వెనెజులాలో బస్సు, ట్రక్కు ఢీ: పదిమంది మృతి

వెనెజులా రాజధానిలో ప్రయాణీకులతో నిండిన బస్సును ఓ ట్రక్కు ఢీకొనడంతో పది మంది మృతి చెందగా మరో 12 మంది తీవ్ర గాయాలపాలైనారు.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 9:33 am

అరుణాచల్ ప్రదేశ్ సీఎల్పీ నేతగా దూర్జీ ఖండూ ఎన్నిక

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సీఎల్పీ నేతగా దూర్జీ ఖండూ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖండూను శనివారం ఎన్నుకున్నారు. దీంతో ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 9:31 am

మాంద్యం ముగిసింది... కానీ రికవరీదే అసలు కథ!

విమానయాన పరిశ్రమకు కష్టాలు మరింతగా పెరగనున్నాయి. దీనికి నిదర్శనం.. 2009లో భారత విమానయాన పరిశ్రమ 1.5 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోయే అవకాశం ఉన్నట్లు అంతర్జాతీయ వాయు రవాణా అసోసియేషన్ (ఐఏటీఏ) వెల్లడించింది. ప్రత్యేకించి ప్రముఖ దేశీయ విమానయా సంస్థ ఎయిర్ ఇండియా అత్యధికంగా ఈ నష్టాలను ఎదుర్కుంటోందని ఐఏటీఏ తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 8:48 am

సిప్ అకాడెమీ ఆధ్వర్యంలో చిత్రలేఖన పోటీలు

తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో సిప్ అకాడెమీ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి చిత్రలేఖన పోటీలు శనివారం జరిగాయి. స్థానిక అన్నానగర్‌లో అన్నా ఆదర్శ్ మహిళా కళాశాలలో నిర్వహించిన ఈ పోటీల్లో ఆరేళ్ల నుంచి 12 సవంత్సరాల బాలబాలికలు పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 8:38 am

బికినీ... బాత్‌టబ్ సన్నివేశాల్లో నటించాలా... మేం రెడీ!!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోయిన్ల మధ్య ఎక్స్ పోజింగ్‌పై పోటీ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఒకరికి మించి మరొకరు బికినీల్లో బాత్‌టబ్ సీన్లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఇటువంటి హాటెస్ట్ సన్నివేశాలలో నటించేందుకు ప్రత్యేకంగా కొంతమంది సెక్సీ తారలు ఉండేవారు. ఇప్పుడది కనుమరుగై హీరోయిన్లే ఆ పాత్రలను కూడా పోషిస్తున్నారు. సినిమాలో కనీసం నాలుగైదు సార్లు రెచ్చగొట్టే సన్నివేశాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు. అలా కనిపించకపోతే కెరీర్‌లో వెనకబడిపోతామన్న ఆలోచనలో కథానాయికలు ఉన్నట్లు కనపిస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 8:07 am

"మా"లో ఎలాంటి విభేదాలు లేవు: మురళీ మోహన్

సినీ ప్రముఖుల మధ్య ఎలాంటి విబేధాలు లేవని మా అధ్యక్షులు మురళీమోహన్ అన్నారు. తమలో ఎలాంటి విభేదాలు లేవని నిరూపించేందుకే నవంబర్ ఏడో తేదీన వరద బాధితుల సహాయార్థం "స్టార్ నైట్" కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. నవంబర్ ఏడో తేదీ సాయంత్రం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో వరద బాధితుల సహాయార్థం "స్టార్ నైట్" కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 7:45 am

జాబ్స్: ఇంటలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు

ఇంటలిజెన్స్ బ్యూరోలో సెక్యూరిటీ అసిస్టెంట్ల నియామకం కోసం భారత హో మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి వివరాలు ఇక్కడ చూడండి. హైదరాబాద్‌లో మొత్తం.. 26 ఖాళీలున్నాయి. ఇందులో.. ఎస్సీలకు.. 4, ఎస్టీలకు.. 2, ఓబీసీలకు.. 7, జనరల్ కేటగిరీలకు.. 13 పోస్టులు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 7:35 am

భారత్‌తో మెరుగైన సంబంధాలను కోరుకుంటున్నాం: వెన్

భారత ప్రధాని మన్మోహన్ సింగ్, చైనా ప్రధాని వెన్ జియాబావోలు శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తొలుత వెన్ మాట్లాడుతూ... తాము భారతదేశంతో ఆరోగ్యకరమైన, స్థిరమైన సంబంధాలను కోరుకుంటున్నామని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 7:31 am

ఈవీఎంల టాంపరింగ్‌ను ఏ పార్టీ రుజువు చేయలేదు: ఈసీ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా టాంపరింగ్ చేయవచ్చనే విషయాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ధారించలేక పోయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నవీన్ చావ్లా స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై ఈసీ పూర్తి సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 7:25 am

పీఎన్‌బీ సీఎమ్‌డీగా నియమితులు కానున్న కామత్ !

అలహాబాద్ బ్యాంక్ ఛైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్(సీఎమ్‌డీ), కే.ఆర్. కామత్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సీఎమ్‌డీగా నియమితులు కానున్నారు.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 7:04 am

నేడు మహారాష్ట్ర సీఎల్పీ నేత ఎన్నిక: చవాన్‌కే ఛాన్సెస్!

మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు శనివారం భేటీ కానున్నారు. ఈ భేటీలోనే తమ కొత్త నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 7:02 am

నష్టాల్లో అమెరికా మార్కెట్లు

అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో పయనించాయి. టెక్నాలజీ సంస్థల్లో తగ్గిన వృద్ధి మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీంతో అమెరికా స్టాకులు నష్టపోయాయి. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ ఇండెక్స్- 109 పాయింట్లు కోల్పోయి 10వేల మార్కు కన్నా దిగువున 9,972 వద్ద ముగిసింది. నాస్‌డాక్ కంపోజిట్ ఇండెక్స్- 11 పాయింట్లు నష్టపోయి 2,154 వద్దకు చేరుకుంది. భారత ఏడీఆర్‌లు కూడా దాదాపు నష్టాలతోటే ముగిశాయి. ఎంటీఎన్ఎల్, టాటా మోటార్స్, స్టెరిలైట్, పాట్నీ కంప్యూటర్స్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ తదితర సంస్థల వాటాలు బలహీనపడ్డాయి.
Source: Yahoo! Telugu: News | 24 Oct 2009 | 6:57 am

తెల్లపిల్ల తమన్నాతో మళ్లీ జతకట్టనున్న వరుణ్ సందేశ్!

శేఖర్‌కమ్ముల "హ్యాపీడేస్" ద్వారా జంట అదిరిందని ప్రేక్షకుల మార్కులు కొట్టేసిన వరుణ్ సందేశ్, తమన్నాలు మళ్లీ కలిసి నటించనున్నారట. హ్యాపీడేస్‌లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగా కుదిరిందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాదు.. తమన్నానే తనకు సరైన జోడీ అని వరుణ్ సందేశే.. ఇటీవల విడుదలైన "ఎవరైనా.. ఎప్పుడైనా" సినిమా రిలీజ్ తర్వాత చెప్పాడని అతని సన్నిహితులు అంటున్నారు. "హ్యాపీడేస్" సినిమాలో తమన్నా ప్రేమించకముందే.. ముద్దడిగిన వరుణ్ సందేశ్.. ఆమెను నిజజీవితంలో వివాహం చేసుకునేందుకైనా సిద్ధంగా ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో టాక్. మరి తమన్నా కలిసి నటించబోయే తదుపరి సినిమా వీరిద్దరి మంచి బ్రేక్ సంపాదించిపెడుతుందా? లేదా? అనే విషయం తెలియాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 6:41 am

ప్రభుదేవాను పిచ్చిపిచ్చిగా ఇష్టపడతుంటా: నయనతార

ఇటీవల నయనతార నటించిన ఘటికుడు చిత్రంలో నయన తన అందాలను దాచుకోవడంపై తాము ఎంతో నిరాశ చెందామని టీనేజ్ కుర్రకారు ఆమెకు కుప్పలు తెప్పలుగా మెయిల్స్ పంపుతున్నారట. సెల్యూట్, వల్లభ చిత్రాల్లో రెచ్చిపోయి శరీరాన్నంతా చూపించిన నయన ఒక్కసారిగా ఈ చిత్రంలో ఒళ్లును కప్పేసుకున్నట్లు నటించింది. పాటల్లో తప్ప మిగిలిన సన్నివేశాల్లో ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంది. కుర్రకారు అడుగుతున్న ప్రశ్నలకు నయనతార స్పందించడానికి ప్రస్తుతం అందుబాటులో లేదు. ప్రియుడు అని చెప్పబడుతున్న నృత్య దర్శకుడు ప్రభుదేవా సిఫార్సుతో బాలీవుడ్ అవకాశాలను వెతుక్కుంటోంది. శ్రియ, అసిన్ బాలీవుడ్‌ను దున్నేస్తున్నారనీ, నీకు వారికంటే ఎక్కువ సత్తా ఉందని ప్రభుదేవా చెప్పాడట. చెప్పడమే కాదు... తనకు బాలీవుడ్ నిర్మాతలతో ఉన్న స్నేహ సంబంధాలను ఉపయోగించి నయనకు ఛాన్సులను ఇప్పించే పనిలో ముమ్మరంగా ఉన్నాడట. నయన అంటే ప్రభుదేవాకు ఎంత శ్రద్ధ. అన్నట్లు ప్రభుదేవాను తను పిచ్చిగా ఇష్టపడుతుంటానని నయనతార ఓ టీవీ ఇంటర్యూలో డైరెక్టుగా చెప్పింది. మరి ప్రభుదేవా భార్య ఈ మాటను విన్నదో లేదో....
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 6:31 am

మానవత్వం ఉన్న మనుషుల్లారా.. "మగధీర" చూడండి!

ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని తలంపు, మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ "మగధీర" చిత్రాన్ని చూడాలని ఆ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తి వెనుక తన చిత్ర కలెక్షన్లను మరింతగా పెంచుకోవాలన్న కుట్ర ఉందని భావించవద్దు.
Source: Yahoo! Telugu: Entertainment | 24 Oct 2009 | 6:22 am

బంగ్లా నుంచి మావోల ఆయుధాల సేకరణ: చిదంబరం

మావోయిస్టులు తమకు కావాల్సిన ఆయుధాలను పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, మియన్మార్, నేపాల్ వంటి దేశాల నుంచి సేకరిస్తున్నారని కేంద్ర హోంశాఖామంత్రి పి.చిదంబరం అన్నారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 4:31 am

అరుణాచల్ ప్రదేశ్ సీఎల్పీ నేతగా దూర్జీ ఖండూ ఎన్నిక

అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర శాసనసభ సీఎల్పీ నేతగా దూర్జీ ఖండూ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఖండూను శనివారం ఎన్నుకున్నారు. దీంతో ఆయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండో సారి బాధ్యతలు చేపట్టనున్నారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 4:02 am

ఈవీఎంల టాంపరింగ్‌ను ఏ పార్టీ రుజువు చేయలేదు: ఈసీ

ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా టాంపరింగ్ చేయవచ్చనే విషయాన్ని ఏ ఒక్క రాజకీయ పార్టీ నిర్ధారించలేక పోయిందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి నవీన్ చావ్లా స్పష్టం చేశారు. ఈవీఎంల పనితీరుపై ఈసీ పూర్తి సంతృప్తిగా ఉందని ఆయన తెలిపారు.
Source: జాతీయ | 24 Oct 2009 | 1:56 am

నేడు మహారాష్ట్ర సీఎల్పీ నేత ఎన్నిక: చవాన్‌కే ఛాన్సెస్!

మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేలు శనివారం భేటీ కానున్నారు. ఈ భేటీలోనే తమ కొత్త నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి అశోక్‌చవాన్‌కే ఎక్కువ అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాలు చెపుతున్నాయి.
Source: జాతీయ | 24 Oct 2009 | 1:33 am

డిసెంబర్‌లో పులివెందుల ఉపఎన్నిక: ఈసీ

దివంగత మహానేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖరరెడ్డి మరణానంతరం ఖాళీ ఏయిన పులివెందుల నియోజకవర్గంలో ఉపఎన్నికను డిసెంబరులో నిర్వహించాల్సిందిగా ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను శుక్రవారం వెలువడింది. ఈ నెల 26, 27 తేదీల్లో నోటిఫికేషన్‌‌ను ఈసీ విడుదల చేయనుంది. డిసెంబరు మూడోవారంలో ఈ ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 1:26 am

చిరంజీవి సినిమాల్లోనే హీరో.. బయట కాదు: మల్లోజుల

ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కేవలం వెండితెరపైన మాత్రమే హీరో అని, బాహ్య ప్రపంచంలో కాదని మావోయిస్టు అగ్రనేత మల్లోజుల కోటేశ్వర రావు అభిప్రాయపడ్డారు. కేసీఆర్ ఓ దొంగగా ఆయన చిత్రీకరించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 1:17 am

వైఎస్.జగన్ వ్యాఖ్యలను జీర్ణించుకోలేని వ్యతిరేక వర్గం!

కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై ఆయన వ్యతిరేక వర్గం లోలోన రగిలిపోతోంది. ప్రభుత్వ పథకాలు విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషించాల్సిన మంత్రుల సమక్షంలోనే జగన్ ప్రభుత్వ పథకాల అమలు తీరును ఎండగట్టారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 12:16 am

కేసీఆర్ ఏం మాట్లాడుతాడో.. ఆయనకే తెలియదు: చిరు

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎప్పుడు ఏమి మాట్లాడుతాడో ఆయనకే తెలియదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. ఈ విషయంపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. ప్రజానాయకులు.. ఎవరైనా ప్రజల మనోభావాలు దెబ్బతినకండూ మాట్లాడాలని చిరు సూచించారు.
Source: ఏపీ న్యూస్ | 24 Oct 2009 | 12:15 am

జార్ఖండ్ రాష్ట్ర శాసనసభకు ఐదు దశల్లో ఎన్నికలు

జార్ఖండ్ రాష్ట్ర అసెంబ్లీకి ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల షెడ్యూల్‌ను ఈసీ శుక్రవారం రాత్రి వెల్లడించింది.
Source: జాతీయ | 23 Oct 2009 | 11:53 pm

రోశయ్య సర్కారుకు "పక్కలో బల్లెం" వైఎస్ జగన్!?

'ముఖ్యమంత్రి ఎవరనేది తమకు పనిలేదు. వైఎస్ ఆశయ సాధన కోసం ప్రభుత్వంపై ఒత్తిడి చేద్దాం. ఓ తండ్రి కార్యసాధనలో అశువులు బాస్తే కొడుకుగా దాన్ని పూర్తి చేయాలని భావించడం తప్పులేదు'. ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరో కాదు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 11:29 pm

"జయహో"తో వైఎస్సార్‌కు రెహ్మాన్ స్వరనీరాజనం

"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రం ద్వారా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగీత మాంత్రికుడు, సంగీత యువకెరటం ఎ.ఆర్. రెహ్మాన్ బృందం నిర్వహించే.. "జయహో" సంగీత విభావరి శనివారం రాత్రి హైదరాబాదులో జరుగనుంది. దివంగత మహానేత వై.ఎస్. రాజశేఖర రెడ్డికి.. ఈ విభావరి ద్వారా ఎ.ఆర్. రెహ్మాన్ తన స్వర నీరాజనాన్ని అర్పించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 11:20 pm

హింసకు స్వస్తి పలికితేనే నక్సల్స్‌తో చర్చలు: చిదంబరం

హింసను వీడితేనే నక్సల్స్‌తో చర్చలు జరపాలని రాష్ట్రాలకు సూచించినట్లు కేంద్ర హోంమంత్రి పి. చిదంబరం పునరుద్ఘాటించారు. అప్పుడే ఈ చర్చల ప్రక్రియలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని శుక్రవారం ఢిల్లీలో చిదంబరం పేర్కొన్నారు.
Source: జాతీయ | 23 Oct 2009 | 10:30 pm

స్పెక్ట్రమ్‌ వివాదం.. రాజాపై చర్య తీసుకోవాలి: ఏచూరి

స్పెక్ట్రమ్ కేటాయింపుల వివాదంపై కేంద్ర కేబినేట్ జోక్యం చేసుకోవాలని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. దాదాపు 22వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగమైన ఆ స్పెక్ట్రమ్ కేటాయింపుల అంశంలో ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా జోక్యం చేసుకుని, సమస్యను పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Source: జాతీయ | 23 Oct 2009 | 10:11 pm

పాటల చిత్రీకరణలో "చేత వెన్నముద్ద"

ఆల్తాఫ్, హ్యాపీడేస్ ఫేమ్ క్రితిక, కృష్ణన్ హీరోహీరోయిన్లుగా రోహిత్. ఎస్. అభ్యుదయ్ దర్శకత్వంలో ఫుల్‌మూన్ పిక్చర్స్ పతాకంపై పి.ఆర్. కుమార్ నిర్మిస్తోన్న చిత్రం "చేతవెన్నముద్ద". ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎమ్. భరత్ కుమార్ మాట్లాడుతూ.. ప్రస్తుతం, హీరో, హీరోయిన్లతో పాటు పలువురు విదేశీ అమ్మాయిలపై "అందాలపూదోట తోటలో ఒక మేడ.. మేడలో చెలిబాల.." అనే పాట చిత్రీకరణ జరుగుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 12:20 pm

జె.డి.చక్రవర్తి చేతులమీదుగా "యువరాజ్యం" ఆడియో

వీరశంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న "యువరాజ్యం" ఆడియో విడుదల గురువారం రాత్రి శిల్పకళావేదికలో జరిగింది. ముఖ్యఅతిథి జె.డి. చక్రవర్తి ఆడియో సీడీని విడుదల చేసి సంగీత దర్శకుడు గురుచరణ్‌కు అందజేశారు. యువకులకు సంబంధించిన కథ కాబట్టి పలు విద్యార్థి సంఘాల నాయకులను పిలిపించి ఆడియో వేడుకను జరిపారు. స్వాతంత్ర్య సమరయోధుడు నారాయణరావు పవాన్‌ను నాగబాబుచే సన్మానించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 11:57 am

నిరాశపరిచిన కళ్యాణ్‌రామ్, హన్సికల "జయీభవ"

కళ్యాణ్‌రామ్ పాత్ర రొటీన్‌గా ఉంటుంది. మనిషి డల్‌గా కన్పించాడు. ఎమోషన్స్ పలికించడానికి ప్రయత్నించినా సాధ్యపడలేదు. హన్సిక పాత్ర ఫర్వాలేదు. చిలిపితనం, అమాయకత్వం కలిపిన సన్నివేశాల్లో బాగానే చేసింది. జయప్రకాష్ రెడ్డి, ముఖేష్ రుషి పాత్రలు వారికి కొట్టిన పిండే. అలీ కారు డ్రైవర్‌గా, జయప్రకాష్‌రెడ్డి కొడుకుగా నటించే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. లక్ష్మీనరసింహశాస్త్రి (బ్రహ్మానందం) పాత్ర ప్రవేశంతోనే చిత్ర గమనం కాస్త పుంజుకుంటుంది. అంజలికి, రామ్‌కు పెళ్లి నిశ్చయం చేసే సన్నివేశం నుంచి చివరివరకు అతను పడే మానసిన హింస.. ప్రేక్షకులకు వినోదం పండించినా అది సినిమా ఏమాత్రం సహాయపడలేదు. మిగిలిన పాత్రలన్నీ మాములుగానే ఉన్నాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 11:12 am

రామ్‌చరణ్‌కు చెక్ పెట్టాలంటున్న జూనియర్ ఎన్టీఆర్!

తాను నటించిన రెండో చిత్రంతోనే టాలీవుడ్‌లో సూపర్‌స్టార్ రేంజ్‌కు చేరుకున్న జూనియర్ మెగాస్టార్ రామ్‌చరణ్ క్రేజ్‌కు చెక్ పెట్టాలన్న బలమైన పట్టుదలతో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 10:48 am

24న శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల నిశ్చితార్థం!

గత రెండేళ్లుగా ఎన్నారై బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోన్న బాలీవుడ్ పొడవుకాళ్ల సుందరి శిల్పాశెట్టి నిశ్చితార్థం ఈ నెల 24న జరుగనుంది. ముంబైలో జరుగనున్న ఈ నిశ్చితార్థం ద్వారా ప్రేమికులైన శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాలు త్వరలో భార్యాభర్తలు కానున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అతి ఖరీదైన దుస్తులను ధరించనున్నారని సన్నిహితులు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 9:32 am

నేను ముఖ్యమంత్రి అయ్యే రోజు వస్తుంది: వైఎస్ జగన్

కోట్లమంది తెలుగువారి ఆదరాభిమానాలతో తాను ఏదో ఒకరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించడం ఖాయమని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన మనసులోని కోరికను బయటపెట్టారు. ప్రజలు, పార్టీ అండదండలతో తను ఖచ్చితంగా ఆ పదవిని అలంకరిస్తానన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 8:57 am

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను బాంబుతో పేల్చేస్తా: ఆగంతకుడు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను శుక్రవారం రాత్రి గం. 9.00ల నుంచి గం. 9.30ల మధ్య బాంబుతో పేల్చేస్తానని ఓ ఆగంతకుడు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించాడు. పైగా పోలీసులకు దమ్ముంటే తనను పట్టుకోవాలని కూడా బెదిరించినట్లు సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 8:47 am

ఐదు విడతలుగా జరుగనున్న జార్ఖండ్ ఎన్నికలు

జార్ఖండ్ రాష్ట్రంలో వచ్చే నెల 27 నుంచి ఐదు విడతలుగా ఎన్నికలు జరుగనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం ప్రకటించింది.
Source: జాతీయ | 23 Oct 2009 | 8:22 am

అరెరె... రాష్ట్రాన్ని మరోసారి నరకంలోకి తోసేశారే: బాల్ థాకరే

కాంగ్రెస్- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కూటమిని తిరిగి ఎన్నికల్లో గెలిపించడం ద్వారా మహారాష్ట్రను నరక కూపంలోకి మరోసారి నెట్టివేశారని బాల్ థాకరే నేరుగా మహా ప్రజలపైనే విరుచుకుపడుతున్నారు. ముచ్చటగా మూడోసారి పరాజయం చవిచూసిన బాల్ థాకరే సహనాన్ని కోల్పోయి పై విధంగా తన పత్రిక సామ్నాలో ప్రజలను విమర్శిస్తూ ఎడిటోరియల్ రాశారు.
Source: జాతీయ | 23 Oct 2009 | 7:02 am

"మహా" ముఖ్యమంత్రి రేసులో లేను: మంత్రి దేశ్‌ముఖ్

మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని కేంద్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి విలాస్ రావ్ దేశ్‌ముఖ్‌ స్పష్టం చేశారు. అయితే, ఆయన శుక్రవారం ఉదయం పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో నెంబర్ 10 జనపథ్‌లో కలుసుకుని అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశారు.
Source: జాతీయ | 23 Oct 2009 | 6:20 am

ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా 28న తెరాస జైల్‌భరో

హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా ప్రకటించడాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 28వ తేదీన జైల్ భరో కార్యక్రమాన్ని నిర్వహించాలని తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర రావు శుక్రవారం వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 6:04 am

"మంజీరా, కొండాపూర్" అందాలను చూసొద్దాం రండి..!!

దేశ విదేశాల నుంచి తరలివచ్చే వందలాది రంగుల వలస పక్షుల సందడితో సందడి చేసే మంజీరా ప్రాజెక్టు.. ఆ ప్రాజెక్టు ఆవరణలోని మొసళ్ల పెంపక కేంద్రంలోని రకరకాల మొసళ్ల రాజసాలు.. అక్కడికి సమీపంలో ఉండే గార్డెన్ పచ్చదనపు సోయగాలు.. వీటన్నింటిని గూర్చి తెలియజెప్పే విధంగా బొమ్మల రూపంలో ఉండే ప్రదర్శనశాల.. పరవళ్లు తొక్కుతూ ప్రవహించే మంజీరా నది గలగలలు... "మంజీరా, కొండాపూర్"ల సొంతం.
Source: వినోదం | 23 Oct 2009 | 5:40 am

24న శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల నిశ్చితార్థం!

గత రెండేళ్లుగా ఎన్నారై బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోన్న బాలీవుడ్ పొడవుకాళ్ల సుందరి శిల్పాశెట్టి నిశ్చితార్థం ఈ నెల 24న జరుగనుంది. ముంబైలో జరుగనున్న ఈ నిశ్చితార్థం ద్వారా ప్రేమికులైన శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాలు త్వరలో భార్యాభర్తలు కానున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అతి ఖరీదైన దుస్తులను ధరించనున్నారని సన్నిహితులు చెప్పారు.
Source: వినోదం | 23 Oct 2009 | 4:05 am

"స్వాతిముత్యం" విశ్వనాథ్ దర్శకత్వంలో శృతిహాసన్..!?

సాగరసంగమమం, స్వాతిముత్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ డైరక్షన్‌లో "శృతిహాసన్" నటించబోతుందని తెలిసింది. పద్మభూషణ్, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె అయిన శృతిహాసన్ బాలీవుడ్ సినిమా "లక్"లో హీరోయిన్‌గా పరిచయమైంది. సినీరంగంలో బాలనటిగా, గాయనిగా, కథానాయికగా తన హవాను కొనసాగించిన శృతిహాసన్ తాజాగా తన తండ్రి నటించి నిర్మాణ సారథ్యం వహించిన "ఈనాడు" సినిమాకు సంగీత దర్శకురాలిగా మారింది. మరోవైపు.. ప్రముఖ దర్శకుడు, కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో, క్రేజీ హీరో సిద్ధార్థ కథానాయకుడుగా నటిస్తున్న మరో చిత్రంలోనూ శృతి కథానాయిక పాత్రను పోషిస్తుందనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తానికి శృతిహాసన్ త్వరలో టాలీవుడ్ కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట..!.
Source: వినోదం | 23 Oct 2009 | 4:05 am

యడ్యూరప్పతో భేటీ కానున్న ముఖ్యమంత్రి రోశయ్య

రాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రోశయ్య భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి యడ్యూరప్ప తేనీటి విందునిస్తారు. ఈ భేటీలో భాగంగా ఇరురాష్ట్రాలను ముంచెత్తిన వరదలు, ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలపై రోశయ్య-యడ్యూరప్పల మధ్య చర్చ జరుగవచ్చునని పార్టీ శ్రేణుల సమాచారం. అనంతరం శుక్రవారం జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో రోశయ్య పాల్గొంటారు.
Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 3:27 am