భారత్‌లో మారణహోమానికి పాక్ పథకం: చిదంబరం

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన తీవ్రవాదులను భారత్‌లోకి పంపి మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ పథకం పన్నుతోందని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 9:26 am

చవాన్‌కు బర్త్‌డే గిఫ్ట్: మహారాష్ట్ర సీఎంగా ఎంపిక!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అడ్వాన్స్‌డ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా రెండోసారి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాగా, మరో మూడు రోజుల్లో అశోక్ చవాన్ తన 51వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 9:08 am

రేపు భారత్-అమెరికా వాణిజ్య ప్రతినిధుల భేటీ!

భారత్, అమెరికా దేశాల మధ్య ద్వౌపాక్షిక వాణిజ్య ఒప్పందాలను మరింత బలోపేతం చేసేందుకు గాను ఇరు దేశాల ప్రతినిధులు సోమావారం న్యూఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పాల్గొనే అమెరికా ప్రతినిధి బృందానికి రాన్ కిర్క్ నాయకత్వం వహిస్తున్వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 8:46 am

2010 నాటికి 10 శాతానికి చేరుకోనున్న ద్రవ్యోల్బణం

వచ్చే 2010 మార్చి మాసాంతానికి ద్రవ్యోల్బణం పది శాతానికి చేరుకోవచ్చని ఇండస్ట్రీ బాడీ అసోచామ్ అభిప్రాయపడింది. అక్టోబరు పదో తేదీతో ముగిసిన వారాంతానికి ద్రవ్యోల్బణం ఒక శాతానికి చేరుకుంది. ఏడు నెలల తర్వాత ఒక శాతానికి చేరుకోవడం ఇదే తొలిసారి.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 7:47 am

వారం రోజుల్లో తాలిబన్‌ సామ్రాజ్యం కూల్చివేస్తాం: పాక్

పాకిస్థాన్ పాలకులకు కంటిపై కునుకు లేకుండా చేస్తున్న తాలిబన్ తీవ్రవాదుల ఆగడాలను త్వరోలనే ఆటకట్టిస్తామని ఆ దేశ రక్షణశాఖామంత్రి చౌదరి అహ్మద్ ముఖ్తార్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 7:30 am

అరుణాచల్‌ ప్రదేశ్ మా అంతర్భాగం: సీఎం ఖండూ

భారత్-చైనాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లో అంతర్భాగమని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దూర్జీ ఖండూ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ రాష్ట్ర పర్యటనకు రానున్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సాదర స్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 7:13 am

విద్యార్థులు తరగతులను బహిష్కరించాలి: కేసీఆర్

జైల్‌భరో కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు.అక్టోబర్ 28న తలపెట్టిన జైల్‌భరో కార్యక్రమంలో ఓపెన్ కాస్ట్ గనులను వ్యతిరేకించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు బుల్లెట్ దెబ్బలకన్నా సిద్ధపడాలన్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 6:49 am

76 మంది శ్రీలంక తమిళులను విడుదల చేసిన కెనడా

అంతర్జాతీయ సరిహద్దులను ఉల్లంఘించిన కెనడా సముద్ర జలాల్లోకి ప్రవేశించిన 76 మంది శ్రీలంక తమిళులను కెనడా ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది. పసిఫిక్ సముద్ర జలాల్లోకి చట్ట వ్యతిరేకంగా వీరంతా ప్రవేశించడంతో కెనడా భద్రతా సిబ్బంది వారం రోజుల క్రితం తమ అదుపులోకి తీసుకున్నారు.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 6:16 am

అరుణాచల్ సీఎంగా దూర్జీ ఖండూ ప్రమాణ స్వీకారం

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దూర్జీ ఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జేజే.సింగ్ ప్రమాణ చేయించారు. అరుణాచల్ ప్రదేస్ కాంగ్రెస్ శాసనసభ (సీఎల్పీ) నేతగా ఖండూ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 5:51 am

విదేశీ కరెన్సీ రేట్లు

విదేశీ కరెన్సీ రేట్లు ఈ విధంగా ఉన్నాయిఅమెరికా డాలరు కొనుగోలు రేటు (థామస్ కుక్) 43.95 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 49.10యూరో కరెన్సీ కొనుగోలు రేటు (థామస్ కుక్) 65.85 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 73.45జపాన్ యెన్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 47.60 అమ్మకపు రేటు (రూ.లలో) రూ. 53.00సింగపూర్ డాలర్ కొనుగోలు రేటు (థామస్ కుక్) 30.65 అమ్మకపు రేటు రూ. 35.95.
Source: Yahoo! Telugu: News | 25 Oct 2009 | 5:25 am

భారత్‌లో మారణహోమానికి పాక్ పథకం: చిదంబరం

పాకిస్థాన్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న లష్కర్, జైషే మొహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి సంస్థలకు చెందిన తీవ్రవాదులను భారత్‌లోకి పంపి మారణహోమం సృష్టించేందుకు పాకిస్థాన్ పథకం పన్నుతోందని కేంద్ర హోం శాఖామంత్రి పి.చిదంబరం ఆరోపించారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 3:57 am

చవాన్‌కు బర్త్‌డే గిఫ్ట్: మహారాష్ట్ర సీఎంగా ఎంపిక!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ చవాన్‌కు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అడ్వాన్స్‌డ్ బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. మహారాష్ట్ర సీఎం అభ్యర్థిగా రెండోసారి కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేసింది. కాగా, మరో మూడు రోజుల్లో అశోక్ చవాన్ తన 51వ పుట్టిన రోజు వేడుకలను జరుపుకోనున్నారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 3:38 am

అరుణాచల్‌ ప్రదేశ్ మా అంతర్భాగం: సీఎం ఖండూ

భారత్-చైనాల మధ్య వివాదాలకు కేంద్ర బిందువుగా ఉంటున్న అరుణాచల్ ప్రదేశ్‌లో భారత్‌లో అంతర్భాగమని ఆ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి దూర్జీ ఖండూ స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ రాష్ట్ర పర్యటనకు రానున్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు సాదర స్వాగతం పలుకుతామని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 25 Oct 2009 | 1:44 am

విద్యార్థులు తరగతులను బహిష్కరించాలి: కేసీఆర్

జైల్‌భరో కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు విద్యార్థులు తరగతులను బహిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు పిలుపునిచ్చారు. అక్టోబర్ 28న తలపెట్టిన జైల్‌భరో కార్యక్రమంలో ఓపెన్ కాస్ట్ గనులను వ్యతిరేకించేందుకు టీఆర్ఎస్ శ్రేణులు బుల్లెట్ దెబ్బలకన్నా సిద్ధపడాలన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Oct 2009 | 1:19 am

అరుణాచల్ సీఎంగా దూర్జీ ఖండూ ప్రమాణ స్వీకారం

అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా దూర్జీ ఖండూ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఇటానగర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జేజే.సింగ్ ప్రమాణ చేయించారు. అరుణాచల్ ప్రదేస్ కాంగ్రెస్ శాసనసభ (సీఎల్పీ) నేతగా ఖండూ శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెల్సిందే.
Source: జాతీయ | 25 Oct 2009 | 12:22 am

వైఎస్,.జగన్ నిర్ణయం హర్షణీయం: ప్రరాపా అధినేత చిరు

దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన స్థానంలో సీఎంను ఎంపిక చేసే విషయంలో అధిష్టానం తీసుకుని నిర్ణయాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి శిరసావహించడం శుభపరిణామమని పీఆర్పీ అధినేత చిరంజీవి అన్నారు. ఈ విషయంపై జగన్ అనుసరిస్తున్న తీరు మంచి పరిణామమని చిరు కితాబిచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 11:36 pm

ఇస్రో ఛైర్మన్‌ మాధవన్ నాయర్ వారసుడు కె.రాధాకృష్ణన్

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ మాధవన్ నాయర్ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన వారసునిగా కె.రాధాకృష్ణన్‌ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం తిరువనంతపురంలోని విక్రమ్‌సారాభాయ్ అంతరిక్ష కేంద్రానికి సంచాలకుడిగా వ్యవహిస్తున్నారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 11:15 pm

తెలుగు సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోయింది: తమ్మారెడ్డి

మన తెలుగు సినిమాల్లో క్వాలిటీ తగ్గిపోయిందని నంది అవార్డ్స్ కమిటీ ఛైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. 2008 సంవత్సరానికిగాను నంది అవార్డులను శనివారం ప్రకటించారు. నంది అవార్డుల ఎంపిక కోసం దాదాపు 72 సినిమాలు చూశాను. ఏ కొద్ది సినిమాలు తప్పనిస్తే.. మిగిలిన సినిమాలు అంతగా బాగోలేవని చెప్పారు. టెక్నికల్‌పరంగా భారీ వ్యయంతో తెరకెక్కించిన సినిమాల్లో కథాబలం లోపించిందని భరద్వాజ తెలియజేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 11:03 am

2008 నంది అవార్డులు: ఉత్తమ నటుడిగా రవితేజ

2008 సంవత్సరానికిగాను నంది అవార్డులను తమ్మారెడ్డి భరద్వాజ శనివారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నంది అవార్డుల్లో 'ఉత్తమ నటుడి‌'గా క్రేజీస్టార్ "రవితేజ" నిలిచాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన "నేనింతే" చిత్రానికిగాను రవితేజకు ఈ అవార్డు దక్కింది. ఈ అవార్డు కింద రవితేజకు వెండి నందితో పాటు 30వేల రూపాయల నగదును అందజేస్తారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 10:21 am

భుజాన జోలెతో విరాళాలు సేకరిస్తున్న చిరంజీవి

వరద బాధితులకు తన వంతు సాయం చేసేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి నడుంబిగించారు. భుజాన జోలె వేసుకుని విరాళాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రజానీకాన్ని అర్థిస్తున్నారు. దీనికి ప్రరాపాకు గట్టిపట్టున్న విశాఖ జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 8:49 am

బికినీ... బాత్‌టబ్ సన్నివేశాల్లో నటించాలా... మేం రెడీ!!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల మధ్య ఎక్స్ పోజింగ్‌పై పోటీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరికి మించి మరొకరు బికినీల్లో బాత్‌టబ్ సీన్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇటువంటి హాటెస్ట్ సన్నివేశాలలో నటించేందుకు ప్రత్యేకంగా కొంతమంది సెక్సీ తారలు ఉండేవారు. ఇప్పుడది కనుమరుగై హీరోయిన్లే ఆ పాత్రలను కూడా పోషిస్తున్నారు. సినిమాలో కనీసం నాలుగైదు సార్లు రెచ్చగొట్టే సన్నివేశాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. అలా కనిపించకపోతే కెరీర్‌లో వెనకబడిపోతామన్న ఆలోచనలో కథానాయికలు ఉన్నట్లు కనపిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 8:07 am

"మా"లో ఎలాంటి విభేదాలు లేవు: మురళీ మోహన్

సినీ ప్రముఖుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని మా అధ్యక్షులు మురళీమోహన్ అన్నారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని నిరూపించేందుకే నవంబర్ ఏడో తేదీన వరద బాధితుల సహాయార్థం "స్టార్ నైట్" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ ఏడో తేదీ సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వరద బాధితుల సహాయార్థం "స్టార్ నైట్" కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 7:45 am

పూంఛ్ జిల్లాలో కాల్పులకు తెగబడిన పాక్ బలగాలు

పాకిస్థాన్ బలగాలు మరోమారు హద్దు మీరాయి. ఇరు దేశాల మధ్య అమలులో ఉన్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని శనివారం ఉల్లంఘించారు. పూంఛ్ జిల్లాలోని మెంధర్ సెక్టార్‌లో ఏకపక్షంగా భారత బలగాలపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒక భారత జవాను గాయపడ్డారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 6:58 am

తెల్లపిల్ల తమన్నాతో మళ్లీ జతకట్టనున్న వరుణ్ సందేశ్!

శేఖర్‌కమ్ముల "హ్యాపీడేస్" ద్వారా జంట అదిరిందని ప్రేక్షకుల మార్కులు కొట్టేసిన వరుణ్ సందేశ్, తమన్నాలు మళ్లీ కలిసి నటించనున్నారట. హ్యాపీడేస్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. తమన్నానే తనకు సరైన జోడీ అని వరుణ్ సందేశే.. ఇటీవల విడుదలైన "ఎవరైనా.. ఎప్పుడైనా" సినిమా రిలీజ్ తర్వాత చెప్పాడని అతని సన్నిహితులు అంటున్నారు. "హ్యాపీడేస్" సినిమాలో తమన్నా ప్రేమించకముందే.. ముద్దడిగిన వరుణ్ సందేశ్.. ఆమెను నిజజీవితంలో వివాహం చేసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. మరి తమన్నా కలిసి నటించబోయే తదుపరి సినిమా వీరిద్దరి మంచి బ్రేక్ సంపాదించిపెడుతుందా? లేదా? అనే విషయం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 6:41 am

అధినేత్రి చేతుల్లో మహారాష్ట్ర సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత!

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యతను పార్టీ అధినేత్రి సోనియా గాంధీకే వదిలి వేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన 81 మంది ఎమ్మెల్యేలు ఓ తీర్మానం చేశారు. శనివారం విధాన్ భవన్‌లో జరిగిన ఈ సమావేశం జరింది.
Source: జాతీయ | 24 Oct 2009 | 6:32 am

ప్రభుదేవాను పిచ్చిపిచ్చిగా ఇష్టపడతుంటా: నయనతార

ఇటీవల నయనతార నటించిన ఘటికుడు చిత్రంలో నయన తన అందాలను దాచుకోవడంపై తాము ఎంతో నిరాశ చెందామని టీనేజ్ కుర్రకారు ఆమెకు కుప్పలు తెప్పలుగా మెయిల్స్ పంపుతున్నారట. సెల్యూట్, వల్లభ చిత్రాల్లో రెచ్చిపోయి శరీరాన్నంతా చూపించిన నయన ఒక్కసారిగా ఈ చిత్రంలో ఒళ్లును కప్పేసుకున్నట్లు నటించింది. పాటల్లో తప్ప మిగిలిన సన్నివేశాల్లో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంది. కుర్రకారు అడుగుతున్న ప్రశ్నలకు నయనతార స్పందించడానికి ప్రస్తుతం అందుబాటులో లేదు. ప్రియుడు అని చెప్పబడుతున్న నృత్య దర్శకుడు ప్రభుదేవా సిఫార్సుతో బాలీవుడ్ అవకాశాలను వెతుక్కుంటోంది. శ్రియ, అసిన్ బాలీవుడ్‌ను దున్నేస్తున్నారనీ, నీకు వారికంటే ఎక్కువ సత్తా ఉందని ప్రభుదేవా చెప్పాడట. చెప్పడమే కాదు... తనకు బాలీవుడ్ నిర్మాతలతో ఉన్న స్నేహ సంబంధాలను ఉపయోగించి నయనకు ఛాన్సులను ఇప్పించే పనిలో ముమ్మరంగా ఉన్నాడట. నయన అంటే ప్రభుదేవాకు ఎంత శ్రద్ధ. అన్నట్లు ప్రభుదేవాను తను పిచ్చిగా ఇష్టపడుతుంటానని నయనతార ఓ టీవీ ఇంటర్యూలో డైరెక్టుగా చెప్పింది. మరి ప్రభుదేవా భార్య ఈ మాటను విన్నదో లేదో....
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 6:31 am

మానవత్వం ఉన్న మనుషుల్లారా.. "మగధీర" చూడండి!

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తలంపు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ "మగధీర" చిత్రాన్ని చూడాలని ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి వెనుక తన చిత్ర కలెక్షన్లను మరింతగా పెంచుకోవాలన్న కుట్ర ఉందని భావించవద్దు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 6:22 am

కొణిజేటి రోశయ్య సొంత ఛానల్ పేరు "భజంత్రీ"!?

ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సొంతగా "భజంత్రీ" పేరుతో ఓ టీవీ ఛానల్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి హఠాన్మరణంతో అనుకోకుండా తనకు లభించిన సీఎం కిరీటం జారిపోకుండా ఉండేందుకు ఆయన రేయింబవుళ్లు పని చేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 5:04 am

బంగ్లా నుంచి మావోల ఆయుధాల సేకరణ: చిదంబరం

మావోయిస్టులు తమకు కావాల్సిన ఆయుధాలను పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ వంటి దేశాల నుంచి సేకరిస్తున్నారని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం అన్నారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 4:31 am

ప్రభుదేవా ప్రమేయంతో నయనకు బాలీవుడ్ ఛాన్సు..!?

సాధారణంగా ప్రియురాలికి ప్రేమికుడు ఏదో గొప్ప బహుమతినివ్వడం పరిపాటి. కానీ ఫిలిమ్ నగర్లో కొంతకాలం ప్రేమికులుగా అందరి నోట్లో నానుతోన్న ప్రభుదేవా-నయనతారల ప్రేమాయణంలో కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది. ఇందులో విషయమేమిటంటే..? కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన ప్రభుదేవా.. తన ప్రియురాలు అయిన సెక్సీడాళ్ నయనతారకు బాలీవుడ్ ఛాన్సు ఇస్తున్నాడని తెలిసింది. సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో విడుదలైన "వాంటెడ్" సూపర్ సక్సెస్ బాటలో పయనిస్తుండటంతో తిరిగి అదే టీమ్‌తో "మోస్ట్ వాంటెడ్" అనే సినిమాను నిర్మించేందుకు బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో నయనతారకు అవకాశం ఇవ్వాలని ప్రభుదేవా నిర్మాత బోని కపూర్‌కు సిఫార్సు చేసినట్లు సమాచారం. బోనీ కపూర్ కూడా నయనకు అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు భోగట్టా. అయితే ఇంకా ఆమెను హీరోయిన్‌గా ఖరారు చేయలేదని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నయనను రంగప్రవేశం చేయడంలో ప్రభుదేవా ఆసక్తిని చూస్తే వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతూనే ఉందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
Source: వినోదం | 24 Oct 2009 | 4:12 am

అరుణాచల్ ప్రదేశ్ సీఎల్పీ నేతగా దూర్జీ ఖండూ ఎన్నిక

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సీఎల్పీ నేతగా దూర్జీ ఖండూ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖండూను శనివారం ఎన్నుకున్నారు. దీంతో ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 4:02 am

బికినీ... బాత్‌టబ్ సన్నివేశాల్లో నటించాలా... మేం రెడీ!!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల మధ్య ఎక్స్ పోజింగ్‌పై పోటీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరికి మించి మరొకరు బికినీల్లో బాత్‌టబ్ సీన్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇటువంటి హాటెస్ట్ సన్నివేశాలలో నటించేందుకు ప్రత్యేకంగా కొంతమంది సెక్సీ తారలు ఉండేవారు. ఇప్పుడది కనుమరుగై హీరోయిన్లే ఆ పాత్రలను కూడా పోషిస్తున్నారు. సినిమాలో కనీసం నాలుగైదు సార్లు రెచ్చగొట్టే సన్నివేశాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. అలా కనిపించకపోతే కెరీర్‌లో వెనకబడిపోతామన్న ఆలోచనలో కథానాయికలు ఉన్నట్లు కనపిస్తోంది.
Source: వినోదం | 24 Oct 2009 | 2:48 am