నాగార్జున కుమారుడు నాగచైతన్య "జోష్"గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇదే తరహాలో చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ త్వరలో నటుడిగా కన్పించబోతున్నాడు. అల్లు అర్జున్, రాజ్ చరణ్ తరహాలో వరుణ్ ప్రతిష్టాత్మకంగా హీరోగా పరిచయం కాబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చనుందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 6:43 am సస్పెన్స్ థ్రిల్లర్‌గా "అపార్ట్‌మెంట్" సినిమా ప్రారంభంశ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రవివర్మను హీరోగా పరిచయం చేస్తూ.. "అపార్ట్‌మెంట్" చిత్రం రూపొందుతోంది. ఎ.కె. శ్రీకాంత్, సతీష్ కె.వి. వేగేసిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజతో ఈ సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. దేవుని పటాలపై నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సతీష్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, యాక్షన్, థ్రిల్లింగ్ గొలిపే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని నిర్మాత అన్నారు. నవంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి ఏకధాటిగా సాగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని మరో నిర్మాత సతీష్ పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 6:25 am "సుఖోయ్" యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రయాణం!భారత నౌకా దళానికి చెందిన యుద్ధ విమానంలో రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ప్రయాణించనున్నారు. వైమానికదళంలో అగ్రశ్రేణి యుద్ధ విమానాలుగా ఖ్యాతిగడించిన సుఖోయ్ -30 ఎంకేఐ రకం యుద్ధ విమానంలో ఆమె ప్రయాణించి సరికొత్త రికార్డును సృష్టించనున్నారు.Source: జాతీయ | 30 Oct 2009 | 6:22 am ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రాజేంద్రప్రసాద్ "గుడు గుడు గుంజం""గుడు గుడు గుంజం.. గుండే రాగం, పావుల పట్నం పడగేరాగం.." ఇది చిన్న పిల్లలాట.. పిడికిలి బిగించి ఆడే ఈ ఆటని ఒక వేళ పెద్దలు గుప్పెట్లో నిజం దాచుకుని ఆడితే ఎలా ఉంటుందనే చిలిపి ఆలోచనతో అల్లిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ "గుడు గుడు గుంజం" డాక్టర్. రాజేంద్ర ప్రసాద్, కస్తూరి, సితార మిడిల్ ఏజిడ్ లవ్‌స్టోరీ నాయికా, నాయకులుగా, పార్థు (నవదీప్ బ్రదర్స్), చాహత్, రిథిమ, ఆర్తి యువ జంటగా కామెడీని పండించారు.Source: వినోదం | 30 Oct 2009 | 6:20 am నా కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రం "ప్రవరాఖ్యుడు": జగపతిబాబుజగపతిబాబు, ప్రియమణి, హంసానందిని జంటగా నటిస్తోన్న 'ప్రవరాఖ్యుడు' చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రమని అన్నారు. కీరవాణి మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుందని, ఈ సినిమా పాటల్ని డిస్కో తెక్‌లో కూడా వినేటట్లు సంగీతం అందించారని జగపతిబాబు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 6:02 am కొండా సురేఖ రాజీనామాపై భిన్నాభిప్రాయాలు!మంత్రి కొండా సురేఖ రాజీనామా పట్ల కాంగ్రెస్ పార్టీ నేతల్లో భిన్నాభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. రాజీనామా అనేది ఆమె వ్యక్తిగతమని, దీన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదని ఆ పార్టీ నేతలు అంటున్నారు. అయితే, మరికొందరు మాత్రం సురేఖ నిర్ణయాన్ని తప్పుబట్టారు.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2009 | 6:00 am వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే "తేజం"సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తూ.. రాజ్ కె. ఎస్. గోపి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం "తేజం". ఈ నెల 29న "తేజం" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ "యు" సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిమంది హీరోలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. మంచి టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం యువత మనోభావాలకి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉంటుందన్నారు. ప్రీతిజింగానియా స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ఒక హైలైట్ కాగా, ఛేజింగ్, బ్రహ్మానందం కామెడీ మరో హైలైట్‌గా నిలువనున్నాయని చెప్పారు. సెన్సార్ సభ్యుల నుంచి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల మీద మంచి చిత్రాన్ని నిర్మించారన్న ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 5:39 am "మహా" పీఠంపై వీడని కాంగ్రెస్-ఎన్సీపీ చిక్కుముడి!మహారాష్ట్రలొ కొత్త ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామ్య పార్టీలైన కాంగ్రెస్, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీల మధ్య ఏర్పడిన చిక్కుముడి ఇప్పటికిపుడు వీడేలా కనిపించడం లేదు. ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను ఎన్సీపీ డిమాండ్ చేస్తూ, 1999 ఫార్ములాను అమలు చేయాలని పట్టుబడుతోంది.Source: జాతీయ | 30 Oct 2009 | 5:29 am ప్రపంచ వారసత్వ సంపద "చంపానేర్-పావగఢ్"భారతదేశంలోని ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో పేరెన్నికగన్నవి చంపానేర్-పావగఢ్ ప్రదేశాలు. 2004వ సంవత్సరంలో యునెస్కో "ప్రపంచ వారసత్వ జాబితా" స్థానం సంపాదించుకున్న ఈ అపురూపమైన చారిత్రక ప్రదేశాలు... గుజరాత్ రాష్ట్రంలోని పాంచ్‌మహల్ జిల్లాలో ఉన్నాయి. ఇక్కడి ఎత్తయిన పావగఢ్ కొండపై ఉండే కాళికామాత ఆలయం ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయానికి వెళ్లేందుకు "రోప్ వే" సౌకర్యం కూడా ఉండటం విశేషంగా చెప్పవచ్చు. అయితే రోప్ వేలో ప్రయాణించిన తరువాత మళ్లీ ఆలయం చేరుకునేందుకు 250 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది...Source: వినోదం | 30 Oct 2009 | 5:04 am జీహెచ్‌ఎంసీ కంటే తెలంగాణాయే ముఖ్యం: కేసీఆర్వచ్చే నెలలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కంటే ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమకు ముఖ్యమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కె.చంద్రశేఖర రావు స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 30 Oct 2009 | 4:51 am కూలిపోయిన ఎమ్ఐ-17 హెలికాప్టర్: 10 మంది గల్లంతుశుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ధోడా సమీపంలోని చీనాబ్ నదిలో కూలిపోయింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులోనున్న పదిమంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఓ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.Source: జాతీయ | 30 Oct 2009 | 3:39 am జైపూర్ మృతులకు రూ.2లక్షల నష్టపరిహారంజైపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి సితాపురా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ డిపోలో ఆకస్మికంగా భారీ ఎత్తున మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ పైపు లీకేజీ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా పరిశీలించారు.Source: జాతీయ | 30 Oct 2009 | 3:38 am మెగాస్టార్ 'చిరంజీవి' కుటుంబం నుంచి మరో నటవారసుడు..?!టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో నటవారసులు హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు "చిరుత"గా రంగ ప్రవేశం చేసి, "మగధీర"గా ప్రేక్షకుల మదిలో నిలిచాడు. మరోవైపు యువసామ్రాట్ నాగార్జున కుమారుడు నాగచైతన్య "జోష్"గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇదే తరహాలో చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ త్వరలో నటుడిగా కన్పించబోతున్నాడు. అల్లు అర్జున్, రాజ్ చరణ్ తరహాలో వరుణ్ ప్రతిష్టాత్మకంగా హీరోగా పరిచయం కాబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చనుందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.Source: వినోదం | 30 Oct 2009 | 2:49 am సస్పెన్స్ థ్రిల్లర్‌గా "అపార్ట్‌మెంట్" సినిమా ప్రారంభంశ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రవివర్మను హీరోగా పరిచయం చేస్తూ.. "అపార్ట్‌మెంట్" చిత్రం రూపొందుతోంది. ఎ.కె. శ్రీకాంత్, సతీష్ కె.వి. వేగేసిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజతో ఈ సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. దేవుని పటాలపై నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సతీష్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, యాక్షన్, థ్రిల్లింగ్ గొలిపే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని నిర్మాత అన్నారు. నవంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి ఏకధాటిగా సాగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని మరో నిర్మాత సతీష్ పేర్కొన్నారు.Source: వినోదం | 30 Oct 2009 | 2:49 am
|