పసిడి దిగుమతుల్లో రికార్డు సృష్టించిన భారత్

దేశంలో ఇటీవల పండుగల సీజన్ రావడంతో సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 72 శాతం పెరగి 37.5 టన్నులకు చేరుకుంది. అదే ఆగస్టు నెలలో 21.8 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకున్నట్లు బొంబాయి బులియన్ మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 9:39 am

సెన్సెక్స్ 16వేల మార్కుకు బ్రేక్: ఆర్‌కామ్ క్షీణత

స్టాక్ మార్కెట్ రివర్సయింది. రెడ్ మార్కులో మరింతగా కూరుకుపోతోంది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 162 పాయింట్లు కోల్పోయి 16వేల మార్కును బ్రేక్ చేసి 15,891 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4,721 వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 9:38 am

బారత్‌తో చర్చించేందుకు మేమూ సిద్ధమే: పాక్

తమ ఇరు దేశాల సరిహద్దులు, తదితర సమస్యలపై చర్చించేందుకు భారత ప్రధాని సుముఖంగా ఉన్నట్లు ప్రకటించడంతో తాము స్వాగతిస్తున్నామని, భారతదేశంతో చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ దేశపు ప్రసార శాఖామంత్రి కమర్ జమాన్ కైరా శుక్రవారం వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 9:23 am

నష్టాల్లో పయనిస్తున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 148 పాయింట్లు కోల్పోయి 15,904 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 30 పాయింట్లు నష్టపోయి 4,721 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.92 శాతం, నిఫ్టీ 0.63 శాతం మేరకు క్షీణించాయి. బీఎస్ఈ మధ్య తరహా కంపెనీల ఇండెక్స్ 0.03 శాతం బలపడగా.. బీఎస్ఈ చిన్న తరహా కంపెనీల ఇండెక్స్ 0.27 శాతం మేరకు క్షీణించింది.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 9:10 am

జైపూర్ మృతులకు రూ.2లక్షల నష్టపరిహారం

జైపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి సితాపురా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ డిపోలో ఆకస్మికంగా భారీ ఎత్తున మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే.పెట్రోల్ పైపు లీకేజీ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా పరిశీలించారు.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 9:07 am

కూలిపోయిన ఎమ్ఐ-17 హెలికాప్టర్: 10 మంది గల్లంతు

శుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ధోడా సమీపంలోని చీనాబ్ నదిలో కూలిపోయింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులోనున్న పదిమంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఓ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 9:02 am

సురేఖ "రాజీనామా"ను 'రాజకీయం' చేయొద్దు..!: దానం

దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణంతో ఏర్పడిన మానసిక క్షోభతోనే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే సురేఖ రాజీనామాను రాజకీయం చేయడం సబబు కాదని దానం చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 8:05 am

మళ్లీ నెగటివ్ జోన్‌లోకి స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ మళ్లీ నెగటివ్ జోన్‌లోకి ప్రవేశించింది. దీంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 8 పాయింట్లు కోల్పోయి 16,045 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు లాభపడి 4,764 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.05 శాతం మేరకు క్షీణించగా.. నిఫ్టీ 0.27 శాతం మేరకు లాభపడింది.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 7:43 am

కొండా సురేఖాకు ధైర్యం ఎక్కువ: సబ్బం హరి

మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ్ ధైర్యశాలి అని అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి కితాబిచ్చారు. అన్నమాట ప్రకారమే సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని సబ్బం గుర్తు చేశారు. కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయమై శుక్రవారం సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ.. అవమానాలు, హేళనలు భరించలేకే ఆమె మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారన్నారు.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 7:40 am

వాతావరణ మార్పుతో ఆఫ్రికా అల్లకల్లోలం

వాతావరణంలో ప్రస్తుత పెను మార్పులు ఆఫ్రికా ఖండాన్నే అల్లకల్లోలం చేయనున్నట్లు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ప్రోఫెసర్ సర్ గోర్డోన్ కోన్వె వెల్లడించారు. ఆఫ్రికాలో ప్రస్తుతం ఉన్నదానికన్నా ఇంకా అత్యంత దారుణంగా ఆహార కొరత పెరగనుందని.. అక్కడి ఉష్ణోగ్రతలు కూడా అంచనాలకు మించి పెరిగిపోనున్నట్లు ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 30 Oct 2009 | 7:34 am

మెగాస్టార్ 'చిరంజీవి' కుటుంబం నుంచి మరో నటవారసుడు..?!

టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో నటవారసులు హీరోలుగా ప్రేక్షకులను అలరిస్తోన్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి తనయుడు "చిరుత"గా రంగ ప్రవేశం చేసి, "మగధీర"గా ప్రేక్షకుల మదిలో నిలిచాడు. మరోవైపు యువసామ్రాట్ నాగార్జున కుమారుడు నాగచైతన్య "జోష్"గా వెండితెరకు పరిచయమయ్యాడు. ఇదే తరహాలో చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ త్వరలో నటుడిగా కన్పించబోతున్నాడు. అల్లు అర్జున్, రాజ్ చరణ్ తరహాలో వరుణ్ ప్రతిష్టాత్మకంగా హీరోగా పరిచయం కాబోతున్నాడని ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. రాబోయే రెండేళ్లలో ఇది కార్యరూపం దాల్చనుందని సినీ జనం చెవులు కొరుక్కుంటున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 6:43 am

సస్పెన్స్ థ్రిల్లర్‌గా "అపార్ట్‌మెంట్" సినిమా ప్రారంభం

శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రవివర్మను హీరోగా పరిచయం చేస్తూ.. "అపార్ట్‌మెంట్" చిత్రం రూపొందుతోంది. ఎ.కె. శ్రీకాంత్, సతీష్ కె.వి. వేగేసిన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామానాయుడు స్టూడియోలో పూజతో ఈ సినిమా షూటింగ్‌కు శ్రీకారం చుట్టారు. దేవుని పటాలపై నిర్మాతల్లో ఒకరైన శ్రీకాంత్ క్లాప్ కొట్టగా, మరో నిర్మాత సతీష్ కెమేరా స్విచ్ఛాన్ చేశారు. ఇది ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని, యాక్షన్, థ్రిల్లింగ్ గొలిపే అంశాలు ఇందులో చాలా ఉన్నాయని నిర్మాత అన్నారు. నవంబర్ 9 నుంచి రెగ్యులర్ షూటింగ్‌ను ప్రారంభించి ఏకధాటిగా సాగే షెడ్యూల్తో చిత్రాన్ని పూర్తిచేస్తామని మరో నిర్మాత సతీష్ పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 6:25 am

నా కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రం "ప్రవరాఖ్యుడు": జగపతిబాబు

జగపతిబాబు, ప్రియమణి, హంసానందిని జంటగా నటిస్తోన్న 'ప్రవరాఖ్యుడు' చిత్ర టైటిల్‌ను గురువారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జగపతిబాబు మాట్లాడుతూ.. తన కెరీర్‌లోనే పెద్ద బడ్జెట్ చిత్రమని అన్నారు. కీరవాణి మ్యూజిక్ హైలైట్‌గా ఉంటుందని, ఈ సినిమా పాటల్ని డిస్కో తెక్‌లో కూడా వినేటట్లు సంగీతం అందించారని జగపతిబాబు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 6:02 am

వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే "తేజం"

సన్‌రేస్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై తొమ్మిది మంది హీరోలను పరిచయం చేస్తూ.. రాజ్ కె. ఎస్. గోపి దర్శకత్వంలో రాజశేఖర్ నిర్మిస్తున్న చిత్రం "తేజం". ఈ నెల 29న "తేజం" సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని క్లీన్ "యు" సర్టిఫికేట్‌ను పొందింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తొమ్మిదిమంది హీరోలతో నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవలే సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. మంచి టెక్నికల్ వాల్యూస్‌తో నిర్మించిన ఈ చిత్రం యువత మనోభావాలకి, ప్రస్తుత వాస్తవ పరిస్థితులకి దగ్గరగా ఉంటుందన్నారు. ప్రీతిజింగానియా స్పెషల్ సాంగ్ ఈ చిత్రానికి ఒక హైలైట్‌ కాగా, ఛేజింగ్, బ్రహ్మానందం కామెడీ మరో హైలైట్‌గా నిలువనున్నాయని చెప్పారు. సెన్సార్ సభ్యుల నుంచి ప్రస్తుత వాస్తవ పరిస్థితుల మీద మంచి చిత్రాన్ని నిర్మించారన్న ప్రశంసలు అందుకున్న ఈ చిత్రాన్ని నవంబర్ రెండో వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 30 Oct 2009 | 5:39 am

కూలిపోయిన ఎమ్ఐ-17 హెలికాప్టర్: 10 మంది గల్లంతు

శుక్రవారం దేశీయ వాయుసేనకు చెందిన ఓ హెలికాప్టర్ ప్రమాదవశాత్తు ధోడా సమీపంలోని చీనాబ్ నదిలో కూలిపోయింది. హెలికాప్టర్ కూలిపోవడంతో అందులోనున్న పదిమంది గల్లంతయ్యారు. గల్లంతైనవారిలో ఓ మృతదేహం లభించిందని అధికారులు తెలిపారు.
Source: జాతీయ | 30 Oct 2009 | 3:39 am

జైపూర్ మృతులకు రూ.2లక్షల నష్టపరిహారం

జైపూర్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డిపోలో సంభవించిన భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు రూ. 2లక్షల పరిహారాన్ని రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించింది. గురువారం అర్ధరాత్రి సితాపురా పారిశ్రామిక ప్రాంతంలోని ఈ డిపోలో ఆకస్మికంగా భారీ ఎత్తున మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ పైపు లీకేజీ వల్లే ఈ అగ్నిప్రమాదం చోటు చేసుకుందని అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సంఘటనా స్థలాన్ని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి మురళీ దేవరా పరిశీలించారు.
Source: జాతీయ | 30 Oct 2009 | 3:38 am

సురేఖ "రాజీనామా"ను 'రాజకీయం' చేయొద్దు..!: దానం

దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణంతో ఏర్పడిన మానసిక క్షోభతోనే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కొండా సురేఖ రాజీనామా చేశారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్ అన్నారు. అయితే సురేఖ రాజీనామాను రాజకీయం చేయడం సబబు కాదని దానం చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Oct 2009 | 2:35 am

నరేంద్ర మోడీని సోకిన స్వైన్ ఫ్లూ మహమ్మారి..!

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న స్వైన్ ఫ్లూ మహమ్మారి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కూడా సోకింది. గుజరాత్ సీఎం నరేంద్రమోడీకి హెచ్1ఎన్1 వైరస్ సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. రష్యా పర్యటనకు వెళ్లి వచ్చిన అనంతరం ఆయనలో స్వైన్ ఫ్లూ లక్షణాలు బయటపడ్డాయని వైద్యులు చెప్పారు. దీంతో నరేంద్రమోడీని వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడిన నరేంద్ర మోడీకి జరిపిన స్వైన్ ఫ్లూ పరీక్షల్లో పాజిటివ్ అని తేలిందని వైద్యులు చెప్పారు.
Source: జాతీయ | 30 Oct 2009 | 2:29 am

కొండా సురేఖాకు ధైర్యం ఎక్కువ: సబ్బం హరి

మంత్రి పదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ్ ధైర్యశాలి అని అనకాపల్లి కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి కితాబిచ్చారు. అన్నమాట ప్రకారమే సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేశారని సబ్బం గుర్తు చేశారు. కొండా సురేఖ తన మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయమై శుక్రవారం సబ్బం హరి మీడియాతో మాట్లాడుతూ.. అవమానాలు, హేళనలు భరించలేకే ఆమె మంత్రి పదవికి గుడ్‌బై చెప్పారన్నారు.
Source: ఏపీ న్యూస్ | 30 Oct 2009 | 2:10 am

దలైలామా మా రాష్ట్ర అతిథి: అరుణాచల్ సీఎం ఖండూ

బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు దలైలామా తమ రాష్ట్ర అతిథి అని అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి దూర్జీ ఖండూ స్పష్టం చేశారు. వచ్చే నెల ఏడో తేదీ నుంచి దలైలామా వారం రోజుల పాటు అరుణాచల్ ప్రదేశ్‌లో పర్యటించనున్నారు.
Source: జాతీయ | 30 Oct 2009 | 1:01 am

మానసిక వేదనతో సురేఖ రాజీనామా: సీఎం రోశయ్య

ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి దుర్మరణంతో కొండా సురేఖ మానసిక వేదన అనుభవిస్తున్నారని, అందువల్లే ఆమె మంత్రిపదవికి రాజీనామా చేశారని ముఖ్యమంత్రి కె.రోశయ్య తెలిపారు. ఆమె రాజీనామా వల్ల ఎలాంటి నష్టం వాటిల్లబోదని ఆయన శుక్రవారం తేల్చి చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 30 Oct 2009 | 12:17 am

ముఖ్యమంత్రి రోశయ్యతో సమావేశమైన ధర్మపురి

మంత్రి కొండా సురేఖ రాజీనామా నేపథ్యంలో ముఖ్యమంత్రి రోశయ్యతో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ గురువారం రాత్రి సమావేశమయ్యారు. వీరిద్దరు సుమారు గంట పాటు చర్చలు జరిపినట్టు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 11:48 pm

ఉంటే ఉండండి.. పోతే పోండి: సీఎం రోశయ్య హుకుం!

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మంత్రివర్గంపై పట్టు సాధిస్తున్నారు. తనను ధిక్కరించే మంత్రులపై వేటు వేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం ఆయన స్వభానికి విరుద్ధంగా కాస్త కఠిన వైఖరిని అవలంభించాలని నిశ్చయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 11:43 pm

ఐఓసీలో అగ్నిప్రమాదం: 15కు చేరిన మృతుల సంఖ్య

రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌లోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈప్రమాదంలో ఇప్పటి వరకు 15 మంది మృత్యువాత పడ్డారు. వంద మందికి పైగా గాయాలపాలయ్యారు.
Source: జాతీయ | 29 Oct 2009 | 11:29 pm

మావోయిస్టుల బెడదను తిప్పికొడతాం: ప్రధాని మన్మోహన్

దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న మావోయిస్టుల దుశ్చర్యలను సమర్థవంతంగా తిప్పికొడతామని ప్రధాని మన్నోహన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి ద్విముఖ వ్యూహం అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన నొక్కివక్కాణించారు.
Source: జాతీయ | 29 Oct 2009 | 10:00 pm

సరిహద్దు వివాద పరిష్కారానికి కాలపరిమితి లేదు: కృష్ణ

భారత-చైనా దేశాల మధ్య దీర్ఘకాలికంగా నెలకొని వున్న సరిహద్దు వివాదం పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితి లేదని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ఎం.కృష్ణ స్పష్టం చేశారు. ఇదో నిరంతర, దీర్ఘకాలిక ప్రక్రియ అని స్పష్టం చేశారు.
Source: జాతీయ | 29 Oct 2009 | 9:52 pm

మాస్‌ను ఆకట్టుకునే ప్రభాస్ "ఏక్‌ నిరంజన్"

"ఏక్‌నిరంజన్"లో చోటుగా ప్రభాస్ పాత్రకు న్యాయం చేశాడు. మాస్‌ను బాగా ఆకట్టుకునే స్టైల్‌లో కనిపించాడు. కానీ డైలాగ్ మాడ్యులేషన్ రొటీన్‌కు భిన్నంగా మార్చే క్రమంలో లాగి.. లాగి.. మాట్లాడినట్లుంది.ఛత్రపతి తరహాలో మాడ్యులేషన్ ఉంది. సమీరాగా కంగనా తెలుగుకు పరిచయమైన బాలీవుడ్ నటి. ఆమెతో హావభావాలు పలికించడం తక్కువే. క్లోజప్‌లో డ్రగ్గిస్ట్‌గా కన్పిస్తుంది. ఇతర హీరోయిన్లలో ఉండే చురుకుదనం ఆమెలో లోపించింది. తంత్ర జ్యోతిష్య పండిట్‌గా బ్రహ్మానందం, ఆయన భార్యగా అభినయ శ్రీ, జూ. రేలంగిగా నటించారు. జ్యోతిష్యం చెప్పే సన్నివేశాలు హ్యాస్యాన్ని పండించినా మంత్ర జ్యోతిష్యుడు (అలీ) పాత్రలో పూర్తిగా నీరుగారిపోయింది. కేవలం అభినయ శ్రీకి అలీ దగ్గరకావడం అనే ట్రాక్ విసుగుపుట్టింది. సినిమా మొత్తంగా సోనూసూద్, అతని అసిస్టెంట్ బ్రహ్మాజీ, ఆ తర్వాత ప్రభాస్‌పై జరిగే సన్నివేశాలు, సంభాషణలే ఎంటర్‌టైన్ చేస్తాయి. విలన్‌ను కొత్తగా చూపించే క్రమంలో పూరీ జగన్నాథ్ సక్సెస్ అయ్యాడు. రొటీన్ విలనే అయినా విలన్ మేనరిజం, ప్రవర్తన ఆకట్టుకుంటాయి. భరణి, సంగీత పాత్రలు రొటీన్‌గా ఉన్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2009 | 11:47 am

"నేహాశర్మ" గ్లామర్ పంట పండింది.. అంతవరకేనా..?!

"చిరుత" చిత్రంలో "మగధీర" కథానాయకుడు రామ్‌చరణ్ సరసన నటించిన గ్లామర్ భామ నేహాశర్మ. 'చిరుత'లో అందాల ఆరబోతతో పండినా నటనాపరంగా, అందంపరంగా చాలా వరకు అభిమానుల్ని ఆకర్షించుకోలేకపోయింది. అయితే నేహాశర్మ మాత్రం అందాల ఆరబోతతో అవకాశాలు మోతెత్తిపోతాయనుకుంది. కాని ఆ తర్వాత ఆమెకు ఆశించినంత ఛాన్సులు రాలేదు. చిరుత సినిమా గ్యాప్ తర్వాత 'హ్యాపీడేస్' ఫేమ్ వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు చిత్రంలో నేహా నటిస్తోంది. కానీ చరణ్ తొలి సినిమాలో ఆమెను ఎందుకు ఎంపికచేశారనే విమర్శలు ఇప్పటికీ ఫిలిం నగర్ వర్గాల్లో షికార్లు చేస్తూనే ఉన్నాయి. మరోవైపు "చిరుత" చరణ్ తొలి చిత్రం కాబట్టి ఆకర్షణీయంగా నిలవాలనే ఆకాంక్షతో నేహాశర్మను ఎంపిక చేసినట్లు సినీ పెద్దలు విశ్లేషించారు. ప్రస్తుతం నేహాను తీసుకోవడానికి ఏ నిర్మాత ముందుకు రావడం లేదు. మొన్నీమధ్యే బెల్లంకొండ సురేష్‌కూడా ఓ చిత్రానికి ఫోటోసెషన్స్ కోసం పిలిపించి మళ్లీ వద్దనుకుని వదిలేశాడు. కాకపోతే ఆమె రాకపోక ఛార్జీలు కూడా ఇచ్చి మరీ పంపాడు. మరి దేనికైనా ఇండస్ట్రీలో టైం ముండాలి. కదా.. మరి మీరేమంటారు..?.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2009 | 10:28 am

"మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం"గా ప్రకాష్, భూమికల చిత్రం!?

ప్రకాష్‌రాజ్, భూమిక జంటగా నటిస్తోన్న చిత్రానికి "మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం" అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై టేకుల కృపాకరరెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కొంతకాలం దాసరి నారాయణరావు దగ్గర పనిచేసి, విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2009 | 9:18 am

జగన్‌కు వ్యతిరేకంగా "కమ్మ" లాబీయింగ్!: కొండా సురేఖ

మంత్రిపదవికి రాజీనామా చేసిన కొండా సురేఖ తీవ్రమైన, సంచలనమైన ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కమ్మ లాబీయింగ్ పని చేస్తోందని దుయ్యబట్టారు.
Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 9:12 am

మంత్రి పదవికి కొండా సురేఖ రాజీనామా!

ఎట్టకేలకు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుచరులు రాజీనామాలకు శ్రీకారం చుట్టారు. అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా రాష్ట్ర మంత్రిపదవికి కొండా సురేఖ గురువారం సాయంత్రం రాజీనామా లేఖ రాశారు.
Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 9:11 am

అల్లు అర్జున్ "ఆర్య-2" పాటలొచ్చేస్తున్నాయ్..!

క్రేజీ హీరో అల్లు అర్జున్, 'మగధీర' కథానాయిక కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "ఆర్య-2" ఆడియో నవంబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ఆదిత్యబాబు, బోగవల్లి ప్రసాద్‌లు వెల్లడించారు. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 29 Oct 2009 | 8:18 am

హైదరాబాద్‌ నోవోటెల్‌ వైపు కర్ణాటక రాష్ట్ర "గాలి"

కర్ణాటక రాష్ట్ర రాజకీయాలు హైదరాబాద్‌కు చేరుకున్నాయి. కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్.యడ్యూరప్పపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన గాలి సోదరులు సీఎంను మార్చాలని డిమాండ్ చేస్తున్నారు.
Source: జాతీయ | 29 Oct 2009 | 7:52 am

మాస్‌ను ఆకట్టుకునే ప్రభాస్ "ఏక్‌ నిరంజన్"

"ఏక్‌నిరంజన్"లో చోటుగా ప్రభాస్ పాత్రకు న్యాయం చేశాడు. మాస్‌ను బాగా ఆకట్టుకునే స్టైల్‌లో కనిపించాడు. కానీ డైలాగ్ మాడ్యులేషన్ రొటీన్‌కు భిన్నంగా మార్చే క్రమంలో లాగి.. లాగి.. మాట్లాడినట్లుంది. ఛత్రపతి తరహాలో మాడ్యులేషన్ ఉంది. సమీరాగా కంగనా తెలుగుకు పరిచయమైన బాలీవుడ్ నటి. ఆమెతో హావభావాలు పలికించడం తక్కువే. క్లోజప్‌లో డ్రగ్గిస్ట్‌గా కన్పిస్తుంది. ఇతర హీరోయిన్లలో ఉండే చురుకుదనం ఆమెలో లోపించింది.
Source: వినోదం | 29 Oct 2009 | 6:25 am

ట్రెక్కింగ్‌, రాక్‌ క్లైంబింగ్‌‌లతో సాహసాలు చేద్దామా..?!

ఓ వైపు కింద పరవళ్లు తొక్కుతూ ప్రవహించే నదీ ప్రవాహం.. పైన తాళ్లతో వేలాడే చెక్క వంతెన... అడుగులో అడుగు వేసుకుంటూ ఆ వంతెనపై నడుస్తూ నదిని దాటాలంటే ఎవరికైనా గట్స్ ఉండాల్సిందే..! మరోవైపు పెద్ద లోయ.. కిందికి చూస్తే ప్రాణాలు పైపైనే పోతాయన్న భయం.. అలాంటి చోటుకి కొండ పైనుంచి కిందికి తాళ్లతో జారుకుంటూ పోతే... తలచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తోంది కదూ...?..
Source: వినోదం | 29 Oct 2009 | 5:08 am

ప్రభుత్వ ఏర్పాటుకు భాజపాతో చేతులు కలపం: పవార్

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మతవాద పార్టీగా ముద్రపడిన భారతీయ జనతా పార్టీతో చేతులు కలపబోమని నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్, కేంద్ర వ్యవసాయ శాఖామంత్రి శరద్ పవార్ తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 29 Oct 2009 | 5:02 am

ముష్కరులపై చర్యలు సంతృప్తికరంగా లేవు: ప్రధాని

దేశ వాణిజ్య రాజధాని ముంబైపై మారణహోమానికి పాల్పడిన ముష్కరులపై పాకిస్థాన్ తీసుకున్న చర్యలు ఏమాత్రం సంతృప్తికరంగా లేవని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 29 Oct 2009 | 5:02 am

"చిరుత"నయుడి "మగధీర" ట్రైలర్ మీకోసం..

"చిరుత"నయుడు రామ్‌చరణ్ తేజ హీరోగా, అందాల రాశి కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించిన బ్లాక్ బ్లస్టర్ మూవీ "మగధీర". యాక్షన్, లవ్, ఎంటర్‌టైన్‌మెంట్ వంటి అన్ని అంశాల మేళవింపుతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. హాలీవుడ్ స్థాయిలో నిలిచింది. తమిళ చిత్రాలైన ‘శివాజి’, ‘దశావతారం’, తర్వాత ‘మగధీర’ చిత్రం సినిమా ఇండస్ట్రీలో ఒక చరిత్రను సృష్టింస్తోంది.
Source: వినోదం | 29 Oct 2009 | 4:13 am

సత్యం కుంభకోణంపై దర్యాప్తుకు ప్రత్యేక కోర్టు: కేబినెట్

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణంపై దర్యాప్తును వేగవంతం చేసే దిశగా ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర మంత్రి మండలి గురువారం నిర్ణయించింది. గురువారం సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య అధ్యక్షతన రాష్ట్ర కేబినేట్ సమావేశమైంది. ఈ సందర్భంగా 50 సంవత్సరాలు నిండిన గీతకార్మికులకు ప్రతినెల రూ. 200 వృద్ధాప్య పించను ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదించింది. ఇందుకోసం రూ. 18 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించింది.
Source: ఏపీ న్యూస్ | 29 Oct 2009 | 3:59 am

"మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం"గా ప్రకాష్, భూమికల చిత్రం!?

ప్రకాష్‌రాజ్, భూమిక జంటగా నటిస్తోన్న చిత్రానికి "మిస్టర్ అండ్ మిసెస్ వెంకటేశం" అనే పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని అమోద్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై టేకుల కృపాకరరెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. కొంతకాలం దాసరి నారాయణరావు దగ్గర పనిచేసి, విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత ఈ కుటుంబకథా చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
Source: వినోదం | 29 Oct 2009 | 3:49 am

అల్లు అర్జున్ "ఆర్య-2" పాటలొచ్చేస్తున్నాయ్..!

క్రేజీ హీరో అల్లు అర్జున్, 'మగధీర' కథానాయిక కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న "ఆర్య-2" ఆడియో నవంబర్ ఒకటో తేదీన విడుదల చేస్తున్నామని చిత్ర నిర్మాతలు ఆదిత్యబాబు, బోగవల్లి ప్రసాద్‌లు వెల్లడించారు. ఆదిత్య ఆర్ట్స్ పతాకంపై రూపొందుతోన్న ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: వినోదం | 29 Oct 2009 | 3:29 am

అక్షయ్‌కుమార్‌తో "బంపర్ ఆఫర్": పూరీ జగన్నాథ్

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాంశంకర్ హీరోగా నటించిన "బంపర్ ఆఫర్" చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పూరి చెప్పారు. తెలుగులో విడుదలైన "బంపర్ ఆఫర్" సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయని, ఏలూరు ప్రాంతంలో పక్కన ఉన్న థియేటర్లలో కూడా వేరే సినిమా ఆపి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత పూరీ జగన్నాథ్ వెల్లడించారు.
Source: వినోదం | 29 Oct 2009 | 3:28 am

"మెగాస్టార్" రికార్డు అడుగు జాడల్లో "మెగా పవర్ స్టార్"

రెండో సినిమాతోనే టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన రామ్ చరణ్ తేజ తన కెరీర్ గ్రాఫ్‌ను మరింత పగడ్బందీగా రూపొందించుకుంటున్నాడు. ఓ సామాన్య సినీ జీవిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన చిరంజీవి ఎంతటి ఘన రికార్డులను సాధించారో... వాటన్నిటినీ అనుక్షణం మననం చేసుకుంటూ ముందుకు సాగుతానంటున్నాడు. ఇప్పటికీ తన తండ్రి చిరంజీవి కెరీర్ ప్రారంభంలో నటించిన సినిమాలు మొదలు ఇంద్ర, ఠాగూర్ వరకూ అన్ని చిత్రాలను సమయం దొరికినపుడల్లా చూస్తుంటానని చెపుతాడు ఈ చిరుత. టాలీవుడ్ కుర్ర హీరోల్లో ఎవర్‌గ్రీన్ బాయ్‌గా పేరుతెచ్చుకున్న మహేష్ బాబుకు సమానమైన పోటీనివ్వడంలో ఇతర కుర్రహీరోలు విఫలమయ్యారు. అసలు మహేష్ బాబు ఇమేజ్‌ను చేరుకోగల కుర్ర హీరో టాలీవుడ్‌లో లేరనే చాలామంది అనుకున్నారు. ఈ పరిస్థితుల్లో రామ్ చరణ్ తేజ మగధీర దూసుక వచ్చింది. విడుదలైన అన్ని ప్రధాన కేంద్రాల్లో శతదినోత్సవానికి పరుగులు తీయడమే కాక పోకిరి రికార్డులను అధిగమించే దిశలో పయనిస్తోంది.
Source: వినోదం | 29 Oct 2009 | 3:28 am

ఆ పాట విన్నా... సినిమా తీయాలనిపించి వచ్చా: చరణ్ రాజ్

కథ వినకుండానే ఓ ఛానల్‌లో ఎక్కువగా ప్రసారం చేస్తున్న ఓ ప్రైవేట్ సాంగ్‌ను విని దానికి స్పందించి ఆ పాట వెనుక ఉన్న కథను ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనుకుంటున్నాడు నటుడు చరణ్ రాజ్. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ వివరాలను ఆయనే తెలియజేస్తూ... కరీంనగర్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి పాట టీవీలో వస్తుంటే ఓ స్నేహితుడు చెప్పడంతో చూశాను. అది ఎంతో నచ్చింది. అతని హృదయ వేదన ఆ పాటలో ఉంది. "నా ప్రాణమా... విడిపోకుమా అనిత... ఓ వనిత... నా ప్రేమను దోచిన అనిత..." అంటూ ఆయన ఆ పాట పాడి వినిపించారు.
Source: వినోదం | 29 Oct 2009 | 3:28 am

సిద్ధార్థ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం

పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ టాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు కె. ప్రకాష్ రూపొందించే నూతన చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. లవర్‌బాయ్ సిద్ధార్థ హీరోగా నటించే ఈ సినిమా షూటింగ్ ఆదివారం రామోజీ ఫిలింసిటీలో లాంఛనంగా ప్రారంభమైంది. శృతిహాసన్, సిద్ధార్థ, ప్రముఖ టీవీ యాక్టర్, బాలనటి శ్రియాశర్మలపై తీసిన తొలిషాట్‌కు 'మగధీర' దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు.
Source: వినోదం | 29 Oct 2009 | 3:27 am

నంది అవార్డు దక్కడానికి పూరీనే కారణం: రవితేజ

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "నేనింతే" సినిమాకు నంది అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని క్రేజీ హీరో రవితేజ అన్నారు. తనను హీరోగా పెట్టి తీసిన సినిమాకు అవార్డు లభించడం, తానీస్థాయిలో ఉండటానికి కారణం పూరిజగన్నాథేనని ఆయన చెప్పారు.
Source: వినోదం | 29 Oct 2009 | 3:26 am