ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం: సీపీఐ

ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 9:34 am

తీవ్రవాద దాడుల సమాచారం అందించండి: పాక్

పాకిస్తాన్ భూభాగం వైపు నుంచి తీవ్రవాదులు భారతదేశంపై దాడులకు వ్యూహం రచిస్తున్నారన్న సమాచారం భారత్ వద్ద ఉంటే తక్షణమే తమకు అందించాలని పాకిస్తాన్ కోరింది. ఈ సమచారాన్ని తమ దేశానికి అప్పగించినట్లయితే ముందస్తుగా తగిన చర్యలు తీసుకోగలమని తెలిపింది.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 9:29 am

నష్టాల్లోకి కూరుకుపోతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోకి కూరుకుపోతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 179 పాయింట్లు క్షీణించి 17,044 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 51 పాయింట్లు నష్టపోయి 5,063 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 1.04 శాతం, నిఫ్టీ 1.00 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 9:27 am

రాజీవ్ "ఆరోగ్యశ్రీ"పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

తెల్లరేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమలు విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం సచివాలయంలో ఆరోగ్యశ్రీ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో ఆరోగ్యశ్రీ మంత్రి పితాని సత్యనారాయణ, గల్లా అరుణకుమారి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉంటారు.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 9:25 am

"కథ"ల కాన్సెప్ట్‌తో ఆడియో విడుదల!

బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా హీరోయిన్‌గా రూపుదిద్దుకుంటోన్న "కథ" సినిమా ఆడియో వైవిధ్యంగా విడుదలైంది. జస్ట్ ఎల్లో అధినేత గుణ్ణం గంగరాజు ఈ కార్యక్రమాన్ని మాదాపూర్ ఆర్ట్ గ్యాలరీలో వైవిధ్యంగా జరిపారు.ముందుగా కొన్ని చీటీలు రాసి అందులో మూడక్షరాలు వచ్చే పదాలను రాసి దానికి తగినట్లుగా అతిథులు ఓ కథ చెప్పాలి. అలా కథను ఒక్కొక్కరు అల్లుకుంటూ కొనసాగించాలి. అవి ప్రేక్షకులను అలరించాలి. మొదటి విడతలో.. రచయిత రాజసింహ, ఎన్టీఆర్, కీరవాణి, తమ్మారెడ్డి భరద్వాజ, రమా రాజమౌళి, రఘుబాబు, రాజమౌళి, ప్రకాష్‌రాజ్, జెనీలియా, చిత్ర హీరో అరుణ్ అదిత్ తదితరులు హాజరయ్యారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 8:30 am

స్టాక్ మార్కెట్లో విస్తరిస్తున్న నష్టాలు

స్టాక్ మార్కెట్లో నష్టాలు విస్తరిస్తుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 49 పాయింట్లు కోల్పోయి 17,174 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 9 పాయింట్లు నష్టపోయి 5,106 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.29 శాతం, నిఫ్టీ 0.17 శాతం మేరకు క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 8:30 am

మాకు ఆయన గాడ్‌ఫాదర్ లాంటివారు: అల్లరి నరేష్

అల్లరినరేష్, కామ్న జఠ్మలానీ హీరోహీరోయిన్లుగా డా.డి. రామానాయుడు నిర్మించిన "బెండు అప్పారావు" చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. తమకు రామానాయుడు గాడ్‌ఫాదర్ లాంటివారు. నాన్నకు, అన్నయ్యకు, తనకు మంచి బ్రేక్ ఇచ్చారు. తనతో నిర్మించిన ఈ చిత్రం విజయం సాధించడం ఆనందంగా ఉంది. భారీ ఓపెన్సింగ్ ఈ సినిమాకు రావడం విశేషమని నరేష్ అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 8:12 am

ఎంఅండ్ఎం, రేనాల్ట్‌ల మధ్య భాగస్వామ్యానికి బ్రేక్!

ప్రముఖ కంపెనీలు మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం), ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రేనాల్ట్‌ల మధ్య భాగస్వామ్యానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి. జరుగుతున్న పరిణామాలను బట్టి.. ఇలాంటి పరిస్థితులే కొనసాగినట్లయితే.. భాగస్వామ్యం నుంచి వైదొలిగుతామని రేనాల్ట్ కంపెనీ స్వయంగా వెల్లడించడం గమనార్హం.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 8:09 am

భారత్‌లో పర్యటిస్తున్న మాల్దీవుల అధ్యక్షుడు నషీద్

ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఈ రోజు ఉదయం మాల్దీవుల అధ్యక్షుడు మొహ్మద్ నషీద్ భారత్‌కు చేరుకున్నారు. ఆయన తన పర్యటనలో ముందుగా.. వాతావరణ మార్పుపై ఏర్పాటు చేసే సదస్సుకు హాజరవుతారు. ఈ సమావేశంలో భారత్, మాల్దీవుల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై సమీక్షిస్తారు.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 8:06 am

దాసరి, వెంకీ చేతుల మీదుగా "చాప్టర్-6" ఆడియో

సూర్యకిరణ్ దర్శకత్వంలో కళ్యాణి నిర్మాత రూపొందుతోన్న "చాప్టర్-6" ఆడియో ఆవిష్కరణ హైదరాబాదులో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన దర్శకరత్న డా. దాసరినారాయణరావు ఆడియోను ఆవిష్కరించి విక్టరీ వెంకటేష్‌కు అందజేశారు. ఆడియో సీడీని రాజశేఖర్ ఆవిష్కరించి జగపతిబాబుకు ఇచ్చారు
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 7:59 am

నష్టాల్లోనే కొనసాగుతున్న స్టాక్ మార్కెట్

స్టాక్ మార్కెట్ ప్రస్తుతం నష్టాల్లోనే కొనసాగుతుండటంతో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 27 పాయింట్లు కోల్పోయి 17,196 వద్దకు చేరుకుంది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 13 పాయింట్లు నష్టపోయి 5,101 వద్ద పయనిస్తోంది. సెన్సెక్స్ 0.15 శాతం, నిఫ్టీ 0.26 శాతం చొప్పున క్షీణించాయి.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 7:37 am

ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్న ప్రభుత్వం: బాబు

ప్రతిపక్షాలను ఎలా బలహీన పరచాలన్న ధ్యేయంతోనే అధికార పార్టీ ఉన్నదనీ, నిత్యం దాని గురించే ఆలోచిస్తోంది తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన చేయడం లేదని తెలుగుదేశం అధినేత మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 7:24 am

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా: మమత

మధుర వద్ద బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు రైల్వేమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు గోవా ఎక్స్‌ప్రెస్- మేవాస్ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొనడంతో సంభవించిన ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 21 Oct 2009 | 7:18 am

జెనీలియా, కాజల్‌లతో "మగధీర" మూడో సినిమా!

ప్రముఖ నిర్మాణ సంస్థ అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై "చిరుత"నయుడు, 'మగధీర' హీరో, రామ్ చరణ్ తేజ కథానాయకుడుగా, బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా, సెక్సీడాళ్ కాజల్ అగర్వాల్ నాయికలుగా నటించనున్న భారీ బడ్జెట్ మూవీ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. హైటెక్ సిటీలోని హోటల్‌లో దేవుని పటాలపై ప్రారంభమైన తొలిషాట్‌కు దర్శకరత్న డాక్టర్. దాసరి నారాయణరావు క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్‌చరణ్ తొలిసినిమా "చిరుత" ఒక విజయమైతే.., అతని రెండో సినిమా "మగధీర" సెన్సేషనల్ రికార్డు సృష్టించిందన్నారు. అలాగే రామ్‌చరణ్ మూడో సినిమా కూడా ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ సాధించాలని దాసరి ఆకాంక్షించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Oct 2009 | 5:26 am

ధరల నియంత్రణలో విఫలమైన ప్రభుత్వం: సీపీఐ

ధరల నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది సీపీఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ఆరోపించారు. అలాగే రాష్ట్రాన్ని ముంచెత్తిన వరద సహాయక చర్యల్లోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన విమర్శించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 4:04 am

రాజీవ్ "ఆరోగ్యశ్రీ"పై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు

తెల్లరేషన్ కార్డుతో నిమిత్తం లేకుండా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అమలు విధివిధానాలపై అధ్యయనం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది. ముఖ్యమంత్రి రోశయ్య బుధవారం సచివాలయంలో ఆరోగ్యశ్రీ పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీపై అధ్యయనం చేసేందుకు ఐదుగురు మంత్రులతో కూడిన ఓ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. ఈ మంత్రివర్గ ఉప సంఘంలో ఆరోగ్యశ్రీ మంత్రి పితాని సత్యనారాయణ, గల్లా అరుణకుమారి, బొత్స సత్యనారాయణ, వట్టి వసంత్‌కుమార్, జూపల్లి కృష్ణారావులు సభ్యులుగా ఉంటారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 3:55 am

మేడమ్..అపాయింట్‌మెంట్ ఇస్తే కలుస్తా.!: జగన్

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ ఇస్తే.. ఆమెను కలుస్తానని వైఎస్సార్ తనయుడు, కడప ఎంపీ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఆర్థిక శాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ అపాయింట్‌మెంట్ అడిగామని, మరో మూడు రోజుల పాటు హస్తినలో ఉంటానని జగన్ వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 2:03 am

ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్న ప్రభుత్వం: బాబు

ప్రతిపక్షాలను ఎలా బలహీన పరచాలన్న ధ్యేయంతోనే అధికార పార్టీ ఉన్నదనీ, నిత్యం దాని గురించే ఆలోచిస్తోంది తప్ప ప్రజా సమస్యలను పరిష్కరించాలన్న ఆలోచన చేయడం లేదని తెలుగుదేశం అధినేత మాజీముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 1:54 am

మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా: మమత

మధుర వద్ద బుధవారం తెల్లవారుజామున సంభవించిన ఘోర రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.5లక్షల నష్టపరిహారాన్ని అందజేయనున్నట్లు రైల్వేమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటలకు గోవా ఎక్స్‌ప్రెస్- మేవాస్ ఎక్స్‌ప్రెస్‌లు ఢీకొనడంతో సంభవించిన ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టేందుకు ఆదేశించినట్లు ఆమె తెలిపారు.
Source: జాతీయ | 21 Oct 2009 | 1:49 am

పర్యావరణ మార్పులపై యుద్ధం చేద్దాం: భారత్-చైనా

ప్రస్తుతం చైనా సరిహద్దు వెంబడి రగులుతున్న సమస్య అందరికీ తెలిసిందే. అయితే ఆ సమస్యలను ప్రస్తుతానికి ప్రక్కనపెట్టి భారత్-చైనాలు పర్యావరణ మార్పులపై యుద్ధం చేయాలని నిర్ణయించాయి. ఇందుకు అనుగుణంగా ఇరు దేశాలు బుధవారం సంయుక్తంగా ఓ అంగీకారికి వచ్చాయి.
Source: జాతీయ | 21 Oct 2009 | 1:34 am

వరద సహాయక చర్యల్లో పోలీసుల సేవలు భేష్!: సబిత

వరద ముంపు ప్రాంతాల్లో పోలీసులు చేసిన సహాయక చర్యలు ఎనలేనివని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలోని కర్నూలు, గుంటూరు, కృష్ణా జిల్లాల వరద ముంపు ప్రాంతాల్లో పోలీసులు చేసిన సేవలు మరుపురానివని మంత్రి కొనియాడారు.
Source: ఏపీ న్యూస్ | 21 Oct 2009 | 12:45 am

గోవా, మేవార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఢీ: 15 మంది మృతి

మధురకు సమీపంలో గోవా, మేవార్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఒకదానికి ఒకటి ఢీ కొన్న సంఘటనలో సుమారు 15 మందికి పైగా ప్రయాణీకులు మృతి చెందారు. మరో 50 మందికి పైగా ప్రయాణీకులు బోగీల్లో చిక్కుకుని ఉన్నారు. ఈ రోజు ఉదయం 4.45 గంటల సమయంలో మధురకు సమీపంలోని బజ్నా వంతెన వద్ద ఈ దుర్ఘటన జరిగింది.
Source: జాతీయ | 20 Oct 2009 | 11:53 pm

ఆ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు: అమితాబ్

సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్‌సింగ్‌పై దాఖలైన కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ స్పష్టం చేశారు. ఐదువందల కోట్ల రూపాయల నిధుల కుంభకోణంకు సంబంధించి ఎస్పీ నేత అమర్ సింగ్, ఆయన భార్యపై కాన్పూర్‌లో కేసు దాఖలైన విషయం తెలిసిందే.
Source: జాతీయ | 20 Oct 2009 | 10:02 pm

నక్సలైట్లను.. ఉగ్రవాదులను ఒకే గాటను కట్టలేం: చిదంబరం

నక్సలైట్లను మావోయిస్టులతో పోల్చి చూడటం జరగదని, అలాగే జమ్మూ- కాశ్మీరులో దాడులకు పాల్పడే ఉగ్రవాదులతో సైతం పోల్చబోమని కేంద్ర హోం శాఖామంత్రి పి. చిదంబరం వెల్లడించారు. నక్సలైట్లు హింసాత్మక మార్గాన్ని విడనాడి భేషరతుగా ప్రభుత్వంతో చర్చలు జరపేందుకు ముందుకు రావాలనీ, జనస్రవంతిలో కలిసి జీవనం సాగించాలని ఆకాంక్షించారు.
Source: జాతీయ | 20 Oct 2009 | 9:52 pm

నా శరీరాన్ని దాచుకుంటా.. చూపించను: జెనీలియా

ఇపుడు హీరోయిన్లందరూ విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. పొట్టి దుస్తులు.. బికినీల్లో తమ శరీరపు అందాలన్నిటినీ ప్రదర్శించేస్తున్నారు. మరి మీరు కూడా చేస్తారా...? అని జెనీలియాను ప్రశ్నిస్తే విలక్షణమైన సమాధానం చెప్పుకొచ్చింది. అదేమంటే.. ఎవరో ఏదో చూపిస్తున్నారని తను మాత్రం అటువంటి ఎక్స్‌పోజింగ్‌లు చేయదట. ముఖాన్ని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తానని అంటోంది. తన శరీరాన్ని దాచుకుంటానని చెపుతోంది. " సై అనే చిత్రంలో కాస్త సెక్సీగా కన్పించాను. కానీ అందులో వల్గారిటీ ఎక్కడా కనబడదు. నేను నటించిన సినిమాలు నా ఫ్యామిలీ కూడా హ్యాపీగా చూస్తుంది. వాళ్లకు నచ్చనిది నేను చేయను. వాళ్లు మెచ్చుకోని సన్నివేశాలలో నేను ఎట్టి పరిస్థితుల్లో నటించను గాక నటించను. అందుకనేనేమో నాకు ఇటీవల కాస్త ఆఫర్లు తగ్గాయి. అయినా ఫర్లేదు. మోడ్రన్ గాళ్ అయినా మోడ్రన్‌గా ఉంటాను తప్పించి శరీరాన్ని మాత్రం ఎక్స్‌పోజ్ చేయన"ని కచ్చితంగా చెపుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 12:19 pm

హిట్‌లేని "లవర్‌ బాయ్" సినిమాకు ముగ్గురు దర్శకులు..!

ఒకప్పుడు "లవర్‌ బాయ్‌"గా పేరుతెచ్చుకున్న తరుణ్‌, ఇప్పుడు హిట్‌ సినిమాలు లేకుండా కష్టాలు పడుతున్నాడు. ఇటీవలే పబ్‌ను నెలకొల్పి సినిమాలు లేనప్పుడు ఆ వ్యాపారాన్ని కూడా చూసుకుంటున్నాడు. విశేషమేమిటంటే..? తాజాగా సుప్రీం ఆడియో కంపెనీ అధినేత రాజు హిర్యాణి తరుణ్‌తో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ప్రారంభంలోనే ఈ చిత్రానికి ఆదిత్య దర్శకుడు. ఆదిత్య ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటంతో.. కాస్త గ్యాప్ ఇచ్చి వి.ఎన్. ఆదిత్యను ఎంపికచేశారు. కొద్దిరోజులు బ్యాంకాక్‌‌లో షూటింగ్ జరిపారు. అక్కడ దర్శకుడికి, నిర్మాతలకు మధ్య గొడవ జరగడంతో ఫైన్ కట్టి వెనుదిరిగి వచ్చారు. తాజాగా ఇదే చిత్రానికి కన్మణిని మూడో దర్శకుడిగా పెట్టుకున్నారు. మొత్తానికి ముగ్గురు దర్శకులు కలిస్తేగాని తరుణ్ సినిమా ఇంకా పూర్తికావడం లేదు. మరి రిలీజ్ తర్వాత ఏమవుతుందో..? వేచి చూడాల్సిందే..!.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 10:11 am

"దేశముదురు" భామతో జతకట్టనున్న దేవీ శ్రీ ప్రసాద్!?

ప్రముఖ గాయకుడు దేవీశ్రీప్రసాద్ హీరోగా ఛార్మి హీరోయిన్‌గా ఓ కొత్త చిత్రంలో నటించబోతున్నారని వార్తలొస్తే.. వాటిని దేవీ శ్రీ ప్రసాద్ ఖండించాడు. ఆ తర్వాత అదే చిత్రంలో ఓ గెటప్‌లో మాత్రం దేవీశ్రీప్రసాద్ కన్పించబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఈ విషయాన్ని అటుంచితే.. విశ్వసనీయ సమాచారం ప్రకారం సుమంత్ ఆర్ట్స్ అధినేత ఎం.ఎస్. రాజు ఓ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో దేశముదురు భామ హన్సిక హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. దర్శకుడు ఎవరైనా ఎం.ఎస్ రాజును వేయందే సినిమా కాదని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇంకేముంది.. బొద్దుగుమ్మ.. ఛార్మికి దేవీశ్రీ ప్రసాద్ టాటా చెప్పేసి.. హన్సికతో జతకట్టనున్నాడన్నమాట..!.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 9:55 am

ఆ రెండు అవార్డులు లభించడం నా అదృష్టం: సుమన్

దసరా, దీపావళి పండుగల సందర్భంగా తనకు రెండు అవార్డులు లభించడం అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ నటుడు సుమన్ అన్నారు. తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన "శివాజీ"లో చేసిన విలన్ పాత్రకు తమిళనాడు ప్రభుత్వం నుంచి "ఉత్తమ విలన్" అవార్డు దక్కడం మరిచిపోలేని మధురానుభూతిగా సుమన్ పేర్కొన్నారు. అదేవిధంగా "సిగప్పుమళై" (రెడ్ రైన్) అనే మలయాళ సినిమాలో నటించినందుకుగాను దీపావళినాడు "గిన్నిస్‌బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్"లో తన పేరు నమోదు చేసుకోవడం మరో మధురానుభూతి అని సుమన్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 7:33 am

దాడులు జరిగే అవకాశం ఉంది... జాగ్రత్త: ప్రధాని

పొరుగు దేశం పాకిస్తాన్‌లో వరుస తీవ్రవాద దాడుల నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రత్యేకంగా త్రివిధ దళాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉగ్రవాదులు దేశంలో మరోసారి తమ పంజాను విసిరే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయని వెల్లడించారు.
Source: జాతీయ | 20 Oct 2009 | 7:22 am

అన్నయ్య పార్టీలో చేరే ఆలోచనే రాలేదు: శ్రీకాంత్

తనకు రాజకీయాలంటే అసలు పడవని ప్రముఖ నటుడు శ్రీకాంత్ అన్నారు. ఇటీవలే కృష్ణవంశీ దర్శకత్వంలో రూపుదిద్దుకుని తెరకెక్కిన "మహాత్మా"తో వంద చిత్రాల్లో నటించిన శ్రీకాంత్‌ను "తెలుగు ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్" సోమవారం ఘనంగా సత్కరించింది. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవికి అభిమానిగా, మంచి స్నేహితుడిగా భావిస్తానని స్పష్టం చేశారు. అయితే తాను చిరంజీవి పార్టీకి ఎటువంటి ప్రచారం చేయలేదని, అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు కూడా అందులో చేరాలనే ఆలోచనకూడా రాలేదని శ్రీకాంత్ స్పష్టం చేశారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 7:20 am

నవంబరులో వస్తోన్న "మా నాన్న చిరంజీవి"

జగపతిబాబు, నీలిమ, మాస్టర్ అతులిత్ నటించిన కుటుంబ కథా చిత్రం "మా నాన్న చిరంజీవి" చిత్రాన్ని వచ్చేనెల రెండోవారంలో విడుదలచేస్తున్నట్లు దర్శకుడు అరుణ్ ప్రసాద్ వెల్లడించారు.ఈ చిత్ర విశేషాలను విలేకరుల సమావేశంలో దర్శకుడు తెలియజేస్తూ.. చిన్నతనంలో పిల్లలకి తమ నాన్న అన్ని విషయాల్లో హీరోలా ఉండాలని ఫీలవుతారు. తండ్రిని రోల్‌మోడల్‌గా గుర్తిస్తుంటారు. ఆ పాయింట్‌ను బేస్‌చేసుకుని ఓ పిల్లవాడి కోణం నుంచి కథను తయారు చేశామన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 20 Oct 2009 | 7:00 am

నా శరీరాన్ని దాచుకుంటా.. చూపించను: జెనీలియా

ఇపుడు హీరోయిన్లందరూ విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేస్తున్నారు. పొట్టి దుస్తులు.. బికినీల్లో తమ శరీరపు అందాలన్నిటినీ ప్రదర్శించేస్తున్నారు. మరి మీరు కూడా చేస్తారా...? అని జెనీలియాను ప్రశ్నిస్తే విలక్షణమైన సమాధానం చెప్పుకొచ్చింది. అదేమంటే.. ఎవరో ఏదో చూపిస్తున్నారని తను మాత్రం అటువంటి ఎక్స్‌పోజింగ్‌లు చేయదట. ముఖాన్ని మాత్రమే ఎక్స్‌పోజ్ చేస్తానని అంటోంది. తన శరీరాన్ని దాచుకుంటానని చెపుతోంది.
Source: వినోదం | 20 Oct 2009 | 6:51 am

అన్నపూర్ణేశ్వరి దివ్యశోభతో అలరారే "హోరనాడు"

భూమిమీది ప్రతి జీవికీ తిండిని ప్రసాదించే దేవత "అన్నపూర్ణేశ్వరి". అందుకే ఈ అమ్మవారిని దర్శించి, మనసారా ప్రార్థిస్తే జీవితంలో అన్నానికి లోటుండదని భక్తుల నమ్మకం. ఇంతటి మహిమగల పార్వతీ అవతారమైన అన్నపూర్ణేశ్వరీ అమ్మవారు కర్నాటక రాష్ట్రంలోని చిక్‌మగళూరుకు నైరుతీ దిశలో వంద కిలోమీటర్ల దూరంలోగల హోరనాడు ప్రాంతంలో కొలువై దివ్యశోభతో అలరారుతున్నారు.
Source: వినోదం | 20 Oct 2009 | 5:12 am

జగన్‌కు పిలుపు సందేహమే: కేవీపీ సన్నిహితుడు!

దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్.జగన్‌కు కాంగ్రెస్ అధిష్టానం నుంచి పిలుపు రావడం సందేహమేనని ఆయన కుటుంబ సభ్యుడు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు సన్నిహితుడు మంగళవారం ఢిల్లీలో వెల్లడించారు.
Source: ఏపీ న్యూస్ | 20 Oct 2009 | 4:50 am

సైక్లింగ్ చేయడమే రాహుల్ శరీర విజయ రహస్యం!

కాంగ్రెస్ యువరాజు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, అమేథీ లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ స్లిమ్‌గా ఉండటానికి అనేకమంది పలు రకాల కారణాలు చెప్పారు. కొంతమంది యోగా చేస్తారని, మరికొందరు వ్యాయామాలు చేస్తారని ఇలా తమకు తోచినట్టుగా చెప్పుకుంటూ వచ్చారు.
Source: జాతీయ | 20 Oct 2009 | 4:07 am

ఆస్తానా మృతిపై న్యాయ విచారణకు సుప్రీంకోర్టు ఆదేశం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన పీఎఫ్ కుంభకోణం సూత్రధారి అశుతోష్ ఆస్తానా మృతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం మంగళవారం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మేరకు ఆస్తానా శరీర భాగాలను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు అందజేయాలని కోర్టు ధర్మాసనం సీబీఐకు ఉత్తర్వులు జారీ చేసింది.
Source: జాతీయ | 20 Oct 2009 | 3:33 am