|
107 శాతం లాభాలు పొందిన డా. రెడ్డీస్ ల్యాబ్ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో నికర లాభాలు 106.55 శాతం పెరిగి రూ. 217.3 కోట్లకు చేరుకుందని డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ సంస్థ బొంబాయి స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌కు శుక్రవారం వెల్లడించింది.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 9:48 am ఓటమికి కుంటి సాకులు వెదుకుతున్న కమలనాథులుభారతీయ జనతా పార్టీ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. లోక్‌సభ ఎన్నికల ఓటమి నుంచి ఇపుడిపుడే తేరుకుంటున్న కమలనాథులకు తాజా ఎన్నికల్లో ఎదురైన ఓటమి మరింత కుంగదీసింది. పార్లమెట్ ఎన్నికల పుణ్యమాని పార్టీ నేతల్లో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారి భగ్గుమన్నాయి.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 9:45 am మార్కెట్లను బలహీనపరిచిన రిలయన్స్స్టాక్ మార్కెట్లను అతి పెద్ద పారిశ్రామిక గ్రూపు సంస్థ అయిన రిలయన్స్ బలహీనపరిచింది. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 41 పాయింట్లు లాభపడి 16,831 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 16 పాయింట్లు బలపడి 5,005 వద్ద పయనిస్తోంది.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 9:35 am 39 శాతం నికర లాభాలను పొందిన భెల్ సంస్థప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బిహెచ్ఈఎల్) సంస్థ నికర లాభాలు 39 శాతానికి పెరిగి రూ. 858 కోట్లకు చేరుకుందిSource: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 9:34 am 24న శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాల నిశ్చితార్థం!గత రెండేళ్లుగా ఎన్నారై బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమాయణం కొనసాగిస్తోన్న బాలీవుడ్ పొడవుకాళ్ల సుందరి శిల్పాశెట్టి నిశ్చితార్థం ఈ నెల 24న జరుగనుంది. ముంబైలో జరుగనున్న ఈ నిశ్చితార్థం ద్వారా ప్రేమికులైన శిల్పాశెట్టి-రాజ్ కుంద్రాలు త్వరలో భార్యాభర్తలు కానున్నారు. ఈ నిశ్చితార్థ వేడుకలో రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి అతి ఖరీదైన దుస్తులను ధరించనున్నారని సన్నిహితులు చెప్పారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 9:32 am శాసనసభ ప్రతిపక్ష నేత పదవికి వసుంధరా గుడ్‌బై!రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి ఆమె శుక్రవారం సమర్పించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 9:18 am చిత్రాల్లో నటిస్తారంటున్న జాక్సన్ పిల్లలుజాక్సన్ ముగ్గురు పిల్లలు కూడా చిత్ర నటులు కావాలనుకుంటున్నారని, వారు ముగ్గురు కూడా జాక్సన్ బాటలో పయనించాలనుకోవడం లేదని జాక్సన్ సోదరుడు జర్మైన్ తెలిపినట్లు కాంటాక్ట్ మ్యూజిక్ సంస్థ లండన్‌లో శుక్రవారం వెల్లడించిందిSource: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 9:18 am యడ్యూరప్పతో భేటీ కానున్న ముఖ్యమంత్రి రోశయ్యరాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రోశయ్య భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి యడ్యూరప్ప తేనీటి విందునిస్తారు. ఈ భేటీలో భాగంగా ఇరురాష్ట్రాలను ముంచెత్తిన వరదలు, ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలపై రోశయ్య-యడ్యూరప్పల మధ్య చర్చ జరుగవచ్చునని పార్టీ శ్రేణుల సమాచారం. అనంతరం శుక్రవారం జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో రోశయ్య పాల్గొంటారు.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 8:55 am స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్స్టాక్ మార్కెట్ ప్రస్తుతం స్వల్ప లాభాల్లో పయనిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 23 పాయింట్లు పుంజుకుని 16,813 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు లాభపడి 4,998 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.32 శాతం, నిఫ్టీ 0.37 శాతం చొప్పున లాభపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 8:21 am వైఎస్ పథకాల అమలులో మందగమనం: వైఎస్.జగన్‌ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాల అమలులో మందగమనం నెలకొందని ఆయన తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 7:57 am "స్వాతిముత్యం" విశ్వనాథ్ దర్శకత్వంలో శృతిహాసన్..!?సాగరసంగమమం, స్వాతిముత్యం వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాథ్ డైరక్షన్‌లో "శృతిహాసన్" నటించబోతుందని తెలిసింది. పద్మభూషణ్, దశావతారం హీరో కమల్ హాసన్ కుమార్తె అయిన శృతిహాసన్ బాలీవుడ్ సినిమా "లక్"లో హీరోయిన్‌గా పరిచయమైంది. సినీరంగంలో బాలనటిగా, గాయనిగా, కథానాయికగా తన హవాను కొనసాగించిన శృతిహాసన్ తాజాగా తన తండ్రి నటించి నిర్మాణ సారథ్యం వహించిన "ఈనాడు" సినిమాకు సంగీత దర్శకురాలిగా మారింది. మరోవైపు.. ప్రముఖ దర్శకుడు, కె. రాఘవేంద్రరావు తనయుడు ప్రకాష్ దర్శకత్వంలో, క్రేజీ హీరో సిద్ధార్థ కథానాయకుడుగా నటిస్తున్న మరో చిత్రంలోనూ శృతి కథానాయిక పాత్రను పోషిస్తుందనే వార్తలు కూడా విన్పిస్తున్నాయి. మొత్తానికి శృతిహాసన్ త్వరలో టాలీవుడ్ కథానాయికగా ప్రేక్షకుల ముందుకు రానుందన్నమాట..!.Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 7:55 am స్టాక్ మార్కెట్లో నెమ్మదించిన లాభాలుస్టాక్ మార్కెట్లో లాభాలు నెమ్మదించాయి. ప్రస్తుతం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 69 పాయింట్లు పుంజుకుని 16,859 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 22 పాయింట్లు లాభపడి 5,010 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.38 శాతం, నిఫ్టీ 0.43 శాతం మేరకు లాభపడ్డాయి.Source: Yahoo! Telugu: News | 23 Oct 2009 | 7:40 am టీనేజ్ గర్ల్, 'దేశముదురు' భామ "హన్సిక" పర్సనల్ టచ్"దేశముదురు" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తెల్లపిల్ల, అందాల ముద్దుగుమ్మ, టీనేజ్ గర్ల్ హన్సిక. బాలీవుడ్‌లో చైల్డ్ ఆర్టిస్టుగా "ఎస్కేప్ ఫ్రమ్ తాలిబన్" చిత్రం ద్వారా రంగప్రవేశం చేసింది. తర్వాత హవా, కోయి.. మిల్ గయా, జాగో, అబ్రాకా దబ్రా, హుమ్ ఖాన్ హాయ్ వంటి ఆరేడు హిందీ చిత్రాల్లో బాలనటిగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. టాలీవుడ్‌కు కథానాయిగా "దేశముదురు" ద్వారా అల్లుఅర్జున్ సరసన నటించిన ఈ భామకు, 2004 సంవత్సరానికి గానూ ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటీమణి అవార్డు లభించింది. తర్వాత కంత్రి, మస్కా, బిల్లా వంటి చిత్రాల్లో ప్రేక్షకుల మదిని దొంగలించిన హన్సిక.. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ సరసన చేసిన "జయీభవ" సినిమాలో నటించింది. పుట్టిన రోజు.. ఆగస్టు 9, 1991 (1991-08-09), జన్మస్థలం: ముంబై, వయసు: 18 సంవత్సరాలు,ఇతర పేర్లు: సీమా మొత్వాని, హన్సిక మొత్వాని.తెలిసిన భాషలు: హిందీ, తెలుగు, మరాఠి, బెంగాలీ, ఇంగ్లీష్, తుళులతో పాటు మాతృభాష సింధి.Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 7:32 am వందరోజుల వేడుకలో 'చిరుత'నయుడి "మగధీర""చిరుత"నయుడు 'రామ్‌చరణ్ తేజ' హీరోగా నటించిన "మగధీర" సినిమా వందరోజుల వేడుకలకు సిద్ధమవుతోంది. రామ్‌చరణ్, అందాలతార కాజల్ అగర్వాల్ హీరోహీరోయిన్లుగా, గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన మగధీర ఘనవిజయాన్ని పురస్కరించుకుని అత్యంత భారీగా వందరోజుల వేడుక చేయాలని నిర్ణయించారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 6:03 am నా కన్నా పొట్టిగా ఉన్నా.. పెళ్లి చేసుకుంటా..!: అనుష్కతనకంటే పొట్టిగా ఉండే వ్యక్తిని వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని యోగాటీచర్, బిల్లా సెక్సీడాళ్ అనుష్క అంటోంది. కానీ.. పెళ్లితోనే పరిచయమయ్యే వ్యక్తి తన కంటే ఎత్తు తక్కువైతే మాత్రం ఒప్పుకోనని అంటోంది. అయితే పెళ్లికి ముందే పరిచయమైన వ్యక్తిగా ఉంటే మాత్రం పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తానని ఈ పొడవుకాళ్ల సుందరి స్పష్టం చేసింది. టాలీవుడ్ కథానాయికల్లో.. ఇతరులను ఇట్టే ఆకట్టు అందచందాలతో ఖచ్చితమైన ఎత్తుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న అనుష్కకు ఈ మధ్య హైట్ ఓ సమస్యగా మారిందట. ఏ హీరో పక్కన ఆమెను నిలబెట్టినా కథానాయకులే పొట్టిగా కనిపిస్తున్నారట.Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 5:42 am యాడ్ ఫిల్మ్‌లో ప్రిన్స్ మహేష్.. టెన్నిస్ రాణి సానియా!టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రిన్స్‌గా పేరుగాంచిన మహేష్ బాబు.. టెన్నిస్ క్రీడారంగంలో తన హృదయ అందచందాలతో కోట్లాది అభిమానుల మనస్సు దోచుకున్న సానియా మీర్జాలు కలిసి నటించనున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 23 Oct 2009 | 5:27 am శాసనసభ ప్రతిపక్ష నేత పదవికి వసుంధరా గుడ్‌బై!రాజస్థాన్ రాష్ట్ర శాసనసభ ప్రతిపక్ష నేత పదవికి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అగ్రనేత ఎల్కే.అద్వానీకి ఆమె శుక్రవారం సమర్పించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.Source: జాతీయ | 23 Oct 2009 | 3:49 am యడ్యూరప్పతో భేటీ కానున్న ముఖ్యమంత్రి రోశయ్యరాష్ట్ర ముఖ్యమంత్రి కె. రోశయ్య శుక్రవారం బెంగళూరు చేరుకున్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్పతో రోశయ్య భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి యడ్యూరప్ప తేనీటి విందునిస్తారు. ఈ భేటీలో భాగంగా ఇరురాష్ట్రాలను ముంచెత్తిన వరదలు, ఇరు రాష్ట్రాల రాజకీయ అంశాలపై రోశయ్య-యడ్యూరప్పల మధ్య చర్చ జరుగవచ్చునని పార్టీ శ్రేణుల సమాచారం. అనంతరం శుక్రవారం జరిగే ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశంలో రోశయ్య పాల్గొంటారు.Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 3:27 am వైఎస్ పథకాల అమలులో మందగమనం: వైఎస్.జగన్‌ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాల అమలులో మందగమనం నెలకొందని ఆయన తనయుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 2:28 am మహారాష్ట్ర, హర్యానా ఫలితాలపై రాహుల్ ప్రభావంమహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవడంలో ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ ప్రభావం ఎక్కువగానే ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో రాహుల్ సుడిగాలి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.Source: జాతీయ | 23 Oct 2009 | 1:54 am తిరుపతి-పండర్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు: ద మ రైల్వేసికింద్రాబాద్-తిరుపతి, ఆదిలాబాద్-పండర్‌పూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా.. సికింద్రాబాద్ నుంచి 24వ తేదీ రాత్రి 11-10 గంటలకు బయలుదేరే సర్వీస్ నెం.0709 రైలు.. మరుసటి రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంటల మీదుగా ఈ రైలు ప్రయాణిస్తుంది.Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 1:23 am అజ్ఞాతంలో దేవరకద్ర ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డిదేవరకద్ర వ్యవసాయ అధికారిణి రాజేశ్వరి ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న స్థానిక ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి గురువారం రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆమెతో పాటు.. జడ్పీటీసీ ఛైర్మన్‌ను అరెస్టు చేసేందుకు దేవరకద్ర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 1:22 am రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు లేవు: మంత్రి గాదెముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి దుర్మరణం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు ఉన్నట్టు వస్తున్న వార్తలను రాష్ట్ర హిందూ దేవాదాయ శాఖామంత్రి గాదె వెంకట రెడ్డి కొట్టి పారేశారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు గానీ పొరపొచ్చాలు గానీ లేవని ఆయన స్పష్టం చేశారు.Source: ఏపీ న్యూస్ | 23 Oct 2009 | 1:08 am మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ఏర్పాటుకు కాంగ్రెస్ సిద్ధం!తాజాగా ఎన్నికల ఫలితాలు వెలువడిన మూడు రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సమాయత్తమవుతోంది. మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా స్పష్టమైన తీర్పు ఇచ్చారు.Source: జాతీయ | 23 Oct 2009 | 12:58 am హస్తం గెలుపు: ఇక్కడ చిరంజీవి.. అక్కడ రాజ్థాక్రేమహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హ్యాట్రిక్ సాధించడానికి ప్రధాన కారకంగా ఉపయోగపడిన వ్యక్తి మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధిపతి రాజ్‌థాక్రే. అలాగే, మన రాష్ట్రంలో వైఎస్సార్ తిరిగి రెండోసారి పదవిలోకి రావడానికి దోహదపడిన వ్యక్తి సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి.Source: జాతీయ | 23 Oct 2009 | 12:34 am వైఎస్.జగన్‌కు పంగనామాలని ఆనాడే చెప్పా: కేకేదివంగత నేత వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డికి పార్టీ హైకమాండ్ పంగనామాలు పెట్టడం ఖాయమని తాను ఎపుడో జోస్యం చెప్పానని రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో వైఎస్ జగన్ గురువారం ఉదయం భేటీ అయ్యారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 11:28 pm "మా" స్టార్‌నైట్‌కు పోటీగా "మెగాస్టార్" జోలె భిక్షాటన!టాలీవుడ్‌లో స్టార్ వార్ ఆరంభమైంది. నిన్నమొన్నటి వరకు అంతర్గతంగా ఉన్న ఈ స్టార్ వార్ వరదల పుణ్యమాని బహిర్గతమైంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఆధ్వర్యంలో వచ్చే నెల ఏడో తేదీన స్టార్ నైట్ ఏర్పాటు చేయతలపెట్టారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 11:13 pm హర్యానా ప్రభుత్వ ఏర్పాటులో హెచ్‌జేసీ-బీఎల్ కీలకంహర్యానా రాష్ట్రంలో తొలిసారి హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. దీంతో హర్యానా జనహిత్ కాంగ్రెస్ (బీఎల్)తో పాటు స్వతంత్ర అభ్యర్థులు ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నారు. దీనిపై ఆ పార్టీ అధ్యక్షుడు బిషోనీ మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేల సమావేశాన్ని శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేస్తున్నామన్నారు.Source: జాతీయ | 22 Oct 2009 | 10:00 pm గ్రీన్‌హౌస్ టెక్నాలజీ వినియోగ వస్తువుగా మారాలి: పీఎంగ్రీన్హౌస్ టెక్నాలజీ పరిజ్ఞానం బదిలీకి సంబంధించి తగినన్ని ఆర్థిక వనరులను సమకూర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనా, ఐక్యరాజ్యసమితిపైనా ఉందని ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.Source: జాతీయ | 22 Oct 2009 | 9:47 pm నవంబర్ 19న వస్తోన్న 'జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా''జగద్గురు శ్రీ షిర్డి సాయిబాబా' చిత్రాన్ని నవంబర్ 19వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రముఖ నటుడు ఎం. మోహన్‌బాబు ప్రకటించారు. ఎస్.ఆర్.ఆర్ క్రియేషన్స్ పతాకంపై బి.వి.రెడ్డి టైటిల్ పాత్ర పోషించి నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను సైతం పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మోహన్‌బాబు మాట్లాడుతూ.. బి.వి.రెడ్డి తనకు మంచి స్నేహితుడని చెప్పారు. ఆయనకు సినిమా పట్ల చక్కటి అభిరుచి ఉన్నదని చెప్పారు. ఈ సినిమాను బి.వి.రెడ్డి తనకు ముందే చూపించారని, షిర్డీ సాయిబాబా పాత్రకు ఆయన చక్కటి న్యాయం చేకూర్చారని అన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2009 | 12:31 pm 'పూరి జగన్నాథ్' నా డార్లింగ్: బిల్లా స్టార్ ప్రభాస్"ఈశ్వర్"తో హీరోగా పరిచయం అయి రాఘవేంద్ర, వర్షం, ఛత్రపతి, చక్రం, అడవిరాముడు, పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో "ఏక్‌నిరంజన్"గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అక్టోబర్ 23 ప్రభాస్ పుట్టినరోజు. ఈ సందర్భంగా స్విట్జర్లాండ్‌లో కరుణాకరన్ దర్శకత్వంలో, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మిస్తోన్న భారీ చిత్రం షూటింగ్‌లో ఉన్న బిల్లాతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు మీ కోసం... ప్రశ్న: లాస్ట్ బర్త్‌డేకి, ఈ బర్త్‌డేకి మధ్య మీ కెరీర్ ఎలా వుంది?జ: లాస్ట్ బర్త్ డేకి బిల్లా సక్సెస్. ఈ బర్త్‌డే గిఫ్ట్‌గా పూరీ "ఏక్‌నిరంజన్" రిలీజ్ అవుతోంది. ప్రశ్న: ఈ పుట్టినరోజును ఎలా గడుపుకోవాలనుకుంటున్నారు?జ: స్విట్జర్లాండ్‌లో యూనిట్ సభ్యుల మధ్య సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అభిమానులకు దూరంగా ఉండటం బాధగా ఉన్నా తప్పలేదు.ప్రశ్న: ఏక్‌నిరంజన్ హైలైట్స్ ఏమిటి?జ: హీరో క్యారక్టరైజేషన్, పూరి డైలాగ్స్, మ్యూజిక్, యాక్షన్.. ఇలా అన్ని హైలైట్సే. మొత్తంగా చెప్పాలంటే.. పూరి అందించే మంచి కమర్షియల్ ప్యాకేజి "ఏక్‌నిరంజన్" అంటూ ముగించారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2009 | 11:00 am పాటల చిత్రీకరణలో "రక్షకులు"ఈశ్వర్, ప్రేరణ, ఉదయ్, నిహారిక హీరోహీరోయిన్లుగా రవివర్మ ఎమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం రక్షకులు (బ్రేక్ ద రూల్స్). ఎస్. ఎల్. కె. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట రమణారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా పాటల చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. రెండు రోజుల నుంచి దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో 30మంది డ్యాన్సర్లపై "సోకు బాగుంది.." అనే పాటను చిత్రీకరించడం జరుగుతుందన్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2009 | 10:03 am కాంగ్రెస్‌కు అంత సీను లేదు... మమ్మల్ని పిలవండి: చౌతాలా"అధికార కాంగ్రెస్ పార్టీ పేరుకు ఎక్కువ సీట్లు సాధించి ఉండవచ్చు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల శక్తి దానికి లేద"ని ఐఎన్ఎల్డీ చీఫ్ ఓం ప్రకాష్ చౌతాలా పేర్కొన్నారు. అత్యధిక స్థానాలు కైవసం చేసుకున్న ప్రతిపక్షాలను గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని సూచించారు.Source: జాతీయ | 22 Oct 2009 | 9:15 am మహారాష్ట్ర సమరం: కాంగ్రెస్-ఎన్సీపీ హ్యాట్రిక్ విజయం!మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసుకున్నాయి. గురువారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో ఈ కూటమి తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంది. సాయంత్రానికి ప్రకటించిన 269 స్థానాల ఫలితాల్లో కాంగ్రెస్ కూటమి 131 సీట్లను తన ఖాతాలో వేసుకుంది.Source: జాతీయ | 22 Oct 2009 | 7:27 am హర్యానాలో మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో "హస్తం"!దేశంలో జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో హస్తం హవా కొనసాగింది. మహారాష్ట్ర, అస్సోంలలో కాంగ్రెస్ పార్టీ విజయభేరీ మోగించి, వరుసగా రెండోసారి అధికారాన్ని కైవసం చేసుకుంది. అయితే హర్యానాలో మాత్రం సాధారణ మెజారిటీకి ఆరు సీట్ల దూరంలో వచ్చి ఆగిపోయింది.Source: జాతీయ | 22 Oct 2009 | 7:14 am ప్రభుదేవా ప్రమేయంతో నయనకు బాలీవుడ్ ఛాన్సు..!?సాధారణంగా ప్రియురాలికి ప్రేమికుడు ఏదో గొప్ప బహుమతినివ్వడం పరిపాటి. కానీ ఫిలిమ్ నగర్లో కొంతకాలం ప్రేమికులుగా అందరి నోట్లో నానుతోన్న ప్రభుదేవా-నయనతారల ప్రేమాయణంలో కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది. ఇందులో విషయమేమిటంటే..? కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన ప్రభుదేవా.. తన ప్రియురాలు అయిన సెక్సీడాళ్ నయనతారకు బాలీవుడ్ ఛాన్సు ఇస్తున్నాడని తెలిసింది. ఇదేదో బాలీవుడ్ ఛాన్సంటే.. త్రిష, అసిన్‌లా కాదండీ బాబూ.. ప్రభుదేవా దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న హిందీ "పోకిరి"లో నయనతారను హీరోయిన్‌గా పరిచయం చేస్తున్నట్లు సమాచారం. "మోస్ట్ వాంటెడ్" అనే పేరుతో పోకిరి హిందీలో రీమేక్ కానుందని, దీనికి బోని కపూర్ నిర్మాణ సారథ్యం వహిస్తున్నట్లు తెలిసింది.Source: Yahoo! Telugu: Entertainment | 22 Oct 2009 | 7:06 am అరుణాచల్ పీఠం హస్తగతం: తృణమూల్ బోణీ!మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఎన్నికల జరిగిన రాష్ట్రాల్లో ఒకటైన అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. గురువారం సాయంత్రానికి వెల్లడించిన 23 స్థానాల ఫలితాల్లో కాంగ్రెస్ 17 సీట్లలో విజయం సాధించింది.Source: జాతీయ | 22 Oct 2009 | 6:23 am సోనియాతో జగన్ భేటీ: ఆ గంట రహస్యం ఏమిటి?కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో కడప పార్లమెంట్ సభ్యుడు, దివంగత నేత వైఎస్ తనయుడు వైఎస్.జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. వీరిద్దరి సమావేశంలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీపీ రామచంద్రరావు కూడా ఉన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 5:33 am అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు... ఇంకా ఉన్నాయ్!!దట్టమైన అడవి మధ్యలో సరస్సు, అందులో పడవ ప్రయాణం, అడవి మధ్యలో అటూ ఇటూ తిరుగాడే ఏనుగులు, నీటి కోసం బయటకు వచ్చే పులులు, అడవి దున్నలు.. చెట్లపై దుముకుతూ, వేలాడుతూ అల్లరి చేసే నీలగిరి కోతులు, చింపాంజీలు, చిరుతలు.. కనువిందు చేసే రకరకాల, రంగు రంగుల పక్షులు... ఇవన్నీ వింటుంటే ఏదో సినిమాలో దృశ్యం కాబోలు అనుకునేరు సుమా..! అలాంటిదేమీ కాదు. తేక్కడి అటవీ ప్రాంతంలో...Source: వినోదం | 22 Oct 2009 | 4:53 am పాటల చిత్రీకరణలో "రక్షకులు"ఈశ్వర్, ప్రేరణ, ఉదయ్, నిహారిక హీరోహీరోయిన్లుగా రవివర్మ ఎమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం రక్షకులు (బ్రేక్ ద రూల్స్). ఎస్. ఎల్. కె. ప్రొడక్షన్స్ పతాకంపై వెంకట రమణారెడ్డి నిర్మిస్తోన్న ఈ సినిమా పాటల చిత్రీకరణలో ఉంది. ఈ సందర్భంగా దర్శకులు మాట్లాడుతూ.. రెండు రోజుల నుంచి దిలీప్ మాస్టర్ కొరియోగ్రఫీలో 30మంది డ్యాన్సర్లపై "సోకు బాగుంది.." అనే పాటను చిత్రీకరించడం జరుగుతుందన్నారు.Source: వినోదం | 22 Oct 2009 | 4:34 am సోనియా అమ్మపై పూర్తి విశ్వాసం ఉంది: వైఎస్ జగన్కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీపై పూర్తి విశ్వాసం, నమ్మకం ఉందని ముఖ్యమంత్రి వైఎస్ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. తన భవిష్యత్‌ను అమ్మే నిర్ణయిస్తుందని, ఇందులో ఎలాంటి మార్పు లేదన్నారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 2:52 am "గ్రేటర్ హైదరాబాద్"లో గెలుపే లక్ష్యం కావాలి: చంద్రబాబుత్వరలో జరుగనున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.Source: ఏపీ న్యూస్ | 22 Oct 2009 | 2:52 am
|