|
78 పాయింట్ల నష్టంతో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం 78 పాయింట్లు నష్టంతో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 16,276 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 17 పాయింట్లు నష్టపోయి 4,830 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.48 శాతం, నిఫ్టీ 0.35 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 9:42 am పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధం: ప్రధాని మన్మోహన్జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్‌తో సహా రాష్ట్రంలోని అన్నివర్గాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 9:34 am కొత్త వాహనాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టిన హోండాజపాన్కు చెందిన హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ సంస్థకు చెందిన హోండా మోటార్ సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీలో మంగళవారం మోటోస్కూటర్ ఏవియేటర్‌కు చెందిన కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 9:26 am పెషావర్‌లో కారుబాంబు పేలుడు: 45మంది మృతిపాకిస్థాన్లోని పెషావర్‌లో బుధవారం మధ్యాహ్నం కారుబాంబు పేలడంతో అక్కడికక్కడే 45మంది మృతి చెందగా 100 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 9:03 am స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న నష్టాలుస్టాక్ మార్కెట్లో నష్టాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 92 పాయింట్లు బలహీనపడి 16,261 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 24 పాయింట్లు నష్టపోయి 4,822 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.57 శాతం, నిఫ్టీ 0.50 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 8:47 am భారత్‌లో మరిన్న దాడులు జరుపుతాం: అల్ఖైదానిరుడు నవంబర్ నెలలో ముంబైలో జరిగిన దాడులకు భిన్నంగా భారతదేశంలో మరోసారి తాము దాడులకు పాల్పడనున్నట్లు అల్‌ఖైదాకు చెందిన ప్రముఖ కమాండర్ ఇలియాస్ కశ్మీరీ అన్నారు.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 7:51 am రికవరీ నుంచి మళ్లీ నష్టాల్లోకి స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం రికవరీ నుంచి మళ్లీ నష్టాల్లోకి ప్రవేశించడంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 52 పాయింట్లు కోల్పోయి 16,301 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 10 పాయింట్లు నష్టపోయి 4,836 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.32 శాతం, నిఫ్టీ 0.21 శాతం మేరకు క్షీణించాయి.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 7:31 am లాభాలబాటలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికాంతానికి హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సంస్థ నికర లాభాలు 5.67 శాతం పైకెగసి రూ. 1,295 కోట్లకు చేరుకుందని బుధవారం బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు తెలిపింది.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 7:30 am కొలువుదీరిన హర్యానా కొత్త అసెంబ్లీ: రేపు బల పరీక్షహర్యానా రాష్ట్ర కొత్త అసెంబ్లీ బుధవారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాతో సహా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. వీరితో ప్రొటెం స్పీకర్ అజయ్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు.Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 6:53 am జాబ్స్: ఇండియన్ నేవీ ఉద్యోగాలుఇండియన్ నేవీ ఆర్మమెంట్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ ఇన్‌స్పెక్షన్ కేడర్ 2010, జూలై కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ చేశారు. పందొమ్మిదిన్నర ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయసు లోపు వారు అర్హులు (1985, జూలై 2 నుంచి 1991, జనవరి 1వ తేదీ మధ్యన జన్మించి ఉండాలి). అలాగే అవివాహితులై ఉండాలి. పురుషులు మాత్రమే దీనికి అర్హులు. ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్ లేదా మెకానికల్ బ్రాంచ్‌లలో బీటెక్ లేదా బీఈ లేదంటే.. ఫిజిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్‌లలో పోస్ట్ గ్రాడ్యుయేషన్Source: Yahoo! Telugu: News | 28 Oct 2009 | 6:53 am అఆ.. ఇఈ... ఆంటీల వక్షోజపు అందాల పోటీశ్రీకాంత్, మీరా జాస్మిన్, సదా కాంబినేషన్లో "అఆ.. ఇఈ" చిత్రం ఎట్టకేలకు విడుదలవుతోంది. సదా తన ఓవర్‌డోస్ గ్లామర్‌ను తొలిసారిగా చూపించబోతోంది. చాన్నాళ్లుగా సినీ ఛాన్సులు లేక నకనకలాడుతున్న సదా తన బొడ్డు, వక్షోజపు అందాలను ఎడాపెడా చూపించినట్లు భోగట్టా. దీనికితోడు ఆ అందాలపైనే శ్రీకాంత్ ఏపిల్, ద్రాక్ష పండ్లను విసురుతూ వాటిపై పడిన ద్రాక్ష పండ్లను ఏరుకుని తినే సన్నివేశాలు యూత్‌ను మత్తెక్కిస్తాయని అంటున్నారు. అయితే సెన్సార్ అభ్యంతరాలు చెప్పినా ఇది ఊహాజనితమైన పాట గనుక ఇటువంటివాటిపై అంత లోతుగా చూడాల్సిన పనిలేదనే శ్రీకాంత్ డైలాగు ఉంది. దీంతో ఆ పాటకు సెన్సార్ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదిలావుంటే రమ్యశ్రీ ఈ చిత్రంలో మరింత అందాలను ఆరబోసింది. చాలా కష్టపడి ఎక్స్‌పోజింగ్ చేసినట్లు సమాచారం. సదా చేస్తే లేనిది తాను చేస్తే తప్పేంటి? అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. అపూర్వ కూడా తన వక్షోజపు సౌందర్యాన్ని కావలసిన మేరకు ఆరబోసినట్లు సమాచారం. మరి ఇంత మంది తమ అందాలను "అఆ.. ఇఈ" అంటూంటే ప్రేక్షకులు ఎలా ఆస్వాదిస్తారో చూడాలి.Source: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2009 | 6:00 am డిసెంబరు 5న "విలేజ్ వినాయకుడు"కృష్ణుడు, సరనయ హీరోహీరోయిన్లుగా సాయికిరణ్ అడవి దర్శకత్వంలో మూన్ వాటర్ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహి నిర్మిస్తున్న విలేజ్ వినాయకుడు చిత్రాన్ని వచ్చే నెల 5వ తేదీన విడుదల చేస్తున్నట్లు దర్శకుడు చెప్పారు. ఇటీవల విడుదలైన ఆడియోకు మంచి స్పందన వచ్చిందన్నారు. ప్రస్తుతం మ్యూజిక్ టూర్లో ఉన్నామని తెలియజేస్తూ... బుధవారం నుంచి వైజాగ్‌లో బయలుదేరి తిరుపతి వరకూ యాత్ర చేస్తున్నట్లు వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 28 Oct 2009 | 5:39 am పాకిస్థాన్‌తో చర్చలకు సిద్ధం: ప్రధాని మన్మోహన్జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం పాకిస్థాన్‌తో సహా రాష్ట్రంలోని అన్నివర్గాలతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటించారు.Source: జాతీయ | 28 Oct 2009 | 4:05 am కొలువుదీరిన హర్యానా కొత్త అసెంబ్లీ: రేపు బల పరీక్షహర్యానా రాష్ట్ర కొత్త అసెంబ్లీ బుధవారం కొలువుదీరింది. ముఖ్యమంత్రి భూపీందర్ సింగ్ హుడాతో సహా కొత్త ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తొమ్మిది మంది మహిళా సభ్యులు కూడా ఉన్నారు. వీరితో ప్రొటెం స్పీకర్ అజయ్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేయించారు.Source: జాతీయ | 28 Oct 2009 | 1:24 am "రాజధాని" హైజాక్ క్షమించరాని నేరం: సీఎం నవీన్రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలును మావోయిస్టులు హైజాక్ చేయడం క్షమించరాని నేరమని ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ అన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్య తీసుకోవాలని ఆయన బుధవారం అన్నారు.Source: జాతీయ | 28 Oct 2009 | 1:03 am ఫ్రీజోన్‌పై తెరాస వార్: తెలంగాణా ప్రాంతాల్లో జైల్భరోహైదరాబాద్ ఫ్రీజోన్ అంశంపై తెలంగాణా రాష్ట్ర సమితి బుధవారం తెలంగాణా ప్రాంతాల్లో జైల్‌భరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో పాల్గొన్న తెరాస నేతలతో పాటు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2009 | 12:47 am హస్తినలో బొత్స: డీఎస్ పిలుపులో ఆంతర్యమేమి!రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణను హుటాహుటిన ఢిల్లీకి పిలిపించడానికి గల కారణాలపై రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. ఢిల్లీ అధిష్టానం పిలుపు మేరకు సోమవారం సాయంత్రం పీసీసీ చీఫ్ ధర్మపురి శ్రీనివాస్ ఢిల్లీకి వెళ్లారు.Source: ఏపీ న్యూస్ | 28 Oct 2009 | 12:19 am ఇంగిత జ్ఞానంలేని చౌకబారు నేత కేసీఆర్: బాబురాష్ట్ర రాజకీయ నేతల్లో ఉన్నటువంటి వారిలో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావుకు కాస్త కూడా ఇంగిత జ్ఞానం లేదని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇలాంటి వ్యక్తి భవిష్యత్‌లో కూడా మళ్లీ పుట్టబోరన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 11:54 pm ముఖ్యమంత్రి రోశయ్య పితృసమానులు: మంత్రి సురేఖముఖ్యమంత్రి రోశయ్య తనకు పితృసమానులని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమాభివృద్ధి శాఖామంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఆయనతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 11:43 pm దేవదేవుని సాక్షిగా.. ఒక్కటైన 7700 జంటలుతిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కళ్యాణమస్తు కార్యక్రమంలో 7700 జంటలు ఒక్కటయ్యాయి. తితిదే అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఐదో విడత కల్యాణమస్తు విజయవంతమైంది.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 11:36 pm నేడు కాశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మన్మోహన్ప్రధాని మన్మోహన్ సింగ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి బుధవారం వెళ్లనున్నారు. ఈ పర్యటనలో దేశంలోనే అతిఎత్తైన రైల్వే లైనును ఆయన ప్రారంభించి అనంతనాగ్-ఖాజిగడ్‌ల మధ్య రైలు సర్వీసులకు జెండా ఊపుతారు.Source: జాతీయ | 27 Oct 2009 | 11:15 pm మహారాష్ట్ర ప్రభుత్వంలో కీలక శాఖలు కావాలి: ఎన్.సి.పిమహారాష్ట్రలో కొత్తగా ఏర్పాటు కానున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంలో తమకు కీలక శాఖలు కేటాయించని పక్షంలో తాము ప్రభుత్వంలో పాలు పంచుకోమని ఎన్.సి.పి చీఫ్ శరద్ పవార్ మేనల్లుడు, కీలక నేత అజిత్ పవార్ స్పష్టం చేశారు.Source: జాతీయ | 27 Oct 2009 | 10:45 pm భాజపాకు సర్జరీ అవసరం: ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్భారతీయ జనతా పార్టీకి కాన్సర్ వ్యాధి సోకిందని అందువల్ల ఆ పార్టీకి సర్జరీ అవసరమని రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్) చీప్ మోహన్ భాగవత్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ పార్టీకి చికిత్స అవసరమో కాదో కమలనాథులే తేల్చుకోవాలని ఆయన సూచించారు.Source: జాతీయ | 27 Oct 2009 | 9:37 pm సారాయి కథల ప్రేరణతో "సారాయి వీర్రాజు"అజయ్ హీరోగా, డి.ఎస్. కణ్ణన్ దర్శకత్వంలో విశాలాక్షి క్రియేషన్స్ పతాకంపై, పరుచూరి కోటేశ్వరరావు నిర్మిస్తున్న "సారాయి వీర్రాజు" చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. శ్రీసాయి అద్భుతంగా మ్యూజిక్ అందించారని దర్శకుడు అన్నారు. ఇందులో హీరో పేరు సారాయి వీర్రాజు. సారాయి కాస్తుంటాడు. 60శాతం వెటకారం, 30శాతం వీరత్వం, ఒక శాతం నీతి నిజాయితీ, ధైర్యం కలిగిన వ్యక్తిగా ప్రేక్షకులకు కన్పిస్తాడు. స్క్రీన్‌ప్లే కొత్తగా ఉంటుంది. సహజత్వం కోసం నర్సీపట్నంకు చెందిన 180 మందిని ఇందులో నటింపజేశాం. సంభాషణలు కూడా సహజంగా ఉంటాయని దర్శకుడు తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ.. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతోంది. నవంబర్ మొదటివారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. అజయ్ పాత్ర చిత్రణ ఈ సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని, ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Oct 2009 | 11:19 am నవంబరులో తెరపైకి రానున్న కరిష్మా కొటక్ "గ్లామర్"గతంలో ప్రత్యూష, సర్ధార్ చిన్నపరెడ్డి, అయ్యప్పదీక్ష, రంగులకల, టి.నగర్ (తమిళ్) వంటి 15 చిత్రాలు నిర్మించిన నటుడు, దర్శక నిర్మాత పి. సత్యారెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వంలో "గ్లామర్" చిత్రం రూపుదిద్దుకుంటోంది. "శంకర్‌దాదా జిందాబాద్" ఫేమ్ కరిష్మాకొటక్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ను పూర్తిచేసుకుంది. నవంబర్ మొదటివారంలో ఆడియోను లహరి మ్యూజిక్ ద్వారా సినీ ప్రముఖుల సమక్షంలో విడుదల చేస్తామని దర్శక నిర్మాత చెప్పారు. నిర్మాణానంతర పనులను ఈ రోజునుంచే మొదలుపెట్టి, నవంబర్ చివరి వారంలో సినిమాను విడుదల చేస్తామన్నాన్నారు. కాగా చలనచిత్ర పరిశ్రమ కోసం ఎన్నో సేవలు చేసిన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్. రాజశేఖర రెడ్డికి ఈ చిత్రాన్ని అంకితమిస్తున్నట్లు ఆయన తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Oct 2009 | 11:02 am ప్రజలపక్షాన పోరాడతాం: చంద్రబాబు నాయుడుప్రజల సమస్యలను తీర్చేందుకు తమ పార్టీ ప్రభుత్వం నిరంతరం పోరాటం చేస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 10:18 am సబితా, కేవీపీలను బర్త్‌రఫ్ చేయండి : యనమలదివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికి భద్రత కల్పించడంలో విఫలమైన రాష్ట్ర హోంశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర భద్రతా సలహా సంఘం ఛైర్మన్ కేవీపీరామచంద్రరావులను వెంటనే బర్త్‌రఫ్ చేయాలని మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 10:18 am "రాజధాని" ప్రయాణికులు సురక్షితం: చిదంబరంమావోయిస్టులు తమ అధీనంలోకి తీసుకున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని హోం మంత్రి పి. చిదంబరం వెల్లడించారు. సీఆర్పీఎఫ్ దళాలతోపాటు రాష్ట్ర పోలీసులు సంఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారన్నారు.Source: జాతీయ | 27 Oct 2009 | 10:08 am రాజకీయాలు వేరు.. వ్యక్తిగత జీవితం వేరు: చిరంజీవిరాజకీయాలను, వ్యక్తిగత జీవిత అంశాలను వేర్వేరుగా చూడాలని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మీడియాకు విజ్ఞప్తి చేశారు. ఒక వ్యక్తి బాధలో ఉన్నపుడు ఆ వ్యక్తిని ఓదార్చడం కనీస మానవ ధర్మమన్నారు. దీన్ని రాజకీయం చేయడం తగదన్నారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 7:07 am ఎన్ని కుట్రలు పన్నినా నా పదవికి ఢోకాలేదు: డీఎస్రాష్ట్ర రాజకీయ నేతలు ఎన్ని రకాల కుట్రలు, కుతంత్రాలు పన్నినా తన పదవికి వచ్చిన ముప్పేమీ లేదని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 27 Oct 2009 | 6:00 am అందాన్ని అందంగా చూపితే ఎక్స్‌పోజింగ్ అంటారేం...?ఎక్స్‌పోజింగ్ అంటే ఏమిటి? అది ఎలా ఉంటుంది? అంటూ నటి కంగనా రనౌత్ ప్రశ్నిస్తోంది. ఏమిటి ఆశ్చర్యంగా ఉందా? నిజమండీ బాబూ. బయట కొంతమంది అమ్మాయిలు ధరించే వేషధారణకన్నా తాము నటించే దుస్తులు ఫర్వాలేదని చెబుతోంది. అసలు అందాన్ని అందంగా చూపించడాన్ని ఎక్స్‌పోజింగ్ అని పేరు పెట్టడం సమంజసం కాదనీ అంటోంది. కులుమనాలిలో పుట్టిన ఈ భామ పూరీ జగన్నాథ్ "పోకిరి" ఛాన్స్ మిస్సయ్యానని బాధపడ్డా మళ్లీ ఆయన దర్శకత్వంలో "ఏక్ నిరంజన్" చిత్రంలో నటిస్తున్నందుకు ఆనందంగా ఉందని చెబుతోంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె కొన్ని ప్రశ్నలకు సమాధానం చెపుతూ... "ఎన్నో వృత్తి ఉద్యోగాలు ఉన్నట్లే సినిమా కూడా ఓ వృత్తే. కాకపోతే డబ్బు ఎక్కువగా వచ్చే వృత్తి. దానికోసం ఏ పాత్ర ఇచ్చినా పరిధి మేరకు నటించాల్సిందే. లేదంటే.. ఈ రంగంలోకి రాకూడదని నా అభిప్రాయం. మీరడిగినట్లు ఎక్స్‌పోజింగ్ అంటే.. నిర్మాతను అడగండి. తీసిన రీల్ ఎంత ఎక్స్‌పోజ్ అయిందో చెబుతారు" అంటూ నవ్వుతూ చమత్కారంగా మాట్లాడింది.Source: Yahoo! Telugu: Entertainment | 27 Oct 2009 | 5:44 am అక్షయ్‌కుమార్‌తో "బంపర్ ఆఫర్": పూరీ జగన్నాథ్ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ సోదరుడు సాయిరాంశంకర్ హీరోగా నటించిన "బంపర్ ఆఫర్" చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్‌తో తీయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పూరి చెప్పారు. తెలుగులో విడుదలైన "బంపర్ ఆఫర్" సినిమాకు ఓపెనింగ్స్ బాగా వచ్చాయని, ఏలూరు ప్రాంతంలో పక్కన ఉన్న థియేటర్లలో కూడా వేరే సినిమా ఆపి ఈ చిత్రాన్ని ప్రదర్శించడం చాలా సంతోషంగా ఉందని చిత్ర నిర్మాత పూరీ జగన్నాథ్ వెల్లడించారు.Source: Yahoo! Telugu: Entertainment | 27 Oct 2009 | 5:08 am పాక్ పర్యటనకు వెళ్లొద్దు: భక్తులకు విదేశాంగ శాఖ వినతిపాకిస్థాన్లోని గురుద్వారాల సందర్శనకు వెళ్లే భక్తలకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పాక్‌లో పర్యటించ వద్దని హితవు పిలికింది. అక్కడ పరిస్థితులు మెరుగైన తర్వాత తమ పర్యటించాలని కోరింది. దీనిపై కేంద్ర విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.Source: జాతీయ | 27 Oct 2009 | 4:51 am ప్రధాని జమ్మూకాశ్మీర్ పర్యటనకు హిజ్బుల్ ముప్పు!ప్రధాని మన్మోహన్ సింగ్ తలపెట్టిన రెండు రోజుల జమ్మూకాశ్మీర్ రాష్ట్ర పర్యటనకు హిజ్బుల్ ముజాహిద్దీన్ తీవ్రవాద సంస్థ ముప్పు తలపెట్టింది. ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్రంలో భారీ స్థాయిలో అల్లర్లు సృష్టించాలని ఆ సంస్థ చీఫ్ సయ్యద్ సలావుద్దీన్ తమ శ్రేణులకు ఆదేశాలు జారీ చేసినట్టు నిఘా వర్గాలు హెచ్చరించారు.Source: జాతీయ | 27 Oct 2009 | 2:56 am
|