ఇక.. వైఎస్.జగన్-ధర్మపురి శ్రీనివాస్‌ల "పులి"జూదం

ముఖ్యమంత్రి రోశయ్య-వైఎస్.జగన్ వార్ ముగిసింది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జగన్ అధిష్టానం హితబోధతో తన మనస్సు మార్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించేందుకు దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ నుంచే రెండో కథ ఆరంభమైంది.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 10:05 am

గృహకల్ప వద్ద తెరాస ధర్నా: హరీష్ రావు అరెస్టు

ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అడ్డుకుంది. తెలంగాణా ప్రాంతాల్లోని భూములను విక్రయించవద్దంటూ హైదరాబాద్‌లని గృహకల్ప కాంప్లెక్స్ సోమవారం జరిగిన వేలం పాటలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 9:39 am

66 శాతానికి చేరుకున్న ఎల్‌ఐసీ వాటా

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) రూ. 25,814 కోట్ల విలువ చేసే పాలసీల వ్యాపారం చేసింది. దేశంలో ఎల్ఐసీ తన వాటాను పది శాతాన్ని వృద్ధి చేసుకుంది. దీంతో సంస్థ మార్కెట్ వాటా 66 శాతానికి చేరుకుంది.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 9:38 am

నక్సల్స్ సానుభూతిపరులపై హోంమంత్రి మండిపాటు

నక్సల్స్ సానుభూతిపరులపై కేంద్ర హోం మంత్రి చిదంబరం మండిపడ్డారు. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టుల పట్ల సానుభూతి చూపుతున్న వారి వైఖరిని ఆయన ఖండించారు. మున్ముందు నక్సల్స్‌పై కఠిన వైఖరి అవలంభించనున్నట్టు ఆయన హెచ్చరించారు.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 9:24 am

నష్టాల్లో కూరుకుపోయిన బాంబే స్టాక్ మార్కెట్

విదేశీ ప్రభావం, అమ్మకాల ఒత్తిడి కారణంగా సోమవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్ 40 పాయింట్లు క్షీణించి 16, 767 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 22 పాయింట్లు కోల్పోయి, 4, 973 పాయింట్ల వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 9:12 am

ఆ పాట విన్నా... సినిమా తీయాలనిపించి వచ్చా: చరణ్ రాజ్

కథ వినకుండానే ఓ ఛానల్‌లో ఎక్కువగా ప్రసారం చేస్తున్న ఓ ప్రైవేట్ సాంగ్‌ను విని దానికి స్పందించి ఆ పాట వెనుక ఉన్న కథను ఆధారంగా చేసుకుని సినిమా తీయాలనుకుంటున్నాడు నటుడు చరణ్ రాజ్. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. ఆ వివరాలను ఆయనే తెలియజేస్తూ... కరీంనగర్‌కు చెందిన నాగరాజు అనే వ్యక్తి పాట టీవీలో వస్తుంటే ఓ స్నేహితుడు చెప్పడంతో చూశాను. అది ఎంతో నచ్చింది. అతని హృదయ వేదన ఆ పాటలో ఉంది. "నా ప్రాణమా... విడిపోకుమా అనిత... ఓ వనిత... నా ప్రేమను దోచిన అనిత..." అంటూ ఆయన ఆ పాట పాడి వినిపించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Oct 2009 | 8:26 am

నల్ల ధనాధిపతులను వదిలేది లేదు: ప్రణబ్‌

దేశీయ బడాబాబులు తమవద్దనున్న నల్లధనాన్ని విదేశాల్లో అక్రమంగా దాచుకున్న వారికి క్షమాభిక్ష ప్రసాదించే ఆలోచనేదీ లేదని కేంద్ర ఆర్థిక శాఖామంత్రి ప్రణబ్‌ ముఖర్జీ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 8:12 am

కొనుగోళ్ల వైపు మదుపుదారుల ఆసక్తి: సెన్సెక్స్ వృద్ధి

కొనుగోళ్ల వైపు మదుపుదారులు ఆసక్తి చూపడంతో బాంబే స్టాక్ మార్కెట్‌కు సోమవారం కలిసొచ్చింది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలో విదేశీ మార్కెట్ల ప్రభావంతో నష్టాలను చవిచూసిన బాంబే స్టాక్ ఎక్చేంజ్ సూచీ సెన్సెక్స్, మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో 117 పాయింట్ల మేర బలపడి, 16, 928 పాయింట్ల మార్కు వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా నేషనల్ స్టాక్ ఎక్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 31 పాయింట్లు పుంజుకుని 5, 027 పాయింట్ల మార్కు వద్ద పయనిస్తోంది.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 7:57 am

ఆఫ్గనిస్థాన్‌లో హెలికాప్టర్లు ఢీ : నలుగురి మృతి

ఆఫ్గన్ దేశంలోని దక్షిణ ప్రాంతంలో సోమవారంనాడు రెండు హెలికాప్టర్లు గాలిలోనే ఢీకొనడంతో పేలిపోయాయని ఇందులోనున్న నలుగురు సైనికులు మృతి చెందినట్లు నాటో దళానికి చెందిన ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అసిస్టెంట్ ఫోర్స్ (ఐఎస్ఏఎఫ్) తెలిపింది
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 7:54 am

అభద్రతలో మాయ.. అందుకే మాపై తప్పుడు కేసు: అమర్

రూ. 500 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డామంటూ తనపై బిగ్ బీ అమితాబ్‌పై బిఎస్పీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతి కాన్పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఎస్పీ నేత అమర్ సింగ్ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రజలలో తనకు పట్టు కోల్పోతుందనుకున్నప్పుడు మాయావతి ఇటువంటి చవకబారు చేష్టలు చేస్తుందని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 7:49 am

జానారెడ్డి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ హోం శాఖామంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం ఉదయం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.
Source: Yahoo! Telugu: News | 26 Oct 2009 | 7:16 am

"సీతారాములు"గా నితిన్, హన్సిక

"సీతారాములు"గా నితిన్, హన్సిక కనిపించబోతున్నారు. 'సిద్దూ ఫ్రమ్ శీకాకుళం' ఫేమ్ నిర్మాత వెల్ఫేర్ క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన కార్యక్రమం ఆదివారం సాయంత్రం హైదరాబాదులోని ఓ హోటల్‌లో జరిగింది. నిర్మాత శ్రేయోభిలాషులు సి. కల్యాణ్, కెఎస్ రామారావు టైటిల్ ఆవిష్కరించారు. ముందుగా నిర్మాత మాట్లాడుతూ, తాను తీసిన మొదటి సినిమా దర్శకుడినే తన 2వ చిత్రానికి దర్శకుడిగా తీసుకోవడంతో చాలామంది ఆక్షేపించారు. సెంటిమెంట్‌గా రెండోసారి అదే దర్శకుడికి ఇస్తే సినిమా హిట్ కాదన్నారు. కానీ దాన్ని చెరిపి వేయాలని మళ్లీ ఈ అవకాశాన్ని సిద్దూ ఫ్రమ్ శీకాకుళం దర్శకునికే ఇచ్చానన్నారు. టాకీ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ తీయాల్సి ఉందన్నారు. వచ్చేనెల 18న ఆడియోను, డిశెంబరు చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 26 Oct 2009 | 7:02 am

ఇక.. వైఎస్.జగన్-ధర్మపురి శ్రీనివాస్‌ల "పులి"జూదం

ముఖ్యమంత్రి రోశయ్య-వైఎస్.జగన్ వార్ ముగిసింది. ముఖ్యమంత్రి పీఠంపై కన్నేసిన జగన్ అధిష్టానం హితబోధతో తన మనస్సు మార్చుకున్నారు. రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించేందుకు దృష్టి కేంద్రీకరించారు. ఇక్కడ నుంచే రెండో కథ ఆరంభమైంది.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2009 | 4:37 am

గృహకల్ప వద్ద తెరాస ధర్నా: హరీష్ రావు అరెస్టు

ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయాన్ని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అడ్డుకుంది. తెలంగాణా ప్రాంతాల్లోని భూములను విక్రయించవద్దంటూ హైదరాబాద్‌లని గృహకల్ప కాంప్లెక్స్ సోమవారం జరిగిన వేలం పాటలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2009 | 4:11 am

నక్సల్స్ సానుభూతిపరులపై హోంమంత్రి మండిపాటు

నక్సల్స్ సానుభూతిపరులపై కేంద్ర హోం మంత్రి చిదంబరం మండిపడ్డారు. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న మావోయిస్టుల పట్ల సానుభూతి చూపుతున్న వారి వైఖరిని ఆయన ఖండించారు. మున్ముందు నక్సల్స్‌పై కఠిన వైఖరి అవలంభించనున్నట్టు ఆయన హెచ్చరించారు.
Source: జాతీయ | 26 Oct 2009 | 3:54 am

అభద్రతలో మాయ.. అందుకే మాపై తప్పుడు కేసు: అమర్

రూ. 500 కోట్ల రూపాయల మేర మోసానికి పాల్పడ్డామంటూ తనపై బిగ్ బీ అమితాబ్‌పై బిఎస్పీ అధినేత్రి, యూపీ ముఖ్యమంత్రి మాయావతి కాన్పూర్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడంపై ఎస్పీ నేత అమర్ సింగ్ ధ్వజమెత్తారు. ఉత్తరప్రదేశ్ ప్రజలలో తనకు పట్టు కోల్పోతుందనుకున్నప్పుడు మాయావతి ఇటువంటి చవకబారు చేష్టలు చేస్తుందని అన్నారు.
Source: జాతీయ | 26 Oct 2009 | 2:20 am

జానారెడ్డి నివాసంలో సమావేశమైన సీనియర్ నేతలు

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ హోం శాఖామంత్రి జానారెడ్డి నివాసంలో సోమవారం ఉదయం ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2009 | 1:47 am

స్వైన్ ఫ్లూకు మహిళ మృతి: పూణె మృతుల సంఖ్య 91

స్వైన్ ఫ్లూ వైరస్‌కు మరో మహిళ కన్నుమూసింది. దీంతో పూణెలో మొత్తం మృతుల సంఖ్య 91కు చేరకుంది. మరో ఏడుగురు రోగుల పరిస్థితి విషమంగా ఉందని పూణె వైద్య శాఖ అధికారులు వెల్లడించారు.
Source: జాతీయ | 26 Oct 2009 | 12:32 am

బొల్లినేని ఆస్పత్రి నేత్ర చికిత్సలపై విచారణకు ఆదేశం

నెల్లురు జిల్లా కేంద్రంలోని బొల్లినేని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో కంటి ఆపరేషన్లు చేయించుకున్న పలువురికి ఇన్ఫెక్షన్ సోకి చూపు పోయిన ఘటనపై జిల్లా కలెక్టర్ రాంగోపాల్ విచారణకు ఆదేశించారు.
Source: ఏపీ న్యూస్ | 26 Oct 2009 | 12:09 am

మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: సీఎం రోశయ్య

తమ ప్రభుత్వం రాష్ట్రంలోని మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కె.రోశయ్య స్పష్టం చేశారు. ఇందులోభాగంగా ఇప్పటికే ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2009 | 11:58 pm

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి రేసులో అజిత్ పవార్!

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ మేనల్లుడు అజిత్ పవార్ ముందజంలో ఉన్నారు. అలాగే సీఎం అభ్యర్థిగా అశోక్ చవాన్‌ను కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసిన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 25 Oct 2009 | 11:49 pm

త్వరలో కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత సమావేశం

రాష్ట్ర కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) సమావేశాన్నిత్వరలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ వీరప్ప మొయిలీ తెలిపారు. దీనిపై ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. త్వరలో సిఎల్పీ సమావేశాన్ని నిర్వహించబోతున్నాం. ఐతే తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి వుందని చెప్పారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2009 | 11:06 pm

ప్రభుత్వ ఏర్పాటుకు ఎంఎన్ఎస్‌ సాయం మాకొవద్దు: చవాన్

మహారాష్ట్రలో ఏర్పాటు చేయనున్న కొత్త ప్రభుత్వంలో రాజ్‌థాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ మద్దతు తమకు అవసరం లేదని సీఎంగా అభ్యర్థి అశోక్ చవాన్ తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 10:50 pm

మావోయిస్టులు మా అనుబంధ సభ్యులు కాదు: కారత్

హింసామార్గం మినహా మరో కార్యాచరణ ప్రణాళిక లేకుండా వ్యవహరిస్తున్న మావోయిస్టులు తమ అనుబంధ సభ్యులు లేదా పార్టీ కాదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కారత్ స్పష్టం చేశారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 9:42 pm

సిద్ధార్థ, శృతిహాసన్ హీరోహీరోయిన్లుగా కొత్త చిత్రం

పద్మభూషణ్ కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ టాలీవుడ్ రంగ ప్రవేశం చేయనుంది. ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడు కె. ప్రకాష్ రూపొందించే నూతన చిత్రంలో శృతిహాసన్ కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. లవర్‌బాయ్ సిద్ధార్థ హీరోగా నటించే ఈ సినిమా షూటింగ్ ఆదివారం రామోజీ ఫిలింసిటీలో లాంఛనంగా ప్రారంభమైంది.శృతిహాసన్, సిద్ధార్థ, ప్రముఖ టీవీ యాక్టర్, బాలనటి శ్రియాశర్మలపై తీసిన తొలిషాట్‌కు 'మగధీర' దర్శకుడు రాజమౌళి క్లాప్ కొట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2009 | 10:33 am

నంది అవార్డు దక్కడానికి పూరీనే కారణం: రవితేజ

పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన "నేనింతే" సినిమాకు నంది అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని క్రేజీ హీరో రవితేజ అన్నారు. తనను హీరోగా పెట్టి తీసిన సినిమాకు అవార్డు లభించడం, తానీస్థాయిలో ఉండటానికి కారణం పూరిజగన్నాథేనని ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 25 Oct 2009 | 9:31 am

సరిహద్దుల్లో భారత్-చైనాలు శాంతిని పరిరక్షస్తాయి: పీఎం

సరిహద్దుల్లో శాంతిని పరిరక్షించేందుకు భారత్-చైనాలు అంగీకరించాయని ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అన్నారు. తన రెండు రోజుల థాయ్‌లాండ్ పర్యటనను ముగించుకుని ఆయన ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 6:29 am

రాజకీయ లబ్దికోసమే ఫ్రీజోన్ అంశం: మల్లు రవి

రాజకీయ లబ్ది, ఉనికి కోసమే తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు ఫ్రీజోన్‌పై రాద్ధాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. దీనిపై ఆయన ఆదివారం న్యూఢిల్లీలో మాట్లాడుతూ.. తెరాసపై ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2009 | 6:16 am

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించాలి: బాబు

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధితో పాటు.. విద్య, వైద్య, ఆరోగ్యం తదితర సౌకర్యాల రూపకల్పనపై దృష్టిసారించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన అంతర్జాతీయ సమావేశంలో ముఖ్య అతిథిగా బాబు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2009 | 5:00 am

కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్న ప్రరాపా నేత

ప్రజారాజ్యం పార్టీ సీనియర్ నేత కేఎస్ఆర్ మూర్తి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులోభాగంగా ఆయన ఆదివారం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు డి.శ్రీనివాస్‌తో సమావేశమయ్యారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2009 | 4:44 am

భారత్‌లో మారణహోమానికి పాక్ పథకం: చిదంబరం

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన తీవ్రవాదులను భారత్‌లోకి పంపి మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ పథకం పన్నుతోందని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం ఆరోపించారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 3:57 am

చవాన్‌కు బర్త్‌డే గిఫ్ట్: మహారాష్ట్ర సీఎంగా ఎంపిక!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అడ్వాన్స్‌డ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా రెండోసారి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాగా, మరో మూడు రోజుల్లో అశోక్ చవాన్ తన 51వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 3:38 am